ఎల్లమ్మ పుట్ట పై నాగుపాము నాట్యం
చిన్నశంకరంపేట: అసలే ఎల్లమ్మ పుట్ట.. ఆపై నాగుపాము నృత్యం.. విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడకు చేరుకుని నాగమ్మతల్లే నాట్యమాడుతోందని భక్తి భావంతో పాముకి మొక్కారు. మండల కేంద్రం నుంచి మెదక్ వెళ్లే రహదారి పక్కన కొన్ని సంవత్సరాలుగా ఒక పుట్ట పెరుగుతూ వస్తోంది. దీన్ని ఎల్లమ్మతల్లిగా భావించిన ప్రజలు పూజలు చేస్తూ వస్తోన్నారు. ఉన్నట్టుండి గురువారం సాయంత్రం ఎల్లమ్మపుట్ట వద్దకు వచ్చిన నాగుపాము పడగవిప్పి బుసలు కొడుతూ నాట్యం చేసింది. చీకటి పడినా పాము పుట్ట దగ్గర నుంచి కదలకుండా పుట్టపైనే ఉండటంతో నిజంగా నాగమ్మతల్లే వచ్చిందని చేతులెత్తి నమస్కరించారు