మంగళవారం హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి సమర్పించేందుకు పట్టువస్త్రాలు తీసుకెళుతున్న సీఎం కేసీఆర్ దంపతులు
- పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: డప్పుల మోతలు, పోతురాజుల విన్యాసాల మధ్య బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ మహోత్సవానికి సతీసమేతంగా హాజరైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ ప్రభాకర్, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్‌రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన ఉత్సవాల్లో పాల్గొన్నారు. భక్తులు సమర్పించిన లడ్డూకు వేలం పాట నిర్వహించగా ఫతేనగర్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ కృష్ణగౌడ్ రూ.2 లక్షలకు స్వాధీనం చేసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.