అక్రమ రవాణాకు అడ్డా! | Adda smuggling! | Sakshi
Sakshi News home page

అక్రమ రవాణాకు అడ్డా!

Published Fri, Jul 4 2014 2:27 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Adda smuggling!

  • ప్రైవేటు ట్రావెల్స్‌పై ఎర్రచందనం స్మగ్లర్ల దృష్టి
  •  గతంలో మావోయిస్టులు కూడా
  •  నిఘా లేకుంటే ప్రమాదమే..
  • విజయవాడలోని ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణాకు నెలవుగా మారాయి. వీటిపై నిఘా కొరవడటంతో ఎర్రచందనం వంటివి యథేచ్ఛగా రవాణా అవుతున్నాయి. సాధారణ రోజుల్లో వీటిపై పోలీసుల నిఘా ఉండటంలేదు. గతంలో మావోయిస్టులు ఓ ట్రాన్స్‌పోర్టు సంస్థ ద్వారా పేలుడు పదార్థాలను రవాణా చేస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి కొన్నిరోజులు తనిఖీలు కొనసాగాయి. తరువాత  పోలీసులు ఉదాసీనంగా ఉండటంతో వీటి రవాణా కొనసాగుతోంది.
     
    విజయవాడ క్రైం : విజయవాడలో ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలపై పోలీసు నిఘా కొరవడింది. దీంతో వాటి నిర్వాహకులు నిషిద్ధ వస్తువులతోపాటు ఎర్రచందనం వంటి వాటి అ క్రమ రవాణాకు సహకరిస్తూ సొమ్ము చే సుకుం టున్నారు. గతంలో మావోయిస్టులు విజయవాడ కేంద్రంగా పేలుడు పదార్థాలు అక్రమం గా తరలించేవారు.

    గుంటూరు జిల్లా అచ్చంపేటలోని క్రాంతి ట్రాన్స్‌పోర్టు కార్యాలయంపై పోలీసులు దాడి జరిగినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. తరువాత కొన్నిరోజులపాటు పోలీసులు తర చూ ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు కార్యా యాల్లో త నిఖీలు నిర్వహించారు. తరువాత మిన్నకుండిపోయారు. జిల్లాలో బుధ, గురువారాల్లో ఎర్రచందనం దుంగలు పెద్దమొత్తంలో పట్టుబడటంతో ఇలాంటి వాటి అక్రమ రవాణా మళ్లీ జోరుగా సాగుతోందని నిర్ధారణ అయింది.
     
    ఎర్రచందనం రవాణా
     
    ఎర్రచందనం స్మగ్లర్లపై ప్రభుత్వం కొంతకాలం గా ఉక్కుపాదం మోపుతోంది. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అపారంగా లభ్యమయ్యే ఎర్రచందనాన్ని స్మగ్లర్లు విదేశాలకు రవాణా చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. అక్కడ కూలీ లు నరికిన దుంగలను ప్రత్యేక వాహనాల్లో చెన్నై, బెంగళూరు నగరాలకు తరలిస్తుంటారు. తరువాత వాటిని విమానాల్లో విదేశాలకు  ర వాణా చేస్తున్నారు. దీనిపై కొంతకాలంగా పో లీసు నిఘా పెరిగింది.

    ఆ ప్రాంతంలోని అన్ని రహదారులలో పోలీసు, అటవీ అధికారులు ని ఘా ఉంచి, ఎర్రచందనం అక్రమ రవాణాను నిలువరించారు. దీంతో స్మగ్లర్లు ప్రత్యామ్నా య మార్గాలను ఎంచుకుని ట్రాన్స్‌పోర్టు సం స్థల ద్వారా వీటిని తరలిస్తున్నారు.   చిత్తూరు, కడప జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోగల ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలను స్మ గ్లర్లు ఎంచుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తరలించి రైలు, ఇతర మార్గాల్లో చెన్నై వంటి ప్రాంతాలకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు.

    ఇందులో భాగంగా కొద్ది రోజులుగా విజయవాడకు తరలించిన ఎర్రచందనం దుంగలను పెద్దఎత్తున వేర్వేరు ప్రాంతాలకు పంపుతున్నట్టు వినికిడి. ఇక్కడ తగిన నిఘా లేకపోవడం స్మగ్లర్లకు అనుకూలంగా మా రింది. బుధవారం విజయవాడలో ఎర్రచంద నం  పట్టుబడిన విషయం తెలిసిందే. జిల్లాలో ని గరికపాడు చెక్‌పోస్టు వద్ద గురువారం ఓ కా రులో  తరలిస్తున్న ఎర్రచందనాన్ని కూడా స్వా ధీనం చేసుకున్నారు. దీనినిబట్టి జిల్లానుంచి ఎర్రచందనం జోరుగా అక్రమంగా రవాణా అ వుతున్నట్లు నిర్ధారణ అయింది.
     
    పైరసీ సీడీలు
     
    చెన్నై కేంద్రంగా సాగుతున్న పైరసీ సీడీల దం దాకు ప్రైవేటు ట్రావెల్స్ ఊతమిస్తున్నాయి. చెన్నై నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌లో విజయవాడకు చేర్చి.. ఇక్కడి నుంచి కోస్తా జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. గతంలో ముందస్తు సమాచా రం మేరకు పలువురు పైరసీ సీడీల సరఫరాదారులను పోలీసులు పట్టుకున్నారు. దీంతో కొద్దిరోజుల పాటు మిన్నుకుండిన అక్రమ రవాణాదారులు... తిరిగి తమ కార్యకలాపాలను ప్రా రంభించినట్టు తెలిసింది.
     
    గుట్కాలు కూడా..
     
    నగరంలోని ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా నిషిద్ధ గుట్కాలు కూడా రవాణా అవుతున్నాయి. బెం గళూరు, చెన్నై, పూణే ప్రాంతాల నుంచి బ స్తాల్లో భారీగా ఇక్కడికి గుట్కాలను తరలిస్తున్నారు. ఇక్కడినుంచి ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల ద్వారా కోస్తాజిల్లాలకు సరఫరా చేస్తున్నారు. పోలీసులు అప్పుడప్పుడూ తనిఖీ చేసి కొద్దిపాటి సరుకును పట్టుకుంటున్నారు తప్ప నిరంతర నిఘా ఉండటం లేదు.
     
    నిఘా ఉండాలి
     
    రాష్ట్ర రాజధానిగా విజయవాడ మారుతుందనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రైవేటు ట్రావెల్స్‌పై నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా ప్రై వేటు ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల ద్వారా జరి గే అక్రమ రవాణాను నిలువరించాలి.  లేకుంటే  ఉగ్రవాదులు వంటి సంఘ వ్యతిరేక శక్తులు దీనిని అవకాశంగా తీసుకొని విధ్వంసకర కా ర్యకలాపాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement