అత్తాపూర్ (హైదరాబాద్) : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లిన ఓ భక్తురాలి నుంచి దొంగలు గొలుసు చోరీ చేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు నర్సమ్మ (65) అనే మహిళ శుక్రవారం ఆలయానికి వెళ్లారు. అయితే ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు మాయం కావడంతో బాధితురాలు ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.