
మెదక్,సాక్షి: మెదక్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. తూప్రాన్ వద్ద రాజస్థాన్ నుండి హైదరాబాద్ వెళుతున్న వేగంగా వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ ఊడింది. దీంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ బస్సు ప్రమాదంలో పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ ప్రయాణికుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.