మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతా రామం'. సుమంత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్ నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
20 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్ రామ్ నాకొక బాధ్యతను అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. రామ్ రాసిన ప్రేమ లేఖను సీతామహాలక్ష్మికి చేర్చేందుకు రష్మిక మందన్నా ప్రయత్నిస్తుంటుంది. ఆ లెటర్‌ను రామ్‌కు చేర్చే క్రమంలో అతనికి ఏమైందో తెలుసుకోవడమే సినిమా కథగా తెలుస్తోంది. పాత్రల నటన, డైలాగ్స్ చాలా ఆకట్టుకున్నాయి. 'నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కశ్మీర్‌ను మంచుకు వదిలేసి వస్తారా?', 'నా పాటికి నేను అనాథలా బతికేస్తుంటే ఉత్తరాలు రాసి ఇబ్బంది పెట్టింది కాకుండా దారి ఖర్చులు ఇస్తాననడం న్యాయమా' అంటూ చెప్పే సంభాషణలు బాగున్నాయి. 1965 నాటి కాలంలో సాగే కథతో తెరకెక్కిన ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఆకట్టుుకునేలా ఉంది.
చదవండి: లెక్క తప్పిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
ఆ విషయంలో తెలుగు దర్శకులకు చిరు చురకలు..
కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మి.. ఏదో తెలియని బాధ అంటూ వీడియో
Comments
Please login to add a commentAdd a comment