కమ్మల కోసం తల్లిపై కూతురు దాడి | Daughter attacks Mother for Gold ear rings | Sakshi
Sakshi News home page

కవ్ముల కోసం తల్లిపై కూతురు దాడి

Published Sat, Jul 5 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

కమ్మల కోసం తల్లిపై కూతురు దాడి

కమ్మల కోసం తల్లిపై కూతురు దాడి

హైదరాబాద్:  బంగారు కమ్మల కోసం నవవూసాలు మోసి, కని, పెంచిన తల్లిపైనే దాడి చేసిందో కూతురు. అరెస్టవుతున్న కూతుర్ని కాపాడుకోవడం కోసం పలు రకాలుగా ప్రయుత్నించిందా తల్లి. వివరాలివీ.. జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ లో నివసిస్తున్న మేకల ఎల్లమ్మ బంగారు కవ్ములపై ఆమె కూతురు గౌరవ్ము  దృష్టి పడింది. కమ్మలు ఇవ్వమని కూతురు పలు మార్లు అడిగినా..తన తల్లిదండ్రులకు గుర్తుగా వాటిని తనవద్దే ఉంచుకుంటానని ఎల్లమ్మ స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహించిన గౌరమ్మ గురువారం రాత్రి తల్లి కమ్మలు బలవంతంగా లాక్కొంది. ఎల్లమ్మ రెండు చెవులు తెగిపోయూరుు. తీవ్ర రక్తస్రావానికి గురైన బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. ఈ సమయంలో అడ్డు వచ్చిన ఎల్లవ్ము భర్తపై అల్లుడు మల్లయ్య ఇటుకతో దాడి చేశాడు.  
 
తల్లడిల్లిన తల్లి హృదయం
 పోలీసులు గౌరమ్మను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలిస్తుండగా ఎల్లమ్మ కన్నీరుమున్నీరైంది. తాను బాధపడ్డా ఫరవాలేదని, కూతురు జైలు కు వెళ్లకుండా కాపాడండని వెక్కి వెక్కి ఏడ్చిన తీరు పోలీసులను కూడా కదిలించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement