
పాల్వంచరూరల్/ఇల్లెందు : జిల్లాలో శుక్రవారం వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. పాల్వంచ మండల పరిధిలో ఏడుగురిని కాటేయగా, ఇల్లెందు పట్టణంలో ఇంటి ఆవరణలో కట్టేసి ఉన్న మేకలపై దాడి చేసి 9 పిల్ల లను చంపేశాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుక్కకాటు బాధితులకు పాల్వంచ ఏరియా ఆస్పత్రి, జగన్నాథపురం పీహెచ్‌సీలో చికిత్స అందించారు. జగన్నాథపురం గ్రామానికి చెందిన జర్పుల దుర్గాప్రసాద్ – లలిత దంపతుల 16 నెలల చిన్నారి భానుశ్రీ ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా కుక్క కాటు వేసింది. అదే గ్రామంలోని జామాయిల్ తోటలో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సాద్విక్, ప్రతిభ, రంగాపురం గ్రామానికి చెందిన సురేష్, పూసుగూడేనికి చెందిన తులసీరాం, ఉప్పుసాకకు చెందిన నాలుగేళ్ల సుచిత, పాల్వంచకు చెందిన హేమంత్ కుక్కల దాడిలో గాయపడ్డారు.
మేక పిల్లలను హతమార్చిన కుక్కలు
ఇల్లెందు పట్టణంలోని 15 నంబర్ బస్తీకి చెందిన శంకర్‌పాసి 50 మేకలను అడవికి తీసుకెళ్లగా, 9 పిల్లలను కొట్టంలో కట్టేసి ఉంచాడు. వాటికి కాపలా ఉన్న కుటుంబ సభ్యులు మధ్యాహ్న భోజనం చేసేందుకు ఇంట్లోకి వెళ్లగా, కుక్కలు దాడి చేసి 9 పిల్లలను చంపేశాయి. చనిపోయిన మేక పిల్లల విలువ సుమారు రూ. 50 వేలు ఉంటుందని శంకర్ పాసీ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment