
‘బలగం’ తర్వాత దర్శకుడు వేణు(venu yeldandi) చాలా గ్యాప్ తీసుకున్నాడు. తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’ (Yellamma Movie) అని ప్రకటించి చాలా రోజులైంది కానీ, ఇంకా పట్టాలెక్కలేదు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తొలుత నాని హీరోగా నటిస్తారనే ప్రచారం జరిగింది. నాని కూడా వేణుతో సినిమా చేస్తానని చెప్పారు. ఏం జరిగిందో తెలియదు కానీ నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పకున్నాడు. చివరకు ఈ కథ అటు తిరిగి ఇటు తిరిగి నితిన్ (Nithiin) దగ్గర వెళ్లింది.
కథ బాగా నచ్చడంతో నితిన్ ఈ చిత్రాన్ని వెంటనే ఓకే చేశాడు. డేట్స్ కూడా అరేంజ్ చేసుకున్నాడు. నిర్మాత దిల్ రాజు కూడా సినిమా షూటింగ్ స్టార్స్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. కానీ ఈ సినిమాకు కీలకమైన హీరోయిన్ మాత్రం దొరకడం లేదట. ‘ఎల్లమ్మ’ కోసం అటు దిల్ రాజు, నితిన్.. ఇటు వేణు తెగ వెతుకుతున్నారట.
బలగం మాదిరే ఈ కథ కూడా రూరల్ నేపథ్యంలోనే సాగుతుదంట. దర్శకుడు వేణు చాలా పకడ్బంధీగా ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందట. కథ మొత్తం ఆమె చుట్టునే తిరుగుతుంది. అందుకే ఓ స్టార్ హీరోయిన్‌ని ఆ పాత్రకు తీసుకోవాలనుకున్నారట.
తొలుత సాయి పల్లవి అయితే బాగుంటందని ఆమెను సంప్రదించారు. అయితే సాయి పల్లవి ఈ సినిమా చేయలేనని చెప్పేసిందట. దీంతో మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ అయితే ‘ఎల్లమ్మ’కు న్యాయం చేస్తుందని ఆమెను సంప్రదించారట. అయితే కథ, పాత్ర బాగా నచ్చినప్పటికీ.. డేట్స్ ఖాలీగా లేకపోవడం నో చెప్పేసిందట. శ్రీలీలను తీసుకుందామంటే.. అల్రెడీ నితిన్‌తో రెండు సినిమాలు చేసింది. అవి కూడా ఫ్లాప్ అవ్వడంతో దిల్ రాజు వెనకడుకు వేస్తున్నాడట. ఇక రష్మిక, సమంత లాంటి హీరోయిన్లు కూడా ఖాలీగా లేరు. నితిన్ ఎప్పుడైన తన సినిమాలకు ట్రెండింగ్ హీరోయిన్‌ని తీసుకుంటాడు. కానీ ఈ సారి మాత్రం అది వర్కౌట్ అయ్యేలా లేదు. స్టార్ హీరోహీరోయిన్లు అంతా బిజీగా ఉన్నారు. మరి ‘ఎల్లమ్మ’గా ఎవరు ఎంట్రీ ఇస్తారో చూడాలి.