Women Police Constable
-
మహిళకు CPR చేసిన కానిస్టేబుల్ పై ప్రశంసలు
-
యూనిఫాంతోనే సమాజంలో గుర్తింపు
సాక్షి, అమరావతి : పోలీస్ యూనిఫాం వల్ల తమకు సమాజంలో మరింత గుర్తింపు, గౌరవం, రక్షణ లభిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులు పేర్కొన్నారు. తమకు యూనిఫాం విధానాన్ని కొనసాగించాలని మహిళా పోలీసుల సంఘం ప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితను కలిసి వినతి పత్రం సమర్పించారు. రెండేళ్లుగా నిబద్ధతతో పని చేస్తూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో మహిళల ఆదరణ పొందామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు యూనిఫాం లేకపోతే విధి నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు దురుద్దేశంతో చేస్తున్న దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దని కోరారు. -
ఎన్నెన్నో కష్టాలు.. డ్యూటీ ఎలా చేసేది
ఆగ్రా: దేశంలో మహిళా పోలీసుల బలవన్మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మహిళా పోలీసులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో పోలీసు శాఖలో మహిళా ఉద్యోగుల స్థితిగతులపై చర్చ మొదలయ్యింది. ఇందులో భాగంగానే మహిళా పోలీసు అధికారులపై ఇండియాటుడే.కామ్ ఓ అధ్యయనం నిర్వహించింది. మహిళా పోలీసులు తమని తాము రక్షించుకునేందుకు పురుషాధిపత్యంతో ఉన్న మగ పోలీసుల నుంచి ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కొంటున్నట్టు తేటతెల్లమయ్యింది. పోలీసు దుస్తుల్లో ఉన్నా, స్త్రీలమని గుర్తుచేస్తారు ఆగ్రాలోని స్థానిక పోలీస్ స్టేషన్లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ ఇండియాటుడేతో మాట్లాడుతూ ‘‘తాను పోలీసు యూనిఫాం ధరించి ఉండవచ్చు, అయినప్పటికీ అడుగడుగునా తాను మహిళననే విషయం గుర్తుచేస్తూనే ఉంటారు’’ అని వ్యాఖ్యానించారు. సాధారణ మహిళలకూ తమకీ ఎటువంటి తేడా ఉండదని, సాధారణ మహిళలు ఎదుర్కొంటున్నట్టే విధినిర్వహణ విషయంలో తాము కూడా అనేక ఇబ్బందులను పంటి బిగువున అదిమిపట్టాల్సి వస్తుందన్నారు. సాధారణ మహిళ లు అడుగు బయటపెట్టినప్పుడు ఎలాంటి వివక్షనీ, ఇబ్బందులనూ ఎదుర్కొంటారో అవన్నీ తమకు కూడా సహజమేనని ఆమె వ్యాఖ్యానించారు. మహిళా పోలీసులకే అసౌకర్యం ఉన్నచోట ఇతర మహిళలకు దిక్కేదీ? పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసులకు ఉద్యోగాల్లో ఉంచడం వల్ల, మహిళలంతా పోలీస్ స్టేషన్లలో ఇబ్బందిపడకుండా ఉండగలుగుతారని భావిస్తారని, అయితే ‘‘మహిళా పోలీసులే పోలీస్ స్టేషన్లలో అసౌకర్యంగా , ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటే, మిగిలిన మహిళలను వాళ్ళెలా సౌకర్యవంతంగా ఉంచగలుగుతారు’’అని ఆమె ప్రశ్నించారు. పని విషయంలో సమానత్వమే సమాన గౌరవం దక్కదు పురుష ఉద్యోగులతో సమానంగా మహిళా పోలీసులు పనిచేయాలని అధికారులు కోరుకుంటారు. అలాగూ పురుష పోలీసులతో సమానంగా పనిచేయించుకుంటారు. కానీ పురుష పోలీసులతో సమానంగా మాత్రం చూడరని, వివక్ష తమని వెన్నాడుతూనే ఉంటుందని మరో పోలీస్ కానిస్టేబుల్ వ్యాఖ్యానించారు. వెకిలి జోకులు.. తప్పుడు కామెంట్లు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ళు అన్న తేడా లేకుండా, మహిళా పోలీసుపై వెకిలి జోకులూ, తప్పుడు కామెంట్లతో వేధిస్తుంటారు. ఆ మాటలు వినలేక అక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప చేసేదేం ఉండదు. అంటారు మరో మహిళ పోలీసు. కొత్తగా రిక్రూట్ అయిన మహిళా పోలీసులు, అధికారుల చేతిలో మరింతగా ఇలాంటి వివక్షకూ, ఇబ్బందులకూ గురవుతారని మహిళా కానిస్టేబుల్ చెప్పారు. ఇన్‌చార్జ్‌ల వేధింపులు రాకబ్ గంజ్ వుమెన్ పోలీస్ స్టేషన్ కి రావడానికి ముందు మరో పోలీస్ స్టేషన్ పనిచేశానని, అక్కడి ఇన్‌చార్జ్‌తో వేధింపులు తాళలేకపోయానని అంటారు మరో మహిళా పోలీసుల. స్నేహంగా ఉందామని చెప్పి నా బతుకు నరకంగా మార్చేశాడంటారు ఆమె. తాను రాజీనామా చేసి వెళ్ళిపోవాలనుకున్నానని, ప్రభుత్వ ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో తెలుసు కనుక తన కుటుంబ సభ్యులు వారించారనీ అంటారామె. పోలీసు ఉద్యోగంలో చేరి తప్పు చేశాను తాను పోలీసు ఉద్యోగంలో చేరినప్పుడు తన మిత్రులు కొంత మంది తాను, ఈ ఉద్యోగంలో కన్నా టీచర్ ఉద్యోగంలో చేరి వుంటే బాగుండేదని కామెంట్ చేశారు. అయినా బలవంతంగా ఇందులో చేరాను. అప్పుడు వారికేం సమాధానం చెప్పలేకపోయినా, యిప్పుడు మాత్రం తాను పోలీసు ఉద్యోగంలో చేరాలన్న నిర్ణయం అంత మంచి విషయమేం కాదని భావిస్తున్నట్టు మరో మహిళా హెడ్ కానిస్టేబుల్ వ్యాఖ్యానించారు. పోలీసు సిబ్బందిలో మహిళలకు సరైన వాతావరణం లేదు పోలీసు సిబ్బందిలో మహిళా పోలీసులు పనిచేసేందుకు సరైన వాతావరణం లేదని మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అన్నారు. కొత్తగా రిక్రూట అయినవారికి మరిని మరింత ఇబ్బంది పెడతారు. పురుష పోలీసులు వారికి పదే పదే ఫోన్లు చేయడం, ఫోన్లలో అశ్లీల ఫొటోలు పంపుతూ వేధింపులకు గురిచేస్తారని ఆమె చెప్పారు. ఆగ్రా ఎస్ఎస్పి బబ్లు కుమార్ పురుష పోలీసులపై చేసిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు. పోలీసు డిపార్టుమెంట్ మహిళలకు సురక్షితమైన పరిస్థితులను కల్పిస్తున్నారని, ఎవరికైనా ఇబ్బందులు వస్తే, తనని నేరుగా కలవొచ్చునని వ్యాఖ్యినంచారు. -
సీఐ వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం
-
సీఐ వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం
⇒ఆయనపై జ్యుడిషియల్ విచారణ జరిపించండి ⇒బాధిత కానిస్టేబుల్ రేణుక డిమాండ్ తిరుపతి క్రైం: ‘ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్‌గా ఉన్న మాకే పోలీస్ శాఖలో న్యాయం జరగడం లేదు.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కుప్పం సీఐ, చిత్తూరు డీఎస్పీలపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి’ అని బాధిత కానిస్టేబుల్ వి.రేణుక డిమాండ్ చేశారు. కుప్పం సీఐ రాజశేఖర్ వేధింపులు తాళలేక కుప్పంకు చెందిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఈ నెల 2వ తేదీన ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన విషయం విది తమే. అందులో నిర్మల చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, రేణుక న్యాయం కోసం శుక్రవారం తిరుపతి సాక్షి కార్యాలయానికి చేరుకున్నారు. తమపై కుప్పం సీఐ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, పత్రికల్లో రాయలేని విధంగా వేధించారని ఆరోపించారు. చిత్తూరు డీఎస్పీ గిరిధర్‌కు ఫిర్యాదు చేస్తే ‘పోలీస్ అధికారులైన మాపైనే ఫిర్యాదు చేస్తావా.. నీకు డిపార్టుమెంట్లో డ్యూటీలు చేయాలని లేదా’ అని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తనను కులం పేరుతో, లైంగికంగా వేధిం చడం వల్లే ఆత్మహత్య చేసుకోవా లని అనుకున్నానన్నారు. సీఐని కాపాడేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, వారి మద్దతుతోనే తనకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. -
మహిళా పోలీస్‌కు చిక్కారో ఇక అంతే!
బిహార్: బిహార్ లో ఓ మహిళా పోలీస్ ఆటో డ్రైవర్ దుమ్ము దులిపింది. ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన ఓ ఆటో డ్రైవర్‌ను మెడపెట్టి జీపులో పడేసింది. ఇప్పుడా వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. అసలే దేశంలో మహిళపై ఆకృత్యాలు ఎక్కువవుతున్నాయని పొద్దున లేచినప్పటి నుంచి చదవలేనన్న వార్తలు దర్శనమిస్తున్నాయి. వీటికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు కొత్తకొత్త చట్టాలు పుట్టుకొస్తున్నాయి. ఎన్నో అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు.. పలు విద్యార్థి సంఘాలు కల్పిస్తూనే ఉన్నాయి. అయినా, కూడా కొందరిలో మార్పు మాత్రం రావడం లేదు. ఈవ్ టీజింగ్ అంటే ఒకప్పుడు కాలేజీలకే పరిమితం కాగా.. ఇప్పుడవి రచ్చకెక్కి వీర విహారం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, ప్రజా రవాణ వ్యవస్థలో ఇవి ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడా మహిళా పోలీసుల మోహరింపు కూడా భారీగానే ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా బిహార్‌లోని పాట్నాలో ఈ ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు. ఓ అమ్మాయిపట్ల ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డాడు. అది కాస్త వెళ్లి ఓ మహిళా పోలీసు కంట్లో పడింది. దాంతో ఆమె ఊరుకుంటుందా.. అతగాడి దుమ్ముదులిపింది. నడిరోడ్డుపైనే అపర కాలికలా మారి దెబ్బమీదదెబ్బ కొడుతూ నడవరా స్టేషన్‌కు అంటూ మెడపట్టి జీపులోకి ఎక్కించింది. -
చిట్టీల పేరుతో పోలీసులకు కుచ్చుటోపీ
హైదరాబాద్: చిట్టీల పేరుతో ఓ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు కుచ్చుటోపీ పెట్టింది. చిట్టీలు వేయమని నమ్మబలికి పోలీసుల వద్ద ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేసింది. సొమ్ము చేతికిరాగానే లీవ్ పెట్టినట్టు పెట్టి మెల్లగా ఊడాయించింది. దీంతో మోసం పోయామని తెలుసుకున్న బాధితులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు మహిళా కానిస్టేబుల్ వద్ద 50లక్షల రూపాయల చిట్టీలు వేసినట్టు సమాచారం. బాధితులందరూ మహిళా కానిస్టేబుల్‌పై సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది.