Thrash
-
భార్య ముందు అంకుల్ అన్నందుకు చితక బాదాడు
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్‌లో రెండు రోజుల క్రితం విచిత్ర సంఘటన జరిగింది. భార్యకు చీరలు కొనడానికి వెళ్లిన రోహిత్ అనే వ్యక్తి షాపు యజమానిని చితకబాదాడు. ఇంతకీ కారణమేంటంటే భార్యతో కలిసి చీరలు కొంటున్న రోహిత్‌కు షాపు యజమాని విశాల్ చాలా చీరలు చూపించాడు. ఎన్ని చీరలు చూసినా రోహిత్ దంపతులు ఒక్కటీ సెలెక్ట్ చేయలేదు. దీంతో విసుగెత్తిన విశాల్ మీకు వెయ్యి రూపాయల రేంజ్లో చీరలు కావాలా అని అడిగాడు. ‘మేం అంతకంటే ఎక్కువ రేంజ్ చీరలే కొనగలం, మమ్మల్ని తక్కువ అంచనా వేయకు’అని రోహిత్ షాపు యజమాని విశాల్‌పై అగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో విశాల్ స్పందిస్తూ ‘అంకుల్ మీకు అన్ని రేంజ్‌ల చీరలు చూపిస్తాను’అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. భార్య ముందు అంకుల్ అనడంతో రోహిత్ కోపం కట్టలు తెంచుకుంది. షాపు నుంచి వెళ్లిపోయి కొద్ది సేపటికి స్నేహితులను వెంటేసుకొచ్చి షాపు యజమాని విశాల్‌ను కర్రలు, బెల్టులతో చితకబాది అక్కడి నుంచి పారిపోయారు. ఇదీ చదవండి: బలవంతంగా ఉమ్మి నాకించారు -
దారుణం: చిన్నారి ఏడుస్తున్నా.. తండ్రిపై కర్రలతో.. వీడియో వైరల్..
చంఢీగర్: పంజాబ్‌లో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వక్తిపై కొందరు యువకులు కర్రలతో దాడి చేశారు. బాధితుని చేతిలో చిన్న కుమారుడు ఉన్నాడనే విచక్షణ కూడా లేకుండా కర్రలతో చితకబాదారు. పక్కనే ఉన్న కుర్రాడు ఏడుస్తున్నా కనికరం లేకుండా బాధితునిపై దాడి చేశారు. ఈ ఘటన పంజాబ్‌లోని మాన్సాలో జరిగింది. ఉదయం సమయంలో బాధితుడు తన పిల్లాడ్ని స్కూల్ వద్ద దింపడానికి బైక్‌పై వచ్చాడు. పాఠశాల వద్ద అలా ఆపాడో లేదో.. అప్పటికే వెంబడించిన కొంతమంది యువకులు అతనిపై దాడి చేశారు. కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. బాధితుడు తిరుగుబాటు చేయకుండా ఓ వ్యక్తి.. అతన్ని బిగ్గరగా పట్టుకున్నాడు. మిగిలిన వ్యక్తులు దాడి చేశారు. పక్కనే ఉన్న బాధితుని కుమారుడు ఏడుస్తున్నా.. నిందితులు పాశవికంగా కొట్టారు. Visuals from Mansa where due to personal rivalry, six people broke both legs of a person who had come to drop his son off at school. They had a previous dispute as well, and earlier also an FIR under section 307 has been registered against them. pic.twitter.com/JEohspw5P8 — Gagandeep Singh (@Gagan4344) August 10, 2023 నిందితులు దాడి చేస్తున్నా పక్కనే ఉన్న అందరూ చూస్తున్నారు తప్పా.. వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. నిందితులు వెళ్లిపోయాక ఓ మహిళ.. బాధితున్ని లేపి ఆస్పత్రికి తరలించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: పంజాబ్‌లో దారుణం.. ఇంట్లో చెప్పకుండా వెళ్లిందన్న కోపంలో ఓ తండ్రి ఘాతుకం -
ఫుడ్ డెలివరీ బాయ్ ఎంట్రీతో సీన్ రివర్స్
Food delivery boy intervenes in lovers spat: ఎక్కడైన ఏదైనా గొడవ జరుగుతుంటే సర్ది చెప్పి గొడవ ఆపేందుకు లేదా సద్దుమణిగేలా చేయడం సహజం. అయితే అలాంటి ఘటనల్లో ఒక్కోసారి మంచి చేద్దామని జోక్యం చేసుకున్నందుకు వాళ్లపైనే తిరగబడిన వాళ్లు ఉంటారు. ఏది ఏమైన ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగానే హ్యండిల్ చేయాలి లేదంటే మంచికిపోతే చెడు ఎదురైందన్న సామెత మాదిరిగా ఉంటుంది. అచ్చం అలాంటి సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఒడిశాలో భువనేశ్వర్‌లోని ఇందిరాగాంధీ పార్క్ వెలుపల ఒక అమ్మాయి తన ప్రియుడితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను తిట్టడం కొట్టడం వంటివి చేసింది. ఇంతలో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేద్దామనుకుంటాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పుడూ ఆ అమ్మాయి ఆ ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ని భయంకరంగా తిట్టడం మొదలు పెట్టింది. ఇక సహనం కోల్పోయిన ఆ వ్యక్తి ఆ అమ్మాయిపై చేయి చేసుకుంటాడు. దీంతో అక్కడ ఉన్న జనం ఒక్కసారిగా షాకై పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ అమ్మాయి గానీ ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్గానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో డీసీపీ ఉమాశంకర్ దాష్ ఆ ఇద్దరి పై కేసు నమోదు చేయమని సంబంధిత పోలీసులను ఆదేశించారు. (చదవండి: చెడు అలవాట్లకు బానిసై... ఆ వ్యక్తి 14 ఏళ్లుగా అక్కడే..) -
‘నన్ను తక్కువ అంచనా వేశావ్’: మృగాడికి చుక్కలు చూపించిన మహిళ
భోపాల్: తనను చెరపట్టబోయిన కామాంధుడి పాలిట అపరకాళికలా మారింది ఆ యువతి. చెప్పు తీసుకుని తన జోలికి వచ్చిన వాడి తుప్పురేగొట్టింది. అంతటితో ఊరుకోక.. రోడ్డు మీద వాడి చేత క్షమాపణ చెప్పించింది. ఆమె తెగువను ప్రశంసిస్తున్నారు జనాలు. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ ప్రాంతానికి చెందిన సదరు మహిళ చాపిహేరా ప్రాంతంలో బ్యూటీపార్లర్ నడుపుతుంది. ఈ క్రమంలో ఆమె రెండు రోజుల క్రితం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా రోడ్డు మీద ఓ వ్యక్తి ఆమెను ఢీకొన్నాడు. ఆ సమయంలో నిందితుడు బాగా తాగి ఉన్నాడు. మహిళను ఢీకొట్టడమేకాక ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెను లైంగికంగా వేధించసాగాడు. సదరు మహిళ ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ మూర్ఖుడు తన బుద్ధి మార్చుకోలేదు. (చదవండి: మహిళ పోలీస్ అధికారి బాత్రూమ్లో కెమెరా.. స్నానం చేస్తుండగా..) ఓపిక నశించిన సదరు మహిళ బస్టాండ్ సమీపంలో.. నడి రోడ్డు మీద ఆ మృగాడిని చెప్పు తీసుకొని కొట్టింది. మత్తు దిగేదాకా చెప్పు దెబ్బలు కొడుతూనే ఉంది. స్పృహ వచ్చి.. పారిపోదామాని భావించిన నిందితుడిను అలాగే పట్టుకుని.. తనకు క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టలేదు. నిందితుడు కింద కూర్చొని.. దండం పెడితే కానీ అతడిని వదలలేదు. (చదవండి: మాట్లాడాలని పిలిచి బాలిక కంట్లో యాసిడ్ పోసి..) చివరగా.. నన్ను తక్కువ అంచాన వేశావ్.. నీలాంటి నీచులకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇంకోసారి కనిపించావో నా చేతుల్లో చచ్చావే అని హెచ్చరించి మరి వదిలిపెట్టింది. ఇక సదరు మహిళ మృగాడిని కొడుతున్న సమయంలో చాలా మంది గుమికూడారు. ఆమె చేస్తున్న పనిని ప్రశంసించారు. చదవండి: మైనర్‌పై లైంగికదాడికి యత్నం: ‘దిశ’తో అరగంటలో నిందితుడు అరెస్ట్ -
ఉబర్ డ్రైవర్‌పై మహిళ దాడి.. ‘నాకిద్దరు సిస్టర్స్ ఉన్నారు’
ఫ్లోరిడా: మధ్య వయస్కురాలైన ఓ నర్సు ఉబర్ డ్రైవర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. అతడి గొంతు పట్టుకుని చితకబాదింది. మహిళ తనను ఇంతలా బాధపెడుతున్న సదరు డ్రైవర్ ఆమె మీద చేయి చేసుకోలేదు. అందుకు అతడు చెప్పిన కారణం ప్రతి ఒక్కరిని కట్టి పడేసింది. ‘‘నాకు ఇద్దరు సోదరీమణలు ఉన్నారు. ఆడవారికి గౌరవం ఇవ్వాలని నా తల్లి నాకు చిన్నప్పటి నుంచి బోధించింది. అవే నేను పాటించాను’’ అన్నాడు. ఇంతకు సదరు నర్స్ అతడిపై ఎందుకు దాడి చేసింది అనేది మాత్ర తెలియలేదు. ఈ సంఘటన ఫ్లోరిడాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతంలో ఈ నెల 17న చోటు చేసుకుంది. ఆ వివరాలు.. మైఖెల్ స్టిల్విల్ అనే లేడీ నర్స్ ఏప్రిల్ 17న సాయంత్రం ఐదు గంటలకు ఉబర్ కారు బుక్ చేసుకుంది. హస్సీ జూనియర్ అనే వ్యక్తి ఆమెను పికప్ చేసుకోవడానికి వచ్చాడు. కారు ఎక్కిన తర్వాత మైఖెల్ నిద్రలోకి జారుకుంది. మెలకువ వచ్చిన తర్వాత సడెన్‌గా హస్సీపై దాడి చేయడం ప్రారంభించింది. వెనక ప్యాసింజర్ సీటులో కూర్చున్న మైఖెల్ నిద్ర నుంచి లేచి.. వెనక నుంచి హస్సీ మెడ పట్టుకుని అతడిని కొట్టడం ప్రారంభించింది. ‘నా కూతురు’ అంటూ అరుస్తూ.. అతడిపై పిడి గుద్దులు కురిపించింది. హస్సీ ఆమె నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు కానీ కుదరలేదు. ఇంతలో మైఖెల్ ముందుకు వచ్చి అతని ఛాతీపై గోళ్లతో గీరింది.. లోతైన గాయం చేసింది. అతడికి ఏమాత్రం తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా దాడి చేసింది. దారిన పోయే వారు దీన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి సదరు నర్స్‌ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హస్పీ మాట్లాడుతూ.. ‘‘ఏం జరిగితే అదే జరుగుతుంది.. నేను మాత్రం ఆమెపై చేయి చేసుకోవద్దని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. పైగా చిన్నతనం నుంచి ఆడవారిపై చేయి చేసుకోకూడదు అనే వాతావరణంలో నేను పెరిగాను. అందుకే ఆమెపై ప్రతి దాడి చేయలేదు’’ అన్నాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో నర్స్ మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చదవండి: మాస్క్ ధరించమన్నందుకు ఉబర్ డ్రైవర్‌పై మహిళ దాడి ఈమె 8 మంది శిశువులను చంపారట! -
ఫారెస్ట్ ఆఫీసర్లను చితకబాది చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు
-
భద్రాద్రి : ఫారెస్ట్ ఆఫీసర్లను కొట్టి.. చెట్టుకు కట్టేసి
సాక్షి, భద్రాద్రికొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ భూములను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అధికారులను గ్రామస్తులు చితకబాదడమే కాక చెట్టుకు కట్టేశారు. ఆ వివరాలు.. దుమ్ముగూడెం మండలంలోని ఢీ కొత్తూరు బీట్ పరిధిలోని చింత గుప్ప గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ భూమిని స్వాదినం చేసుకోవడానికి వెళ్లిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మా పోడు భూమిలోకి మీరు ఎలా వస్తారని అధికారులను అడ్డుకొవడమే కాక వారిని కొట్టి.. చెట్టుకు కట్టేశారు. చదవండి: నల్లవెల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న హెటిరో -
పోకిరీని రఫ్పాడించిన చంచల్
కాన్పూర్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలు, దాడులతో అట్టుడికిపోతోంది. అయితే ఒక మహిళా కానిస్టేబుల్ మాత్రం బాలికలను వేధిస్తున్న ప్రబుద్ధిడికి తగిన శాస్తి చేసిన వైనం ఆకట్టుకుంటోంది. కాన్పూర్, బీతూర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానిక బాలికలు పాఠశాలకు వెళుతున్న సమయంలో ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన మహిళా కానిస్టేబుల్ ఆ పోకిరీని పట్టుకుని రఫ్పాడించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమే బీతూర్ పోలీస్ స్టేషన్‌లోని యాంటీ రోమియో స్క్వాడ్ మహిళా కానిస్టేబుల్ చంచల్ చౌరాసియా. రోమియోల భరతం పట్టే పనిలో ఉన్న చంచల్ అతగాడి కాలర్ పట్టుకుని మరోసారి ఇలాంటి వేధింపులకు గురి చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు. అంతేకాదు బూటు తీసి ఒకటి కాదు రెండు కాదు 22 సార్లు వాయించి పడేసారు. అనంతరం నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. #WATCH A woman constable thrashes a man for allegedly harassing girls on their way to school in Bithur area of Kanpur. (10.12.19) pic.twitter.com/avQpgk73Va — ANI UP (@ANINewsUP) December 11, 2019 -
నడిరోడ్డుపై మహిళను తంతూ..
చండీగఢ్ : అప్పు తీర్చలేదంటూ తన అనుచురులతో కలిసి ఓ మహిళను రోడ్డు మీద దారుణంగా చితకబాదాడో కాంగ్రెస్ నాయకుడి సోదరుడు. వివరాలు.. ముక్త్సర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ రాకేష్ చౌదరి సోదరుడు తన అనుచరులతో కలిసి ఓ మహిళను విచక్షణా రహితంగా కొట్టారు. అప్పు తీర్చే విషయంలో వివాదం తలెత్తడంతో సదరు మహిళను రోడ్డు మీద పడేసి కాళ్లతో తంతూ.. దారుణంగా హింసించారు. మరో మహిళ అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. Muktsar: Woman thrashed by brother of Congress Councillor Rakesh Chaudhary and his aides over a money lending issue. SSP Manjeet Dhesi says 'This is an extremely unfortunate incident, we have arrested 6 ppl and will push for severe punishment.Victim admitted to hospital' #Punjab pic.twitter.com/J5PyfZJoi2 — ANI (@ANI) June 14, 2019 ఈ విషయం గురించి ఎస్ఎస్సీ మంజీత్ దేశి మాట్లాడుతూ.. ‘జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇందుకు బాధ్యులైన ఆరుగురు వ్యక్తులను గుర్తించాం. వారిని కఠినంగా శిక్షిస్తాం’ అని తెలిపారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చినట్లు వెల్లడించారు. -
మహిళపై దాడి.. పోలీసులపై చర్యలు
చండీగఢ్ : మహిళను బెల్ట్‌తో విచక్షణారహితంగా కొట్టినందుకు గాను ఐదుగురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. వివరాలు.. ఫరిదాబాద్‌కు చెందిన ఓ ఐదుగురు పోలీసు అధికారులు.. ఓ మహిళపై దాడి చేశారు. బెల్ట్‌తో విచక్షణారహితంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు దీనిపై స్పందించారు. వీడియోలో ఉన్న అధికారులపై కేసు నమోదు చేయడమే కాక వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్‌ని సస్పెండ్ చేయగా.. మరో ముగ్గురు స్పెషల్ ఆఫీసర్లను విధుల నుంచి తొలగించారు. అంతేకాక సదరు అధికారుల మీద ఆదర్శ నగర్ పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ వీడియో సంవత్సరం క్రితం నాటిదని అధికారులు తెలిపారు. బాధితురాలితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు. Now that's #Faridabad #Police trying to practice #BetiBachao #BetiPadhao ethos. Even if this #woman is guilty of any crime, how justified is the act ? #NCR pic.twitter.com/2tr78SGFrt — PRAVEEN DUTTA (@PraveenDutta) May 28, 2019 -
మోదీ సభలో పోలీసును చితకబాదారు
మిడ్నాపూర్/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్‌లో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘కిసాన్ కళ్యాణ్ ర్యాలీ’లో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు శృతిమించి ప్రవర్తించారు. బందోబస్త్‌లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వాలంటీర్లపై దాడికి యత్నించారు. ర్యాలీ లోకి తమను అనుమితించటంలేదని ఆవేశంతో కర్రలు, రాళ్లతో విరుచుకపడ్డారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి, సుమారు 15 మంది వాలంటీర్లు గాయపడ్డారని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిలో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశామని, మిగతా వారు పార్టీ వాహనాల్లో పరారయ్యారని అధికారులు తెలిపారు. అరెస్టైన వారి నుంచి మిగతావారి వివరాలు సేకరిస్తున్నామని వివరించారు. ఈ ఘటనను స్వపక్ష, విపక్ష సభ్యులు ఖండించారు. ఇలాంటివి మా పార్టీ ప్రోత్సహించదు.. వాలంటీర్లు, పోలీసు అధికారిపై దాడి ఎంతగానో బాధించిందని.. ఇలాంటి చర్యలను తమ పార్టీ ప్రోత్సహించదని పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. మోదీ నిర్వహించిన ర్యాలీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారని, ఆ ఆవేశంలో ఇలా చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వేలాది ప్రజలు పాల్గొన్న ఈ ర్యాలీని పోలీసులు ప్రశాంతంగా వ్యవహరించి విజయవంతం చేశారని, వారికి కృతఙ్ఞతలు తెలిపుతున్నట్లు ఘోష్ తెలిపారు. రాష్ట్రంలో మోదీ అశాంతి వాతావరణం సృష్టించారు.. మోదీ నిర్వహించిన కిసాన్ కళ్యాణ్ ర్యాలీతో రాష్ట్రంలో అశాంతి వాతావరణం నెలకొందని తృణముల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ మేటీ మండిపడ్డారు. జార్ఖండ్, ఒడిశా నుంచి జనాలను రప్పించి రాష్ట్రంలో గొడవలు సృష్టించారని ఆరోపించారు. వాలంటీర్లు, పోలీసులపై దాడిని తీవ్రంగా ఖండించారు. -
మోదీ సభ.. పోలీస్‌ను చితకబాదారు
-
వైఫై ఆఫ్ చేసిందన్న కోపంతో భార్యను...
-
హైదరాబాద్‌లో దారుణం.. వైఫై కోసం భార్యను...
సాక్షి, హైదరాబాద్ : వైఫై కోసం భార్యను చితకబాదాడు ఓ వ్యక్తి. ఆఫ్ చేసిందన్న కోపంతో ఆమెపై పిడిగుద్దులు గుద్దాడు. సోమాజిగూడలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా.. గాయాలపాలైన భార్య ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానా అనే మహిళ తన భర్త అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్లో మునిగిపోతుండటం భరించలేకపోయింది. ఈ క్రమంలో వైఫైను ఆఫ్ చేయటంతో ఆ భర్తకు చిర్రెత్తుకొచ్చింది. ఆమెపై పడి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సుల్తానాను ఆమె తల్లి గురువారం ఉదయం ఆస్పత్రిలో చేర్చింది. సుల్తానా ముఖం, ఛాతీ, తలపై గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సుల్తానా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసే ముందు వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చే యత్నం చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. -
దారుణంగా కొట్టి, వీడియో పోస్ట్ చేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ మహరాజ్ గంజ్‌లో దారుణం చోటు చేసుకుంది. అడవికి వెళ్లిన ఓ జంటపై ముగ్గురు గుండాలు విరుచుకు పడ్డారు. అతిదారుణంగా వీరిద్దరిపై దాడి చేశారు. అంతేకాదు ఈ దృశ్యాలు షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే కట్టెలకోసం అడవికి వెళ్లిన జంటను ఈ దుర్మార్గులు టార్గెట్ చేశారు. వారిని అడ్డుకుని గూండాల్లాగా దాడి చేశారు. ఈ మొత్తం సంఘటనను కెమెరాలో చిత్రించారు. అక్కడితో వీరి దౌర్జన్యం, దురాగతాలు ఆగలేదు. బలవంతంగా బాధితులిద్దర్నీ నగ్నంగా చేసి మరీ వీడియో తీశారు. ఈ సంఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. మోరల్ పోలీసింగ్ ఆరోపణలతోఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
రెచ్చిపోయిన బీజేపీ నేత కుమారుడు
-
రెచ్చిపోయిన బీజేపీ నేత కుమారుడు
రాయ్‌పూర్: తన తండ్రికి రాజకీయ పలుకుబడి ఉందని ఓ బీజేపీ నేత కుమారుడు రెచ్చిపోయాడు. తన ముందు వెళుతున్న రెండు బైక్‌లను క్రాస్ చేసేందుకు ప్రయత్నించి అలా చేయలేక ఆ బైక్ లపై వెళుతున్న వారిపై దాడికి పాల్పడ్డాడు. స్నేహితులతో కలిసి ఆ బైకిస్టులను బురదరోడ్డులో పొర్లించి కొట్టారు. అంతేకాదు తాను చేసిన ఈ ఘనకార్యాన్ని వీడియో రికార్డు చేయడమే కాకుండా దానిని సోషల్ మీడియాలో స్వయంగా పెట్టాడు. ఈ వీడియో ఆధారంగా ఆ నేత కొడుకు, అతడి స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఈ ఘటన గత నెలలోనే జరిగింది. వివరాల్లోకి వెళితే గత ఆగస్టు 15న ఖేర్ కట్టా ప్రాంతంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న మాంథురాం పవార్ కుమారుడు నన్ను పవార్ ఎస్యూవీ వాహనంపై వెళుతున్నాడు. అతడు వెళుతున్న మార్గంలోనే సాధారణంగా ఓ ఇద్దరు యువకులు బైక్ లపై వెళ్లారు. అలా వెళుతున్నవారిని క్రాస్ చేసేందుకు స్నేహితులతో కలిసి వేగంగా ప్రయత్నించినప్పటికీ తొలుత అది వీలుకాలేదు. దీంతో మరోసారి వారిని క్రాస్ చేసి తమనే దాటి ముందుకు వెళతారా అంటూ రెచ్చిపోయిన నన్ను పవార్ బైకర్స్‌పై దాడి చేసి స్నేహితులతో దాడిచేయించాడు. స్వయంగా దీనిని వీడియో తీసి చివరకు అడ్డంగా బుక్కయ్యాడు. -
మహిళా పోలీస్‌కు చిక్కారో ఇక అంతే!
బిహార్: బిహార్ లో ఓ మహిళా పోలీస్ ఆటో డ్రైవర్ దుమ్ము దులిపింది. ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన ఓ ఆటో డ్రైవర్‌ను మెడపెట్టి జీపులో పడేసింది. ఇప్పుడా వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. అసలే దేశంలో మహిళపై ఆకృత్యాలు ఎక్కువవుతున్నాయని పొద్దున లేచినప్పటి నుంచి చదవలేనన్న వార్తలు దర్శనమిస్తున్నాయి. వీటికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు కొత్తకొత్త చట్టాలు పుట్టుకొస్తున్నాయి. ఎన్నో అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు.. పలు విద్యార్థి సంఘాలు కల్పిస్తూనే ఉన్నాయి. అయినా, కూడా కొందరిలో మార్పు మాత్రం రావడం లేదు. ఈవ్ టీజింగ్ అంటే ఒకప్పుడు కాలేజీలకే పరిమితం కాగా.. ఇప్పుడవి రచ్చకెక్కి వీర విహారం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, ప్రజా రవాణ వ్యవస్థలో ఇవి ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడా మహిళా పోలీసుల మోహరింపు కూడా భారీగానే ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా బిహార్‌లోని పాట్నాలో ఈ ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు. ఓ అమ్మాయిపట్ల ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డాడు. అది కాస్త వెళ్లి ఓ మహిళా పోలీసు కంట్లో పడింది. దాంతో ఆమె ఊరుకుంటుందా.. అతగాడి దుమ్ముదులిపింది. నడిరోడ్డుపైనే అపర కాలికలా మారి దెబ్బమీదదెబ్బ కొడుతూ నడవరా స్టేషన్‌కు అంటూ మెడపట్టి జీపులోకి ఎక్కించింది. -
ఈ టైంలో అబ్బాయిలతో తిరుగుతున్నావెందుకని..
పుణె: 'ఎలా నువ్వు పొట్టి దుస్తులు వేసుకుంటావు? ఇంత సమయంలో ఇద్దరు మగాళ్లతో ఎలా తిరగగలుగుతున్నావు? పుణెలో ఇలాంటివి నడవవు' అని ఓ 22 ఏళ్ల యువతిని ఓ గ్యాంగ్ ప్రశ్నించింది. తెల్లవారుతుండగా ఈ ఘటన జరిగింది. అంతేకాదు.. ఆ యువతిని కారులో నుంచి బయటకు ఈడ్చి దాడి చేసింది. అనంతరం గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు గాయాలయ్యాయి. అయితే, ఘటన చోటుచేసుకున్న వారం తర్వాతగానీ పోలీసులు కేసు నమోదుచేయలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తన స్నేహితురాలి వివాహ కార్యక్రమానికి ముందు జరిగే సంగీత్‌లో పాల్గొనేందుకు డ్యాన్స్ రిహార్సల్స్ కోసం ఈ యువతి తన ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లొస్తుండగా ఆమె కారును మరోకారు ఫాలో అయింది. సరిగ్గా తెల్లవారు జామున 5.30గంటల ప్రాంతంలో ఆ కారులోని వ్యక్తులు ఆమె కారు డోర్ కొట్టారు. అనంతరం అందులోకి తొంగిచూశారు. ఆ వెంటనే అనకూడని మాటలు మొదలుపెట్టారు. అలా తిడుతూనే కారులోనే వెంబడించారు. కొద్ది దూరం వెళ్లాక కారును ఆపేశారు. ఆ యువతి స్నేహితుడు జోక్యం చేసుకోవడంతో అతడిపై చేయిచేసుకున్నారు. ఆ వెంటనే ఆ అమ్మాయిని కూడా అసభ్యకరంగా తిడుతూ కొట్టారు. ఈ సందర్భంగా తన స్నేహితులు లేకుంటే బహుషా వారు ఆరోజు తనపై లైంగిక దాడి కూడా చేసేవారని బాధితురాలు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి అమిత్ ముఖ్దేద్ కార్, శుభం గుప్తా అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. -
టికెట్ అడిగినందుకు ఎమ్మెల్యే కొడుకు దాడి
లక్నో: సమాజ్‌వాది పార్టీ నేతలే కాదు.. వారి పుత్ర సంతానం కూడా రౌడీల్లాగానే ప్రవర్తిస్తున్నారు. ఓ షాపింగ్‌మాల్‌లో గార్డుగా చేస్తున్న వ్యక్తిపై ఓ ఎమ్మెల్యే కొడుకు, అతడి స్నేహితులు దారుణంగా దాడి చేశారు. ఏమాత్రం జాలి చూపకుండా పిడిగుద్దులు కురిపించారు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన తీరు మొత్తం సీసీటీవీ పుటేజ్‌లో రికార్డయింది. అసలేం జరిగిందంటే.. లక్నోలోని గోమతి నగర్లో ఓ షాపింగ్ మాల్లోని సినిమా థియేటర్‌కు ఎస్పీకి చెందిన మున్నీ సింగ్ అనే ఎమ్మెల్యే కుమారుడు ఉగ్రసేన్ ప్రతాప్ సింగ్ అతడి స్నేహితులు వెళ్లారు. అయితే, షాపింగ్ మాల్లో ఓ సెక్యూరిటీ గార్డు ఆ సినిమా టిక్కెట్లు చూపించమని అడిగాడు. దీంతో తమనే టిక్కెట్లు అడుగుతావా అంటూ అతడిపై ఉగ్రసేన్, తన స్నేహితులు విరుచుకుపడి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. సీసీటీవీలో ఓ ఎమ్మెల్యే కుమారుడి దౌర్జన్యం స్పష్టంగా కనిపించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ బహదూర్ పాఠక్ నిలదీశారు. ఆ గార్డు చేసిన తప్పేమిటి, అతడు తన విధులను తాను సక్రమంగా చేశాడు అయినా కొడతారా అని ప్రశ్నించారు. -
బైక్‌కు కట్టి వందమీటర్లు ఈడ్చుకెళ్లారు
-
బైక్‌కు కట్టి వందమీటర్లు ఈడ్చుకెళ్లారు
పిలిభిత్: దేశంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువవుతున్నాయి. తమ అరాచకాలను బయటపెడుతున్న విలేకరులకు రక్షణ లేకుండా పోతోంది. డబ్బు అధికార బలం అండచూసుకుని రెచ్చిపోతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో పిలిభిత్ జిల్లాలో ఓ జర్నలిస్టును పిలిచిమరీ దారుణంగా కొట్టారు. బైక్‌కు తాడుతో కట్టి 100 మీటర్లు ఈడ్చుకెళ్లారు. అచ్చం సినిమాల్లో రౌడీల మాదిరిగా వారు ఈ ఘటనకు పాల్పడ్డారు. దీంతో బాధితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం హైదర్ ఖాన్ అనే విలేకరి సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఆనంద్ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాడు. ఓ దొంగతనానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని అతడిని రక్షించేందుకు రావాలని ఫోన్ లో కోరాడు. దీంతో అతడు ఒక్కసారిగా అక్కడికి వెళ్లడంతో నలుగురుకు పైగా అతడిపై దాడి చేసి కారులోంచి బయటకు లాగి.. బైక్ కట్టి వంద మీటర్లు ఈడ్చుకెళ్లారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గతంలో ఇదే జిల్లాలో జగేంద్ర సింగ్ అనే జర్నలిస్టుకు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. -
ఎంపీగారి పిల్లల్ని వాయించారు
న్యూఢిల్లీ: పార్కింగ్ విషయంలో ఘర్షణ తలెత్తి ఓ బీహార్ ఎంపీ కుమారుడు, అల్లుడుని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. దీంతో వారిద్దరూ గాయాలతో వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం దక్షిణ ఢిల్లీలో జహనాబాద్ ఎంపీ అరుణ్ కుమార్ కుమారుడు రితురాజ్(20), అతడి మేనల్లుడు రిషాబ్(20) ఎంపీకి ఉన్న అధికార నివాసం నుంచి సౌత్ ఎక్స్టెన్షన్ అనే మరో నివాసానికి రాగా అక్కడ తమ గేట్ ముందు కొందరు వ్యక్తులు స్కూటీలు పార్క్ చేసి ఉండటం గమనించారు. ఆ స్కూటీలపై వచ్చిన వారంతా అక్కడే ఉన్న తమ బంధువులను చూసేందుకు వచ్చారు. అయితే, వాటిని తమ గేటు ముందునుంచి తీయాలని రితురాజ్ కోరగా.. మనోహర్‌లాల్ అనే వ్యక్తి, అతడి స్నేహితులు కలిసి వారిపై దాడి చేసి పిడిగుద్దులు గుప్పించారు. అడ్డుకునేందుకు వచ్చిన కొందరు మహిళలను చెత్త మాటలతో దూషించారు. దీంతో రితురాజ్ భుజం దెబ్బతినగా, రిషాబ్కు పలు గాయాలయ్యాయి.