
సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లమూడి దర్వకత్వంలో కాలిపు మధు నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.
‘‘మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమాని తీస్తున్నాం. మా చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. బ్రహ్మానందం ఓ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment