Subsequently
-
‘370’ అనంతర మార్పుల్ని కశ్మీర్ ఆమోదించింది: అమిత్ షా
శ్రీనగర్: 2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతర మార్పులను జమ్మూకశ్మీర్ ప్రజలు ఆమోదించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఉగ్రవాద చర్యలు, రాళ్లు రువ్వడం వంటి ఘటనలు 70% తగ్గిపోయాయన్నారు. ఇప్పుడు కొత్త జమ్మూకశ్మీర్ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. మంత్రి శుక్రవారం శ్రీనగర్‌లో జరిగిన ‘వితస్త కల్చరల్ ఫెస్టివల్’కు హాజరయ్యారు. గత 30–40 ఏళ్ల జమ్మూకశ్మీర్ చరిత్ర మాత్రమే తెలిసిన వారు ఇది ఒక సమస్య అని, దీనిని వివాదాస్పద ప్రాంతంగానే భావిస్తారన్నారు. అదే జమ్మూకశ్మీర్ ఇప్పుడు వితస్త ఉత్సవాలు జరుపుకుంటోందని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదంతో బలైన 42 వేల మంది ప్రజల బాధ్యతను ఎవరు తీసుకుంటారని అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్(పీడీపీ)లను ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్ 370తో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ సిద్ధాంతకర్త శ్యామాప్రసాద్ ముఖర్జీకి ఆయన నివాళులర్పించారు. -
అక్రమ రవాణాకు అడ్డా!
ప్రైవేటు ట్రావెల్స్‌పై ఎర్రచందనం స్మగ్లర్ల దృష్టి గతంలో మావోయిస్టులు కూడా నిఘా లేకుంటే ప్రమాదమే.. విజయవాడలోని ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణాకు నెలవుగా మారాయి. వీటిపై నిఘా కొరవడటంతో ఎర్రచందనం వంటివి యథేచ్ఛగా రవాణా అవుతున్నాయి. సాధారణ రోజుల్లో వీటిపై పోలీసుల నిఘా ఉండటంలేదు. గతంలో మావోయిస్టులు ఓ ట్రాన్స్‌పోర్టు సంస్థ ద్వారా పేలుడు పదార్థాలను రవాణా చేస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి కొన్నిరోజులు తనిఖీలు కొనసాగాయి. తరువాత పోలీసులు ఉదాసీనంగా ఉండటంతో వీటి రవాణా కొనసాగుతోంది. విజయవాడ క్రైం : విజయవాడలో ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలపై పోలీసు నిఘా కొరవడింది. దీంతో వాటి నిర్వాహకులు నిషిద్ధ వస్తువులతోపాటు ఎర్రచందనం వంటి వాటి అ క్రమ రవాణాకు సహకరిస్తూ సొమ్ము చే సుకుం టున్నారు. గతంలో మావోయిస్టులు విజయవాడ కేంద్రంగా పేలుడు పదార్థాలు అక్రమం గా తరలించేవారు. గుంటూరు జిల్లా అచ్చంపేటలోని క్రాంతి ట్రాన్స్‌పోర్టు కార్యాలయంపై పోలీసులు దాడి జరిగినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. తరువాత కొన్నిరోజులపాటు పోలీసులు తర చూ ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు కార్యా యాల్లో త నిఖీలు నిర్వహించారు. తరువాత మిన్నకుండిపోయారు. జిల్లాలో బుధ, గురువారాల్లో ఎర్రచందనం దుంగలు పెద్దమొత్తంలో పట్టుబడటంతో ఇలాంటి వాటి అక్రమ రవాణా మళ్లీ జోరుగా సాగుతోందని నిర్ధారణ అయింది. ఎర్రచందనం రవాణా ఎర్రచందనం స్మగ్లర్లపై ప్రభుత్వం కొంతకాలం గా ఉక్కుపాదం మోపుతోంది. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అపారంగా లభ్యమయ్యే ఎర్రచందనాన్ని స్మగ్లర్లు విదేశాలకు రవాణా చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. అక్కడ కూలీ లు నరికిన దుంగలను ప్రత్యేక వాహనాల్లో చెన్నై, బెంగళూరు నగరాలకు తరలిస్తుంటారు. తరువాత వాటిని విమానాల్లో విదేశాలకు ర వాణా చేస్తున్నారు. దీనిపై కొంతకాలంగా పో లీసు నిఘా పెరిగింది. ఆ ప్రాంతంలోని అన్ని రహదారులలో పోలీసు, అటవీ అధికారులు ని ఘా ఉంచి, ఎర్రచందనం అక్రమ రవాణాను నిలువరించారు. దీంతో స్మగ్లర్లు ప్రత్యామ్నా య మార్గాలను ఎంచుకుని ట్రాన్స్‌పోర్టు సం స్థల ద్వారా వీటిని తరలిస్తున్నారు. చిత్తూరు, కడప జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోగల ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలను స్మ గ్లర్లు ఎంచుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తరలించి రైలు, ఇతర మార్గాల్లో చెన్నై వంటి ప్రాంతాలకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా కొద్ది రోజులుగా విజయవాడకు తరలించిన ఎర్రచందనం దుంగలను పెద్దఎత్తున వేర్వేరు ప్రాంతాలకు పంపుతున్నట్టు వినికిడి. ఇక్కడ తగిన నిఘా లేకపోవడం స్మగ్లర్లకు అనుకూలంగా మా రింది. బుధవారం విజయవాడలో ఎర్రచంద నం పట్టుబడిన విషయం తెలిసిందే. జిల్లాలో ని గరికపాడు చెక్‌పోస్టు వద్ద గురువారం ఓ కా రులో తరలిస్తున్న ఎర్రచందనాన్ని కూడా స్వా ధీనం చేసుకున్నారు. దీనినిబట్టి జిల్లానుంచి ఎర్రచందనం జోరుగా అక్రమంగా రవాణా అ వుతున్నట్లు నిర్ధారణ అయింది. పైరసీ సీడీలు చెన్నై కేంద్రంగా సాగుతున్న పైరసీ సీడీల దం దాకు ప్రైవేటు ట్రావెల్స్ ఊతమిస్తున్నాయి. చెన్నై నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌లో విజయవాడకు చేర్చి.. ఇక్కడి నుంచి కోస్తా జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. గతంలో ముందస్తు సమాచా రం మేరకు పలువురు పైరసీ సీడీల సరఫరాదారులను పోలీసులు పట్టుకున్నారు. దీంతో కొద్దిరోజుల పాటు మిన్నుకుండిన అక్రమ రవాణాదారులు... తిరిగి తమ కార్యకలాపాలను ప్రా రంభించినట్టు తెలిసింది. గుట్కాలు కూడా.. నగరంలోని ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా నిషిద్ధ గుట్కాలు కూడా రవాణా అవుతున్నాయి. బెం గళూరు, చెన్నై, పూణే ప్రాంతాల నుంచి బ స్తాల్లో భారీగా ఇక్కడికి గుట్కాలను తరలిస్తున్నారు. ఇక్కడినుంచి ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల ద్వారా కోస్తాజిల్లాలకు సరఫరా చేస్తున్నారు. పోలీసులు అప్పుడప్పుడూ తనిఖీ చేసి కొద్దిపాటి సరుకును పట్టుకుంటున్నారు తప్ప నిరంతర నిఘా ఉండటం లేదు. నిఘా ఉండాలి రాష్ట్ర రాజధానిగా విజయవాడ మారుతుందనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రైవేటు ట్రావెల్స్‌పై నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా ప్రై వేటు ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల ద్వారా జరి గే అక్రమ రవాణాను నిలువరించాలి. లేకుంటే ఉగ్రవాదులు వంటి సంఘ వ్యతిరేక శక్తులు దీనిని అవకాశంగా తీసుకొని విధ్వంసకర కా ర్యకలాపాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. -
‘దుంగల’ అసలు దొంగలేరీ?
‘ఎర్ర’స్మగ్లర్లను పట్టుకోవడంలో పోలీసులు విఫలం ప్రత్యేక బృందాల దర్యాప్తులో కానరాని పురోగతి స్మగ్లర్ల పేర్ల చిట్టా ఉన్నా పోలీసుల మౌనం? సాక్షి, చిత్తూరు: జిల్లాలో పేట్రేగిపోతున్న ఎర్రచంద నం స్మగ్లర్లను పట్టుకోవడంలో పోలీసులు చేతులెత్తేశారు. తమిళనాడు, కర్ణాటక, చిత్తూరు జిల్లాకు చెందిన స్మగ్లర్లు కోట్లు కొల్లగొడుతున్నారు. ఎర్ర దొంగల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా పురోగతి కానరావడం లేదు. వందల సంఖ్యలో కూలీలను పట్టుకుని హడావుడి చేస్తున్న పోలీసు లు అసలు దొంగలను పట్టుకోలేక పోతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆ ప్రభుత్వ ఆశీస్సులతో యథేచ్ఛగా ఎర్రచందనం అక్రమ రవాణా చేసి కోట్లు గడించి నవారు పీలేరు, చంద్రగిరి నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. కేవీ పల్లె, కలకడ, చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాళెం మండలాల్లో చిన్నా, చితకా స్మగ్లర్లు చాలా మంది ఉన్నారు. 10 సంవత్సరాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా ఆదాయం పెంచుకున్నవారి వివరాలు పోలీసులు వద్ద ఉన్నా ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. పీడీ యాక్టు కింద అదుపులోకి తీసుకున్నారని చెబుతున్న భాస్కర్‌నాయుడు ఒక్కడే పీలేరు నియోజకవర్గం నుంచి పట్టుకున్న స్మగ్లరు. రెడ్డినారాయణ, మహేష్, శేషు కడప జిల్లాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు, తాజగా డాను శీను(శీను) అనే మైదుకూరుకు చెందిన స్మగ్లరును కడప పోలీసులు తిరుపతిలో అరెస్టు చేశారు. పీలేరు స్మగ్లర్లపై దృష్టి పీలేరు కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని కాంగ్రెస్ అధికారంలో ఉండగా అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ప్రతిపక్షనేతగా ఉన్న కాబోయే సీఎం చంద్రబాబు చాలాసార్లు ఆరోపణ లు చేశారు. అప్పట్లో పెద్దగా స్పందిం చని పోలీసులు తాజాగా మారిన పరిస్థితుల నేపధ్యంలో పీలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ముసుగులో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లు ఎవరెవరు, వారికి ఎంత వరకు అక్రమరవాణాతో సంబంధం ఉందనే వివరాలను కూపీలాగుతున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ దిశగా పోలీసులు కార్యాచరణ మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులపై కూడా పోలీసులు దృష్టిసారించినట్టు తెలిసింది. దొరకని తమిళనాడు, కర్ణాటక స్మగ్లర్లు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చి ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్న స్మగ్లర్లను జిల్లా పోలీసులు పట్టుకోలేకపోయారు. టాస్క్‌ఫోర్స్ కూడా ప్రయత్నం చేస్తున్నా అసలు వ్యక్తులు దొరకడంలేదు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు బెంగళూరు రూరల్‌కు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు దుబాయ్‌కు చేరి అక్కడ నుంచే అక్రమరవాణాను తమ అనుచరుల ద్వారా నడిపిస్తున్నారు. తమిళనాడు చెన్నయ్‌కు చెందిన స్మగ్లర్లు వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని కొందరు మధ్యవర్తులు, దళారులను పెట్టుకుని ఎర్రచందనాన్ని దోచుకుపోతున్నారు. 35 మంది వివరాలను సేకరించిన పోలీసులు వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. స్మగ్లర్ల అనుచరుల సెల్ఫోన్లపై నిఘా ఉంచినా సరైన సమాచారం దొరకడం లేదని పోలీసులు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. -
శేషాచలం అడవుల్లో పోలీస్ ఫైర్
రాళ్లతో ‘ఎర్ర’ స్మగ్లర్ల దాడి ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు నిందితుల పరార్ తిరుపతి, న్యూస్‌లైన్: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు, వారికి సహకరిస్తున్న కూలీల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. స్మగ్లర్ల ఆట కట్టించేందుకు అడవిలోకి వెళ్లిన పోలీసులపై ఎదురు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు తుపాకులకు పనిచెబుతున్నారు. రెండు రోజుల క్రితం శేషాచల అడవిలోని చామలరేంజ్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. తాజాగా ఆదివారం శేషాచలం కొండల్లో గుడ్డెద్దుబండ, ఈతకుంట ప్రాంతాల్లో కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్లు రువ్వారు. పోలీసులు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపారని జిల్లా సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ ఇలియాస్‌బాషా తెలిపారు. ఆయన కథనం మేరకు.. 15 మంది స్పెషల్ పార్టీ పోలీసులు ఆదివారం కల్యాణిడ్యాం సమీపంలోని శ్రీవారి పాదాలు ప్రాంత అడవిలోకి కూంబింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో గుడ్డెద్దుబండ వద్ద వారికి సుమారు 30 మంది ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్ల ముఠా ఎదురుపడింది. పోలీసులను చూసిన వెంటనే వారు రాళ్లు రువ్వి ఎదురుదాడికి దిగారు. దాంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం రెండు రౌండ్లు కాల్పులు జరి పారు. నిందితులు రాళ్లు రువ్వుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని పారిపోయారు. అలాగే కొండ దిగువ భాగంలో శ్రీవారి పాదాల ప్రాంతానికి ఎడమ వైపు 3 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతానికి 40 మందితో కూడిన మరో స్పెషల్ పార్టీ పోలీసు బృందం కూం బింగ్‌కు వెళ్లింది. అక్కడ ఈతగుంట ప్రాంతంలో వారికి స్మగ్లర్ల ముఠా తారసపడింది. వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా స్మగ్లర్లు పోలీ సులపైకి రాళ్లు విసిరారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పారిపోయారు. ఈ రెండు సంఘటనలు ఆదివారం సాయంత్రం చీకటి పడిన తర్వాత జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ప్రాథమిక సమాచారం మాత్రమే అందిందని, పోలీసు బృందాలకు స్మగ్లర్లు ఎవైరైనా పట్టుబడ్డారా, ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయా అనేది ఇంకా తెలియలేదని డీఎస్పీ ఇలియాస్‌బాషా చెప్పారు. -
‘ఎర్ర’ దొంగలు వ్యూహం మార్చారు
చెన్నై నుంచే ఆపరేషన్ దినకూలి నుంచి కాంట్రాక్ట్‌కు మారిన స్మగ్లింగ్ ఆరడుగుల దుంగకు రూ.5 వేలు అరెస్టులను లెక్క చేయని అక్రమార్కులు వాహనాలు మారుస్తూ రవాణా పోలీసులకు కొత్త సవాళ్లు సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లు వ్యూహం మార్చారు. పాత జాబితాలోని వారు, పోలీసులు వెతుకుతున్న స్మగ్లర్లు రంగంలోకి రావడం మానేశారు. చెన్నై నుంచే స్మగ్లింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు విజయా డెయిరీ సమీపంలో 33 మందికిపైగా ఎర్రచందనం కూలీలను శనివారం అరెస్టు చేశారు. పదిహేను ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. రెం డు రోజుల క్రితం గుడిపాల పోలీసులు ఎర్రచందనం నరికేందుకు వస్తున్న 60 మంది తమిళ తంబీలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. భారం అంతా కూలీలపైనే గతంలో స్మగ్లర్లు అడవి నుంచి సమీపంలోని రోడ్డులో ఉన్న వాహనం వరకే కూలీలను వాడుకునేవారు. ఎర్రచందనం నరికి తెచ్చి వాహనంలో చేరిస్తే దుంగకు రూ.500 నుంచి రూ.1000 ఇచ్చేవారు. ఇప్పుడు తాము రంగంలోకి రాకుండా, పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు వ్యూహం మార్చారు. ఎర్రచందనం నరికే తమిళ తంబీలను కూలీల నుంచి చిన్నపాటి కాంట్రాక్టు స్మగ్లర్లుగా మార్చేశారు. వీరు ఎర్రచందనం నరికి వాహనాల్లో చెన్నైలోని గోడౌన్లకు చేరుస్తున్నారు. ప్రతిఫలంగా ఆరు అడుగుల ఎర్రచందనం దుంగకు రూ.5 వేల వరకు స్మగ్లర్లు చెల్లిస్తున్నారు. కొత్త వ్యూహాలు ఇలా.. గతంలో అడవిలో నరికిన ఎర్రచందనం దుంగలను సమీప గ్రామాల్లో రోడ్డు పక్కనే సిద్ధంగా ఉన్న వాహనాల్లోకి చేర్చేవారు. అక్కడి నుంచి నేరుగా రవాణా చేసేవారు. ఇప్పుడు నిఘా పెరగడంతో స్మగ్లర్ల వ్యూహం మారింది. ప్రస్తుతం కీలక స్మగ్లర్లు, వారి అనుచరులు, దళారులు ప్రత్యక్షంగా రంగంలోకి రావడం లేదు. విల్లుపురం, వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన తమిళ కూలీలకు డబ్బు ఆశ చూపి చిత్తూరు జిల్లాకు పంపుతున్నారు. వారే నేరుగా చెన్నై హార్బర్ సమీపంలోని స్మగ్లర్ల గోడౌన్లకు సరుకు (ఎర్రచందనం) చేర్చే విధంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు కూలీలు, వారిని నడిపించే మేస్త్రీలే పట్టుబడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రవాణా చామల, మామండూరు, బాలయపల్లె ఫారెస్టు రేంజ్‌ల్లోని శేషాచలం కొండల్లో లభించే ఎర్రచందనం దుంగలు నాణ్యంగా, బరువుగా ఉంటాయి. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ అధికం. ప్రస్తుతం తనిఖీలు అధికంగా ఉండడంతో వీటిని వేగంగా తరలించే పరిస్థితి లేదు. దీంతో అక్రమార్కులు ఇప్పుడు నేరుగా ఎర్రచందనం దుంగలను వాహనాల్లో తరలించడం లేదు. దుంగలను నరికిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న గ్రామాలు లేదా అటవీ ప్రాంతం, చెరువు కట్టల కింద డంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. పొదల్లో, నీళ్లలో దుంగలను దాచి ఉంచుతున్నారు. రెండు, మూడు రోజుల అనంతరం పోలీసుల అలికిడి లేని సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనాన్ని తరలిస్తున్నారు. తమిళనాడు సరిహద్దుల వరకు ఒక వాహనం, అక్కడ నుంచి మరో వాహనంలో తలిస్తున్నారు. దీనివల్ల వాహనం ప్రారంభ సమయంలో ఎవరైన పోలీసు ఇన్ఫార్మర్లు సమాచారం ఇచ్చినా ఫలితం ఉండడం లేదు. స్మగ్లర్లు అనుసరిస్తున్న కొత్తవ్యూహాలతో పోలీసులకు కొత్తసవాళ్లు ఎదురవుతున్నాయి.