మహిళా పోలీస్కు చిక్కారో ఇక అంతే! | A police constable thrashes an auto driver over allegations of eve-teasing in Patna (Bihar) | Sakshi
Sakshi News home page

మహిళా పోలీస్కు చిక్కారో ఇక అంతే!

Published Fri, May 13 2016 11:31 AM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

మహిళా పోలీస్కు చిక్కారో ఇక అంతే!

మహిళా పోలీస్కు చిక్కారో ఇక అంతే!

బిహార్: బిహార్ లో ఓ మహిళా పోలీస్ ఆటో డ్రైవర్ దుమ్ము దులిపింది. ఈవ్ టీజింగ్కు పాల్పడిన ఓ ఆటో డ్రైవర్ను మెడపెట్టి జీపులో పడేసింది. ఇప్పుడా వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. అసలే దేశంలో మహిళపై ఆకృత్యాలు ఎక్కువవుతున్నాయని పొద్దున లేచినప్పటి నుంచి చదవలేనన్న వార్తలు దర్శనమిస్తున్నాయి. వీటికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు కొత్తకొత్త చట్టాలు పుట్టుకొస్తున్నాయి. ఎన్నో అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు.. పలు విద్యార్థి సంఘాలు కల్పిస్తూనే ఉన్నాయి. అయినా, కూడా కొందరిలో మార్పు మాత్రం రావడం లేదు.

ఈవ్ టీజింగ్ అంటే ఒకప్పుడు కాలేజీలకే పరిమితం కాగా.. ఇప్పుడవి రచ్చకెక్కి వీర విహారం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, ప్రజా రవాణ వ్యవస్థలో ఇవి ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడా మహిళా పోలీసుల మోహరింపు కూడా భారీగానే ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా బిహార్లోని పాట్నాలో ఈ ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు. ఓ అమ్మాయిపట్ల ఈవ్ టీజింగ్కు పాల్పడ్డాడు. అది కాస్త వెళ్లి ఓ మహిళా పోలీసు కంట్లో పడింది. దాంతో ఆమె ఊరుకుంటుందా.. అతగాడి దుమ్ముదులిపింది. నడిరోడ్డుపైనే అపర కాలికలా మారి దెబ్బమీదదెబ్బ కొడుతూ నడవరా స్టేషన్కు అంటూ మెడపట్టి జీపులోకి ఎక్కించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement