bhadradri
-
గొంగడి త్రిషకు తెలంగాణ సర్కారు భారీ నజరానా
భారత యువ క్రికెటర్ గొంగడి త్రిష(Gongadi Trisha)కు తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. అండర్-19 టీ20 ప్రపంచకప్-2025లో సత్తా చాటిన ఈ ఆల్‌రౌండర్‌కు కోటి రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) బుధవారం ప్రకటించారు. భవిష్యత్తులో త్రిష మరింత గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.వారికి పది లక్షల చొప్పునత్రిషకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించడంతో పాటు భారత జట్టు సభ్యురాలు, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి 10 లక్షల రూపాయల నజరానాను ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా.. జట్టు హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్, ట్రైనర్ షాలినికి 10 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు.కాగా ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళల అండర్–19 వరల్డ్ కప్(ICC U19 Women's World Cup)లో త్రిష అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. తన ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది ఈ యువ తార. ఈ మెగా ఈవెంట్లో ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగిన త్రిష.. టోర్నమెంట్ చరిత్రలోనే తొలి శతకంతో సత్తా చాటి ప్రపంచ రికార్డుతో మెరిసింది.లీగ్ దశలో భాగంగా స్కాట్లాండ్తో మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం 53 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుంది. త్రిష ఇన్నింగ్స్‌లో పన్నెండు ఫోర్లతో పాటు.. నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించిన త్రిష మొత్తంగా 309 పరుగులు చేసింది. అంతేకాదు.. ఈ లెగ్‌స్పిన్నర్ ఏడు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇక సౌతాఫ్రికాతో ఫైనల్లో 33 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచిన గొంగడి త్రిష.. మూడు వికెట్లతో మెరిసి భారత్ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలకంగా మారింది. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా త్రిష సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ'లో నూ ఈ తెలుగుతేజానికి చోటు దక్కడం మరో విశేషం. భద్రాద్రి అమ్మాయికాగా తెలంగాణలోని భద్రాద్రికి చెందిన త్రిషకు చిన్ననాటి నుంచే క్రికెట్ మీద మక్కువ. త్రిష ఈ స్థాయికి చేరడంలో ఆమె తండ్రి రామిరెడ్డిది ప్రధాన పాత్ర. కుమార్తె కోసం ఆయన ఎన్నో కష్టనష్టాలకోర్చి.. తన గారాలపట్టిని క్రికెటర్‌గా తీర్చిదిద్దారు. అందుకే తాను సాధించిన ప్రతి గొప్ప విజయానికి తండ్రికే అంకితం చేస్తుంది ఈ బంగారుతల్లి.ఘన స్వాగతంమలేషియాలో ఐసీసీ టోర్నీ గించుకున్న త్రిష మంగళవారమే హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అరశనపల్లి జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. త్రిషతో పాటు భారత జట్టులో సభ్యురాలైన కేసరి ధృతి, టీమ్ హెడ్ కోచ్ నూషీన్ అల్ ఖదీర్, ట్రెయినర్ షాలిని కూడా నగరానికి చేరుకున్నారు. ఈ నలుగురినీ జగన్మోహన్ రావు సన్మానించారు. 19 ఏళ్ల త్రిష తన అద్భుత ఆటతీరుతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిందని ఆయన ప్రశంసించారు. త్రిష, ధృతిలను ఆదర్శంగా తీసుకొని మరింత మంది అమ్మాయిలు అంతర్జాతీయస్థాయికి ఎదగాలని జగన్మోహన్ రావు ఆకాంక్షించారు. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి వీరికి నగదు బహుమతిని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. హెడ్ కోచ్‌గా నూషీన్ అల్ ఖదీర్‌కు, ప్లేయర్‌గా త్రిషకు ఇది వరుసగా రెండో వరల్డ్‌కప్ టైటిల్ కావడం విశేషం. 2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి అండర్–19 టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు భారత మాజీ స్పిన్నర్ నూషీన్ హెడ్ కోచ్‌గా వ్యవహరించగా... త్రిష సభ్యురాలిగా ఉంది. 2025లోనూ నూషీన్ హెడ్ కోచ్‌గా కొనసాగగా... నిలకడగా రాణించిన త్రిష ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును సాధించింది. కేసరి ధృతి కూడా విజేత జట్టులో సభ్యురాలిగా ఉన్నా ఆమెకు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. అండర్ -19 మహిళల T20 ప్రపంచ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష గారికి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి @revanth_anumula గారు కోటి రూపాయలు నజరానా ప్రకటించారు. మలేషియాలో జరిగిన మహిళ అండర్ -19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన… pic.twitter.com/0lXZyJpMMg— Telangana CMO (@TelanganaCMO) February 5, 2025 -
త్రిష వరల్డ్ రికార్డు.. అభినందనల వెల్లువ.. భద్రాద్రిలో సంబరాలు
భారత మహిళల క్రికెట్‌కు భవిష్యత్ తార దొరికింది. అటు బ్యాట్‌తో అదరగొడుతూ... ఇటు బంతితో మెరిపిస్తూ... తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష(Gongadi Trisha) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో మహిళల అండర్–19 ప్రపంచకప్ టోర్నీ(U19 Womens T20 World Cup) చరిత్రలో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌గా 19 ఏళ్ల త్రిష గుర్తింపు పొందింది.వరల్డ్ రికార్డు.. భద్రాద్రిలో సంబరాలుకాగా 2023లో తొలిసారి జరిగిన అండర్–19 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించిన త్రిష 2025 ఈవెంట్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఈ నేపథ్యంలో గొంగడి త్రిషపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రపంచకప్ టోర్నీలో శతకంతో బాది వరల్డ్ రికార్డు సాధించిన నేపథ్యంలో ఆమె స్వస్థలం భద్రాచలంలో సంబరాలు జరిగాయి. క్రికెట్లో అసాధారణ ప్రతిభతో సెంచరీ చేయడంతో భద్రాద్రి(Bhadradri) పేరు ఒక్కసారిగా ప్రపంచస్థాయిలో మార్మోగిపోయిందంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ కప్ క్రికెట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిపి త్రిషకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి, సీనియర్ క్రికెటర్ బుడగం శ్రీనివాస్, కొండరెడ్ల సంఘం వ్యవస్థాపకులు ముర్ల రమేశ్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు, ఎస్కే సలీం, సదానందం, పూనెం ప్రదీప్‌కుమార్, రేపాక రామారావు, నరేశ్, కోటేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, బలుసు సతీశ్, రమేశ్, ఆనంద్ పాల్, ప్రవీణ్, ప్రసాద్, శ్రీనివాస్, మురళి పాల్గొన్నారు.150 పరుగుల తేడాతో ఘనవిజయంఇదిలా ఉంటే.. అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత మహిళల జట్టు తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న టీమిండియా... స్కాట్లాండ్తో మంగళవారం జరిగిన తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లోనూ చెలరేగిపోయింది. స్కాట్లాండ్తో మంగళవారం జరిగిన ‘సూపర్ సిక్స్’ గ్రూప్–1 మ్యాచ్‌లో నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు 150 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది.‘టీనేజ్ స్టార్’ గొంగడి త్రిష ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకొని భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. స్కాట్లాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ గొంగడి త్రిష స్కాట్లాండ్ బౌలర్ల భరతం పట్టింది. ఈ క్రమంలో ఈ టోర్నీ చరిత్రలోనే తొలి శతకం నమోదు చేసిన ప్లేయర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.త్రిష ఆల్‌రౌండ్ ప్రదర్శనతెలంగాణకు చెందిన 19 ఏళ్ల త్రిష 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెంచరీ మైలురాయిని అందుకుంది. మరో ఓపెనర్ కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) తో కలిసి త్రిష తొలి వికెట్‌కు 13.3 ఓవర్లలో 147 పరుగులు జోడించింది. కమలిని అవుటయ్యాక సనిక చాల్కె (20 బంతుల్లో 29 నాటౌట్; 5 ఫోర్లు)తో కలిసి త్రిష రెండో వికెట్‌కు అజేయంగా 61 పరుగులు జత చేసింది. 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. 14 ఓవర్లు ఆడి కేవలం 58 పరుగులకే స్కాట్లాండ్ ఆలౌటైంది. 10 వికెట్లను భారత స్పిన్నర్లే తీయడం విశేషం.ఎడంచేతి వాటం స్పిన్నర్ ఆయుషి శుక్లా 8 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... మరో ఎడంచేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మ 5 పరుగులిచ్చి 3 వికెట్లు... లెగ్ స్పిన్నర్ గొంగడి త్రిష 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. ఈనెల 31న జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో భారత్ తలపడుతుంది. అదే రోజున జరిగే మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆ్రస్టేలియా ఆడుతుంది. ఫిబ్రవరి 2న ఫైనల్ జరుగుతుంది. చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడిస్తారా? -
అశ్వాపురం మండలం మొండికుంటలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
-
వెళ్లినంత తేలిక కాదు.. వెనక్కి రావడం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ సైన్యంగా పేర్కొనే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) 24వ వారోత్సవాలు ఈనెల 8తో ముగియనున్నాయి. ఒకప్పుడు పీఎల్జీఏ వారోత్సవాలంటే ఉత్తర తెలంగాణ పల్లెల్లో ఉద్రిక్తత నెలకొనేది. ఒకవైపు పటిష్ట పోలీసు నిఘా, మరోవైపు ఆ నిఘా నేత్రాల కళ్లుగప్పి మావోయిస్టులకు మద్దతు పలికేవారు కనిపించేవారు. ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. పదేళ్లుగా తెలంగాణపై పట్టు కోసం మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తెలంగాణ నుంచి బస్తర్ వెళ్లిన మావోయిస్టులు.. తిరిగి తెలంగాణలో ప్రభావం చూపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కష్టతరమవుతున్నాయి.బస్తర్ వైపు అడుగులుశ్రీకాకుళం జిల్లాలో మొదలైన నక్సల్బరీ ఉద్యమం 80వ దశకంలో ఉత్తర తెలంగాణ జిల్లాలను ఊపు ఊపింది. అప్పటి ప్రభుత్వాలపై అసంతృప్తితో ఉన్న జనాలు అన్నలకు అండగా నిలిచారు. యువకులు అడవుల బాట పట్టేందుకు ఉత్సాహం చూపారు. వందలు, వేలుగా వస్తున్న యువతరానికి దళాలుగా శిక్షణ ఇస్తూ భవిష్యత్ లక్ష్యాల దృష్ట్యా తెలంగాణ సరిహద్దులో ఉన్న బస్తర్ అడవులకు పీపుల్స్‌వార్ గ్రూపు పంపింది. జనతన సర్కార్ పేరుతో బస్తర్‌లో అన్నలు సమాంతర పాలన స్థాపించారు. దీంతో మావోయిస్టుల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను 2009లో కేంద్రం చేపట్టింది. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, డీఆర్జీ, కోబ్రా దళాలు నలువైపులా బస్తర్ అడవులను జల్లెడ పడుతున్నాయి. దీంతో మావోయిస్టులకు కొత్త స్థావరం అవసరమైంది.తెలంగాణ వైపు..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వస్తే మావోయిస్టులు పాగా వేస్తారంటూ ఆం«ధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయపడింది. అందుకు తగినట్టుగానే తెలంగాణ వచ్చాక మావోయిస్టులు ఇటువైపు దృష్టి సారించారు. ఈ క్రమాన తొలి ఎన్కౌంటర్ భద్రాచలం సమీపాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిధిలో 2015 జూన్ 15న జరిగింది. ఆ తర్వాత అప్పటి వరంగల్ జిల్లా ములుగులో మావోయిస్టుల పేరుతో కరపత్రాలు, బ్యానర్లు రావడం మొదలైంది. అనంతరం నిర్మాణ పనుల్లో ఉన్న భారీ యంత్రాలను మావోయిస్టులు తగలబెట్టారు. ముందుగా తమ ఉనికి చాటుకుని.. ఆ తర్వాత దాన్ని సుస్థిరం చేసుకునే యత్నంలో ఉండగా 2015 సెప్టెంబర్ 15న గోవిందరావుపేట మండలం రంగాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. దీంతో ఇక్కడ మావోయిస్టుల కదలికలు నెమ్మదించాయి.పదేళ్లలో 98 మంది..తెలంగాణ వచ్చాక 2015లో జరిగిన రంగాపూర్ ఎన్కౌంటర్ మొదలు నిన్నమొన్నటి కరకగూడెం, ఏటూరునాగారం ఎన్కౌంటర్ల వరకు మొత్తం 98 మంది మావోయిస్టులు చనిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 44 సార్లు మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పట్టుమని ఆరు నెలలు కూడా దళాలు ఇక్కడ ఆయుధాలతో సంచరించే పరిస్థితి లేదు. పోలీసుల నిఘా పటిష్టంగా ఉండడం ఒక కారణమైతే.. ఏజెన్సీలు, అడవి సమీప గ్రామాల ప్రజల నుంచి గతంలో లభించిన స్థాయిలో మావోయిస్టులకు ఇప్పుడు మద్దతు దొరకడం లేదు. ఫలితంగా తెలంగాణలోకి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించిన ప్రతీసారి మావోయిస్టులకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. దీనికి తోడు వారు కోవర్టుల పేరుతో సృష్టిస్తున్న రక్తపాతం మరింత చేటు తెచ్చింది. చివరకు మావోయిస్టులు తమ గ్రామాల వైపు రావొద్దంటూ ప్రజలు ర్యాలీలు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది.కాళేశ్వరం మీదుగా..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు 2016లో మొదలైన తర్వాత రెండు రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగాయి. ఈ నేపథ్యాన ముందుగా మావోయిస్టు సానుభూతిపరులు, ఆ తర్వాత దళాలు మహదేవపూర్ అడవుల్లోకి రాకపోకలు సాగించడం మొదలైంది. అయితే, మహదేవపూర్ – ఏటూరునాగారం ఏరియా పరిధిలో పెద్దగా హింసాత్మక ఘటనలు మాత్రం చోటు చేసుకోలేదు. కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో తరచూ కరపత్రాలు పంచడం, మందుపాతరలను అమర్చడం వంటివి చేస్తూ వచ్చారు. ఈ క్రమాన 2017 డిసెంబర్ 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు, ఆ తర్వాత 2020 సెప్టెంబర్‌లో చర్లలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మృతి చెందారు. -
చిత్తశుద్ధి, దూరదృష్టితోనే అభివృద్ధి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నిధులు ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరగదని.. దూరదృష్టి, చిత్తశుద్ధితోనే అర్హులందరికీ అభివృద్ధి ఫలాలు దక్కుతాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. శుక్రవా రం ఉదయం ఆయన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆల య పండితులు ఆయనకు పరివట్టం కట్టి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అంతరాలయంలో మూలమూర్తుల దర్శనం తర్వాత అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ రమా దేవి స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాలు అందచేశారు.తర్వాత రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భద్రాచలంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తలసేమియా, సికిల్‌సెల్ ప్రత్యేక వార్డులను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలో గిరిజనులకు రెడ్‌క్రాస్ సంస్థ ద్వారా అమూల్యమైన సేవలు అందటం అభినందనీయమని అన్నారు. భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రిని కేంద్రం నిధులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చే ప్రతిపాదనలను పరిశీలిస్తామని వెల్లడించారు. కలెక్టరేట్లలో భేటీలు: ఈ పర్యటనలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొత్తగూడెం కలెక్టరేట్, ఖమ్మం కలెక్టరేట్ల లో అధికారులతో పాటు వివిధ రంగాల్లోని ప్రముఖులతో భేటీ అయ్యారు. అలాగే, శాఖల వారీగా ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సమావేశాల్లో గవర్నర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేద, గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందించి వారు మెరుగైన జీవితం గడి పేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని సూచించా రు. భద్రాద్రి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతీరు బాగుందని అభినందించారు. ఖమ్మంలో గవర్నర్ మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మాదిరిగా తాను సైతం పర్యావరణ వేత్తగా కెరీర్‌ను ప్రారంభించానని, ప్రకృతి దైవంతో సమానమనే భావన అందరిలో ఉండా లని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు బలరాంనాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే లు వెంకట్రావు, కూనంనేని సాంబశివరావు, రెండు జిల్లాల కలెక్టర్లు జితేశ్ వి.పాటిల్, ముజమ్మిల్ ఖాన్, ఎస్పీ రోహిత్‌రాజ్, సీపీ సునీల్‌దత్, ఐటీడీఏ పీఓ రాహుల్, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పాల్గొన్నారు. -
భద్రాద్రిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, రాష్ట్రంలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శివరాజ్‌సింగ్ చౌహాన్‌లకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీ పర్యటనలో భాగంగా తుమ్మల కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు అంశాలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రా లు అందజేశారు. అనంతరం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని రామ్మోహన్ నాయుడును కోరినట్లు తెలిపారు. తెలంగాణలో నూతన కోకోనట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరానన్నారు. ఆయిల్‌పామ్ మీద 28% దిగుమతి సుంకం విధించి, దేశీయంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నందుకు తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్‌పామ్‌కు కేంద్రం కనీస మద్దతు ధర కలి్పంచాలని కోరారు. అలాగే ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని కూడా విన్నవించారు. ఇటీవలి వరదల్లో నష్టపోయిన ఖమ్మం జిల్లాకు తగిన మొత్తంలో సహాయం అందజేయాలని కోరారు. నష్టంపై నివేదిక రాగానే సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచి్చనట్లు తెలిపారు. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను కలిసి, తెలంగాణలో ఎక్కువగా పండే పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరానన్నారు. అలాగే.. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ ఆహార సదస్సులో పాల్గొని.. తెలంగాణలోని అవకాశాలను వివరించి, ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించడానికి రాష్ట్రానికి రావాలని ఆహా్వనించానన్నారు. సాగు చేసేవారికే రైతుబంధువ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కౌలు రైతు, భూమి యజమాని చర్చించుకొని రైతుబంధు ఎవరు తీసుకోవాలన్నది వారే నిర్ణయించుకోవాలన్నారు. ఏపీలో ఉన్నట్లుగా తెలంగాణలో కౌలు రైతు ఒప్పందాలు లేవని గుర్తుచేశారు. ఐదేళ్లలో కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేయలేదని, ఒకేసారి రూ.18,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. అవసరమైతే ఇంకా నిధులు సమకూరుస్తామని తెలిపారు. ప్రతి పంట, ప్రతి రైతుకు వర్తించేలా రూ.3,000 కోట్లతో బీమా చేయనున్నట్లు తుమ్మల తెలిపారు. -
Vamsi Modem: బస్తాలు మోసిన భుజం.. పతకాలు తెస్తోంది!
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడో తరగతితోనే చదువు ఆపేసిన భద్రాద్రి ఏజెన్సీకి చెందిన మోడెం వంశీ ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిస్తున్నాడు. కూలీగా మొదలైన ప్రస్థానం ఇపుడు కామన్ వెల్త్ దిశగా సాగుతోంది...మోడెం వంశీ స్వస్థలం ఒకప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లాలోని వాజేడు మండలం ఇప్పగూyð ం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడో తరగతితోనే చదువును అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. దీంతో బతుకుదెరువు కోసం పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం ఇబ్రహీంపట్నంలో ఓ నర్సరీలో పని చేస్తున్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాడు. అక్కడ నర్సీరీలో 50 కేజీల బరువు ఉన్న యూరియా బస్తాలను అలవోకగా ఎత్తుకుని తిరగడాన్ని ఆ నర్సరీ యజమాని, మాజీ వెయిట్ లిఫ్టరైన అబ్దుల్ ఫరూక్ గమనించాడు.దీంతో నర్సరీ ప్రాంగణంలోనే వంశీలో ఉన్న ప్రతిభకు సాన పట్టాడు. ఎంతటి బరువులైనా అవలీలగా ఎత్తేస్తుండటంతో తక్కువ సమయంలోనే ఇబ్రహీంపట్నం నర్సరీ నుంచి భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ మీదుగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని పవర్ లిప్టింగ్ హాల్‌కు వంశీ అడ్రస్ మారింది హైదరాబాద్‌లో పార్ట్‌టైం జాబ్ చేస్తూనే ఎల్బీ స్టేడియంలో వంశీ కోచింగ్ తీసుకునేవాడు. అక్కడ పవర్ లిఫ్టింగ్‌లో ఇండియా తరఫున ఏషియా లెవల్ వరకు ఆడిన సాయిరాం వంశీ ఎదుగుదలకు అండగా నిలిచాడు.గోవాలో 2021లో జరిగిన పోటీల్లో మొదటిసారి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు వంశీ. ఆ తర్వాత 2022లో కేరళ, హైదరాబాద్‌లో 2023లో ఇండోర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పతకాలు గెలుచుకున్నాడు. ఈ ఏడాది రాజస్థాన్, పటియాల (పంజాబ్)లో జరిగిన పోటీల్లోనూ వంశీ పతకాలు గెల్చుకున్నాడు. దీంతో యూరప్‌లోని మాల్టా దేశంలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు వంశీని ఎంపిక చేస్తూ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2024 జూన్ లో నిర్ణయం తీసుకుంది."ఆగస్టు 28 రాత్రి (భారత కాలమానం ప్రకారం) 66 కేజీల జూనియర్ విభాగంలో జరిగిన పోటీలో స్క్వాట్ 280 కేజీలు, బెంచ్‌ప్రెస్ 140 కేజీలు, డెడ్‌లిఫ్ట్ 242.50 కేజీలు మొత్తం 662.5 కేజీలు ఎత్తడంతో వంశీకి ప్రథమ స్థానం స్థానం దక్కింది."తొలిసారిగా విదేశాల్లో జరిగే అంతర్జాతీయ పోటీలో పాల్గొనే అవకాశం దక్కిందనే ఆనందం కొద్ది సేపట్లోనే ఆవిరైంది. పాస్‌పోర్టు, వీసా, ప్రయాణం తదితర ఖర్చులకు రూ. 2.10 లక్షల అవసరం పడింది. హైదరాబాద్‌లో స్పాన్సర్లు దొరకడం కష్టం కావడంతో తన వెయిట్ లిఫ్టింగ్ ప్రస్థానం మొదలైన భద్రాచలంలోని సిటీ స్టైల్ జిమ్‌లో కోచింగ్ ఇచ్చిన రామిరెడ్డిని సంప్రదించాడు. క్రౌడ్ ఫండింగ్ కోసం లోకల్ గ్రూప్‌లలో రూ.100 వంతున సాయం చేయండి అంటూ మెసేజ్‌లు పెట్టాడు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు పట్టణానికి చెందిన వైద్యులు సోమయ్య, శ్రీకర్, కృష్ణప్రసాద్, రోశయ్య, స్పందనలు తమ వంతు సాయం అందించారు.యూరప్ వెళ్లేందుకు వీసా కోసం కాన్సులేట్‌లో జరిగిన ఇంటర్వ్యూలో వంశీకి ఊహించని ఇబ్బంది ఎదురైంది. ‘యూరప్ ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నావ్?’ అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇంగ్లీష్‌లో ప్రశ్నిస్తే ‘ఇక్కడ ఏం జాబ్ చేస్తున్నావు?’ అని అడిగినట్లు భావించి ‘పార్ట్‌టైం జాబ్’ అని బదులు ఇచ్చాడు వంశీ. వీసా క్యాన్సల్ అయ్యింది. దీంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన రూ.20వేలు వృథా కాగా మళ్లీ స్లాట్ బుకింగ్‌కు రూ.15 వేల వరకు అవసరం పడ్డాయి. ఈసారి ఆర్థిక సాయం అందించేందుకు భద్రాచలం ఐటీడీఏ – పీవో రాహుల్ ముందుకు వచ్చాడు.ఇంగ్లీష్ గండం దాటేందుకు స్నేహితులు, కోచ్‌ల ద్వారా ప్రశ్నా – జవాబులు రాయించుకుని వాటిని ్రపాక్టీస్ చేశాడు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఫోన్ చేసి నేర్చుకున్న దాన్ని వల్లెవేయడం, అద్దం ముందు మాట్లాడటం చేస్తూ చివరకు వీసా గండం గట్టెక్కాడు. ఈ పోటీలో పాల్గొనే బృందం ముందుగానే మాల్టా వెళ్లిపోయింది. దీంతో ఆగస్టు 25న హైదరాబాద్ నుంచి ముంబైకి వంశీ ఒక్కడే బస్సులో వెళ్లాడు. అక్కడి నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ మీదుగా మాల్టా వరకు ఎయిర్‌బస్‌లో చేరుకున్నాడు.ఆగస్టు 28 రాత్రి (భారత కాలమానం ప్రకారం) 66 కేజీల జూనియర్ విభాగంలో జరిగిన పోటీలో స్క్వాట్æ 280 కేజీలు, బెంచ్‌ప్రెస్ 140 కేజీలు, డెడ్‌లిఫ్ట్ 242.50 కేజీలు మొత్తం 662.5 కేజీలు ఎత్తడంతో వంశీకి ప్రథమ స్థానం దక్కింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో వచ్చే అక్టోబరులో జరిగే కామన్ వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటేందుకు వంశీ సిద్ధం అవుతున్నాడు. – తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం. -
కలెక్టర్, పీవో అడవిబాట
దుమ్ముగూడెం: ఇద్దరు ఐఏఎస్‌లు.. వారిలో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జితేష్ వి.పాటిల్, మరొకరు భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్. పోడు సాగు అంశంపై హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు సూచనలతో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అడవిబాట పట్టారు. వాహనాలు వెళ్లే మార్గం లేకపోవడంతో రానుపోను 10కి.మీ. నడిచారు. సమస్య ఏంటంటే...భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం గౌరారం అటవీ రేంజ్ పరిధిలో పలువురు రైతులకు కొన్నాళ్ల క్రితం పోడు పట్టాలు అందాయి. అయితే, ఈ భూమిలో అటవీ అధికారులు తమను సాగు చేసుకోనివ్వడం లేదని, పంటలను ధ్వంసం చేస్తున్నారంటూ 23మంది గిరిజన రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న కోర్టు సూచనలతో కలెక్టర్ పాటిల్, పీవో రాహుల్ మంగళవారం అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దుమ్ముగూడెం మండలంలోని ములకనాపల్లి ప్రధానరహదారి వరకు మాత్రమే రహదారి ఉండడంతో వాహనాల్లో వెళ్లారు.అక్కడినుంచి దట్టమైన అడవిలో రెవెన్యూ, అటవీ అధికారులతో కలిసి కాలిబాటన వాగులు, వంకలు దాటుతూ గౌరారం వరకు 5 కి.మీ. వెళ్లి సమస్యపై రైతులు, అటవీ అధికారులతో మాట్లాడారు. అడవిని నరికారని అధికారులు వివరించారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించగా, ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమించినట్టు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ పాటిల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ హక్కు పత్రాల్లో ఉన్నంత మేరకు భూమి సాగు చేసుకోవాలని సూచించారు. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న సమయాన అటవీ ప్రాంతంలో ఇద్దరు ఐఏఎస్‌లు పర్యటించడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నేటి నుంచి భద్రాద్రిలో బ్రేక్ దర్శనం అమలు..
-
దెయ్యం చేపలు!
భద్రాచలం: తిరుమలాయపాలెం మండలంలోని బీసురాజుపల్లి ఆకేరు చెక్‌డ్యామ్ నీటిలో గిరిజనులకు సముద్ర జలాల్లో మాత్రం కనిపించే వింత రకం చేపలు లభించాయి. సముద్ర జలాల్లో మాత్రమే తిరిగే ఈ చేపలను అక్వేరియంల్లోనూ పెంచుతారని తెలుస్తోంది. స్థానికంగా వీటిని దయ్యం చేపలుగా పిలుస్తుండగా, వరదల సమయాన ఆకేరు చెక్‌డ్యామ్‌లోకి చేరినట్లు భావిస్తున్నారు. కాగా, ఇవి చెరువుల్లోకి చేరితే ఇతర చేపల అభివృద్ధికి ఆటంకంగా మారుతాయని మత్స్యకారులు చెబుతున్నారు. -
రాష్ట్రానికి ‘భద్రాద్రి’ గుదిబండే!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం గుదిబండగా మారిందని విద్యుత్ రంగ నిపుణుడు ఎం.వేణుగోపాల్‌రావు, తిమ్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంపిటీటివ్ బిడ్డింగ్‌కి వెళ్లకుండా నామినేషన్ల ప్రాతిపదికన బీహెచ్ఈఎల్కు పనులు అప్పగించడం, కాలం చెల్లిన సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించడమే దీనికి కారణమన్నారు. రూ.7,900 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించగా, వాస్తవ వ్యయం రూ.10 వేల కోట్లు దాటిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న విద్యుత్ రంగ నిర్ణయాల్లో జరిగిన అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ముందు బుధవారం హాజరై తమ పిటిషన్లకు మద్దతుగా వాదనలు వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తికాక ముందే రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా ప్రారంభమైందని, విద్యుత్ కొరత తీర్చడంలో ఈ విద్యుత్ కేంద్రం పాత్ర ఎంతమాత్రం లేదన్నారు. విద్యుత్ కొరతను అధిగమించే సాకుతో టెండర్లు లేకుండా ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి శిరోభారంగా మారిందని తెలిపారు. 2017లో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి వచ్చేనాటికే భూపాలపల్లిలో 800 మెగావాట్ల కేటీపీపీ, జైపూర్ (మంచిర్యాల జిల్లా)లో 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ ప్లాంట్‌తోపాటు జూరా లలో జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి అందుబాటులోకి వచ్చిందని తిమ్మారెడ్డి కమిషన్‌కు వివరించారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాకున్నా విద్యుత్ లైన్ల కోసం రూ.630 కోట్లను చెల్లించారని తప్పుబట్టారు. యూనిట్‌కు రూ.3.90 ధరతో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ వస్తుందని ఒప్పందం చేసుకోగా, వాస్తవ ధర రూ.5.40కు పెరిగిందన్నారు. ఆ సమయంలో దేశంలో రూ.4.20కే కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా విద్యుత్ లభించిందని ఆధారాలను కమిషన్‌కు అందజేశారు. మూడేళ్ల తర్వాతే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ వచ్చింది.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం 2014లో జరిగితే మూడేళ్ల తర్వాత 2017–18 నుంచి సరఫరా ప్రారంభమైందని, 1000 మెగావాట్లకు గాను 75 శాతమే వచ్చిందని వేణుగోపాల్‌రావు అన్నారు. విద్యుత్ బిల్లుల వివాదంతో 2022 ఏప్రిల్ నుంచి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ పూర్తిగా ఆగిపోయిందని చెప్పారు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్‌కు రూ.10–20 వరకు అధిక ధరతో రాష్ట్రం విద్యుత్ కొనాల్సి వచ్చిందన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా అయ్యేందుకు 1000 మెగావాట్ల పవర్ గ్రిడ్ లైన్లను బుక్ చేసుకోగా, పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోయినా రూ.650 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. మరో 1000 మెగావాట్ల కారిడార్‌ను బుక్ చేసుకొని రద్దు చేసుకోవడంతో రూ.261 కోట్లను పరిహారంగా చెల్లించాలని ఎలక్రి్టసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో పవర్‌గ్రిడ్ దావా వేసిందని పేర్కొన్నారు. ఒప్పందం మేరకు రావాల్సిన విద్యుత్ రాకున్నా ఛత్తీస్‌గఢ్‌కు రూ.3వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. -
కేసీఆర్ కు నోటీసులు
-
సీతమ్మకు త్రీడీ చీర
సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటాడు. మూడు రంగుల్లో త్రీడీ చీరను చేనేత మగ్గంపై నేశాడు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మకు బహూకరించేందుకు మూడు రంగుల చీరను అద్భుతంగా రూపొందించాడు. ఆయనే సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్. ఆయన 18 రోజులపాటు చేనేత మగ్గంపై శ్రమించి బంగారు, వెండి, రెడ్ బ్లడ్ రంగుల్లో చీరను నేశారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, 600 గ్రాముల బరువుతో అద్భుతమైన త్రీడీ చీరను రూపొందించారు. ఈ చీరను తిప్పుతుంటే.. రంగులు మారుతూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ ఆదివారం మాట్లాడుతూ.. శ్రీరామ నవమికి భద్రాచలం సీతారాములకు ఈ చీరను బహూకరించనున్నట్లు తెలిపారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, ఉంగరంలో దూరే చీరను కూడా విజయ్‌కుమార్ నేసి అభినందనలు అందుకున్నారు. -
రూ. 151 చెల్లిస్తే.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది భక్తులకు అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (సిద్ధమైంది. గతేడాదిలానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది.ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొంది. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు. -
ప్రమాద స్థాయిలో.. భద్రాద్రి గోదావరి!
భద్రాచలం: తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. దీంతో భద్రాచలం వద్ద గురువారం మధ్యాహ్నమే నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కలెక్టర్ ఎ.ప్రియాంక వరద తీవ్రత, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పొంగి పొర్లుతున్న ఉపనదులు.. ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పెరుగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నుంచి బుధవారం 5.20 లక్షల క్యూసెక్కులు, గురువారం మధ్యాహ్నం 6.20 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరదను దిగువకు వదిలారు. దీనికి ఇంద్రావతి నుంచి వస్తున్న సుమారు నాలుగు లక్షల క్యూసెక్కుల జల ప్రవాహం జతవుతోంది. దీంతో భద్రాచలం వద్ద నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజాము వరకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 48 అడుగులకు చేరుకోవచ్చని అధికారుల అంచనా. ప్రవాహం ఇలాగే కొనసాగితే నేటి సాయంత్రానికి 53 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉంటేనే నష్ట నివారణ గోదావరి నీటిమట్టం గతేడాది అత్యధికంగా 71.3 అడుగులకు చేరి బీభత్సం సృష్టించడంతో.. అధికారులు ఈ ఏడాది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జూలై ప్రారంభంలోనే జిల్లా, డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి మండల, డివిజన్ స్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మూడో ప్రమాద హెచ్చరిక దాటితే ఏజెన్సీలోని పలు గ్రామాలు ముంపునకు గురవుతాయి. భద్రాచలం నుంచి ఇతర మండలాలకు రాకపోకలు స్తంభిస్తాయి. ప్రధానంగా దుమ్ముగూడెం మండలం తూరుబాక, రేగుపల్లి, నడికుడి, గంగోలు, బైరాగులపాడు గ్రామాల వద్ద, చర్ల మండలం కుదునూరు, సుబ్బంపేట గ్రామాల వద్ద ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, నెల్లిపాక, కూనవరం మండలాలకు సైతం పూర్తిగా రవాణా స్తంభిస్తుంది. పునరావాస శిబిరాలు సిద్ధం వరద తీవ్రత పెరిగితే బాధితులను తరలించేందుకు ముందుగానే పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. మండలానికో ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పగించడంతో పాటు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా బఫర్ స్టాక్ ఉంచారు. ప్రజలను తరలించేందుకు ట్రాక్టర్లు, జేసీబీలు, లైఫ్ జాకెట్లు, పడవలను సిద్ధంగా ఉంచారు. నేడు మంత్రి పువ్వాడ రాక మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. శుక్రవారం ఆ స్థాయికి వరద వచ్చే అవకాశం ఉండటంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భద్రాచలంలో మకాం వేయనున్నారు. వరద తగ్గుముఖం పట్టే వరకు ఆయన ఇక్కడే ఉంటారు. మంత్రితో పాటు ఇటీవల బదిలీపై వెళ్లిన కలెక్టర్ అనుదీప్ సైతం ప్రత్యేక సేవలు అందించేందుకు ఇక్కడికి వస్తున్నారు. గతేడాది 71 అడుగుల స్థాయికి వరద వచ్చినా, ప్రాణ నష్టం జరగకుండా వీరిద్దరూ పక్కా ప్రణాళికతో పని చేశారు. దీంతో ఈసారి వరద సహాయ కార్యక్రమాల కోసం మరోసారి భద్రాచలం వస్తున్నారు. -
ఆకాశయానం అందని ద్రాక్షేనా?
భద్రాద్రి: రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్డుల నిర్మాణంపై గతేడాది ఆగస్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరిగాయి. ఇందులో వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్, నిజామాబాద్ (జక్రాన్‌పల్లి) ఎయిర్‌పోర్టుల ప్రస్తావనే వచ్చింది తప్పితే కొత్తగూడెం ఊసే లేదు. అప్పటి వరకు తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల ప్రస్తావన ఎప్పుడొచ్చినా కొత్తగూడెం పేరు తప్పకుండా ఉండేది. మరోవైపు విమాన ప్రయాణ, రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు సైతం ఆకాశయానం అవకాశం కల్పించేందుకు కేంద్రం ఉడాన్ (ఉడే దేశ్‌కి ఆమ్ నాగరిక్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక్కడ కూడా కొత్తగూడెం పేరు లేకపోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కొత్తగా ఎనిమిది విమానాశ్రయాలు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంపీగా గెలిచిన రేణుకాచౌదరి కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆమె చూపిన చొరవతో కొత్త ఎయిర్‌పోర్టుల ప్రతిపాదనల్లో కొత్తగూడెం పేరు కూడా చేరింది. అయితే గత 15 ఏళ్లుగా ఎయిర్‌పోర్టు అంశం విక్రమ్ బేతాళ్ కథలా మారిపోయింది. కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తాయి. ఆ తర్వాత విడతల వారీగా నిపుణుల బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తాయి. వారి సూచనలకు అనుగుణంగా, జిల్లా యంత్రాంగం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం సర్వేలు చేపడతాయి. పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతాయి. అంతే ఇక ఆ తర్వాత ఉలుకూపలుకూ ఉండదు. మూడుసార్లు ప్రభుత్వాలు మారినా ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది. విమానాశ్రయం ముచ్చట సాగిందిలా.. ► కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 2008లో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. నాటి నుంచి 2014 వరకు కాగితాల్లో ప్రతిపాదనలే తప్ప క్షేత్ర స్థాయిలో అంగుళం పని కూడా జరగలేదు. ► తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు అప్పటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఎయిర్‌పోర్టు పనుల్లో దూకుడు పెంచారు. ► ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల కోసం 2015 జనవరి నుంచి 2017 మార్చి వరకు అన్వేషణ సాగింది. ► పాల్వంచ మండలం పునుకుడుచెలక దగ్గర 1600 ఎకరాల స్థలాన్ని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైనదిగా గుర్తించారు. ► ఈ స్థలాన్ని తమకు అప్పగిస్తే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని 2017 మార్చిలో కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. ► పునుకుడుచెలక దగ్గరున్న స్థల సేకరణకు పర్యావరణ, అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ, సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డొచ్చాయి. దీంతో ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. ► 2019లో పాల్వంచ మండలంలో సర్వే నంబర్ 441లో ఉన్న 700 ఎకరాల స్థలాన్ని పరిశీలనలోకి తీసుకున్నారు. శ్రీనివాసకాలనీ నుంచి బంగారుజాల వరకు ఉన్న భూములను ఎంపిక చేసి 2020లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిశీలనకు పంపారు. ► విమానాలు ల్యాండ్, టేకాఫ్ అయ్యేందుకు బంగారుజాల దగ్గరున్న స్థలం అనువైనదా, కాదే అనే అంశాలను ఏఏఐ బృందం 2021లో పరిశీలించింది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన శాఖాపరమైన అనుమతుల కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ అప్పటి నుంచి ఎయిర్‌పోర్టు పనులు ముందుకు సాగలేదు. దృష్టిపెట్టండి.. పారిశ్రామికంగా, ఆధ్యాత్మికంగా భద్రాద్రి జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే దేశ నలుమూల నుంచి పర్యాటకులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఆకాశయాన సౌకర్యం లేక సింగరేణి, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, హెవీ వాటర్ ప్లాంట్, పేపర్‌బోర్డు తదితర పరిశ్రమల్లో పనిచేసే ఉన్నతాధికారులు, నిపుణులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చే ఎయిర్‌పోర్టు నిర్మాణంపై అవసరమైన దృష్టిపెట్టడం లేదనే అపవాదు ను జిల్లా ప్రజాప్రతినిధులు మూటగట్టుకున్నారు. ఇప్పటికై నా ఎయిర్‌పోర్టు నిర్మాణంలో కదలిక వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా కృషి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఆకాశయానం జిల్లా ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. పదిహేనేళ్లుగా ఇదుగో అదుగో అంటూ ప్రకనటలు చేయడం, ఆపై సర్వేలు అంటూ హడావుడి చేయడం మినహా ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో అడుగు ముందుకు పడటం లేదు. -
టికెట్ ప్లీజ్..! ఎమ్మెల్యే స్థానం కోసం హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌గా పనిచేసిన గడల శ్రీనివాసరావు కొత్తగూడెంలో ఈ సారి టికెట్టు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమయం దొరికినప్పుడల్లా ఆ ప్రాంతంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ట్రస్టు ద్వారా సేవలు చేస్తూ అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. నా జీవితం.. ప్రాణం కొత్తగూడెం ప్రజల కోసమేనని చెబుతూ అందరి మనసులను గెలుచుకునే పనిలో పడ్డారు. కన్న తల్లిని.. పుట్టిన భూమిని మర్చిపోకూడదనే ఇక్కడ సేవ చేయడానికి వచ్చానని చెప్పారు. రావణాసురుడి పాలన.. రాష్ట్రమంతా రామరాజ్యం నడుస్తుంటే కొత్తగూడెంలో మాత్రం ఓ రావణాసురుడు పాలిస్తున్నాడని తెలంగాణా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. ఇక్కడి ప్రజలను, అధికారులను ఇబ్బంది పెడుతూ రాజ్యాన్ని నడిపిస్తున్నాడని దుయ్యబట్టారు. కొత్తగూడెం ప్రాంత ప్రజలకు ఇకపై తాను కాపలా కాస్తానని చెప్పారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న తనను కావాలని ఇబ్బంది పెడితే తానేంటో కూడా చూపిస్తానని హెచ్చరించారు. ఎన్నో సేవలు చేశా.. కొత్తగూడెం ప్రాంతంలో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం అందించాలనే ధ్యేయంతో జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాని శ్రీనివాసరావు చెప్పారు. మెగా హెల్త్ క్యామ్ప్ లు పెట్టి సుమారు 200 మందికి నాలుగు కోట్ల రూపాయల విలువైన వైద్యాన్ని అందించామని అన్నారు. 8వేల మంది నిరుద్యోగులకు జాబ్ మేళా లు నిర్వహించి 4 వేల మందికి ఉద్యోగాలు ఇప్పించామని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు శ్రామిక శక్తి అవార్డులు బహుకరించి గౌరవించుకున్నామని స్పష్టం చేశారు. వందలాదిమంది నిరుద్యోగ యువతకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉచిత కోచింగ్ ఇప్పించి భోజనాలు పెట్టించామని అన్నారు. మహిళలకు కుట్టు మిషన్ లు పంపిణీ చేశామని చెప్పారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫర, ఆరో ఓ ప్లాంట్ లను ఏర్పాటు చేసి మంచినీటిని అందించామని చెప్పారు. అభిమానాన్ని తొలగించగలరా? పుట్టిన రోజు సందర్భంగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి పర్యటన సందర్భంగా మా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు కావాలని తొలగించారని ఆరోపించారు. తమ ట్రస్ట్ ద్వారా లబ్ది పొందిన వ్యక్తి చేతే ఫ్లెక్సీ తొలగించారు కానీ అతని గుండెల్లో తనపై ఉన్న అభిమానాన్ని తొలగించగలరా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి సేవ చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను రిక్వెస్ట్ చేసి మొదటి మెడికల్ కాలేజ్ ను సాంక్షన్ చేయించానని చెప్పారు. ఏసీ కారు, బంగ్లా, మంచి పొజీషన్ వదిలి ఇక్కడకు వచ్చి సేవ చేస్తున్నానని అన్నారు. ఇదీ చదవండి: క్షమాణలు చెప్పాకే మోదీ వరంగల్‌లో అడుగు పెట్టాలి: కేటీఆర్ -
భద్రాద్రి బ్రహ్మోత్సవాలు.. సీతారాముల కళ్యాణం
-
పోలీసుల అదుపులో ఒడిశా యువతులు
భద్రాద్రి: పొట్టకూటి కూసం ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతులు తమిళనాడు రాష్ట్రానికి వెళ్తూ మార్గమధ్యలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ పోలీసులకు చిక్కారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఒడివా రాష్ట్రం కోరాపుట్‌కు చెందిన 13 మంది యువతులు తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూట్లోని ఓ దుస్తుల కంపెనీలో పనిచేసేందుకు వెళ్తున్నారు. యువతులు రెండు కార్లు (వాహనాల్లో) బయలు దేరారు. మార్గమధ్యలో ఓ కారు చెడిపోయింది. దీంతో ఒకేకారులో సర్దుకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చండ్రుగొండలోని ఓ పెట్రోల్‌బంకులో కారు ఆపి సేదతీరుతున్నారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ విజయలక్ష్మి సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువతుల వద్ద ఉన్న కంపెనీ గుర్తింపు కార్డులను పోలీసులు తనిఖీ చేయగా అవి ఓ ప్రముఖ దుస్తుల కంపెనీకి చెందినవిగా ఉన్నాయి. కాగా, ఈ అంశంపై డీఎస్పీ అబ్దుల్ రెహమాన్‌ను వివరణ కోరగా పోలీసులకు పట్టుపడిన యువతులను ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. సమగ్ర విచారణ అనంతరం యువతులను పంపిస్తామన్నారు. -
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
-
వివాహిత ఆత్మహత్య
భద్రాద్రి: మండల కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన వివాహిత కుక్కముడి శ్రావణి (25) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. కానీ, ఆమెను తన భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. అంబేడ్కర్‌నగర్‌కు చెందిన శ్రావణి, దివ్యతేజ్‌కుమార్ నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండేళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రావణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని దివ్యతేజ్‌కుమార్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ, భర్తే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు శ్రావణి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. మృతురాలి తల్లి రాధ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూలూరుపాడు సీఐ వసంత్‌కుమార్, ఎస్ఐ విజయలక్ష్మి ఘటనా స్థలాన్ని సందర్శించారు. -
హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి అల్లుడితో లాడ్జికి వెళ్లిన అత్త.. షాకింగ్ ట్విస్ట్!
భద్రాచలంఅర్బన్: పట్టణంలో ఆదివారం ఓ లాడ్జిలో అనుమానాస్పదంగా మృతి చెందిన రావూరి అరుణ (35)ను ఆమెకు అల్లుడు వరసయ్యే ఆంజనేయులు హత్య చేసినట్లు సోమవారం అరుణ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అరుణ హైదరబాద్‌లో ఆమె భర్త కృష్ణారావుతో కలిసి కోళ్ల ఫారంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈనెల 14వ తేదీన అరుణ.. తనకు కడుపులో నొప్పి వస్తోందని, ఆమె సొంత గ్రామం అయిన తిరువూరులో వైద్యులకు చూపించుకుని వస్తానని చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ఖమ్మం జిల్లాలోని కప్పలబంధం గ్రామానికి చెందిన ఆంజనేయులు (అరుణ భర్త కృష్ణార్జున్‌రావు మేనల్లుడు)తో కలిసి భద్రాచలం పట్టణానికి చేరుకొని లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. ఒక రోజు అదే గదిలో ఇద్దరూ కలిసి ఉన్నారని, ఇది తెలిస్తే పరువుపోతుందని గ్రహించిన అరుణ గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు లాడ్జి నిర్వాహకులు ఆదివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. ఇదే విషయాన్ని అరుణ కుటుంబ సభ్యులకు తెలిపామని పోలీసులు చెప్పారు. సోమవారం అరుణ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు పరిశీలించి ఆమె మెడ చుట్టూ కమి లి ఉన్న గాయాన్ని బట్టి ఆంజనేయులే చీర ను అరుణ గొంతుకు చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేసి నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠి నంగా శిక్షించాలని వారు కన్నీటిపర్యంతమ య్యారు. ఇందుకు సంబంధించి పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ నాగరాజురెడ్డి తెలిపారు. -
భద్రాద్రిలో వైభవంగా మహా పట్టాభిషేక మహోత్సవం (ఫొటోలు)
-
రామయ్య తలంబ్రాలు గంటకు 1,500 ప్యాకెట్లు
భద్రాచలం: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు సిద్ధమవుతున్నాయి. భద్రాచలంలో కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు పంచడంతోపాటు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేవారికి సరఫరా చేసేందుకు దేవస్థా నం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులకు తలంబ్రాలు అందించేందుకు వీలుగా ప్రత్యే క యంత్రాల ద్వారా వాటిని ప్యాకింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తలంబ్రాల తయారీ ప్రక్రియ వేగం పుంజుకుంది. రామయ్య కల్యాణ తలంబ్రాలు కావాల నుకునేవారు మీసేవ కేంద్రాల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇన్నాళ్ల ఇబ్బందికి చెక్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏటా శ్రీసీతా రాముల కల్యాణ మహోత్స వాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతారాములకు సమర్పించే ముత్యా ల తలంబ్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఆ ముత్యాల తలంబ్రాలను ఇంటికి తీసుకెళితే మంచి జరు గుతుందన్న భావనతో చాలా మంది భక్తులు తీసుకుంటుంటారు. శ్రీరామనవమి రోజున భద్రాచలం వచ్చిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచితంగానే ముత్యాల తలంబ్రాలను అందిస్తారు. దూర ప్రాంతాల్లో ఉండి కల్యాణోత్సవానికి హాజరు కాలేని వారితోపాటు బంధువులు, స్నేహితులకు అందజేసేందుకు కావాలను కునే భక్తుల కోసం దేవస్థానం రెండు ముత్యాలతో కూడిన తలంబ్రాలను విక్రయిస్తోంది. గతంలో ఈ తలంబ్రాలను స్వచ్ఛంద సంస్థ సభ్యులతో ప్యాకింగ్ చేయించేవారు. దీనితో చాలా సమయం పట్టడంతోపాటు ఆ ప్యాకెట్లు రవాణాలో చిరిగిపోయేవి. ఈ క్రమంలోనే వేగంగా ప్యాకింగ్ చేయడం, రవాణాలో దెబ్బతినకుండా ఉండేలా దేవస్థానం అధికారులు ప్యాకింగ్ యంత్రాలపై దృష్టిపెట్టారు. దాతల చేయూతతో యంత్రాలు.. ముత్యాల తలంబ్రాలు, పులిహోర ప్రసా దం ప్యాకింగ్ యంత్రాల కోసం దేవస్థానం అధికారులు దాతలను సంప్రదించారు. తిరుపతి ఖాదీబండార్కు చెందిన కుమార్ కిట్టు యాజమాన్యం రూ.1.40 లక్షలతో తలంబ్రాల ప్యాకింగ్ యంత్రాన్ని, శశి విద్యాసంస్థల యాజమాన్యం రూ.1.50 లక్షల విలువైన ప్యాకింగ్ కవర్లను సమకూ ర్చాయి. ఇక రూ.1.45 లక్షల విలువైన పులిహోర ప్రసాదం ప్యాకింగ్ యంత్రాన్ని తులసి ఆస్పత్రి యజమాన్యం ఏజేఆర్ సేవా సంస్థ పేరుతో సమకూర్చింది. గంటకు 1,500 ప్యాకెట్లు యంత్రంలో తలంబ్రాల నడుమ ముత్యాలు ఉంచి ఆన్ చేస్తే ఆటోమేటిక్‌గా ప్యాకెట్లు తయారై బయటికి వస్తాయి. ఈ యంత్రం ద్వారా నిమిషానికి 25 చొప్పున గంటకు 1,500 ప్యాకెట్లు సిద్ధమవుతున్నాయి. రోజూ సుమారు 20 వేల వరకు ప్యాకెట్లు చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. పులిహోర ప్యాకింగ్ యంత్రం ద్వారా గంటకు 1,400 వరకు ప్యాకెట్లు సిద్ధ మవుతున్నాయి. ఇటీవలి వరకు రోజువారీగా విక్ర యించే ప్రసాదాన్ని ప్యాక్ చేయాలంటే కార్మికులకు ఒకపూటంతా పట్టేదని.. ఇప్పుడు 2 గంటల్లోనే పని పూ ర్తవుతోందని అధికారులు చెప్పారు. పోస్టల్ శాఖ, ఆర్టీసీ కార్గో ద్వారా తలంబ్రాలను భక్తులకు చేరవేస్తున్నామని పేర్కొన్నారు. -
భద్రాద్రి రాములోరి కల్యాణానికి చీరాల గోటి తలంబ్రాలు
చీరాల: భద్రాద్రి సీతారాముల కల్యాణం అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు ఎనలేని భక్తిభావం. అవకాశం ఉన్నవాళ్లు భద్రాద్రి వెళ్లి ఆ కల్యాణాన్ని కనులారా వీక్షించి పులకించిపోతారు. వెళ్లలేని వాళ్లు టీవీల్లో వీక్షిస్తూనే భక్తిభావంతో ఉప్పొంగిపోతారు. సీతారాముల కల్యాణ క్రతువులో వినియోగించే తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. తలంబ్రాలలో వినియోగించే బియ్యాన్ని గోటితో ఒలిచి స్వామివారికి సమర్పించే అవకాశం క్షీరపురిగా పిలిచే చీరాల వాసులకు వరుసగా తొమ్మిదోసారి దక్కింది. సీతారాముల కల్యాణానికి వడ్లను గోటితో ఒలిచి ఇక్కడి నుంచి పంపించడం ఈ ప్రాంత ప్రజలు తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. ఈ మహాసంకల్పానికి చీరాలకు చెందిన సిద్ధాంతి పి.బాలకేశవులు, మరికొందరు పూనుకుని నియమనిష్టలతో నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చీరాలలో శ్రీ రఘురామ భక్తసేవా సమితి 2011లో 11మందితో ఏర్పాటైంది. వీరికి భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవానికి తలంబ్రాలు అందించే అవకాశం పూర్వజన్మ సుకృతంలా వచ్చింది. తలంబ్రాల కొరకు వడ్లను ఎంతో శ్రమంచి ఒలిచి, పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాలతో కలిపి.. నియమనిష్టలతో, శాస్త్రోక్తంగా తలంబ్రాలు చేస్తారు. విజయదశమి నుంచి ప్రారంభించి ఉగాది వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 2015 అక్టోబర్ 23న చేపట్టిన ఈ మహా కార్యక్రమంలో.. ఏటా వందలాది భక్తులు పాల్గొంటున్నారు. విదేశాల్లోని వారికీ భాగస్వామ్యం రాములోరి కల్యాణానికి అవసరమైన తలంబ్రాలను తయారు చేసే క్రతువులో స్థానికంగానే గాక దేశ, విదేశాల్లోని తెలుగు వారిని కూడా భాగస్వాములు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ రాష్ట్రాలతో పాటు అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాల్లోని 10 వేల మంది భక్తులు ఇందులో భాగస్వాములయ్యారు. కమిటీ ప్రతినిధులు సీతారామ కల్యాణ వైభోగం, భద్రాద్రి సీతారామ కల్యాణం పేర్లుతో వాట్సాప్ గ్రూపులు ప్రారంభించారు. ఆసక్తి ఉన్న భక్తులను గ్రూపుల్లో చేర్చుకుని ఆయా ప్రాంతాలలో పర్యవేక్షకులుగా ఉన్న వారి ద్వారా భక్తులకు వడ్లు ఇచ్చారు. మరికొందరికి కొరియర్ ద్వారా పంపారు. అమెరికా నుంచి నాలుగేళ్లుగా వక్కలగడ్డ వెంకటేశ్వరరావు, పద్మజ దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అలానే దక్షిణాఫ్రికాలో 400 మంది భక్తులు మూడు సంవత్సరాలుగా వడ్లు ఒలిచి పంపిస్తున్నారు. ఇక్కడ ఆత్మకూరి శ్రీనివాసరావు, అప్పాజోస్యుల వీరవెంకటశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈనెల 25న భద్రాద్రికి తలంబ్రాలు, పసుపు, కుంకుమ, భద్రాద్రికి తీసుకెళ్తారు. పూర్వజన్మ సుకృతంలా భావిస్తున్నాం భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాలను అందించే అవకాశం మాకు కలగడం పూర్వజన్మ సుకృతమే. ప్రతి సంవత్సరం మేమంతా కలిసి తలంబ్రాలు తయారు చేస్తున్న విధానంపై దేవస్థానం అధికారులు, ధర్మకర్తలు సంతృప్తి చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములే. – పొత్తూరి బాలకేశవులు, చీరాల -
నాడు కూలీ... నేడు ఓనర్! కాదేది అతివకు అసాధ్యం
ట్రాక్టర్ నడుపుతున్న బడియా సావిత్రిది శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామం. మత్స్యకార కుటుంబానికి చెందిన సావిత్రి పెద్దగా చదువుకోలేదు. కుటుంబ పోషణ కోసం ట్రాక్టర్ కూలీగా పనిచేసేది. ఆడవాళ్లు కార్లు, బైక్‌లు, బస్సులు, రైళ్లు, విమానాలు నడుపుతున్నారు, ట్రాక్టర్ కూడా నడపవచ్చు అనుకుంది. డ్రైవింగ్ నేర్చుకుంది. తనకు సొంతంగా ట్రాక్టర్ ఉంటే బావుణ్నని కలగన్నది. స్వయంసహాయక బృందంలో సభ్యురాలు కావడంతో గత ఏడాది ఆమెకు ‘స్త్రీ నిధి’ నుంచి 80వేలు, గ్రామ సంఘం నుంచి లక్ష రూపాయల లోన్ వచ్చింది. ఆ డబ్బు డౌన్ పేమెంట్‌గా కట్టి వాయిదాల పద్ధతిౖపై ట్రాక్టర్ కొన్నది. ప్రస్తుతం తన ట్రాక్టర్‌ను తానే నడుపుతూ వ్యవసాయ పనులు, ఇతరత్రా పనులు చేసుకుంటోంది సావిత్రి. ►విజయవాడ నగరం, రామలింగేశ్వర నగర్ నివాసి రమాదేవి. . భర్త వ్యసనపరుడై మరణించాడు. ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి ఇంత కష్టమైన పనిని చేయడానికి ముందుకు వచ్చింది. ఎయిర్ బ్రేక్ సిస్టమ్ మెకానిక్‌గా పని చేస్తోంది. ►ఆటో నడుపుతున్న సరస్వతి సుమతిది నెల్లూరు నగరం. ఇంటర్ వరకు చదువుకున్న సుమతి పిల్లల పోషణ కోసం ఆటో నడుపుతూ, పిల్లలతో పాటు చదువును మళ్లీ మొదలు పెట్టి బీఎల్ పూర్తి చేసింది. ►స్వరూపరాణిది పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు మండలం, గంగన్నగూడెం. ఆడవాళ్లు వేదాలను ఎందుకు చదవకూడదనే ప్రశ్నకు తానే జవాబుగా నిలవాలనుకుంది. వేదాలు ఔపోశన పట్టి, బ్యాంకు మేనేజర్ ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పౌరోహిత్యం చేస్తున్నారు. ►నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు సర్పంచ్ గొడ్డేటి వెంకటసుబ్బమ్మ... పొలం దుక్కి దున్నడంతోపాటు నిమ్మచెట్లకు తెగుళ్లు సోకితే స్ప్రేయర్‌తో క్రిమిసంహారక మందులను స్వయంగా పిచికారి చేస్తుంది. ►కాచరమైన కళమ్మ ఉండేది కుషాయిగూడ హైదరాబాద్‌లో.మొదట భవన నిర్మాణ కార్మికురాలిగా ఉన్న కళమ్మ 30 ఏళ్లుగా ఇండ్లకు, దేవాలయాలకు పెయింటింగ్ వేస్తోంది. ►మదనపల్లె పట్టణంలో రేణుక... డ్రైవింగ్ స్కూల్లో స్వయంగా తానే మహిళలకు డ్రైవింగ్ నేర్పిస్తోంది. ►యదళ్ళపల్లి ఆదిలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్లో ఉంటుంది. గత 5 ఏళ్లుగా మెకానిక్‌గా పనిచేస్తోంది. ►కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పెట్రోలు బంకులో పెట్రోలు పడుతున్న పగిడేల ఉమా మహేశ్వరి. చదవండి: Lalitha Manisha: తెనాలి అమ్మాయి.. డోలు నేర్చుకుని! అరుదైన ఘనత.. 35 రకాల తాళాలతో.. -
ఆయనకు ఇద్దరితో పెళ్లి.. ఒకే ముహూర్తానికి.. వైరల్‌గా శుభలేఖ
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన వ్యక్తి ఒకే ముహూర్తానికి ఇద్దరు వధువుల మెడలో తాళిబొట్టు కట్టనున్నాడు. కుర్నపల్లి గ్రామపంచాయతీకి చెందిన కోయ గిరిజనుడు, వ్యవసాయ కూలీ మడివి సత్తిబాబు అదే గ్రామానికి చెందిన సునీతతో పాటు దోశిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారిని ప్రేమించాడు. ఈ క్రమంలో స్వప్నతో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించగా.. విషయం తెలుసుకున్న సునీత నిలదీసింది. ఇరువురికీ సర్దిచెప్పేందుకు పెద్దలు ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో సత్తిబాబు ఇద్దరితోనూ ఎర్రబోరులో ఏడాది క్రితం కాపురాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం సునీత, స్వప్నకు ఒక్కో సంతానం ఉన్నారు. కోయ గిరిజనుల్లో కొన్ని తెగల వారు కొంత కాలం కలిసి కాపురం చేశాక వివాహం చేసుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో వివాహ విషయాన్ని నలుగురికి తెలిసేలా విందు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, పెద్దలు సూచించారు. దీంతో సత్తిబాబు గురువారం ఉదయం 7.04 గంటలకు ఇద్దరితో కల్యాణ ముహూర్తమని శుభలేఖలు అచ్చు వేయించి బంధువులకు పంచాడు. దీంతో ఈ కార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
రెండో రోజుకు చేరిన నిరసన
మణుగూరురూరల్: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో బీటీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన నిరసన రెండో రోజుకు చేరుకుంది. శనివారం ఉద్యోగులు డీఈ జనరల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. జెన్కో యాజమాన్య నిర్లక్ష్యం వల్లే పీఆర్సీ ప్రకటనలో జాప్యం జరుగుతోందని చెప్పారు. యాజమన్యం తక్షణమే స్పందించి పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎస్పీఈ జేఏసీ బీటీపీఎస్ రీజియన్ కన్వీనర్ ఎస్.శ్రీనివాసరెడ్డి, నాయకులు వి.ప్రసాద్, రవిప్రసాద్, సత్యనారాయణ, ప్రేమ్‌కుమార్, వీరస్వామి, రాజబాబు, దయాకర్, కె.నర్సింహారావు, అల్తాఫా తదితరులు పాల్గొన్నారు. -
టీచర్‌గా మారిన డీఈఓ
అశ్వారావుపేటరూరల్: ఆయన జిల్లా విద్యాశాఖాధికారి.. అయినప్పటికీ కొద్ది సేపు విద్యార్థులకు పాఠాలు బోధించి టీచర్‌గా మారిపోయారు. అశ్వారావుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం డీఈఓ సోమశేఖరశర్మ ఆకస్మికంగా సందర్శించారు. పదోవ తరగతి విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి పలు పాఠ్యాంశాలపై ప్రశ్నించారు. ఆ తర్వాత తానే టీచర్‌గా మారిపోయి బ్లాక్ బోర్డుపై విద్యార్థులకు గణిత బోధన చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. కష్టపడి, ఇష్టంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. అనంతరం మన ఊరు – మన బడి పనులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి వంటకాలను రుచి చూశారు. ఆయనతోపాటు ఎంఈఓ పి.కృష్ణయ్య, పరీక్షల విభాగం ఏసీజీఈ మాధవరావు, సెక్టోరియల్ అధికారులు నాగరాజశేఖర్, సతీశ్ ఉన్నారు. -
హామీల అమలుపై..ఆత్మపరిశీలన చేసుకోవాలి
●రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు.. ●పోడు పట్టాల పంపిణీలో చిత్తశుద్ధి చూపండి ●మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చండ్రుగొండ: ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో ఆత్మపరిశీలన చేసుకోవాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రం చండ్రుగొండలో ఆయన క్యాంప్ కార్యాలయాన్ని శనివారం రాత్రి ప్రారంభించి మాట్లాడారు. వందలమంది ఆత్మబలిదానాలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని, రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ను, సహకరించిన బీజేపీని కాదని టీఆర్ఎస్కు ప్రజలు రెండు పర్యాయాలు పట్టం కడితే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. ప్రజల మాదిరిగానే సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను నమ్మానన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సక్రమంగా ఇస్తున్నారా? రైతులు పడుతున్న గోస కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి హామీ ఏమైందని, డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టినవెన్ని, పేదలకు ఇచ్చింది ఎన్ని? లెక్కలు చూసుకోవాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున నామమాత్రంగా పోడు పట్టాలు ఇచ్చే ఎన్నికల స్టంట్ వద్దని, సీఎం కేసీఆర్ హామీ మేరకు పోడుపట్టాలు చిత్తశుద్ధితో ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మువ్వా విజయ్‌బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, జారే ఆదినారాయణ, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, బాణోత్ పార్వతి, భోజ్యానాయక్, నరకుళ్ల సత్యనారాయణ, చెవుల చందర్రావు, సారేపల్లి శేఖర్, కిరణ్‌రెడ్డి పాల్గొన్నారు. -
కుక్కకాట్లపై అప్రమత్తంగా ఉండండి
●రక్షణ చర్యలు చేపట్టండి.. ●కలెక్టర్ అనుదీప్ సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజలు కుక్కకాటుకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. కుక్కలవృద్ధి రేటును నియంత్రించే ఆపరేషన్లు, అత్యవసర వైద్యసేవలు.. తదితర అంశాలపై శనివారం ఐడీఓసీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుక్కల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తక్షణ చర్యలు చేపట్టి ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. సోమవారం నుంచి ఆపరేషన్లు ప్రారంభించాలని, పర్యవేక్షణకు కుటుంబ నియంత్రణ కేంద్రంలో ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. రోజుకు వంద కుక్కలకు ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో మాంసపు దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించి వ్యర్థాలను బయట వేయకుండా అవగాహన చర్యలు చేపట్టాలని సూచించారు. ఫంక్షన్‌హాళ్లు, కోళ్ల వ్యర్థాలు మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బదికి అప్పగించాలని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్క, కోతి కాటు మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో డీపీఓ రమాకాంత్, వైద్యాధికారులు ముక్కంటేశ్వరరావు, రామకృష్ణ, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మున్సిపల్ కమిషనర్లు రఘు, శ్రీకాంత్, అంకుషావలి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 28న జాబ్‌మేళా జిల్లా ఉపాధి, శిక్షణశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28న కొత్తగూడెం క్లబ్లో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జాబ్‌మేళాకు సంబంధించి ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాబ్‌మేళా 28న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, 8వ తరగతి నుంచి పీజీ వరకు, ఇంజనీరింగ్ ఎంబీఏ, ఎంసీఏ, ఐటీఐల్లోని వివిధ ట్రేడ్లు, డిప్లొమా తదితర అర్హతలు ఉన్నవారు తమ బయోడేటాతో పాటు విద్యార్హత జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలని చెప్పారు. కార్యక్రమంలో వేల్పుల విజేత పాల్గొన్నారు. -
ఉపాధి, శిక్షణపై దృష్టి సారించాలి
పాల్వంచ: మహిళలు ఉపాధి శిక్షణపై దృష్టి సారించాలని యాదాద్రి భువనగిరి శ్రీరామనంద తీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ పీఎస్ఎస్ఆర్ లక్ష్మి అన్నారు. శనివారం స్థానిక నవ లిమిటెడ్ మహిళా సాధికార కేంద్రంలో టైలరింగ్ ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆమె సర్టిఫికెట్లు అందించి ప్రసంగించారు. వృత్తి విద్యా కేంద్రం అందుబాటులో ఉండటం సువర్ణ అవకాశమని, అధునాతన పరికరాలు ఇతర శిక్షణ కేంద్రాల్లో ఎక్కడా లేవని పేర్కొన్నారు. కార్యక్రమంలో నవ లిమిటెడ్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ డి.శ్యాంసుందర్, డాక్టర్ విహారికృష్ణ, కిశోర్, లలిత, అరుణ, వాసవి రాణి, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు అశ్వారావుపేటరూరల్: ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఇలాంటి చర్యలకు పాల్పడి తమ విలువైన జీవితాలను పాడు చేసుకోవద్దని పాల్వంచ డీఎస్పీ వెంకటేశ్ అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాలలో శనివారం సీనియర్ విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులను ప్రేమించాలని, గురువులను గౌరవిస్తూ ఆశయాలను సాధించుకోవాలన్నారు. విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని, చెడు వ్యసనాలకు లోను కాకుండా కచ్చితమైన ప్రణాళికతో లక్ష్యాలను అందుకోవాలని సూచించారు. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులను వేధిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలుంటాయని, పలు కేస్ స్టడీలను విద్యార్థుకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల డీన్ వెంకన్న, ఎస్ఐ రాజేశ్‌కుమార్, ప్రొఫెసర్లు మధుసూదన్‌రెడ్డి, గోపాలకృష్ణమూర్తి, శిరీష, జమయ్మ, రమేశ్, రెడ్డిప్రియ, స్రవంతి, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళ ఆత్మహత్య అన్నపురెడ్డిపల్లి: పురుగులమందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబు సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన కాలసాని రత్నకుమారి (28) మతిస్థిమితం లేకపోవడంతో కొంతకాలంగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పొలానికి కొట్టే పురుగులమందు తాగింది. గమనించిన తల్లిదండ్రులు 108 వాహనంలో కొత్తగూడెం తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందిందని వారు తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. మృతురాలి సోదరుడు వీరరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ షాహిన తెలిపారు. అప్పులబాధతో రైతు.. జూలూరుపాడు: అప్పులబాధ తాళలేక మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై స్థానిక పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. హెడ్‌కానిస్టేబుల్ బుచ్చయ్య కథనం ప్రకారం.. మండలంలోని సాయిరాంతండాకు చెందిన తేజావత్ రాంబాబు (25) తనకు ఉన్న 3 ఎకరాల భూమితోపాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి పంటలను సాగు చేశాడు. మిర్చి పంటకు తెగుళ్లు సోకడంతో తీవ్రంగా నష్టపోయాడు. పంటల పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఈ నెల 24న రాంబాబు పొలానికి వెళ్లి వస్తానని భార్యకు చెప్పి వెళ్లి పురుగులమందు సేవించాడు. అదే గ్రామానికి చెందిన గుగులోత్ నరసింహ పొలం పనుల నిమిత్తం అటుగా వెళ్తుండగా రాంబాబు అపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని గమనించి, కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు వచ్చి రాంబాబును ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ బుచ్చయ్య తెలిపారు. వృద్ధురాలి ప్రాణం తీసిన సొరకాయ కొత్తగూడెంరూరల్: బిల్డింగ్‌పైన కాసిన సొరకాయను కోసేందుకు వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి వృద్ధురాలు మరణించిన ఘటన హేమచంద్రాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని హేమచంద్రాపురం గ్రామానికి చెందిన మేకల భారతమ్మ (65) (తన కుమారుడి ఇంట్లో ఉంటోంది) ఇంటి డాబాపైన సొరకాయ కాసింది. దానిని కోసేందుకు డాబాపైకి ఎక్కుతుండగా మెట్ల పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. -
సింగరేణి ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ గార్డుపై దాడి
కొత్తగూడెంటౌన్: సింగరేణి కార్పొరేట్ ఏరియాలోని ఇంటిలిజెన్స్ విభాగంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కుక్కల నర్సింగరావుపై నాజర్ అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకోగా వన్‌టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కార్పొరేట్ ఏరియాలో సెకండ్ షిఫ్ట్‌లో మెయిన్ హాస్పిటల్ ఏరియాలో విధులు ముగించుకుని రాత్రి 10.30 గంటలకు క్యాజువాలిటీలో కేసుల విషయమై డాక్టర్, స్టాఫ్ నర్సును ఆరాతీశారు. తిరిగి ఇంటి వెళ్దామని తన ద్విచక్రవాహనం వద్దకు వెళ్లగా అదే సమయంలో రామాంజేయ కాలనీకి చెందిన బలగం వివేక్ బండిపై కూర్చుని ఉన్నాడు. తాను ఇంటికి వెళ్లాలని.. బైక్ మీద నుంచి దిగాలని సూచించాడు. పక్కనే ఉన్న నాజర్ అనే వ్యక్తి 10 నిమిషాలు అగలేవా.. అంటూ బూతులు తిడుతూ చెంపపై కొట్టాడని, చంపుతానని బెదిరించాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వివాదంపై ఇంటలిజెన్స్ ఆరా కొత్తగూడెంఅర్బన్: వివాహితుడైన ఓ ఎస్ఐ ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడనే ఆరోపణలపై ఇంటలిజెన్స్ విభాగం శనివారం ఆరా తీయడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం పట్టణ పరిధిలోని ఓ ఎస్ఐ పాల్వంచకు చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన విషయం ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే. ఈ తతంగంలో ఎస్ఐ తనకు వివాహం అయినా కూడా యువతిని ప్రేమ పేరుతో మోసం చేయడంపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. కాగా, ఇదే ఎస్ఐపై వ్యక్తిగత ఆరోపణలతో పాటుగా విధి నిర్వహణపై కూడా కొన్ని ఆరోపణలు తెరపైకి రావడం మరోకోణం. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి గుర్తింపు కారేపల్లి: రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలు వెల్లడయ్యాయి. కారేపల్లిలోని పేరుపల్లి రైల్వే గేట్ సమీపాన శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. కాగా, మృతుడు ఏన్కూర్ మండలం రేపల్లేవాడకు చెందిన మార్కపూడి నరసింహారావు(40)గా స్థానికులు గుర్తించారు. కారేపల్లికి చెందిన నాగవెల్లి ప్రభాకర్ బావమరిది అయిన నరసింహారావు కొంతకాలంగా కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతుండగా, కారేపల్లి వచ్చిన ఆయన రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, ఘటనపై శనివారం కేసు నమోదు చేసిన డోర్నకల్ రైల్వే పోలీసులు పంచనామా అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
దుమ్ముగూడెం: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన కందుల ప్రతాప్‌రెడ్డి ఈ నెల 12వ తేదీన ఆర్థిక ఇబ్బందులతో పురుగుమందు తాగాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఏఎస్ఐ సత్యనారయణ వివరాలు వెల్లడించారు. ప్రతాప్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మిర్చి, పత్తి పంటల్లో తీవ్ర నష్టం వాటిల్లడంతో మనోవేదనకు గురై ఈ నెల 12వ తేదీన ఇంట్లో పరుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు వినోద్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. గాయపడిన వ్యక్తి జూలూరుపాడు: మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఈసం పాపయ్య (64) పాలు పితుకుతుండగా ఆవు కాలితో తన్నడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ తిరుపతిరావు కథనం ప్రకారం.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఈసం పాపయ్య పాలు పితుకుతుండగా ఆవు కాలితో ఎగిరి తన్నడంతో అతను తీవ్రంగా గామపడ్డాడు. కుటుంబసభ్యులు పాపయ్యను కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాపయ్య శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఈసం రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తిరుపతిరావు పేర్కొన్నారు. -
అందుబాటులో ఉండేందుకే క్యాంపు కార్యాలయాలు
అన్నపురెడ్డిపల్లి: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలలో పాలు పంచుకునేందుకే క్యాంపు కార్యాలయాలు ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఆయన అనుచరుడు పర్సా వెంకటేశ్వరరావు కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. 2019లో టికెట్ ఇవ్వకపోయినా ప్రజల మధ్యే ఉంటున్నానని, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకం కావాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అని మండలాల్లో, మున్సిపాటీల్లో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. పదవులు ఉన్నా లేకున్నా.. అధికారం ఉన్నా, లేకపోయినా.. తనకు ప్రజలే ముఖ్యమని, ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్సా వెంకటేశ్వర్లు, బోడా పద్మ, భీంరెడ్డి శ్రీనివాసరెడ్డి, దుబ్బాకుల రాము, మారకాల లక్ష్మారెడ్డి, వీరబాయిన నాగేశ్వరరావు, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న డీఎంహెచ్ఓ
కొత్తగూడెంఅర్బన్: కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శేతామహంతి రాష్ట్రవ్యాప్తంగా డీఎంహెచ్ఓలతో శనివారం జూమ్ సమావేశం నిర్వహించారు. ఇందులో డీఎంహెచ్ఓ శిరీష పాల్గొని మాట్లాడారు. హెల్త్ వెల్నెస్ సెంటర్లు, పల్లె, బస్తీ దవాఖానాలు, సబ్ సెంటర్ బిల్డింగ్లు, చైల్డ్ హెల్త్.. తదితర అంశాలపై వివరాలను కమిషనర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టీబీకి సంబంధించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ను అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఎన్ఆర్సీ, ఎస్ఎన్సీయూ, ఎన్‌బీఎస్‌యూ డేటా, ఇమ్యూనైజేషన్‌కు సంబంధించి మీజిల్స్ కోసం ఇంటింటి సర్వే నిర్వహించి 6 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి వారికి ఎంఆర్, ఎంఆర్–2 ఇప్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో డాక్టర్ నందిత, సుధీర, రాజేశ్, ప్రోగ్రాం అధికారులు మణికంఠారెడ్డి, చైతన్య, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
అదనపు కట్నం కోసం వేధింపులు
పాల్వంచ: కోడలు అదనపు కట్నం తేవడం లేదని అత్త చేయి చేసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. స్థానికుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిఽధిలోని పిచ్చయ్య బంజరకు చెందిన రాజేశ్ మొదటి భార్య మృతి చెందడంతో శ్రీలతను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు కూతుళ్లు ఉండగా, శ్రీలతకు కుమారుడు ఉన్నాడు. ముగ్గురీ ఆలనాపాలన శ్రీలతనే చూసుకుంటోంది. కాగా కొన్ని రోజులుగా అత్త లక్ష్మీబాయి పది లక్షల కట్నం ేతేవాలంటూ వేధిస్తోందని శ్రీలత ఆవేదన వ్యక్తం చేసింది. అనేక మార్లు తనను హింసించి, చేయి చేసుకుంటోందని కన్నీళ్ల పర్యంతయింది. ఈ విషయమై ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. తమకు ఫిర్యాదు రాలేదని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి కరకగూడెం: పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని భద్రాచలం ఐటీడీఏ ఏసీఎంఓ రమణయ్య , స్పెషల్ ఆఫీసర్ ఎస్.వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని చిరుమళ్ల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల హెచ్ఎం జగన్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వీధి కుక్కల స్వైరవిహారం
పాల్వంచరూరల్/ఇల్లెందు : జిల్లాలో శుక్రవారం వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. పాల్వంచ మండల పరిధిలో ఏడుగురిని కాటేయగా, ఇల్లెందు పట్టణంలో ఇంటి ఆవరణలో కట్టేసి ఉన్న మేకలపై దాడి చేసి 9 పిల్ల లను చంపేశాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుక్కకాటు బాధితులకు పాల్వంచ ఏరియా ఆస్పత్రి, జగన్నాథపురం పీహెచ్సీలో చికిత్స అందించారు. జగన్నాథపురం గ్రామానికి చెందిన జర్పుల దుర్గాప్రసాద్ – లలిత దంపతుల 16 నెలల చిన్నారి భానుశ్రీ ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా కుక్క కాటు వేసింది. అదే గ్రామంలోని జామాయిల్ తోటలో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సాద్విక్, ప్రతిభ, రంగాపురం గ్రామానికి చెందిన సురేష్, పూసుగూడేనికి చెందిన తులసీరాం, ఉప్పుసాకకు చెందిన నాలుగేళ్ల సుచిత, పాల్వంచకు చెందిన హేమంత్ కుక్కల దాడిలో గాయపడ్డారు. మేక పిల్లలను హతమార్చిన కుక్కలు ఇల్లెందు పట్టణంలోని 15 నంబర్ బస్తీకి చెందిన శంకర్పాసి 50 మేకలను అడవికి తీసుకెళ్లగా, 9 పిల్లలను కొట్టంలో కట్టేసి ఉంచాడు. వాటికి కాపలా ఉన్న కుటుంబ సభ్యులు మధ్యాహ్న భోజనం చేసేందుకు ఇంట్లోకి వెళ్లగా, కుక్కలు దాడి చేసి 9 పిల్లలను చంపేశాయి. చనిపోయిన మేక పిల్లల విలువ సుమారు రూ. 50 వేలు ఉంటుందని శంకర్ పాసీ చెప్పాడు. -
ఐదుగురికి ఏడాది జైలుశిక్ష
కొత్తగూడెంటౌన్: చేతబడి చేశారనే నెపంతో ములకలపల్లికి చెందిన కేసరి రామచంద్రంపై దాడి చేసి కొట్టిన ఐదుగురు వ్యక్తులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ బత్తుల రామారావు శుక్రవారం తీర్పు చెప్పారు. తీర్పు వివరాలు ఇలా.. ములకలపల్లి మండలం ముగురాళ్లగొప్ప గ్రామానికి చెందిన గుండె రమేష్ కూతురు అనారోగ్యంతో బాధపడుతుండగా చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తిప్పాడు. 2017, జూలై 5న చికిత్స కోసం సత్తుపల్లికి వెళ్లొస్తుండగా మృతి చెందింది. దీంతో అదే గ్రామానికి చెందిన కేసరి రామచంద్రం చేతబడి చేయడంతోనే తన కూతురు మృతి చెందిదంటూ అదే రోజు రాత్రి రమేష్ దాడికి దిగాడు. రమేష్‌తోపాటు గుండె నాగరాజు, గుండె వెంకటేష్, గుండె రాజేష్, గుండు శ్రీను, గుండి భద్రయ్య మూకుమ్మడిగా వచ్చి కర్రలు, గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో రామచంద్రం దంతాలు ఊడిపోయాయి. ఈ ఘటనపై గ్రామానికి చెందిన కేసరి శ్రీను 2017, జూలై 6న ములకలపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. విచారణ సమయంలో గుండి భద్రయ్య మృతి చెందాడు. ఆరుగురు సాక్షుల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో మిగిలిన ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. 143,147,148 సెక్షన్ల కింద నెల చొప్పున, 324 సెక్షన్ కింద సంవత్సరం, 342, ఆర్/డబ్ల్యూ, 149/ఐపీసీ సెక్షన్ కింద ఆరు నెలల చొప్పున శిక్షతోపాటు రూ.1300 జరిమానా విధించారు. శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ ఏ.రాజారాం వాదించగా, నిర్వహించగా వీరబాబు, హరిగోపాల్, కోర్టు పీసీ బిక్కులాల్ సహకరించారు. -
నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
కొత్తగూడెంటౌన్: నకిలీ కరెన్సీ నోట్లు చెలామణీ చేసేందుకు వచ్చిన ఓ ముఠా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో టీ తాగేందుకు వచ్చి పోలీసులకు పట్టుబడింది. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. శుక్రవారం వన్‌టౌన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గురువారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ఎస్ఐ టి.లచ్చయ్య తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కారులో ఆ ప్రాంతానికి వచ్చిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా, పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారు జూలూరుపాడు మండలం కొమ్ముగూడేనికి చెందిన బానోతు భోజ్యానాయక్, ఖమ్మం జిల్లా వేంసూరు మండలానికి చెందిన తనమల్ల రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమలంక గ్రామానికి చెందిన బీరెపల్లి రాంబాబు, కొత్తగూడెం బాబుక్యాంప్‌నకు చెందిన జలమని భాస్కర్‌గా తేలింది. ఈ నలుగురు కారు ఓనర్ చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీకి చెందిన పున్నం ప్రసాద్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు నకిలీ కరెన్సీ నోట్లు చెలామణీ చేయాలని పథకం వేసుకున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెం మార్కెట్ ఏరియాలో నకిలీనోట్లు చెలామణీ చేసేందుకు బయల్దేరిన నలుగురు టీ తాగేందుకు బస్టాండ్ సెంటర్‌కు వచ్చారు. అనుమానాస్పదంగా వ్యవహరించి పోలీసులకు పట్టుబడ్డారు. కారులో తనిఖీ చేయగా రూ.3 లక్షల నగదు, దొంగనోట్లు తయారు చేయడానికి ఉపయోగించే యాసిడ్ బాటిళ్లు, నల్లపేపర్ బండిళ్ల కట్టలు 5, చిన్న పిల్లలు ఆడుకునేందుకు ఉపయోగించే 500 నకిలీ నోట్ల కట్టలు 33 లభ్యమయ్యాయి. కారుతోపాటు నగదు, నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా కారు ఓనరు పున్నం ప్రసాద్ పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో వన్‌టౌన్ సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై టి.లచ్చయ్య, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, ఘని, సురేష్, వీరన్న, కామేష్ తదితరులు పాల్గొన్నారు. -
డీజిల్ ట్యాంకర్ బోల్తా
దమ్మపేట : మండల పరిధిలోని ముష్టిబండ గ్రామశివారులో డీజిల్ ట్యాంకర్ బోల్తాపడిన సంఘటన శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ట్యాంకర్ నుంచి డీజిల్ కారిపోతుండగా స్థానికులు, వాహనదారులు బిందెలు, బకెట్లలో నింపుకుని తీసుకెళ్లారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మామకన్ను డీఆర్ఓ సస్పెన్షన్ గుండాల: కాచనపల్లి రేంజ్ పరిధిలోని మామకన్ను సెక్షన్లో వివిధ గ్రామాల నుంచి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో డీఆర్ఓ జాహెదా బేగంను జిల్లా అధికారులు శుక్రవారం సస్పెండ్ చేశారు. సంవత్సర కాలంగా మామకన్ను సెక్షన్ పరిధిలో టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నట్లు, కార్పెంటర్ల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఎద్దులు అపహరణ దుమ్ముగూడెం: మండలంలోని వర్క్‌షాపు, కమలాపురం గ్రామాల్లో ఇద్దరు రైతులకు చెందిన మూడు ఎద్దులను దొంగలు అపహరించిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వర్క్‌షాపు గ్రామానికి చెందిన సునీల్ ఎద్దును బయటకట్టేసి ఉంచగా, అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. కమలాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన రెండు ఎద్దులను కూడా అపహరించినట్లు తెలిసింది. కాగా ఎద్దుల అపహరణపై బాధితులు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. పురుగుల మందు తాగి వ్యక్తి మృతి జూలూరుపాడు: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటనపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. హెడ్‌కానిస్టేబుల్ కొమరం వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మండలంలోని మాచినేనిపేటతండాకు చెందిన వాంకుడోత్ సేవియా(35) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పలుమార్లు ఆస్పత్రికి తీసుకెళ్లినా నయంకాలేదు. భరించలేని కడుపునొప్పి వస్తుండటంతో చనిపోతానంటూ తరచూ కుటుంబ సభ్యులకు చెబుతుండేవాడు. దీంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తామంటూ కుటుంబ సభ్యులు మనోధైర్యం కల్పిస్తున్నారు. కాగా గురువారం కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికే సేవియా పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిఉన్నాడు. దీంతో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య వాంకుడోత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడి ఆత్మహత్యాయత్నం పాల్వంచరూరల్: యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన ధర్మసోత్ విజయ్ గురువారం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కుటుంబసభ్యులు గమనించి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం ఖమ్మం తరలించారు. కాగా విజయ్ తండ్రిని సేవాలాల్ ఆలయంలో పూజారిగా నియమిస్తానని అదే గ్రామానికి చెందిన బాబూరావు అనే వ్యక్తి డబ్బులు తీసుకున్నాడు. కానీ పూజారిగా మరో వ్యక్తిని నియమించారు. దీంతో విజయ్ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగగా బాబూరావు గొడవపడి తిట్టాడు. దీంతో మనస్తాపం చెందిన విజయ్ పురుగులమందు తాగాడు. బాధితుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో.. వైరా: అప్పు కోసం తాకట్టు పెట్టిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరానికి చెందిన ఇండ్ల గోపాలరావు 1205 సర్వే నంబర్లోని 242 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి సాదా అగ్రిమెంట్ రాయించుకున్నాడు. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో 11వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన గోపాలరావు నగదు అవసరాల కోసం ప్లాట్ కాగితాన్ని ఓ నాయకుడి వద్ద తాకట్టు పెట్టాడు. అయితే, ఎన్నికల్లో గోపాలరావు ఓడిపోగా, నగదు చెల్లించకపోవడంతో శుక్రవారం సదరు నాయకుడు ప్లాట్ అమ్మిన వ్యక్తి నుంచి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గోపాలరావు వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి పురుగుల మందు తాగాడు. దీంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నాడు. కాగా, ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు రాలేదని తెలిపారు. -
మృత్యుఘంటికలు..
ఈ నెల 8న బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్ వద్ద ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఓ ఇసుక లారీ ఢీకొట్టి పాల్వంచ మండలం బండ్రిగొండ గ్రామానికి చెందిన నెల్లెల రంజిత్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ నెల 20న ఒడిశాలో జామాయిల్ లోడింగ్‌కు వెళ్లిన ట్రాక్టర్ తిరగబడి సారపాకకు చెందిన సున్నం నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే నెలలో బూర్గంపాడు మండలం సోంపెల్లి గ్రామం వద్ద జామాయిల్ లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ తిరగబడి దమ్మపేట మండలానికి చెందిన చిక్కినేని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పై ఘటనలను పరిశీలిస్తే వాహనాల యజమానుల అత్యాశ, రవాణా శాఖ, మైనింగ్ ఇతర ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం.. వెరసి నిరుపేద కూలీలు, డ్రైవర్ల ప్రాణాలను హరిస్తున్నాయి. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. భద్రాచలం: వాహనాల్లో జామాయిల్ కర్ర, ఇసుక తరలిస్తున్న యజమానులు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలు బోల్తా పడటం, రోడ్డు ప్రమాదాలకు కారణమవడంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. రాత్రి వేళల్లో బైక్‌లను ఢీకొడుతుండటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. జామాయిల్ ఓవర్ లోడింగ్‌తో.. జిల్లాలో సారపాక వద్ద ఉన్న ఐటీసీ పీఎస్పీడీ పేపర్ మిల్లుకు ముడి సరుకుగా అవసరమైన జామాయిల్ పెంపకానికి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలు అనువుగా ఉన్నాయి. దీంతో జామాయిల్ తోటల పెంపకం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. పెంపకం అనంతరం కొట్టిన జామాయిల్ కలపను ట్రాక్టర్ ద్వారా కాంట్రాక్టర్లు, రైతులు ఐటీసీకు తరలిస్తారు. రాజమండ్రి, ఇతర జిల్లాల నుంచి సుమారు రోజుకు 120 నుంచి 150 ట్రాక్టర్లు జామాయిల్‌ను తీసుకొస్తుంటాయి. ఈ తరలించే క్రమంలో నిర్దిష్ట ప్రమాణాల కంటే ఎక్కువ టన్నులు లోడింగ్ చేయటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాస్తవానికి ట్రాక్టర్ వెనుక భాగంలో కేవలం 10 టన్నులను మాత్రమే తరలించాల్సి ఉండగా 15 నుంచి 17 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు. దీంతో వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటమో, ఇతర వాహనాలను ఢీకొట్టడమో జరుగుతోంది. అధికారుల చేతివాటం.. వాహనాల రాకపోకలపై, ఓవర్‌లోడింగ్‌పై నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన రవాణా శాఖ, మైనింగ్, ఇతర సంబంధిత శాఖ అధికారులు నిద్రావస్థలో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రమాదాలు జరిగాక, బాధితులు ప్రాణాలు కోల్పోయాక నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ, జరిమానాలు విధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వరుస సంఘటనల్లో పలువురు మృత్యువాత పడ్డాక నెమ్మదిగా తేరుకున్న రవాణా శాఖ అధికారులు.. గత రెండు రోజుల నుంచి జామాయిల్ ఓవర్ లోడింగ్ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. అయితే భద్రాచలంలోని రవాణా శాఖ కార్యాలయం ముందు నుంచే నిరంతరం ఓవర్ లోడ్‌తో వెళ్తున్న జామాయిల్ ట్రాక్టర్లను పట్టుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక మామూళ్ల మత్తులో జోగే మైనింగ్ శాఖ అధికారులు ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీలను పట్టుకున్న దాఖలాలు లేవు. హైదరాబాద్ నుంచి వచ్చే స్పెషల్ టాస్క్ అధికారులు పట్టుకోవడం తప్ప స్థానిక అధికారులు పట్టుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇసుకాసురులకు కాసులు.. ప్రయాణికులకు యమపాశాలు.. ఇసుకాసురులు లారీల్లో ఇసుక ఓవర్ లోడ్‌తో తరలిస్తున్నారు. వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, మణుగూరులతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక వాహనాలు నిత్యం హైదరాబాద్‌తో సహా ఇతర జిల్లాలకు వెళ్తుంటాయి. వీటిలో ఏ ఒక్క లారీ కూడా రవాణా, మైనింగ్ శాఖ నిబంధనలు పాటించవు. 10 టైర్లు ఉన్న లారీ 20 టన్నులతో వెళ్లాల్సి ఉండగా 25 నుంచి 26 టన్నులు, 12 టైర్ల లారీ 26 టన్నులతో వెళ్లాల్సి ఉండగా సుమారు 32 టన్నులకు పైగానే ఓవర్ లోడ్‌తో తిప్పుతున్నారు. ఇసుక ర్యాంప్, వాహన యజమానులు డబ్బులను పోగు చేసుకుంటుండగా ప్రమాదాలతో రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నవారు మృత్యువాత పడుతున్నారు. ఓవర్ లోడింగ్‌తో వెళ్తున్న లారీ ఇటీవల ఓ వాహనాన్ని క్రాస్ చేస్తూ పినపాక వద్ద ఓ నిరుపేద కూలీ మృతికి కారణమయింది. జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ చిధ్రం అవుతున్నాయి. -
మున్సిపల్ సమస్యలపై నేడు ‘సాక్షి’ ఫోన్ ఇన్
పాల్వంచ: పట్టణ వాసులను కుక్కలు, కోతుల బెడద వేధిస్తోంది. దీనికి తోడు తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్ల సమస్య ఎదుర్కొంటున్న వారు ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా ‘సాక్షి’ సమన్వయం చేయాలని సంకల్పించింది. ఈమేరకు శనివారం ఫోన్ ఇన్ ఏర్పాటుచేయగా పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు పరిష్కారానికి పాటుపడతారు. సీహెచ్.శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ తేది : 25 – 02 – 2023, శనివారం, సమయం : ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ 98499 05884 -
వైద్య పరీక్షలు సక్రమంగా చేయాలి
టేకులపల్లి: పీహెచ్‌సీకి వచ్చేవారికి వైద్య పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని సులానగర్ పీహెచ్‌సీని శుక్రవారం ఆమె తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. ఆశ కార్యకర్తలకు జరుగుతున్న సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ శిక్షణ శిబిరానికి వెళ్లి వారికి దిశా నిర్దేశం చేశారు. అనంతరం కంటివెలుగు కార్యక్రమ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వారందరికీ కళ్లజోళ్లు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. సర్పంచ్‌లు, కార్యదర్శుల సహకారంతో 18 ఏళ్లు నిండిన వారందరినీ కంటివెలుగు శిబిరానికి తరలించి, పరీక్షలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి కందుల దినేష్, అధికారులు అన్నా మేరీ, సీతమ్మ, పీహెచ్ఎన్ సత్యవతి, ట్రైనింగ్ సూపర్వైజర్లు కె.చిట్టెమ్మ, ఎస్.విజయలక్ష్మి, సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, వీసం శకుంతల, అక్బర్, లలిత, నాగలక్ష్మి, అరుణకుమారి, రమేష్‌బాబు పాల్గొన్నారు. -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: మండల పరిధిలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దమ్మతల్లి(కనకదుర్గమ్మ) అమ్మవారికి శుక్రవారం పంచామృతాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా మేళతాళాలతో అమ్మవారి జన్మస్థలం వద్ద పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం మూలవిరాట్ అమ్మవారికి అభిషేకం గావించిన అర్చకులు నివేదన, పంచహారతులు, నీరాజన మంత్రపుష్పార్చన నిర్వహించారు. కార్యక్రమంలో వేద పండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ, దుర్గాప్రసాద్ శర్మ పాల్గొన్నారు. స్వర్ణకవచధారుడైన భద్రాద్రి రామయ్య భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు శుక్రవారంస్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. కాగా, శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, సాయంత్రం దర్బారు సేవ నిర్వహించారు. 28న కొత్తగూడెం క్లబ్లో జాబ్‌మేళా సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం క్లబ్లో ఈనెల 28న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వేల్పుల విజేత తెలిపారు. విప్రో, అపోలో ఫార్మసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ముత్తూట్ గ్రూప్, గూగుల్ పే, ఎయిర్టెల్, వరుణ్ మోటార్స్, కియో మోటార్స్, ఎల్ఐసీ, ప్లిఫ్‌కార్డ్ తదితర సంస్థల్లో సుమారు 3 వేలకు పైగా ఖాళీల భర్తీకి ఈ జాబ్‌మేళా ఏర్పాటుచేసినట్లు వివరించారు. ఆసక్తి గల నిరుద్యోగులు అన్ని సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరుకావాలని సూచించారు. -
దివ్యాంగులు స్వశక్తితో ఎదగాలి
కొత్తగూడెంటౌన్: దివ్యాంగులు స్వశక్తితో ఎదగాలని కలెక్టర్ అనుదీప్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు అన్నారు. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీఎస్సార్ నిధులతో దివ్యాంగుల కోసం కొనుగోలు చేసిన సహాయ ఉపకరణాలను కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనిషి ఎదుగుదలకు వైకల్యం అడ్డుకాదని, అంగవైకల్యాన్ని అధిగమించి అందరితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. దివ్యాంగులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తోందని చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో సహాయ పరికరాలు కావాలని దివ్యాంగులు వినతులు ఇస్తున్నారని, వాటి ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో 405 మందికి వివిధ రకాల పరికరాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈసీఐఎల్ కంపెనీ దివ్యాంగులకు అవసరమైన పరికరాలను ఇచ్చేందుకు ముందుకురావడం హర్షణీయమని అన్నారు. రూ.40 లక్షల సీఎస్సార్ నిధులతో 741 సహాయ పరికరాలను అందజేసినట్లు వివరించారు. జిల్లాలో 30,173 మంది దివ్యాంగులు ఉండగా, వారిలో 18,051 మంది శారీరక దివ్యాంగులు, 3,715 మంది మూగ, చెవిటి వారు, 4,314 మంది మానసిక దివ్యాంగులు, 4,093 మంది అంధులు ఉన్నారని తెలిపారు. వారిలో 407 మందిని ప్రస్తుతానికి ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనీనా, ఈసీఐఎల్ అడిషనల్ జనరల్ మేనేజర్ మునికృష్ణ, ఈసీఐఎల్ సీనియర్ వైద్యాధికారి విఽశ్వనాథరెడ్డి, పర్సనల్ అథికారి సునీల్‌కుమార్, సీనియర్ మేనేజర్లు రాజేష్, కె.శ్రీనివాసరావు, యూనిట్ మేనేజర్ బాలకృష్ణ, స్థానిక కౌన్సిలర్ లక్ష్మణ్, దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండపనేని సతీష్ పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేస్తాం సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని మార్చి 15 వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఫ్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాలు లేకుండా నిర్మించిన ఇళ్ల సమాచారం సేకరణ, కంటి వెలుగు, రెండు పడక గదుల ఇళ్లు, ఆయిల్‌పామ్ సాగు తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. ఈ సందర్భంగా అనుదీప్ మాట్లాడుతూ.. జిల్లాలో 16,860 ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలని లక్ష్యం కాగా, ఇప్పటికి 13,575 ఎకరాల్లో పూర్తి చేశామని, మిగిలిన 3,285 ఎకరాల్లో వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామని వివరించారు. మొక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కంటి వెలుగు పరీక్షల నిర్వహణలో రీడింగ్ అద్దాలను తక్షణమే పంపిణీ చేస్తున్నామని, ప్రిస్కిప్షన్ కంటి అద్దాలు పంపిణీ చేసిన వివరాలను పోర్టల్‌లో నమోదు చేస్తామని చెప్పారు. లబ్ధిదారులకు మార్చిలో క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. చెప్పారు. పోడు పట్టాల జారీకి జిల్లా స్థాయిలో కమిటీ వేసి, పట్టాల ముద్రణ ప్రక్రియ చేపట్టామని చెప్పారు. జిల్లాలో పోడు పట్టాల జారీ ప్రక్రియ, కంటి వెలుగు కార్యక్రమాల నిర్వహణ తీరును సీఎస్ అభినందించారు. సమావేశంలో డీఎఫ్ఓ రంజిత్ నాయక్, అదనపు కలెక్టర్ కె. వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, ఉద్యాన అధికారి మరియన్న, వ్యవసాయాధికారి అభిమన్యుడు, డీఆర్ఓ అశోకచక్రవర్తి, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓలు స్వర్ణలత, రత్నకళ్యాణి, ఆర్ఔఫ్ఆర్ డీటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని తపన!
ఖమ్మంక్రైం: ప్రపంచంలో అతి ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనేది ఆ యువకుడి తపన. కానీ శిక్షణ పొందేందుకు ఆర్థిక స్థోమత లేదు. దీంతో చోరీల బాట ఎంచుకున్న ఆయన చివరకు పోలీసులకు పట్టుబడగా భారీ మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు వివరాలను ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ శుక్రవారం వెల్లడించారు. ఖమ్మం అర్బన్ మండలం పాండురంగాపురానికి చెందిన సంపటి ఉమాప్రసాద్‌కు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనేది కల కాగా, జిమ్‌కు వెళ్తూ దేహదారుఢ్యంపై శ్రద్ధ వహించేవాడు. అయితే, పర్వతాలు అధిరోహించడానికి ప్రత్యేక శిక్షణ అవసరమని, అందుకోసం డబ్బు చాలా ఖర్చవుతుందని తెలుసుకున్నాడు. దీంతో ఆయన డబ్బు సంపాదనకు దొంగతనాలే మార్గమని నిర్ణయించుకున్నాడు. రెండేళ్ల నుంచి ఉదయమంతా డాబుసరిగా తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి వేళ చోరీలకు పాల్పడేవాడు. ఖానాపురం హవేలీ పోలీసుస్టేషన్ పరిధిలో ఆరు, ఖమ్మం టూటౌన్ పరిధిలో రెండిళ్లలో దొంగతనాలు చేశాడు. దొంగిలించిన సొత్తులో నగదు, బంగారు ఆభరణాలు ఉండటంతో వాటిని అమ్మి సొమ్ము చేసుకున్నాక ఎవరెస్ట్ అధిరోహణకు శిక్షణ తీసుకోవాలని భావించాడు. ఈక్రమంలోనే జిల్లా కేంద్రంలో చోరీలు పెరుగుతుండడంతో పోలీసులు నిఘా ఏర్పాటుచేయగా, శుక్రవారం ఉదయం బైపాస్ రోడ్డులో సీసీఎస్, ఖమ్మం టూ టౌన్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఉమాప్రసాద్ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల వ్యవహారం బయటపడింది. ఈ సందర్భంగా నిందితుడి నుంచి రూ.42లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వారియర్ వెల్లడించారు. దారి దోపిడీ ముఠా అరెస్టు ఖమ్మం రూరల్ సబ్ డివిజన్లోని రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్‌ల్లో జల్సాల కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బైక్‌లపై వెళ్తున్న వారిని బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న ఏడుగురి ముఠాను కూడా పోలీ సులు అరెస్టు చేశారు. పొన్నెకల్ క్రాస్ రోడ్డు వద్ద చేపట్టిన తనిఖీల్లో పగడాల విజయ్ అలియాస్ చంటి, ధంసలాపురానికి చెందిన సాదెం లక్ష్మీనారాయణ, దానవాయిగూడెంకు చెందిన షేక్ సైదులు, ఖమ్మంకు చెందిన షేక్ షబాజ్ అలియాస్ సిద్ధిఖీ అలియాస్ షాబు, బోనకల్ మండలం చినబీరవెల్లికి చెందిన పాకాలపాటి ధర్మతేజ, ఖమ్మం ప్రకాష్ నగర్‌కు చెందిన షేక్ పర్వేజ్, రామన్నపేటకు చెందిన పసుపులేటి సాయిగా వృత్తిరీత్యా ఆటో, కారు డ్రైవర్లుగా పనిచేస్తుండగా, కొందరు పంక్చర్ షాపులు నడుపుతున్నారు. అయితే, జల్సాలకు పడిన వీరు ముఠాగా ఏర్పడి శివారు ప్రాంతాలలో ఒంటరిగా వెళ్లే జంటలను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. ఈక్రమంలో 16 కేసుల్లో నిందితులైన వీరిని అరెస్టు చేసి రూ.7.50లక్షల విలువైన ఆభరణాలు, రూ.14.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.67లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్న సీసీఎస్, ఖమ్మం నగర, రూరల్ పోలీసులను సీపీ వారియర్ అభినందించి క్యాష్ అవార్డులు అందజేశారు. ఈసమావేశంలో అడిసనల్ డీసీపీ సుభాష్‌చంద్రబోస్, ఏసీపీలు రవి, గణేష్, బస్వారెడ్డి, సీఐలు శ్రీధర్, రామకృష్ణ, జితేందర్‌రెడ్డి, ఎస్సైలు వెంకటకృష్ణ, వరాల శ్రీనివాస్, సురేష్, గిరిధర్‌రెడ్డి, సిబ్బంది గజేంద్ర, చట్టు శ్రీనివాస్, లింగయ్య, కోలా శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అర్ధాకలి చదువులు
బూర్గంపాడు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇళ్ల దగ్గరి నుంచి కొందరు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తెచ్చుకుంటుంటే, మరికొందరు లంచ్ బాక్స్‌లు లేకుండానే కాలేజీలకు వస్తున్నారు. భోజనం తెచ్చుకోని వారిలో కొందరు కడుపు మాడ్చుకుంటుండగా, మరికొందరు తోటి విద్యార్థులు తెచ్చుకున్న దాంట్లో భాగం పంచుకుంటున్నారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఈ పథకం అమలుకు రెండేళ్లుగా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారే తప్ప అమలు కావడం లేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలల్లో ఉండే విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేకపోవటంతో నీరసించిపోతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమస్యగా మారింది. ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే వారిలో ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందినవారే. ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు ఇంటి నుంచి కళాశాలకు బయలుదేరాలి. కూలీ పనులకు వెళ్లే తల్లిదండ్రులు వీరికి లంచ్‌బాక్స్ కట్టి ఇవ్వటం కొంత ఇబ్బందికరంగానే మారింది. ఒకరోజు లంచ్ బాక్స్ ఇస్తే, రెండురోజులు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. లంచ్‌బాక్స్ సిద్ధం చేసేందుకు సమయం లేకపోవటం, కొందరికి ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతో చాలామంది విద్యార్థులు ఉదయాన్నే ఇంటి వద్ద భోజనం చేసి లంచ్ బాక్స్‌లు లేకుండానే కళాశాలలకు వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్ధాకలితో చదువులను కొనసాగిస్తున్నారు. కొందరు మంచినీళ్లతోనే కడుపు నింపుకుంటున్నారు. కొంతమంది మిత్రులు తెచ్చిన భోజనాన్ని పంచుకుంటుండగా, అది ఇద్దరికీ సరిపోవడం లేదు. కౌమార దశలో ఉన్న విద్యార్థులు కడుపునిండా తినకపోవటంతో అనారోగ్యం పాలవుతున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగింది. విద్యార్థులు పగలంతా కళాశాలలో ఉండాలంటే ఒంట్లో సత్తువ ఉండాలి. అందుకు సరిపడా ఆహారం తీసుకోవాలి. ప్రాక్టికల్స్, ప్రీ ఫైనల్ పరీక్షలపై దృష్టి పెట్టాల్సిన సమయమిది. ఈ తరుణంలో అయినా విద్యార్థులకు కనీసం స్నాక్స్ అందిస్తే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు : 14 ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు : 2,991 ద్వితీయ సంవత్సర విద్యార్థుల సంఖ్య : 2,622 ఇబ్బందులున్న మాట నిజమే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు కాక ఇబ్బందులున్న మాట నిజమే. కొందరు విద్యార్థులు ఇంటి నుంచి లంచ్‌బాక్స్‌లు తెచ్చుకోవటం లేదు. మధ్యాహ్న భోజనం లేకపోవటంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా రెసిడెన్షియల్ కాలేజీల వెపే మొగ్గుచూపుతున్నారు. – సులోచనరాణి, డీఐఈఓ లంచ్ బాక్స్ కోసం ఉంటే ఆలస్యమవుతుంది కళాశాలకు సకాలంలో వెళ్లాలంటే ఉదయం 8.30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాలి. ఆ సమయానికి రోజూ లంచ్‌బాక్స్ తయారు కాదు. అప్పటికే ఇంట్లో ఏది ఉంటే అది తిని హడావుడిగా బయలుదేరుతున్నాం. లంచ్ బాక్స్ తెచ్చుకోని రోజు మధ్యాహ్నం బాగా ఆకలేస్తుంది. నీళ్లు తాగి సాయంత్రం వరకు ఆలాగే ఉంటాం. – అక్షయ్‌కుమార్, సారపాక ఆర్థిక ఇబ్బందులతో బాక్స్ తేవడం లేదు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో లంచ్ బాక్స్ తెచ్చుకోవటం లేదు. ఉదయాన్నే ఇంటి దగ్గర తినివస్తా. మళ్లీ సాయంత్రం ఇంటికి వెళితేనే తినేది. ఫ్రెండ్స్ తినమంటారు. కానీ నాకు ఆకలిగా లేదని చెబుతా. కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే బాగుంటుంది. – శెనగ లహరి, వెలేరు -
కల్తీ ఫుల్లు..తనిఖీలు నిల్లు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిఘా నిద్ర పోతుంటే దగా దండుకుంటోంది అన్నట్టుగా మారింది జిల్లాలో మద్యం అమ్మకాల పరిస్థితి. ముఖ్యంగా పాల్వంచ కేంద్రంగా మద్యం సిండికేట్ పేరుతో యథేచ్ఛగా మద్యాన్ని కల్తీ చేస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెట్టడంతో పాటు ఆరోగ్యానికీ హాని కలిగిస్తున్నారు. కల్తీకి తెరలేపారు.. బెల్ట్‌షాపుల్లో మద్యం అమ్మడం ఎక్సైజ్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఒకసారి బెల్ట్‌షాపులకు మద్యం తరలిందంటే దాని క్వాలిటీ, ధర గురించి అడిగేవారే ఉండరు. అందినకాడికి దోచుకోవడమే ‘బెల్ట్’ నిర్వాహకుల లక్ష్యం. దీంతో మద్యం సిండికేట్ తమ గల్లాపెట్టెను మరింత వేగంగా నింపుకునేందుకు అధిక ధరలకు తోడుగా మద్యం కల్తీకి పాల్పడుతోంది. బెల్ట్‌షాపులకు తరలించే మద్యం బాటిళ్లలో నాసిరకం స్పిరిట్‌ను కలపడం, ఎక్కువ ధర కలిగిన లిక్కర్ బ్రాండ్ సీసాలో తక్కువ ధరకు లభించే మద్యాన్ని కొంత మేర కలిపేస్తూ ప్రత్యేక కౌంటర్లు, ఆటోల ద్వారా బెల్ట్‌షాపులకు ఎలాంటి బెరుకు లేకుండా తరలించేస్తున్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్లతో సరిపెట్టుకుంటుండటంతో ఇక్కడి సిండికేట్ మాఫియా పక్క రాష్ట్రాలకు సైతం కల్తీ మద్యాన్ని తరలించేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు ఏవి.. ఎకై ్సజ్ శాఖ పనితీరులో పారదర్శకతపై నలువైపులా విమర్శలు, ఆరోపణలు వస్తున్నా, పనితీరులో మార్పు రావడం లేదు. తమ ఫోకస్‌ను పూర్తిగా గంజాయి అక్రమ రవాణాపై పెట్టి.. బెల్ట్‌షాపుల దందాను చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. దీనికి ప్రతిఫలం సైతం మద్యం సిండికేట్ నుంచి భారీగా అందుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక వైన్స్, బార్లలో అమ్మే మద్యం నాణ్యతను తరచుగా ఎక్సైజ్ అధికారులు పరీక్షించాల్సి ఉంటంది. వైన్స్, బార్ల నుంచి శాంపిళ్లు సేకరించి ల్యాబుల్లో పరీక్ష చేయించాల్సి ఉంటుంది. పట్టపగలే ఆటోల్లో అక్రమంగా బెల్ట్ దుకాణాలకు మద్యం తరలిపోతుంటే పట్టించుకోని అధికారులు ఇక క్వాలిటీ, కల్తీ గురించి పట్టించుకునేది ఎప్పుడనే విమర్శలు వస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ రావాలి.. గతంలో పాల్వంచ కేంద్రంగా కల్తీ మద్యం రాకెట్ వెలుగు చూసింది. ఆ తర్వాత ఇక్కడ బెల్ట్‌షాపుల్లో అధిక ధరలతో తమ జేబులకు చిల్లులు పెట్టడంపై మద్యం ప్రియుల నుంచి విమర్శలు వచ్చాయి. ఆఖరికి స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి హైదరాబాద్ స్థాయిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గతేడాది స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఇక్కడ ప్రత్యేకంగా దాడులు నిర్వహించి కొందరు ఎక్సైజ్ అధికారులపై వేటు వేసింది. ఫలితంగా కొంతకాలం పాటు సిండికేట్ ఆగడాలకు అడ్డుకట్ట పడింది. కానీ టాస్క్‌ఫోర్స్ దాడులు తగ్గిపోవడంతో మరోసారి లిక్కర్ సిండికేట్ పడగ విప్పడం ప్రారంభించింది. దీంతో సిండికేట్ ఆట కట్టించాలంటే మరోసారి స్టేట్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. సర్వం..బెల్ట్ మయం పాల్వంచ పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా 5 బార్లు, 8 వైన్స్ షాపులు ఉన్నాయి. ఇటీవల మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఇష్టారీతిన మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. గరిష్ట అమ్మకం ధరపై వచ్చే లాభం సరిపోవడం లేదంటూ దొడ్డి దారిన భారీ ఎత్తున మద్యాన్ని బెల్ట్‌షాపులకు తరలిస్తున్నారు. అక్కడ క్వార్టర్ బాటిల్‌పై అదనంగా రూ.20, బీరు బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. పట్టణంలోని గల్లీలతో పాటు మండల పరిధిలోని 36 గ్రామ పంచాయతీల్లో బెల్ట్‌షాప్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ప్రతీరోజు వైన్‌షాపుల్లోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా మద్యాన్ని బెల్ట్ షాపులకు యఽథేచ్ఛగా తరలిస్తున్నారు. పట్టణంలోని వైన్ షాపుల నుంచి కిన్నెరసాని వైపు ఉన్న గ్రామాల సిండికేట్ షాపులకు మద్యం సరఫరా అవుతోంది. పెద్దమ్మగుడి వద్ద గల షాపుల నుంచి జగన్నాధపురం, కేశావాపురం, సోములగూడెం, సంగెం, దంతెలబోర, రంగాపురం, తోగ్గూడెం తదితర ప్రాంతాల్లోని షాపులకు తరలిస్తున్నారు. ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటాం నేను జిల్లాలో కొత్తగా బాధ్యతలు స్వీకరించాను. గతేడాది పాల్వంచ మండలం నుంచి కల్తీ మద్యంపై ఒక ఫిర్యాదు రాగా శాంపిళ్లు సేకరించాం. అందులో కల్తీ ఏమీ తేలలేదు. కల్తీ మద్యంపై ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – జానయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ -
భద్రాద్రి వద్ద గోదావరి ఉధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం/కాళేశ్వరం/వాజేడు: తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు 38.70 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం బుధవారం ఉదయానికి 50 అడుగులకు చేరువైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. చదవండి: మీ వాహనం సేఫ్‌గా ఉండాలా.. వానాకాలంలో ఈ టిప్స్ పాటించాల్సిందే ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వస్తున్న వరదలతో గోదావరి 55 అడుగులు దాటే అవకాశమున్నందని, ముంపు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరించారు. జాలర్లు చేపలవేటకు వెళ్లొద్దని, ప్రజలు వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించొద్దని సూచించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో దుమ్ముగూడెం మండలంలో సున్నంబట్టి–బైరాగులపాడు ప్రధాన రహదారిపైకి వరద భారీగా చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాలలోని సీతమ్మ నారచీరల ప్రాంతం ముంపునకు గురైంది. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో మంగళవారం 9 గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. -
ఒక్కటైన ప్రేమజంట.. దీని వెనక పెద్ద కథే నడిచింది!
సాక్షి,బూర్గంపాడు(భద్రాద్రి): ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని సారపాకలోని రాజీవ్‌నగర్‌లో ఓ యువతి ఆందోళన చేపట్టిన విషయం విదితమే. శనివారం రాత్రి పోలీసుల కౌన్సిలింగ్, ఐద్వా ప్రతినిధుల ఆందోళనలతో ఎట్టకేలకు కథ సుఖాంతమైంది. సారపాక రాజీవ్‌నగర్‌కు చెందిన ఇర్పా నర్మద, అదే కాలనీకి చెందిన బి.కిరణ్‌కుమార్ గత ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే కిరణ్‌కుమార్ పెళ్లికి నిరాకరించటంతో నర్మద ప్రియుడి ఇంటి ఎదుట శనివారం ఆందోళన చేపట్టింది. ఆమె ఆందోళనకు ఐద్వా ప్రతినిధులు మద్దతుగా నిలిచారు. శనివారం రాత్రి పోలీసుల కౌన్సిలింగ్‌తో కిరణ్‌కుమార్ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఐద్వా ఆధ్వర్యంలో బూర్గంపాడులోని రామాలయంలో ప్రేమజంటకు పెళ్లి జరిపించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు సీతాలక్ష్మి, లీలావతి, సున్నం గంగ, జీవనజ్యోతి, పాపినేని సరోజని, జి.రాధ, రమణ, చుక్కమ్మ, సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు పొడియం నరేందర్, కొనకంచి శ్రీని వాస్, గుర్రం సుదర్శన్ పాల్గొన్నారు. చదవండి: గురుకులంలోకి అగంతకుడు.. రాత్రి సమయంలో విద్యార్థుల గదుల్లోకి -
‘బలిదానాలతోనే తెలంగాణ’
సాక్షి,బూర్గంపాడు(భద్రాద్రి): వందల మంది ప్రాణత్యాగం..వేల మంది ఆస్తుల త్యాగంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని, తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కుటుంబంలో ఎంతమంది ప్రాణత్యాగం చేశారో చెప్పాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కొనసాగింది. జిన్నెగట్టు గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వివిధ గ్రామాల్లో సాగింది. ఉప్పుసాక గ్రామంలో జరిగిన రైతుగోస సభలో షర్మిల మాట్లాడుతూ..ఉద్యమ సమయం నుంచి నేటి వరకు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటూ అధికారాన్ని అనుభవిస్తోందని, తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ పాదాల కింద నలిగిపోతోందని ఆరోపించారు. రాజన్న బిడ్డగా ఆశీర్వదిస్తే తిరిగి రాష్ట్రంలో వైఎస్సార్ పాలన తీసుకొస్తామన్నారు. దీక్షలో వైఎస్సార్ టీపీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ గడిపల్లి కవిత, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు నరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా రామయ్య పట్టాభిషేకం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/భద్రాచలం: భద్రాద్రి రామయ్య పట్టాభిషేక మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. మిథిలా స్టేడియం లోని కల్యాణ మండపంలో సీతమ్మవారితో సింహాసనంపై ఆసీనులైన రామయ్యను చూసి భక్తులు తరించారు. ఈ వేడుకకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరై ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆ మె రామాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టాభిషేకం పూర్తయ్యాక భద్రాచలంలో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన గర్భిణుల సీమంతం కార్యక్రమంలో తమిళిసై పాల్గొన్నారు. నేడు కొండరెడ్లతో ముఖాముఖి సోమవారం సాయంత్రం దమ్మపేట మండలం నా చారం గ్రామంలో గుట్టపై ఉన్న స్వయంభూ శ్రీ జగదాంబ సమేత జయలింగేశ్వర స్వామి ఆలయా న్ని దర్శించుకున్న తమిళిసై... మంగళవారం దమ్మ పేట మండలం పూసుకుంట, అశ్వారావుపేట మం డలం గోగులపూడి, రెడ్డిగూడెం గ్రామాలకు చెందిన వెనుకబడిన వందకుపైగా కొండరెడ్ల కుటుంబాల తో పూసుకుంటలో ముఖాముఖి నిర్వహించనున్నారు. 10 నెలల క్రితమే గవర్నర్ ఈ 3 గ్రామాలను దత్తత తీసుకొని గిరి వికాస్, గిరి పోషణ్ పథకాలతో వారికి పౌష్టికాహారం అందించడంతోపాటు కోళ్లు పంపిణీ చేస్తున్నారు. సోమవారం ఉదయం స్థానిక బీజేపీ నాయకులు గవర్నర్‌ను కలి సేందుకు సింగరేణి గెస్ట్‌హౌస్‌కు రాగా బిజీ షెడ్యూల్ ఉందం టూ తమిళిసై సున్నితంగా తిరస్కరించారు. -
సీఎం కేసీఆర్ ఈసారైనా వస్తారా..?
భద్రాచలం: శ్రీరామనవమికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారైనా వస్తారా? ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు పట్టుకొస్తారా? యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తయింది. ఇక భద్రాద్రిపై దృష్టి పెడతారా? రూ.100 కోట్ల అభివృద్ధి ప్రకటనను అమలు చేస్తారా.. అనే ప్రశ్నలు భక్తుల మెదళ్లను తొలుస్తున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక 2016లో తొలిసారిగా సీఎం దంపతులు శ్రీరామనవమి వేడుకలకు హాజరయ్యారు. శ్రీసీతారామచంద్రస్వామి వారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మళ్లీ వేడుకలకు హాజరు కాలేదు. 2017లో స్వామి వారికి సీఎం మనుమడితో పట్టువస్త్రాలు పంపించడమూ, విమర్శలకు దారితీయడమూ తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్లపాటు అంతరాలయంలోనే సీతారాముల కల్యాణం నిరాడంబరంగా జరిపారు. భక్తులను అనుమతించలేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాకపోయినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ ఏడాది వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కల్యాణ ముహూర్తం ప్రకటించినప్పటి నుంచి సీఎం కేసీఆర్ రాకపై చర్చ సాగుతోంది. నిజాం నవాబు తానీషా కాలం నుంచి సంప్రదాయంగా వస్తున్న పట్టు వస్త్రాలు, తలంబ్రాల సమర్పణను ముఖ్యమంత్రి హోదాలో బ్రేక్ చేసిన కేసీఆర్.. ఈ సారైనా వస్తారా? రారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. యాదాద్రి పూర్తైంది.. మరి భద్రాద్రి..? 2016న భద్రాచలం వచ్చిన సీఎం కేసీఆర్ భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయితో మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. అంతటితో ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అదే క్రమంలో యాదాద్రి ఆలయాన్ని మాత్రం శరవేగంగా పూర్తి చేశారు. వందల కోట్ల రూపాయలతో తీర్చిదిద్దారు. యాదాద్రితో పాటే భద్రాద్రి అని అధికారం పక్షం వారు చెబుతున్నా.. అభివృద్ధి అమలుకు నోచుకోవడంలేదు. యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తైన నేపథ్యంలో భద్రాచలం రామాలయంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలని భక్తులు, జిల్లావాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు. స్థానికులు, భక్తుల్లో అసంతృప్తి భద్రాచల రాముడిపై సీఎం కేసీఆర్‌కు చిన్నచూపు ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు విమర్శల దాడి చేస్తున్నాయి. నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భద్రాచలం రామాలయం అభివృద్ధి చేయకపోవడం, ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తిరిగి సాధించలేకపోవడంతో స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ పథకంలో భాగంగా భద్రాచలం, పర్ణశాల ఆలయాలకు రూ.96 కోట్లు ప్రకటించింది. కార్యాచరణ వేగవంతం చేసింది. కల్యాణానికి ముఖ్యమంత్రి, పట్టాభిషేకానికి గవర్నర్లు హాజరు కావడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ హాజరు కాకుండా, గవర్నర్ తమిళిసైతో పాటుగా బీజేపీ మంత్రులు హాజరయితే విమర్శల తాకిడి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఉగాది రోజు సీఎం, గవర్నర్‌కు ఆహ్వానాలు శ్రీ సీతారాముల కల్యాణానికి హాజరు కావాలని దేవస్థానం తరఫున సీఎం, గవర్నర్లకు ఉగాది రోజున ఆహ్వాన పత్రికలు అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా ఏప్రిల్ 2న సీఎం, గవర్నర్లను ఆహ్వానించేందుకు ఈవో, అర్చకులు వెళ్లనున్నారు. 1న దేవదాయ శాఖ మంత్రి చేతుల మీదుగా వాల్ పోస్టర్ ఆవిష్కరించనున్నారు. అనంతరం సీఎం, గవర్నర్‌తోపాటు ఇతర మంత్రులను ఆహ్వానించనున్నారు. -
టీఆర్ఎస్ కారులో కయ్యం.. ఏందబ్బా ఇది!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. ఇప్పటికే కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో ముఖ్య నేతల మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. కాగా ఈ నెల 25వ తేదీ శుక్రవారం పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం మల్లెలమడుగులో చోటు చేసుకున్న సంఘటన జిల్లా రాజకీయాలనే కుదిపేసింది. ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలు 144 సెక్షన్ అమలుకు దారి తీసినా పరస్పర దాడులు మాత్రం తప్పలేదు. సాక్షాత్తు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో ఆయన వర్గీయులు, అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వర్గీయుల మధ్య తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. పాయం వెంకటేశ్వర్లుతో కలిసి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిని ‘రేగా’ అనుచరులతో పాటు పోలీసులూ అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోగా, పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. తనను అడ్డుకున్న పోలీసులతో పాయం వెంకటేశ్వర్లు విభేదించారు. దీంతో 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతంలో ఏఎస్ఐ మోహన్ విధులకు ఆటంకం కలిగించినందుకు పిడమర్తి రవితో పాటు మరో ఐదుగురిపై 188, 143, 353,ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు చందాలు వసూలు చేసి ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అనుమతి లేకున్నా వచ్చి తమపై దాడి చేశారంటూ ఆ పార్టీ ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ఎన్నా అశోక్.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, తుళ్లూరి బ్రహ్మయ్య, గజ్జల లక్ష్మారెడ్డితో పాటు మరో ఎనమిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై 188,143,324,109 ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్.. మల్లెలమడుగులో జరిగిన ఘటన నేపథ్యంలో శనివారం ఉదయం సామాజిక మాధ్యమాల్లో రేగా కాంతారావు.. పొంగులేటి, పిడమర్తి రవిని విమర్శిస్తూ పెట్టిన పోస్టులు హాట్‌టాపిక్‌గా మారాయి. పిడమర్తి రవిని దళిత ద్రోహిగా అభివర్ణించిన ‘రేగా’ పినపాక నియోజకవర్గంలో పొంగులేటికి ఏం పని అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో కార్యకర్తల జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు. కాగా గత ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాజీ ఎంపీ పొంగులేటికి సన్నిహితుడు కావడం, వచ్చే ఎన్నికల్లోనూ పాయం ఇదే పార్టీ నుంచి పోటీకి సన్నద్ధమవుతుండడంతో ఇరువర్గాల మధ్య అంతర్గత పోరు మొదలైంది. ఆది నుంచి పాయం వెంకటేశ్వర్లుకు అండగా ఉంటున్న పొంగులేటిపై ‘రేగా’ విమర్శలకు కారణమిదే అనే ప్రచారం గులాబీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాగా, నియోజకవర్గ స్థాయి యువతతో ఆదివారం రేగా కాంతారావు సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఏ అంశాలు చర్చిస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా.. ఈ వ్యవహారం ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణలు, మార్పులు ఎలా ఉంటాయోననే చర్చ మొదలైంది. నేనో సీనియర్ ఉద్యమకారుడిని. తెలంగాణ ఉద్యమంలో నేను పోషించిన పాత్ర మీ అందరికీ తెలుసు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా సేవలందించా. పినపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అశ్వాపురంలో మాదిగ జేఏసీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ఆవిష్కరణకు నన్ను పిలిచింది. అదే కులానికి చెందిన బిడ్డగా ఈనెల 25న నేను ఆ విగ్రహావిష్కరణకు వెళ్తే పది మంది నాపై దాడి చేశారు. నాతో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును అడ్డుకున్న పోలీసులు మాపై కేసులు నమోదు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రోద్బ లంతోనే ఇదంతా జరిగింది. మాకు జరిగిన అవమానంపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తా. – పిడమర్తి రవి -
భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
-
ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య
-
తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య
అశ్వారావుపేట రూరల్/చండ్రుగొండ: పాఠశాలకని వెళ్లిన బాలిక అదృశ్యమై రెండురోజుల తర్వాత విగతజీవిగా కనిపించింది. ఆమెతోపాటు ఆటోడ్రైవర్ కూడా బలవన్మరణానికి పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. అప్పటికే పెళ్లి అయి ఇద్దరు పిల్లలున్న ఆటోడ్రైవర్, ఆ బాలికను ప్రేమపేరిట మభ్యపెట్టినట్లు తెలుస్తోంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడెంకి చెందిన మాయర సర్వేష్ – కృష్ణవేణి దంపతుల పెద్ద కుమార్తె అనూష(14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన పోరల్ల జగ్గారావు(28) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. గ్రామానికి చెందిన పలువురితో కలసి అనూష కూడా జగ్గారావు ఆటోలో పాఠశాలకు వెళ్లివచ్చేది. ఈ క్రమంలోనే అతడు ప్రేమపేరిట మాయమాటలు చెప్పి ఆమెను వశపర్చుకున్నట్లు సమాచారం. సోమవారం రోజులాగే పాఠశాలకు వచ్చిన ఆమె మధ్యాహ్న భోజన సమయంలో బయటకు వెళ్లి తిరిగిరాలేదు. అయితే, అప్పటికే పాఠశాల బయట వేచి ఉన్న జగ్గారావు ఆమెను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో వారు అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చి కొత్తగూడెం డిపో బస్సు ఎక్కి కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత వారిద్దరూ పురుగుల మందు తాగి వాంతులు చేసుకుంటూ కనిపించడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ రాక ఆలస్యం కావడంతో బస్సులోనే వారిద్దరిని అశ్వారావుపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే పరిస్థితి విషమించి ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం
భద్రాచలం అర్బన్: ప్రభుత్వాస్పత్రిలో వైద్యమంటే సాధారణ ప్రజలే ఒకటికి, రెండుసార్లు ఆలోచిస్తుంటారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్.. తన భార్య మాధవికి ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవం చేయించారు. మంగళవారం రాత్రి పురిటినొప్పులు రాగా, మాధవిని భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి శస్త్రచికిత్స ద్వారా బుధవారం తెల్లవారుజామున 1:19 నిమిషాలకు ప్రసవం చేశారు. మాధవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి శిశువుకు వ్యాక్సిన్ వేశారు. కాగా, మాధవి గర్భం దాల్చినప్పటి నుంచే ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కలెక్టర్ అనుదీప్ ఆస్పత్రిలో కుమారుడిని ఎత్తుకుని మురిసిపోయారు. వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. హరీశ్‌రావు అభినందనలు: కలెక్టర్ అనుదీప్ నిర్ణయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్లో ప్రçశంసించారు. ‘తల్లీశిశువు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. సమర్థుడైన కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. దీంతో ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులే మొదటి ఛాయిస్‌గా మారాయి’ అని ఆయన పేర్కొన్నారు. మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్ కూడా ట్విట్టర్ ద్వారా కలెక్టర్ దంపతులను అభినందించారు. (చదవండి: ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరిన కలెక్టర్ భార్య) చదవండి: అరుదైన బాలుడు.. ప్రతి వెయ్యి మందిలో ఒకరు మాత్రమే ఇలా.. Warmest Congratulations to @Collector_BDD & his wife. I hope both the mother & the child are doing well. It gives us immense pride to see how under the able leadership of CM KCR Garu, state medical infrastructure has proven to be the first choice of people. https://t.co/H7jN2ldMZi— Harish Rao Thanneeru (@trsharish) November 10, 2021 -
నిండా ముంచిన మిర్చి
-
Telangana: ఆ ఊరికి ఏమైంది..?
ఆ ఊరును కిడ్నీవ్యాధి పీడిస్తోంది. అంతుచిక్కకుండా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఆ వ్యాధి సోకి పలువురు మృత్యుకోరల్లో చిక్కుకున్నారు. చాలామంది డయాలసిస్ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వైద్యానికి డబ్బుల్లేక మరికొందరు దీనంగా రోజులు వెళ్లదీస్తున్నారు. ఇదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామపంచాయతీ పరిస్థితి. ఆ గ్రామపంచాయతీ పరిధిలోని పంతులుతండా, టాక్యాతండా, పీక్లాతండా, చీపురుగూడెం, రాచబండ్ల కోయగూడెం, రేగళ్లతండా గ్రామాల ప్రజలు కూడా ఈ వ్యాధితో పోరాడుతున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు కిడ్నీ సంబంధితవ్యాధితో 28 మంది మృతి చెందారు. గత పదిరోజుల వ్యవధిలోనే పంతులుతండాలో గుగులోత్ దేవిజ్యా(58), ధరావత్ వీరు(38) మృత్యువాతపడ్డారు. ఈ పంచాయతీ పరిధిలో 18 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా పడకలు, వసతుల్లేక ప్రైవేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందని బాధితులు అంటున్నారు. – జూలూరుపాడు భద్రాద్రి జిల్లా భేతాళపాడులో అంతుచిక్కని కిడ్నీవ్యాధి ఏడేళ్లుగా ఇదే తంతు... : ఈ పంచాయతీ పరిధిలోని ప్రజలు ఏడేళ్లుగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్నా, పలువురు పిట్టల్లా రాలిపోతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో అంతుపట్టడం లేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017లో ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నామమాత్రంగా స్పందించి, అక్కడి ప్రజల తాగునీటి శాంపిళ్లను పరీక్షించి ఫ్లోరైడ్ సమస్య లేదని తేల్చారు. ఆ తర్వాత కూడా కిడ్నీవ్యాధి నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రజలు ఎందుకు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారనే విషయాలను తేల్చడంలో ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. భేతాళపాడు, పంతులుతండా, టాక్యాతండా, పీక్లాతండా గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య వల్లే కీళ్లు, ఒంటినొప్పులు, కాళ్లవాపులు రావడంతోపాటు కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్లు దయచూపాలె గత నాలుగేళ్లుగా భార్యాభర్తలిద్దరం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాం. డయాలసిస్ చేస్తే చనిపోతావని, బలహీనంగా ఉన్నావని, మందులు వాడమని నాకు డాక్టర్లు చెప్పారు. నా భార్య లక్ష్మి కీళ్లనొప్పులు, ఒళ్లు, నడుము నొప్పుల బాధ భరించలేకపోతోంది. ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లే మాపై దయ చూపాలి. –బానోత్ పరశ్యా, పంతులుతండా వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నా రెండేళ్లుగా మూత్రపిండాలవ్యాధితో బాధపడుతున్నా. వారానికి రెండుసార్లు ఖమ్మం ఆస్పత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నా. నెలకు రూ.20 వేలు ఖర్చవుతున్నాయి. డయాలసిస్ కోసం కొత్తగూడెం, భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే పడకలు ఖాళీగా లేవని డాక్టర్లు అంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్దామంటే డబ్బుల్లేవు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలి. – బానోత్ మంగ్యా, టాక్యాతండా రక్త నమూనాలు సేకరిస్తాం భేతాళపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. బాధితుల రక్త నమూనాలు సేకరించాలని పీహెచ్సీ డాక్టర్‌ను ఆదేశించాం. బ్లడ్ శాంపిల్స్‌ను టీ హబ్‌కు పంపిస్తాం. భేతాళపాడుతోపాటు తండాల్లో నీటి నమూనాలు కూడా సేకరించాలని చెప్పాం. అన్ని శాఖల సమన్వయంతో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. – శిరీష, డీఎంహెచ్‌వో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా -
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు తప్పిన ప్రమాదం
టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు పెను ప్రమాదం తప్పింది. కొత్తగూడెంలో మంగళవారం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న నర్సయ్య, కారులో ఇల్లెందు బయలుదేరారు. ఆయనతో పాటు సోదరుడి కుమారుడు వర్మ ఉన్నారు. టేకులపల్లి మండలం తొమ్మిదో మైలుతండా దాటాక రోళ్లపాడు క్రాస్ రోడ్డు సమీపంలో.. ఇల్లెందు నుంచి ఎదురుగా దూసుకొచ్చిన లారీ డ్రైవర్ ఒక్కసారి బ్రేక్ వేశాడు. దీంతో లారీని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు నాలుగు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో నర్సయ్య కాలు, చేతికి స్వల్ప గాయాలు కాగా, కొత్తగూడెం వైపు వెళ్తున్న కాంగ్రెస్ నాయకుడు చీమల వెంకటేశ్వర్లు తన వాహనంలో గుమ్మడి నర్సయ్యను తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఆయన స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
చిట్టీ డబ్బులివ్వలేదు.. స్థలం రిజిస్ట్రేషన్ చేయలేదు..
పాల్వంచ: కష్టపడి చిట్టీ కట్టగా, డబ్బు ఇవ్వకుండా మోసం చేశారనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాల్వంచలోని జయమ్మ కాలనీకి చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వరరావు (40) దగ్గరి బంధువైన నందిగం భానుకుమార్ వద్ద రూ.25 లక్షల చిట్టీలు రెండు కట్టాడు. చివరి వరకు చెల్లించాక రూ.50 లక్షలు ఇవ్వాలని కోరితే తిప్పుతుండటంతో కేసు పెడుతామని చెప్పాడు. దీంతో బొల్లేరుగూడెం ఏరియాలోని 747 గజాల స్థలాన్ని వెంకటేశ్వరరావుకు రాసిచ్చాడు. కానీ రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేయసాగాడు. ఇదిలా ఉండగా, వెంకటేశ్వరరావుకు తెలియకుండా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెకు చెందిన మరో వ్యక్తికి కూడా ఇదే స్థలాన్ని భానుకుమార్ అగ్రిమెంట్ చేశాడు. చివరికి వీరిద్దరికి కాకుండా మల్లెల దినేష్‌కు రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ స్థలంలో దినేష్ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ విషయమై పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయని సమాచారం. అయినా తనకు న్యాయం జరగడం లేదని భావించిన వెంకటేశ్వరరావు గురువారం రాత్రి ఇంటి వద్దే పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్వరరావు మరణించాడు. కాగా, ఓ ఎమ్మెల్యే కుమారుడు, అధికార పార్టీ నేతలు, పోలీసులు కూడా తనకు న్యాయం జరగకుండా అడ్డుకున్నారని, ఈ కారణంగానే మనస్తాపానికి గురైనట్లు వెంకటేశ్వరరావు పురుగు మందు తాగే ముందు ఎస్పీ పేరిట 43 మంది పేర్లతో రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఈ విషయమై పాల్వంచ ఎస్ఐ రితీశ్‌ను వివరణ కోరగా.. చిటీ డబ్బు విషయంలో మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య శ్రావణి ఫిర్యాదు చేసిందని తెలిపారు. -
నువ్వు సూపరహే.. 67 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో అద్భుతం
భద్రాద్రి: ఈ చిత్రంలో కానిస్టేబుల్ డ్రెస్‌లో ఉన్న యువకుడి పేరు ఆనంద్. ఊరు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కోయ రంగాపురం గ్రామపంచా యతీ పరిధి గుంటిమడుగు. ఈ గిరిజన గ్రామంలో గత 67 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరూ లేరు. తాజాగా బంధం బైరాగి – దుర్గమ్మ దంపతుల కుమారుడు ఆనంద్.. కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకుని మంగళవారం స్వగ్రామానికి వచ్చాడు. అతడిని స్థానికులు, యువకులు ఘనంగా స్వాగతించి సత్కరించారు. – అశ్వారావుపేట రూరల్ -
జోరువానను లెక్కచేయక.. టీకా కోసం తోపులాట..
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్ వద్ద గురువారం తోపులాట జరిగింది. రెండు రోజుల తరువాత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం, దానికి తోడు సిబ్బంది సమయానికి రాకపోవడంతో వ్యాక్సిన్ కోసం ఒక్కసారిగా ప్రజలు దూసుకువచ్చారు. తోపులాటలో పలువురు వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారు. 800 మంది టీకా కోసం రాగా, సాయంత్రానికి 450 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు.– రామన్నపేట కరోనా థర్డ్‌వేవ్ ప్రచారంతో టీకా తీసుకునేందుకు వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి గురువారం వ్యాక్సిన్ కోసం ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జోరువానను కూడా లెక్క చేయకుండా గొడుగులు వేసుకుని మరీ బారులు తీరారు. – బూర్గంపాడు -
Post Cord Day: ఆ పాత ‘ఉత్తరం’ ఎక్కడోపోయింది..
సాక్షి, సుజాతనగర్(భద్రాద్రి కొత్తగూడెం): బంధువుల యోగక్షేమాలు తెలుసుకోవాలన్నా.. స్నేహితులతో కబుర్లు చెప్పుకోవాలన్నా.. ప్రియుడు/ప్రియురాలితో మనసులోని భావాలను పంచుకోవాలన్నా.. సైనికులు తమ కుటుంబాలకు వివరాలు తెలపాలన్నా.. పాత రోజుల్లో పోస్ట్‌కార్డు (ఉత్తరం) ఉండేది. ఆ ఉత్తరాల ద్వారానే అన్ని రకాల సమాచారం చేరవేసుకునేవారు. ఇంటి ముందటికి పోస్ట్‌మ్యాన్ వచ్చి పోస్ట్ అనగానే ఇంటిల్లిపాది అతడి దగ్గరవాలిపోయేవారు. ఉత్తరాలు చదివి.. తిరిగి జవాబు రాసి పంపించి ఎంతో ఆనందించేవారు. నేడు పోస్ట్ కార్డు డే సందర్భంగా ఆ పాత ఉత్తరాన్ని గుర్తుచేశాం. చదవండి: తలకు గన్నుపెట్టి భూమి పత్రాలను రాయించుకున్న ఎస్సై.. -
భద్రాద్రి : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
-
వీళ్లను కన్న బిడ్డల్లా చూసుకుంటా : మహిళా ఎమ్మెల్యే
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన ఇద్దరు అనాథ పిల్లలకు ఎమ్మెల్యే హరిప్రియ అండగా నిలిచారు. భట్టు గణేశ్, స్రవంతి దంపతులు. మూడేళ్ల క్రితం గొంతు కేన్సర్‌తో గణేశ్, మూడు నెలల క్రితం కిడ్నీ సమస్యలతో స్రవంతి మృతి చెందారు. దీంతో వారి పిల్లలు ఏడేళ్ల కృషన్, ఐదేళ్ల హరిప్రియ భారం అమ్మమ్మ నాగమణిపై పడింది. వారి ఇబ్బందులను గణేశ్ మిత్రుడు ఫణి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో వివరించాడు. వెంటనే స్పందించిన కేటీఆర్.. స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ, కలెక్టర్ డి.అనుదీప్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మికి ఈ సమాచారం అందించారు. దీంతో ఎమ్మెల్యే హరిప్రియ చిన్నారుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. పిల్లలను కన్న బిడ్డల్లా చూసుకుంటానని, ఇద్దరికీ విద్య, ఇతర అవసరాలకు సాయం అందిస్తానని, డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వారిని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు. చదవండి: చిన్నారి వైద్యానికి కేటీఆర్ సాయం -
గుడ్లగూబ టవర్ ఎక్కడుందో తెలుసా..
గుబ్బల మంగమ్మ గుహ నాగరక సమాజానికి పెద్దగా పరిచయం లేని ప్రదేశం. దట్టమైన అడవి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ వాగు, ఆ వాగు మధ్యలో ఓ గుహ, ఆ గుహలో ఉన్న దేవత పేరు మంగమ్మ. ఆదివాసీల దేవత. ఈ గుహాలయానికి వెళ్లే దారిలో ప్రయాణించడం సరదాగా మాత్రమే కాదు, విచిత్రంగా కూడా ఉంటుంది. రోడ్డుకు ఒకవైపు తెలంగాణ, మరో వైపు ఏపీ భూభాగం. ఈ ఆలయానికి తెలంగాణ రాష్ట్రం– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే తేడా లేకుండా తెలుగువాళ్లందరూ వస్తారు. ఒకప్పుడు ఆదివాసీలు మాత్రమే కనిపించేవారు. ఇప్పుడు నాగరకులు కూడా వస్తున్నారు. మంగమ్మ దేవతకు ఆదివాసీలు ఆది, గురువారాల్లో మొక్కులు చెల్లించుకుంటారు. ఆ రెండు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రోజుల్లో ప్రశాంతమైన పర్యాటకానికి వేదిక ఈ ప్రదేశం. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌లు పనిచేయవు. దీంతో పర్యాటకులు ఫోన్లను బ్యాగ్‌లో పెట్టేసి కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడుపుతారు. పిక్నిక్కి వచ్చిన వాళ్లు ఇక్కడే వంట చేసుకుని తింటూ ప్రకృతి ఒడిలో రోజంతా హాయిగా గడుపుతారు. ఇది చక్కటి ఎకోటూరిజం పాయింట్ కూడా. జీవ జలపాతం ఈ గుహాలయం పైన ఓ జలపాతం ఏడాదంతా జాలువారుతుంటుంది. వాగులో నీరు ఎప్పుడూ మోకాళ్ల లోతు ఉంటాయి. స్వచ్ఛమైన నీటి ధార కింద తడవకుండా వెనక్కి వస్తే పిక్నిక్ అసంపూర్తిగా ముగించినట్లే. గుడ్లగూబ టవర్ సెల్‌ఫోన్ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి పక్షుల కిలకిలరవాలను ఆస్వాదించడానికి ఏ అడ్డంకీ ఉండదు.ఆలయానికి సమీపంలో తెలంగాణ అటవీశాఖ బేస్ క్యాంప్ ఉంది. గుహాలయాన్ని దాటి మరింతగా అడవి లోపలికి వెళ్తే ఓ గుట్టపై 33 అడుగుల ఎత్తులో వాచ్‌టవర్ ఉంది. పేరు గుడ్లగూబ టవర్. ఈ వాచ్‌టవర్ పైకి ఎక్కితే కనుచూపు మేరలో పెద్ద పెద్ద గుట్టలు, చిక్కటి అడవి కంటికి ఇంపుగా కనిపిస్తాయి. – తూమాటి భద్రారెడ్డి, సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం, గిరివనపర్యాటకం ఆ రాష్టం– ఈ రాష్ట్రం నడిమధ్య నీటి వాగు మంగమ్మ గుహ ఉన్న వాగు రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు అన్నమాట. ఒకవైపు తెలంగాణ, భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా – మరోవైపు ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా. ఆలయం ఉన్న గుహ తెలంగాణ, ఆలయానికి మెట్ల దారి ఉన్న ఆర్చి ఆంధ్రప్రదేశ్. -
ఫారెస్ట్ ఆఫీసర్లను చితకబాది చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు
-
భద్రాద్రి : ఫారెస్ట్ ఆఫీసర్లను కొట్టి.. చెట్టుకు కట్టేసి
సాక్షి, భద్రాద్రికొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ భూములను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అధికారులను గ్రామస్తులు చితకబాదడమే కాక చెట్టుకు కట్టేశారు. ఆ వివరాలు.. దుమ్ముగూడెం మండలంలోని ఢీ కొత్తూరు బీట్ పరిధిలోని చింత గుప్ప గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ భూమిని స్వాదినం చేసుకోవడానికి వెళ్లిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మా పోడు భూమిలోకి మీరు ఎలా వస్తారని అధికారులను అడ్డుకొవడమే కాక వారిని కొట్టి.. చెట్టుకు కట్టేశారు. చదవండి: నల్లవెల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న హెటిరో -
హై టెన్షన్.. 26 మంది కిడ్నాప్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో తిరిగి పుంజుకునేందుకు మావోయిస్టుల ప్రయత్నాలు.. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ముమ్మరంగా కూంబింగ్.. వెరసి మన్యం అట్టుడికిపోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేవళ్లగూడెంలో ఇటీవలి ఎన్కౌంటర్, సరిహద్దున ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో నలుగురు జవాన్లను శనివారం మావోలు హతమార్చిన తాజా ఘటనలతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మావోయిస్టులు ఈ నెల 6వ తేదీన ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం నెలకొంది. మావోలు తమ ప్రాబల్యం పెంచుకునేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్షన్ టీమ్‌లను ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి పంపారు. జూలై 20న మావోయిస్టు పార్టీ కొత్తగా రాష్ట్ర కమిటీని, మరో 12 డివిజన్, ఏరియా కమిటీలను, రాష్ట్రస్థాయి యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసు యంత్రాంగం మావోలను నిరోధించేందుకు నిరంతరం సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ నెల 3న గుండాల ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత హరిభూషణ్ గన్‌మన్, యాక్షన్ టీం కమిటీ సభ్యుడు దూది దేవాల్ అలియాస్ శంకర్ హతమయ్యాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ లేఖలను విడుదల చేసిన మావోయిస్టు ఏరియా, డివిజన్ కమిటీ కార్యదర్శులు ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుండటంతో అవాంఛనీయ, విధ్వంసక ఘటనలు జరగకుండా నిరోధించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. యాక్షన్ టీమ్‌లు సంచరిస్తున్న గోదావరి పరీవాహక జిల్లాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కీలకమైన ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. డీజీపీ పర్యవేక్షణ డీజీపీ మహేందర్‌రెడ్డి నాలుగు రోజులుగా ఆసిఫాబాద్ జిల్లాలోనే మకాం వేసి సెర్చ్ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి పరీవాహక జిల్లాల్లో కూంబింగ్ ఆపరేషన్లు జిల్లా ఎస్పీలు చూసుకుంటున్నారు. సబ్ డివిజినల్ పోలీసు అధికారులు ఏకంగా స్పెషల్ పార్టీ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. కొన్ని నెలల కిందట ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని సబ్ డివిజన్లలో ఎస్డీపీఓలుగా ప్రభుత్వం ఐపీఎస్ అధికారులనే నియమించింది. భద్రాచలంతోపాటు మణుగూరు, ఏటూరునాగారం సబ్ డివిజన్లకు ఐపీఎస్‌లను కేటాయించారు. మరోవైపు మూడు రోజుల కిందట భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జిల్లాల్లో ప్రజాప్రతినిధుల సిఫారసులతో సంబంధం లేకుండా పోలీస్‌బాస్ మార్క్‌తో ఓఎస్డీ, సీఐల బదిలీలు చేశారు. మావోయిస్టు ఆపరేషన్లు చేయడంలో అనుభవం ఉన్న వారిని కీలకమైన ఠాణాలకు కేటాయించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్), సీతారామ ఎత్తిపోతల పథకాలకు పోలీసులు భద్రత మరింత పెంచారు. ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తుండటంతో మావోలు వారిలో కలసిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నాయకులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 26 మంది కిడ్నాప్ నలుగురి హత్య మావోయిస్టులు భద్రాద్రి ఏజెన్సీకి సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని మోటాపోల్, పునాసార్ అనే రెండు గ్రామాలకు చెందిన నలుగురు గిరిజనులను శనివారం పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో హతమార్చారు. ముందుగా ఈ రెండు గ్రామాలకు చెందిన 26 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ప్రజాకోర్టు ఏర్పాటు చేసి ఈ నలుగురిని గొంతుకోసి దారుణంగా చంపారు. ఆరుగురిని విడిచిపెట్టి, మరో 16 మందిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. బలగాలు కూంబింగ్ ఆపరేషన్లను నిలిపేయకపోతే తమ అధీనంలో ఉన్న 16 మందిని హతమారుస్తామని మావోయిస్టులు హెచ్చరించారు. -
నరకయాతన.. పురిటి నొప్పులతోనే..
గుండాల: పురిటి నొప్పులతో ఓ గర్భిణి నరకయాతన అనుభవించింది. మార్గమధ్యలో మల్లన్నవాగులో నీటి ఉధృతి పెరగడంతో ఆమెను అతికష్టం మీద వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈసం సంధ్యారాణి శుక్రవారం తెల్లవారుజాము నుంచి పురిటి నొప్పులతో బాధ పడుతుండగా కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. అయితే రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మార్గమధ్యలోని మల్లన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నొప్పులతో బాధపడుతున్న ఆమెను వాగు దాటించి అప్పటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌లో ఎక్కించి గుండాల ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆపరేషన్ చేయడంతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. -
అమ్మను గెంటేశాడు
బూర్గంపాడు: మాతృ దినోత్సవం నాడే ఓ తల్లి కంటతడి పెట్టింది. ఇంటి నుంచి కొడుకు గెంటేయడంతో మౌన దీక్షకు దిగింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. భద్రాద్రి జిల్లా పరిధిలోని సారపాకు చెందిన అయిలూరి రంగారెడ్డి, వెంకట కోటమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేసేశారు. వృద్ధాప్యంలోనూ ఆ దంపతులు కలిసే ఉండేవారు. రంగారెడ్డి అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. దీంతో కోటమ్మ ఒంటరిగానే ఉంటోంది. కోటమ్మ నివాసం ఉండే ఇల్లు విషయంలో కొడుకు శ్రీనివాసరెడ్డికి, తల్లికి మధ్య విభేదాలు రావడంతో శనివారం తల్లితో శ్రీనివాసరెడ్డి గొడవ పెట్టుకుని ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆదివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తన ఇంటి వద్దే మౌనదీక్షకు దిగింది. -
మర్కటాలకు మహాకష్టం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలోనే అత్యధిక అటవీ ప్రాంతం కలిగి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లాక్డౌన్ కారణంగా జనసంచారం తగ్గి వివిధ రకాల వన్యప్రాణుల పరిస్థితి మెరుగుపడగా, కోతులు మాత్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు, అడవి దున్నలు, అడవి పందులు, కుందేళ్లు ప్రధాన రహదారుల సమీపంలో సైతం స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. వీటి పరిస్థితి ఇలా ఉంటే.. కోతు లు ఆహారం దొరక్క విలవిల్లాడుతున్నాయి. జిల్లాలో కోతులు అత్యధికంగా కొత్తగూడెం–మణుగూరు ప్రధాన రహదారి పక్కన మొండికుంట అటవీ ప్రాంతంలో, కొత్తగూడెం–ఇల్లెందు ప్రధాన రహదారి పక్కన, సారపాక అటవీ ప్రాంతంలో, పాల్వంచ–దమ్మపేట రహదారి పక్కన ములకలపల్లి అటవీ ప్రాంతంలో, కిన్నెరసాని డ్యామ్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణించేవారిలో అధికశాతం మంది కోతులకు నిత్యం ఆహార పదార్థాలను పెట్టేవారు. ఇలా జిల్లాలో సుమారు 20 వేల వరకు కోతులు వాహనదారులు అందించే పండ్లు, ఇతర ఆహార పదార్థాలపై ఆధారపడేవి. లాక్‌డౌన్‌తో జన సంచారం లేక కోతులు ఆహారం కోసం అలమటిస్తున్నాయి. కాగా.. ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవుల్లో అడవి మామిడి, ఇతర ఫలాలు ఆశించిన రీతిలో కాయలేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో రైతుల మామిడి తోటల్లోనూ కాయలు అనుకున్నంతగా కాయలేదు. తునికి కాయలు కూడా అంతంతమాత్రంగానే లభిస్తున్నాయి. దీంతో ఆహారం కోసం కోతులు వివిధ రహదారులపై రోజూ ఎదురుచూస్తున్నాయి. కొన్ని చోట్ల జనావాసాల్లోకి వచ్చి అందిన తిండి ఎత్తుకెళుతున్నాయి. అడపాదడపా కొందరు జంతుప్రేమికులు ఆహారం అందిస్తున్నప్పటికీ అది పరిమితమే కావడంతో రోడ్లవెంబడి మర్కటాలు దీనంగా తిరుగుతున్నాయి. ఎవరైనా వస్తారేమో.. ఏదైనా ఇస్తారేమో అని ఆశగా చూస్తున్నాయి. వేసవి వల్ల అటవీ ప్రాంతాల్లో చిన్న చిన్న కుంటలు సైతం ఎండిపోవడంతో దాహార్తి తీర్చుకునేందుకు కూడా వీలులేకుండా పోయింది. ఆదుకుంటున్న జంతు ప్రేమికులు ఆహారం దొరక్క అవస్థలు పడుతున్న వానరాలను అడపాదడపా జంతు ప్రేమికులు ఆదుకుంటున్నారు. జంతువులను ఆదుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా పలువురు పిలుపునిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉండే కొందరు అప్పుడప్పుడు కోతులకు కూరగాయలు, తినుబండారాలు, పండ్ల వంటి ఆహార పదార్థాలను అందిస్తున్నారు. కాగా.. కోతులు వేల సంఖ్యలో ఉండడం వల్ల జంతు ప్రేమికులు అందించే ఆహారం వాటికి ఏమాత్రం సరిపోవడంలేదు. దీంతో అర్ధాకలితోనే వానరాలు అలమటిస్తున్నాయి. అడవుల్లో తిండి దొరక్క కోతుల గుంపులు సమీపంలోని జనావాసాల్లోకి వచ్చి తినే పదార్థాలు ఎత్తుకుపోవడం, స్థానికులపై దాడి చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వానరాలకు ఆహారాన్ని అందించి ఆదుకోవాలని పలువురు జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
భద్రాద్రిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో 15 రోజులుగా కొనసాగుతున్న వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు బధవారం పూర్ణాహుతితో ముగిశాయి. పూర్ణిమ సందర్భంగా ఆలయంలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బేడా మండపానికి తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులను చేశారు. రోలు, రోకలికి ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచారు. స్వామివారికి ముందుగా చూర్ణోత్సవం, జలద్రాణి ఉత్సవం, నవకలశ స్నపనం జరిపించారు. అనంతరం ఆచార్యులు సుదర్శన చక్రాన్ని శిరస్సుపై ధరించి వైదిక పెద్దలతో కలసి ఆలయంలో ఏర్పాటు చేసిన గంగాళంలో అభిషేకం నిర్వహించారు. చక్రతీర్థంగా అభివర్ణించే ఈ కార్యక్రమం పవిత్ర గోదావరిలో నిర్వహించాల్సి ఉండగా.. కరోనా వైరస్ ప్రభావంతో ఆలయంలోనే అర్చకుల మధ్య నిరాడంబరంగా పూర్తి చేశారు. ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ 12 రకాలుగా ప్రదక్షిణ నిర్వహించి, 12 రకాల ప్రసాదాలను నైవేద్యంగా పెట్టారు. రాత్రికి ఆలయంలోని ఉత్సవ మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ‘ఫృథవీశాంత’ అనే మంత్రంతో మహా కుంభ ప్రోక్షణ నిర్వహించారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అయ్యాయి. కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నేటి నుంచి నిత్య కైంకర్యాలు.. బ్రహ్మోత్సవాలు ముగియడంతో గురువారం నుంచి స్వామివారికి యథావిధిగా నిత్య కైంకర్యాలు, దర్బార్ సేవ, దశవిధ ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. పవళింపు సేవ మాత్రమే నిలిపివేస్తామని చెప్పారు. 16 రోజుల పండుగ రోజున మాత్రమే స్వామివారికి ఏకాంత సేవలు చేస్తామని, ఈనెల 16న నూతన పర్యంకోత్సవం, ఎడబాటు ఉత్సవం ఉంటాయని వివరించారు. -
రాజాధి'రాజ'..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య పట్టాభిషిక్తుడయ్యాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం రామాలయంలో శుక్రవారం ఈ వేడుక నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, దేవస్థానం ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ క్రతువు జరిపారు. ప్రతియేటా శ్రీ సీతారామచంద్ర స్వామివారికి కల్యాణం జరిగిన మరుసటి రోజే, అదే వేదికపై పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. కోవిడ్–19 లాక్డౌన్ కారణంగా ఈసారి కల్యాణ మహోత్సవం మిథిలా స్టేడియంలో నిర్వహించకుండా.. బేడా మండపంలోనే నిర్వహించారు. పట్టాభిషేకం కూడా అక్కడే జరిపారు. భక్తులు లేకుండానే ఈ వేడుక సాగింది. ఉదయం యాగశాలలో చతుస్థానార్చన హోమం నిర్వహించారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన ప్రత్యేక పల్లకీపై వేంచేయింపజేసి బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులను చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను శిరస్సుపై «పెట్టుకుని మండపంలోని స్వామివారికి సమర్పించారు. ఆ తదుపరి అర్చకులు జగదభిరాముడికి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణం శ్రీరామ నామ సంకీర్తనలతో మార్మోగింది. పట్టాభిషేకం భద్రాద్రి రామయ్యకే ప్రత్యేకం ముక్కోటి దేవుళ్లలో ఎవరికీ లేని పట్టాభిషేక యోగం ఒక్క శ్రీరాముడికే సొంతమని పట్టాభిషేక క్రతువు నిర్వహించిన అర్చకులు, వేద పండితులు తెలిపారు. మొదటగా విశ్వక్సేనుడి పూజతో మహా పట్టాభిషేకం ప్రారంభించారు. వేడుకకు వినియోగించే పూజా ద్రవ్యాలకు పుణ్యాహవచనం చేశారు. పట్టాభిషేకానికి హాజరైన ప్రముఖుల హృదయాలు పవిత్రంగా ఉండాలని పుండరీకాక్ష నామస్మరణ చేసి భక్తులకు సంప్రోక్షణ జరిపారు. శ్రీరామ నవమి మరుసటి రోజైన దశమిని ధర్మరాజు దశమి అంటారని, ఈ రోజున పట్టాభిషేకం జరిగితే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని వేదపండితులు పేర్కొన్నారు. పవిత్ర నదీజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత అష్టోత్తర, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చనలతో స్వామివారికి పూజలు జరిపారు. మండపంలో పంచకుండాత్మక–పంచేష్టిసహిత చతుర్వేద హవన పురస్కృతంగా వేదపండితులు క్రతువు నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 12గంటలకు రజిత సింహాసనంపై శ్రీసీతారాముల వారిని పట్టాభిషిక్తుడిని చేశారు. సకల రాజలాంఛనాలతో.. పట్టాభిషేకం సమయాన భక్త రామదాసు చేయించిన దివ్యాభరణాలను శ్రీసీతారామచంద్రస్వామి వారికి అలంకరించారు. ఒక్కో ఆభరణాన్ని భక్తులకు చూపిస్తూ, వాటి విశిష్టతను వివరిస్తూ స్వామివారికి ధరింపజేశారు. స్వర్ణఛత్రం, స్వర్ణపాదుక, రాజదండం, రాజముద్రిక, కత్తి, డాలు, మహా సామ్రాట్ కిరీటాన్ని స్వామివారికి అలంకరింపజేశారు. నాటి మహర్షులు, అష్టదిక్పాలకులు, శ్రీరాముని సేనను గురించి వివరించారు. త్రేతాయుగంలో శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన చైత్ర పుష్యమి ముహూర్తంలోనే భద్రాచలం దివ్యక్షేత్రంలో కూడా పట్టాభిషేకం జరిపించడం ఆనవాయితీ అని వేద పండితులు తెలిపారు. 60ఏళ్లకు ఒకసారి మహా సామ్రాజ్య పట్టాభిషేకం, 12 ఏళ్లకు ఒకసారి పుష్కర ప్రయుక్త పట్టాభిషేకం, ప్రతి ఏటా కల్యాణం మరుసటి రోజు మహా పట్టాభిషేకం నిర్వహించే సంప్రదాయం భక్త రామదాసు కాలం నుంచి కొనసాగుతోందని వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు వివరించారు. పట్టాభిషేకం వీక్షించినవారికి విజయాలు సిద్ధిస్తాయని, అందరికీ మంచి జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా రామాలయ ప్రాంగణం జై శ్రీరామ్, జైజై శ్రీరామ్ అనే నినాదాలతో మార్మోగింది.పట్టాభిషేకం పూర్తైన తర్వాత స్వామివారి అభిషేకంలో ఉపయోగించిన పుణ్యజలాలను భక్తులపై చల్లారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, అర్చకులు పాల్గొన్నారు. -
శ్రీ సీతారాముల కల్యాణం..టీవీలో చూతము రారండి!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/హైదరాబాద్: ఊరూరా.. వాడవాడలా కన్నుల పండువగా జరిగే శ్రీరామ నవమి వేడుకలు గురువారం అత్యంత నిరాడంబరంగా జరగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ప్రత్యేక సూచనలు చేసింది. భక్తులు రాకుండా కేవలం అర్చకులు, దేవాదాయశాఖ అధికారులు, ఒకరిద్దరు ఆలయ ధర్మకర్తల సమక్షంలోనే ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాద్రి విచ్చేసి రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించేవారు. కానీ ఈసారి టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాన్ని చూసి సరిపెట్టుకోవాల్సిందే. ఏటా మిథిలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవా రు. ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములవారి కల్యాణం జరగనుంది. ప్రభుత్వం ప్రతినిధులుగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేయనున్నారు. వేదపండితులు, అర్చకులు, పోలీసు, సాధారణ అధికారులు, ఆలయ ప్రతినిధులు దీనికి హాజరు కానున్నారు. నేడు కల్యాణం.. రేపు పట్టాభిషేకం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణానికి సంబంధించి గురువారం తెల్లవారు జామున రెండు గంటలకే రామాలయం తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాతం నిర్వహించనున్నారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం జరిపి అంతరాలయంలోని ధ్రువమూర్తులకు అభిషేకం జరుపుతారు. తర్వాత «మూలమూర్తులకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రజిత సింహాసనంపై ఆశీనులను చేస్తారు. భక్త రామదాసు చేయించిన దివ్యాభరణాలను అలంకరిస్తారు. వేదికపై ఆశీనులైన శ్రీ సీతారాములకు సంకల్పం చెప్పి సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో జీలకర్ర, బెల్లం స్వామివారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలపై ఉంచుతారు. భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో మాంగల్యధారణ కార్యక్రమాన్ని చేస్తారు. అనంతరం ఎర్రని తలంబ్రాలతో వేడుక నిర్వహిస్తారు. శుక్రవారం శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. అన్ని దేవాలయాల్లోనూ ఇలాగే.. భద్రాచలం శ్రీరామచంద్రస్వామి ఆలయం మొ దలు మారుమూల పల్లెల్లోని దేవాలయాల వర కు కేవలం అన్నిచోట్లా ఆలయ కార్యక్రమంగానే స్వామి కల్యాణాన్ని పరిమితం చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయా న్ని ఇప్పటికే దేవాదాయశాఖ అన్ని దేవాలయాలకు సూచించగా, తెలంగాణ విద్వత్సభ కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. స్వయంగా కల్యాణం లో పాల్గొనాలనుకునే భక్తులు కార్యక్రమాన్ని ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని, ఇతరులను ఆహ్వానించవద్దని అధికారులు సూచించారు. ఈసారి పానకం, వడపప్పు అందించటం, అన్నసంతర్పణ చేయటాన్ని నిషేధించారు. -
బళ్లారి టు భద్రాద్రి.. 637 కి.మీ నడకయాతన
లాక్‌డౌన్‌తో వలస కార్మికులకు అవస్థలు తప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాంతానికి చెందిన సుమారు 20 మంది కూలీలు కర్ణాట క రాష్ట్రం బల్లారిలో రోడ్డు నిర్మాణానికి ఉప యోగించే కంకరను కొట్టే పనులకు వెళ్లారు. లాక్డౌన్ ప్రకటించడంతో పను లు లేక, రవాణా సదుపాయం లేక 637 కిలోమీటర్లు కాలి నడకన పాల్వంచకు బయలుదేరారు. ఆరు రోజుల పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా లను దాటుకుని సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. రామవరం చెక్‌పోస్టు వద్ద వీరిని ఏఎస్సై రామకృష్ణ అడ్డుకుని వివరాలు సేకరించారు. ఏపీలో కరోనా టెస్టులు చేసిన రిపోర్టులను పోలీసులకు చూపించి తమ గోడు విన్నవించుకున్నారు. ఏఎస్సై.. వెంటనే ఆహార పదా ర్థాలు అందించి పాల్వంచకు పంపించే ఏర్పాట్లు చేశారు. లాక్డౌన్ కూలీల బతుకులను ఛిద్రం చేస్తుందనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. – దశరథ్ రజువా, సాక్షి ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం -
ఏ ఉద్యోగం రాదనే మనస్తాపంతో..
సాక్షి, పాల్వంచ: ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని సీతారాంపట్నంకు చెందిన ఎన్ఎండీసీ ఉద్యోగి భాగం మధుసూదన్‌రావు కుమారుడు భరత్‌కుమార్(26) శనివారం ఉదయం పొలం దగ్గర నీళ్లు పెట్టి వస్తానని చెప్పి వెళ్లాడు. మధ్యాహ్నం భోజ నానికి కూడా రాకపోవడంతో తండ్రి మధుసూదన్‌రావు పొలం వద్దకు వెళ్లి చూడగా షెడ్డులో ఇనుపపైపుకు తాడుతో ఉరివేసుకుని ఉన్నాడు. ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. కొడుకు ప్రభుత్వం ఉద్యోగం కోసం అనేక పరీక్షలు రాసినా ఏ ఉద్యోగం రాదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి చేసిన ఫిర్యాదుతో ఎస్ఐ ప్రవీణ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.