Dulquer Salman
-
టాలీవుడ్ దర్శక-నిర్మాతలపై కన్నేసిన పర భాష హీరోలు!
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాలీవుడ్ ముందు వరుసలో ఉంది. స్టార్ హీరోల తెలుగు సినిమాలు పాన్ ఇండియా మూవీస్‌గా ఇతర భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. కథాబలం ఉన్న సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఇలా ఇతర భాషల హీరోల సినిమాలు కూడా టాలీవుడ్లో విడుదలై, మంచి సినిమాలు సూపర్‌హిట్స్‌గా నిలుస్తున్నాయి. దీంతో కొందరు హీరోలు తెలుగు నిర్మాణ సంస్థలు, తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా క్షేమంగా రండి లాభంగా వెళ్లండి అంటూ ఆదరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం...ఆకాశంలో ఒక తార!‘మహానటి, సీతారామం’, ఇటీవల ‘లక్కీభాస్కర్’ చిత్రాలతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తెలుగులో దుల్కర్ చేసిన ఈ మూడు సినిమాలు సూపర్‌హిట్స్ కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. దీంతో తెలుగులో సినిమాలు చేయడానికి మరింత ఆసక్తి చూపిస్తున్నారు దుల్కర్ సల్మాన్ . ప్రస్తుతం ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నారాయన. పవన్ సాధినేని ఈ సినిమాకు దర్శకుడు. గీతా ఆర్ట్స్, స్వప్నా సినిమాస్, లైట్ బాక్స్ మీడియా పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే ‘కాంత’ అనే పీరియాడికల్ ఫిల్మ్‌లోనూ దుల్కర్ హీరోగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని మరో లీడ్ రోల్ చేస్తున్నారు. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ అట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జాను సంగీతం అందిస్తున్నారు. కాగా దుల్కర్ తెలుగు నిర్మాతలతో సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.రాజమౌళి సమర్పణలో...అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న బన్వర్సింగ్ షెకావత్ పాత్రలో తెలుగు ఆడియన్స్‌ను మెప్పించారు మలయాళ హీరో ఫాహద్‌ఫాజిల్. ప్రస్తుతం ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలోనూ ఫాహద్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అయితే ఫాహద్ హీరోగా ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్ ’ అనే రెండు తెలుగు సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, కార్తికేయ ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. ‘ఆక్సిజన్ ’ సినిమాతో సిద్ధార్థ్ నాదెళ్ల, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాతో శశాంక్ ఏలేటి దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ ఏడాది మార్చిలో ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్’ సినిమాల ఫస్ట్‌లుక్స్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఆ తర్వాత ఈ సినిమాల గురించి మరో అప్డేట్ రావాల్సి ఉంది.జై హనుమాన్‘కాంతార’ సినిమాతో కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి పేరు జాతీయస్థాయిలో మార్మోగిపోయింది. ప్రస్తుతం ‘కాంతార’ సినిమా ప్రీక్వెల్ ‘కాంతార: ఛాప్టర్ 1’తో బిజీగా ఉన్నారు రిషబ్‌శెట్టి. అయితే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాకుండానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే జై హనుమాన్.ఈ ఏడాది సంక్రాంతి ఫెస్టివల్‌కు విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘హను–మాన్ ’ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్ ’ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో రిషబ్‌శెట్టి మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయు)లో భాగంగా ‘జై హను మాన్ ’ అనే తెలుగు సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు రిషబ్. ప్రశాంత్ వర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రానా మరో లీడ్ రోల్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ‘జై హనుమాన్’ సినిమాను నిర్మిస్తున్నారు.యాక్షన్ ‘జాట్’బాలీవుడ్‌లోని సీనియర్ హీరోల్లో ఒకరైన సన్నీ డియోల్ తెలుగులో సినిమా చేస్తున్నారు. ‘జాట్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మొదలైంది. పీటర్ హెయిన్స్, అన్ల అరసు, రామ్–లక్ష్మణ్, వెంకట్.. ఇలా నలుగురు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఈ సినిమాకు అసోసియేట్ కావడం చూస్తే యాక్షన్ సీక్వెన్స్‌లు నెక్ట్స్ లెవల్లో ఉండబోతున్నాయని ఊహించవచ్చు. రణ్‌దీప్ హుడా, వినీత్‌కుమార్, సయామీ ఖేర్, రెజీనా ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ ‘జాట్’ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. హిందీలో ‘గదర్ 2’ వంటి బ్లాక్‌బస్టర్ కొట్టిన వెంటనే సన్నీడియోల్ తెలుగులో ‘జాట్’ చేయడానికి అంగీకరించడం విశేషం. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ‘జాట్’ కాకుండా హిందీలో ‘బోర్డర్ 2, లాహోర్ 1947’ సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీడియోల్. ‘జాట్’ విజయం సాధిస్తే ఆయన తదుపరి సినిమాలైన ‘బోర్డర్ 2, లాహోర్ 1947’ చిత్రాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతాయని ఊహించవచ్చు.కంగువాహీరో సూర్య తెలుగులోనూ పాపులర్. ఆయన తమిళ చిత్రాలు ఎప్పటికప్పుడు తెలుగులో అనువాదం అవుతుంటాయి. వీలైనప్పుడు నేరుగా తెలుగు సినిమాల్లోనూ సూర్య నటిస్తారు. తాజాగా సూర్య నటించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షనల్ ఫిల్మ్ ‘కంగువా’. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్స్ , యూవీ క్రియేషన్స్ పతాకాలపై తమిళ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా, తెలుగు నిర్మాతలు వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ‘కంగువ, ఫ్రాన్సిస్’ అనే రెండు భిన్నమైన రోల్స్‌లో సూర్య నటించారు. దిశా పటానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో యోగిబాబు, బాబీడియోల్ ఇతర పాత్రలు చేశారు. ఈ నెల 14న ‘కంగువా’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. అలాగే గీతాఆర్ట్స్ సంస్థలో సూర్య ‘గజిని 2’ సినిమా చేస్తారని, అలాగే బోయ΄ాటి శ్రీను దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.కుబేరధనుష్కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన తమిళ సినిమాలు తెలుగులో అనువాదమై ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటున్నాయి. అయితే ధనుష్ తెలుగు, తమిళం భాషల్లో నటించిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ‘సార్’ చిత్రం వందకోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో వెంటనే తెలుగు నిర్మాతలతో మరో సినిమా చేసేందుకు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే ‘కుబేర’. శేఖర్‌కమ్ముల దర్శ కత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాలో నాగార్జున మరో లీడ్ రోల్లో నటిస్తుండగా, రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ నెల 15న ‘కుబేర’ సినిమా టీజర్ విడుదల కానుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘కుబేర’ సినిమా రిలీజ్ కానుంది. ఈ తరహాలో మరికొంతమంది ఇతర భాషల హీరోలు టాలీవుడ్ దర్శక– నిర్మాతలతో సినిమాలు చేస్తున్నారు. ఇంకొందరు ఆసక్తి చూపిస్తూ, కథలు వింటున్నారు. -
'సీతారామం' డిలీటెడ్ సీన్ చూశారా? ఈ సీన్ కూడా అద్భుతమే
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై సౌత్ సహా బాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలై 50రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా తాజాగా ఈ చిత్రంలోని డిలీటెడ్ సీన్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో చిక్కుకున్న దుల్కర్, సుమంత్‌ల మధ్య చిత్రీకరించిన సీన్ అది. ఫుట్‌బాల్ ఆట పూర్తైన తర్వాత విష్ణు సర్.. మళ్లీ మీరే గెలిచారు అని రామ్ చెప్పగా.. అతని కాలర్ పట్టుకొని అంతా నీవల్లే జరిగింది.. నువ్వు అనాథవురా. నాకు పుట్టింది ఆడపిల్లనో, మగపిల్లాడో కూడా తెలియదు అంటూ విష్ణుశర్మ ఫైర్ అవుతాడు. దీంతో దుల్కర్ భావోద్వేగానికి లోనవుతాడు. ఈ సీన్ కూడా ప్రేక్షకులని కట్టి పడేస్తుంది. ఇప్పటికే ఈ సీన్‌ను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయగా 1మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సీతారామం సినిమా.. డేట్ ఫిక్స్
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించారు. రష్మిక మందన్నా, సుమంత్,తరుణ్ భాస్కర్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా తొలిరోజు నుంచే హిట్‌టాక్‌ను సొంతం చేసుకొని సుమారు రూ. 80కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇటీవలె హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయగా అక్కడ కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తికావడంతో ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. ఈనెల 9నుంచి సీతారామం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. -
డైరెక్టర్‌ను పట్టుకొని ఏడ్చేసిన హీరోయిన్.. వీడియో వైరల్
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం 'సీతారామం'. హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(శుక్రవారం)విడుదలై హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది.క్లాసిక్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విజువల్స్, కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ సహా హీరో,హీరోయిన్ల కెమిస్ట్రీకి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆడియెన్స్ నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డైరెక్టర్‌ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. తనకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు దర్శకుడికి మృణాల్ కృతజ్ఞతలు తెలిపింది. ఇక హీరో దుల్కర్ సైతం సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ను చూసి ఒకింత ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. That moment 🥹 @dulQuer @mrunal0801 @hanurpudi got emotional after watching movie with fans in Hyderabad 🥺😭❤#SitaRamamFDFS#SitaRamam @VyjayanthiFilms #dulqersalman #dulquersalmaan #MrunalThakur#BlockBusterSitaRamam pic.twitter.com/rNAyuY0flZ — 🦋Sita Ramam Day💃❣️ (@Nikki_Keerthy) August 5, 2022 -
నా జేబులో డబ్బులుండవు, మాకు థియేటరే గుడి: ప్రభాస్
Prabhas Interesting Comments In Sita Ramam Pre Release Event: తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. సుమంత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్ నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం (ఆగస్టు 3) ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో భాగంగాలో స్టేజ్‌పైకి వచ్చిన ప్రభాస్ మొదట ఏం మాట్లాడను అని షాక్ ఇచ్చాడు. తర్వాత ఈ సినిమా నిర్మాత స్వప్నదత్ వచ్చి మాట్లాడితే గానీ తాను మాట్లాడనని చెప్పాడు డార్లింగ్. 'ప్రభాస్ సాధారణంగా బయటకు రారు. ఒకటి మాకోసం వచ్చారు. రెండు సినిమాని బతికిద్దామని వచ్చారు. జనాన్ని థియేటర్ కు రప్పించడానికి ఇక్కడకు వచ్చారు' అని స్వప్న దత్ తెలిపారు. అనంతరం స్వప్న దత్ మాట్లాడకా ఆమె కోసమే ఈ ఈవెంట్‌కు వచ్చానని నవ్వులు పంచాడు. ''ఇలాంటి సినిమా తియ్యాలి అంటే మామూలు విషయం కాదు. కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి 'సీతారామం' సినిమాని థియేటర్ లోనే చూడాలి. ఇంట్లో దేవుడు ఉన్నాడని గుడికి వెళ్లడం మనేస్తామా? ఇది అంతే. మా సినీ ఫీల్డ్‌కు థియేటర్సే దేవలయాలు. తప్పకుండా సినిమాని థియేటర్లో చూడండి'' అని ప్రభాస్ పేర్కొన్నాడు. కార్యక్రమం చివర్లో రూ. 100 పెట్టి అశ్వనిదత్ వద్ద టికెట్ కొనుక్కోవాలని యాంకర్ సుమ చెప్పగా.. 'నా జేబులో డబ్బులుండవు. ఇందాక నాగ్ అశ్విన్ వద్ద అడిగి తీసుకున్న' అని ప్రభాస్ చెప్పడం నవ్వు తెప్పించేలా ఉంది. తర్వాత అశ్వనిదత్‌కు రూ. 100 ఇచ్చి టికెట్ తీసుకున్నాడు ప్రభాస్. 'సీతారామం' చిత్ర యూనిట్ అంతా టికెట్‌తో పాటు ఫొటోలకు ఫోజులివ్వడంతో ఈ ఈవెంట్ ముగిసింది. -
గ్రాండ్‌గా 'సీతారామం' ప్రీరిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా ప్రభాస్
Prabhas Grand Entry In Sita Ramam Pre Release Event: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. సుమంత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్ నిర్మించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, క్యారెక్టర్ల లుక్స్, పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం (ఆగస్టు 3) ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఘనంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో స్టేజ్‌పైకి ప్రభాస్ ఇచ్చిన ఎంట్రీ గ్రాండ్‌గా ఆకట్టుకునేలా ఉంది. డార్లింగ్ ఎంట్రీతో విజిల్స్, అరుపులతో స్టేడియం హోరెత్తింది. అలాగే ప్రముఖ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేస్తున్న ఈ ఈవెంట్లో డైరెక్టర్ అనుధీప్, తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి, సుమంత్, అశ్వినీదత్, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. -
ఉత్తరం రాస్తే కశ్మీర్‌ను మంచుకు వదిలేస్తారా ?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతా రామం'. సుమంత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్ నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 20 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్ రామ్ నాకొక బాధ్యతను అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. రామ్ రాసిన ప్రేమ లేఖను సీతామహాలక్ష్మికి చేర్చేందుకు రష్మిక మందన్నా ప్రయత్నిస్తుంటుంది. ఆ లెటర్‌ను రామ్‌కు చేర్చే క్రమంలో అతనికి ఏమైందో తెలుసుకోవడమే సినిమా కథగా తెలుస్తోంది. పాత్రల నటన, డైలాగ్స్ చాలా ఆకట్టుకున్నాయి. 'నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కశ్మీర్‌ను మంచుకు వదిలేసి వస్తారా?', 'నా పాటికి నేను అనాథలా బతికేస్తుంటే ఉత్తరాలు రాసి ఇబ్బంది పెట్టింది కాకుండా దారి ఖర్చులు ఇస్తాననడం న్యాయమా' అంటూ చెప్పే సంభాషణలు బాగున్నాయి. 1965 నాటి కాలంలో సాగే కథతో తెరకెక్కిన ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఆకట్టుుకునేలా ఉంది. చదవండి: లెక్క తప్పిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు ఆ విషయంలో తెలుగు దర్శకులకు చిరు చురకలు.. కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మి.. ఏదో తెలియని బాధ అంటూ వీడియో -
రష్మిక అసలు హీరోయినే కాదు : డైరెక్టర్ కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలె ఈ ముద్దుగుమ్మ 'సీతారామం' అనే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జయంతి మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో రష్మిక అఫ్రీన్ అనే కశ్మీరీ ముస్లీం అమ్మాయి పాత్రలో నటిస్తుండటంతో ఇక హీరోయిన్ రష్మికే అన్న కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఇదే అంశంపై డైరెక్టర్ హను క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ కాదు.. హీరో అనే చెప్పాలి అంటూ కామెంట్స్ చేశారు. పాత్రకు తగ్గట్లు రష్మిక ఎంతో కష్టపడిందని, ఆమె నటన చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
షాకింగ్.. దుల్కర్ సల్మాన్ సినిమాలపై నిషేధం..!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన 'సెల్యూట్' చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే . ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌తో ఈ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమాను ఈనెల 18న సోనీ LIVలో నేరుగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇందులో దుల్కర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇక ఇదిలా ఉండగా దుల్కర్ సల్మాన్ సినిమాలపై కేరళ థియేటర్ ఓనర్స్ నిషేధం విధించారు. దుల్కర్ నటించిన అన్ని చిత్రాలను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్‌కు రెడీగా ఉన్న 'సెల్యూట్' చిత్రంలో దుల్కర్ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తొలుత థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మూవీమేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ అలా చేయకుండా ఓటిటీలో విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇక దీనిపై ఆగ్రహించిన థియేటర్ ఓనర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. -
సంక్రాంతి బరిలో మరో హీరో.. కలిసొచ్చిన 'ఆర్ఆర్ఆర్' వాయిదా
Dulquer Salman Salute Movie Release In Sankranti Festival: దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న రౌద్రం రణం రుధిరం ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. అయితే దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసుల నేపథ్యం, పలు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ, థియేటర్లు మూసివేయడం వంటి తదితర కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయితే తమ చిత్రాలకు నష్టం కలుగుతుందని భావించి వాయిదా వేసుకున్న నిర్మాతలు ఉన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా అనేక చిత్రాలకు కలసివచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అందుబాటులో ఉండేసరికి తమ సినిమాలకు మార్గం సుగమం అయినట్లు భావించి విడుదలకు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన కొత్త సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. దుల్కర్ సల్మాన్ నటించి సెల్యూట్ చిత్రాన్ని మలయాళంలో జనవరి 14న రిలీజ్ చేయనున్నట్లు ఇదీ వరకే ప్రకటించింది చిత్రబృందం. అయితే ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో థియేటర్లు అందుబాటులో ఉండటంతో తెలుగులోనూ అదే రోజున విడుదల చేస్టున్నట్లు సమాచారం. దుల్కర్ సల్మాన్ పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్ డైరెక్టర్. ఈ చిత్రంతో పాటు ఆది సాయి కుమార్ నటించిన 'అతిథి దేవోభవ' (జనవరి 7), సిద్దు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' (జనవరి 14), సూపర్ మచ్చి (జనవరి 14), మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా 'హీరో' (జనవరి 15) తదితర సినిమాలు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో వైరల్.. సిక్స్ ప్యాక్ ఫేక్ అని ట్రోలింగ్ -
థ్రిల్ చేస్తారట
‘చీనీకమ్, పా, షమితాబ్, కీ అండ్ కా, ప్యాడ్‌మ్యాన్’ వంటి సినిమాల తర్వాత ఓ థ్రిల్లర్ కథను చెప్పడానికి రెడీ అయ్యారట బాలీవుడ్ దర్శకుడు ఆర్. బాల్కీ. ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నారు. ఇదో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అని తెలిసింది. ఇప్పటివరకూ బాల్కీ తీసిన సినిమాల కంటే వైవిధ్యంగా ఈ సినిమా ఉంటుందట. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ను ఏడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట. ఒకే షెడ్యూల్లో సినిమా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందట. 2018లో వచ్చిన ‘కార్వాన్’తో హిందీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు దుల్కర్. ఆ తర్వాత ‘జోయా ఫ్యాక్టర్’ అనే సినిమా కూడా చేశారు. -
మలయాళంలో తొలిసారిగా...
‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. ఇప్పుడు మరో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో దుల్కర్ మిలటరీ వ్యక్తిగా కనిపిస్తారు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను స్వప్నా దత్ నిర్మించనున్నారు. ఇందులో దుల్కర్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నారని సమాచారం. ఈ సినిమాను తెలుగు, మలయాళంలో తెరకెక్కించనున్నారు. ఒకవేళ పూజా హెగ్డే ఈ సినిమా కమిట్ అయితే ఆమె మాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. -
నేనేం చేస్తున్నానంటే...!
విజయ్ దేవరకొండ ఏది చేసినా విభిన్నంగా ఉండేలా చేస్తారు. ప్రస్తుతం అందరూ ‘‘బి ది రియల్ మేన్ ఛాలెంజ్’’ చేస్తున్నారు. ఇంట్లో వాళ్లకు పనుల్లో సహాయం చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఈ ఛాలెంజ్. విజయ్ను దర్శకుడు కొరటాల శివ ఈ ఛాలెంజ్‌కి ఎంపిక చేశారు. ‘‘రియల్ మేన్ ఛాలెంజ్ చేద్దాం అంటే మా అమ్మ నన్ను ఏ పనీ చేయనీయడం లేదు. అందుకే ఈ లాక్ డౌన్లో ఏం చేస్తున్నానో చూపిస్తాను’’ అన్నారు విజయ్. ఉదయాన్నే ఆలస్యంగా నిద్రలేవడం, బాటిల్స్‌లో నీళ్లు నింపడం, మామిడి పండుతో ఐస్ క్రీమ్ చేయడం, వీడియో గేమ్స్ ఆడటం వంటి పనులు చేస్తున్న వీడియోను పంచుకున్నారు విజయ్. ఈ వీడియోను విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ షూట్ చేశారు. ఈ వీడియోలో తన తండ్రిని చూపిస్తూ ‘ది రియల్ మేన్’ అని విజయ్ పేర్కొనడం విశేషం. ఈ ఛాలెంజ్‌కు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ని నామినేట్ చేశారు విజయ్ దేవరకొండ. -
క్వారంటైన్ డాడీ చేసే పనులు: హీరో
ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా దేశమంతా ప్రస్తుతం లాక్డౌన్ అమలు అవుతోంది. మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తుండటంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించేందుకే మొగ్గుచూపుతున్నాయి. ఇక కరోనా కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని సినీ స్టార్లు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే హీరో, హీరోయిన్లు, నటులంతా ఇంటికే పరిమితమై తమలో దాగున్న మరిన్ని కళలు ప్రదర్శిస్తున్నారు. గార్డెనింగ్, వంటలు చేస్తూ కుటుంబ సభ్యులను ఖుషీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.(ఎంతమంది పేర్లు మీకు తెలుసు?: బిగ్‌బీ) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దుల్కర్.. తాజాగా చేతిపై సీతాకోకచిలుక టాటూ, గోళ్లకు రంగు.. సరికొత్త మేకప్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కూతురితో ఆడుకునేందుకు ఇలా చేతికి స్టిక్కర్ అంటించుకున్నానని.. ఈ క్రెడిట్ అంతా తన కూతురు మరియంకు ఇచ్చాడు. క్వారంటైన్ డాడీ చేసే పనులు ఇవేనంటూ.. నిజంగా మనం ఎవరమో తెలుసుకునేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయని పేర్కొన్నాడు. కాగా 2011లో అమల్‌తో దుల్కర్ వివాహం చెన్నైలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ జంటకు 2017లో మరియం జన్మించింది. ఇక మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తూ దుల్కర్ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంటున్నాడు.(‘20 రోజులుగా అడుగు బయటపెట్టలేదు’) View this post on Instagram Quarantined Dad things ! #playingprincesstomyprincess #alsohercanvas #stickertattoos #nailposhish #makeuptransformation #thosewithissues #allofitwashesoff #yeahyouknowwhoyouare #allyouinstacops A post shared by Dulquer Salmaan (@dqsalmaan) on Apr 9, 2020 at 7:41am PDT -
హే సినామికా
సీనియర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ బృందా దర్శకురాలిగా మారారు. ఆమె దర్శకత్వం వహించనున్న సినిమా ముహూర్తం గురువారం జరిగింది. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితీరావ్ హైదరీ ముఖ్య పాత్రల్లో బృందా దర్శకత్వంలో తెరకెక్కనున్న తమిళ చిత్రం ‘హే సినామికా’. రొమాంటిక్ కామెడీ జానర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా ద్వారా జియో స్టూడియోస్ సంస్థ కోలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ‘హే సినామికా’ టైటిల్‌ను మణిరత్నం – దుల్కర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఓకే కన్మణి’ (ఓకే బంగారం)లో ‘హే సినామికా...’ పాట నుంచి తీసుకున్నారట. -
‘మేం చేసిన బుర్ర తక్కువ పని లవ్ చేయడం’
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, 'పెళ్లి చూపులు' ఫేమ్ రీతువర్మ జంటగా నటించిన మలయాళీ రొమాంటిక్ థ్రిల్లర్ 'కణ్ణుమ్ కణ్ణుమ్ కొళ్లైయాడిత్తాల్'. తెలుగులో 'కనులు కనులను దోచాయంటే' పేరుతో విడుదలవుతోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ కీలక పాత్రలో నటించారు. దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో వయాకం 18 స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. కెఎఫ్సి ఎంటర్టైన్మెంట్స్ తెలుగు హక్కులను దక్కించుకుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, పాటలు, తమిళ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. తాజాగా విడుదలయిన ట్రైలర్ మరింత ఆకట్టుకునేలా ఉంది. (చదవండి : ‘గుండె గిల్లి ప్రాణం తీయొద్దే’) హీరో, అతని స్నేహితుడు లగ్జరీ లైఫ్ స్టైల్‌కు అలవాటుపడిన యువకులని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. లగ్జరీ లైఫ్ కోసం వాళ్లు చేసిన పనులు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టాయి. దాని నుంచి ఎలా బయటపడ్డారు అనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్ ద్వారా చూపించారు. ‘ఇండియాలో ఆన్లైన్ ట్రేడ్‌కి వన్ ఇయర్ వర్త్ ఎంతో తెలుసా? రెండు లక్షల కోట్లు. సుమారు 10 కోట్లమంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. మనం వెతికేవాడు ఆ పది కోట్లలో ఒక్కడు’ హీరో చెప్పే డైలాగ్‌లో ట్రైలర్ మొదలైంది. ‘మేం చేసిన బుర్ర తక్కువ పని లవ్ చేయడం’, ‘ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా.. గోవిందా’ అని హీరో, అతని స్నేహితులు చెప్పే కామెడీ డైలాగులలో ట్రైలర్ ముగిసింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కనులు కనులను దోచాయంటే’ ట్రైలర్ -
‘గుండె గిల్లి ప్రాణం తీయొద్దే’
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రీతువర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘‘కన్నుం కన్నుం కొలైయడిత్తాల్’. ఇదే చిత్రాన్ని ‘కనులు కనులను దోచాయంటే’ టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో వయాకం 18 స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రేమికుల రోజును పురస్కరించుకొని ఈ సినిమాలోని ‘గుండె గిల్లి ప్రాణం తీయొద్దే’ అంటూ సాగే ప్రేమ పాటను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. మసాల కాఫీ మ్యూజిక్ బ్యాండ్ ఈ పాటను కంపోజ్ చేయగా రోహిత్ పరటాల ఆలపించాడు. సామ్రాట్ నాయుడు, పూర్ణచారి చల్లూరి లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ పాట యూత్‌ను ముఖ్యంగా లవర్స్‌కు బాగా కనెక్ట్ అయింది. అంతేకాకుండా విజువల్ పరంగా కూడా చాలా అందంగా ఉండటంతో నెటిజన్లను తీవ్రంగా ఆకర్షించింది. దీంతో ప్రస్తుతం ‘గుండె గిల్లి’ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘మహానటి’ చిత్రం తర్వాత దుల్కర్‌కు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. చదవండి: రాఖీ బాయ్‌తో కురుప్.. పవన్ కల్యాణ్ ఎంట్రీకి భారీ ప్లాన్! -
కామ్రేడ్ కోసం
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటుడే కాదు మంచి సింగర్ కూడా. ఇది వరకు తన సినిమాల్లో కొన్ని పాటలను తానే పాడారు. ‘ఏబీసీడి, చార్లీ, పరవా’ సినిమాల్లో తన గొంతుని వినిపించారు. తన తండ్రి మమ్ముట్టి నటించిన ‘మంగ్లీష్’ కోసం ఓ పాట పాడారు. లేటెస్ట్గా టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమా కోసం ఓ పాట పాడారు. అయితే ఇది తెలుగు పాట కాదు, మలయాళ పాట. ‘డియర్ కామ్రేడ్’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం మలయాళ పాటను ఇటీవలే రికార్డ్ చేశారట దుల్కర్. -
ఇక్కడికి ‘గీతా ఛలో’.. అక్కడికి ‘అర్జున్ రెడ్డి’..!
ఒక హీరోకో, హీరోయిన్‌కో పక్క ఇండస్ట్రీలో క్రేజ్ ఏర్పడితే వాటిని క్యాష్ చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకప్పటి సినిమాలను ప్రస్తుతమున్న క్రేజ్‌తో జతచేసి వేరే భాషల్లో రిలీజ్ చేస్తుంటారు. అయితే ఇది ఎవరి పని అని కచ్చితంగా చెప్పలేం. దీని వెనక సదరు నిర్మాతలే ఉండొచ్చు.. లేక హీరో, హీరోయిన్లే ఉండొచ్చు. తాజాగా అలాంటి సినిమాలే డబ్బింగ్ రూపంలో దాడి చేసేందుకు రెడీ అయ్యాయి. మహానటి సినిమాతో దుల్కర్ సల్మాన్‌కు క్రేజ్ ఏర్పడగా.. అతడు గతంలో నటించిన రెండు (జనతా హోటల్, అతడే) సినిమాలను తెలుగులో రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమాలు వచ్చినట్టుగా కూడా ఎవరికీ తెలీదు. ఇక ఇదే వరుసలో మోహన్‌లాల్ కూడా జనతాగ్యారేజ్‌తో వచ్చిన క్రేజ్‌ను వాడుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్ని డబ్బింగ్ సినిమాలతో పలకరించినా.. ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోతున్నారు. తాజాగా వచ్చిన లూసిఫర్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఇక టాలీవుడ్ సెన్సేషన్ స్టార్విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి చిత్రాలతో ఇమేజ్ పెరగ్గా.. పక్క భాషలపై కన్నేశాడు. నోటా చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్‌తో మొత్తం దక్షిణాదిపై కన్నేశాడు. అయితే విజయ్ నటించిన ద్వారకా మూవీ ఇక్కడ తేలిపోయింది. అయితే విజయ్‌కు ఉన్న క్రేజ్‌ను అడ్డంపెట్టుకుని ద్వారకా మూవీని తమిళంలో అర్జున్ రెడ్డి పేరుతో తమిళంలోకి డబ్ చేయనున్నారు. ఛలో, గీతగోవిందం సినిమాలతో స్టార్హీరోయిన్గా మారింది కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న. ఇక రష్మికకు ఏర్పడిన ఈ క్రేజ్‌ను వాడుకునేందుకు అక్కడి వారు కూడా రెడీ అయ్యారు. 2017లో రష్మిక నటించిన కన్నడ చిత్రం చమక్‌ను.. తెలుగులో గీతా..ఛలోగా డబ్ చేస్తున్నారు. ఇలా డబ్బింగ్ చిత్రాలతో దాడి చేస్తే.. సదరు హీరోహీరోయిన్లుకు మైనస్‌గా మారొచ్చు. అవి హిట్ అయితే లెక్కవేరేలా ఉంటుంది కానీ.. ప్లాఫ్ అయితేనే వారి కెరీర్‌గ్రాఫ్‌పై ప్రభావం చూపొచ్చు. -
‘మహానటి’ తర్వాత..
‘ఓకే బంగారం’ ఫేమ్ దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం ‘ఉస్మాద్ హోటల్’. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘జనతా హోటల్’ పేరుతో తెలుగులోకి అనువదించారు నిర్మాత సురేశ్ కొండేటి. వినాయక చవితి కానుకగా ఈ నెల 14న ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సురేశ్ కొండేటి మాట్లాడుతూ– ‘‘లవ్, సెంటిమెంట్, పేద– ధనిక వర్గాల మధ్య భేదం.. వంటి అంశాలతో తెరకెక్కిన చక్కని ఫీల్‌గుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. కథ, కథనంతో పాటు దుల్కర్, నిత్యామీనన్ జంట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాహితీగారు రాసిన సంభాషణలు హైలైట్‌గా నిలుస్తాయి. మా సంస్థలో వచ్చిన ‘జర్నీ, పిజ్జా, డా. సలీమ్’ చిత్రాలకు ఆయన మంచి సంభాషణలు అందించారు. ఇప్పుడు ‘జనతా హోటల్’కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. గోపీ సుందర్ స్వరపరచిన పాటలు మా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ‘మహానటి’ చిత్రం తర్వాత దుల్కర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టే గొప్ప చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. లోకనాథన్. -
త్వరలో ‘జనతా హోటల్’
మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు దుల్కర్ సల్మాన్. వైవిధ్యమైన పాత్రలను చేస్తూ మాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగారు. తాజాగా దుల్కర్ నటించిన ఓ మలయాళ మూవీని తెలుగులోకి ‘అతడే’ సినిమాగా డబ్ చేశారు. ఇక ఇదే వరుసలో దుల్కర్ నటించిన మరొక మూవీ కూడా విడుదల కానుంది. పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలే చేస్తూ తనకంటూ ఓ గుర్తింపును సాధించిన హీరోయిన్ నిత్యా మీనన్. చివరగా ‘అ!’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఉస్తాద్ హోటల్ అని మలయాళంలో ఎప్పుడో రిలీజ్ అయిన ఈ సినిమాను ‘జనతా హోటల్’గా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. -
‘మూడు ఆత్మలు, రెండు శవాలు..’
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్, మాలీవుడ్ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్‌లు కలిసి చేస్తోన్న చిత్రం కర్మాన్. ఈ మధ్యే బ్లాక్ మెయిల్, హిందీ మీడియమ్ చిత్రాలతో సక్సెస్ సాధించారు. హిందీ మీడియమ్ సినిమా చైనాలో కూడా విజయవంతమైంది. మహానటి సినిమాతో తెలుగు, తమిళ్లో కూడా ఫేమస్ అయిన దుల్కర్ సల్మాన్ గతవారం ‘అతడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. మహానటి తెచ్చిన గుర్తింపుతో ఇక్కడ కూడా తన మార్కెట్ పెరిగింది. దుల్కర్, ఇర్ఫాన్‌లు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘కర్వాన్’ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ‘మూడు ఆత్మలు, రెండు శవాలు.. ఓ జీవిత కాలపు ప్రయాణం’ అంటూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 3న విడుదలకానుంది. Irrfan, Dulquer Salmaan and Mithila Palkar... First look poster of #Karwaan... Trailer out tomorrow... Akarsh Khurana directs... 3 Aug 2018 release. pic.twitter.com/ia54uOrNvY — taran adarsh (@taran_adarsh) June 26, 2018 -
మహిళా శక్తి.. సమంత
మహానటి సినిమాలో ఎక్కువ శాతం మహిళలే పనిచేశారు. నిర్మాతలు మహిళలే. లీడ్ క్యారక్టర్ కూడా మహిళే. ఈ సినిమా కోసం ఎక్కువ మంది మహిళలే పనిచేశారని ఆడియో వేడుకల్లో కింగ్ నాగ్ కూడా పేర్కొన్నారు. ఒక సినిమా మొదలు కావాలంటే మొదటగా కావాల్సింది నిర్మాతలే. నిర్మాతలు ధైర్యం చేస్తేనే గొప్ప సినిమాలు వస్తాయి. మహానటి సినిమా నిర్మాతలు ప్రియాంక, స్వప్నలు ధైర్యం చేసి ఈ సినిమా బాధ్యతను తీసుకున్నారు. తెరపై ఆ మహానటి సాధించిన విజయాల్ని మళ్లీ అదే తెరపై ఆవిష్కరించేందుకు ఈ మహిళమణులు పూనుకున్నారు. అందుకే ‘మహానటి’ రూపు దాల్చింది. అలనాటి మహానటి సావిత్రిని గుర్తుకు తెచ్చేలా నటించడం మామూలు విషయం కాదు. కీర్తి సురేశ్ మాత్రం సావిత్రి పాత్రకోసమే పుట్టిందేమో అన్నట్టుగా జీవించేసినట్టుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు అచ్చం సావిత్రిని గుర్తుకుతెచ్చేలా ఉన్నాయి. తెర వెనుక ఇంకా ఎందరో మహిళామణుల కష్టం దాగి ఉంది. ఈ సినిమా విడుదలై సంచలనాలు సృష్టిస్తుందని, అప్పుడు ఈ క్రెడిట్ అంతా సినిమాకు పనిచేసిన మహిళలదే అవుతుందని అందుకే మహిళా శక్తి అని సమంత ట్వీట్ చేసి ఉంటుంది. కీర్తి సురేశ్, సమంత, షాలినీ, దుల్కర్ సల్మాన, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, క్రిష్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘మహానటి’మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. Girl power 💪💪#Mahanatipromotions #Mahanation9th @VyjayanthiFilms @KeerthyOfficial pic.twitter.com/Dp9HPhMHcT — Samantha Akkineni (@Samanthaprabhu2) May 6, 2018 -
‘మహానటి’లో సావిత్రి కూతురు ఎవరో తెలుసా?
సావిత్రి చిన్ననాటి పాత్రలో రాజేంద్రప్రసాద్ మనవరాలు నిశంకర నటిస్తుండగా, సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి పాత్రను పాప్ సింగర్ స్మిత కూతురు శివి చేస్తోంది. ఈ పాత్రకు సంబంధించిన ఫోటోలను స్మిత సోషల్‌మీడియాలో పోస్ట్ చేసారు. తల్లి సావిత్రి( కీర్తి సురేశ్) , తండ్రి జెమినీ గణేషన్( దుల్కర్ సల్మాన్)తో ఉన్న ఫోటోలను స్మిత షేర్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. సావిత్రి పాత్రకు సంబంధించిన కీర్తి సురేశ్ ఫోటోలను రిలీజ్ చేస్తూ... సినిమాపై అంచనాలను పెంచేస్తోంది చిత్రయూనిట్. కీర్తి సురేశ్, దుల్కర్సల్మాన్, సమంత, విజయ దేవరకొండ, షాలినీ పాండే, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్‌రాజ్, మోహన్‌బాబు, క్రిష్, అవసరాల శ్రీనివాస్ లాంటి భారీ తారాగణంతో ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మిక్కి జే మేయర్ స్వరాలు సమకూర్చగా... నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. One more with mom & dad 😊 @Shivisayz @KeerthyOfficial @dulQuer #NagAshwin #Mahanati @SwapnaCinema pic.twitter.com/YlhqrrHpIl — Smita (@smitapop) May 6, 2018 Finally sharing a picture, I guess I can now😊 a moment from the shoot of #Mahanati @Shivisayz with father @dulQuer #Gemini pic.twitter.com/eISKjTBA7w — Smita (@smitapop) May 4, 2018 -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మహానటి’
లెజెండరీ నటి, తెలుగు వాళ్లు గర్వించదగ్గ నటి మహానటి సావిత్రి. అలాంటి నటిపై వస్తున్న సినిమా ‘మహానటి’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ కత్తెరకు పని చెప్పకుండా... ఒక్క సన్నివేశం కూడా అభ్యంతర కరంగా లేవని సెన్సార్ వాళ్లు... క్లీన్ యూ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఈ విషయాన్ని నిర్మాతలు ట్విటర్ ద్వారా తెలిపారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్, లుక్స్, మోషన్ పోస్టర్స్,సాంగ్స్ ప్రేక్షకులకు చేరువయ్యాయి. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేశ్, జెమినీ గణేషన్‌గా దుల్కర్సల్మాన్ నటించిన విషయం తెలిసిందే. ఇతర కీలక పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ నటించారు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా, మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చగా, వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది.