సూపర్ స్టార్ ను వెనక్కి నెట్టిన వారసుడు! | Dulquer beats father Mammootty in Kerala State film award race | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ ను వెనక్కి నెట్టిన వారసుడు!

Published Tue, Mar 1 2016 6:40 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

సూపర్ స్టార్ ను వెనక్కి నెట్టిన వారసుడు!

సూపర్ స్టార్ ను వెనక్కి నెట్టిన వారసుడు!

తిరువనంతపురం: సూపర్ స్టార్ మమ్మూట్టీ వారసుడు ఏకంగా ఆయననే మించిపోయాడు. మంగళవారం ప్రకటించిన కేరళ ఫిల్మ్ అవార్డులు 2015లలో మమ్మూట్టీ తనయుడు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. మమ్మూట్టీ కూడా చివరివరకు రేసులో నిలవడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ దృష్టి ఈ తండ్రీకొడుకులపైనే కేంద్రీకరించింది. చార్లీ మూవీలో నటకు గానూ దుల్కర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. సినిమాటోగ్రఫీ మంత్రి తిరువంచూర్ రాధాక్రిష్ణన్ ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని విజేతల పేర్లు ప్రకటించారు. అయితే ఉత్తమ నటుడి కేటగిరిలో దుల్కర్ తండ్రి మమ్మూట్టీ, మరో హీరో జయసూర్య నిలిచినా డైరెక్టర్ మోహన్ దుల్కర్ వైపు మొగ్గు చూపడంతో చివరికి ఈ యంగ్ హీరోనే అవార్డు అందుకున్నాడు. చాలా తొందరగానే తనకు ఈ అవార్డు రావడంపై ఈ యంగ్ హీరో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చార్లీ మూవీ యూనిట్, ఫిల్మ్ ఇండస్ట్రీకే తన అవార్డు అంకితం చేసినట్లు ప్రకటించాడు.

అవార్డు రావడంతో తన తండ్రి చాలా ఆనందంతో పాటు గర్వంగా ఫీలయ్యారని దుల్కర్ చెప్పాడు. సంతోషంతో తనను కౌగిలించుకున్నారని, ముద్దు పెట్టుకున్నారని తెలిపాడు. తనకంటే ఇతర హీరోలు బాగా నటిస్తారని భావించేవాడినని, ఈ అవార్డు ద్వారా యంగ్ హీరోలను కూడా ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. పాథేమారీ ఫిల్మ్ లో నటనకుగానూ సూపర్ స్టార్ మమ్మూట్టీ చివరి వరకూ రేసులో ఉండి కుమారుడితో పోటీపడటం విశేషం. చార్లీ మూవీకి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు అవార్డులు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement