yellamma temple
-
వీడియో: వానల ఎఫెక్ట్.. ఎల్లమ్మ గుడిలోకి వరద నీరు
సాక్షి, నిర్మల్: కొద్దిరోజులుగా తెలంగాణలో వానలు దండికొడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. వరదల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్‌ల్లోకి నీరు వచ్చి చేరుకుంది. ► ఇక, భారీ వరదల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్‌లో ఉన్న పుసాయి ఎల్లమ్మ దేవాలయంలోకి వరద నీరు చేరుకుంది. దేవాలయాన్ని వరద ముంచెత్తింది. ► నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 88,554, ఔట్ ఫ్లో 84,487 క్యూసెక్కులుగా ఉంది. ► అటు, ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మంజీర పరవళ్లు తొక్కుతోంది. దీంతో, ఏడుపాయల ఆలయంలోకి వరద నీరు చేరుకుంది. ఆలయ పరిసరాల్లో మంజీరా ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మూడో రోజు కూడా దర్శనాలను నిలిపివేశారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ వర్షసూచన -
ఎల్లమ్మ కల్యాణం.. ఎల్లెడలా ఆనందం (ఫొటోలు)
-
కన్నుల పండుగగా బల్కంపేట అమ్మవారి కళ్యాణం
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం మంగళవారం కన్నుల పండుగగా, అత్యంత ఘనంగా జరిగింది. ఆలయం ముందు నిర్మించిన భారీ షెడ్డు క్రింద వేదపండితుల మంత్రోచ్ఛారణలతో అమ్మవారి కల్యాణం నిర్వహించారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆలయ పరిసరాలు మొత్తం జనసంద్రంగా మారాయి.రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దంపతులు అమ్మవారి కల్యాణం లో పాల్గొన్న అనంతరం ఆలయం లోపల అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ క్యూ లైన్ లలో నిల్చున్నారు. ఆలయం పక్కన నూతనంగా నిర్మించిన షెడ్డులో కూడా భక్తులు కూర్చొని అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించారు. భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్ లను కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారి కళ్యాణంలో టీఎస్ఎమ్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎంపీ కవిత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ దంపతులు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేటర్ లు మహేశ్వరి, సరళ, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఈవో అన్నపూర్ణ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తల్లి కోరికను తీర్చిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి,చిత్తూరు: పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన తల్లి కోరిన కోరికను తీర్చారు. మంత్రి స్వగ్రామమైన ఎర్రతివారిపల్లెలో తమ ఇలవేల్పు సదుం ఎల్లమ్మ ఆలయం శిధిలావస్థలో ఉండటంతో తిరిగి ఆలయాన్ని నిర్మించాలని ఆయన తల్లి పద్మావతమ్మ కోరారు. తల్లి ఆదేశాలతో రెండు నెలల్లో అన్ని హంగులతో ఎల్లమ్మ ఆలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి పునర్నిర్మించారు. ఆలయం నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా సోమవారం కుంభాభిషేకం నిర్వహించారు. చదవండి: ‘ఈనాడు’ ఏనాడూ చెప్పని నిజం.. రైతు భరోసాలో ఇదో చరిత్ర ఈ కుంభాభిషేకంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు అశోక్ కుమార్, పెద్దిరెడ్డి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వైభవంగా జరిగిన కుంభాభిషేక కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు హాజరయ్యారు. కుంభాభిషేకంలో ఎమ్మెల్సీ భరత్, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, వెంకట గౌడ, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
దొంగోడి తిప్పలు; భక్తుడిలా గుడికి.. చెట్టుతొర్రలో ఇరుక్కుని..
సాక్షి, శంషాబాద్ రూరల్: ఆలయంలో నగదు చోరీ చేసిన ఓ మైనర్ బాలుడు.. తిరిగి ఆలయం నుంచి బయటకు వస్తూ చెట్టుతొర్రలో ఇరుక్కుపోయాడు. ఆలయ పూజారి వచ్చి గమనించి ఆ బాలుడిని పట్టుకున్నాడు. శంషాబాద్ మండలం ఇందిరానగర్ దొడ్డి ప్రాంతానికి చెందిన బాలుడు(11) సోమవారం మధ్యాహ్నం ఘాంసిమియాగూడలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రధాన ఆలయంలోకి భక్తుడిలా వచ్చాడు. కొబ్బరికాయ చేతిలో పట్టుకొని గుడిలోపలికి వెళ్లాడు. అయితే పూజలు చేస్తున్నట్లుగా నటించి ఏకంగా ఆలయం లోపల టేబుల్ ఖానాలో దాచి ఉంచిన రూ.10వేలను తస్కరించాడు. తిరిగి అదే చెట్టు తొర్రలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ అందులో ఇరుక్కుపోయాడు. అయితే, కొద్దిసేపటి తర్వాత ఆలయానికి వచ్చిన పూజారికి టేబుల్ ఖానాలోని నగదు కనిపించలేదు. దీంతో ఆయన స్థానికులతో కలిసి సీసీ పుటేజ్‌ను పరిశీలించగా.. బాలుడు ఆలయంలోకి వచ్చి చెట్టుతొర్రలోకి వెళ్లినట్లు గుర్తించారు. వారు అక్కడికి వెళ్లి చూడగా ఆ బాలుడు అందులోనే ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి బాలుడి నుంచి రూ.10 వేలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఈ బాలుడు సెల్‌పోన్ దొంగతనం సంఘటనలో నిందితుడుగా ఉన్నట్లు సీఐ ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చదువులో వెనకబడ్డానని.. బీటెక్ విద్యార్థి.. -
హైదరాబాద్‌లో మహిళా దొంగల ముఠా హల్చల్
-
దేవాలయంలో గొలుసు చోరీ
అత్తాపూర్ (హైదరాబాద్) : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లిన ఓ భక్తురాలి నుంచి దొంగలు గొలుసు చోరీ చేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు నర్సమ్మ (65) అనే మహిళ శుక్రవారం ఆలయానికి వెళ్లారు. అయితే ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు మాయం కావడంతో బాధితురాలు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆలయంలో చోరీ
కర్నూలు (వెల్దుర్తి) : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయంలోని హుండీని పగులగొట్టి సుమారు రూ.50 వేల నగదును దోచుకెళ్లారు. అమ్మవారి విగ్రహంపై ఉన్న వెండి ఆభరణాలను కూడా దోచుకెళ్లారు. వీటి విలువ రూ.15 వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
- పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్: డప్పుల మోతలు, పోతురాజుల విన్యాసాల మధ్య బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ మహోత్సవానికి సతీసమేతంగా హాజరైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ ప్రభాకర్, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్‌రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన ఉత్సవాల్లో పాల్గొన్నారు. భక్తులు సమర్పించిన లడ్డూకు వేలం పాట నిర్వహించగా ఫతేనగర్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ కృష్ణగౌడ్ రూ.2 లక్షలకు స్వాధీనం చేసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
బల్కంపేట ఎల్లమ్మగుడిలో కేసీఆర్ పూజలు
-
బల్కంపేట ఎల్లమ్మగుడిలో కేసీఆర్ పూజలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అమ్మవారి కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు ఎల్లమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ఆలయ అభివృ఼ద్ధికి మరింత పాటుపడతామని చెప్పారు. కాగా, మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును పరిశీలించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ హరితహారం పథకం అమలుచేసే విషయం గురించి పరిశీలించనున్నారు. భారీ ఎత్తున ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జోగిని రాధిక -
సోదరింటికి వెళుతూ మృత్యు ఒడిలోకి..
కరీంనగర్: సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజ్పల్లి గ్రామంలో ఎల్లమ్మగుడి మూల మలుపు వద్ద ట్రాక్టర్ బోల్తా పడటంతో రొడ్ల వీరారెడ్డి(45) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చెర్లబూత్కూర్ గ్రామానికి చెందిన వీరారెడ్డి తండ్రి రాజిరెడ్డి 15 రోజుల క్రితం మృతిచెందారు. దీంతో వీరారెడ్డిని తన ఇంట్లో ఒకరోజు నిద్రచేయాలని ఎలిగేడు మండలం ర్యాకల్‌దేవ్‌పల్లిలో ఉంటున్న సోదరి కోరింది. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి ట్రాక్టర్‌ను తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలో ఐతరాజ్పల్లి ఎల్లమ్మ గుడి మూల మలుపు వద్ద బోల్తాపడింది. ట్రాక్టర్ నడుపుతూ వెళుతున్న వీరారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అటువైపు వెళుతున్న స్థానికులు ఈ ప్రమాదాన్ని గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వారు ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరారెడ్డి శనివారం మృతిచెందాడు. (సుల్తానాబాద్)