అలిగిన మంత్రి పొన్నం.. బల్కంపేట గుడిలో ప్రోటోకాల్‌ రగడ | Protocol Controversy In Balkampet Yellamma Temple, Minor Injuries To Mayor | Sakshi
Sakshi News home page

అలిగిన మంత్రి పొన్నం.. బల్కంపేట గుడిలో ప్రోటోకాల్‌ రగడ

Published Tue, Jul 9 2024 11:07 AM | Last Updated on Tue, Jul 9 2024 11:48 AM

protocol Controversy In Balkampet Yellamma Temple

సాక్షి,హైదరాబాద్‌:  ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా బల్కంపేట గుడిలో మంగళవారం(జులై 9) ప్రోటోకాల్‌ వివాదం తలెత్తింది.  ఎల్లమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు హైదరాబాద్‌ ఇంఛార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ దంపతులు గుడికి వచ్చారు.  వీరితో పాటు జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కూడా వచ్చారు. 

ఈ సందర్భంగా గుడిలో తోపులాట జరిగింది. తోపులాటలో మేయర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో మంత్రి పొన్నం, మేయర్‌ అలిగి గుడి బయటే కూర్చున్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిని అయిన తనకు ప్రోటోకాల్‌ పాటించడం లేదని పొన్నం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌పై పొన్నం సీరియస్‌ అయ్యారు. అధికారులు ఎంత నచ్చజెప్పినా మంత్రి పొన్నం అలక వీడలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement