
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రి ల్ 6, 7 తేదీల్లో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణం, మహా పట్టాభి షేకం ఉత్సవాలకు బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. కల్యాణానికి ఉభయదాతల టికెట్లు రూ.7,500, సెక్టార్ల టికెట్లు రూ.2,500, రూ.2,000, రూ.1,000, రూ.300, రూ.150, పట్టాభిషేక మహోత్సవానికి రూ.1,500, రూ.500, రూ.100 టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచామని వివరించారు.
ఉత్సవాలకు రాలేని భక్తుల గోత్రనామాలతో కల్యాణం జరిపించే సేవల కోసం రూ.5,000, రూ.1,116 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. htts://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వారు ఈనెల 20వ తేదీ ఉదయం 11 గంటల నుంచి.. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు దేవస్థానం సమీపంలోని తానీషా కల్యాణ మండపంలో ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి టికెట్లు పొందాలని సూచించారు.
నేరుగా విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు..
ఈనెల 20వ తేదీ నుంచి భద్రాచలంలో నేరుగా సెక్టార్ టికెట్లు విక్రయించనున్నారు. రామాలయం వద్ద మెయిన్ కౌంటర్, తానీషా కల్యాణ మండపం, సీఆర్వో కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం ఆర్డీవో ఆఫీసు వద్ద వచ్చే నెల 1 నుంచి కౌంటర్ అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment