వారాహి అమ్మవారిని దర్శించుకున్నారు బ్రహ్మానందం(Brahmanandam ). మరి... ఏం కోరుకున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సుమంత్(Sumanth) హీరోగా రూపొందుతున్న ‘మహేంద్రగిరి వారాహి’(Mahendragiri Vaarahi) చిత్రంలోని ఓ సన్నివేశం ఇది. ఫిబ్రవరి 1న బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్‌ని విడుదల చేశారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌పై కాలిపు మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘‘సుమంత్ హీరోగా సంతోష్ దర్శకత్వంలో రూపొందిన ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ కూడా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని కాలిపు మధు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment