
సాక్షి, భద్రాద్రికొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ భూములను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అధికారులను గ్రామస్తులు చితకబాదడమే కాక చెట్టుకు కట్టేశారు. ఆ వివరాలు.. దుమ్ముగూడెం మండలంలోని ఢీ కొత్తూరు బీట్ పరిధిలోని చింత గుప్ప గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ భూమిని స్వాదినం చేసుకోవడానికి వెళ్లిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మా పోడు భూమిలోకి మీరు ఎలా వస్తారని అధికారులను అడ్డుకొవడమే కాక వారిని కొట్టి.. చెట్టుకు కట్టేశారు.