balkampet
-
బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం..పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
Hyderabad: ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం (ఫొటోలు)
-
అలిగిన మంత్రి పొన్నం.. బల్కంపేట గుడిలో ప్రోటోకాల్ రగడ
సాక్షి,హైదరాబాద్: ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా బల్కంపేట గుడిలో మంగళవారం(జులై 9) ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఎల్లమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు గుడికి వచ్చారు. వీరితో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా వచ్చారు. ఈ సందర్భంగా గుడిలో తోపులాట జరిగింది. తోపులాటలో మేయర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో మంత్రి పొన్నం, మేయర్ అలిగి గుడి బయటే కూర్చున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని అయిన తనకు ప్రోటోకాల్ పాటించడం లేదని పొన్నం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌పై పొన్నం సీరియస్ అయ్యారు. అధికారులు ఎంత నచ్చజెప్పినా మంత్రి పొన్నం అలక వీడలేదు. -
ఫ్యామిలీ స్టార్ కోసం పూజలు.. మృణాల్ పోస్ట్ వైరల్!
-
హైదరాబాద్ : వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం (ఫొటోలు)
-
ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం (ఫొటోలు)
-
బల్కంపేట ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
-
నాన్న పుట్టినరోజు.. అమ్మవారికి బంగారు ఆభరణాలు
-
బల్కంపేటలో బతుకమ్మ ఆడిన కవిత.. యాదాద్రిలో ఘనంగా వేడుకలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని తూర్పు రాజగోపురం ముందు తిరువీధిలో ఈవో గీతారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానిక మహిళలు పెద్దఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ ఆడారు. కూచిపూడి కళాకారుల నృత్యాలు వేడుకల్లో ఆకర్షణగా నిలిచాయి. బల్కంపేట ఎల్లమ్మ వద్ద.. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కూతురు ఎమ్మెల్సీ కవిత ఆదివారం బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి సాదర స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సీఎం సతీమణి శోభ వెళ్లిపోగా.. కవిత, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సతీమణి స్వర్ణ, మహిళా పోలీసులతో కలిసి బతుకమ్మ ఆడారు. అబుదాబిలో బతుకమ్మ సంబరాలు రాయికల్ (జగిత్యాల): అబుదాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న తెలంగాణవాసులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలు గౌరిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా భారత రాయబారి కార్యా లయ కౌన్సిల్ ఆర్.బాలాజీ హాజరయ్యారు. చదవండి: భారీ బతుకమ్మల కోసం విదేశాల నుంచి పూలు -
ఎల్లమ్మ కల్యాణం.. ఎల్లెడలా ఆనందం (ఫొటోలు)
-
Balkampet Yellamma: బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్తు కాంతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. క్యూలైన్ల కోసం బారికేడ్లను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. సోమవారం ఉదయం వేదపండితులు మంత్రోశ్చరణల నడుమ ప్రత్యేక పూజలతో ఉత్సవాలను ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఎస్.అన్నపూర్ణ తెలిపారు. సాయంత్రం సాంప్రదాయ బద్దంగా ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉంటుంది. బందోబస్తు నిమిత్తం 500 మంది సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. అమీర్‌పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రూ.5 లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా తయారు చేయించారు. చదవండి: Hyderabad: కారు దిగిన మేయర్.. కాంగ్రెస్‌లో చేరిక -
ఓయోలో వ్యభిచారం.. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా యువతులను తీసుకొచ్చి..
సాక్షి, అమీర్‌పేట: ఓయో హోటల్ ప్రధాన కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బల్కంపేట ఎస్బీఐ బ్యాంకు సమీపంలోని తేనేటి టవర్స్‌లో ఉన్న ఓయో రూమ్‌లో వ్యభాచారం జరుగుతుందన్న సమాచారంతో టాస్క్ఫోర్సు పోలీసులు సోదాలు చేశారు. ఈ సమయంలో హోటల్ వద్ద ఉన్న నిర్వాహకుడు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. గదిలో ఉన్న కాచికూడకు చెందిన ఆడీటర్ వేణుకుమార్, ఓ యువతిని అరెస్టు చేశారు. రమేష్‌ను విచారించగా తాను జనార్దన్ అనే వ్యక్తి వద్ద పని చేస్తానని చెప్పడంతో లీలానగర్‌లోని విద్యుత్ టవర్స్‌లో ప్రధాన నిర్వాహకుడు జనార్దన్‌ను అరెస్టు చేశారు. జనార్దన్ ఇచ్చిన సమాచారం మేరకు మరో నిర్వాహకుడు నాగుల్ మీరా, కో ఆర్టినేజర్ తిరుమల్‌రావుతో మరో నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా యువతులను తీసుకువచ్చి వివిధ చోట్ల వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు. చదవండి: ఇంతకుముందే పెళ్లి.. నాగరాజుతో సాన్నిహిత్యం.. కట్నం తేవాలంటూ.. -
ఎల్లమ్మా... సల్లంగ సూడమ్మా
-
హైదరాబాద్‌లో మహిళా దొంగల ముఠా హల్చల్
-
దేవాలయంలో గొలుసు చోరీ
అత్తాపూర్ (హైదరాబాద్) : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లిన ఓ భక్తురాలి నుంచి దొంగలు గొలుసు చోరీ చేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు నర్సమ్మ (65) అనే మహిళ శుక్రవారం ఆలయానికి వెళ్లారు. అయితే ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు మాయం కావడంతో బాధితురాలు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. మేడ్చల్ ఎలక్ట్రికల్ డీఈ శ్రీధర్ నివాసాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లోని బల్కంపేటలోని నివాసంతో పాటు కరీంనగర్, సిరిసిల్లలో ఉన్న ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. శ్రీధర్ కు రూ. 5 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. 60 తులాల బంగారం, రూ. 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. రెండు బ్యాంకు ఖాతాలు, లాకర్లను సీజ్ చేసినట్టు తెలుస్తోంది. -
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్
-
నేటి నుంచే బల్కంపేట అమ్మవారి ఉత్సవాలు
హైదరాబాద్: నేటి నుంచే బల్కంపేట ఎల్లమ్మతల్లి ఉత్సవాలు జరుగనున్నాయి. సోమవారం అమ్మవారి ఎదుర్కొలుతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఎల్లమ్మతల్లి కల్యాణం నిర్వహించనున్నారు. ఈ నెల 22న అమ్మవారి రథోత్సం జరగనుంది. ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించింది.