Watch: Dulquer Salmaan Sita Ramam Movie Deleted Scene Released, Video Viral - Sakshi
Sakshi News home page

Sita Ramam Deleted Scene: 'సీతారామం' డిలీటెడ్‌ సీన్‌ రిలీజ్‌ చేసిన మేకర్స్‌..

Published Sat, Sep 24 2022 11:46 AM | Last Updated on Sat, Sep 24 2022 1:50 PM

Dulquer Salmaan Starrer Sita Ramam Deleted Scene Released - Sakshi

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై సౌత్‌ సహా బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

సినిమా విడుదలై 50రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా తాజాగా ఈ చిత్రంలోని డిలీటెడ్‌ సీన్స్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. పాకిస్తాన్‌ ఆర్మీ చేతుల్లో చిక్కుకున్న దుల్కర్‌, సుమంత్‌ల మధ్య చిత్రీకరించిన సీన్‌ అది. ఫుట్‌బాల్‌ ఆట పూర్తైన తర్వాత విష్ణు సర్‌.. మళ్లీ మీరే గెలిచారు అని రామ్‌ చెప్పగా.. అతని కాలర్‌ పట్టుకొని అంతా నీవల్లే జరిగింది..

నువ్వు అనాథవురా. నాకు పుట్టింది ఆడపిల్లనో, మగపిల్లాడో కూడా తెలియదు అంటూ  విష్ణుశర్మ ఫైర్ అవుతాడు. దీంతో దుల్కర్‌ భావోద్వేగానికి లోనవుతాడు. ఈ సీన్‌ కూడా ప్రేక్షకులని కట్టి పడేస్తుంది. ఇప్పటికే ఈ సీన్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయగా 1మిలియన్‌కు పైగా వ్యూస్‌ వచ్చాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement