సంక్రాంతి బరిలో మరో టాలీవుడ్ సినిమా! | Another Tollywood Movie Enters Into Sankranthi Race 2025 at Box office | Sakshi
Sakshi News home page

Sumanth: సంక్రాంతి బాక్సాఫీస్.. గేమ్ ఛేంజర్‌తో పోటీ పడనున్న సినిమా!

Published Mon, Oct 14 2024 9:46 PM | Last Updated on Mon, Oct 14 2024 9:50 PM

Another Tollywood Movie Enters Into Sankranthi Race 2025 at Box office

సుమంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం మహేంద్రగిరి వారాహి. రాజశ్యామల బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్‌ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. గ్లింప్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు.  ఈ మూవీ గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది.

కాగా.. మహేంద్రగిరి వారాహి సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత కాలిపు మధు ఇటీవల వెల్లడించారు. ఈ మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని బ్రహ్మానందం చేయబోతున్నారని దర్శకుడు సంతోష్ తెలిపారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

కాగా.. వచ్చే ఏడాది-2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా..  వచ్చే సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement