Private travel
-
ట్రావెల్స్ దోపిడీ
ప్రైవేట్ ట్రావెల్స్ దసరా పండగ చేసుకుంటున్నాయి. పండగ రద్దీ పేరిట అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తే భారీ జరిమానా విధిస్తామన్న రవాణ శాఖ హెచ్చరికలు బేఖాతరు అవుతున్నాయి. టికెట్ ధరకు రెండింతలకు పైగా పెంచేసి ప్రయాణికులను ప్రైవేట్ ట్రావెల్స్ నిలువుదోపిడీ చేస్తున్నాయి. పెరిగిన ధరలతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. 50 శాతం అదనపు చార్జీపై హైదరాబాద్, రాష్ట్రంలోని ముఖ్య నగరాలకు 325 సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. పెంచిన ధరలతో దసరా పండగ కోసం జిల్లాకు వచ్చేవారిపై దాదాపు రూ.2.34 కోట్ల అదనపు భారం పడుతున్నట్టు అంచనా. తూర్పుగోదావరి, మండపేట: విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి కోసం హైదరాబాద్, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి.. దసరా పండగ కోసం జిల్లాలోని స్వస్థలాలకు వచ్చినందుకు టికెట్ల రూపంగా పెనుభారం మోసే దుస్థితి ఏర్పడుతోంది. దసరా సెలవుల ప్రారంభం నుంచి జిల్లాకు వచ్చే బస్సులు, రైళ్లల్లో రద్దీ మొదలైంది. వచ్చే ఆదివారం వరకు పాఠశాలలకు సెలవులు ఉండటంతో తిరుగు ప్రయాణికులతో మరో ఐదు రోజులు పాటు రద్దీ కొనసాగుతుంది. గమ్యస్థానాలకు చేరే వీరి నుంచి టికెట్ల రూపంలో దోపిడీ చేసేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ పొంచి ఉన్నాయి. సాధారణ టికెట్టు ధరను రెండు రెట్లు పెంచేసి దోపిడీ పర్వానికి తెరలేపాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో ఆదివారం సర్వీసులు రద్దు కావడం ప్రైవేట్ ట్రావెల్స్‌కు మరింత కలిసొచ్చింది. హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే బస్సులకు ధరలు అమాంతం పెంచేశారు. మరో దారి లేక అధిక ధరలు చెల్లించి ప్రైవేట్ ట్రావెల్స్‌ను ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు. భారీగా ధరల పెంపు కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, తుని, రాజోలు తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రోజుకు దాదాపు 130 వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 40 శాతానికి పైగా ఏసీ సర్వీసులే. ఈ బస్సుల సిటింగ్ సామర్థాన్ని బట్టి 5,100 మంది వరకు ప్రయాణించే వీలు ఉంది. సాధారణ రోజుల్లో కాకినాడ నుంచి హైదరాబాద్‌కు టికెట్ రూ.500 నుంచి రూ.650 వరకు ఉంటుంది. ఏసీ సర్వీసుకు రూ.750 ఉంటుంది. పండగల రద్దీ పేరుతో ఆదివారం పలు ట్రావెల్స్ సాధారణ సర్వీసులకు టికెట్ రూ.1,200 నుంచి రూ.1,600 వరకు, ఏసీ సర్వీసుకు రూ.2,300 వరకు పెంచేశారు. సగటున ఒక్క టికెట్‌పై రూ.800 వరకు అదనపు భారం ప్రయాణికులపై పడుతున్నట్టు అంచనా. ఈ నెల 13వ తేదీ వరకు తిరుగు ప్రయాణ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ఈ ఐదు రోజుల వ్యవధిలో దాదాపు రూ.2.34 కోట్ల మేర అదనపు భారం జిల్లావాసులపై పడుతుందని అంచనా. గతంలో పండగల రద్దీ సమయంలో నిబంధనలకు తుంగలోకి తొక్కి పర్మిట్లు లేకుండానే కొందరు వ్యాపారులు యథేచ్ఛగా ప్రైవేట్ బస్సులు నడిపేవారు. అధిక ధరలు వసూలు చేస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్న రవాణా శాఖ.. నామమాత్రపు తనిఖీలతో చేతులు దులుపుకుంటోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఇప్పుడైనా తనిఖీలు విస్తృతంగా చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు జిల్లా నుంచి హైదరాబాద్‌కు రోజుకు 40 వరకు సర్వీసులు నడుపుతున్న ఆర్టీసీ దసరా రద్దీ కారణంగా టికెట్ ధరపై 50 శాతం అదనంగా ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. గతేడాది హైదరాబాద్, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు జిల్లా నుంచి రానుపోనూ 293 సర్వీసులు ఆర్టీసీ నడిపింది. ఈ ఏడాది 325 సర్వీసుల వరకు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. ప్రత్యేక సర్వీసుల ద్వారా దాదాపు రూ.30 లక్షల వరకు అదనపు ఆదాయం వస్తుందని ఆర్టీసీ అంచనా. మరోపక్క హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణికులతో ఈ నెల 13వ తేదీ వరకు రైళ్లలో వెయింటింగ్ లిస్ట్ అధికంగా ఉంది. జిల్లా మీదుగా రోజూ హైదరాబాద్‌కు 12 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. -
పండగ దగా
సాక్షి, గుంటూరు: సంక్రాంతి పండుగ వారం రోజులుండగానే ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు ఆన్లై¯న్Œ ద్వారా టికెట్ రేట్లను విక్రయిస్తుండేవారు. పండగ నేపథ్యంలో తత్కాల్ విధానాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన చాలా మం ది చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. దీంతో పం డుగ పూట సొంతూరుకి రావాలన్నా, పండగ అ నంత రం ఆయా నగరాలకు తిరిగి వెళ్లాలన్నా జేబు లకు చిల్లు పడుతోంది. స్పెషల్ సర్వీసుల పే రుతో ఆర్టీ సీ టికెట్‌పై అదనంగా 50 శాతం రేట్లు వసూలు చేస్తుండగా, ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు రెండడుగులు ముందుకేసి టికెట్ రేటును మూడు నుంచి నాలుగు రెట్లు అదనంగా వసూలుకు చేస్తున్నా రు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం కళ్లప్పగించి చూస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా టికె ట్ ధరలను పెంచుతున్న ట్రావెల్స్‌పై చర్యలు తీ సుకోవాల్సిన రవాణా శాఖ సైతం దోపిడీకి రైట్ రై ట్ చెబుతోంది. మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తూ ప్రైవేట్ ట్రావెల్స్‌కు పరోక్షంగా సహకరిస్తోం ది. ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు.. సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యా సంస్థలకు ఈ నెల 12 నుంచి 20 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. పండుగ ముందు రెండో శనివారం, ఆదివారం కూడా కలిసి రవాడంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్న వారు నాలుగు రోజుల ముందే సొంతూళ్లకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో గుంటూరు రీజియన్, జిల్లాలోని వివిధ డిపోలలో ఆర్టీసీ నేటి నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి జిల్లాకు 100కుపైగా స్పెషల్ బస్సులు నడుపుతోంది. పండుగ అనంతరం ఆయా నగరాలకు తిరిగి వెళ్లే ప్రయాణికులు అధికంగా ఉంటారనే ఉద్దేశంతో 15, 16 తేదీల్లో సైతం ఆర్టీసీ అదనపు సర్వీసులు కేటాయిస్తోంది. ఏటా ఇదే దోపిడీ... మూడు రోజులపాటు సాగే సంక్రాంతి పండుగకు వివిధ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వచ్చి, వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విశాఖపట్టణం వంటి నగరాలకు సాధారణంగా వీకెండ్ సమయాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తుంటాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికులు రద్దీ అధికంగా ఉంటుందని భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను సైతం తీసుకువచ్చి తిప్పుకుంటున్న తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఈ డిమాండ్‌కు అనుగుణంగా బస్సులను నడపాల్సి ఉన్నా మొక్కుబడిగా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తోంది. ఇదే ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లకు వరంగా మారింది. ప్రతి ఏటా సంక్రాంతి సీజన్ కాసులు కురిపిస్తోంది. అడ్డగోలుగా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేసేందుకు పక్కా ప్రణాళికలను అమలు చేస్తున్నారు. -
ఒడిశాలో తెలుగు యాత్రికులను దోచుకున్న దొంగలు
ఒడిశాలో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. తెలుగు యాత్రికులను ప్రమాదానికి గురిచేసి, వారంతా ఆ షాక్ నుంచి తేరుకోకమునుపే నిలువుదోపిడీ చేశారు. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోయింది. వివరాలివీ.. గుంటూరు జిల్లా నర్సరావుపేట, ముప్పాళ్ల, ఈపూరు, రొంపిచెర్ల ప్రాంతాలకు చెందిన దాదాపు 35 మంది ప్రయాణికులు ఈనెల 20వ తేదీన తీర్థయాత్రలకు బయలుదేరారు. వారి బస్సు సోమవారం రాత్రి ఒడిశా రాష్ట్రం కటక్ సమీపంలోని అటవీప్రాంతం గుండా వెళ్తుండగా దోపిడీ దొంగలు రోడ్డుపై అడ్డంగా ఉంచిన రాళ్లను ఢీకొట్టి పడిపోయింది. దీంతో బస్సు ప్రయాణికులు హాహాకారాలు చేస్తుండగానే అక్కడే మాటువేసి ఉన్న దుండగులు వారిని బెదిరించి నగదు, ఆభరణాలు, సెల్ఫోన్లు, విలువైన వస్తువులను దోచుకుని పరారయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో బస్సులోని తులశమ్మ మరణించగా పది మంది తీవ్రంగా గాయపడ్డారు. తులశమ్మ స్వస్థలం నరసరావుపేట మండలం బరంపేటగా గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చినరాజప్ప ఆరా.. ఈ ఘటనపై మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఒడిశా అధికారులతో ఆరా తీశారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం రాష్ట్రానికి పంపాలని, అలాగే క్షతగాత్రులకు చికిత్స చేయించి వెనక్కి పంపించాలని ఆ రాష్ట్ర విపత్తు నిర్వమణ శాఖ ముఖ్య కార్యదర్శి మహాపాత్రను కోరారు. కాగా ఏపీ డీజీపీ రాముడు.. ఒడిశా డీజీపీతో ఫోన్ లో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు., -
అక్రమ రవాణాకు అడ్డా!
ప్రైవేటు ట్రావెల్స్‌పై ఎర్రచందనం స్మగ్లర్ల దృష్టి గతంలో మావోయిస్టులు కూడా నిఘా లేకుంటే ప్రమాదమే.. విజయవాడలోని ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణాకు నెలవుగా మారాయి. వీటిపై నిఘా కొరవడటంతో ఎర్రచందనం వంటివి యథేచ్ఛగా రవాణా అవుతున్నాయి. సాధారణ రోజుల్లో వీటిపై పోలీసుల నిఘా ఉండటంలేదు. గతంలో మావోయిస్టులు ఓ ట్రాన్స్‌పోర్టు సంస్థ ద్వారా పేలుడు పదార్థాలను రవాణా చేస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి కొన్నిరోజులు తనిఖీలు కొనసాగాయి. తరువాత పోలీసులు ఉదాసీనంగా ఉండటంతో వీటి రవాణా కొనసాగుతోంది. విజయవాడ క్రైం : విజయవాడలో ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలపై పోలీసు నిఘా కొరవడింది. దీంతో వాటి నిర్వాహకులు నిషిద్ధ వస్తువులతోపాటు ఎర్రచందనం వంటి వాటి అ క్రమ రవాణాకు సహకరిస్తూ సొమ్ము చే సుకుం టున్నారు. గతంలో మావోయిస్టులు విజయవాడ కేంద్రంగా పేలుడు పదార్థాలు అక్రమం గా తరలించేవారు. గుంటూరు జిల్లా అచ్చంపేటలోని క్రాంతి ట్రాన్స్‌పోర్టు కార్యాలయంపై పోలీసులు దాడి జరిగినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. తరువాత కొన్నిరోజులపాటు పోలీసులు తర చూ ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు కార్యా యాల్లో త నిఖీలు నిర్వహించారు. తరువాత మిన్నకుండిపోయారు. జిల్లాలో బుధ, గురువారాల్లో ఎర్రచందనం దుంగలు పెద్దమొత్తంలో పట్టుబడటంతో ఇలాంటి వాటి అక్రమ రవాణా మళ్లీ జోరుగా సాగుతోందని నిర్ధారణ అయింది. ఎర్రచందనం రవాణా ఎర్రచందనం స్మగ్లర్లపై ప్రభుత్వం కొంతకాలం గా ఉక్కుపాదం మోపుతోంది. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అపారంగా లభ్యమయ్యే ఎర్రచందనాన్ని స్మగ్లర్లు విదేశాలకు రవాణా చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. అక్కడ కూలీ లు నరికిన దుంగలను ప్రత్యేక వాహనాల్లో చెన్నై, బెంగళూరు నగరాలకు తరలిస్తుంటారు. తరువాత వాటిని విమానాల్లో విదేశాలకు ర వాణా చేస్తున్నారు. దీనిపై కొంతకాలంగా పో లీసు నిఘా పెరిగింది. ఆ ప్రాంతంలోని అన్ని రహదారులలో పోలీసు, అటవీ అధికారులు ని ఘా ఉంచి, ఎర్రచందనం అక్రమ రవాణాను నిలువరించారు. దీంతో స్మగ్లర్లు ప్రత్యామ్నా య మార్గాలను ఎంచుకుని ట్రాన్స్‌పోర్టు సం స్థల ద్వారా వీటిని తరలిస్తున్నారు. చిత్తూరు, కడప జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోగల ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలను స్మ గ్లర్లు ఎంచుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తరలించి రైలు, ఇతర మార్గాల్లో చెన్నై వంటి ప్రాంతాలకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా కొద్ది రోజులుగా విజయవాడకు తరలించిన ఎర్రచందనం దుంగలను పెద్దఎత్తున వేర్వేరు ప్రాంతాలకు పంపుతున్నట్టు వినికిడి. ఇక్కడ తగిన నిఘా లేకపోవడం స్మగ్లర్లకు అనుకూలంగా మా రింది. బుధవారం విజయవాడలో ఎర్రచంద నం పట్టుబడిన విషయం తెలిసిందే. జిల్లాలో ని గరికపాడు చెక్‌పోస్టు వద్ద గురువారం ఓ కా రులో తరలిస్తున్న ఎర్రచందనాన్ని కూడా స్వా ధీనం చేసుకున్నారు. దీనినిబట్టి జిల్లానుంచి ఎర్రచందనం జోరుగా అక్రమంగా రవాణా అ వుతున్నట్లు నిర్ధారణ అయింది. పైరసీ సీడీలు చెన్నై కేంద్రంగా సాగుతున్న పైరసీ సీడీల దం దాకు ప్రైవేటు ట్రావెల్స్ ఊతమిస్తున్నాయి. చెన్నై నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌లో విజయవాడకు చేర్చి.. ఇక్కడి నుంచి కోస్తా జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. గతంలో ముందస్తు సమాచా రం మేరకు పలువురు పైరసీ సీడీల సరఫరాదారులను పోలీసులు పట్టుకున్నారు. దీంతో కొద్దిరోజుల పాటు మిన్నుకుండిన అక్రమ రవాణాదారులు... తిరిగి తమ కార్యకలాపాలను ప్రా రంభించినట్టు తెలిసింది. గుట్కాలు కూడా.. నగరంలోని ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా నిషిద్ధ గుట్కాలు కూడా రవాణా అవుతున్నాయి. బెం గళూరు, చెన్నై, పూణే ప్రాంతాల నుంచి బ స్తాల్లో భారీగా ఇక్కడికి గుట్కాలను తరలిస్తున్నారు. ఇక్కడినుంచి ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల ద్వారా కోస్తాజిల్లాలకు సరఫరా చేస్తున్నారు. పోలీసులు అప్పుడప్పుడూ తనిఖీ చేసి కొద్దిపాటి సరుకును పట్టుకుంటున్నారు తప్ప నిరంతర నిఘా ఉండటం లేదు. నిఘా ఉండాలి రాష్ట్ర రాజధానిగా విజయవాడ మారుతుందనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రైవేటు ట్రావెల్స్‌పై నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా ప్రై వేటు ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల ద్వారా జరి గే అక్రమ రవాణాను నిలువరించాలి. లేకుంటే ఉగ్రవాదులు వంటి సంఘ వ్యతిరేక శక్తులు దీనిని అవకాశంగా తీసుకొని విధ్వంసకర కా ర్యకలాపాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. -
‘ప్రయివేట్’కు పచ్చజెండా
కొత్త ప్రభుత్వం అండతో ట్రావెల్స్ ఖుషీ దర్జాగా రాకపోకలు ఆదాయం ఎరగా చూపి తెరచాటు ప్రయత్నాలు ప్రయివేటు ట్రావెల్స్ ఇక చక్రం తిప్పనున్నాయి. ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్న ఆర్టీసీ మళ్లీ కష్టాల బాట పట్టక తప్పదు. కొత్తగా గద్దెనెక్కబోయే సర్కారుకు ఆదాయం ఎరగా వేసి తమహవా కొనసాగిస్తామనే ధీమాను ప్రయివేటు ఆపరేటర్లు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొన్ని దుర్ఘటనలు చోటు చేసుకోవడంతో రవాణా శాఖాధికారులు ప్రయివేటు వాహనాలపై అప్పట్లో కన్నెర్రజేశారు. ఇప్పుడు నాయకుల అండతో మళ్లీ తమ హవా కొనసాగిస్తామని ప్రయివేటు రవాణాదారులు ధీమాగా చెబుతున్నారు. విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రయివేట్ ట్రావెల్స్‌కు కాలం కలిసొచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించడంతో ప్రయివేటు ఆపరేటర్లు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే ట్రావెల్స్ వ్యాపారం ఊపందుకుంది. తమ వ్యాపారానికి ఇక అడ్డు లేదని ఆపరేటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య కాలంలో మహారాష్ట్రలోని షోలాపూర్, మహబూబ్‌నగర్ వద్ద పాలెం బస్సు దుర్ఘటనలు ప్రయివేట్ ట్రావెల్స్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రభుత్వ చర్యలతో ప్రయివేట్ బస్సుల రాకపోకలు నిలిచాయి. ప్రముఖ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు నడుస్తున్నా చిన్నా చితకా ట్రావెల్స్ బస్సులు రోడ్డెక్కడం లేదు. వందలాది బస్సులు బకాయిలు తీర్చలేక ఫైనాన్స్ కంపెనీల గూటికి చేరాయి. త్రైమాసిక పన్నులు, బీమా, ఫిట్నెస్ లేని కారణంగా అనేక బస్సులు గ్యారేజీలకు పరిమితమయ్యాయి. రవాణా శాఖాధికారులు మార్గమధ్యంలో బస్సులు నిలిపి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో వ్యాపారులు సేద తీరారు. గమ్యస్థానంలో సీజ్ చేసుకోవచ్చని హైకోర్టు వెల్లడించిన తీర్పు ఆపరేటర్లకు కలిసివచ్చింది. ఇదే సాకుతో అధికారులు తనిఖీలకు పుల్‌స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. చట్టపరంగా రాకపోకలు ఇక రాబోయే రోజుల్లో చట్టపరంగా రాకపోకలు చేస్తామని ఆపరేటర్లు చెబుతున్నారు. కాంట్రాక్ట్ పర్మిట్ ఉండి స్టేజి క్యారియర్‌గా రాకపోకలు చేయడం నిబంధనలకు విరుద్ధమని చట్టం చెబుతోంది. స్టేజి క్యారియర్ పర్మిట్ మంజూరుతో ఎటువంటి ఇబ్బందులు ఉండవు కదా! అనే దిశగా వ్యాపారులు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ‘ఇన్నాళ్లు ఓపిక పట్టాం, ఇక సహించం..వచ్చింది మా ప్రభుత్వం’ అంటూ వారు చెబుతుండడం విశేషం. ‘కోర్టుల ద్వారా పోరాడతాం, అవసరమైతే ప్రత్యేక బిల్లుతో ప్రభుత్వం ద్వారా అనుమతులు కచ్చితంగా పొందుతాం’ అని చెప్పడం గమనార్హం. ఆదాయం లక్ష్యంగా.. ప్రభుత్వ ఆదాయం కోసం బస్సులకు స్టేజి క్యారియర్ పర్మిట్లు మంజూరు చేయడం ఒక్కటే ఉత్తమమని ప్రయివేట్ ఆపరేటర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విభజనతో ఇరు రాష్ట్రాలకు కోట్ల రూపాయల ఆదాయం రాబట్టవచ్చని అంటున్నారు. ఆదాయం కోసం ఆయా ప్రభుత్వాలు పర్మిట్లు మంజూరు చేయక తప్పదని జోస్యం చెబుతున్నారు. కొండంత అండగా నాయకులు విజయవాడ, అనంతపురానికి చెందిన లోక్ సభ సభ్యులు ట్రావెల్స్ వ్యాపారానికి పెద్ద దిక్కుగా మారారు. ఇప్పటికే వారిద్దరూ రాష్ట్రంలో ప్రముఖ ట్రావెల్స్‌కు యజమానులుగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ట్రావెల్స్ వ్యాపారులు భారీగా వెచ్చించినట్టు తెలిసింది. వ్యాపార లోకానికి నాయకులు కొండంత అండగా ఉండగా తమకు అడ్డుపడేది ఎవరని ఆపరేటర్లు ధీమాగా ఉన్నారు. ఉద్యమాలతో ఫలితం ప్రయివేట్ ట్రావెల్స్ వ్యాపారం పుంజుకుంటోంది అంటే ఆర్టీసీ నష్టాలలోకి వెళ్లడం.. అర్థమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ట్రావెల్స్ వ్యాపారం కుదేలవడంతో గతేడాదిగా ఆర్టీసీ పురోగతి సాధించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉద్యమించి పోరాడితే ప్రయివేట్ వ్యాపారానికి అడ్డుకట్ట వేయవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ప్రై‘వేటు’ దోపిడీ
సెలవులు, ఎన్నికల నేపథ్యంలో... కాస్ట్లీగా మారిన ప్రయాణం ఆర్టీసీ అరకొర ఏర్పాట్లు ప్రయాణికులను నిలువునా దోచేస్తున్న ట్రావెల్స్ పట్టనట్టు వ్యవహరిస్తున్న రవాణా శాఖ నాంపల్లి, అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: వేసవి సెలవులు, ఎన్నికల నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నాయి. సెలవులు, ఎన్నికలు ఒక్కసారిగా రావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పరిమితమైన రైళ్లు.. ఆర్టీసీ బస్సులు చాలని పరిస్థితిలో ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ ట్రావెల్స్ రెట్టింపు ధరలు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. నగరం నుంచి చెన్నై, ముంబై, వైజాగ్, బెంగ ళూరు, నాగ్‌పూర్, తిరుపతి, గోవా వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రైళ్లలో బెర్త్‌లు లభించకపోవడంతో ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. బెంగళూరు, చెన్నైలకు పెరిగిన రద్దీ బెంగళూరు, చెన్నై వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ రద్దీగా మారింది. ఆదివారం ఒక్కసారిగా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో అధికారులు అదనపు బస్సులు నడిపారు. సాధారణ రోజుల్లో ఎంజీబీఎస్ నుంచి బెంగళూరు, చెన్నైలకు ఆర్టీసీ 32 బస్సులను నడుపుతుంది. రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ఆదివారం 30 అదనపు బస్సులను నడిపారు. సీమాంధ్రకు 600 అదనపు బస్సులు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో సీమాంధ్ర ప్రాంతానికి 600 అదనపు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన సీమాంధ్రలో ఎన్నికలు జరగనున్నందున ఓటు వేసేందుకు నగరం నుంచి సీమాంధ్ర జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బస్సులను నడిపనున్నట్లు ఎంజీబీఎస్ ఏటీఎం -1 ఇ.వి.సత్యనారాయణ తెలిపారు. ప్రతినిత్యం ఎంజీబీఎస్ నుంచి సీమాంధ్ర జిల్లాలకు నడిపే 720 షెడ్యూల్డ్ బస్సులకు అదనంగా మరో 600 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే సీమాంధ్ర వైపు వెళ్లే బస్సుల్లోని సీట్లన్నీ ముందుగానే రిజర్వు కాడవంతో.. అదనపు బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించిందని ఆయన వెల్లడించారు. -
దారి దోపిడీ
ధరలు పెంచేసిన ప్రయివేట్ ట్రావెల్స్ సంక్రాంతికి పెరిగిన రద్దీ రైళ్లన్నీ కిటకిట.. దిక్కుతోచని పండగ ప్రయాణికులు డాక్‌యార్డులో పనిచేసే శంకర్‌కు పండగకు ఎలా ఊరికి వెళ్లాలో పాలుపోవడం లేదు. విజయవాడలో అమ్మానాన్నా... రైళ్లన్నీ కిటకిట..బస్సులో ఆపసోపాలు పడలేని పరిస్థితి..పోనీ ప్రయివేట్ బస్సెక్కుదామంటే గుండెలదిరే రేట్లు చెబుతున్నారు. అవును మరి..సంక్రాంతి పండగకు అందరూ ఊళ్లు వెళ్లాల్సిందే. దీంతో ఒకటే డిమాండ్.. దీన్ని ప్రయివేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఇప్పటికే విద్యాలయాలు సెలవులు ప్రకటించడంతో కుటుంబాలతో ప్రయాణాలు పోటెత్తాయి. ట్రావెల్స్ ఆపరేటర్లు బిజీ అయ్యారు. పండగకు స్వస్థలాలు చేరుకోవాలంటే రవాణా ఛార్జీలు ధడ పుట్టిస్తున్నాయి. పండగ పేరిట ట్రావెల్స్ ఆపరేటర్లు రెట్టింపు ధరల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. విశాఖ నుంచి కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, తిరుపతి, తదితర ప్రాంతాలకు సామాన్యులు చేరుకోలేని దుస్థితి ఏర్పడింది. సాధారణ రోజుల్లో తీసుకునే చార్జీల కంటే ఒకటి, రెండు రెట్లు అదనంగా ఆపరేటర్లు వసూలు చేస్తుండటం విశేషం. రైలులో ప్రయాణాలకు అవకాశం లేకపోవడం, ఆర్టీసీ బస్సుల సౌకర్యం అంతంత మాత్రంగా ఉండటంతో ట్రావెల్స్ వ్యాపారం ఊపందుకోంది. గత రెండు నెలలుగా రోడ్డెక్కని ప్రైవేట్ బస్‌లు ఇదే అదునుగా భావించి ధరలు అమాంతంగా పెంచేశారు. ఆన్లైన్లో టికెట్ల ధరలు సాధారణంగా ఉంటున్నా ఖాళీలు లేనట్టు చూపడం, నేరుగా ట్రావెల్స్ కార్యాలయాలకు వెళితే అధిక ధరలు వసూలు చేస్తుండటం గమనార్హం. అదే బాటలో ఆర్టీసీ..: ఆర్టీసీ ధరలు ప్రయాణికులకు చుక్క లు చూపిస్తున్నాయి. అధిక ధరలు రాబట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. డిమాండ్‌కు తగ్గట్టు సొమ్ములు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీ భరించలేక ఆర్టీసీని ఆశ్రయిస్తే అక్కడా అదే పరిస్థితి ఎదురవుతోంది. పండగ సీజన్లో దాదాపు వెయ్యి ప్రత్యేక సర్వీస్‌లు నడుపుతామని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సూప ర్ లగ్జరీ, హైటెక్ బస్‌లు రాకపోకలకు వినియోగిస్తున్నారు.