yellamma
-
‘ఎల్లమ్మ’గా సాయి పల్లవి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
వెండితెరపై ఎల్లమ్మగా సాయి పల్లవి(sai Pallavi) కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. నితిన్ హీరోగా ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టాలనుకుంటున్నారు. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు సాయి పల్లవిని అనుకుంటున్నారట. ఆల్రెడీ తెలంగాణ నేటివిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఫిదా, విరాటపర్వం’ చిత్రాల్లో సాయి పల్లవి నటిగా మెప్పించారు. ఇక ఇప్పుడు వేణు తెరకెక్కించే చిత్రం కూడా తెలంగాణ నేపథ్యంలోనే ఉంటుందట. ఎల్లమ్మ(Yellamma) పాత్రకు సాయి పల్లవి అయితేనే న్యాయం చేస్తుందని వేణు, దిల్ రాజు భావిస్తున్నారట. దిల్ రాజు ద్వారా సాయి పల్లవిని కలిసిన వేణు.. కథ చెప్పి ఆమె పాత్ర గురించి వివరించారట. ఆమె పాత్ర నచ్చడంతో సాయి పల్లవి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ గాపిప్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరోసారి తెలంగాణ నేపథ్య సినిమాలో సాయి పల్లవి నటించబోతున్నారనే వార్త తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ గాసిప్ నిజమై.. వెండితెరపై ‘ఎల్లమ్మ’గా సాయి పల్లవి కనిపిస్తారా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
వేణు ‘ఎల్లమ్మ’ కష్టాలు తీరినట్లేనా?
‘బలగం’ సినిమాకి ముందు ఇండస్ట్రీలో వేణుకి ఉన్న ఇమేజ్ వేరు. అప్పటి వరకు వేణు అంటే కమెడియన్ మాత్రమే అని అందరికి తెలుసు. ఆయనలో ఓ గొప్ప దర్శకుడు దాగి ఉన్నాడనే విషయం ‘బలగం’ రిలీజ్ ముందు వరకు తెలియదు. అందరికి లాగే తాను కూడా సరదా కోసం మెగాఫోన్ పట్టారని అంతా అనుకున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత వేణు టాలెంట్ ప్రపంచం మొత్తానికి తెలిసింది. తొలి సినిమాతో స్టార్ డైరెక్టర్ హోదా సంపాదించాడు. ఆ హోదాను వేణు అలాగే కాపాడుకోవాలి అంటే..కచ్చితంగా ‘బలగం’కి మించిన సినిమాను తీయాలి. ఆ విషయం వేణుకి కూడా బాగా తెలుసు. అందుకే కాస్త సమయం తీసుకొని మరోసారి తెలంగాణ గ్రామీణ నేపథ్య కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలంగాణ ‘కాంతార’బలగం తరహాలోనే వేణు మరోసారి పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న కథతో ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించబోతున్నారట. వేణు కెరీర్‌కి ఈ సినిమా హిట్ చాలా ముఖ్యం అందుకే చాలా జాగ్రత్తగా ఈ కథను రాసుకున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయింది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఈ కథను రెడీ చేశాడట వేణు. కాంతార తరహాలోనే ఈ కథకి కూడా బలమైన క్లైమాక్స్ ఉంటుందట.నాని టు నితిన్‘ఎలమ్మ’ కథను పలువురు హీరోలకు వినిపించాడట వేణు. ప్రతి ఒక్కరు బాగుందనే చెప్పారట. తొలుత నానికి కథ చెప్పాడట. ఆయనకు విపరీతంగా నచ్చిందట. అయితే అప్పటికే తెలంగాణ నేపథ్యంలో ‘దసరా’ సినిమా ఒప్పుకోవడంతో ‘ఎల్లమ్మ’ కథను రిజెక్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత ‘హను-మాన్’ హీరో తేజ సజ్జను అనుకున్నారట. కానీ ఈ వయసులోనే అంత పెద్ద పాత్రను పోషించలేని తేజ వెనక్కి తగ్గారు. వరుణ్ తేజ్ కూడా కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారట. వీరందరికి కంటే ముందే హీరో నితిన్‌కి ఈ కథ చెప్పాడట వేణు. అయితే దిల్ రాజు బ్యానర్లో వరుస సినిమాలు చేస్తున్నాని..మళ్లీ ఇప్పుడు అదే బ్యానర్లో చేస్తే బాగోదని చెప్పాడట. కానీ మళ్లీ ఈ కథ చివరికి నితిన్ వద్దకే చేరిందట. ఆయన అయితేనే వేణు రాసుకున్న పాత్రకు న్యాయం చేస్తాడని భావించి.. దిల్ రాజు ఒప్పించారట. నితిన్ ప్రస్తుతం ‘తమ్ముడు’, ‘రాబిన్‌వుడ్’ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయిన వెంటనే ‘ఎల్లమ్మ’ సెట్లోకి అడుగుపెడతారట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. -
Ashwini Sree : ఎల్లమ్మ తల్లికి బోనమెత్తిన బిగ్‌బాస్ బ్యూటీ (ఫోటోలు)
-
అలిగిన మంత్రి పొన్నం.. బల్కంపేట గుడిలో ప్రోటోకాల్ రగడ
సాక్షి,హైదరాబాద్: ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా బల్కంపేట గుడిలో మంగళవారం(జులై 9) ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఎల్లమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు గుడికి వచ్చారు. వీరితో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా వచ్చారు. ఈ సందర్భంగా గుడిలో తోపులాట జరిగింది. తోపులాటలో మేయర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో మంత్రి పొన్నం, మేయర్ అలిగి గుడి బయటే కూర్చున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని అయిన తనకు ప్రోటోకాల్ పాటించడం లేదని పొన్నం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌పై పొన్నం సీరియస్ అయ్యారు. అధికారులు ఎంత నచ్చజెప్పినా మంత్రి పొన్నం అలక వీడలేదు. -
వివాహిత అదృశ్యంపై కేసు
గార్లదిన్నె(శింగనమల): గార్లదిన్నె మండలం పి.కొత్తపల్లికి చెందిన ఎల్లమ్మ(26) అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భార్య తిరిగి రాలేదని, తెలిసిన చోటల్లా ఆమె కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో భర్త రాజశేఖర్ తమను ఆశ్రయించినట్లు ఆయన వవరించారు. అతని ఫిర్యాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఎల్లమ్మ ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
ఎల్లమ్మ పుట్ట పై నాగుపాము నాట్యం
చిన్నశంకరంపేట: అసలే ఎల్లమ్మ పుట్ట.. ఆపై నాగుపాము నృత్యం.. విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడకు చేరుకుని నాగమ్మతల్లే నాట్యమాడుతోందని భక్తి భావంతో పాముకి మొక్కారు. మండల కేంద్రం నుంచి మెదక్ వెళ్లే రహదారి పక్కన కొన్ని సంవత్సరాలుగా ఒక పుట్ట పెరుగుతూ వస్తోంది. దీన్ని ఎల్లమ్మతల్లిగా భావించిన ప్రజలు పూజలు చేస్తూ వస్తోన్నారు. ఉన్నట్టుండి గురువారం సాయంత్రం ఎల్లమ్మపుట్ట వద్దకు వచ్చిన నాగుపాము పడగవిప్పి బుసలు కొడుతూ నాట్యం చేసింది. చీకటి పడినా పాము పుట్ట దగ్గర నుంచి కదలకుండా పుట్టపైనే ఉండటంతో నిజంగా నాగమ్మతల్లే వచ్చిందని చేతులెత్తి నమస్కరించారు -
కమ్మల కోసం తల్లిపై కూతురు దాడి
హైదరాబాద్: బంగారు కమ్మల కోసం నవవూసాలు మోసి, కని, పెంచిన తల్లిపైనే దాడి చేసిందో కూతురు. అరెస్టవుతున్న కూతుర్ని కాపాడుకోవడం కోసం పలు రకాలుగా ప్రయుత్నించిందా తల్లి. వివరాలివీ.. జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ లో నివసిస్తున్న మేకల ఎల్లమ్మ బంగారు కవ్ములపై ఆమె కూతురు గౌరవ్ము దృష్టి పడింది. కమ్మలు ఇవ్వమని కూతురు పలు మార్లు అడిగినా..తన తల్లిదండ్రులకు గుర్తుగా వాటిని తనవద్దే ఉంచుకుంటానని ఎల్లమ్మ స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహించిన గౌరమ్మ గురువారం రాత్రి తల్లి కమ్మలు బలవంతంగా లాక్కొంది. ఎల్లమ్మ రెండు చెవులు తెగిపోయూరుు. తీవ్ర రక్తస్రావానికి గురైన బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. ఈ సమయంలో అడ్డు వచ్చిన ఎల్లవ్ము భర్తపై అల్లుడు మల్లయ్య ఇటుకతో దాడి చేశాడు. తల్లడిల్లిన తల్లి హృదయం పోలీసులు గౌరమ్మను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలిస్తుండగా ఎల్లమ్మ కన్నీరుమున్నీరైంది. తాను బాధపడ్డా ఫరవాలేదని, కూతురు జైలు కు వెళ్లకుండా కాపాడండని వెక్కి వెక్కి ఏడ్చిన తీరు పోలీసులను కూడా కదిలించింది.