సాక్షి, నిర్మల్: కొద్దిరోజులుగా తెలంగాణలో వానలు దండికొడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. వరదల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్‌ల్లోకి నీరు వచ్చి చేరుకుంది.
► ఇక, భారీ వరదల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్‌లో ఉన్న పుసాయి ఎల్లమ్మ దేవాలయంలోకి వరద నీరు చేరుకుంది. దేవాలయాన్ని వరద ముంచెత్తింది.
► నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 88,554, ఔట్ ఫ్లో 84,487 క్యూసెక్కులుగా ఉంది.
► అటు, ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మంజీర పరవళ్లు తొక్కుతోంది. దీంతో, ఏడుపాయల ఆలయంలోకి వరద నీరు చేరుకుంది. ఆలయ పరిసరాల్లో మంజీరా ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మూడో రోజు కూడా దర్శనాలను నిలిపివేశారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ వర్షసూచన
Comments
Please login to add a commentAdd a comment