హోం మంత్రి మేకతోటి సుచరితను కలిసిన మహిళా పోలీసుల సంఘం ప్రతినిధులు
సాక్షి, అమరావతి : పోలీస్ యూనిఫాం వల్ల తమకు సమాజంలో మరింత గుర్తింపు, గౌరవం, రక్షణ లభిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులు పేర్కొన్నారు. తమకు యూనిఫాం విధానాన్ని కొనసాగించాలని మహిళా పోలీసుల సంఘం ప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితను కలిసి వినతి పత్రం సమర్పించారు.
రెండేళ్లుగా నిబద్ధతతో పని చేస్తూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో మహిళల ఆదరణ పొందామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు యూనిఫాం లేకపోతే విధి నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు దురుద్దేశంతో చేస్తున్న దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment