నిరసన తెలుపుతున్న బీటీపీఎస్ ఉద్యోగులు
మణుగూరురూరల్: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో బీటీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన నిరసన రెండో రోజుకు చేరుకుంది. శనివారం ఉద్యోగులు డీఈ జనరల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. జెన్కో యాజమాన్య నిర్లక్ష్యం వల్లే పీఆర్సీ ప్రకటనలో జాప్యం జరుగుతోందని చెప్పారు. యాజమన్యం తక్షణమే స్పందించి పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎస్పీఈ జేఏసీ బీటీపీఎస్ రీజియన్ కన్వీనర్ ఎస్.శ్రీనివాసరెడ్డి, నాయకులు వి.ప్రసాద్, రవిప్రసాద్, సత్యనారాయణ, ప్రేమ్‌కుమార్, వీరస్వామి, రాజబాబు, దయాకర్, కె.నర్సింహారావు, అల్తాఫా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment