Women police
-
మహిళా పోలీసులు అరకొరే!
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణలో జనాభాకు అనుగుణంగా పోలీసుల సంఖ్య పెరగడం లేదు. ప్రధానంగా మహిళా పోలీసులు, అధికారులు అరకొరగా ఉన్నారని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఏటా నేరాల సంఖ్య పెరుగుతుండగా, అందుకు అనుగుణంగా తగినంత మంది పోలీసు సిబ్బంది నియామకాలు లేకపోవడంతో ఉన్నవారితోనే సరిపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మహిళాల పోలీసుల కొరత పోలీసు విభాగాన్ని వేధిస్తోంది. 1.87 కోట్ల మహిళలకు 4,782 మంది మహిళా పోలీసులు ప్రభుత్వం వెల్లడించిన ‘తెలంగాణ ఎట్ఎ గ్లాన్స్–2021’నివేదిక ప్రకారం రాష్ట్ర జనాభా 3,77,25,803. ఇందులో పురుషులు 1,89,78,412 కాగా, మహిళలు 1,87,47,391 మంది ఉన్నారు. తెలంగాణ క్రైం రికార్డు బ్యూరో ప్రకారం రాష్ట్రంలో 9 పోలీసు కమిషనరేట్లు, 20 జిల్లాలు, ఒక రైల్వే యూనిట్లలో 58,504 మంది సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ విభాగాలకు చెందిన పోలీసులు (పోలీసు కానిస్టేబుల్ నుంచి డీజీ వరకు) ఉన్నారు. అలాగే 763 శాంతి భద్రతల స్టేషన్లు, 18 మహిళా పోలీసుస్టేషన్లు ఉండగా, ప్రతి లక్ష మంది జనాభాకు 141 మంది పోలీసులు ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. కాగా 2024 జనవరి 1 నాటికి తెలంగాణ మొత్తం పోలీసుల సంఖ్య 76,292 మందికి చేరినట్లు సమాచార హక్కు చట్టం కింద వివరాలు వెల్లడించిన డీజీ కార్యాలయం.. మహిళా పోలీసులు 4,782 మంది ఉన్నట్లు తెలిపింది. దీనిని బట్టి తెలంగాణలో మహిళల జనాభాకు అనుగుణంగా మహిళా పోలీసుల సంఖ్య లేదని వెల్లడవుతోంది.ఇంటా, బయటా జరుగుతున్న వేధింపుల గురించి చాలామంది యువతులు, మహిళలు పురుష పోలీసుల దగ్గర చెప్పుకోలేని పరిస్థితి ఉంది. మహిళలపై ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారికి మహిళా పోలీసులే ధైర్యం చెబుతూ, అండగా నిలబడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జనాభాకు అనుగుణంగా మహిళా పోలీసులను నియమించాలని వివిధ మహిళా సంఘాలు కోరుతున్నాయి. నియోజకవర్గస్థాయిలో మహిళా స్టేషన్లు ఉండాలి.. జిల్లా కేంద్రాల్లోనే కాకుండా నియోజకవర్గస్థాయిలో కూడా మహిళా పోలీ స్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. హక్కుల కో సం ఆందోళనలు చేపడుతున్న మహిళలను అరెస్ట్ చేసే సమయంలో మహిళా పోలీసు అధికారులు మాత్రమే ఉండేలా చూడాలి. – రాజేంద్ర పల్నాటి, ఫౌండర్, యూత్ ఫర్ యాంటీ కరప్షన్మహిళా పోలీస్స్టేషన్ల సంఖ్య పెంచాలి.. మహిళలపై రోజురోజుకూ హింస పెరిగిపోతోంది. అత్యాచారాలు, హత్యలు, యాసిడ్ ఘటనలు, గృహహింస దాడులు.. ఇలా అనేకం జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళా పోలీస్స్టేషన్లు తక్కువగా ఉన్నాయి. మహిళల భద్రత కోసం ప్రతీ మండలంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్, జనాభా ప్రాతిపదికన మహిళా ఎస్సై, కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ జరగాలి. – ఇర్రి అహల్య, జిల్లా అధ్యక్షురాలు, ఐద్వా, జనగామ -
సరిహద్దుల్లో సాహసమే వెన్నెముకగా...
‘ఓ పక్షీ! నీ పాట ఇక్కడ పాడబోకు ఎగిరిపో... నీ వనాలెక్కడున్నాయో వెతుక్కుంటూ’ అనేది కవి వాక్యం. బీటెక్ చదువుతున్న మహాలక్ష్మి టెక్ దారిలో వెళ్లకుండా... బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)కు ఎంపికైంది. తెనాలి అయితానగర్ అమ్మాయి మహాలక్ష్మి ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సగర్వంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తోంది..ఎన్సీసీలో చేరిన రోజుల్లో ఎంతోమంది సాహసికులైన సైనికుల గురించి తెలుసుకునే అవకాశం మహాలక్ష్మికి వచ్చింది. ఆ సమయంలోనే ‘నేను సైతం సైన్యంలోకి’ అనే లక్ష్యానికి బీజం మహాలక్ష్మి మదిలో పడింది. మహాలక్ష్మి తల్లి వెంకాయమ్మ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సు, తండ్రి రాజుది పెయింటింగ్ వృత్తి. చాలీచాలని సంపాదనైనా ఆ దంపతులు బిడ్డలిద్దరినీ చదివించారు. మహాలక్ష్మి చదువుతో పాటు ఆటపాటల్లోనూ ప్రతిభ చూపేది. ఎన్సీసీ మాస్టారు బెల్లంకొండ వెంకట్ ప్రోత్సాహంతో ఎన్సీసీలో చేరింది. రెండు జాతీయ శిబిరాలకు హాజరయ్యే అవకాశం వచ్చింది. కాలేజి గ్రౌండులో వ్యాయామం చేసేందుకు వస్తుండే బాలయ్య అన్నయ్య రన్నింగ్, హైజంప్‌లో అథ్లెటిక్స్‌లో సాధన చేయించాడు.జోనల్ అథ్లెటిక్ మీట్లో రన్నింగ్‌లో ఫస్ట్ వచ్చింది. చదువే లోకం అనుకునే అమ్మాయికి ఎన్సీసీ, ఆటలు పరిచయం కావడంతో కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపించింది. తనలోని శక్తిసామర్థ్యాలకు పదును పెట్టుకునే అవకాశం వచ్చింది. టెన్త్ తర్వాత సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజిలో పాలిటెక్నిక్‌లో చేరిన మహాలక్ష్మి, తర్వాత అదే కాలేజిలో బీటెక్ సెకండియర్‌లో చేరింది. ప్రస్తుతం ఫైనలియర్లో ఉండాల్సింది. ఈలోగా 2022లో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. 2023లో బీఎస్ఎఫ్కు ఎంపికైంది. పశ్చిమబెంగాల్ బైకాంతపూర్‌లోని బీఎస్ఎఫ్ క్యాంపులో 11 నెలల శిక్షణ పూర్తి చేసుకుంది. గత అక్టోబరు 28న పశ్చిమబెంగాల్లోని బీఎస్ఎఫ్ 93 బెటాలియన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అదే రాష్ట్రంలో ఇండో–బంగ్లాదేశ్ బోర్డర్లోని జపర్సల వద్ద మహాలక్ష్మి సైనికురాలిగా ఉద్యోగ విధులు నిర్వహిస్తోంది.ప్రస్తుతం క్రిస్మస్ సెలవులకని సొంతూరు తెనాలికి వచ్చింది. శిక్షణ రోజుల గురించి ప్రస్తావించినప్పుడు ఇలా చెప్పింది.... ‘బైకాంతపూర్‌లోని క్యాంపులో శిక్షణ చాలా కఠినంగా ఉండేది. చిన్నప్పటి నుంచి ఆడిన ఆటలు, చేసిన వ్యాయామాల వల్ల కష్టం అనిపించేది కాదు. తెల్లవారుజాము నాలుగు గంటల్నుంచే రన్నింగ్, ఇతర వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. తర్వాత తరగతులు ఉంటాయి. ఏకే 47తో సహా రకరకాల వెపన్లు విడగొట్టటం, నిర్ణీత వ్యవధిలో అమర్చటం, బుల్లెట్లను లోడు చేయడం, ఫైరింగ్... మొదలైనవి ఎన్నో సాధన చేయించేవారు. సాయంత్రం 5 గంటల నుంచి సరిహద్దులో డ్యూటీ చేయాలి. కష్టమే అయినా ఇష్టంగా చేయగలిగాను’‘సైన్యంలో పనిచేస్తున్నావట కదా... మంచి విషయం అమ్మా’ అని అభినందించే వారే కాదు... ‘సరిహద్దుల్లో ఉద్యోగమా! అంత కష్టమెందుకమ్మా. ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకోవచ్చు కదా!’ అని సలహా ఇచ్చేవారు ఉన్నారు. సైన్యంలో జెండర్ బారియర్స్ తొలగిపోతున్న కాలం ఇది. పురుషులతో సమానంగా అమ్మాయిలు సత్తా చాటుతున్న కాలం ఇది. ఇలాంటి కాలంలో.... నిరాశపరిచే మాటలు వారి హృదయాలను చేరవు. దేశభక్తి ఉన్న హృదయాలకు భయాలతో పనేమిటి! కమాండర్ స్థాయికి చేరుకోవాలని...ఎన్సీసీలో ఉన్నప్పుడు ఎంతోమంది గొప్ప సైనికుల గురించి, వారి త్యాగాల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆ వీరులు, త్యాగధనుల గురించి వింటున్న క్రమంలో ‘ఏదో ఒకరోజు నేను కూడా సైన్యంలో పనిచేస్తాను’ అనుకునేదాన్ని.అయితే అదెంత కష్టమో నాకు తెలియంది కాదు. ప్రోత్సహించేవారి కంటే నిరూత్సాహపరిచేవారే ఎక్కువగా ఉంటారు. కష్టాన్ని ఇష్టపడేవారే విజేతలు అవుతారు. శిక్షణ కాలంలో బైకాంతపూర్ క్యాంప్‌లో ‘ఇంత కష్టమా’ అనిపించలేదు. ‘ఇన్ని విషయాలు తెలుసుకున్నాను కదా’ అనుకున్నాను. దేశభక్తి గురించి అధికారులు చెప్పిన మాటలు నాలో స్ఫూర్తిని కలించాయి. ఆ స్ఫూర్తితోనే దేశ సరిహద్దుల రక్షణకు అంకితమయ్యాను. బాగా కష్టపడి బీఎస్ఎఫ్లో కమాండర్ స్థాయికి చేరుకోవాలనేది నా కల.– వై.మహాలక్ష్మి – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
రాజకీయ ప్రేరేపిత హింసే సరికొత్త సవాల్
సాక్షి, హైదరాబాద్/ఖిలా వరంగల్: రాష్ట్రంలో ఇటీవలి కాలంలో రాజకీయ ప్రేరేపిత హింస పోలీసులకు సరికొత్త సవాల్‌గా మారిందని డీజీపీ జితేందర్ అన్నారు. సైబర్ నేరాలు, మత్తుపదార్థాల అక్రమ రవాణాతోపాటు రాజకీయ ప్రేరేపిత హింసను కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీస్ సిబ్బంది సర్వదా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 2024 బ్యాచ్ సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), ఐటీ అండ్ కమ్యూనికేషన్, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీఓ) విభాగాలకు చెందిన 8,047 మంది కానిస్టేబుల్ కేడెట్లు 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మొత్తం 19 శిక్షణ కేంద్రాల్లో గురువారం పాసింగ్ అవుట్ పరేడ్లు నిర్వహించారు. హైదరాబాద్‌లోని రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో 1,211 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్‌తో కలిసి కానిస్టేబుళ్ల గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కేడెట్లకు ట్రోఫీలు, మెమొంటోలు అందించారు. అనంతరం కానిస్టేబుళ్లను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళా పోలీసులు పెరగటం శుభ పరిణామం రాష్ట్ర పోలీస్‌శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య పెరగడం శుభ పరిణామం అని డీజీపీ జితేందర్ అన్నారు. 2024 బ్యాచ్‌లో మొత్తం 2,338 మంది మహిళా పోలీసులు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారని గుర్తుచేశారు. ఉన్నత విద్యావంతులు కానిస్టేబుల్స్‌గా చేరినందున పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచేలా పనిచేయాలని సూచించారు. వృత్తిగత జీవితంలోనూ కొత్త అంశాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన యువకులను ఉత్తమ అధికారులుగా తీర్చిదిద్దడంలో తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ఇతర సిబ్బంది కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఉత్తమ శిక్షణ, వసతుల కల్పనకుగాను తెలంగాణ పోలీస్ అకాడమీకి ఎనర్జీ, ఫుడ్ సేఫ్టీ, హెల్త్ సహా ఐదు అంశాల్లో ఐఎస్ఓ సరి్టఫికెట్లు దక్కడంపై డీజీపీ సంతోషం వ్యక్తం చేశారు. కొత్త కానిస్టేబుళ్లతో ప్రమాణం చేయించిన తర్వాత అభిలాష బిస్త్ మాట్లాడుతూ సవాళ్లను అధిగమించి కొత్త సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చామని తెలిపారు. పరేడ్ కమాండర్‌గా ఏఆర్ కానిస్టేబుల్ ఉప్పునూతల సౌమ్య వ్యవహరించారు. కండ్లకోయలోని పోలీసు శిక్షణ కళాశాలలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఇంటలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి పాల్గొన్నారు.నా తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చా మాది హైదరాబాద్. మా నాన్న కారు డ్రైవర్. మా అమ్మానాన్నలకు ముగ్గురం కుమార్తెలమే. మేం పోలీసులం కావాలని మా తల్లిదండ్రుల ఆశయం. వారి కష్టాన్ని చూసి కష్టపడి చదువుకున్నాం. మొదటి ప్రయత్నంలోనే ఒకే కుటుంబం నుంచి ఇద్దరం కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాం. – హరిణి సురేష్, రోషిణి సురేష్ రాణీ రుద్రమ స్ఫూర్తితో ముందుకు సాగండి: మంత్రి సీతక్క ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తిచేసుకొన్న 1,127 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో గురువారం ఆమె పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళా కానిస్టేబుళ్లు రాణీ రుద్రమదేవి స్ఫూర్తితో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు. -
మహిళా కానిస్టేబుళ్లపై టీడీపీ నేతల ప్రతాపం
తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో కొంతమంది టీడీపీ నేతలు అధికారులు, సామాన్యులనే కాకుండా ఇప్పుడు మహిళా పోలీసులను సైతం బెదిరింపులకు గురిచేసేందుకు వెనుకాడడం లేదు. తాజాగా ఆదివారం లింగాయపాలెం ఇసుక రీచ్‌కు వెళ్లే లారీలకు స్లిప్పులు రాస్తున్న మహిళా పోలీసులపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు గొడవ పెట్టుకుని.. మీరేమైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులనుకుంటున్నారా కుర్చీలు వేసుకుని ఇక్కడ ఏంటీ అంటూ.. కుర్చీలను తీసుకుని కంపచెట్లలోకి విసిరేశారు. పక్కనే ఉన్న ఎస్ఈబీ కానిస్టేబుల్ వారించేందుకు యత్నించినప్పటికీ అతనిని కూడా ఇష్టారీతిగా మాట్లాడడంతో.. డ్యూటీ ముగిసిన అనంతరం పోలీస్‌స్టేషన్‌లో సదరు మహిళా కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ నాయకులకు వత్తాసుగా లింగాయపాలెం గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడితో పాటు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కూడా చూసీ చూడనట్లు పొమ్మని ఫోన్లు రావడంతో.. కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో మహిళా కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పోలీసు శాఖ ఉన్నతాధికారులు స్పందించి సదరు టీడీపీ నేతల దురుసు ప్రవర్తనకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
మహిళా పోలీస్‌కే రక్షణ లేదు..
దర్శి: విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన టీడీపీ నాయకులకు వత్తాసు పలకడమే కాకుండా, కేసు నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం చేసిన ఉదంతమిది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం బూత్ నం.213లో మే 13న మహిళా పోలీస్ కట్టా అనూష బీఎల్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. పోలింగ్ బూత్‌లో టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారనే విషయమై వివాదం చెలరేగింది.ఓటు వేసి ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చున్న టీడీపీ నాయకులను ఓ కానిస్టేబుల్ వెళ్లిపోవాలని సూచించినా లెక్క చేయలేదు. అదే సమయంలో బీఎల్వో కల్పించుకుని మీరంతా ఇక్కడే ఉంటే ఇబ్బంది కలుగుతుందని చెబుతుండగా టీడీపీ నాయకుడు జిల్లెళ్లమూడి రామకృష్ణ, మరో 12 మంది ఒక్కసారిగా రెచ్చిపోయారు. అనూషను అసభ్యకరంగా తిడుతూ జుట్టు పట్టుకుని లాగారు. గొంతు పట్టుకుని కింద పడేసి కొట్టారు. కులం పేరుతో తిడుతూ కాలితో తన్నబోతుండగా అక్కడే ఉన్న కానిస్టేబుల్, బస్ డ్రైవర్ వచ్చి పక్కకు నెట్టినా ఆవేశంతో ఊగిపోయారు. పట్టించుకున్నవారు లేరు.. తనపై టీడీపీ నేతలు దాడి చేసిన విషయాన్ని మహిళా పోలీస్ అనూష మే 13వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫోన్ చేసి చెప్పగా, దర్శి సీఐ షమీఉల్లాను కలవాలని సూచించారు. ఆ రోజు సీఐ, ఎస్ఐకి విషయం చెప్పినా పట్టించుకోలేదు. 14న ఎస్ఐ సెలవులో ఉన్నారని చెప్పి ఫిర్యాదు తీసుకున్నారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. 16న కేసు ఎందుకు కట్టలేదని ఏఎస్ఐని ప్రశ్నించగా ఉన్నతాధికారులను అడగాలని సమాధానమిచ్చారు.కేసు నమోదు చేయాలని అనూష నిలదీయడంతో నిందితులుగా ఉన్న కోటేశ్వరరావు, మరి కొందరిని స్టేషన్‌కు పిలిపించారు. వారు ఏఎస్ఐ ఎదుటే మహిళా పోలీస్‌ను బెదిరించారు. కాగా, మే 17న దర్శి సీఐని కలిశానని, అయితే టీడీపీ నేతలను పిలిపించి రాజీ చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారని, అందుకు తాను అంగీకరించలేదని అనూష చెబుతోంది. అదే రోజు మధ్యాహ్నం ఆమె ఒంగోలులో ఎస్పీని కలిసేందుకు ప్రయత్నించగా.. ఎస్పీ ఉన్నప్పటికీ లేరని చెప్పి వెనక్కు పంపారు. 17న కలెక్టర్ దినేష్‌కుమార్ ఎదుట అనూష తన గోడు వెళ్లబోసుకున్నారు.వెంటనే కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయానికి కలెక్టర్ ఆదేశాలిచ్చారు. దీంతో ముండ్లమూరు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు 13 మంది టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదేరోజు బాధితురాలు అనూషపైనా టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. అట్రాసిటీ కేసుపై దర్శి డీఎస్పీ విచారణ చేపట్టినా ఇప్పటి వరకు ఏమీ చర్యలు తీసుకోలేదు. -
Kashi Vishwanath Temple: వారణాసి ఆలయంలో పోలీసులకు అర్చకుల డ్రెస్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులు దోతీ కుర్తా ధరించారు. మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలో కనిపించారు. వారికి దోతీ కుర్తా, సల్వార్ కుర్తాలను ఉన్నతాధికారులు డ్రెస్‌కోడ్‌గా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, దీనిపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు తమ యూనిఫాం కాకుండా ఇతర దుస్తులు ధరించడం ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల భద్రతకు ముప్పు కలుగుందని చెప్పారు. పోలీసులు పూజారుల వేషం వేయడం సరైంది కాదన్నారు. నేరగాళ్లు కూడా ఇలాంటి దుస్తులు ధరించి ప్రజలను మోసం చేసే అవకాశం ఉందన్నారు. ఆలయంలో పోలీసులు పూజారుల దుస్తులు ధరించాలంటూ ఆదేశాలు ఇచి్చనవారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, విశ్వనాథ ఆలయంలో పోలీసుల డ్రెస్‌కోడ్‌ను వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ సమరి్థంచారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆలయాల్లో పోలీసుల విధులు భిన్నంగా ఉంటాయని అన్నారు. రద్దీగా ఉన్నప్పుడు పోలీసులు నెట్టివేస్తే భక్తులు ఆగ్రహిస్తారని తెలిపారు. ఆర్చకుల వేషధారణలో ఉన్నవారు నెట్టివేస్తే పెద్దగా సమస్యలు రాబోవన్నారు. -
మహిళా పోలీసుల ప్రవర్తన సరికాదు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు సంబంధించిన ఇటీవలి సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినినిపై పోలీసుల దాడి అమానుషమని మండిపడ్డారు. ఇది ఆమోదయోగ్యం కాదని తెలిపారు. శాంతియుతంగా ఉన్న నిరసన చేస్తున్న విద్యార్థినిని ఈడ్చుకెళ్లడం, నిరసనకారులపై అసభ్య ప్రవర్తించడం మంచిది కాదని తెలిపారు. The recent incident involving Telangana police is deeply concerning and absolutely unacceptable. Dragging a peaceful student protester and unleashing abrasive behaviour on the protestor raises serious questions about the need for such aggressive tactics by the police. This… pic.twitter.com/p3DH812ZBS — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 24, 2024 ఈ దురహంకార ప్రవర్తనకు తెలంగాణ పోలీసులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. హ్యూమన్ రైట్స్ కమీషన్ వెంటనే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ప్రవర్తన ఒక కట్టుబాటు కాదు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని కవిత పేర్కొన్నారు. చదవండి: కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ -
అకృత్యాలకు అడ్డుకట్ట కార్నర్ మీటింగ్స్
ముంబైలోని మురికివాడల్లో ఉదయం పూట మహిళాపోలీసులు ‘కార్నర్ మీటింగ్స్’ నిర్వహిస్తున్నారు. ప్రతి వీధిలోని ఒక మూల మీద అక్కడ పోగైన స్త్రీలకు, పిల్లలకు ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’తో మొదలు డ్రగ్స్, ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్‌ల గురించి వివరిస్తున్నారు. పెద్దగా చదువులేని మహిళలకు ఈ వీధిమలుపు మీటింగ్‌లు మేలుచేస్తున్నాయి. నిజానికి ప్రతి రాష్ట్రంలో, ప్రతి బస్తీల్లో ఇలాంటి కార్నర్ మీటింగ్‌ల అవసరం ఉంది. నగరాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్న స్త్రీల భద్రత గురించి కొంతైనా నిశ్చింత ఉంది. కాని ఇవే నగరాల్లో, పెద్ద పట్టణాల్లోని మురికివాడల్లోని, బస్తీల్లోని స్త్రీల, పసిపిల్లల భద్రత చాలా కష్టతరమైనది. చట్టపరంగా ఎంత కట్టుదిట్టాలు ఉన్నా స్వీయ అవగాహన లేకపోతే ప్రమాదం తప్పదు. మన దేశంలో నిత్యం పసి పిల్లల మీద అకృత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. తప్పిపోతున్న పిల్లల సంఖ్య తీవ్రంగా ఉంది. మరోవైపు అసంఘటిత రంగాల్లో స్త్రీలపై లైంగిక దాష్టికాలు కొనసాగుతూనే ఉన్నాయి. చదువు లేని స్త్రీలు ఈ విషయమై ఎవరితో చెప్పుకోవాలో తెలియక బాధ పడతారు, ఆందోళన చెందుతారు. అందుకే ముంబైలో మహిళా పోలీసులు ‘కార్నర్ మీటింగ్’ లు నిర్వహిస్తున్నారు. సంవత్సరం క్రితం సంవత్సరం క్రితం పోలీసు అధికారుల సూచన మేరకు మహిళా పోలీసులతో మొదలైన ఈ పని సత్ఫలితాలను ఇస్తోంది. ముంబైలోని అతి పెద్ద మురికివాడలకు రోజూ ఉదయం పూట మహిళా పోలీసు బృందాలు చేరుకుని వీధి మూలల్లో ఆడవాళ్లను కూడేసి జాగ్రత్తలు చెప్పడమే ఈ కార్నర్ మీటింగ్‌ల ఉద్దేశం. ఆడపిల్లలకు అర్థమయ్యేలా ‘గుడ్ టచ్ బ్యాడ్ టచ్’ల గురించి చెప్పడం మరో ముఖ్య ఉద్దేశం. అపరిచితులకు పిల్లల్ని అప్పగించి పనుల్లోకి వెళ్లకుండా చూడటం, మొబైల్ ఫోన్లలో వచ్చే కేటుగాళ్ల కాల్స్ వల్ల ఆర్థికంగా నష్టపోకుండా చూడటం కూడా కార్నర్ మీటింగ్‌ల ముఖ్యవిధిగా ఉంది. ‘రోజూ పది నుంచి పదకొండు గంటల మధ్య బస్తీ స్త్రీలు ఖాళీగా దొరుకుతారు. వారికి అన్ని విధాలా కౌన్సెలింగ్ ఇచ్చి అలెర్ట్ చేస్తాం. చిన్నచిన్న ఫ్యాక్టరీల్లో పని చేసే స్త్రీలు లైంగికపరంగా వేధింపులను ఎదుర్కొంటే ఫిర్యాదు చేయమని చెబుతాం. దీని వల్ల దౌర్జన్యకారుల్లో భయం ఏర్పడుతోంది’ అంటున్నారు మహిళా పోలీసులు. అలాగే వ్యభిచార వృత్తిలోకి ఈడ్చబడే స్త్రీల, బాలికలను కాపాడే బాధ్యత వారి గురించి సమాచారం ఇచ్చే చైతన్యం కూడా బస్తీ మహిళలకు కలిగిస్తున్నారు. మత్తు పదార్థాల వల్ల జరిగే హాని చెబుతున్నారు. నిజానికి ఈ పని ముంబైలోనే కాదు దేశంలోని ప్రతి నగరంలో చదువులేని బీదసాదలు ఉండే అన్నీ ఊళ్ల వాడల్లో జరగాలి. సత్ఫలితాలు ఇస్తున్న ఈ పనిని మిగిలిన రాష్ట్రాల్లోని పోలీసులు కూడా అనుసరిస్తే బాగుంటుంది. -
మేమంటే అంత చులకనా బాబూ?
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులను ఉద్దేశించి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. 40 ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడినని చెప్పుకునే ఆయన తమను ఉద్దేశించి అంత చులకనగా మాట్లాడటం, నిరాధార ఆరోపణలు చేయడంపట్ల మహిళా పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంపిక పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందిన తమను నామినేటెడ్ ఉద్యోగులని చంద్రబాబు హేళన చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. విజయవాడలో మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశాక చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.. అందులోనూ మహిళా పోలీసులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్నారు. అంతేకాకుండా వీరిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వో)లుగా వీరు పనిచేస్తున్నారని.. వీరిని తొలగించాలన్నారు. నామినేటెడ్ ఉద్యోగాలు పొందిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో ఎలా నియమిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. వారికి ఏం అవగాహన ఉంది.. ఎన్నికల విధులు, ఓటర్ల నమోదు గురించి ఏం తెలుసన్నారు. అంతటితో చంద్రబాబు సరిపెట్టలేదు. మహిళా పోలీసుల వ్యకి్తత్వం గురించి కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్ష ద్వారా మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు పొందిన తమను ఆయన అవమానించారని సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. తాము విధుల్లో చేరాక రెండేళ్లపాటు ప్రొబేషన్‌లో ఉన్నామని.. ఈ కాలంలో ప్రతిభ చూపినందుకు ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేసిందని గుర్తుచేస్తున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే, ప్రభుత్వ నిబంధనల మేరకే తాము కూడా నియమితులయ్యామనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలని వారంటున్నారు. అటువంటి తమను నామినేటెడ్ ఉద్యోగులని హేళన చేయడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు. ఎన్నికల విధులకు మేమెందుకు అర్హులం కాదు? ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఎన్నికల విధులు నిర్వహించేందుకు అర్హులు అయినప్పుడు తామెందుకు కామని మహిళా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ తమను ద్వితీయశ్రేణి ఉద్యోగులుగా వివక్షాపూరితంగా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తామని గతంలోనే చంద్రబాబు, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టీడీపీ వ్యవహార శైలి అదే తీరులో ఉండటం గమనార్హం. తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన ఉద్దేశాన్ని పునరుద్ఘాటించాయి. టీడీపీ అధికారంలోకి వస్తే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తొలగించడంతోపాటు తమను తీవ్ర అవస్థల పాలు చేస్తారని ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను కించపరిచిన చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చంద్రబాబు నిరాధారణ ఆరోపణలు చేయడంపై మహిళా పోలీసులు మండిపడుతున్నారు. మహిళలు అంటే చంద్రబాబుకు ఎంతటి చిన్నచూపో.. ఎంతటి చులకన భావముందో మరోసారి ఈ వ్యాఖ్యల ద్వారా నిరూపించారని రాష్ట్ర మహిళా పోలీసుల సంఘం మండిపడింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రధానంగా మహిళా పోలీసుల పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. -
శాంతిభద్రతలు భేష్
పోలీసు యంత్రాంగం అత్యుత్తమ పనితీరుతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిస్థాయిలో విజయవంతమవుతోందని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానంగా దిశ వ్యవస్థతో మహిళల భద్రతను పటిష్టపరచడం దేశానికే ఆదర్శప్రాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ మొబైల్ యాప్, దిశ వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో మహిళా పోలీసు వ్యవస్థతో మహిళల భద్రతకు పూర్తి భరోసా కల్పి స్తున్నామని తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. – సాక్షి, అమరావతి వినూత్న విధానాలతో నేరాల కట్టడి విజబుల్ పోలీసింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమర్థ వినియోగం, వినూత్న విధానాలతో నేరాల కట్టడి సాధ్యమైంది. 2022 కంటే 2023లో రాష్ట్రంలో నేరాలు 8.13శాతం తగ్గాయి. 2022లో 1,75,612 కేసులు నమోదు కాగా 2023లో 1,61,334 కేసులకు తగ్గాయి. హత్యలు, దాడులు, దోపిడీలు, దొంగతనాలు, ఘర్షణలు, మహిళలపై నేరాలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. హత్యలు, హత్యాయత్నం కేసులు 10శాతం, దోపిడీలు 28.57శాతం, దొంగతనాలు 37.24 శాతం, పగటి దొంగతనాలు 13.41 శాతం, రాత్రి దొంగతనాలు 13.54 శాతం, రోడ్డు ప్రమాదాలు 7.83 శాతం, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 15.20 శాతం, సైబర్ నేరాలు 25.52 శాతం తగ్గాయి. పోలీసు బీట్లు పునర్వ్యవస్థీకరించడం, నిరంతర పర్యవేక్షణ, అనుమానితుల వేలిముద్రల సేకరణ, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం వంటి విధానాలను పటిష్టంగా అమలు చేశాం. మహిళా భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించి సత్ఫలితాలను సాధించాం. అసాంఘిక శక్తులపై నిఘా, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, మహిళా పోలీసుల సమర్థ వినియోగం, పీడీ యాక్ట్ ప్రయోగం, కన్విక్షన్ బేస్డ్ విధానాలతో నేరాలను గణనీయంగా తగ్గించగలిగాం. పోలీసు శాఖకు చెందిన 4,92,142 కేసులను లోక్ అదాలత్‌ల ద్వారా పరిష్కరించాం. రౌడీలపై ఉక్కుపాదం మోపుతున్నాం. రాష్ట్రంలోని 4వేల మంది రౌడీల్లో వెయ్యి మంది జైళ్లలో ఉన్నారు. ఈ ఏడాది 900 మంది రౌడీలకు న్యాయస్థానాల ద్వారా శిక్షలు విధించగలిగాం. మరో 200 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశాం. మహిళలకు పటిష్ట భద్రత 2023లో రాష్ట్రంలో మహిళలపై నేరాలతోపాటు అన్ని రకాల నేరాలను గణనీయంగా తగ్గించడంలో పోలీసు యంత్రాంగం సమర్థవంతమైన పాత్ర పోషించింది. క్షేత్రస్థాయి వరకు పోలీసింగ్ వ్యవస్థను విస్తృత పరచడం, సమర్థ పర్యవేక్షణ, సున్నిత ప్రాంతాల జియో మ్యాపింగ్ వంటి విధానాలతో మహిళలకు పటిష్ట భద్రత. 2022లో కంటే 2023లో మహిళలపై అత్యాచార కేసులు 28.57శాతం, వరకట్న కేసులు 11.76శాతం, మహిళలపై ఇతర నేరాలు 14శాతం తగ్గడమే అందుకు నిదర్శనం. సమర్థ పోలీసింగ్ విధానాలతో రాష్ట్రంలో అన్ని రకాల నేరాలు భారీగా తగ్గాయి. డ్రగ్స్, గంజాయి కట్టడి డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను సమర్థంగా కట్టడి చేస్తున్నాం. నాటుసారాపై ఉక్కుపాదం మోపాం. మూడేళ్లలో 5 లక్షల కేజీల గంజాయిని జప్తు చేశాం. గిరిజనులకు 2.52 లక్షల ఎకరాల్లో ప్రత్యమ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నాం. విలేకరుల సమావేశంలో అదనపు డీజీ (శాంతి, భద్రతలు) శంకబ్రత బాగ్చి, డీఐజీ రాజశేఖర్‌బాబు కూడా పాల్గొన్నారు. -
యూపీలో మరో ఎన్కౌంటర్.. మహిళా కానిస్టేబుల్‌పై దాడిలో..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో ఎన్కౌంటర్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఎన్కౌంటర్లో మృతిచెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, యూపీలోని అయోధ్యలో జరిగిన ఈ ఎన్కౌంటర్ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. వివరాల ప్రకారం.. ఆగస్టు 30న అయోధ్య రైల్వే స్టేషన్‌లోని సరయు ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ముగ్గురు వ్యక్తుల దాడిలో సదరు మహిళా కానిస్టేబుల్ తలకు తీవ్రగాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. నిందితులు.. పదునైన ఆయుధంతో ఆమె ముఖంపై దాడిచేశారు. వారి దాడిలో ఆమె పుర్రె ఫ్రాక్చర్ అయింది. దీంతో, వెంటనే ఆమెను లక్నోలోని కేజీఎంసీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే, రైలులో సీటు విషయంలో నిందితులు, మహిళా కానిస్టేబుల్‌కు మధ్య రైలులో గొడవ జరిగినట్టు పోలీసులు తెలిపారు. గొడవ మరింత పెరగడంతో కానిస్టేబుల్‌పై నిందితులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఇక, రైలు అయోధ్యకు చేరుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. #UttarPradesh: Main accused in case of attack on lady police constable killed in police encounter in Saryu Express near Ayodhya. pic.twitter.com/Gd4fqpWv9s — All India Radio News (@airnewsalerts) September 22, 2023 ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, శుక్రవారం ఉదయం పోలీసులకు నిందితులు కనిపించడంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా నిందితులు వారి వద్ద ఉన్న తుపాలకులతో పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో, పోలీసులు కూడా కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ప్రధాన నిందితుడు అనీస్ ఖాన్ మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన అజాద్ ఖాన్, విశ్వంభర్ దయాళ్గా గుర్తించారు. అనంతరం, వారిని ఆసుపత్రికి తరలించారు. కాల్పుల సందర్భంగా కలండర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు రతన్‌శర్మకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీనియర్ సూపరింటెండెంట్ రాజ్ కరణ్ నయ్యర్ మాట్లాడుతూ.. నిందితులు కాల్పుల జరపడంతోనే పోలీసులు ఫైరింగ్ చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే అనిస్ ఖాన్ మృతిచెందినట్టు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ప్రెసిడెన్షియల్ సూట్ వద్దన్నాడు.. విమానాన్ని కాదన్నాడు! -
ఏపీలోనే మహిళా పోలీసులు అత్యధికం
సాక్షి, అమరావతి: దేశంలో మహిళా పోలీసులు అత్య«దికంగా ఉన్న రాష్ట్రాల్లో అంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని 28 రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో అత్యధికంగా 21.76 శాతం మంది మహిళా పోలీసులు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధికంగా బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో ఉన్నారు. కాగా అఖిల భారత స్థాయిలో మహిళా పోలీసులు చాలా తక్కువగా ఉన్నారు. జాతీయ స్థాయిలో 11.75 శాతమే ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. పోలీసుల అంశం రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీతోపాటు మహిళా కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించి అదనపు పోస్టులను సృష్టించాలని సూచించింది. ప్రతి పోలీసు స్టేషన్లో కనీసం ముగ్గురు మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు, 10 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్లు పేర్కొంది. తద్వారా పోలీస్ స్టేషన్లో మహిళా హెల్ప్‌డెస్క్ 24 గంటలు పనిచేస్తుందని తెలిపింది. -
రక్షక దళంలో వీర నారీమణులు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : అసలే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం... అక్కడ పోలీస్ డ్యూటీ అంటే కత్తిమీద సాము లాంటిదే.. అలాంటి ప్రాంతంలో మహిళా పోలీసులు డ్యూటీ చేయడం అంటే అసాధ్యం అంటారు. కానీ వనదేవతలు కొలువైన ములుగు జిల్లాలో మహిళా రక్షకభటులే ఆ ప్రాంతానికి రక్షణ కవచంలా మారారు. మారుమూల అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ ఆడది అబల కాదు... కనిపించని ‘నాలుగో సింహమేరా పోలీస్’ అని నిరూపిస్తున్నారు. అన్నల ఇలాఖా ఆడ పోలీసులకు అడ్డాగా మారింది. పురుషులతో సమానంగా... సెంట్రీ నుంచి ఎస్హెచ్ఓ వరకు తెలంగాణలో అధికశాతం అటవీప్రాంతం గల జిల్లా ములుగు. అడవే కాదు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువైన జిల్లాలో పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అలాంటి ప్రదేశంలో పోలీస్ డ్యూటీ అంటే మగవారికే ముచ్చెమటలు పడుతాయి. కానీ మహిళా పోలీసులు నిర్భయంగా పని చేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు కానిస్టేబుల్ నుంచి ఎస్సై స్థాయి వరకు 150 మంది మగవారితో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. ఏ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా రిసెప్షనిస్ట్, హెల్ప్‌డెస్క్ లో మహిళా పోలీసులు ఉండడం సహజం. కానీ వెంకటాపూర్‌లో 28 మంది పోలీస్ సిబ్బంది ఉంటే అందులో 22 మంది మహిళలే ఉన్నారు. జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్లేకపోయినా, వెంకటాపూర్ పీఎస్‌ను చూస్తే మహిళా పోలీస్ స్టేషన్ అనక తప్పదు. సెంట్రీ డ్యూటీ నుంచి ఇన్చార్జ్ ఎస్హెచ్ఓ డ్యూటీ వరకు మహిళా రక్షకభటులే నిర్వహిస్తారు. ప్రస్తుతం అందులో సగం మంది ఎస్సై పోస్ట్ కొట్టేందుకు కోచింగ్ తీసుకుంటున్నారు. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అక్కడికి చేరి శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజాసేవలో ముందుంటున్నారు. సరిహద్దు ఠాణాల్లో మన మహిళా శివంగులు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్, డెవలప్మెంట్ (బీపీఆర్డీ) గణాంకాల ప్రకారం 2021 జనవరి 1 నాటికి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటే.. మహిళా పోలీసుల సంఖ్యలో తెలంగాణది 25వ స్థానం. ఈ విషయంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా.. తెలంగాణలో ఉన్న వారు అందులో సగం కంటే తక్కువ. రాష్ట్రంలో మొత్తం పోలీసుల సంఖ్యలో 8.03 శాతం మాత్రమే మహిళలు. వీరిలో 76.5 శాతం క్షేత్రస్థాయిలోని కానిస్టేబుళ్లే. అదనపు డీజీపీలు అయిదుగురు, ఐజీలు ఇద్దరు, డీఐజీ ఒకరు, ఎస్పీలు 15 మంది, అదనపు ఎస్పీలు 19 మంది, డీఎస్పీలు నలుగురు, ఇన్స్పెక్టర్లు 58 మంది, ఎస్సైలు 514 మంది, ఏఎస్సైలు 214 మంది, హెడ్‌కానిస్టేబుళ్లు 280 మంది, కానిస్టేబుళ్లు 3,630 మంది ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌లో అన్ని కేడర్లలో 8 వేలకు పైగా ఉండగా.. అందులో మహిళలు వెయ్యి మందికిపైగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పని చేస్తుండటం విశేషం. -
మహిళా పోలీస్..లెక్కలో లెస్..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర జనాభాలో మహిళలు దాదాపు సగం (49.7 శాతం) ఉన్నప్పటికీ... మహిళా పోలీసుల శాతం మాత్రం ఇప్పటికీ నామమాత్రంగానే ఉంది. కేంద్రం అధీనంలోని బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్ అండ్ డీ) గణాంకాల ప్రకారం రాష్ట్ర పోలీసు విభాగంలో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది, అధికారుల సంఖ్య 62,731గా ఉండగా అందులో మహిళా పోలీసులు కేవలం 5,349 (8.53 శాతం) మందే ఉన్నారు. 2021 జనవరి నాటి పరిస్థితుల ఆధారంగా... బీపీఆర్ అండ్ డీ ఏటా అన్ని రాష్ట్రాలు, కమిషనరేట్లలో పోలీసు సిబ్బంది వివరాలను సేకరిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న జనాభాతో పురుష–మహిళా పోలీసులు, సివిల్–ఆర్మ్డ్ రిజర్వ్ బలగాల్లోని సిబ్బందిని గణించి నివేదిక రూపొందిస్తోంది. 2021 జనవరి నాటి గణాంకాల ఆధారంగా అధ్యయనం చేసిన బీపీఆర్ అండ్ డీ... రాష్ట్రంలో మహిళలకు అవసరమైన స్థాయిలో మహిళా పోలీసులు లేరని స్పష్టం చేసింది. అయితే అన్ని రాష్ట్రాలూ మహిళా పోలీసు పోస్టుల సంఖ్య పెంచడంతోపాటు భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఉన్న సిబ్బందికీ సమస్యలెన్నో... ప్రస్తుతం పోలీసు విభాగంలో ఉన్న మహిళా సిబ్బందిని ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. చాలా మంది మహిళా పోలీసులు స్థూలకాయంతో బాధపడుతున్నారు. వ్యాయాయం లేకపోవడం, ఏళ్ల తరబడి కార్యాలయ విధులకే పరిమితం కావడంతో బందోబస్తు డ్యూటీ చేయాల్సి వస్తే నిరసనకారులను అదుపు చేయడం వారికి సాధ్యం కావట్లేదు. కొత్తగా విధుల్లో చేరిన యువ మహిళా సిబ్బంది మినహా మిగిలిన వారిలో అనేక మందికి ఈ సమస్యలు ఉన్నాయి. మహిళా పోలీసు సిబ్బంది కొరత తీర్చడంతోపాటు ఉన్న వారిలోనూ నైపుణ్యాలు మెరుగుపరచడానికి ఉమ్మడి రాష్ట్రంలో తెరపైకి వచ్చిన ప్రతిపాదనలు ఇప్ప టికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. మహిళా పోలీసులకు సమకాలీన అంశాలపై అవగాహన కల్పించడం, వృత్తిలో మెళకువలు నేర్పే ఉద్దేశంతో క్రాష్‌కోర్స్ నిర్వహించాలని గతంలో భావించారు. అయితే ఈ ప్రక్రియ కొందరికి పూర్తయినా మిగిలిన వారికి ఆగిపోయింది. ప్రత్యేక మహిళా బెటాలియన్ ఏర్పాటుకు సన్నాహాలు చేసినా ఆచరణకి రాలేదు. ఎట్టకేలకు లా అండ్ ఆర్డర్‌కు నేతృత్వం.. హైదరాబాద్‌లోని మూడు కమిషరేట్లలో 150కిపైగా లా అండ్ ఆర్డర్ పోలీసుస్టేషన్లు, ఐదు మహిళా ఠాణాలు ఉన్నాయి. మహిళా ఠాణాలకు ఉమెన్ ఆఫీసర్లే నేతృత్వం వహిస్తున్నా చాలాకాలం వరకు మూడు కమిషనరేట్లలో ఏ ఒక్క శాంతి భద్రతల విభాగం పోలీసుస్టేషన్‌కు మహిళా పోలీసును స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా నియమించిన దాఖలాలు లేవు. అయితే హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గతేడాది మహిళా దినోత్సవం రోజు లాలాగూడ ఠాణాకు మధులతను మొదటి మహిళా ఎస్హెచ్ఓగా నియమించారు. మరోవైపు గతంలో మహిళా పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినా అభ్యర్థి నుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన ఉండేది కాదని... తాజాగా చేపట్టిన పోలీసు రిక్రూట్మెంట్లో స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతోపాటు వారికి అనేక వెసులుబాట్లు కల్పించడంతో పోలీసు విభాగంలో అతివల కొరత చాలా వరకు తీరుతుందని అధికారులు చెబుతున్నారు. -
‘బయల్దేరుదామా రజతి’ అంటుంది 34 ఏళ్ల సుకన్య డ్యూటీ ఎక్కబోతూ...
అలుపెరగని కెరటాలు. ఆహ్లాదానికి వచ్చే జనాలు. ఉత్సాహం శృతి మించితే ప్రాణానికే ప్రమాదం. అదుపు చేయాలి పిల్లల్ని పెద్దల్ని. చెన్నై మెరీనా బీచ్ ప్రతి ఉదయం సాయంత్రం జన సముద్రం. వారు ప్రమాదాల బారిన పడకుండా అశ్వదళం నిత్యం గస్తీ కాస్తుంటుంది. వారిలో ఐదుగురు మహిళా పోలీసులు ఉన్నారు. అశ్వాన్ని అధిరోహించి ఈ చివర నుంచి ఆ చివరకు కెరటాల మీద రేఖ గీస్తుంటారు. మగ పోలీసుల మాట కంటే ఈ మహిళా పోలీసుల మాటే జనం ఎక్కువగా వింటారు. జీను మీద కూచుని వీరు సాగించే సవారీ కష్టమైనది. స్ఫూర్తిదాయకమైనది. వారి పరిచయం. ‘బయల్దేరుదామా రజతి’ అంటుంది 34 ఏళ్ల సుకన్య డ్యూటీ ఎక్కబోతూ. 12 ఏళ్లుగా అశ్వదళంలో పని చేస్తున్న సుకన్యకు ప్రియమైన అశ్వం రజతి. డ్యూటీ వాళ్లిద్దరూ కలిసి చేయాలి. ఒకరు లేకుండా మరొకరికి డ్యూటీ అసంపూర్ణం. ‘గ్రేటర్ చెన్నై మౌంటెడ్ బ్రాంచ్’ (అశ్వదళం)లో ఇప్పుడు 26 అశ్వాలు ఉన్నాయి. వాటితో డ్యూటీ చేస్తున్న సిబ్బంది సంఖ్య 30. వారిలో ఐదుగురు మహిళా పోలీసులు. వీరి శాఖ పుదుపేటలో ఉంటుంది. వీరి ప్రధాన డ్యూటీ మెరీనా బీచ్‌ను కాపు కాయడమే. పోకిరీల నుంచి కాపాడాలి బంగాళాఖాతంలో అలల తాకిడి ఎక్కువ. విహారానికి వచ్చినవారు అత్యుత్సాహంతో లోపలికి వెళితే ప్రాణాలకు ప్రమాదం. అందుకని సుకన్య, ఇతర గస్తీ సిబ్బంది అలల్లో తడుస్తూనే తిరుగుతూ సందర్శకులను తీరం వైపు తరుముతుంటారు. ‘అది ఒక్కటే కాదు... అమ్మాయిలను వేధించే పోకిరీల నుంచి, చైన్ స్నాచర్ల నుంచి, పార్కింగ్ దగ్గర వాహనాలు ఎత్తుకెళ్లే దొంగల నుంచి కూడా జనాన్ని కాపాడాలి. అలాగే తప్పిపోయిన పిల్లలను వెతికి పెట్టాలి. ఒక్కోసారి జనం తాకిడి ఎక్కువైతే చాలామంది పిల్లలు తప్పిపోతూ ఉంటారు’ అంటుంది సుకన్య. ‘నేను మామూలు లాఠీ పట్టుకుని నేల మీద యూనిఫామ్‌తో నడుస్తూ వస్తే ఏ పోకిరీ మాట వినడు. అదే గుర్రం మీద వస్తే ఆ కథే వేరు. పరిగెడతారు’ అంటుంది నవ్వుతూ. ప్రమాదాలు ఉంటాయి అయితే ఈ ఉద్యోగం అంత సామాన్యం కాదు. మన మూడ్ బాగలేకపోతే గుర్రం గ్రహిస్తుంది. అలాగే గుర్రం మూడ్ పాడైతే మనం గ్రహించాలి. ఈ రెంటి మధ్య సమన్వయం లేకపోతే ప్రమాదం. ‘ఒకసారి న్యూ ఇయర్ నైట్ జనం విపరీతంగా వచ్చారు బీచ్‌కి. గుర్రం బెదిరి భయంకరంగా పరిగెత్తింది. దాని మీద ఉన్న నా గుండెలు అవిసిపోయాయి. అది ఎక్కడ ఆగుతుందో చెప్పలేము. అది ఆగాక ఒక్కసారిగా గెంతి, దాని మెడ నిమిరి అదుపులోకి తెచ్చాను’ అంటుంది సుకన్య. ఆమెతో పని చేసే జాస్మిన్ అనే కానిస్టేబుల్‌ను అయితే గుర్రం అలల్లోకి విసిరికొట్టింది. మణికట్టు విరిగితే ఆరునెలలక్కానీ మళ్లీ కళ్లేలు పట్టుకోవడం వీలు కాలేదు. మొత్తం ఐదుమంది ఇప్పుడు అశ్వదళంలో సుకన్య, జాస్మిన్, మాళవిక, పునీత, మహలక్ష్మి పని చేస్తున్నారు. సుకన్య, జాస్మిన్ సీనియర్లు అయితే మిగిలిన ముగ్గురూ జూనియర్లు. వీరంతా తమ తమ గుర్రాల మంచి చెడ్డలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వీటికి ప్రతి రోజూ ఆహారం అందించాలి. అందుకు ఒక్కో గుర్రానికి 600 రూపాయలు ఖర్చుపెడుతోంది పోలీస్ శాఖ. గుర్రాలకు స్నానం చేయించడం, మసాజ్, గారం చేయడం ఇవన్నీ చేస్తేనే అవి స్నేహాన్ని పాటిస్తాయి. ‘మేమందరం డ్యూటీ దిగాక గుర్రాలను కాసేపు బుజ్జగించి ఇళ్లకు వెళతాం’ అంటుంది సుకన్య. ఈ గుర్రాలను ఉత్తర ప్రదేశ్ సహరన్పూర్ నుంచి, తమిళనాడు చెట్టినాడ్ నుంచి కొని తెస్తూ ఉంటారు. వీటి కోసంగా ఊటీ నుంచి రోజూ ప్రత్యేకం క్యారట్, గడ్డీ వస్తుంటుంది. పశువైద్యులు చెకప్‌లు నిర్వహిస్తారు. ‘నగరంలో కాసింత ఊపిరి పీల్చుకోవడానికి స్త్రీలు చాలామంది బీచ్‌కు వస్తారు. వాళ్లకు మమ్మల్ని చూస్తే ధైర్యం. డ్యూటీ తృప్తిగా చేయడానికి ఇంతకు మించి కారణం ఏముంది’ అంటారు మెరీనా ధీరలు. ఈసారి చెన్నై వెళితే వారిని చూడండి. సూపర్ సుకన్య కోయంబత్తూరుకు చెందిన సుకన్య అంతవరకూ మగవాళ్లు మాత్రమే పని చేసే అశ్వదళంలో మొదటిసారిగా చేరింది. ‘నేను సినిమాల్లోనే గుర్రాలు చూశాను అప్పటి వరకూ’ అంటుంది సుకన్య. కాని రెండు మూడు నెలల్లోనే ట్రైనింగ్‌లో సుకన్య గుర్రాన్ని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో నేర్చుకుంది. మూడేళ్ల క్రితం వరకూ కూడా మొత్తం అశ్వదళంలో ఆమె ఒక్కర్తే మహిళా పోలీస్. ‘మా ఇంట్లో వాళ్లు మొదట్లో ఈ ఉద్యోగానికి ఒప్పుకోలేదు. ఆడపిల్ల గుర్రం ఎక్కి గస్తీ కాయడం ఏంటి అని ఇప్పటికీ మా అమ్మానాన్నలు అనుకుంటారు. కాని నాకు ఈ ఉద్యోగమే ఇష్టం’ అంటుంది సుకన్య. ఉదయం నాలుగున్నరకు డ్యూటీ మొదలవుతుంది ఆమెది. గుర్రం ఎక్కి మెరీనా బీచ్‌లో వాకింగ్‌కి, విహారానికి, స్నానానికి వచ్చేవారిని అదుపు చేయాలి. వారిని కాపాడాలి. మెరీనా బీచ్ సుదీర్ఘమైన బీచ్. అందుకని గుర్రాలు గస్తీకి బాగా ఉపయోగపడతాయి. అశ్వదళం బ్రిటిష్ హయాం నుంచి ఉన్నా 1926 నుంచి మెరీనా బీచ్ గస్తీకి ఉపయోగిస్తున్నారు. కాని 2011 వరకూ మహిళలు ఎవరూ అందులో చేరలేదు. సుకన్యదే ఆ రికార్డు. ఉదయం 8 వరకూ డ్యూటీ ముగించుకుని మళ్లీ సాయంత్రం 4 గంటలకు గుర్రం ఎక్కుతుంది సుకన్య. 7 గంటల వరకూ డ్యూటీ చేస్తుంది. మొత్తం మీద గుర్రంతో ఆమె రోజూ ఆరు నుంచి ఏడు గంటల పాటు తీరంలో తిరుగుతుంది. -
దిశా మహిళా పోలీసుల మనోభావాలు ఫ్యామిలీ విశేషాలు
-
సచివాలయ మహిళా పోలీస్ దేశానికే ఆదర్శం
సాక్షి, మచిలీపట్నం: గ్రామ సచివాలయ మహిళా పోలీసుల ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదుల స్వీకరణ, తక్షణమే పరిష్కరించే కార్యక్రమం చేపడుతున్న ఏపీ ప్రభుత్వ చర్యలను పలు రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులు ప్రశంసించారు. గ్రామ సచివాలయాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు పోలీస్ సేవలు అందించడంపై శిక్షణ తరగతి (ట్రైనింగ్ సెషన్) నిర్వహించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మంగళవారం నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ శిక్షణ కార్యక్రమంపై నేషనల్ పోలీస్ అకాడమీలో మిడ్ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు చెందిన 87 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బ్రీఫింగ్ ఇచ్చారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తెలుసుకునేలా ఎస్పీ రూపొందించిన ‘ప్రత్యక్ష స్పందన’ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు తిలకించారు. ఈ కార్యక్రమం ద్వారా వారి సమస్యలు చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి ఉండకుండా, వారి గ్రామంలోనే మహిళా పోలీసుల ద్వారా సచివాలయాల నుంచి టైం స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయంలో వచ్చి ఎస్పీతో వారి సమస్యలను చెప్పుకొనేలా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ఎస్పీతో పాటు వారి ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం ద్వారా పోలీస్ అధికారులతో వారి సమస్యను నేరుగా చెప్పుకొనే అవకాశం కల్పించారు. ఎస్పీ ఫిర్యాదుదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ వారి ఎదురుగానే సంబంధిత పోలీస్ అధికారులకు ఆ ఫిర్యాదును బదిలీ చేసి, పూర్తి పారదర్శకంగా పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఫిర్యాదు పురోగతి గురించి బాధితులు మహిళా పోలీస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి చూసిన సీనియర్ ఐపీఎస్ అధికారులు.. సచివాలయ వ్యవస్థను, మహిళా పోలీసుల ఏర్పాటును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. గ్రామ సచివాలయాల్లోనే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సమస్య పరిష్కారానికి కృషిచేస్తున్న సచివాలయ మహిళా పోలీసు వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శమని చెప్పారు. -
ప్రభుత్వ కౌంటర్ పరిశీలించాకే మహిళా పోలీసులపై నిర్ణయం
సాక్షి, అమరావతి: పోలీసుల నియామకానికి సంబంధించి ప్రత్యేక బోర్డు, నిబంధనలు ఉన్నాయని హైకోర్టు గుర్తు చేసింది. మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసు శాఖలో అంతర్భాగంగా పరిగణించేందుకు రాజ్యాంగంలోని అధికరణ 309 కింద ఉన్న అధికారాన్ని ఇలా ఉపయోగించడానికి వీల్లేదని పేర్కొంది. చట్ట నిబంధనలు లేనప్పుడు మాత్రమే అధికరణ 309 కింద అధికారాలను ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది. గ్రామ,వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులను (మహిళా సంరక్షణ కార్యదర్శులు) పోలీసు శాఖలో అంతర్భాగంగా పరిగణించడం అంటే మహిళా పోలీసులను దొడ్డి దారిలో నియమించినట్లేనని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన జీవోల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఈ కేసు అర్హమైందని పేర్కొంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ను పరిశీలించిన తరువాత తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. మహిళా పోలీసుల నియామకం, శిక్షణ, సిలబస్, జాబ్ చార్ట్, సబార్డినేట్ సర్వీసు నిబంధనలను ఖరారు చేస్తూ ఇచ్చిన ఈ రెండు జీవోలను పోలీసు చట్టానికి, నియామక నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
తొలిసారిగా 25 శాతం మంది మహిళా పోలీసు అధికారులు..
కొంత కాలం క్రితం... దక్షిణ సూడాన్‌లోని జుబా నగరంలో జరుగుతున్న యూఎన్ (ఐక్యరాజ్యసమితి) మెడల్ పరేడ్ అది. పతకం స్వీకరించడానికి ఆ ఐదుగురు మహిళా పోలిసు అధికారులు నడిచొస్తుంటే నలుదిక్కుల నుంచి చప్పట్లు మారుమోగాయి. వారి నడకలో సాహస ధ్వని వినిపించింది. దక్షిణ సుడాన్లో ఏ ప్రమాదం ఏ మూల నుంచి మృత్యువును మోసుకొస్తుందో తెలియని కల్లోల ప్రాంతాల్లో పనిచేశారు వారు. పోలిస్ ఇన్స్పెక్టర్ రీనా యాదవ్... చండీగఢ్ డీఎస్పీ భారతి స్వామినాథన్... మహారాష్ట్ర ఇన్స్పెక్టర్ రజనీకుమారి... మహారాష్ట్ర డీఎస్పీ గోపిక జహగిర్దార్.... మహారాష్ట్ర ఏ ఎస్పీ కమలా షెకావత్... రాజస్థాన్ దక్షిణ సుడాన్లో అంతర్యుద్ధ పరిస్థితులను నివారించడంలో తమవంతు పాత్ర పోషించి ‘శభాష్’ అనిపించుకున్నారు. ఐక్యరాజ్యసమితికి మన మహిళా పోలిస్ అధికారుల సాహస ప్రవృత్తి, త్యాగం... సుపరిచితం. (చదవండి: 6 లక్షల పెట్టుబడి.. 4 కుట్టు మిషన్లతో ఆరంభం.. లక్షల్లో ఆదాయం!) తాజాగా... ఆంధ్ర, తెలంగాణ, దిల్లీ, హరియాణ, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, సిక్కిం, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్... మొదలైన రాష్ట్రాలు, రకరకాల సెంట్రల్ పోలిస్ ఆర్గనైజేషన్స్ నుంచి 69 మంది పోలిసు అధికారులు ‘యునైటెడ్ నేషన్స్ మిషన్ సర్వీసెస్: 2022–2024’లో భాగం అయ్యారు. వెహికిల్, వెపన్ హ్యాండ్లింగ్, కంప్యూటర్ స్కిల్స్... మొదలైన వాటికి సంబంధించిన పరీక్షలలో వీరు విజయం సాధించారు. ఈసారి విశేషం ఏమిటంటే ప్యానల్లో తొలిసారిగా 25 శాతం మంది మహిళా పోలిసు అధికారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూఎన్‌లో పనిచేయడానికి వృత్తినిబద్ధత, భిన్నసంస్కృతుల పట్ల గౌరవభావం... ప్రధాన లక్షణాలు అంటారు. అవి మన మహిళాపోలిసు అధికారులలో పుష్కలంగా ఉన్నాయని గత చరిత్ర సగర్వంగా చెప్పకనే చెబుతుంది. (చదవండి: ‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కూడా..) -
మహిళల భద్రత, కుటుంబ వివాదాల పరిష్కారం..
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయిలో కీలక భూమిక పోషించేలా గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. కమ్యూనిటీ పోలీసింగ్ తరహాలో ఈ వ్యవస్థను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. మహిళల భద్రత, కుటుంబ వివాదాల పరిష్కారం, సామాజిక అంశాలపై చైతన్యం కల్పించడం, ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణ తదితర కీలక బాధ్యతలను నిర్వర్తించేలా ఈ వ్యవస్థను రూపొందించనున్నారు. ఇప్పటికే మహిళా పోలీసుల విధులు, బాధ్యతలపై ప్రభుత్వం మార్గదర్శకాలిచ్చింది. ఈ మేరకు వారికి తగిన శిక్షణ ఇచ్చేందుకు పోలీసు శాఖ ప్రణాళికను రూపొందించింది. రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది వరకూ ఉన్న మహిళా పోలీసులకు త్వరలో శిక్షణ కార్యక్రమాన్ని పోలీసు శాఖ చేపట్టనుంది. రాష్ట్రంలోని 21 పోలీసు శిక్షణ కేంద్రాల్లో ప్రస్తుతం ఒక విడతలో 5 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు వసతులున్నాయి. వాటిని మరింత పెంపొందించి రెండు విడతల్లో 15 వేల మందికీ శిక్షణ పూర్తి చేయాలని భావిస్తోంది. ఒక విడతలో మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు.. అలా ఆరు నెలల్లో శిక్షణ పూర్తవుతుంది. శిక్షణకు సిలబస్ ఖరారు శిక్షణ కాలంలో మహిళా పోలీసులకు వారి విధులు, బాధ్యతలపై అవగాహన కల్పిస్తారు. ప్రధానంగా పోలీసు చట్టాలు, న్యాయపరమైన అంశాలపై పట్టు సాధించేలా చేస్తారు. కుటుంబ వివాదాలు తమ దృష్టికి వచ్చినప్పుడు, బాధిత మహిళలు ఆశ్రయించినప్పుడు వారికి ఎలా మనోధైర్యం కల్పించాలి.. ఎలా మార్గనిర్దేశం చేయాలన్న అంశాలపై అవగాహన కల్పిస్తారు. సైబర్ నేరాలకు గురికాకుండా, సామాజిక మాధ్యమాల్లోని వేధింపుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరిస్తారు. తద్వారా మహిళా పోలీసులు తమ పరిధిలోని మహిళలు, విద్యార్థినులు, ఇతరులకు మార్గనిర్దేశం చేయగలుగుతారన్నది పోలీస్ శాఖ ఉద్దేశం. అలాగే ప్రభుత్వ పథకాల పర్యవేక్షణపైనా మహిళా పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నారు. మార్చిలో మొదటి విడత శిక్షణ తరగతులు ప్రారంభించాలని భావిస్తోంది. -
ఏపీ పోలీస్ భేష్.. చార్జిషీట్ల దాఖలులో నంబర్ వన్
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థ మరింతగా బలోపేతమైందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రధానంగా దోషులకు శిక్షలు పడేలా సమర్థ దర్యాప్తు, మహిళా పోలీసుల ప్రాతినిధ్యం పెరగడం సానుకూల పరిణామమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘గుడ్ గవర్నెన్స్–2021’ నివేదిక జ్యుడిషియరీ–పబ్లిక్ సెక్యూరిటీ అనే అంశం కింద వివిధ రాష్ట్రాల్లో పోలీసు వ్యవస్థ ఎలా ఉందనే విషయాలను విశ్లేషించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–21లో మన రాష్ట్రం మెరుగైన పనితీరు కనబరిచిందని నివేదిక స్పష్టంగా పేర్కొంది. దోషులకు సత్వరం శిక్షలు విధించడం, జనాభాను బట్టి పోలీసు అధికారులు– సిబ్బంది నిష్పత్తి, ప్రత్యేకంగా మహిళా పోలీసుల నిష్పత్తి, కేసుల పరిష్కార తీరు అనే నాలుగు ప్రామాణిక అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయించింది. – సాక్షి, అమరావతి సత్వర శిక్షల దిశగా ముందుకు.. వివిధ రకాల నేరాలకు పాల్పడిన దోషులను గుర్తించి సత్వరం శిక్షలు విధించడంలో ఆంధ్రప్రదేశ్ సమర్థవంతమైన పనితీరు కనబరిచింది. 2019–20లో 26.10 శాతం కేసుల్లో దోషులను గుర్తించి శిక్షలు విధించారు. కాగా 2020–21లో 38.40 శాతం కేసుల్లో దోషులను గుర్తించి శిక్షలు విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పోలీస్ అధికారులు నిర్ణీత కాలంలో ఎఫ్ఐఆర్ల నమోదు, చార్జిషీట్లను దాఖలు చేయడం, కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతోనే ఇది సాధ్యమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 60 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రత్యేకంగా పోక్సో న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం ద్వారా కేసుల విచారణ కూడా వేగం పుంజుకుంది. 2020–21లో శిక్షలు పడిన రేటు 12.30 శాతం పెరిగింది. జనాభాకు అనుగుణంగా నియామకాల్లోనూ పురోగతి జనాభా నిష్పత్తికి అనుగుణంగా పోలీస్ అధికారులు, సిబ్బంది నియామకం విషయంలోనూ మన రాష్ట్రం పురోగతి సాధించింది. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా 15 వేల మంది మహిళా పోలీసులను నియమించడం ఇందుకు బాగా దోహదపడింది. 2019–20లో పోలీసు శాఖలో మహిళా పోలీసుల సంఖ్య 4.17 శాతం ఉండగా.. 2020–21లో 5.85 శాతానికి పెరిగింది. పోలీసుల సంఖ్య పెరుగుదల 1.68 శాతం నమోదైంది. -
మహిళా పోలీసులకు పదోన్నతులు
సాక్షి, అమరావతి: మహిళలు, బాలల సంరక్షణలో కీలకమైన సచివాలయ మహిళా పోలీసులకు ఇన్స్పెక్టర్ (నాన్ గెజిటెడ్) వరకు పదోన్నతులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా పోలీసుల నియామకం, శిక్షణ సిలబస్; జాబ్ చార్ట్, సబార్డినేట్ సర్వీస్ నిబంధనలను ఖరారు చేసింది. ఈమేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గుడి విజయకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని పోలీసు శాఖలో ప్రత్యేక విభాగంగా పరిగణిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా పోలీసు, సీనియర్ మహిళా పోలీసు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ), సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ), ఇన్స్పెక్టర్ (నాన్ గెజిటెడ్).. ఇలా ఐదు కేటగిరీలుగా వీరిని పరిగణిస్తారు. మొదటి స్థాయిలో ప్రత్యక్ష ఎంపిక ద్వారా మహిళా పోలీస్‌లను నియమిస్తారు. అనంతరం సీనియర్ మహిళా పోలీస్, ఏఎస్ఐ, ఎస్ఐ, ఇన్స్పెక్టర్ వరకు పదోన్నతులు ఇస్తారు. నియామకం, పదోన్నతులు ఇలా.. ► ఇకపై రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మహిళా పోలీసుల నియామకం ఉంటుంది. ► 90 శాతం మందిని నేరుగా ఎంపిక చేస్తారు. మిగిలిన 10 శాతంలో 5 శాతం అర్హులైన హోమ్ గార్డులకు, మిగిలిన 5 శాతం గ్రామ/వార్డు సచివాలయాల వలంటీర్లకు కేటాయించారు. ► 5 అడుగులు ఎత్తు, 40 కిలోల తగ్గకుండా బరువు ఉన్న అభ్యర్థులు అర్హులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గిరిజనులకు ఎత్తు 148 సెంటీమీటర్లు, బరువు 38 కిలోలు ఉండాలి. ► దేహ దారుఢ్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్)లో 20 నిమిషాల్లో 2 కిలోమీటర్లు నడవాలి. దీంతోపాటు రాత, మెడికల్ పరీక్షల్లో అర్హత సాధించాలి. ► రెండేళ్లు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ► కానిస్టేబుల్ నుంచి సీఐ/ఇన్స్పెక్టర్ వరకు పోలీస్ శాఖలో ఉన్న రిపోర్టింగ్, పర్యవేక్షణ, నిర్ణయాధికారాలు వీరికీ వర్తిస్తాయి. ► శాంతిభద్రతలు, మహిళలు, పిల్లల రక్షణ, ప్రజా సేవలు సహా పలు అంశాలపై ఇన్డోర్, 10 విభాగాల్లో అవుట్ డోర్ శిక్షణ ఉంటుంది. ► మహిళా పోలీస్‌గా కనీసం ఆరు సంవత్సరాలు, సీనియర్ మహిళా పోలీస్‌గా ఐదేళ్లు, ఏఎస్ఐగా ఐదేళ్లు, ఎస్ఐగా ఐదేళ్లు పనిచేసిన వాళ్లు ఆపై పదోన్నతులకు అర్హులు. సంబంధిత పోస్టులో పనితీరు, రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణతను పరిగణనలోకి తీసుకుని పదోన్నతి ఇస్తారు. బోర్డు పరీక్షలకు 90%, పనితీరుకు 10 శాతం వెయిటేజి ఇస్తారు. ► మహిళా పోలీస్ నుంచి ఏఎస్ఐ వరకు జిల్లా పరిధిలో, ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు రేంజ్ పరిధిలో పదోన్నతులు, సీనియారిటీ, బదిలీలు ఉంటాయి. జాబ్ చార్ట్ ► శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను ఎప్పటికప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలి. ► తమ పరిధిలోని విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థులకు రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, మహిళల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించాలి. ► అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలి. ► ఆత్మహత్యలు, ఒత్తిడి అధిగమించడంపై రైతులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. ► అవసరం మేరకు పోలీస్ స్టేషన్లలో కేసుల విచారణకు సహాయపడాలి. ► ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలి. ► బాల్య వివాహాల కట్టడికి ఐసీడీఎస్, రెవెన్యూ, ఇతర శాఖలతో కలిసి పనిచేయాలి. ► గృహ హింస, బాల్య వివాహం, లైంగిక వేధింపుల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ నిర్ణయం గొప్ప పరిణామం గ్రామ మహిళా పోలీస్ వ్యవస్థను సాధారణ పోలీసు విభాగంలో అంతర్భాగం చేయడం గొప్ప పరిణామమని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మహిళా పోలీస్ వ్యవస్థను పోలీసు శాఖలో ప్రత్యేక విభాగంగా పరిగణిస్తూనే వారి సేవలను మరింత సమర్థంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉపయోగించుకునేలా ప్రభుత్వం జీవో జారీ చేయడంపట్ల డీజీపీ బుధవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ‘యూనిఫామ్ అనేది ఒక గౌరవం. సగర్వంగా యూనిఫామ్ ధరించండి. ప్రజా సేవలో పునరంకితమవ్వండి. మహిళా పోలీసులకు పోలీస్ శాఖలో తగిన గౌరవం ఉంటుంది’ అని పేర్కొన్నారు. పోలీసు శాఖ పదోన్నతులతో సంబంధం లేకుండా మహిళా పోలీసులకు ప్రత్యేకంగా పదోన్నతులు లభిస్తాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, వార్డుకు ఒక మహిళను పోలీసు ప్రతినిధిగా నియమించిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. సామాన్యులకు మెరుగైన సేవలందిస్తూనే, మహిళలు, చిన్నారులు, అట్టడుగు వర్గాల రక్షణే ధ్యేయంగా మహిళా పోలీసు వ్యవస్థను సమర్థవంతంగా, ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో విధులు నిర్వర్తించనున్న మహిళా పోలీసులకు నాలుగు నెలలు శిక్షణ ఇస్తామన్నారు. మొదటి మూడు నెలలు పోలీస్ కళాశాలలో, మరో నెల క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తామన్నారు. మహిళా పోలీసుల పదోన్నతులపై తాజా జీవోను స్వాగతిస్తున్నామని పోలీస్ అధికారుల సంఘం పేర్కొంది. ఇంతవరకు ఈ వ్యవస్థపై నెలకొన్న అపోహలకు ప్రభుత్వం తెరదించిందని తెలిపింది. -
చిరుత దళం; వాళ్లు చంపాలని.. వీరు కాపాడాలని!
చిరుతపులిని రక్షించాలా? మనిషినా? ఏ ప్రాణమూ తక్కువ విలువైనది కాదు అంటారు ఈ ఏడుగురు. అడవి నుంచి ఊళ్లలోకి వచ్చే చిరుతలను పట్టి మళ్లీ అడవిలో వదలడానికి సూరత్ సమీపాన ఉండే మాండ్వి అటవీ ప్రాంతంలో ప్రత్యేక మహిళా దళం పని చేస్తోంది. ఏడుగురు ఉండే ఈ దళం అడవిలోని చిరుతలకు రక్షకులు. కొత్త చిరుత కనిపిస్తే పట్టుకుని వాటికి ‘రేడియో ఫ్రీక్వెన్సీ’ ట్యాగ్స్‌ను అమర్చడం కూడా వీరి పనే. కాంక్రీట్ అరణ్యంలో తిరగడానికి జంకే కొందరు స్త్రీలు ఉన్న రోజుల్లో కీకారణ్యంలో ధైర్యంగా తిరుగుతూ స్ఫూర్తినిస్తున్నారు వీరు. విధి నిర్వహణలో చిరుత దళ సభ్యులు ప్రభుత్వం చిరుతలను అదుపు చేయడానికి చేయవలసిందంతా చేస్తోంది. ఒక్క అడవులను తెగ నరకడాన్ని సమర్ధంగా ఆపు చేయడం తప్ప. సూరత్ (గుజరాత్) జిల్లాలోని మాండ్వి అంటే భిల్లుల సామ్రాజ్యం. అటవీ ప్రాంతం. భిల్లులు, అడవి మృగాలు కలిసి జీవించిన ప్రాంతం అది ఒకప్పుడు. ఇప్పుడు అరా కొరా అడవి మిగిలింది. వాటిలోని చిరుతలు ఏం చేయాలో తెలియక ఊళ్ల మీద పడుతున్నాయి. మాండ్వి అడవిని ఒరుసుకుంటూ పారే తాపి నది ఒడ్డున ఉన్న పల్లెల్లో ఒకప్పుడు కోళ్లు, గొర్రెలు, పశువులు పెంచేవారు. ఇప్పుడు మానేశారు చిరుతల దెబ్బకు. ఒక ఊరిలో కుక్కలు మాయమయ్యాయంటే చిరుతలు తరచూ దాడి చేస్తున్నట్టు అర్థం. ఆ ప్రాంతంలో ఒకప్పుడు కనిపించిన నెమళ్లు, కోతులు, కుక్కలు అన్నీ పారిపోయాయి. మాండ్వి అడవిలో దాదాపు 50 చిరుతలు ఉన్నట్టు అంచనా. ప్రభుత్వానికి వాటిని కాపాడటం ఎంత అవసరమో మనుషుల్ని కాపాడటం కూడా అంతే అవసరం. మృగానికి మనిషికి మధ్య తకరారు వచ్చినప్పుడల్లా ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగుతుంది. అయితే చిరుత దాడి వల్ల మనిషినో, పశువునో కోల్పోయిన గ్రామస్తులు చాలా కోపంగా ఉంటారు. చిరుతను కొట్టి చంపాలని చూస్తారు. ఆ సమయంలో మగ ఫారెస్ట్ సిబ్బంది మాట వినరు. కాని మహిళా సిబ్బంది అయితే నచ్చ చెప్పే అవకాశం ఎక్కువ. అందుకే ఫారెస్ట్ ఆఫీసర్లు ఏడుగురు మహిళలతో చిరుత దళాన్ని ఏర్పాటు చేశారు. మాండ్వి ప్రాంతంలో చిరుతను పట్టుకోవాలన్నా, దూరంగా తీసుకెళ్లాలన్నా, దాడుల నుంచి కాపాడాలన్నా, వాటిని పట్టి వాటి కదలికల్ని తెలియచేసే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ అమర్చాలన్నా అదంతా ఈ ఏడుగురు మహిళా సిబ్బంది పనే. స్థానిక సమూహాల నుంచి ఈ మహిళా సిబ్బందిని తీసుకోవడం వల్ల వారికి అడవి తెలుసు. మచ్చల ఒంటితో హఠాత్తుగా ఊడి పడే చిరుతా తెలుసు. వారు భయపడరు. ‘గత సంవత్సర కాలంలో మేము 22 చిరుతలను పట్టుకుని వాటికి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ అమర్చాము’ అంటుంది ఈ దళానికి నాయకత్వం వహించే పూజా సింగ్. ‘ఇంకా కనీసం 20 లేదా 30 చిరుతలకు ఈ పని చేయాల్సి ఉంది. కాని చిరుతలు అంత సులువుగా దొరకవు. బోన్లో పడవు. వాటి కోసం వేచి ఉండాలి. అదే సమయంలో అవి ఉత్త పుణ్యానికి దాడి చేయవు’ అంటారు ఈ చిరుత దళ సభ్యులు. ‘ఒకసారి అడవిలో కార్చిచ్చు వ్యాపించింది. మేము అదుపు చేసే పనిలో ఉన్నాం. అప్పుడు మా సమీపంగా చిరుత వచ్చింది. అలాంటి సమయంలో రెచ్చగొట్టే పనులు చేయకూడదని మేము తర్ఫీదు అయి ఉన్నాం. కనుక మేము ఏమీ చేయలేదు. అదీ ఏమీ చేయకుండా వెళ్లిపోయింది’ అంటారు ఈ సిబ్బంది. కాని అన్నిసార్లు పరిస్థితి ఇంత సులువుగా ఉండదు. విధి నిర్వహణలో చిరుత దళ సభ్యులు మధార్కుయి గ్రామంలో చిరుత దాడి చేసి ఒక నాలుగేళ్ల పాపాయిని చంపేసింది. గ్రామస్తులు అగ్గి మీద గుగ్గిలం అయ్యి చిరుత వెంట పడ్డారు. అది ఊళ్లోనే నక్కింది. చిరుత దళానికి కబురు అందింది. వీరు ఆఘమేఘాల మీద చేరుకున్నారు. గ్రామస్తులు ఆ చిరుతను చంపాలని. వీరు కాపాడాలని. ‘చివరకు గాలిలో కాల్పులు జరిపి చిరుతను ప్రాణాలతో పట్టుకున్నాం. లోపలి అడవిలో దానిని వదిలిపెట్టాం’ అన్నారు ఆ దళ సభ్యులు. మాండ్వి అడవంచు పల్లెల్లో చెరకు పంట వేస్తారు. పెరిగిన చెరకు పంట చిరుతలకు దాక్కోవడానికి అనువుగా ఉంటుంది. కనుక దాడి చేస్తాయి. మరోవైపు అడవిలో ఆహారం దొరక్కపోవడం, వేసవిలో నీటి కుంటలు ఎండిపోవడం వల్ల కూడా ఊళ్ల మీదకు వస్తాయి. ‘వేసవిలో అవి నీరు తాగే చోటుకు నీరు చేర వేసి ఆ కుంటలు నిండుగా ఉండేలా చూస్తాం’ అంటారు చిరుత దళ సిబ్బంది. వీరు చిరుతలను కాపాడటమే కాదు ఉచ్చుల్లో చిక్కుకున్న అటవీ మృగాలను, గాయపడ్డ పక్షులను కూడా కాపాడుతుంటారు. చిరుతల కోసం ఇలా ఏడుగురు స్త్రీలు ప్రాణాలకు తెగించి పని చేయడం ఈ కాలంలో స్ఫూర్తినిస్తున్న గొప్ప విశేషం. స్త్రీల చేతుల్లో అడవి క్షేమంగా ఉంటుంది అనడానికి మరో నిదర్శనం. ‘ఒకసారి అడవిలో కార్చిచ్చు వ్యాపించింది. మేము అదుపు చేసే పనిలో ఉన్నాం. అప్పుడు మా సమీపంగా చిరుత వచ్చింది. అలాంటి సమయంలో రెచ్చగొట్టే పనులు చేయకూడదని మేము తర్ఫీదు అయి ఉన్నాం. కనుక మేము ఏమీ చేయలేదు. అదీ ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. -
యూని‘ఫామ్’లోకి రానివ్వరా?
సాక్షి, హైదరాబాద్: ఆకాశంలో సగం, అర్ధాంగి.. మహిళల గురించి తరచూ చెప్పుకునే, వినే పదాలివి. రాజకీయాలు, క్రీడలు, వ్యాపారం.. ప్రతీ రం గంలోనూ పురుషులకు దీటుగా మహిళలు రాణిస్తున్నారు. ఉద్యోగాల్లోనూ ఉన్నత స్థాయిలో ప్రతిభ చూపుతున్నారు. కానీ తెలంగాణ పోలీస్ శాఖలో మాత్రం చాలామంది మహిళా అధికారులకు ప్రాధాన్యత లభించడం లేదని, శాంతి భద్రతల విభాగంలో అవకాశంతో పాటు ఫోకల్ (ప్రాధాన్యత కలిగిన) పోస్టులు దక్కడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతమంది ఎప్పుడో ఉద్యోగంలో చేరిన కొత్తలో శాంతి భద్రతల విభాగంలో డ్యూటీ చేశారంటే.. ఇప్పటివరకు మళ్లీ పోలీస్ యూనిఫామ్ వేసింది లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. నియామకాల్లో భాగంగా సివిల్ కేటగిరీలో 33% రిజర్వేషన్, ఆర్మ్డ్ రిజర్వ్‌లో 10% రిజర్వేషన్ కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. మహిళా అధికారులు, సిబ్బంది సంఖ్య భారీగా పెంచాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ మహిళా పోలీస్ అధికారులకు పోస్టింగుల విషయంలో మాత్రం న్యాయం జరగడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. నల్లగొండ, సూర్యాపేటల్లో మహిళా ఎస్ఐలే లేరు తెలంగాణ ఏర్పాటు తర్వాత చేపట్టిన నియామకాలతో మహిళా సబ్ ఇన్స్పెక్టర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే ట్రైనింగ్‌లో పోలీస్స్టేషన్లలో విధులు నిర్వర్తించడంతో పాటు ప్రొబేషన్ పూర్తయ్యే లోపు ఒక పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేయాల్సి ఉం టుంది. ఈ నిబంధనలను సైతం పోలీస్ శాఖ పక్కన పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 60లోపు మాత్రమే మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు శాంతి భద్రతల విభాగంలో పనిచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్ జోన్లో నలుగురు, బాలానగర్ జోన్లో ఇద్దరు మహిళా ఎస్ఐలు ఉండగా.. శంషా బాద్ జోన్లో ఒకే ఒక్కరు ఉన్నారు. రాచకొండ పరిధిలో ఎల్బీనగర్ జోన్లో ఇద్దరు ఉండగా.. మల్కా జ్గిరి జోన్లో ఒక్క మహిళా ఎస్ఐ కూడా లేకపోవడం గమనార్హం. భువనగిరి జోన్లో ఒకే ఒక్కరు ఈ విభాగంలో ఉన్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో సెంట్రల్ జోన్, ఈస్ట్‌జోన్, సౌత్జోన్లో ఒక్కొక్కరు చొప్పున ఉండగా, వెస్ట్‌జోన్‌లో ఇద్దరు, నార్త్‌జోన్‌లో నలుగురు ఉన్నారు. నల్లగొండ, సూర్యా పేట జిల్లాల్లో ఒక్క మహిళా ఎస్ఐ కూడా లేరు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, సంగారెడ్డి, రామగుండం, మహబూబ్‌నగర్‌లో ఒక్కొక్కరు మాత్రమే ఉండగా ఖమ్మంలో ఎనిమిది మంది, మెదక్‌లో ఇద్దరు, వనపర్తిలో ముగ్గురు, జోగులాంబ గద్వాలలో ఆరుగురు, సిద్దిపేటలో ఇద్దరు, నిర్మల్‌లో ముగ్గురు మహిళా ఎస్ఐలు పనిచేస్తున్నారు. ఈ జిల్లాల్లో ఎక్కువమంది.. మహిళా ఎస్ఐలు శాంతి భద్రతల విభా గాల్లో పనిచేస్తున్న జిల్లాల్లో జగిత్యాల, ఆదిలాబాద్, వరంగల్ కమిషనరేట్లు టాప్‌లో ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో 9 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 8 మంది, వరంగల్ కమిషనరేట్ లో 9 మంది మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు లా అండ్ ఆర్డర్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 1996 బ్యాచ్‌లో ఎస్ఐగా పోలీస్ శాఖలో అడుగుపెట్టిన అధికారుల నుంచి 2012 బ్యాచ్ వరకు మహిళా అధికారులు మొదట్లో ఒక రెండు పోలీస్స్టేషన్లలో లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేశారు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు కనీ సం మహిళా ఠాణాలో కూడా అవకాశం రాకపోవ డం తీవ్ర నిరాశకు గురిచేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశా రు. సీఐడీ, ఏసీబీ, సీసీఎస్, డీసీఆర్బీ, ఐటీ కోర్‌టీం, షీటీమ్స్, సైబర్ క్రైమ్, కొన్ని చోట్ల ట్రాఫిక్ విభాగాల్లో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్నారు. డీసీపీలు, అదనపు డీసీపీలదీ అదే పరిస్థితి గ్రూప్ వన్, ప్రమోషన్ల ద్వారా పోలీస్ శాఖలోకి అడుగుపెట్టిన మహిళా అధికారులదీ అదే పరిస్థితి కేవలం వరంగల్ మినహా ఎక్కడా కూడా శాంతి భద్రతల విభాగంలో మహిళా అధికారులకు పెద్దగా ప్రాధాన్యత దక్కింది లేదు. ట్రాఫిక్‌తో పాటు క్రైమ్, ఇతర విభాగాల్లో ఎస్పీ స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిలోనూ అవకాశం లేకపోవడం అధికారులను ఆవేదనకు గురిచేస్తోంది. అదే విధంగా అదనపు డీసీపీ శాంతి భద్రతలు, ట్రాఫిక్, క్రైమ్ పోస్టులు ఖాళీగా ఉన్నా మహిళలకు అవకాశం కల్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్/ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఏసీపీ/డీఎస్పీ స్థాయిలో మహిళా అధికారులకు ఫోకల్ పోస్టింగులు ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నా.. రాజకీయ పలుకుబడితో జరిగే బదిలీల కారణంగా ఇది సాధ్యపడటం లేదనే ఆరోపణలున్నాయి. 356లో ఇద్దరే ఇద్దరు రాష్ట్రంలో శాంతి భద్రతల విభాగంలో సర్కిల్ ఇన్స్పెక్టర్/ఇన్స్పెక్టర్(సీఐ) హోదా కల్గిన స్టేషన్ హౌస్‌అధికారి (ఎస్హెచ్ఓ) పోలీస్స్టేషన్లు 356 ఉన్నాయి. వీటిల్ల కేవలం ఇద్దరు మాత్రమే మహిళా ఇన్స్పెక్టర్లు (రాజన్న సిరిసిల్లా జిల్లా, మహబూబ్‌నగర్) మాత్రమే ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఉన్న మహిళా పోలీస్స్టేషన్లలోనూ పురుష అధికారులే ఎక్కువ ఠాణాలకు ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్నారు. మహిళల వేధింపుల కేసులు, భార్యాభర్తల కేసులతో పాటు సంబంధిత కేసులను పర్యవేక్షించాల్సిన స్థానాల్లో పురుషులుండటం వివాదాస్పదంగా మారుతోంది. మొత్తం 17 మహిళా పోలీస్స్టేషన్లు ఉండగా.. 13 చోట్ల పురుషులే ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లోని మూడు ఠాణాల్లో, సరూర్‌నగర్ ఠాణాలో మాత్రమే మహిళా ఇన్స్పెక్టర్లు విధులు నిర్వస్తున్నారు. కనీసం నూతన జిల్లాల్లో అయినా మహిళా ఠాణాలు ఏర్పాటు చేస్తే కాస్తో కూస్తో యూనిఫాం వేసుకొని డ్యూటీలు చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందని ద్రాక్షగా కమిషనర్ పోస్టు ఉమ్మడి రాష్ట్రంలో, ప్రస్తుతం తెలంగాణలో ఏ ఒక్క మహిళ ఐపీఎస్‌కూ పోలీస్ కమిషనర్‌గా పనిచేసే అవకాశం రాలేదు. అదనపు డీజీపీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ హోదాల్లో ఐపీఎస్ అధికారులున్నా కమిషనర్‌గా మాత్రం అవకాశం దక్కడం లేదు. తమకు అవకాశం కల్పిస్తే సత్తా చాటుతామని మహిళా అధికారులంటున్నారు. -
యూనిఫాంతోనే సమాజంలో గుర్తింపు
సాక్షి, అమరావతి : పోలీస్ యూనిఫాం వల్ల తమకు సమాజంలో మరింత గుర్తింపు, గౌరవం, రక్షణ లభిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులు పేర్కొన్నారు. తమకు యూనిఫాం విధానాన్ని కొనసాగించాలని మహిళా పోలీసుల సంఘం ప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితను కలిసి వినతి పత్రం సమర్పించారు. రెండేళ్లుగా నిబద్ధతతో పని చేస్తూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో మహిళల ఆదరణ పొందామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు యూనిఫాం లేకపోతే విధి నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు దురుద్దేశంతో చేస్తున్న దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దని కోరారు. -
Anila Parashar: మహిళా పోలీస్..శీతల సైనికురాలు
Madhya Pradesh: Woman Police Anila Parashar donate blankets to homeless people: నిరాశ్రయులై వీధుల్లో తలదాచుకునేవారికి ఒంటిమీద బట్టలే సరిగా ఉండవు. ఇక చలి నుంచి రక్షణకు కంబళ్లు, దుప్పట్లు అంటే కష్టమైన పనే. అలాంటి వారు పడే ఇబ్బందులను గుర్తించిన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అనిలా పరాశర్ రాత్రిపూట వీధుల్లో పడుకునే నిరాశ్రయులకు దుప్పట్లు, రగ్గులు పంచుతూ ఉదారతను చాటుకుంటోంది. ఈ మహిళా పోలీస్ చేసే పని పై అధికారులను కూడా కదిలించింది. పోలీసులే బృందాలుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని మూడేళ్ల నుంచి నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తోంది. అనిలా పరాశర్ చేస్తున్న ఈ దాతృత్వాన్ని తెలుసుకోవడానికి అక్కడి ఏ పోలీసును అడిగినా ఆమె గొప్పతనాన్ని చెబుతారు. కదిలించిన సంఘటనలు మూడేళ్ల క్రితం చలికాలంలో రాత్రిపూట ఆమె విధుల్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు విపరీతమైన చలి కారణంగా కొందరు మహిళలు, వృద్థులు చనిపోవడం చూశామని చెబుతారు అనిల. ‘ఆ హృదయవిదారక సంఘటనలు ఇప్పటికీ నా కళ్లముందు కదులుతూనే ఉంటాయి. ఆ పరిస్థితులను గమనించాక ఇంటి నుంచి దుప్పట్లు, కంబళ్లు తీసుకెళ్లి పంచేదాన్ని. పోలీసుల బృందాలనే కదిలించి.. అది కాస్తా ఓ కార్యక్రమంగా ప్రారంభమైంది. పరిస్థితి వివరించినప్పుడు నా భర్త వికాస్ పరాశర్ కూడా ఇందుకు సాయం చేస్తా అని చెప్పాడు. దీంతో ‘తాండ్ కే సిపాయ్’ (శీతల సైనికుడు) అనే పేరుతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మా పోలీసులూ ఇందుకు ముందుకు వచ్చారు. ఒక బృందం ఏయే ప్రాంతాల్లో నిరాశ్రయులు ఉన్నారో గుర్తిస్తుంది. ఆ పై నిర్దిష్ట ప్రాంతాల్లో మరో బృందం దుప్పట్లు, కంబళ్లు పంపిణీ డ్రైవ్ నిర్వహిస్తుంది’ అని వివరిస్తారు ఈ మహిళా పోలీస్. సామాజిక సంస్థలూ చేయూత ‘ఈ ధార్మిక కార్యక్రమంలో నేనూ పాలుపంచుకోవడం అనిల భర్తగా పిలిపించుకోవడం నాకు చాలా గర్వంగా ఉందంటారు ఈ మహిళా పోలీస్ భర్త వికాస్ పరాశర్. అనిలా ప్రారంభించిన ఈ కార్యక్రమం మూడేళ్లుగా తన సేవలు అందిస్తోంది. కిందటేడాది ఎనిమిది వేలకు పైగా దుప్పట్లు, కంబ్లళ్లను పంచింది. ‘ఇండోర్‌లో రాత్రిళ్లు పనిచేసే సమయాల్లో అధికారులు సైతం చలిలో వణుకుతూ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితులు ఎదురవు తుంటాయి. అలాంటి పరిస్థితిలో పోలీసులకు దుప్పట్లను ఇచ్చేవారు. అందులో భాగంగానే పోలీసులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని సామాజిక సంస్థలు కూడా చేరాయి. దీంతో ఈ కార్యక్రమం ద్వారా అసుపత్రులు, అనాథ శరణాలయాల్లోనూ దుప్పట్లు, కంబళ్లు పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా ఖాకీ డ్రెస్ వేసుకున్నవారిలో కాఠిన్యమే కనిపిస్తుంది అనుకుంటారు చాలా మంది. కానీ, సమాజ రక్షణలో నలుదిక్కులను గమనించేవారికే సమస్యలు బాగా కనిపిస్తాయని, వాటికి పరిష్కార మార్గం కూడా వారికే బాగా తెలుస్తుందని నిరూపిస్తుంది అనిలా పరాశర్. మహిళా పోలీసుగా ఒక చిన్న అడుగుతో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు పోలీసు బృందాలే పనిచేసే దిశగా ఎదిగింది. చదవండి: ‘ఫోర్బ్స్’ లిస్ట్‌లో ఆశా వర్కర్..ఎందుకంటే..? -
AP: గ్రామ,వార్డు మహిళా పోలీసులకు వరం.. సీఐ వరకు పదోన్నతి..!
సాక్షి, అమరావతి: గ్రామ/వార్డు మహిళా పోలీసుల ఉద్యోగాలను త్వరలో క్రమబద్ధీకరించనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత ప్రోత్సహించనుంది. క్షేత్రస్థాయిలో మహిళల రక్షణ కోసం కీలకంగా వ్యవహరించే మహిళా పోలీసులకు పదోన్నతులు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకోసం ముసాయిదా బిల్లును రూపొందించింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. పోలీసు శాఖలో ప్రత్యేక వ్యవస్థగా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చేందుకు మహిళలు వెనుకంజ వేస్తున్నందున వారి సమస్యలను స్థానికంగానే గుర్తించి పరిష్కరించేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో దాదాపు 15వేలమంది మహిళా పోలీసులను నియమించారు. వారికి కానిస్టేబుల్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. వారి సర్వీసులను ప్రభుత్వం త్వరలోనే క్రమబద్ధీకరించనుంది. అందుకోసం రాతపరీక్ష, ప్రాజెక్టు వర్క్‌లు ఇప్పటికే పూర్తి చేసింది కూడా. ప్రస్తుతం మహిళా పోలీసులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు. మహిళా పోలీసులకు కానిస్టేబుల్ హోదా ఇవ్వడంతో ఇప్పటికే వారు హోం శాఖ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ వారి హాజరు, సెలవుల మంజూరు, జీతాల చెల్లింపు అంశాలు సంబంధిత మున్సిపాలిటీలు/ పంచాయతీల పరిధిలోనే ఉన్నాయి. దాంతో క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు సాధారణ పోలీసుల ఎంపిక ప్రక్రియ నిబంధనలు ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ సామాన్యులతో మమేకం అయ్యేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా పోలీసుల ఎంపిక ప్రక్రియ వేరేగా ఉంది. దాంతో సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా మహిళా పోలీసుల సర్వీసులను క్రమబద్ధీకరించాల్సి ఉంది. అందుకోసం సాధారణ పోలీసులుగా కాకుండా మహిళా పోలీసులను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయనుంది. సాధారణ పోలీసులకు సమాంతరంగా మహిళా పోలీసు వ్యవస్థ ఉండనుంది. పదోన్నతి అవకాశాలు కూడా.. ►మహిళా పోలీసులకు పదోన్నతులపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ప్రస్తుతం వార్డు/ గ్రామ సచివాలయం పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు పదోన్నతుల కోసం ‘హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సీఐ’ పోస్టులను ఏర్పాటు చేస్తారు. ►పట్టణ ప్రాంతాల్లో అయితే కొన్ని వార్డులకు, గ్రామీణ ప్రాంతాల్లో మండలానికి ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. ►పోలీస్ సర్కిల్ స్థాయిలో మహిళా ఏఎస్ఐ ఉంటారు. ►పోలీస్ సబ్–డివిజన్ స్థాయిలో మహిళా ఎస్ఐ ఉంటారు. ►పోలీస్ జిల్లాస్థాయిలో మహిళా సీఐ ఉంటారు. ఈ పదోన్నతుల అంశంపై మరింతగా సమీక్షించి హోం శాఖ తుది ముసాయిదాను ఖరారు చేయనుంది. అనంతరం బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించాలన్నది ప్రభుత్వం భావిస్తోంది. -
అమ్మ మనసు చాటారు
పోలీసులుగా మగువలు తమ సత్తా చాటుతున్నారు. అడ్డంకులను అధిగమిస్తూ ముందడుగు వేస్తున్నారు. ఆపదల్లో, విపత్తుల్లో మానవత్వాన్ని చూపుతూ ఖాకీ విలువను పెంచుతున్నారు. అమ్మగా బిడ్డ ఆలన చూస్తూనే విధులనూ అంతే నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారు. జనం మధ్య జనం కోసం ఎదుగుతున్న ఈ మహిళా పోలీసులు జనం నోట వేనోళ్ల ప్రశంసలు అందుకుంటున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులు తమ పని పట్ల గొప్ప నిబద్ధత చూపుతూనే ఉన్నారు. వ్యవస్థను నియంత్రణలో ఉంచడంలో కరకుగా వ్యవహరిస్తూ, ఆపదలో రక్షణ ఇస్తూ, విపత్కర పరిస్థితుల్లో స్నేహహస్తాన్ని అందిస్తూ తన ప్రాధాన్యతను చాటుతోంది ఖాకీ నారి. ఆపదలో రక్షణ ఇటీవల చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఓ చెట్టుకూలి మీద పడటంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఓ 28 ఏళ్ల వ్యక్తిని రక్షించి, భుజాల మీద మోసుకెళ్లి, ఆటోరిక్షా వద్దకు చేర్చిన మహిళా పోలీసు వీడియో వార్తల్లో నిలిచింది. ఆమె చూపిన తెగువకు ఎంతో మంది అభినందనలు తెలిపారు. ఆ మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ పేరు రాజేశ్వరి. 53 ఏళ్ల వయసు. వార్తా కథనాల ప్రకారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు రాజేశ్వరికి ఫోన్‌కాల్ వచ్చింది. టిపి ఛత్రం ప్రాంతంలోని శ్మశానవాటికలో ఉదయకుమార్ అనే వ్యక్తి చెట్టు కొమ్మ మీద పడటంతో మరణించాడని ఆ ఫోన్ సారాంశం. మహిళా పోలీసు తన బృందంతో ఆ శ్మశానవాటికకు వెళ్లింది. కూలిన చెట్టును తొలగించి చూడగా ఉదయకుమార్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. శ్మశాన వాటికలో పనిచేసే ఉదయకుమార్, స్నేహితుడితో కలిసి అతిగా మద్యం సేవించడం వల్ల అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అయితే ఉదయకుమార్ మరణించాడనుకున్న అతని స్నేహతుడు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న రాజేశ్వరి అతని స్నేహితుడిని మందలించి, సకాలంలో ఉదయకుమార్‌ను ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేసింది. ఆపద సమయాల్లో తను మహిళ అని, మధ్యవయస్కురాలని ఏ మాత్రం ఆలోచించకుండా పోలీసు విధిని సమర్థవంతంగా నిర్వహించినందుకు ఆమెను ఎంతోమంది కొనియాడారు. నిస్సహాయతలో ... అక్టోబర్ 31న అస్సామ్‌లో బొకాజన్ హెచ్ఎస్ స్కూల్ సెంటర్లో టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ జరిగింది. ఈ టెస్ట్ రాయడానికి ఓ తల్లి తన చంటిబిడ్డతో సహా వెళ్లింది. బయట ఆ బిడ్డను చూసుకునేవారు ఎవరూ లేక, పరీక్షకు హాజరు కాలేనేమోనన్న భయంతో ఉన్న ఆ తల్లి పరిస్థితిని చూíసి చలించిపోయిన అక్కడి మహిళా పోలీసు ఆ బిడ్డను తన అక్కున చేర్చుకుంది. పరీక్ష జరిగినంత సేపు ఆ పసివాడిని జాగ్రత్తగా చూసుకుంది. ఈ మహిళా పోలీసు బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటున్న చిత్రాన్ని ఎమ్మెల్యే నుమల్ మోమిన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ‘మానవ స్పర్శ ఎల్లప్పుడూ అవసరం. హృదయాన్ని కదిలించేలా ఉన్న ఈ చిత్రం ఎన్నో అర్థాలను చెబుతుంది. ఈ రోజు ఆ తల్లి సమస్యను పరిష్కరించి, బిడ్డను చూసుకున్న లేడీ కానిస్టేబుల్ శ్రీమితి కాచే బేపి కి సెల్యూట్ చేస్తున్నాను’ అని పోస్ట్ పెట్టిన గంటలోపే ఆ మహిళా పోలీసుకు అభినందనలు వెల్లువలా వచ్చాయి. 2019లో అస్సాంలోని దర్రాంగ్ జిల్లాలో టెట్ పరీక్షకు హాజరైన వారి పిల్లలను పట్టుకున్న మహిళా పోలీసు కూడా ఇలాగే అధికారుల ప్రశంసలు పొందారు. కాబోయే అమ్మ... గర్భవతిగా ఉన్నప్పుడు తన బిడ్డ గురించి తల్లి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో మనకు తెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో తన బాధ్యతను గుర్తెరిగి గర్భవతిగా ఉన్నా విధి నిర్వహణలో పాల్గొంది ఛత్తీస్‌గడ్‌లోని డీఎస్పీ శిల్పా సాహూ. కరోనా మహమ్మారి కారణంగా గత ఏప్రిల్‌లో చాలా చోట్ల లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధించారు. అలాంటి సమయంలో ఛత్తీస్గడ్ బస్తర్‌లోని దంతెవాడలో కోవిడ్–19 ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ విధులను నిర్వర్తిస్తున్న ఐదునెలల గర్భిణి డీఎïస్పీ శిల్పాసాహూ వీడియో వెలుగులోకి వచ్చింది. ‘నక్సల్ ఆపరేషన్లలో కూడా అత్యుత్తమంగా పనిచేసిన సాహూ, ఈ కష్టకాలంలోనూ తన పరిస్థితిని లెక్కచేయకుండా విధులను నిర్వర్తించడం అభినందనీయం’ అని పోలీసు డైరెక్టర్ జనరల్ అవస్తి ట్విటర్ వేదికగా ప్రశంసించారు. అదే వేదికగా ఎంతోమంది సాహూకి తమ అభినందనలు తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్ ముంౖ»ñ ని వరదలు ముంచెత్తుతున్నప్పుడు ఓ మహిళా పోలీసు వృద్ధ దంపతులను రక్షించిన సందర్భం ఎంతోమంది హృదయాలను కదిలించింది. దాదర్‌లోని హింద్మాతా ప్రాంతంలోని వీధి మొత్తం నీళ్లు. అలాంటి వీధి గుండా వెళ్లేందుకు వృద్ధ దంపతులు ప్రయత్నిస్తున్నారు. ఆ నీళ్ల నుండి బయటపడే మార్గం లేక, ప్రాణాలను అరచేతుల్లో పట్టుకున్నారు. ఆ వీధిలో ప్రజలకు సాయం చేస్తూ, ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తూ క్షణం విరామం తీసుకోకుండా పనిచేస్తున్న మహిళా పోలీసు ఈ జంటను రక్షించడానికి చేసిన ప్రయత్నం ఎంతోమందిని కదిలించింది. సామాజిక మాధ్యమాల్లో తిరిగిన ఈ వీడియోకు నెటిజన్లు ఎన్నో ప్రశంసలు అందజేసి, పోలీసులకు అభివాదం తెలిపారు. ముంబై వరదల్లో వృద్ధ జంటను రక్షిస్తున్న మహిళా పోలీస్ -
మన రక్షణా దళంలో ఆ ముగ్గురు... స్ఫూర్తి ప్రదాతలు..!
CRPF Assistant Commandant: విమానాశ్రయాలు, ఓడరేవులు, అణు ఇంధన సంస్థలు... ఇలా ఏ సున్నిత ప్రాంతమైనా అది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పహారాలో ఉంటుంది. ఈ దళంలో పని చేయడానికి ఎంపికైన వారికి హైదరాబాద్ శివార్లలో ఉన్న హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో (నిసా) ట్రైనింగ్ ఇస్తారు. ఈసారి శిక్షణ పొందిన 62 మందిలో స్నేహ ప్రదీప్ పాటిల్, భూమిక వార్షినే, కీర్తి యాదవ్ అనే ముగ్గురు మహిళలున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి... మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన స్నేహ ప్రదీప్ పాటిల్ తండ్రి రైతు. తల్లి గృహిణి. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేసిన స్నేహ... యూపీఎస్సీ పరీక్షల కోసం ఢిల్లీలో శిక్షణ తీసుకున్నారు. ఆమెతో పాటు శిక్షణపొందిన అనేక మంది సీఐఎస్‌ఎఫ్‌లోకి అడుగుపెట్టారు. ఆ స్ఫూర్తితో ఆమె సీఐఎస్ఎఫ్ను ఎంచుకున్నారు. ‘శిక్షణలో పురుషులకు, స్త్రీలకు వేర్వేరు అంశాలు ఉండవు. ఈ నేపథ్యంలో మహిళలు మరింత కష్టపడాల్సి ఉంటుంది. సివిల్స్ రాసి ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిగా దేశ సేవ చేయాలన్నది నా లక్ష్యం. అది సాధ్యం కాకుంటే సీఐఎస్ఎఫ్ ద్వారా సేవ చేస్తా’ అన్నారు స్నేహ. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! తండ్రిని చూసి స్ఫూర్తి పొంది... హర్యానా, రివాడీ జిల్లాకు చెందిన కీర్తి యాదవ్ తండ్రి ప్రతాప్ సింగ్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి. ప్రస్తుతం వారెంట్ ఆఫీసర్. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి బీఎస్సీ కెమిస్ట్రీ (ఆనర్స్) చేశారామె. ఢిల్లీలో ఉండి సివిల్స్‌కు తర్ఫీదు పొందుతుండగా... సీఏపీఎఫ్ (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్) ద్వారా నిసాలో అడుగుపెట్టారు. ‘నిసాలో శిక్షణ అనేక కొత్త విషయాలను నేర్పింది. సెప్టెంబర్‌లో జరిగిన వారం రోజుల గ్రేహౌండ్స్ శిక్షణలో జంగిల్ క్యాంప్ జరిగింది. ఆ సమయంలో తీవ్ర వర్షాలు కురుస్తుండటంతో టాస్క్ కష్టసాధ్యమైంది. నా టార్గెట్ సివిల్స్’ అని కీర్తి తెలిపారు. ఎన్సీసీలో సక్సెస్ కావడంతో... ఉత్తరప్రదేశ్, బదాయు ప్రాంతానికి చెందిన భూమిక వార్షినే అలహాబాద్ యూనివర్శిటీ నుంచి బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) చేశారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన భూమిక కళాశాల రోజుల నుంచి ఎన్సీసీలో కీలకంగా వ్యవహరించే వారు. ఈమె చూపిన ప్రతిభ ఫలితంగా యూత్ ఎక్సేంజ్ కార్యక్రమంలో శ్రీలంక వెళ్లి వచ్చారు. ఆ సమయంలోనే రక్షణ బలగాల్లో చేరాలని బలంగా నిర్ణయించుకున్నారు. ‘నిసాలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. వార్షిక క్రీడా పోటీల్లో ఉత్తమ అథ్లెట్‌గా పీవీ సింధు చేతుల మీదుగా సత్కారం అందింది. శిక్షణలో చూపిన ప్రతిభతో పాసింగ్ ఔట్ పరేడ్‌లో ప్లటూన్ కమాండర్ అయ్యా. మహిళలకు స్ఫూర్తిదాయకంగా మారాలని, నన్ను చూసి మరింత మంది యువతులు సీఐఎస్‌ఎఫ్‌లోకి అడుగుపెట్టాలన్నదే నా లక్ష్యం’ అని భూమిక వివరించారు. ముగ్గురివీ అత్యత్తమ ర్యాంకులే... యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ (యూపీఎస్సీ) నిర్వహించిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరీక్ష ద్వారా అసిస్టెంట్ కమాండెంట్స్ (ఏసీ) శిక్షణకు ఎంపికయ్యారు ఈ ముగ్గురూ. గతేడాది జరిగిన ఈ పరీక్షకు ఐదు లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనేక వడపోతల తర్వాత 62 మంది నిసా వరకు వచ్చారు. ఈ పరీక్ష ఆలిండియా ర్యాంకుల్లో భూమికకు తొమ్మిది, కీర్తికి 26, స్నేహకు 52వ ర్యాంక్ లు వచ్చాయి. – శ్రీరంగం కామేష్, సిటీబ్యూరో, హైదరాబాద్ చదవండి: మెదడు ఆరోగ్యానికి మేలుచేసే చేపలు! స్ట్రోక్ సమస్యకు కూడా.. -
మహిళలకు అధికారమిస్తే ఆందోళన ఎందుకు?
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను ‘మహిళా పోలీసులు’గా పోలీసుశాఖలో అంతర్భాగంగా పరిగణిస్తూ ఈ ఏడాది జూన్‌లో జారీచేసిన జీవో 59పై హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఏపీపీఎస్సీ చైర్మన్, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ తదితరులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నవంబర్ 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. జీవో 59 ఏపీ పోలీసు చట్ట నిబంధనలకు, రాజ్యాంగానికి విరుద్ధమంటూ ప్రకటించి ఆ జీవోను రద్దు చేయాలని కోరుతూ విశాఖపట్నం పెదవాల్తేరుకు చెందిన నిరుద్యోగి ఆరేటి ఉమామహేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ న్యాయవాది వై.బాలాజీ వాదనలు వినిపిస్తూ.. మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించడంతోపాటు వారికి పోలీసు యూనిఫాం ఇవ్వడంతోపాటు కానిస్టేబుల్‌కు ఉండే అధికారాలు, బాధ్యతలు కట్టబెట్డడం చట్టవిరుద్ధమని చెప్పారు. పోలీసు నియామక బోర్డు ద్వారానే పోలీసు నియామకాలు జరగాల్సి ఉంటుందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మహిళలకు అధికారం ఇస్తే తప్పేముందని ప్రశ్నించింది. మహిళలకు అధికారం ఇస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది. ప్రజలకు సేవ చేయడానికే కదా ప్రభుత్వం మహిళలను పోలీసులుగా గుర్తిస్తోందంటూ వ్యాఖ్యానించింది. మహిళలకు అధికారం ఇవ్వడాన్ని తాము తప్పుపట్టడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా చేయడాన్నే తప్పుపడుతున్నామని బాలాజీ చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను నవంబర్ 24కి వాయిదా వేసింది. -
ఆ ఉద్యోగాలు కేవలం పురుషులకే అన్న అభిప్రాయానికి కాలం చెల్లింది: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పోలీసు శాఖలో మహిళల సంఖ్య పెరుగుతుండడం శుభ పరిణామమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో 2014 నుంచి 2020 మధ్య మహిళా పోలీసుల సంఖ్య రెట్టింపయ్యిందని అన్నారు. భవిష్యత్తులో కొత్త తరం పోలీస్ వ్యవస్థను వారే ముందుండి నడిపిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సైన్యం, పోలీసు శాఖ కేవలం పురుషులకే అన్న పాతకాలపు అభిప్రాయానికి కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. 2014లో దేశవ్యాప్తంగా 1.05 లక్షల మంది మహిళా పోలీసులు ఉండగా, 2020 నాటికి 2.15 లక్షలకు చేరినట్లు ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్’ గణాంకాలు వెల్లడిస్తున్నాయని గుర్తుచేశారు. గత ఏడేళ్లలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు దళాల్లోనూ మహిళల సంఖ్య రెండింతలు పెరిగిందన్నారు. కఠినమైన శిక్షణ పొంది కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ యూనిట్లలో సైతం పనిచేసేందుకు యువతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారని ప్రశంసించారు. ఇది మన సమాజంపై సానుకూల ప్రభావం చూపుతోందన్నారు. మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారని వివరించారు. మహిళా పోలీసులు బాలికలకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు 100 కోట్ల డోసుల కరోనా టీకా పంపిణీ పూర్తి కావడంతో దేశం కొత్త ఉత్సాహం, వేగంతో ముందుకు దూసుకెళుతోందని మోదీ అన్నారు. మనదేశం ఎప్పుడూ విశ్వశాంతి కోసం పాటుపాడుతూనే ఉందని తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని ప్రధాని ప్రజలను కోరారు. -
దీపికా పాటిల్ నిజంగా ధైర్యే సాహసే లక్ష్మి!
సాక్షి , విజయనగరం: సమస్త ప్రకృతినీ స్త్రీ మూర్తిగా ఆరాధించే సంప్రదాయం భారతీయులది. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ ఉత్తమ సమాజం పరిఢవిల్లుతుంది. అందుకు భిన్నంగా కొందరు కామాంధులు మహిళలు, యువతులు, చివరకు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పైశాచిక వ్యక్తుల పీచమణచడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ‘దిశ’ చట్టంతో నాంది పలికింది. మహిళా ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు దిశ యాప్‌ను తీసుకొచ్చింది. మౌనరోదన వీడి మనోధైర్యంతో దిశ యాప్ ద్వారా ఎస్ఓఎస్ లేదా స్పీడ్ డెయిల్తో సమాచారం ఇస్తే చాలు తగిన రక్షణ కల్పిస్తామని ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. శ్రావణ శుక్రవారంతో మహిళలు చైత న్యం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మహిళా లోకానికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. గురువారం ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘దిశ’పై బస్సుల్లో ప్రత్యేక వీడియో ప్రదర్శన... దిశ యాప్ వినియోగంపై అవగాహన కల్పించడానికి వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాం. ఆండ్రాయి డ్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నట్లు చూపిస్తే ఉచితంగా ప్రయాణించడానికి బస్సులు ఏర్పాటు చేశాం. అవి పోలీస్ శాఖకు సంబంధించినవి. సాధారణ ప్రయాణానికి వీలుకావు. ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడాం. ఎంపిక చేసిన పోలీసులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్తూ ప్రయాణికులకు దిశ యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తారు. విజయనగరం నుంచి ప్రతిరోజూ 165 వరకూ బస్సులు దూర ప్రాంతాలకు వెళ్తున్నాయి. వాటిలో ఉండే టీవీల్లో ‘దిశ’పై ప్రత్యేకంగా రూపొందించిన వీడియో ఫిల్మ్‌ను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశాం. ఢిల్లీలో బస్సులో వెళ్తున్న యువతిపైన, పొరుగు రాష్ట్రంలో మహిళా డాక్టర్‌పై జరిగిన అఘాయిత్యాల వంటివి చెక్ చెప్పేందుకు ఏపీ సర్కారు దిశ చట్టానికి అంకురార్పణ చేసింది. బస్సుల్లో ప్రయాణించే మహిళలు, విద్యార్థినులకు దిశచట్టం, యాప్ వినియోగంపై చైతన్యం చేస్తున్నాం. మందుబాబుల ఆటకట్టు... జిల్లాలో మహిళలపై జరిగిన నేరాలను పరిశీలిస్తే ఎక్కువ అఘాయిత్యాలు మామిడి తోటలు, నగర శివార్లలోని లేఅవుట్లు, నిర్మానుష్యంగానున్న బహిరంగ ప్రదేశాల్లోనే చోటుచేసుకున్నాయి. అక్కడ బహిరంగ మద్యపానమే దీనికి కారణం. రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ దృష్యానే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. గత నెలలో రోజుకు వంద వరకూ ఉండేవి. పోలీసుల నిరంతర నిఘా ఫలితంగా ఇప్పుడు 50కి మించట్లేదు. వాటిని ఇంకా తగ్గించాలి. మందుబాబుల సమాచారం ఇవ్వాలని ఆయా లేఅవుట్లు, తోటల్లో ఉంటున్న వాచ్మన్లకు పోలీసులతో అవగాహన కల్పిస్తున్నాం. పదేపదే నేరాలకు పాల్పడేవారిపై షీట్.. ఇటీవల గుర్ల పోలీసుస్టేషన్ పరిధిలో ఓ 35 ఏళ్ల ఆటో డ్రైవర్ 14 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాచిపెంట పోలీసుస్టేషన్ పరిధిలో ఓ ఉపాధ్యాయుడు బాలికపై లైంగిక వేధింపులకు తెగించాడు. సాధారణంగా వారి వయసును బట్టి చూస్తే వారు ఇలాంటి దారుణాలకు పాల్పడతారని ఎవరూ అనుమానించరు. అందుకే మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిపై పోలీసుస్టేషన్లో షీట్ తెరిచే ఉంటుంది. వారిపై నిరంతర నిఘా ఉంటుంది. వారి నేర తీరును కుటుంబసభ్యులకు ‘దిశ’ పోలీసులు చెబుతారు. పరిసర ప్రాంతాల వారినీ అప్రమత్తం చేస్తారు. నేరగాళ్లకు ప్రత్యేక కౌన్సెలింగ్... మహిళలపై ముఖ్యంగా చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిలో పైశాచిక మనస్తత్వం ఉంటుంది. వారానికి ఒకసారి సైకాలజిస్టుతో కౌన్సెలింగ్ చేయిస్తున్నాం. ఇప్పటికే కొన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఈ ప్రత్యేక కౌన్సెలింగ్ ప్రారంభమైంది. సైబర్ నేరాలపైనా అవగాహన... ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్‌మీడియాలో స్నేహాల పేరుతో మోసపోతున్న మహిళలు, యువతుల సంఖ్య మన జిల్లాలోనూ పెరుగుతోంది. సైబర్ నేరాల సంఖ్య ఎక్కువవుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏటీఎం కార్డు వినియోగం కూడా తెలియనివారు ఉన్నారు. మహిళలు, యువతులు సైబర్ నేరగాళ్ల బారినపడకుండా అవగాహన కల్పించే మూడు రోజుల ప్రత్యేక శిక్షణను త్వరలోనే ప్రారంభిస్తాం. మహిళా పోలీసులు, డ్వాక్రా మహిళల ప్రతినిధులు, టీచర్లు, బ్యాంకర్లు, పోలీసులను భాగస్వాములను చేస్తున్నాం. బాధితులకు ‘దిశ’ భరోసా... మహిళలు, యువతులు, బాలికలు తమపై జరిగిన అఘాయిత్యాలను ధైర్యంగా పోలీసులకు చెప్పాలి. దీనివల్ల నేరగాళ్లపై సత్వరమే కేసు నమోదు చేస్తూ పోలీసు శాఖ ఆయా బాధితురాళ్లకు అండగా నిలబడుతుంది. దిశ కేసులకు ప్రత్యేకంగా ఒక డీఎస్సీని ప్రభుత్వం నియమించింది. దిశ పోలీసుస్టేషన్లో సగం మంది మహిళా పోలీసులే ఉంటారు. ఎస్సై కూడా మహిళే ఉన్నారు. ఆ కేసులను సత్వరమే పరిష్కరించడానికి ప్రత్యేక నైపుణ్యం ఉన్న పోలీసులను ఒక ప్రత్యేక పరీక్ష ద్వారా ఎంపిక చేసి నియమించాం. హెల్స్ డెస్క్లోనూ మహిళనే ఉంచుతున్నాం. ‘దిశ’ సద్వినియోగంతోనే రక్షణ... పాచిపెంట ఘటనలో బాధితురాలు దిశ ఎస్వోఎస్ను పంపడం వల్లే నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోగలిగాం. జిల్లాలో ఇప్పటివరకూ 3.38 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో స్మార్ట్ ఫోన్ల వాడకం తక్కువ. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్నెట్, సిగ్నల్స్ తదితర సాంకేతిక సమస్యలు ఉన్నాయి. అందుకే అలాంటిచోట్ల సాధారణ ఫోన్లలో స్పీడ్ డయిల్ ఆప్షన్ పెట్టిస్తున్నాం. కీ ప్యాడ్‌పై 1 నంబరు నొక్కగానే పోలీసులకు లోకేషన్ సహా సమాచారం వచ్చేస్తుంది. మహిళలపై అఘాయిత్యాలు సాగవిక... అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా ఉన్న చీకటి ప్రదేశాలు, మహిళలపై గతంలో తరచుగా దాడులు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించాం. ఈవ్‌టీజింగ్ జరుగుతున్న కళాశాలల పరిసర ప్రాంతాలు, బస్టాప్‌లు, నగరాల్లో మార్కెట్లు తదితర రద్దీ ప్రదేశాలు ఇలా... జిల్లాలో దాదాపు 225 వరకూ ఉన్నాయి. అక్కడ నిఘాకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. ఫుట్ పెట్రోలింగ్ కూడా చేస్తారు. ఒకవేళ ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా వెంటనే దిశ యాప్ ద్వారా ఎస్ఓఎస్ను పోలీసులకు ఏవిధంగా పంపించాలో బాధితులకు అవగాహన కల్పించేలా బోర్డులు పెట్టిస్తున్నా. ఫోన్ నంబర్లు కూడా ఉంటాయి. అత్యాచారం, లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్ వంటి నేరాలకు పాల్పడితే ఎంతటి కఠిన శిక్షలు పడతాయో ఆకతాయిలకు హెచ్చరికలు కూడా ఉంటాయి. డ్రోన్‌తోనూ నిఘా ఉంచుతున్నాం. ప్రతి రోజూ ఏదొక ప్రదేశంపై డ్రోన్ సర్వైలెన్స్ ఉంటుంది. -
కఠినమైన వృత్తిలో ఉంటూనే వరలక్ష్మీ వ్రత పూజ
పొద్దున్న లేస్తే గొడవలు, పేచీలు, రాజీలు, సర్దుబాట్లు.. ఇన్నింటి మధ్య కొంత నిశ్శబ్దం కావాలి. ఒంటి మీద ఖాకీ పడింది మొదలు దొంగలు, నేరస్తులు, మోసగాళ్ల ఆటకట్టించడమే పని. వీరి నీడ కూడా పడని స్థలంలో కాసేపు గడపాలి. బయటే కాదు ఇంతులకు ఇంటిలోనూ జీవిత కాల ఉద్యోగమే కదా. ఆ తలనొప్పులు తప్పేలా మనసుకు ప్రశాంతత దొరకాలి. బాధలు, హోదాలు మరిచి దేవుడి సన్నిధిలో సేద తీరాలి. శ్రావణం ఆ సమయాన్నిస్తోంది. హడావుడిని కాస్త పక్కనపెట్టి నిమ్మళంగా పూజ గదిలో కూర్చుని వ్రతం చేసుకోవడానికి మన ‘ధైర్య’లక్ష్ములు ఇష్టపడుతున్నారు. వరలక్ష్మీ వ్రతాలకు సిద్ధమయ్యారు. పాలకొండ రూరల్/రాజాంసిటీ: శ్రావణం వచ్చిందంటే మహిళలకు ప్రతిరోజూ ఓ పండగే. ఈ పండగ రోజుల్ని జరుపుకునేందుకు ఎవరూ మినహాయింపు కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ముఖ్యంగా ఈ శాఖలో పనిచేసే వాళ్లకు అనుక్షణం సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వాళ్లు అనేక సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొనాల్సి ఉంటుంది. కఠిన సమయాలు వాళ్లకు వెన్నంటి కాదు.. ఎదురు నిలిచి ఉంటాయి. అయితే ఇంత పని ఒత్తిడిలోనూ తమ వ్యక్తిగత జీవితానికి కాసింత సమయం కేటాయిస్తున్నారు. అటు వృత్తిని.. ఇటు సంప్రదాయాల్ని పాటిస్తూ లైఫ్ బ్యాలన్స్ చేసుకుంటున్నారు. శ్రావణ మాసంలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం, నోములు నోచుకోవడం తమ జీవితంలో ఓ భాగమే అని మనసారా నమ్ముతున్నారు. వృత్తిలో అంతే కఠినంగా కూడా వ్యవహరిçస్తున్నారు. వివిధ స్థాయి ల్లో పనిచేస్తున్న పోలీసు అధికారుల్ని వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. వారి అభిప్రాయాల్ని ఇలా చెప్పుకొచ్చారు. సంప్రదాయాలకు పెద్దపీట.. నాకు మొదటి నుంచి ఆచార సంప్రదాయాలంటే మక్కు వ. చిన్ననాటి నుంచి దైవభక్తి అలవడింది. పూజ లు, వ్రతాలు కచ్చితంగా చేస్తా. ఎన్ని బందోబస్తు డ్యూటీలున్నా సరే వరలక్ష్మీ వ్రతానికి ప్రాధాన్యమిస్తా. పూజ చేస్తే ఏదో తెలియని సంతృప్తి. ప్రతిఏటా కుటుంబ సభ్యులందరం కలిసి ఈ పూజలో పాల్గొంటాం. అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తాం. ముందురోజే పూజా సామగ్రి కొనుగోలు చేస్తాను. డ్యూటీ సమయానికంటే ముందే పూజను ముగించేస్తాం. ఇలాంటి కార్యక్రమాల వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందనేది నా నమ్మకం. పూజ ముగియగానే యూనిఫారమ్ ధరించి డ్యూటీకి సిద్ధమైపోతా. – ఎల్.రమణమ్మ, ఏఎస్ఐ, రాజాం వృత్తి.. దైవం వృత్తి.. దైవం.. ఈ రెండింటిని సమదృష్టితో చూస్తా. అలా చూసినప్పుడే సమాజంలో గుర్తింపు. పోలీస్ అధికారిగా సబ్ డివిజన్ ప్రజలకు రక్షణ కల్పించటంతో పాటు వారి సుఖశాంతుల కోసం భగవంతుడ్ని ప్రార్థిస్తా. విధినిర్వహణలో నిత్యం అంకితభావంతో పనిచేసే మాకు ఈ తరహా సంప్రదాయ పూజల్లో పాల్గొన్నప్పుడు కొంత సాంత్వన లభిస్తుంది. తెలుగు వారి సంప్రదాయం అంటే నాకు చాలా ఇష్టం. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఎక్కడున్నా కచ్చితంగా ఆచరిస్తా. ఓ మహిళగా కుటుంబ సభ్యుల క్షేమం కోసం దైవాన్ని ప్రార్థిస్తా. ఇలాంటి కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించడం నాకు ఆనందాన్నిస్తుంది. –మల్లంపాటి శ్రావణి, డీఎస్పీ, పాలకొండ ఒత్తిడి నుంచి దూరంగా.. వృత్తితోపాటు సంప్రదాయాలను గౌరవిస్తాను. వృత్తి రీత్యా విధి నిర్వహణలో కొంతమేర ఒత్తిడి తప్పదు. వరలక్ష్మీ వ్రతంలాంటి సంప్రదాయ పండగలు, పూజలు కుటుంబ సభ్యులతో కలసి చేసుకుంటున్నప్పుడు ఆ ఒత్తిడి నుంచి దూరం కావచ్చు. నిత్యం యూనిఫాంలో ఉండే మేము ఇలాంటి సమయాల్లోనే సంప్రదాయ వస్త్రాలను ధరించటంలో ఎంతో ఆనందం ఉంటుంది. నేను పాటిస్తేనే కదా.. నా తర్వాత తరం అలవాటు చేసుకుంటుంది. వృత్తి.. దైవం రెండు కళ్లుగా భావిస్తాను. ఎంతటి వారైనా కొన్ని సమయాల్లో భగవంతుడిపై నమ్మకం ఉంచక తప్పదు. – బి.ప్రభావతి, ఎస్ఐ, సీతంపేట -
ఏపీ మరో కీలక నిర్ణయం: వారిక మహిళా పోలీసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను ఇక నుంచి ‘మహిళా పోలీసులు’గా వ్యవహరించాలని నిర్ణయించింది. వారు పోలీస్ శాఖలో అంతర్భాగమని ప్రకటిస్తూ వారికి ‘కానిస్టేబుల్’ హోదా కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 14,910 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల పోస్టులకు గాను ప్రస్తుతం 14,313 మంది ఉన్నారు. త్వరలోనే వీరికి రెండేళ్ల ప్రొబెషన్ సర్వీసు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో వారి సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ‘మహిళా పోలీస్’గా పేర్కొంటూ కానిస్టేబుల్‌కు ఉండే అధికారాలు, బాధ్యతలు ప్రకటించడంతోవీరికి మరింత ప్రయోజనం కలగనుంది. మహిళా పోలీసులకు సంబంధించిన విధివిధానాలపై హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధివిధానాలు.. ► మహిళా పోలీసులకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం మహిళా కానిస్టేబుళ్లు వినియోగిస్తున్న యూనిఫాంను వీరికి కూడా ఇస్తారు. ► వివిధ చట్టాల ప్రకారం కానిస్టేబుళ్లకు ఉన్న అధికారాలు, బాధ్యతలు కూడా మహిళా పోలీసులకు కల్పిస్తారు. ► మహిళా పోలీసులు తమ గ్రామ, వార్డు సచివాలయానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ► వీరికి పదోన్నతి కోసం అదనపు హెడ్ కానిస్టేబుల్ పోస్టులను సృష్టిస్తారు. ► మహిళా పోలీసులుగా తగిన అధికారాలు, విధుల కల్పనకు చట్టంలో అవసరమైన మార్పులు చేస్తారు. -
సంఖ్యతోపాటు బాధ్యతలూ పెరగాలి
పోలీస్ అంటే మగ వారి ఉద్యోగం అని భారత్‌లో చాలామంది భావన. హిమాచల్ ప్రదేశ్ ఏర్పాటు గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మా రాష్ట్ర మహిళా పోలీస్ అధికారుల భాగ స్వామ్యం పోలీస్‌శాఖలో ఎంతుందో చెప్పదల్చుకున్నా. 1973లో అంటే దాదాపు 50 ఏళ్ల క్రితం ముగ్గురు మహిళలను కారుణ్య నియామకం కింద కానిస్టేబుళ్లుగా చేర్చాము. 1975లో తొలిసారిగా 28 మంది మహిళా కానిస్టేబుళ్లను భర్తీ చేశాం. ప్రస్తుతం 15 మంది ఐపీఎస్, 8 మంది హెచ్‌పీఎస్ అధికారుణులు సహా 2,352 మంది నాన్‌గెజిటెడ్ అధికారిణులు పనిచేస్తున్నారు. సంఖ్య పెరుగుతున్నా క్షేత్రస్థాయిలో కీలక విధుల్లో ప్రాధాన్యత ఉండటం లేదు. లింగ వివక్ష, మౌలిక వసతుల లేమి వీటికి కారణాలు. ఈ రోజు రాష్ట్ర పోలీస్‌శాఖలో 13 శాతానికి మహిళల సంఖ్య చేరింది. పది శాతానికి మించి మహిళా పోలీస్ సిబ్బంది ఉన్న ఏడు రాష్ట్రాలైన బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, సిక్కిం, తమిళ నాడు, ఉత్తరాఖండ్ సరసన చేరింది. మహిళా సిబ్బంది 33 శాతం ఉండాలని 2009లో కేంద్ర హోంశాఖ లక్ష్య నిర్దేశం చేసింది. దీన్ని హిమాచల్ వీలైనంత త్వరగా చేరుతుందన్న ఆశాభావం ఉంది. కానిస్టేబుల్ స్థాయి నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లను రాష్ట్రం అమలు చేయడం దీనికి దోహదపడుతుందని భావిస్తున్నాను. కానిస్టేబుల్, సబ్ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టుల భర్తీలో 25 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తామని బడ్జెట్ సమావేశాల్లో సీఎం ప్రకటించారు. మహిళలు, చిన్నారులపై నేరాల పరిశోధనలో మహిళా అధికారులు ప్రముఖ పాత్ర పోషించగల్గుతారు. లైంగికదాడుల కేసులో బాధితులతో మాట్లాడేందుకు మహిళా అధికారులు ఉండాలని ఐపీసీ, పోక్సో చట్టాలు కూడా చెబుతున్నాయి. కోవిడ్ పరిస్థితుల్లోనూ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా అద్భుతంగా సేవలందించారు. హిమాచల్‌లో మహిళల సంఖ్య పెర గడం వారి శరీర దారుఢ్యత అనుమానాలను నివృత్తి చేయగల్గింది. మహిళా సాధికారత విషయంలోనూ ఇది ఒక శక్తిమంతమైన సందే శాన్ని పంపగల్గింది. మూడో అంశం, వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మహిళలను ప్రి–జడ్జి చేశారని, అవి తప్పని నిరూపితం అయినట్టు తేలింది. అయితే శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, నేర పరిశోధనలో మహిళా సిబ్బంది ఇంకా సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితే ఉంది. వారి సంఖ్య పెరుగుదలకు అను గుణంగా మౌలిక వసతులు పెరగడం లేదు. సరైన టాయిలెట్లు లేకపోవడంతో కొందరు మహిళా సిబ్బంది విధులకు వచ్చే ముందు నుంచే మంచినీళ్లు తాగడం మానేస్తున్న పరిస్థి తులు ఉంటున్నాయి. ట్రాఫిక్ విధులు సైతం కనీసం నీటిని కూడా తాగకుండానే నిర్వర్తిస్తు న్నారు. చిన్నచిన్న పిల్లలు ఉన్న తల్లులు తమ చిన్నారులను ఇండ్లలోనే వదిలి విధులకు వస్తున్న పరిస్థితులు ఉంటున్నాయి. రుతుక్రమ సమయంలో, ఇతర సందర్భాల్లోనూ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు పురుష సహ ఉద్యోగుల నుంచి వివక్షను ఎదుర్కొనక తప్పని పరిస్థితి. వీటన్నింటినీ ఉత్తమ శిక్షణ ద్వారా మార్చాల్సిన ఆవశ్యకత ఉంది. శిక్షణ పద్ధతులు సైతం పాత కాలపు మగ ఆధిపత్య ధోరణులతో కూడి ఉన్నాయి. జెండర్ సెన్సిటివ్‌గా వాటిని కాలానుగుణంగా మార్చాల్సిన అవసరం ఉంది. ‘సరైన సమయం వస్తే ఈ భూమి మీద ఏ శక్తి కూడా ఒక ఆలోచనను నిలువరించలేదు’ అన్నారు విక్టర్ హ్యూగో. మూస ధోరణులు వీడి మహిళలకు నామమాత్రపు విధులు కాకుండా, కీలక బాధ్యతలు అప్పగించాల్సిన ఆవశ్యకత ఉంది. అలా చేయకపోతే పోలీస్‌శాఖలో వారి సంఖ్య మాత్రమే పెరుగుతుంది, వారి బాధ్య తలు కావు. వ్యాసకర్త: సంజయ్ కుందు హిమాచల్‌ప్రదేశ్ డీజీపీ -
ఎన్నెన్నో కష్టాలు.. డ్యూటీ ఎలా చేసేది
ఆగ్రా: దేశంలో మహిళా పోలీసుల బలవన్మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మహిళా పోలీసులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో పోలీసు శాఖలో మహిళా ఉద్యోగుల స్థితిగతులపై చర్చ మొదలయ్యింది. ఇందులో భాగంగానే మహిళా పోలీసు అధికారులపై ఇండియాటుడే.కామ్ ఓ అధ్యయనం నిర్వహించింది. మహిళా పోలీసులు తమని తాము రక్షించుకునేందుకు పురుషాధిపత్యంతో ఉన్న మగ పోలీసుల నుంచి ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కొంటున్నట్టు తేటతెల్లమయ్యింది. పోలీసు దుస్తుల్లో ఉన్నా, స్త్రీలమని గుర్తుచేస్తారు ఆగ్రాలోని స్థానిక పోలీస్ స్టేషన్లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ ఇండియాటుడేతో మాట్లాడుతూ ‘‘తాను పోలీసు యూనిఫాం ధరించి ఉండవచ్చు, అయినప్పటికీ అడుగడుగునా తాను మహిళననే విషయం గుర్తుచేస్తూనే ఉంటారు’’ అని వ్యాఖ్యానించారు. సాధారణ మహిళలకూ తమకీ ఎటువంటి తేడా ఉండదని, సాధారణ మహిళలు ఎదుర్కొంటున్నట్టే విధినిర్వహణ విషయంలో తాము కూడా అనేక ఇబ్బందులను పంటి బిగువున అదిమిపట్టాల్సి వస్తుందన్నారు. సాధారణ మహిళ లు అడుగు బయటపెట్టినప్పుడు ఎలాంటి వివక్షనీ, ఇబ్బందులనూ ఎదుర్కొంటారో అవన్నీ తమకు కూడా సహజమేనని ఆమె వ్యాఖ్యానించారు. మహిళా పోలీసులకే అసౌకర్యం ఉన్నచోట ఇతర మహిళలకు దిక్కేదీ? పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసులకు ఉద్యోగాల్లో ఉంచడం వల్ల, మహిళలంతా పోలీస్ స్టేషన్లలో ఇబ్బందిపడకుండా ఉండగలుగుతారని భావిస్తారని, అయితే ‘‘మహిళా పోలీసులే పోలీస్ స్టేషన్లలో అసౌకర్యంగా , ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటే, మిగిలిన మహిళలను వాళ్ళెలా సౌకర్యవంతంగా ఉంచగలుగుతారు’’అని ఆమె ప్రశ్నించారు. పని విషయంలో సమానత్వమే సమాన గౌరవం దక్కదు పురుష ఉద్యోగులతో సమానంగా మహిళా పోలీసులు పనిచేయాలని అధికారులు కోరుకుంటారు. అలాగూ పురుష పోలీసులతో సమానంగా పనిచేయించుకుంటారు. కానీ పురుష పోలీసులతో సమానంగా మాత్రం చూడరని, వివక్ష తమని వెన్నాడుతూనే ఉంటుందని మరో పోలీస్ కానిస్టేబుల్ వ్యాఖ్యానించారు. వెకిలి జోకులు.. తప్పుడు కామెంట్లు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ళు అన్న తేడా లేకుండా, మహిళా పోలీసుపై వెకిలి జోకులూ, తప్పుడు కామెంట్లతో వేధిస్తుంటారు. ఆ మాటలు వినలేక అక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప చేసేదేం ఉండదు. అంటారు మరో మహిళ పోలీసు. కొత్తగా రిక్రూట్ అయిన మహిళా పోలీసులు, అధికారుల చేతిలో మరింతగా ఇలాంటి వివక్షకూ, ఇబ్బందులకూ గురవుతారని మహిళా కానిస్టేబుల్ చెప్పారు. ఇన్‌చార్జ్‌ల వేధింపులు రాకబ్ గంజ్ వుమెన్ పోలీస్ స్టేషన్ కి రావడానికి ముందు మరో పోలీస్ స్టేషన్ పనిచేశానని, అక్కడి ఇన్‌చార్జ్‌తో వేధింపులు తాళలేకపోయానని అంటారు మరో మహిళా పోలీసుల. స్నేహంగా ఉందామని చెప్పి నా బతుకు నరకంగా మార్చేశాడంటారు ఆమె. తాను రాజీనామా చేసి వెళ్ళిపోవాలనుకున్నానని, ప్రభుత్వ ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో తెలుసు కనుక తన కుటుంబ సభ్యులు వారించారనీ అంటారామె. పోలీసు ఉద్యోగంలో చేరి తప్పు చేశాను తాను పోలీసు ఉద్యోగంలో చేరినప్పుడు తన మిత్రులు కొంత మంది తాను, ఈ ఉద్యోగంలో కన్నా టీచర్ ఉద్యోగంలో చేరి వుంటే బాగుండేదని కామెంట్ చేశారు. అయినా బలవంతంగా ఇందులో చేరాను. అప్పుడు వారికేం సమాధానం చెప్పలేకపోయినా, యిప్పుడు మాత్రం తాను పోలీసు ఉద్యోగంలో చేరాలన్న నిర్ణయం అంత మంచి విషయమేం కాదని భావిస్తున్నట్టు మరో మహిళా హెడ్ కానిస్టేబుల్ వ్యాఖ్యానించారు. పోలీసు సిబ్బందిలో మహిళలకు సరైన వాతావరణం లేదు పోలీసు సిబ్బందిలో మహిళా పోలీసులు పనిచేసేందుకు సరైన వాతావరణం లేదని మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అన్నారు. కొత్తగా రిక్రూట అయినవారికి మరిని మరింత ఇబ్బంది పెడతారు. పురుష పోలీసులు వారికి పదే పదే ఫోన్లు చేయడం, ఫోన్లలో అశ్లీల ఫొటోలు పంపుతూ వేధింపులకు గురిచేస్తారని ఆమె చెప్పారు. ఆగ్రా ఎస్ఎస్పి బబ్లు కుమార్ పురుష పోలీసులపై చేసిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు. పోలీసు డిపార్టుమెంట్ మహిళలకు సురక్షితమైన పరిస్థితులను కల్పిస్తున్నారని, ఎవరికైనా ఇబ్బందులు వస్తే, తనని నేరుగా కలవొచ్చునని వ్యాఖ్యినంచారు. -
సెంట్రీగా ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: పోలీసుస్టేషన్లు, ఏసీపీ, డీసీపీ కార్యాలయాలతో పాటు పోలీసు కమిషనరేట్‌కూ నిత్యం పహారా అవసరం. ఈ విధులు నిర్వర్తించే వారినే పోలీసు పరిభాషలో సెంట్రీలని అంటారు. ఇప్పటివరకు పురుష కానిస్టేబుళ్లే సెంట్రీలుగా ఉండేవారు. అయితే రాష్ట్రంలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ అధికారులు.. ఈ విధుల్లో మహిళల్నీ వినియోగించుకోవాలని నిర్ణయించారు. మొదట బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఉమెన్ సెంట్రీలను ఏర్పాటుచేశారు. గతంలో పోలీసు విభాగంలో మహిళా సిబ్బంది కొరత తీవ్రంగా ఉండేది. గడిచిన కొన్నేళ్లలో జరిగిన పోలీసు రిక్రూట్మెంట్స్లో మహిళలకు 33 శాతం కోటా ఇవ్వడంతో వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన కానిస్టేబుళ్లలో ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగానికి చెందిన మహిళలు పెద్దసంఖ్యలో ఉన్నారు. అయితే 24 గంటలూ విధుల్లో ఉండాల్సిన సెంట్రీ డ్యూటీలు వీరికి అప్పగించడంపై అధికారులు దృష్టిపెట్టలేదు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఉన్నతాధికారులకు ప్రత్యేక విధులు, ఏరియాలు కేటాయించారు. ఇందులో భాగంగా ఓ మహిళా ఉన్నతాధికారిణికి ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లతో స్పెషల్ పార్టీ కేటాయించారు. నిత్యం ఆమె వెంట ఉంటూ అవసరమైన సందర్భాల్లో కేటాయించిన విధులు నిర్వర్తించడమే ఈ టీమ్ లక్ష్యం. ఆ సమయంలోనే ఏఆర్ మహిళా సిబ్బంది ప్రతిభాపాటవాలపై సదరు అధికారిణికి స్పష్టత వచ్చింది. దీంతో ఆమె ‘ఉమెన్ సెంట్రీ’ఆలోచనకు రూపమిచ్చారు. ప్రాథమికంగా కమిషనరేట్‌కు 4+1 చొప్పున నలుగురు మహిళా ఏఆర్ కానిస్టేబుళ్లు, ఒక హెడ్–కానిస్టేబుల్‌ను కేటాయించారు. ఒక్కో మహిళా కానిస్టేబుల్ మూడు గంటల చొప్పున రొటేషన్‌లో రోజుకు ఆరు గంటలు విధుల్లో ఉంటారు. వీరిని హెడ్–కానిస్టేబుల్ పర్యవేక్షిస్తారు. ఉమెన్ సెంట్రీల ఏర్పాటు మంచి ఆలోచనగా చెబుతున్న అధికారులు.. భవిష్యత్తులో ఈ విధానాన్ని ఇతర కార్యాలయాలు, పోలీసుస్టేషన్లకు విస్తరించాలని భావిస్తున్నారు. -
పోలీసింగ్ ఉద్యోగం కాదు.. సమాజసేవ
సాక్షి, హైదరాబాద్/రాజేంద్రనగర్: పోలీసింగ్ అంటే ఉద్యోగం కాదని, సమాజానికి చేసే సేవ అని షీటీమ్స్, భరోసా ఇన్చార్జ్, ఏడీజీ స్వాతి లక్రా అన్నారు. హిమాయత్‌సాగర్‌లోని రాజ్‌బహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)లో బుధవారం 3వ ఆర్మ్డ్ రిజర్వ్ మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ పాసింగ్ ఔట్ పరేడ్(పీవోపీ) జరిగింది. 637 మంది కానిస్టేబుళ్లు 9 నెలలుగా ఇక్కడ శిక్షణ పొందారు. వీరి ఔట్ పరేడ్‌కు ముఖ్యఅతిథిగా స్వాతి లక్రా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగం, దర్యాప్తు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందున్నారని తెలిపారు. కోవిడ్ కాలంలో రాష్ట్ర పోలీసులు సమాజసేవలో గొప్ప పాత్ర పోషించారన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పోలీస్ విభాగంలో 33 శాతం రిజర్వేషన్ అమలు జరుగుతోందన్నారు. మహిళలు, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళా పోలీసులు మరింత మెరుగ్గా విధులు నిర్వహించేందుకు డీజీపీ తీసుకున్న పలు చర్యలను కేడెట్లకు వివరించారు. టీఎస్పీఏ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతిభ చూపిన కామెరి స్నేహ (ఆదిలాబాద్), కడాలి హారిక (మేడ్చల్), బండారపు మమత(పెద్దపల్లి)కు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఐపీఎస్ అధికారులు కె.రమేశ్‌నాయుడు, డాక్టర్ బి.నవీన్‌కుమార్, శ్రీబాలాదేవి, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ కారణంగా కేడెట్ల కుటుంబాలను ఈ వేడుకకు ఆహ్వానించలేదు. రాష్ట్రంలోని 28 కాలేజీల్లో శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల ఔట్‌పరేడ్ వేడుకలు శుక్రవారం వరకు ఇక్కడ జరగనున్నాయి. -
‘సైబ్ హర్’ను అభినందించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగాన్ని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అభినందించారు. మహిళలు, పిల్లలు భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ‘సైబ్ హర్’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం మరో అద్భుతం సాధించిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ఇంటర్ నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాల వినియోగం గణనీయంగా పెరగడంతో సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్నాయి. సులువుగా మోసాలకు గురయ్యే అవకాశం ఉన్న పిల్లలు, మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ‘సైబ్ హర్’ పేరుతో పోలీసులు స్పెషల్ ప్రోగ్రాం చేపట్టారు. దాదాపు 15 లక్షల మందికి సైబర్ నేరాలు జరిగే విధానం- నేరాల నుంచి బయటపడేందుకు పోలీసులు అవగాహన కల్పించారు. వారిని మనసారా అభినందిస్తున్నానని’’ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
గడప ముంగిట మహిళా సైన్యం
సాక్షి, అమరావతి: గడప ముంగిటకే అన్ని సంక్షేమ ఫలాలను తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసి ‘రక్షణ’ వ్యవస్థను కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసులు ప్రధాన పాత్ర పోషించేలా కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు ప్రతిదాంట్లోనూ ఒక మహిళా పోలీసును నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా 14,944 మహిళా పోలీస్ పోస్టులకుగాను ఇప్పటివరకు 12,265 పోస్టులను భర్తీ చేసింది. మహిళా పోలీసులు ఆ ప్రాంతానికి చెందిన వారే కావడంతో స్థానిక ప్రజలతో మమేకమై పనిచేసే అవకాశం ఉంటుంది. వీరు మరింత సమర్థవంతంగా పనిచేసేలా రాష్ట్ర పోలీసు శాఖ పర్యవేక్షణలో దిశానిర్దేశం చేయనున్నారు. ప్రాథమిక స్థాయిలోనే శాంతిభద్రతల సమస్యలపై స్పందించి గడప వద్దకే వెళ్లి రక్షణ సేవలను అందించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జీరో ఎఫ్ఐఆర్ (ఎక్కడైనా ఫిర్యాదు చేసే అవకాశం) విధానాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఆయా సచివాలయాల పరిధిలో వివాదాలను నేరుగా పోలీస్‌స్టేషన్‌కు నివేదించి ఉన్న చోట నుంచే ఎఫ్ఐఆర్ నమోదుకు మహిళా పోలీసులు వారధిగా ఉపయోగపడనున్నారు. అంతేకాకుండా మద్యం వంటి సామాజిక రుగ్మతలపై ప్రజా చైతన్య వీచికలుగా వీరిని సిద్ధం చేయనున్నారు. స్థానికంగా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, అక్రమాలను అరికట్టేందుకు ప్రజలతో మమేకమై మహిళా పోలీసులు పనిచేస్తారు. శాంతి కమిటీల ఏర్పాటు, ఇతర సామాజిక చైతన్య కార్యక్రమాల్లో వీరిని భాగస్వాముల్ని చేసి.. ఆయా సచివాలయాల పరిధిలో పెనుమార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. క్షేత్రస్థాయిలో వారి సేవలను ఉపయోగించుకుంటాం రాష్ట్రవ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వం మహిళా పోలీసులను నియమించడం గొప్ప విషయం. క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతల నిర్వహణకు వారి సేవలు ఉపయోగించుకుంటాం. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులతోపాటు మహిళా మిత్ర, సైబర్ మిత్ర, స్టూడెంట్ క్యాడెట్ వంటి అనేక మంది సేవలు అందిస్తున్నారు. ఇదే క్రమంలో సచివాలయాల్లోని మహిళా పోలీసుల సేవలను మరింత బాగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటాం. ఆయా జిల్లాల ఎస్పీలు వారిని సమన్వయం చేసేలా చూస్తాం. – డీజీపీ గౌతమ్ సవాంగ్ -
మహిళల రక్షణకు ‘దిశా’నిర్దేశం
సాక్షి, అమరావతి: ‘దిశ’ చట్టాన్ని తెచ్చి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బాధిత మహిళలకు సత్వర న్యాయం చేసేందుకు అంతే వేగంగా చర్యలు చేపడుతోంది. రాజమహేంద్రవరంలో ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. అనంతరం నన్నయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో పోలీసులు, న్యాయవాదులతో జరిగే సదస్సులో మాట్లాడతారు. ఈ సందర్భంగా దిశ యాప్‌ను కూడా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటవుతాయి. ఒక్కో స్టేషన్లో డీఎస్పీలు, సీఐలు ఇద్దరు, ఐదుగురు ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్ సిబ్బంది ఉంటారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఆంధ్రప్రదేశ్‌లో తెచ్చిన దిశ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఢిల్లీ, మహారాష్ట్ర ప్రకటించడం గమనార్హం. -
పోలీసు మహిళా సిబ్బంది కోసం మొబైల్ టాయిలెట్లు
సాక్షి, హైదరాబాద్: బందోబస్తు విధుల్లో ఉండే పోలీసు మహిళా సిబ్బంది కోసం ఆ శాఖ ప్రత్యేకంగా మొబైల్ రెస్ట్‌రూమ్స్, టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు మొదట 17 వాహనాలను సిద్ధం చేసింది. వీటిని ప్రస్తుతం మేడారం జాతర విధుల్లో ఉన్న పోలీసు మహిళా సిబ్బంది కోసం అందుబాటులో ఉంచబోతున్నారు. శుక్రవారం వీటిని హోంమంత్రి మహమూద్ అలీ జెండా ఊపి ప్రారంభించారు. త్వరలో వీటి సంఖ్యను 25కు పెంచుతామని, బందోబస్తు విధుల్లో ఉండే మహిళా సిబ్బందికి వీలుగా ఆయా ప్రాంతాల్లో ఉంచుతామని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ప్రత్యేకంగా ఇందుకు వాహనాలను సమకూర్చుకుని వాటిని మొబైల్ టాయిలెట్లుగా రూపొందించారు. -
‘రాచకొండ మహిళా పోలీసులకు మర్దానీ-2 ప్రదర్శన’
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వరిస్తున్న మహిళా పోలీసుల కోసం రాచకొండ సీపీ మహేష్ భగవత్ ‘మర్దానీ’ 2 చిత్రాన్ని ప్రదర్శించారు. ఉప్పల్‌లోని ఏషియన్ సినిమా థియేటర్లో ఈ సినిమాను ప్రదర్శించారు. మర్దానీ చిత్రంలో మహిళల భద్రత కోసం రాణి ముఖర్జీ ఎలా కృషి చేసిందే ప్రతీ ఒక్కరు అలాగే పనిచేయాలని సీపీ మహేష్ భగవత్ సూచించారు. 2020లో మహిళలపై ఒక్క నేరం కూడా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని అన్నారు. శివారు ప్రాంతాల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని సీపీ పేర్కొన్నారు. -
హ్యాపీ చిల్డ్రన్స్ డే
మదర్ ఈజ్ ఎ వెర్బ్. ఇట్ ఈజ్ సమ్‌థింగ్ యు డు, నాట్ జస్ట్ హు ఆర్ యు! (అమ్మ అనే మాట ఒక క్రియ. నువ్వేం చేశావో అదే నువ్వు. నువ్వెవరివో అది కాదు నువ్వు). కొంచెం ఫిలాసఫీ, కొంచెం అంతర్లీనత కలిసి ఉన్న ఈ వాక్యం ఈ నెల 10న అసోం పోలీస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ప్రత్యక్షమైంది! సాధారణంగా అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫిలాసఫీ, ఫిలాసఫీకి పోలీస్ డిపార్ట్మెంట్.. ఒకదానికొకటి సరిపడనివి. వాక్యంలో అంతర్లీనత కూడా కలిసి ఉందంటే.. డిపార్ట్మెంట్లో ఎవరో బాగా చదువరులైన వాళ్లు ఉండి ఉండాలి. ఆ చదువరులు అమెరికన్ రచయిత్రి చెరిల్ లేసీ డొనోవాన్ 2009లో రాసిన పుస్తకం ‘ది మినిస్ట్రీ ఆఫ్ మదర్‌హుడ్’ ను కూడా చదివే ఉండాలి. మదర్ ఈజ్ ఎ వెర్బ్. ఇట్ ఈజ్ సమ్‌థింగ్ యు డు, నాట్ జస్ట్ హు ఆర్ యు.. అనే మాట ఆ పుస్తకం లోనిదే. కొన్ని మాటలు అనువాదం చేశాక కూడా ఎంత తన్నుకున్నా అర్థం కావు. మాటల్లో లోతు ఎక్కువగా ఉన్నందు వల్ల కలిగే కష్టం అది. ‘అమ్మ అనే మాట ఒక క్రియ’.. అనే ఈ మాటను మాటల్లోకి కాకుండా, ఒక చక్కటి ఫొటోలోకి తర్జుమా చేస్తే ఇదిగో.. మీరిక్కడ చూస్తున్న ఫొటో అవుతుంది. ఇద్దరు మహిళా పోలీసు అధికారులు డ్యూటీ చేయడానికి వచ్చి, తమ డ్యూటీలో ఏ మాత్రం భాగం కాని ‘పని’ని తల్లి మనసుతో చేతుల్లోకి ఎత్తుకున్నారు. ఆ రోజు అసోంలో ‘టీచింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (టెట్) పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష రాసేందుకు బిడ్డ తల్లులూ వచ్చారు. దరంగ్ జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రానికి అలా బిడ్డలతో వచ్చిన ఇద్దరు తల్లులకు సహాయంగా ఎవరూ లేకపోవడంతో అక్కడ విధుల్లో ఉన్న ఈ ఇద్దరు మహిళా పోలీసులు చొరవ చూపి, వారి బిడ్డల్ని చేతుల్లోకి తీసుకున్నారు. ‘‘మీరు నిశ్చింతగా పరీక్ష రాసి రండి. అంతవరకు మీ బిడ్డల పూచీ మాది’’ అని భరోసా కూడా ఇచ్చారు. ట్విట్టర్లో అసోం పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిన ఈ ఫొటో ఇప్పుడు.. చిన్నారులు స్వేచ్ఛగా అడుకుంటూ చుట్టుపక్కలంతా తిరిగినట్లుగా.. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కలియ తిరుగుతోంది. ఈ ఇద్దరు మహిళా పోలీసులపై ఏకధారగా ప్రశంసలు కురుస్తున్నాయి. ‘వియ్ సెల్యూట్’ అని, ‘గ్రేటెస్ట్ వర్క్ ఎవర్, ప్రౌడ్ ఆఫ్ యు’ అని కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. చెరిల్ లేసీ కరెక్టుగానే చెప్పారు. అమ్మ ఏ యూనిఫామ్‌లో ఉన్నా, అమ్మ మనసుకు ఏ యూనిఫామూ ఉండదు. -
అతివల ఆపన్నహస్తం 181
వనజకు మూడేళ్ల క్రితం వివాహమైంది. అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అడుగు పెట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. కానీ, సమీప బంధువు ఒకరు వనజను వేధిస్తుండటం... ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిలో స్నేహితురాలి సహకారంతో ఉమెన్ హెల్ప్‌లైన్ ‘181’కు ఫోన్ చేసి వివరాలు చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు సమస్యను గుట్టుచప్పుడు కాకుండా పరిష్కరించారు. రమ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. అదే కంపెనీలో పనిచేసే టీమ్ లీడర్‌తో ఐదేళ్ల క్రితం అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. ఏడాది పాటు బాగానే సాగిన వారి జీవితంలో క్రమంగా గొడవలు మొదలై కలహాల కాపురంగా మారింది. తల్లిదండ్రులకు దూరంగా ఉండటంతో సర్దిచెప్పేవారు లేరు. ఈ క్రమంలో హెల్ప్‌లైన్ గురించి తెలుసుకున్న రమ్య ఫోన్ చేసింది. భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ కావాలని హెల్ప్‌లైన్ గుర్తించింది. సఖి కేంద్రం ద్వారా నాలుగైదు సెషన్లలో వారి కాపురం గాడిలో పడింది. మూడేళ్లలో హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్ సంవత్సరం వచ్చిన కాల్స్ 2017–18 2,01,948 2018–19 4,45,265 2019–20 1,75,820 (ఇప్పటివరకు) సాక్షి, హైదరాబాద్: ఉమెన్ హెల్ప్‌లైన్ (181)... మహిళా సమస్యల పరిష్కారానికి వారధి. దగ్గరి వ్యక్తులకు సైతం చెప్పుకోలేని సమస్యలను హెల్ప్‌లైన్‌కు వివరిస్తే మూడో కంటికి తెలియకుండా పరిష్కరించడం హెల్ప్‌లైన్ స్టైల్. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు సంస్థ (జీవీకే) భాగస్వామ్యంతో మూడేళ్ల క్రితం ఉమెన్ హెల్ప్‌లైన్ అందుబాటులోకి వచ్చింది. మహిళలు పడే ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వాటికి సలహాలు, వేధింపులు, దాడులు ఇలా అన్ని రకాల అంశాలపై ఈ హెల్ప్‌లైన్ పనిచేస్తుంది. 24/7 పాటు పనిచేస్తున్న ఈ హెల్ప్‌లైన్ ప్రారంభించిన మూడేళ్ల కాలంలో వీటికి వస్తున్న కాల్స్ 8 లక్షలకు చేరింది. రోజుకు సగటున 800 కాల్స్ వస్తుండటం గమనార్హం. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్యలైనా హెల్ప్‌లైన్ దృష్టికి తీసుకురావచ్చు. సమస్య తీవ్రతను బట్టి హెల్ప్‌లైన్ రంగంలోకి దిగుతుంది. అత్యవసరంగా స్పందించాల్సి ఉన్నప్పుడు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను అలర్ట్ చేస్తుంది. కేసు నమోదు చేయాల్సి వస్తే లీగల్ అసిస్టెంట్స్‌తో పాటు వసతిని కూడా ఏర్పాటు చేస్తుంది. వచ్చిన ప్రతికాల్‌కు పరిష్కారం చూపడం, నమోదు చేసిన కేసులను ఫాలోఅప్ చేయడం అంతా క్రమ పద్దతిలో జరుగుతుంది. ఇప్పటివరకు వచ్చిన కాల్స్‌లో 90శాతానికిపైగా పరిష్కరించారు. డీవీ (గృహ హింస) కేసుకు సంబంధించిన ఫిర్యాదు వస్తే వెంటనే సంబంధిత జిల్లా లీగల్ కౌన్సెలర్ లేదా సఖి కేంద్రానికి కాల్ కనెక్ట్ చేస్తారు. బాధితురాలి వివరాలను స్వీకరించి తదుపరి చర్యలు తీసుకుంటారు. కేసు నమోదు చేయాల్సి వస్తే బాధితురాలి రక్షణ చర్యలు తీసుకుని కేసు ఫైల్ చేస్తారు. ఆమెకు కుటుంబ సహకారం లభించకుంటే సఖి కేంద్రంలో వసతి కల్పిస్తారు. వేధింపుల కేటగిరీలో ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉంటుంది. కాల్ వచ్చిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు వాకబు చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకోవడం, కేసు నమోదు, బాధితు రాలికి రక్షణ కల్పించడంలాంటివి క్షణాల్లో జరుగుతాయి. దాడులు, అఘాయిత్యాలకు గురైన మహిళకు వసతి, వైద్య సహకారం అందించ డంతో పాటు న్యాయ సహకారం కోసం సఖి కేంద్రానికి రిఫర్ చేస్తారు. ∙కుటుంబ కలహాలపై వచ్చే ఫిర్యాదులకు హెల్ప్‌లైన్ స్పందన క్రమ పద్ధతిలో ఉంటుంది. కౌన్సెలింగ్ చేయాల్సి వస్తే.. ఇరువురిని సఖి కేంద్రానికి పిలిపిస్తారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు పిలిచి అవగా హన కల్పిస్తారు. ఫోన్లోనూ కౌన్సెలింగ్ ఇచ్చేందుకు హెల్ప్‌లైన్ సహకరిస్తుంది. సలహాలు, సూచనలు.. ఉమెన్ హెల్ప్‌లైన్ ద్వారా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కూడా అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా చిన్నపాటి అంశాలను పెద్దవి కాకుండా జాగ్రత్త పడేలా హెల్ప్‌లైన్ సహకరిస్తుంది. మహిళా చట్టాల పైన విస్తృత అవగాహన కల్పిస్తుంది. కాల్స్ చేసే మహిళలకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు వారిని గైడ్ చేయడంలో హెల్ప్‌లైన్ వ్యూహాత్మకంగా పని చేస్తుంది. రోజూ వస్తున్న కాల్స్‌లో.. ఫిర్యాదు చేయడంతో పాటు వాటికి సంబంధించి తీసుకున్న చర్యలు, కేసు నమోదు చేస్తే వాటి స్టేటస్, సలహాల స్వీకరణ, కాల్ మధ్యలో కట్ అయితే తిరిగి చేయడం, సమాచార స్వీకరణలో అవరోధాలు తదితర అంశాలతో కొందరు వ్యక్తులు పలుమార్లు కాల్స్ చేస్తున్నారు. దీంతో కాల్స్ సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
పోలీసమ్మా... మనసు చల్లనమ్మా..
సాక్షి, కడప: ఈ చిత్రం చూస్తే పోలీసమ్మా.. మనసు చల్ల నమ్మా అనక తప్పదు. గ్రామ సచివాలయ పరీక్షలకు పలువురు అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో చిన్న పిల్లల తల్లులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కడప ఆర్ట్స్ కళాశాలలో తల్లి పరీక్ష రాయడానికి వెళ్లగా బయట అమ్మమ్మ లాలిస్తున్నా చిన్నారి ఏడుస్తూనే ఉంది. విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసమ్మ ఆ బిడ్డను తీసుకుని బాటిల్‌తో పాలు పట్టి లాలించింది. -
లా అండ్ లాలన
పోలీసు శాఖ అంటేనే మానవత్వం లేని శాఖగా అభివర్ణిస్తారు చాలా మంది. కానీ ఖాకీ డ్రెస్ వెనుక కాఠిన్యమే కాదు.. మానవత్వం, ప్రేమ కూడా ఉంటాయని నిరూపించారు సీఐ మాధవి.అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సీఐగా విధులు నిర్వహిస్తున్న వి. మాధవి మూడేళ్లక్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రూరల్ సీఐగా çపని చేసేవారు. ఆ సమయంలో కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన భార్యాభర్తలు అనారోగ్యంతో మరణించగా వారి పిల్లలు అనాథలయ్యారని పత్రికల్లో చదివి అప్పటి డీఎస్పీ దామెర నర్సయ్యతో కలిసి వెళ్లి పరామర్శించారు. ఆ చిన్నారులను చూసి చలించిపోయిన మాధవి వారికి దాతల సాయంతో ఆర్థికంగా ఆసరా ఇప్పించారు. అంతేకాదు, పిల్లల్లో ఒకరైన భవానిని దత్తత తీసుకుని చదివించారు. భవాని టెన్త్‌లో 9.7 గ్రేడ్‌ను సాధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ, కలెక్టర్ల ప్రశంసలు అందుకుంది. భవానికి చదువుపై ఉన్న శ్రద్ధను గమనించిన మాధవి ఆమెను తన పిల్లలు చదివే కాలేజీలోనే చేర్పించి, ఆలనాపాలనా చూడడమే కాకుండా ఒక తల్లిగా మంచిచెడులు చెప్తూ ఇంటర్లో మంచి మార్కులు సాధించాలని ఆ దత్త పుత్రికకు స్ఫూర్తిని ఇచ్చారు. భవాని కష్టపడి చదివి ఇంటర్లో 969 మార్కులు సాధించింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఒక మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతోంది. తన ‘పోలీస్ అమ్మ’ కోరిక మేరకు సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని చెప్తోంది భవాని. మాటే మంత్రం స్టేషన్‌కి వచ్చే బాధితులతో ఒక పోలీస్‌గా కాకుండా ఒక ఆత్మీయురాలిగా మాట్లాడతారు మాధవి. కుటుంబ కలహాలతో తన దగ్గరకి వచ్చినవారికి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంతటి ఉపద్రవానికి దారి తీస్తాయో చెబుతూ చక్కటి కౌన్సెలింగ్ ఇస్తారు. ఆమె మాట మంత్రంగా పని చేసి ఆ జంట కలిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి ప్రేమికురాలు ఆమె ఏ స్టేషన్లో విధులు నిర్వహించినా అక్కడ పచ్చదనం కనిపించేలా చూస్తుంది. మానకొండూర్ పీఎస్‌లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పోలీస్‌స్టేష¯Œ పరిసరాలు ఉద్యానవనాన్ని తలపించేలా గార్డెనింగ్ చేయించింది. అందుకే జిల్లాలోనే అంతటి పచ్చదనం ఉన్న పోలీస్‌స్టేషన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇంత మంచి మనసున్న పోలీస్ మాధవమ్మ జీవితం కూడా పచ్చగా ఉండాలని కోరుకుందాం.– స్వర్ణ మొలుగూరి, సాక్షి, హైదరాబాద్ -
అతివలకు అండగా..
సాక్షి, అమరావతి: మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గడచిన ఐదేళ్లలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 82,502 కేసులు నమోదు కాగా.. వాటిలో అత్యాచారాలు, వేధింపులు, దాడులు, అవమానాల వంటి కేసులు 44,780 ఉండటం గమనార్హం. గతేడాది జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. 2014 నుంచి 2018 డిసెంబర్ వరకు మహిళలపై నేరాలను గమనిస్తే ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న మహిళా పోలీస్ టీమ్‌లను సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపాటు కొత్తగా మరిన్ని చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు విజయవాడ, విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో 18 యూనిట్లలో ఏర్పాటైన శక్తి టీమ్స్ (మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల బృందాలు)ను రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. ప్రధానంగా పట్టణాల్లోని విద్యాలయాలు, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కాపుకాసే మహిళా పోలీస్ టీమ్‌లు పోకిరిల పనిపట్టనున్నాయి. మహిళలపై దాడులు, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ఇవి పనిచేస్తాయి. పోలీస్ వలంటీర్లు, మహిళా మిత్రల నియామకం వివిధ సమస్యల బారిన పడుతున్న మహిళలకు అండగా ఉండేలా ప్రత్యేకంగా మహిళా పోలీస్ వలంటీర్లు, మహిళా మిత్రలను ప్రభుత్వం నియమిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 18,512 మంది మహిళా పోలీస్ వలంటీర్ల నియామకం, నిర్వహణ కోసం ఈ ఏడాది బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ప్రస్తుతం విజయవాడలో నేర విచారణ, బాధితుల సంరక్షణ కోసం అంతర్జాతీయ ఫౌండేషన్ సహకారంతో మహిళా పోలీస్ వలంటీర్ల వ్యవస్థ నడుస్తోంది. వారితోపాటు రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలకు చెందిన మహిళా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యోగులు, విద్యార్థినులతో ‘మహిళా మిత్ర’ బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మహిళా చైతన్యానికి, వారికి అండగా నిలిచేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బాలికలు, మహిళల అక్రమ రవాణాకిక చెక్ రాష్ట్రం నలుమూలల నుంచి మహిళల సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు యుద్ధప్రాతిపదికన స్పందించి వారికి రక్షణ కల్పించేలా ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వíßహిస్తున్న హెల్ప్‌లైన్ 181, ఏపీ పోలీస్ హెల్ప్‌లైన్ 100, 1090, పోలీస్, అగ్నిమాపక, ఆరోగ్య, ఇతర అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ 112 నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్రాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య మానవ అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళలు, బాలికల అక్రమ రవాణాను నివారించేలా ఏలూరు, గుంటూరు, అనంతపురంలలో ఉన్న మూడు ప్రత్యేక యూనిట్లకు జవసత్వాలు కల్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. మరోవైపు సామాజిక మాధ్యమాలు, ఇతర ప్రచార సాధనాల్లో మహిళలు, బాలికలకు సంబంధించిన అసభ్య పోస్టింగ్‌లు, ట్రోలింగ్లు, కించపరిచే వ్యాఖ్యానాల మూలాలను గుర్తించి అడ్డుకోవడంపైనా ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం మహిళలు, చిన్నారులపై సైబర్ క్రైమ్ నిరోధానికి నాలుగు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.38.85 లక్షలను బడ్జెట్లో కేటాయించడం విశేషం. -
టిక్ టాక్: మహిళా పోలీసుల స్టెప్పులు.. వైరల్
సాక్షి, చెన్నై: డ్యూటీలో ఉన్న మహిళా పోలీసులు సరదాగా బీచ్‌లో తీన్మార్ స్టెప్పులేశారు. టిక్ టాక్ మోజులో పడి యూనిఫామ్‌లో ఉన్నామన్న సంగతి కూడా మరిచి.. రొమాంటిక్ పాటకు కాలు కదిపారు. ఇంకేముంది వెంటనే లైక్స్ కోసం దాన్ని టిక్‌టాక్‌లో అప్లోడ్ చేశారు. కడలూరు రిజర్వ్ పోలీసు బెటాలియన్ చెందిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సమీపంలోని బీచ్‌లో ఓ తమిళ పాటకు తీన్మార్ స్టెప్పులు వేస్తూ టిక్ టాక్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖాకీ దుస్తుల్లోనే ఇరువురు కానిస్టేబుళ్లు స్టెప్పులు వేయటం పోలీసు అధికారులకు ఆగ్రహం తెప్పించింది. వారిద్దరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
దొంగ నుంచి 2.50 లక్షలు కొట్టేసిన మహిళా సీఐ
చెన్నై ,టీ.నగర్: దొంగ వద్ద నుంచి రెండున్నర లక్షల రూపాయలు అపహరించిన మహిళా ఇన్స్పెక్టర్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. చెన్నైలో గత మే లో రైలులో చోరీలు చేసే సాహుల్ అమీన్ అనే యువకుడు అరెస్టు అయ్యారు. కేరళకు చెందిన ఇతను రైళ్లలో ఏసీ బోగీ టికెట్లు తీసుకుని ప్రయాణికుల తరహాలో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడేవాడు. ఇదిలాఉండగా రైల్వే పోలీసులకు చిక్కిన సాహుల్ అమీన్ వద్ద 110 సవర్ల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద విచారణ జరపగా తరచుగా చోరీలకు పాల్పడుతూ వస్తున్నట్టు తెలిసింది. ఇందులో చోరీ చేసిన నగలను విక్రయించి నగదును బ్యాంకులో జమచేస్తున్నట్టు తెలిసింది. అతనికి 15 బ్యాంకులలో ఖాతాలు ఉన్నట్లు తెలిసింది. ఈ బ్యాంకు ఏటీఎం కార్డులు కూడా సాహుల్ అమీన్ వద్ద ఉన్నాయి. ఇదిలాఉండగా పోలీసుల వద్ద సాహుల్‌అమీన్ తన రెండు ఏటీఎం కార్డులు మాయమైనట్టు తెలిపారు. దీనికి సంబంధించి రైల్వే పోలీసులు రహస్య విచారణ చేపట్టారు. సాహుల్ అమీన్ వద్ద విచారణ జరిపిన పోలీసులు ఈ కార్డులను తీసి ఉపయోగించారా అనే విషయంపై విచారణ జరిగింది. ఇందులో మహిళా పోలీసు ఇన్స్పెక్టర్ ఒకరు రెండు కార్డులను ఉపయోగించి నగదు తీసుకున్న వివరాలు బయటపడ్డాయి. సాహుల్ అమీన్ ఎటీఎం కార్డు ఉపయోగించి మహిళా ఇన్స్పెక్టర్ రూ.2.50 లక్షలు తీసుకున్నారు. ఆమె నగదు తీసుకున్న వీడియో ఆధారాలు కూడా బయటపడ్డాయి. రైల్వేపోలీసులో పని చేసిన సదరు మహిళా ఇన్స్పెక్టర్ ప్రస్తుతం చెన్నై క్రైం బ్రాంచ్ విభాగంలో వేప్పేరి కమిషనర్ ఆఫీసులో పనిచేస్తున్నారు. బుధవారం సాయంత్రం ఈ వివరాలు వెల్లడి కాగానే సెంట్రల్ క్రైం బ్రాంచ్‌లో కలకలం ఏర్పడింది. -
తప్పు చేసి.. తప్పించుకోలేరు
సాక్షి, హైదరాబాద్: మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి జరిగిన సమయంలో బాధితులు సకాలంలో పోలీసులను ఆశ్రయించినా.. శాస్త్రీయ ఆధారాలు సేకరించడంలో జరిగే జాప్యం వల్ల చాలాసార్లు నిందితులు తప్పించుకుంటున్నారు. నిందితుల పీచమణచడానికి తెలంగాణ పోలీసుశాఖ ఇకపై ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని నిర్ణయించింది. లైంగిక దాడి లేదా హత్యజరిగినపుడు ఘటనాస్థలం నుంచి సెమెన్, రక్తం, వెంట్రుకలు, వేలిముద్రలు, తదితరాలను సేకరించి తక్షణమే విశ్లేషించి పకడ్బందీగా కేసు నమోదు చేసేందుకు ప్రత్యేకమైన మెడికల్ కిట్‌ను రూపొందించారు. దీనిపై ప్రభుత్వ వైద్యులకు ఇప్పటికే శిక్షణ ఇస్తున్నారు. త్వరలోనే వీటిని రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లకు పంపనున్నారు. వీటి ఆధారంగా సేకరించిన శాంపిల్స్‌తో నేరనిరూపణ, నిందితులకు శిక్ష వంటివి వేగంగా అమలు జరిగి, బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది. ఈ కిట్‌ను ప్రవేశపెట్టడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమం మొత్తం మహిళా రక్షణ విభాగ చీఫ్, ఐజీ స్వాతిలక్రా నేతృత్వంలో జరుగుతోంది. మొత్తం కార్యక్రమాన్ని ఎస్పీ సుమతి పర్యవేక్షిస్తున్నారు. కార్పొరేట్ సదస్సు 27న ఆఫీసుల్లో ఉద్యోగం చేసుకునే మహిళలకు ఎదురయ్యే వేధింపులపై అవగాహన కల్పించడానికి మహిళా రక్షణ విభాగం నిర్ణయించింది. ఈనెల 27న మాదాపూర్‌లో తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు పలు ప్రముఖ ఐటీ కంపెనీల ముఖ్యులు కూడా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పనిచేసే చోట మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపులు, బెదిరింపులు వాటిని ఎలా ఎదుర్కోవాలి తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు. గ్రామీణ ఫిర్యాదులపై వేగంగా స్పందించేందుకు.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఫిర్యాదులు చేసేందుకు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. నం 100కు డయల్ చేసి ఫిర్యాదు చేసినపుడు పోలీసులు వేగంగా స్పందించి, సమీపంలోని వారు 5 నిమిషాలలోపు సంఘటనా స్థలికి చేరుకునే విధంగా ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు. గృహహింస, వేధింపులు, లైంగిక దాడి ఘటన ఎలాంటిదైనా, నేర తీవ్రతతో సంబంధం లేకుండా.. అన్ని ఫిర్యాదులపై ఒకే రకంగా స్పందించేలా చర్యలు చేపట్టనున్నారు. మహిళల రక్షణ మా భరోసా తెలంగాణలో మహిళలకు అన్ని విధాలా రక్షణ కల్పించడమే మా ధ్యేయం. ముఖ్యంగా పలు రకాల దాడులకు గురైన కేసుల్లో బాధితుల నుంచి శాస్త్రీయ ఆధారాల సేకరణ ఇకపై పకడ్బందీగా ఉండనుంది. నేరస్తులకు వీలైనంత వేగంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం. – స్వాతి లక్రా ఐజీ,చీఫ్ విమెన్స్ సేఫ్టీ వింగ్ బాధితులకు వేగంగా న్యాయం శాస్త్రీయ ఆధారాల సేకరణతోపాటు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వేధింపులు, దాడులపై అవగాహన కల్పిస్తున్నాం. దీని వల్ల నేర నియంత్రణ సాధ్యమవుతుంది. – సుమతి, ఎస్పీ, విమెన్స్ సేఫ్టీ వింగ్ ప్రతీరోజు డీజీపీకి నివేదిక.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలను ఎప్పటికపుడు విమెన్ సేఫ్టీ వింగ్ పర్యవేక్షిస్తోంది. నేరాల దర్యాప్తు, నిందితులను కోర్టుకు పంపడం తదితర విషయాలన్నీ నిత్యం డీజీపీకి నివేదిక పంపుతున్నారు. ముఖ్యంగా ఫోక్సో కేసుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిందితులను 24 గంటల్లోనే అరెస్టు చేయడంలో చాలా వరకు సఫలీకృతులవుతున్నారు. త్వరలో స్కూళ్లు,కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ సదస్సుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇలాంటి కేసులపై మహిళా ప్రజాప్రతినిధుల్లోనూ అవగాహన పెంచేందుకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులకు కూడా మహిళా పోలీసులు శిక్షణ ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే వీటి తేదీలు ఖరారు చేస్తారు. -
మహిళా సీఐ ఆత్మహత్య
తమిళనాడు, టీ.నగర్: దిండివనంలో మహిళా సీఐ ఆది వారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విల్లుపురం జిల్లా, దిండివనం సమీపం కావేరిపాక్కానికి చెందిన మాణిక్యవేలు భార్య జైహింద్ దేవి (38). ఈమె బ్రహ్మదేశం పోలీసుస్టేషన్లో ఎస్ఐగా పనిచేశారు. ప్రస్తుతం పదోన్నతి పొంది కడలూరు జిల్లా నైవేలి థర్మల్ పోలీసుస్టేషన్లో ఇన్స్పెక్టర్గా వెళ్లారు. ఇలావుండగా ఆమె ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కారణాలు తెలియరాలేదు. దిండివనం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. దిండివనం డీఎస్పీ కనకేశ్వరి విచారణ జరుపుతున్నారు. -
ఢిల్లీ మహిళా పోలీసులు స్టెప్పులు
-
వైరల్ వీడియో : మహిళా పోలీసులా మజాకా..!
న్యూఢిల్లీ : హర్యానాకు చెందిన ప్రముఖ సింగర్ కమ్ డ్యాన్సర్ సప్నా చౌదరి అంటే తెలియని వారుండరు. ఆమె పాటల్లో ‘తేరి ఆఖోంకా ఏ కాజల్’ చాలా ఫేమస్. ఎంతలా అంటే యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను ఇప్పటికే 380 మిలియన్ల మంది చూశారు. ఇప్పుడు ఇదే పాటకు ఢిల్లీ మహిళా పోలీసులు అదిరిపోయే స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గత నెల 30న సౌత్ వెస్ట్ ఢిల్లీ పోలీసులు ‘సునో సహెలీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దానిలో భాగంగా సప్నా చౌదరి ‘తేరి ఆఖోంకా ఏ కాజల్’ పాటను ప్లే చేశారు. ఇంకేముంది ఓ ముగ్గురు, నలుగురు మహిళా పోలీసు అధికారులు స్టేజీ మీదకు ఎక్కి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. అంతటితో ఊరుకోక ఐపీఎస్ అధికారిణి బెనిటా మారి జైకర్ను కూడా తమతో పాటు స్టేజీ మీదకు లాకెళ్లారు. దీన్ని స్పోర్టీవ్‌గా తీసుకున్న ఐపీఎస్ అధికారిణి కూడా మిగతా వారితో కలిసి స్టెప్పులేసింది. డ్యాన్సర్, సింగర్ అయిన సప్నా చౌదరికి హర్యానాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే బిగ్‌బాస్ షోలో పాల్గొనడంతో ఆమె గురించి దేశం అంతా తెలిసింది. గత ఏడాది గూగుల్‌లో అత్యధిక మంది సర్చ్ చేసింది కూడా సప్నా చౌదరి గురించేనట. -
మహిళా పోలీసు ఆత్మహత్య
తమిళనాడు , టీ.నగర్: ఉసిలంపట్టి సమీపంలో మహిళా పోలీసు ఉరేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. మదురై జిల్లా ఉసిలంపట్టి పరిధిలోని గుంజాంపట్టి గ్రామానికి చెందిన ముత్తువాళన్ ఆటోడ్రైవర్. ఇతని భార్య అముద (30). ఈమె ఉసిలంపట్టి మహిళా పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వీరికి అన్బురాజ్ అనే కుమారుడు, ఝాన్సి అనే కుమార్తె ఉన్నారు. వీరు గుంజాంపట్టి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఎస్ఐ పరీక్షల కోసం అముద చదువుతోంది. భార్య చదువుకు ఆటంకం కలిగించకూడదని ముత్తువాళన్ ఆదివారం రాత్రి మిద్దెపై ఉన్న గదిలో నిద్రించాడు. పిల్లలు మరో గదిలో నిద్రించారు. సోమవారం ఉదయం చాలా సేపయినప్పటికీ అముద ఉన్న గది తలుపు తెరుచుకోలేదు. దీని గురించి పిల్లలు తండ్రికి తెలిపారు. రాత్రంతా చదివి ఆదమరచి నిద్రపోయి ఉంటుందని, ఆమెను లేపకుండా స్కూలుకు వెళ్లమని వారికి తెలిపాడు. ఇలావుండగా కిటీకీ నుంచి చూసిన అన్బురాజŒ బిగ్గరగా కేకలు వేశారు. ముత్తువాళన్ తలుపు పగులగొట్టి చూడగా అముద ఉరి వేసుకుని మృతిచెందింది. సమాచారం అందుకున్న ఉసిలంపట్టి డీఎస్సీ రాజా ఆధ్వర్యంలోని పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇది కుటుంబ సమస్య లేదా అధికారుల వేధింపుల కారణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
మహిళలకు తోడుగా ‘ఉమెన్ ఆన్ వీల్స్’
ఖైరతాబాద్: నగరం పోలీసు విభాగంలో షీ టీమ్స్ తరహాలోనే పెట్రోలింగ్ వ్యవస్థలో ఉమెన్ ఆన్ వీల్స్ కూడా కీలకంగా మారుతుందని సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ అన్నారు. బుధవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వేదికగా ప్రత్యేకంగా శిక్షణ పొందిన 20 మంది మహిళా కానిస్టేబుళ్లను ‘‘ఉమెన్ ఆన్ వీల్స్’’ విధుల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ హైదరాబాద్ సిటీ పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థలో మహిళా కానిస్టేబుళ్లతో ‘ఉమెన్ ఆన్ వీల్స్’ పేరుతో పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. షీ టీమ్స్ తరహాలోనే పెట్రోలింగ్ వ్యవస్థలో పురుషులకు సమానంగా మహిళలను నియమిస్తున్నారు. వారికి రెండు నెలల పాటు డ్రైవింగ్ స్కిల్స్, ఇంటర్న్‌షిప్, ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రజల్లోకి పంపుతున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఈ తరహా పోలీసింగ్ కీలక భూమిక పోషిస్తుందన్నారు. ఇప్పటివరకు మహిళా కానిస్టేబుళ్లు కౌన్సిలింగ్, రిసెప్షనిస్ట్‌లుగా మాత్రమే పరిమితమయ్యారన్నారు. ఎన్టీఆర్గార్డెన్, లుంబినీపార్క్, సంజీవయ్యపార్క్, మాల్స్ తదితర ప్రాంతాల్లో మహిళలు ఈవ్‌టీజింగ్ తదితర ఇబ్బందులు ఎదుర్కొటున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఉమెన్ పెట్రోలింగ్ సిబ్బందితో మహిళలు వారి సమస్యలను నేరుగా చెప్పుకునేందుకు వీలవుతుందన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ‘ఉమెన్ ఆన్ వీల్స్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సెంట్రల్ జోన్ పరిధిలో 20మంది కానిస్టేబుళ్లు అవగాహన కల్పించేందుకు పీపుల్స్ ప్లాజా నుంచి ఐమాక్స్ రోటరీ చౌరస్తా, లుంబినీపార్క్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. సైఫాబాద్, పంజగుట్ట, బంజారాహిల్స్, చిక్కడపల్లి, ఆబిడ్స్, లేక్ పోలీస్స్టేషన్ల పరిధిలో వీరు విధులు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో షీ టీమ్స్ ఏసీపీ నర్మద, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, సైఫాబాద్ ఇన్స్‌స్పెక్టర్ చింతల సైదిరెడ్డి, సీసీఎస్ అడ్మిన్ పూర్ణచందర్, నాంపల్లి రాజేష్, రాంగోపాల్‌పేట్ బాబు ఇన్స్ప్పెక్టర్లు పాల్గొన్నారు. సమస్యలను ధైర్యంగా చెప్పుకోవచ్చు మహిళలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు 100కు డయల్‌చేసిన వెంటనే పెట్రోలింగ్ విధుల్లో ఉండే పురుషులు సంఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు వారి సమస్యలను నేరుగా చెప్పలేకపోవచ్చు. ఆ విధుల్లో మేము ఉండటం వల్ల వారు ధైర్యంగా వారి ఇబ్బందులు మాతో చెప్పుకోగలరు. విధులను చాలెంజ్‌గా తీసుకుంటా.– పుష్యమిత్ర, చాంద్రాయణగుట్ట పీఎస్ కొత్త ఒరవడికి శ్రీకారం ఉమెన్ ఆన్ వీల్స్ అనే కొత్త వరవడికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా మాకు రెండు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రజలకు నేరుగా సేవచేసేందుకు ఇదో మంచి అవకాశం. – నాగకుమారి, చాంద్రాయణగుట్ట పీఎస్ -
మహిళా పోలీసులకు కొత్త డ్రెస్‌కోడ్
కర్ణాటక, బనశంకరి : మహిళా పోలీసుల డ్రెస్ కోడ్‌లో పోలీసు శాఖ సంపూర్ణ మార్పులు తెచ్చింది. విధి నిర్వహణలో అనుకూలంగా ఉండేలా ఖాకీ చీరల స్థానంలో ఖాకీ ప్యాంట్, షర్ట్ ధరించాలనే ఆదేశాలు శనివారం నుంచి అమలులోకి వచ్చాయి. మహిళా కానిస్టేబుళ్లు చీరలు ధరించి విధులు నిర్వర్తించడం కష్టతరంగా ఉండటం, నేరాలు జరిగిన సమయంలో ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి, నేరస్థులను వెంబడించడానికి ఇబ్బందిగా ఉండటంతో గతనెల 3న పోలీసుశాఖ ప్రధాన కార్యాలయంలో డీజీపీ నీలమణి రాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో డ్రెస్‌కోడ్‌లో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై చీరలకు బదులు ఖాకీ ప్యాంట్, షర్ట్ ధరించాలని, చెవి కమ్మలు, నుదుట బొట్టు, చేతి గాజులు చిన్నసైజులో ఉండాలని, ఒక చేతికి చిన్నసైజులో లోహంతో చేసిన గాజు ధరించవచ్చంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. కేశాలంకరణలో కొన్ని మార్పులు చేశారు. జుట్టును వదులుగా వదిలేయకుండా కొప్పుగా చుట్టి నల్లరంగు నెట్టెడ్ బ్యాండ్‌తో ముడి వేసుకోవాలని ఆదేశాల్లో సూచించారు. నల్లరంగు హెయిర్‌డై మినహా జుట్టుకు ఏ ఇతర రంగు వేయరాదు. పూలు పెట్టుకోవడాన్ని కూడా నిషేధించారు. శాఖలోని మహిళా అధికారి నుంచి సిబ్బంది వరకు ఒకే డ్రస్కోడ్ అమలులో ఉంటుంది. -
స్టేషన్ ఇన్‌చార్జ్‌లుగా మహిళా పోలీసులు
ముంబై : మహారాష్ట్ర పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌లుగా ఎనిమిది మంది మహిళా అధికారులును నియమిస్తున్నట్లు ముంబై పోలీసులు ట్వీటర్లో తెలిపారు. రాష్ట్రంలో ఏమూల నుంచైనా మహిళలు ప్రమాదంలో ఉన్నారని ఫిర్యాదు చేస్తే ఈ టీం వెంటనే స్పందిస్తుంది. అంతేకాకుండా వారి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎనిమిది మంది మహిళా అధికారులను నియమిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కాగా ఈ విధంగా మహిళా ఇన్‌చార్జ్‌లను ఏర్పాటు చేయటం దేశంలోని మొదటి సిటీగా ముంబై పోలీసులు ఘనత సాధించారు. ఈ టీం కేవలం ట్వీటర్‌ను ఫాలో అవ్వడమే కాకుండా నేరస్తులను కూడా పట్టుకోవడంతో కీలక పాత్ర పోషించే విధంగా వారికి శిక్షణ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలను ఎప్పటికప్పడు సమీక్షిస్తూ సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని అందిస్తారు. ముంబై పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా సంఘాలు, స్థానికులు అభినంధనలు తెలుపుతున్నారు. మహిళా సాధికారతకు ఇది మంచి పరిణామం అని ట్వీటర్ వేదికగా ప్రసంశలు కురిపిస్తున్నారు. -
మహిళా పోలీస్ స్టేషన్లా..అవసరం లేదు!
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని పోలీసు శాఖ స్పష్టం చేసింది. పోలీస్ నియామకాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేస్తున్న నేపథ్యంలో వాటి ఉపయోగం పెద్దగా అవసరం లేదని భావిస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. వేధింపులు, వరకట్న కేసులు, విడాకులు.. ఇలా మహిళలకు సంబంధించిన కేసుల విచారణ కోసం పాత జిల్లాల్లో ప్రత్యేకంగా మహిళా పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసు శాఖ తాజా నిర్ణయంతో ఉన్న ఈ పోలీస్ స్టేషన్లు కూడా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో పాత జిల్లాల హెడ్‌క్వార్టర్స్‌లో ఒక్కో మహిళా పోలీస్ స్టేషన్ చొప్పున ఏర్పాటు చేశారు. అయితే కొత్త జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్కటి కూడా ఏర్పాటు కాలేదు. దీనిపై పోలీస్ శాఖను వివరణ కోరగా.. ఇక మహిళా పోలీస్స్టేషన్లు అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో మహిళా పోలీస్ స్టేషన్ల వ్యవస్థపై పోలీస్ శాఖ నిర్ణయం వివాదాస్పదమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. రిజర్వేషన్‌తో సంబంధం ఏంటి? గృహిణులు, యువతులు, మహిళలు.. వేధింపులు, సమస్యలతో పోలీస్ స్టేషన్లకు వెళ్తుంటారు. అయితే మహిళా కానిస్టేబుళ్లు, అధికారులు ఉంటేనే వారితో సమస్య చెప్పుకునేందుకు, కేసుల వ్యవహారంపై చర్చించుకునేందుకు బాధిత మహిళలకు సులభంగా ఉంటుంది. ఇలా కాకుండా సాధారణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మహిళలు తమ సమస్య చెప్పుకోవడం ఎలా సాధ్యమవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్‌కు, నూతన జిల్లాల్లో మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు లింకు పెట్టడంపై పోలీస్ శాఖలో తీవ్రమైన అభ్యంతరం వ్యక్తమవుతోంది. పోలీస్ ఫోర్స్‌లో 3.13 శాతమే ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖలో కేవలం 1,484 మంది మహిళా సిబ్బంది మాత్రమే ఉన్నారు. అంటే మొత్తం పోలీస్ ఫోర్స్‌లో 3.13 శాతం మాత్రమే. ఇందులో కూడా కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్లే ఎక్కువగా ఉన్నారు. అధికారుల విషయానికొస్తే 17 మంది మహిళా ఇన్స్పెక్టర్లు, 34 మంది ఎస్ఐలు, 58 మంది ఏఎస్ఐలు ఉన్నారు. పాత జిల్లాల పరిధిలోని 14 మహిళా పోలీస్ స్టేషన్లను ఒకసారి పరిశీలిస్తే.. హైదరాబాద్ కమిషనరేట్‌లో మినహా మిగతా ప్రాంతాల్లో మహిళా అధికారులకు మహిళా పోలీస్ స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓలుగా పోస్టింగ్స్ ఇవ్వలేదు. కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్‌లోని హన్మకొండలో పురుషులనే ఎస్‌హెచ్‌ఓలుగా నియమించారు. సైబరాబాద్, సంగారెడ్డి మహిళా పోలీస్స్టేషన్లకు ఇన్స్పెక్టర్ అంటూ లేరు. మహిళల కేసుల పరిష్కారం..? మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయని పక్షంలో శాంతి భద్రతల పోలీస్ స్టేషన్ అధికారి నేతృత్వంలోనే మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తారు. అయితే బందోబస్తులు, నేరాల నియంత్రణ, ఇతరత్రా వ్యవహారాలతోనే సంబంధిత స్టేషన్ హౌస్ అధికారి బిజీగా ఉంటారు. మరి మహిళల సంబంధిత కేసులను ఎప్పుడు పర్యవేక్షిస్తారు, పరిశీలిస్తారనే దానిపై ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ నేతృత్వంలో షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. వీటి పర్యవేక్షణ బాధ్యత మహిళా పోలీస్ స్టేషన్లకు అప్పగిస్తే ప్రత్యేకమైన విభాగం ఎప్పుడూ మహిళల రక్షణ, బాధ్యతపైనే పని చేస్తుందన్న వాదనను పట్టించుకోకపోవడం గమనార్హం. హెల్ప్ డెస్క్‌తో సరి..? మహిళా పోలీస్ స్టేషన్లో ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారితోపాటు మరో ఇద్దరు ఎస్ఐలు, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, పది మంది వరకు కానిస్టేబుళ్లు ఉంటారు. రిజర్వేషన్ పెంపుతో నూతన పోలీస్ స్టేషన్లు ఏర్పాటైతే వారిని ఎస్‌హెచ్‌ఓలుగా నియమిం చవచ్చు. అలా కాదని కొత్త జిల్లాల్లో మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయకుండా, శాంతి భద్రతల కోసం పోలీస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ ప్రకారం హెల్ప్ డెస్కుల్లో కేవలం కానిస్టేబుల్/హెడ్‌కానిస్టేబుల్ ర్యాంకు సిబ్బందిని కూర్చోబెట్టాలని యోచిస్తున్నారు. మహిళా ఎస్ఐలు, ఏఎస్ఐలు ఉండరు. 33% రిజర్వేషన్ అమలు నేపథ్యంలో అవసరం లేదని వెల్లడి -
మహిళా పోలీసుపై అత్యాచారం: ఎస్ఐపై కేసు
చెన్నై: తిరునెల్వేలి జిల్లాలో మహిళా పోలీసును పెళ్లి పేరుతో మోసం చేసి ఆమెపై అత్యాచారం జరిపిన సబ్ఇన్స్పెక్టర్పై కేసు నమోదైంది. తిరునెల్వేలి జిల్లా పొపట్టలైకు చెందిన రామలక్ష్మి (29) మహిళా పోలీసు అయిన ఈమె ఆలంకులం సమీపంలోగల సీద పర్సనల్లూర్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వహిస్తోంది. ఈమె గత 2014లో కేసులకు సంబంధించిన ఫైల్స్ విషయంలో తరచూ ఆలంగులం డీఎస్పీ కార్యాలయానికి వెళుతుండేది. ఆ సమయంలో అదే పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న వీరకోరలంపుదూర్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ అరుమై నాయగన్ (35)కు, రామలక్ష్మికి మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో అరుమై నాయగన్ తనకు అప్పటికే వివాహం జరిగిన విషయాన్ని దాచి రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని ఆశలు కల్పించి ఆమెపై అత్యాచారం జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలల క్రితం అరుమై నాయగన్ సబ్ఇన్స్పెక్టర్గా పరీక్ష రాసి చెన్నైలో గల పోలీసు ట్రైనింగ్ కళాశాలకు వెళ్లాడు. దీంతో అతడు రామలక్ష్మితో మాట్లాడడం తగ్గించాడు. ఈ క్రమంలో అరుమైనాయగన్కు వివాహం జరిగిన విషయం తెలిసి రామలక్ష్మి తనకు న్యాయం చేయాలని అరుమైనాయగన్ వద్ద అడిగింది. దీంతో అతడు ఆమెను బెదిరించడంతో రామలక్ష్మి ఈ విషయాన్ని అంబై మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ నాగదేవి, పోలీసులు విచారణ చేసి సబ్ ఇన్స్పెక్టర్ అరుమై నాయగన్‌పై కేసు నమోదు చేశారు. -
'విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు'
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో లాఠీచార్జ్‌పై సోమవారం మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నివేదిక అందజేశారు. మహిళా పోలీసులే విద్యార్థినులను అరెస్ట్ చేశారని ఆయన నివేదికలో పేర్కొన్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. వైస్ ఛాన్సలర్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి దాడికి యత్నించారని అన్నారు. పోలీసులపై కూడా రాళ్లు రువ్వారని చెప్పారు. దాంతో విధిలేని పరిస్థితుల్లోనే పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు హెచ్ఆర్సీకి ఇచ్చిన నివేదికలో సీవీ ఆనంద్ వివరణ ఇచ్చారు. -
అతివకు ‘భరోసా’
బాల బాధితులకూ సమగ్ర ఆసరా అన్ని సేవలూ ఒకే గొడుకు కిందికి హాకా భవన్లో ప్రత్యేక కార్యాలయం త్వరలో అందుబాటులోకి: పోలీసు కమిషనర్ నగరంలోని 60 శాంతిభద్రతల ఠాణాలు, మూడు మహిళా పోలీసుస్టేషన్లకు బాధిత మహిళలు నుంచి ప్రతి రోజూ 50 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. మైనర్లు, చిన్నపిల్లలపై జరిగే దారుణాలపైనా నిత్యం అనేక ఫిర్యాదులందుతున్నాయి. సిటీబ్యూరో: తీవ్రమైన వేధింపులు, దాడులు ఎదుర్కొన్న మహిళలు, చిన్నారులకు ఊరట లభించాలంటే కేవలం కేసు నమోదు చేస్తే సరిపోదు. దీంతో పాటు వైద్య-న్యాయ సహాయాలు, పునరావాసం, కౌన్సెలింగ్ తదితరాలు ఎంతో అవసరం. ప్రస్తుతం వీటి కోసం బాధితులు పోలీసుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అనేక చోట్లకు తిరగాల్సి వస్తోంది. ఇది వారికి ఎంతో ఇబ్బంది కలిగించే అంశం. ఈ సమస్యలకు పరిష్కారంగా నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆలోచన నుంచి పుట్టిందే ‘భరోసా’ కేంద్రం. మహిళా దినోత్సవం నేపథ్యంలో మంగళవారం దీని వివరాలు వెల్లడించిన కొత్వాల్.. ఇందుకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. దేశంలో మరే ఇతర నగరంలోనూ ఈ తరహా సెంటర్ లేదని అధికారులు చెప్తున్నారు. అంతర్జాతీయ హంగులతో... లక్డీకాపూల్‌లో ఉన్న హాకా భవన్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ‘భరోసా’ రూపుదిద్దుకుంటోంది. ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తయారవుతున్న ఈ కేంద్రం పరిధిలోకే ‘షీ-టీమ్స్’, ‘చైల్డ్ లైన్’ విభాగాలనూ తీసుకువస్తున్నారు. కమిషనర్ నేతృత్వంలో ఉండే కమిటీ పర్యవేక్షణలో పని చేసే ఈ కేంద్రానికి మహిళా ఏసీపీ ఇన్చార్జ్గా, వివిధ రంగాలకు చెందిన 36 మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. వివిధ నేరాల్లో బాధితులైన మహిళలు, యువతులు, బాలికలకు ఈ కేంద్రం సేవలందిస్తుంది. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో పని చేసే ‘భరోసా’లో దాదాపు అంతా మహిళా ఉద్యోగులు, అధికారులే ఉంటారు. కేసు... కౌన్సెలింగ్... సహాయం... కుటుంబం, సమాజం, పని చేసే ప్రాంతాల్లో మానసిక, శారీకర, లైంగిక వేధింపులు, నేరాల బారినపడే అతివలు, నేరాల్లో బాధితులుగా మారే బాలికలు భరోసా కేంద్రాన్ని ఆశ్రయించవచ్చు. దీనికి వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునే సిబ్బంది అవసరమైన పోలీసుస్టేషన్, విభాగంలో కేసు నమోదు అయ్యేలా చూస్తారు. వైద్య, న్యాయ సహాయాలు అవసరమైన వారికి వాటిని అందిస్తారు. పునరావాసం, కౌన్సెలింగ్ ఇప్పించడంలో కీలకపాత్ర పోషిస్తారు. ఈ సహాయ, సహకారాలు అందుతున్న విధానాన్నీ పర్యవేక్షిస్తారు. వీడియో లింకేజ్ ద్వారా విచారణ... వివిధ రకాలైన నేరాల్లో బాధితులుగా ఉండి, ఈ కేంద్రం ద్వారా సహాయం పొందిన వారు సాక్ష్యం చెప్పడానికి న్యాయస్థానానికి వెళ్లాల్సిన అవసరమూ ఉండదు. న్యాయ సాధికారిక సంస్థతో ఒప్పందం ఉన్న నేపథ్యంలో ఈ కేంద్రంలో ఉండే ప్రత్యేక వీడియో లింకేజ్ రూమ్ నుంచి కోర్టుకు సాక్ష్యం ఇచ్చే సౌలభ్యం కల్పించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ విభాగం, పలు స్వచ్ఛంద సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తూ అవగాహన ఒప్పందాలు చేసుకున్న పోలీసు విభాగం అన్ని సేవల్నీ ఒకే గొడుగు కిందికి తెచ్చింది. కొత్వాల్ కల సాకారం ‘భరోసా లాంటి కేంద్రం ఉండాలనేది నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి కల. ఆయన కృషి ఫలితంగానే సాకారమవుతోంది. స్త్రీ-పురుషులు సమానమనే స్ఫూర్తిని పెంచే ఈ కేంద్రం ఏర్పాటు సుదీర్ఘ ప్రయాణంలో ఓ అడుగు మాత్రమే.’ - అంజనీకుమార్, అదనపు సీపీ (శాంతిభద్రతలు) సహాయంతో పాటు పర్యవేక్షణ ‘భరోసా సెంటర్‌ను ఆశ్రయించిన బాధితులకు తక్షణం సహాయ సహకారాలు అందిస్తాం. దీంతో పాటు వారు జీవితంలో పూర్తిగా స్థిరపడేలా, వారికి అన్ని దశల్లోనూ పూర్తిస్థాయి న్యాయం జరిగేలా పర్యవేక్షణ బాధ్యతల్నీ స్వీకరిస్తాం. షీ-టీమ్స్, చైల్డ్ లైన్ తదితరాలనూ దీని పరిధిలోకే తీసుకువస్తున్నాం.’ - స్వాతి లక్రా, అదనపు సీపీ (నేరాలు) రాష్ట్ర వ్యాప్తంగా అమలు యోచన ‘ఈ తరహా కేంద్రాన్ని ప్రభుత్వం పెలైట్ ప్రాజెక్టుగా నగరంలో ఏర్పాటు చేస్తోంది. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వారి విధి నిర్వహణనూ పర్యవేక్షిస్తూ విజయవంతం చేస్తాం. ఆపై రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది.’ - డాక్టర్ టి.ప్రభాకరరావు, జేసీపీ (క్రైమ్స్) సుదీర్ఘకాలం కొనసాగేలా ప్రభుత్వ అనుమతితో ఏర్పాటవుతున్న భరోసా కేంద్రం సుదీర్ఘకాలం కొనసాగేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కేంద్రం నుంచి నిర్భయ ఫండ్ ద్వారా, రాష్ట్రం నుంచి వివిధ పథకాల ద్వారా నిధులు సమకూర్చుకోవడంతో పాటు కార్పొరేట్ సంస్థల సీఎస్సార్ ఫండ్స్, స్వచ్ఛదంగా ముందుకు వచ్చే ఆస్పత్రులు, ఎన్జీఓలను భాగస్వాముల్ని చేశాం. బాధితులకు అన్ని రకాల సహాయసహకారాలు అందడంతో పాటు వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న ‘భరోసా’ త్వరలో ప్రారంభమవుతుంది.’ - ఎం.మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ -
దప్పికతోనే మహిళ పోలీసుల విధులు!
న్యూఢిల్లీ: మహిళా సాధికారిత సాధనలో భాగంగా పోలీసుశాఖలోనూ పెద్ద ఎత్తున మహిళలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో కనీస మౌలిక సౌకర్యాలు లేక మహిళా పోలీసులు అనుభవిస్తున్న కష్టాలను తాజాగా ఓ సర్వే వెలుగులోకి తెచ్చింది. విధులు నిర్వహించే ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో ఒకటికి వెళ్లకుండా ఉండేందుకు కనీసం నీళ్లు కూడా తాగకుండా మహిళా పోలీసులు కర్తవ్యపాలన చేస్తున్నారు. దీనికితోడు పురుషుల శరీర దారుఢ్య కొలతలతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, రక్షణ జాకెట్లు రూపొందిస్తుండటంతో అవి తాము ధరించినప్పుడు చాలా బిగుతూగా ఉండి.. ఊపిరి కూడా అందడం లేదని, చాలాబరువుగా కూడా ఉంటున్నాయని మహిళా పోలీసులు ఈ సర్వేలో వెల్లడించారు. గత ఏడాది జరిగిన పోలీసుశాఖలోని మహిళల 7వ జాతీయ సదస్సు సందర్బంగా ఈ సర్వే వివరాలు, సిఫారసులను అందజేశారు. పోలీసు రీసెర్చ్, అభివృద్ధి బ్యూరో, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే వివరాలు తాజాగా వెల్లడించారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాల గురించి చర్చించి.. వాటి పరిష్కారం కోసం సలహాలతో కూడిన ఈ సర్వే వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. కేంద్ర బలగాల్లో 33శాతం పోస్టులను, సరిహద్దు భద్రతా దళాల్లో 15 శాతం పోస్టులను మహిళలకు కేటాయించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పోలీసుశాఖలోని మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. -
చట్టంతో నేరాలకు చెక్‌పెట్టండి
♦ మహిళా పోలీసులకు ఎస్వీపీఎన్పీఏ డెరైక్టర్ అరుణ బహుగుణ పిలుపు ♦ ‘చట్టం అమలులో మహిళల పాత్ర’ సదస్సులో ఉపన్యాసం సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాదంతో పాటు వివిధ నేరాలను చట్టం అనే ఆయుధంతో అణచివేసేందుకు మహిళా పోలీసులు ముందడుగు వేయాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీ(ఎస్వీపీఎన్పీఏ) డెరైక్టర్ అరుణ బహుగుణ పిలుపునిచ్చారు. స్థానిక నేషనల్ పోలీసు అకాడమీలో దేశంలో తొలిసారిగా ఎస్వీపీఎన్పీఏ, ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ సంయుక్తంగా ‘చట్టం అమలులో మహిళల పాత్ర’ అనే అంతర్జాతీయ సదస్సును మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ సదస్సులో బహుగుణ మాట్లాడుతూ తొలితరం మహిళామణుల జీవితాలు స్ఫూర్తిగా తీసుకొని విధి నిర్వహణలో అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ‘సాంకేతిక అభివృద్ధితో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. నేరం, ఉగ్రవాదం ఖండ ఖండాతరాల్లో వేగంగా వ్యాపిస్తున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న నేరం-ఉగ్రవాద రూపంలో ఉన్నా, సాంకేతిక రూపంలో ఉన్నా చట్టం అనే ఆయుధంతో అణచివేసేందుకు మహిళ పోలీసులు ముందడుగు వేయాల’ని ఆమె అన్నారు. సీఎస్‌యూ ప్రొఫెసర్ ట్రెసీ గ్రీన్ మాట్లాడుతూ వ్యవస్థీకృత నేరాలు, సరిహద్దు భద్రత, ఉగ్రవాదం, తీవ్రవాదం వైపు మళ్లించడం లాంటి అంశాలను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ, ప్రాంతీయ నుంచి దేశీయస్థాయి దాకా పోలీసింగ్ నెట్‌వర్క్‌ను అనుసంధానం చేసుకోవడానికి ఈ సదస్సు ఓ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని అన్నారు. ఇదో మైలురాయి... ‘భారత్, ఆస్ట్రేలియా మధ్య విధానపరమైన అంశాల్లో ఇప్పటికే సఖ్యత ఉంది. పన్ను ఎగవేత, తీవ్రవాదం ఎదుర్కొనడం లాంటి అంశాలపై కలసి పనిచేస్తున్నాం. అయితే ఉమెన్ పోలీసింగ్, లింగ సమానత్వం వంటి సమస్యలపై కలిసి పనిచేసేందుకు ఈ సదస్సు మైలురాయిగా నిలవడం ఆనందంగా ఉంద’ని ఆస్ట్రేలియా హైకమిషన్ డిప్యూటీ ైెహ కమిషనర్ క్రిస్ ఎల్స్టొఫ్ట్ అన్నారు. అనంతరం క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన సస్కియా హుఫ్నగేల్.. ఓల్డ్ బాయ్స్ నెట్‌వర్క్‌పై ప్రజంటేషన్ ఇచ్చింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఈస్టోనియా, బెల్జియమ్ వంటి దేశాల్లో మినహా మిగతా అన్ని దేశాల్లో పోలీసు ఫోర్స్‌లో మహిళల పట్ల వివక్ష ఉంది. పోలీసు ఫోర్స్‌ల్లో మహిళల సంఖ్య పెంచితే సరిపోదు. ఉన్నత స్థానాలకు చేరే విధంగా వారిలో నమ్మకం కల్పించాలి. ఇంటర్‌పోల్‌లో 44 శాతం, ఇంటర్నేషనల్ పోలీసు ఆఫీసులో 44 శాతం మంది మహిళలు ఉన్నారు. అయితే వీరంతా తక్కువ స్థాయిల్లోనే పనిచేస్తున్నా’రని గణాంకాలతో సహా వివరించారు. ఆస్ట్రేలియాలోని వోలంలాంగ్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కతినా మిషెల్ ‘నేషనల్ సెక్యూరిటీ టెక్నాలజీ’ వల్ల కలిగే నష్టాలను ప్రజంటేషన్ రూపంలో ఇచ్చారు. ఈ సదస్సులో 120 మంది మహిళా పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
సూపర్ ఉమెన్ ఫోర్స
సందడిగా ‘శాంతి భద్రతల పరిరక్షణలో మహిళల పాత్ర’ సదస్సు {పత్యేక ఆకర్షణగా విదేశీ, భారత మహిళా పోలీసులు రానున్న రోజుల్లో అన్ని దేశాల పోలీస్ వ్యవస్థలో మహిళల సంఖ్య మరింత పెరగాలని పలువురు మహిళా పోలీస్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలోమంగళవారం ‘శాంతిభద్రతల పరిరక్షణలో మహిళల పాత్ర’పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఇందులో విదేశీయులతో పాటు భారతీయ మహిళా పోలీసు అధికారులు పాల్గొన్నారు. పోలీసింగ్, మహిళా పోలీసుల పాత్రపై చర్చించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పలువురు విదేశీ మహిళ అధికారులను పలుకరించగా వారు ఇలా స్పందించారు. - సాక్షి, సిటీబ్యూరో ఓర్పు ఉండేది మహిళల్లోనే.. బంగ్లాదేశ్ పోలీసు ఫోర్స్‌లో మహిళల ప్రాతినిథ్యం 20 శాతం కన్నా తక్కువే ఉంది. రానున్న రోజుల్లో వీరి సంఖ్య పెరుగుతుందని అనుకుంటున్నా. ఓర్పు, నేర్పుతో ఉండే మహిళల సంఖ్య పెరిగితే బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా ఇవ్వగలం. మహిళలు, పిల్లల బాధితులకు న్యాయం చేసేందుకు ‘విగ్ టీమ్ సపోర్ట్ సెంటర్’ ప్రత్యేకంగా పనిచేస్తోంది. పోలీసు రిఫామ్ ప్రాజెక్టు కింద కూడా మహిళలకు న్యాయం చేసేందుకు మా పోలీసులు పోరాడుతున్నారు. - షాహీనా అమీన్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, బంగ్లాదేశ్ చిల్డ్రన్-ఉమెన్ బ్యూరోతో సేవలు పిల్లలు, మహిళల కోసం మా దేశంలో ప్రత్యేకంగా ‘చిల్డ్రన్ అండ్ ఉమెన్ బ్యూరో’ పనిచేస్తోంది. మొత్తం 36 బృందాల సహాయంతో ఎప్పటికప్పుడు వారి భద్రతను పర్యవేక్షిస్తున్నాం. శ్రీలంక పోలీసు ఫోర్స్లోనూ మహిళల ప్రాతినిథ్యం అంతంత మాత్రమే. అయితే ఫిర్యాదుదారులు తమ బాధలను ఎక్కువగా మహిళ పోలీసులకే చెప్పేందుకు ఇష్టపడుతున్నారు. - సుమాకుమారి సిన్హా, ఏఎస్పీ, శ్రీలంక సైన్యంలోనూ మహిళలు.. మిలట్రీ ఫోర్స్‌లో ఇప్పుడిప్పుడే మహిళల సంఖ్య పెరుగుతోంది. 2011లో అఫ్ఘనిస్థాన్‌లో జరిగిన యుద్ధంలో మా సైనికులు పాల్గొన్నారు. ఇందులో మహిళల పాత్ర మరువలేనిది. ఇప్పటికే మిలట్రీ ఫోర్స్‌లో మహిళల ఇబ్బందులు, వారు పనిచేస్తున్న తీరుపై అధ్యయనం చేశా. మా దేశంలోనూ మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. - నటాలిక్ శాన్బి, మిలట్రీ భద్రతా అధికారిణి, ఆస్ట్రేలియా బాధితులకు అండగా.. మా ప్రాంతంలో పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ ఎక్కువగా జరుగుతుంటాయి. బాధితులు ఎక్కువగా విదేశీయులే ఉంటారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలతో పాటు విదేశీయులను టార్గెట్ చేస్తున్న దొంగలను పట్టుకునేందుకు మా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు విభాగం పనితీరుపై పూర్తి అధ్యయనం చేశా. కొంత మంది మహిళా పోలీసులు తాము ఎదుర్కొంటున్న బాధలు కూడా వివరించారు. - లియాన్ బ్లి, రీసెర్చ్ స్టూడెంట్, వియత్నాం -
చిన్నారిపై లైంగిక దాడి యత్నం కేసు విచారణ
ఏకపాదంపల్లి (తాడిమర్రి) : మండలంలోని ఏకపాదంపల్లి గ్రామంలో ఇటీవల ఆరేళ్ల చిన్నారిపై జరిగిన లైంగికదాడికి యత్నం కేసును శనివారం తహశీల్దార్ రామకృష్ణయ్య విచారణ చేశారు. అనంతపురం నగరంలోని మహిళా పోలీస్‌స్టేషన్ ఏఎస్ఐ సుభద్రమ్మ, స్థానిక ఏఎస్ఐ ప్రసాద్ బాధిత చిన్నారి, ఆమె తల్లిదండ్రులను తహశీల్దార్ ఎదుట హాజరు పరిచి కేసు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులను విచారించారు. ఘటన ఎలా జరిగింది? గ్రామంలో ప్రజలను విచారించారా? నిందితుణ్ణి అదపులోకి తీసుకున్నారా అని ఆయన పోలీసులను అడిగారు. నిష్పక్ష పాతంగా కేసు దర్యాప్తు చేసి నిజా, నిజాలను నిగ్గుతేల్చి దోషిని శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. స్పందించిన పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నామని, కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. తొలుత ఈ ఘటన పోలీసులు తహశీల్దార్‌కు చెప్పటడంతో ఆయన అవాక్కయ్యారు. ఈ నెల 20న ఘటన జరిగితే తనకు ఎవ్వరూ తెలపలేదని మండిపడ్డారు. గ్రామంలో జరిగిన ఘటనపై సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని వీఆర్వో రాజశేఖర్‌ను మందలించారు. -
ఆరుగురు పోలీస్త్రీలు
అతివలు వంటింటి గడప దాటి చాలా కాలమైనా.. ఇప్పటికీ కొన్ని రంగాల్లో వారి ప్రవేశం ప్రశ్నార్థకమే. కుసుమ కోమలంగా ఉంటే కొన్ని రకాల బాధ్యతలు నిర్వర్తించలేరన్న భావన స్త్రీ శక్తికి అడ్డుగా నిలుస్తోంది. ఈ అభిప్రాయం తప్పని నిరూపిస్తూ తెలంగాణ రాష్ట్ర ట్రాఫిక్ నియంత్రణ విభాగంలో తొలిసారిగా ఆరుగురు మహిళలు నియమితులయ్యారు. హైదరాబాద్ ట్రాఫికర్‌ను కంట్రోల్ చేయడంతో సత్తా చాటుతున్న వారు అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. - సమీర నేలపూడి మాదాపూర్.. సైబర్ టవర్స్ దగ్గరలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్... రెడ్‌లైట్ పడింది. పరుగులు తీస్తోన్న వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. కానీ ఒక బైక్ మాత్రం ఆగినట్టే ఆగి మళ్లీ దూసుకుపోబోయింది. కానీ మరుక్షణంలో ఆగిపోయింది. ఎందుకంటే ఆ బైక్‌కి అడ్డుగా ఓ అమ్మాయి వచ్చి నిలబడింది. ఖాకీ ప్యాంటు, తెల్లని చొక్కా, నెత్తిమీద నీలిరంగు టోపీ.. ట్రాఫిక్ పోలీస్. ఆమెను చూస్తూనే అక్కడివారంతా ఆశ్చర్యపోయారు. లేడీ ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్నారా అంటూ విస్మయం చెందారు. మాదాపూర్ పరిధిలోని ఆరు ప్రధాన కూడళ్ల దగ్గర ఆరుగురు మహిళా ట్రాఫిక్ పోలీసులు కొద్ది రోజులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే మొదటిసారి.. తెలంగాణ రాష్ట్రంలో మహిళా పోలీసులు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పటివరకూ ట్రాఫిక్ విభాగంలో ఒక్క మహిళా లేదు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ట్రాఫిక్ని నియంత్రించడం అంత తేలిక కాదు. ముఖ్యంగా సిటీలో అది మరింత కష్టం. దానికి తోడు రోజంతా నిలబడి ఉండాలి. రకరకాల మనస్తత్వాలున్న వాహనదారులను ఓ దారికి తేగలగాలి. ఇలాంటివి మగువలకు కష్టమనే ఉద్దేశంతో ట్రాఫిక్ విభాగంలో ఇన్నాళ్లూ మహిళలకు నో ఎంట్రీ ఉంది. అంతరిక్షంలో అడుగుపెట్టగల మహిళ.. ట్రాఫిక్‌ను నియంత్రించలేదా అని అనుకున్న సైబరాబాద్ కమిషనల్ సీవీ ఆనంద్ ట్రాఫిక్ విభాగంలో కొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టారు. శకుంతల, అశ్విని, లావణ్య, శ్రీవాణి, వెంకటమ్మ, వరలక్ష్మిలను ట్రాఫిక్ పోలీసులుగా నియమించారు. సవాళ్లను ఎదుర్కొంటూ... మండుటెండలో ఆరేడు గంటలపాటు నిలబడి.. వచ్చే పోయే వాహనాలను గమనిస్తూ... సిగ్నల్స్ ఉల్లంఘనులను అడ్డుకుంటూ.. ఫొటోలు తీస్తూ... చలానాలు రాస్తూ.. పురుషులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ... పై అధికారులతో శభాష్ అనిపించుకుంటున్నారు ఈ ఆరుగురు ఇంతులు. అయితే వారు ఈ స్థాయికి చేరుకోవడానికి కొన్ని నెలలు శ్రమించారు. రోడ్డు మధ్యన నిలబడటం.. వింత చూపులను తట్టుకోవడం.. మొదట్లో మనస్తాపాన్ని కలిగించినా.. వాటిని అధిగమించాం అంటారు వీరు. ‘మేం పురుషులకు తీసిపోమని నమ్మి అధికారులు మమ్మల్ని తీసుకున్నప్పుడు, ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి కదా’ అన్నారు ఆరుగురిలో ఒకరైన శకుంతల. ఇబ్బందులు అన్ని చోట్లా ఉంటాయి కదా! చేయలేం అనుకుంటే.. ఏమీ సాధించలేం’ అన్నారు శ్రీవాణి. ఈ ఇద్దరే కాదు. ఆరుగురిలోనూ ఒకటే పట్టుదల. ఒకటే ధైర్యం. అవే వాళ్లను సవాళ్లతో నిండిన ఈ ఉద్యోగాన్ని సమర్థంగా చేసేందుకు తోడ్పడుతున్నాయి. పాజిటివ్ రిజల్ట్స్.. సిటీలో ట్రాఫిక్ ఉల్లం‘ఘనులు’ తక్కువేం కాదు. అయితే ఓ మహిళా పోలీస్ ఆపేసరికి అటువంటి వారంతా దారిలోకి వచ్చేస్తున్నారు. ఇలాంటి కొన్ని పాజిటివ్ పరిణామాలు కనిపించడం, మహిళా పోలీసుల సామర్థ్యం కూడా నిరూపణ అవడంతో... త్వరలో మరికొంతమంది మహిళల్ని ట్రాఫిక్ పోలీసులుగా నియమించాలనుకుంటున్నారు అధికారులు. అదే జరిగితే.. త్వరలో తెలంగాణ రాష్ట్రమంతటా మహిళా ట్రాఫిక్ పోలీసులు కనిపించడం ఖాయం. ఎందులోనూ తీసిపోరు... ‘మా కమిషనర్‌గారి నమ్మకం నిలబడింది. ఆరుగురు అమ్మాయిలూ పురుషులకు తీసిపోకుండా పని చేస్తున్నారు. మేం కూడా వారికి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం. వాష్‌రూమ్స్ అందుబాటులో ఉండే కూడళ్ల వద్దే డ్యూటీ వేస్తున్నాం. అలాగే ఇద్దరిద్దరు డ్యూటీ చేయాల్సిన చోట ఒక మేల్ కానిస్టేబుల్‌తో పాటు వీరికి డ్యూటీ వేస్తున్నాం. దానివల్ల వారికి కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది కదా’ అన్నారు మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ టి.నర్సింగరావ్. మొదట్లో డ్యూటీ కష్టమనిపించినా ఇప్పుడు అలవాటైపోయింది అంటున్నారు లేడీ ట్రాఫిక్ కానిస్టేబుల్ వరలక్ష్మి. ‘రాష్ట్రంలో మొదటిసారి తీసుకున్న మహిళా ట్రాఫిక్ పోలీసుల్లో నేనూ ఒకదాన్ని కావడం సంతోషంగా ఉంది. వాహన చోదకులు కూడా మమ్మల్ని గౌరవిస్తున్నారు’ అని చెప్పారామె. -
రైళ్లలో మహిళా పటాలం
న్యూఢిల్లీ: రైళ్లలో మహిళా ప్రయాణికుల రక్షణ కోసం త్వరలో మహిళా పోలీసులు రంగంలోకి దిగనున్నారు. రైల్వే రక్షక దళం మహిళా బెటాలియన్(పటాలం)ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. వేధింపులపై మహిళా ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు ఓ అప్లికేషన్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రయాణికుల కార్యకలాపాలను గమనించేందుకు రైళ్లలో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. మరోవైపు, రైళ్లలో ప్రయాణికులకు కనీస వసతులు కూడా లేవని ఆ శాఖ అంగీకరించింది. దూర ప్రాంత రైళ్లు కొన్నింటిలో నాణ్యతలేమి ఆహారం సరఫరాపై ఫిర్యాదులు వచ్చినట్లు ఆ శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అపరిశుభ్ర పరిస్థితులు, బొద్దింకలు, లైట్లు వెలగకపోవడం, ఆహారం తదితర వసతులకు సంబంధించి 2012 ఏప్రిల్ నుంచి 2014 అక్టోబర్ మధ్య 5,670 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. పార్లమెంటు సమాచారం కుప్లంగా.. - ఉద్యోగుల భవిష్యనిధి లావాదేవీల్లో ఆధార్ నెంబర్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేయలేదని కార్మిక మంత్రి దత్తాత్రేయ బదులిచ్చారు. ళీఉపాధీ హామీ కూలీలకు నిధుల చెల్లింపుల్లో పోస్టాఫీసుల్లో దళారుల పాత్ర తమ దృష్టికి వచ్చిందదని, దీని నివారించేందుకు ఏపీ, తెలంగాణ, జార్ఖండ్‌లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రతిపాదించామని కేంద్రం పేర్కొంది. - దేశంలో 24 శాతం గృహాలు సురక్షితం కాని మంచినీటితో కాలం వెళ్లదీస్తున్నాయని కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ తెలిపారు. -
పాపం పోలీసులని తెలియక..
మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుళ్లపై దాడికి దొంగల యత్నం సాక్షి, ముంబై: అహమ్మదాబాద్ నేషనల్ హైవే సమీపంలో ఉన్న కాసా ప్రాంతం సమీపంలో మఫ్టీలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళా పోలీసులపై దోపిడీ దొంగలు దాడి చేశారు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి....కాసా ప్రాంతంలో అధికంగా దారిదోపిడీలు జరుగుతుండటంతో దొంగలను పట్టుకోవడానికి కాసా ప్రాంత పోలీసులు పథకం పన్నారు. ఈ మేరకు మఫ్టీలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు అద్దె వాహనం తీసుకుని సాధారణ ప్రయాణికులుగా ఆ ప్రాంతంలో ప్రయాణించారు. అనంతరం దారిలో వాహనం రిపేర్ వచ్చినట్లు ఆపి దొంగల కోసం ఎదురుచూడసాగారు. వారు ఊహించినట్లుగానే కొంతసేపటికి ఐదుగురు వ్యక్తులు వచ్చి వారిని ప్రశ్నించారు. వాహనంలో డ్రైవర్‌తోపాటు ముగ్గురూ మహిళలే ఉండటంతో బెదిరించి దోపిడీ చేసేందుకు యత్నించారు. అంతవరకు సాధారణ మహిళలుగా నటించింది కానిస్టేబుళ్లుగా గుర్తించిన దొంగలు ఒక్కసారిగా ఖంగుతిని పారిపోయేందుకు యత్నించారు. తమను పట్టుకోవడానికి ప్రయత్నించిన వారిపై కారం పొడి చల్లారు. అయితే దొంగల్లో ఇద్దరిని పోలీసులు పట్టుకోగలిగారు. మిగిలిన ముగ్గురూ సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయారని, త్వరలోనే వారినీ పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
పెరుగుతున్న అత్యాచారాలు
నిజామాబాద్ క్రైం : జిల్లాలో తరుచూ ఏదోఒక ప్రాంతంలో మహిళలు అఘాయిత్యానికి లోనవుతున్నారు. పెండ్లి చేసుకుని అత్తరింట్లో కాలు పెట్టిన మరుక్షణం నుంచే వరకట్నం వేధింపులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఎక్కువగా ఇలాంటి కేసులే నమోదవుతున్నాయి. గత పది నెలల్లోనే 528 వరకట్నం వేధింపు కేసులు నమోదు అయ్యాయి. ఇందులో వరకట్నం వేధింపులతో హత్యలు ఏడు ఉండగా, వరకట్నం వేధింపులకు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు 24 మంది ఉన్నారు. ఇక జిల్లాలో మహిళలపై అత్యచారం కేసులు 37 నమోదు కాగా, ఇందులో 16 మంది మైనార్ బాలికలే! మరో 25 మంది మహిళలు వివిధ ఘటనలలో బలలయ్యారు. కాగా గృహ హింస కేసులు ఈ సంవత్సరం ఒక్కటి కూడా న మోదు కాకపోవటం గమనార్హం. మహిళా పోలీసులు కరువు జిల్లా జనాభాలో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. 12 లక్షల 99 వేల 882 మంది మహిళలు ఉండగా కేవలం 66 మంది సివిల్ మహిళా పోలీసులు, మహిళా హోంగార్డులు 68 మంది ఉన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు కనీసం అయిదుగురు మహిళా పోలీసు సిబ్బంది ఉండాలి. కాగా జిల్లాలోని 45 పోలీస్ స్టేషన్లకు 90 మంది మహిళా కానిస్టేబుళ్లే పోస్టులే ఉన్నాయి. అయితే ప్రస్తుతం 66 మంది మహిళా కానిస్టేబుళ్లు మాత్రమే పనిచేస్తున్నారు. అలాగే 68 మంది మహిళా హోంగార్డులు పని చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఒకే ఒక్క మహిళా పోలీస్‌స్టేషన్ ఉంది. కాని ఇక్కడ మహిళా పోలీసు అధికారి లేకుండా పోయారు. దాంతో మహిళలు ఈ స్టేషన్‌కు రావాలంటే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ ప్రతివారం నిర్వహిస్తున్నప్పటికీ కుటుంబ తగాదాలతో వస్తున్న కొన్ని కేసులు పరిష్కారం అవుతుండగా, మరికొన్ని పెండింగ్ లో ఉంటున్నాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల లో అన్యాయాలకు గురైన మహిళలు న్యాయం కోసం ఆయా పోలీస్స్టేషన్లకు వెళ్తే సరైన ఆదరణ లేకుండా పోతోందని వాపోతున్నారు. ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళలు కనీసం నాలుగైదుసార్లు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తోందంటున్నారు. జిల్లాలో మహిళా జనాభాకు అనుగుణంగా మహిళ పోలీస్ సిబ్బంది లేక పోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ సబ్ డివిజన్ల పరిధిలోనే మహిళా కౌన్సెలింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి. కౌన్సెలింగ్ కేంద్రాలలో బాధిత మహిళల సమస్యలు వినడానికి మహిళా ఎస్సైతో పాటు, మహిళ న్యాయవాది, మహిళా వైద్యురాలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిలు ఉంటారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా రిసిప్షనిస్టును నియమించవలసి ఉండగా, సిబ్బంది కొరతతో అది సాధ్యపడటంలేదు. జిల్లాలో మొత్తం 45 పోలీస్స్టేషన్లకు గాను 18 పోలీస్స్టేషన్లలో మహిళా రిసిప్షనిస్టులు ఒక్కరు కూడా కనిపించారు. దాంతో మహిళలు ప్రతి శనివారం నిర్వహించే ఫ్యామిలీ కౌన్సిలింగ్‌పైనే ఆధారపడుతున్నారు. మచ్చుకు కొన్ని కేసులు.. ఎల్లారెడ్డిలోని బీడి కాలనీకి చెందిన నాగమణిని ఆమె భర్త రాజలింగం, అత్త సాయవ్వ కొంత కాలంగా అదనపు కట్నం కోసం వేధించటంతో ఈనెల 3న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కామారెడ్డి మండలం సరంపల్లి గ్రామానికి చెందిన యశోద, పరిచయస్తుడైన ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌కు అప్పుగా రూ. 50 వేలు ఇచ్చింది. తిరిగి ఈ డబ్బులను ఇవ్వాలని కోరడంతో అక్టోబరు 14న మద్యం తాగించి చీర కొంగుతో ఉరే సి చంపాడు. బీర్కుర్ మండలం దుర్కి గ్రామానికి చెందిన మేతిరి బశెట్టి తన భార్య సవితతో నిత్యం గొడవ పడేవాడు. ఈ గొడవలకు నువ్వే కారణమంటూ తల్లి పోశవ్వను బండరాయితో మోది చంపాడు. -
మహిళల కోసం పోలీసు కంట్రోల్ రూం
రాజధానిలోని అన్ని జోన్లు, ప్రతి జిల్లాలో పోలీస్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ప్రభుత్వానికి ప్రతిపాదించనున్న రాష్ట్ర మహిళా భద్రతా కమిటీ గుజరాత్, ముంబైలలో పర్యటించి వచ్చిన కమిటీ నేడు డీజీపీతో సమావేశం హైదరాబాద్: ఆపదలో ఉన్న మహిళలకు వెంటనే రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా మహిళా పోలీస్ కంట్రోల్‌రూంను ఏర్పాటు చేయాలని మహిళా భద్రతా కమిటీ రాష్ర్ట ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది.అలాగే రాజధానిలోని అన్ని జోన్లతోపాటు, ప్రతి జిల్లాలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని కూడా సూచించనుంది. రాష్ర్టంలో మహిళలు, యువతులు, బాలికల భద్రత కోసం ప్రభుత్వం తీసుకువచ్చే చట్టాల కోసం తగిన సిఫారసులు చేయడానికి ఏర్పాటైన మహిళా భద్రతా కమిటీ సభ్యులు రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ సౌమ్యామిశ్రా, సీఐడీ ఐజీ చారుసిన్హా, హైదరాబాద్ నగర అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్) స్వాతి లక్రా రెండురోజుల పాటు గుజరాత్, ముంబైలలో పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని వన్‌స్టాప్ క్రైం సిస్టంతోపాటు, మహిళలు ఆన్లైన్లో కంప్లయింట్ చేసే విధానాన్ని బృందం పరిశీలించింది. పోలీసు డయల్ 100 మాదిరిగా ఆపదలో ఉన్న మహిళల కోసం డయల్ 181 విధానాన్ని పరిశీలించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం, అందులో మహిళలే పనిచేయడం, వచ్చిన కాల్లపై స్పందిస్తున్న తీరును పరిశీలించిన వారు ఆ విధానాన్ని రాష్ర్టంలోనూ అమలు చేయాలని ప్రతిపాదించనున్నారు. అలాగే, ముంబైలో ప్రతిజోన్‌లో ఒక ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు ద్వారా మహిళలకు అందుతున్న తక్షణ రక్షణను పరిశీలించారు. వీటిని మహారాష్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని అక్కడి అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. గుజరాత్, ముంబైలలో మహిళల భద్రతకు పనిచేస్తున్న వ్యవస్థలు, విధివిధానాలకు సంబంధించిన పుస్తకాలను పరిశీలించిన కమిటీ ముఖ్యమైన అంశాలతో ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది. అందులో భాగంగానే పోలీస్ కంట్రోల్ రూం, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ల ఏర్పాటు, మహిళా సిబ్బంది నియామకంపై సూచనలు చేస్తుంది. వీటికి తుదిరూపు ఇవ్వడానికి ఆదివారం డీజీపీ అనురాగ్‌శర్మ, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సునీల్ శర్మలతో మహిళా భద్రతా కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. -
మహిళా పోలీసుల సంఖ్య పెంచుతాం
మహిళా ఠాణా ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ సాక్షి, సిటీబ్యూరో: పోలీసు శాఖలో మహిళా సిబ్బంది సంఖ్యను పెంచుతామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, సైబరాబాద్ సీపీ ఆనంద్ తో కలిసి ఆయన గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్‌లో ఏర్పాటు చేసిన మహిళా పోలీసుస్టేషన్‌తో పాటు గచ్చిబౌలిలోని శాంతి భద్రతల స్టేషన్‌ను బుధవారం ప్రారంభించారు. అనంతరం కమిషనర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని, ఇందులో భాగంగా పోలీసులకు వాహనాల కొనుగోలు కోసం రూ.300 కోట్లు విడుదల చేసిందన్నారు. మహిళల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల అధ్యయనం కోసం ప్రభుత్వం నియమించిన మహిళా భద్రత కమిటీ త్వరలో సింగపూర్ వెళ్లి అక్కడి చట్టాలను అధ్యయనం చేస్తుందన్నారు. ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల భద్రతకు సైబరాబాద్ పోలీసులు తీసుకున్న చర్యలను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే కార్డన్ సర్చ్ వల్ల మంచి ఫలితాలొచ్చాయన్నారు. డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ, పోలీసు శాఖలో 33 శాతం మహిళా సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సేఫ్‌సిటీ ప్రాజెక్ట్‌ను గ్రామ స్థాయికి తీసుకెళ్తామన్నారు. రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఐటీ ఉద్యోగుల సౌకర్యార్థంలో ఐటీ కారిడార్‌లో అదనంగా మరో 15 ఆర్టీసీ బస్సులను త్వరలో ప్రవేశపెడతామన్నారు. మహిళలు తమ కష్టాలను పోలీసులకు తెలపడంతో పాటు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫేస్బుక్ పేజీని, మహిళా స్టేషన్‌కు కేటాయించిన ఇన్నోవా వాహనాన్ని మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. మహిళల రక్షణ కోసం టెక్ మహింద్రా సంస్థ రూపొందించిన ఫైట్‌బ్యాక్ (ఎఫ్బీ) యాప్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ యాప్‌ను మహిళలందరూ డౌన్లోడ్ చేసుకోవాలని, ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగిస్తే సెలెక్ట్ చేసిన ఐదుగురి సెల్ఫోన్లకు ఎక్కడ ఆపదలో చిక్కుకున్నది తదితర వివరాలతో మెసేజ్ వెళ్తుందన్నారు. తద్వారా త్వరగా రక్షణ చర్యలు చేపట్టడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ ఐటీ ఉద్యోగుల భద్రతకై తీసుకున్న చర్యలను వివరించారు. మహిళా ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో జాయింట్ పోలీసు కమిషనర్ గంగాధర్, డీజీపీలు అవినాష్ మహంతి, క్రాంతిరాణా టాటా, అదనపు డీసీపీ జానకీ షర్మిల, ఎం.శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ఎ.గాంధీ, జూపల్లి కృష్ణారావు, ఏనుగు రవీందర్‌రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ , ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకు ముందు మహిళా ఠాణా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ కారిడార్‌లో మహిళల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన ఇన్స్పెక్టర్ మధులత, శ్యామలక్ష్మిలకు మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డిలు జ్ఞాపికను బహూకరించారు. -
మగువలకేదీ భద్రత
జిల్లాలో మహిళలకు రక్షణ కరువు? పెరిగిపోతున్న వరకట్న హత్యలు, అత్యాచారాలు, ఈవ్‌టీజింగ్ 21.47 లక్షల మహిళా జనాభాకు 210 మంది మహిళా పోలీసులే గతి మహిళా రిసెప్షనిస్టులు లేక ఫిర్యాదుకు బాధితుల వెనుకడుగు గత ఏడాది కేసులు.. 451 జిల్లాలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఒకపక్క లైంగిక దాడులు, వరకట్న వేధింపులు, అత్యాచారాలు, సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అయినా వీటిని నియంత్రించే చర్యలు కానరావడం లేదు. 21.47 లక్షల మగువల జనాభా ఉండగా, కేవలం 210 మంది మాత్రమే పనిచే స్తుం డడం విశేషం. జనాభాకు అనుగుణంగా మహిళా పోలీసుల సంఖ్య పెరగడం లేదు. దీంతో మహిళల కష్టాలను పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. స్టేషన్‌కు వెళ్లి బాధలు చెప్పుకోవాలన్నా మహిళా సిబ్బందే కరువవుతున్నారు. సాక్షి,విశాఖపట్నం : జిల్లాలో జనాభా 42.88 లక్షలుకాగా అందులో మహిళల జనాభా 21.47 లక్షలు. వీరి సంఖ్యకు తగ్గట్టుగా మహిళా పోలీసులు లేకపోవడంతో మగువలపై దాడులు పెరిగిపోతున్నాయి. మహిళల జనాభాకు తగ్గట్టుగా కనీసం 550 మందికిపైగా మహిళా పోలీసులు అవసరం. ప్రసుత్తం 210 మంది మాత్రమే పనిచేస్తుండడం మహిళల భద్రతపై ప్రభుత్వానికికున్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఉన్న సిబ్బందిలో హోంగార్డులు,కానిస్టేబుళ్లు 195వరకు ఉండగా, ఇద్దరు ఎస్ఐలు, ముగ్గురు ఏఎస్ఐలు మాత్రమే ఉన్నారు. దీంతో ఉన్న జనాభాకు వీరే మాత్రం సరిపోని పరిస్థితి. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుత జనాభా, పోలీసుల నిష్పత్తి చూస్తే 10,223 మంది మహిళలకు ఒకే ఒక మహిళా పోలీసు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేకంగా పోలీసుస్టేషన్లు ఉండాలనే నిబంధన ఉంది. ప్రస్తుత జనాభాకు తగ్గట్టుగా కనీసం అయిదు స్టేషన్ల వరకు ఉండాలి. కాని అనకాపల్లిలో మాత్రమే ఏకైక మహిళా స్టేషన్ ఉంది. మహిళలు తమ బాధలు చెప్పుకోవాలన్నా ముందుకురాలేని దుస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 43 స్టేషన్లున్నాయి. ప్రతిస్టేషన్లో మహిళల ఫిర్యాదులు స్వీకరించడానికి మహిళా రిసెప్షనిస్ట్ ఉండాలి. కాని ఇది పెద్దగా అమల్లో లేదు. దాడులు,నేరాలకు సంబంధించిన దర్యాప్తు గగనమైపోతోంది. ఒకవేళ ముందుకువచ్చి ఫిర్యాదుచేసినా మహిళా సిబ్బంది లేకపోతో మగపోలీసులు ఆకేసులను నీరుగార్చేస్తున్నారు. దీంతో వారికి న్యాయం జరగడం లేదు. ఆందోళనల సమయాల్లో మహిళలను మహిళా పోలీసు సిబ్బంది అదుపుచేయాలి. మగ పోలీసులే ఇవన్నీ చేస్తుండడంతో మహిళలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం పనిచేస్తోన్న మగ పోలీసుల్లో 10శాతం కూడా మహిళా పోలీసులు లేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.గతేడాది జిల్లాలో వరకట్న హత్యలు 4, వరకట్న చావులు 6,వేధింపులతో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు 13,మహిళల హత్యలు 14, వేధింపుల కేసులు 99,అత్యాచారాలు 9 ఈవిధంగా పలు సెక్షన్ల కింద వివిధ విభాగాల్లో 451 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మహిళల జనాభా - 21.47 అవసరమైన మహిళా పోలీసులు- 550 ప్రస్తుతం ఉన్న వారు- 210 రిసెప్షన్లు లేని స్టేషన్లు- 43 అనకాపల్లిలోనే ఒకే ఒక్క స్టేషన్ -
12.66 లక్షల జనాభాకు 155 మంది మహిళా పోలీసులు
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఏటా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నేరాలను అరికట్టడంలో పోలీసు శాఖ విఫలం అవుతోంది. ప్రధానంగా స్త్రీల సంఖ్యకు అనుగుణంగా మహిళా పోలీసు సిబ్బంది లేకపోవడమే ప్రధాన కారణం. ప్రతీ ఠాణాలో కచ్చితంగా ఒక మహిళా సిబ్బంది ఉండాలి. జిల్లాలోని చాలా ఠాణాల్లో మహిళా పోలీసులు లేకపోవడంతో బాధితులు స్టేషన్‌కు రాలేకపోతున్నారు. వారి సమస్యలను పోలీసులకు వివరించ లేకపోతున్నారు. తెలంగాణ సర్కారు ఆగస్టు 19 నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారం జిల్లాలో పురుషులు 12,51,672 మంది ఉండగా, మహిళలు 12,66,498 మంది ఉన్నారు. పురుషుల కంటే స్త్రీలే అధికంగా ఉన్నారు. అయినప్పటికీ మహిళా జనాభాకు అనుగుణంగా ఠాణాలు, మహిళా సిబ్బంది లేరు. జిల్లా వ్యాప్తంగా 72 పోలీసుస్టేషన్లు ఉంటే కేవలం ఆదిలాబాద్, శ్రీరాంపూర్‌లో మాత్రమే మహిళా ఠాణాలు ఉన్నాయి. మిగతా 70 పోలీసుస్టేషన్లలో 45 ఠాణాల్లో మహిళా సిబ్బంది ఉండగా, 25 ఠాణాల్లో లేరు. 12.66 లక్షల మహిళా జనాభాకు కేవలం 155 మంది మహిళా పోలీసులు అందుబాటులో ఉన్నారు. ఈ లెక్కన చూస్తే సుమారు 8 వేల మంది మహిళా జనాభాకు ఒక్క పోలీసు ఉన్నాడన్నమాట. మహిళా పోలీసుల కొరత జిల్లాలో మహిళా పోలీసుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రతీ పోలీసుస్టేషన్లో బాధిత మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక మహిళా రిసెప్షనిస్టు ఉండాలి. జిల్లా వ్యాప్తంగా 19 మంది సీఐల పరిధిలో కౌన్సిలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల కౌన్సెలింగ్ సమయంలో బాధిత మహిళల సమస్యలు వినడానికి మహిళా కానిస్టేబుల్ ఉండాలి. అదేవిధంగా ఏడు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో ప్రతీ సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం ఉంటుంది. అయితే జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో మినహా ఎక్కడా మహిళా పోలీసు సిబ్బంది లేరు. దీంతో మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. కొందరు బాధిత మహిళలు తమ సమస్యలు, బాధను, వేదనను పురుషులకు చెప్పడానికి ముందుకు రావడం లేదు. మహిళా సిబ్బంది ఉంటేనే తమ బాధను, సమస్యను వివరంగా చెప్పగలుగుతారు. వారికి న్యాయం జరుగుతుంది. ఎంపిక కాలేకపోతున్న మహిళా అభ్యర్థులు జిల్లాలో 1993 సంవత్సరంలో మహిళా పోలీసు వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 155 మంది సిబ్బంది ఉండగా మరో 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2012 సంవత్సరంలో మహిళా పోలీసుల నియామకం జరిగింది. 80 పోస్టులకు ఎంపిక నిర్వహించగా కేవలం 46 మంది మహిళా అభ్యర్థులు మాత్రమే ఎంపికయ్యారు. మిగతా పోస్టులకు అర్హత సాధించకపోవడంతో అవి ఖాళీగా మిగిలాయి. అభ్యర్థులు ఎంపిక కాకపోవడానికి కారణం చాలా మంది మహిళలు తక్కువ బరువు ఉండడం, శారీరక ఆరోగ్యం లేకపోవడమే. అసలే మహిళలు పోలీసు ఉద్యోగం చేయాలంటే భయపడుతారు. కొందరు ముందుకు వచ్చినా ఆరోగ్యరిత్యా ఎంపిక కాలేకపోతున్నారు. ఒక పక్క ప్రభుత్వమే అరకొర పోస్టులు మంజూరు చేస్తుందంటే.. అందులో మంజూరైన పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు. దీంతో జిల్లాలో మహిళా పోలీసు వ్యవస్థ పటిష్టం కావడం లేదు. ఫలితంగా పోలీసుస్టేషన్లలో మహిళల ఫిర్యాదుల సంఖ్య తగ్గుతోంది. పెరుగుతున్న పనిభారం జిల్లాలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపైనే పనిభారం పడుతోంది. అత్యవసర సమయంలో ఒక్క రోజు కూడా సెలవు దొరకని పరిస్థితి. ఏ సమయంలో ఫోన్ వచ్చినా పరుగెత్తాలి. విధులు నిర్వహించే ప్రాంతంలో వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మహిళలకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. మహిళా సంఘాలు ధర్నాలు, ఆందోళనలు చేసిన సమయంలో వారిని కట్టడి చేసేందుకు నానాతంటాలు పడాల్సి వస్తోంది. పోలీసు స్టేషన్లలో కేసుల విషయంలో పనిభారం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైన ప్రభుత్వం చొరవ చూపి మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని మహిళా పోలీసు స్టేషన్లు, పోలీసుల సంఖ్య పెంచాలని ప్రజలు, బాధిత మహిళలు కోరుతున్నారు. -
సిబ్బంది పెంపుతోనే సమస్యల పరిష్కారం
అధ్యయన కమిటీతో మహిళా పోలీసు అధికారులు బంజారాహిల్స్: నగరంలోని చాలా పోలీసుస్టేష న్లలో మహిళా పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఉన్న ఈ కొద్దిపాటి సిబ్బందిని కూడా బందోబస్తులకు, ధ ర్నాలు, ర్యాలీలను అడ్డుకొనేందుకు విని యోగిస్తున్నారు. ఠాణాలో మహిళా పోలీ సులు అందుబాటులో లేకపోవడంతో ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు వచ్చే బా ధిత మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇబ్బ డి ముబ్బడిగా వస్తున్న ఫిర్యాదులను పరి ష్కరించేందుకు అవసరమైన సిబ్బంది లేక అధికారులు అవస్థలు పడుతున్నా రు. మహిళా పోలీసుస్టేషన్ల సంఖ్యతో పాటు సిబ్బంది సంఖ్యను పెంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని మహిళా పోలీసు అధికారులు కోరుతున్నారు. మహిళల భద్రతపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్య యన కమిటీ సమావేశం జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సోమవారం జరిగింది. సీని యర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య తదితరుల ఆధ్వర్యం లో జరిగిన ఈ సమావేశంలో జంట క మిషనరేట్ల పోలీసు అధికారులు అధ్య యన కమిటీకి ఇవే సూచనలు చేశారు. వసతులు లేక సతమతం... నగరంలోని చాలా ఠాణాల్లో సరైన టా యిలెట్ సౌకర్యాలు లేవు. దీంతో ఫిర్యా దు చేసేందుకు వచ్చే మహిళలతో పాటు మహిళా పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని స్టేషన్లలో ఉమెన్స్ హెల్ప్ డెస్క్‌లు ఉన్నా... సరైన సౌకర్యాలు లేవు. మహిళా ఫిర్యాదుదారులు అందరినీ దాటుకొని అక్కడికి రావాల్సి వస్తోంది. విచారణకు కూడా ప్రత్యేక వసతి సదుపాయాలులేవు. అధ్యయన కమిటీ.. పో లీసు అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. ఠాణాల సంఖ్య పెంచాలి... నగరంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను నివారించేందుకు మహిళా పోలీస్స్టేషన్ల సంఖ్యను పెంచడంతోపాటు, సిబ్బంది సంఖ్యను పెంచాలి. అంతేకాకుండా ప్రజాఅవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహించాలి. ఇక ఫిర్యాదులకు అనుగుణంగా మహిళా సిబ్బంది సంఖ్య ఉండటం లేదు. దీనిపై ఖచ్చితంగా దృష్టిసారించాలి. - రజిత, సౌత్‌జోన్ ఉమెన్ పోలీస్‌స్టేషన్ వైద్య పరీక్షల్లో జాప్యం తగ్గించాలి... మహిళా బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లే సమయంలో వివిధ పరీక్షలకు సమయం విపరీతంగా ఖర్చవుతోంది. దీనివల్ల అటు బాధితులు, ఇటు శాఖాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ జాప్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా బాధితుల విషయంలో అన్ని వైద్యసేవలు ఒకేసారి పూర్తయ్యేలా చొవర చూపాలి. - మాధవీలత, సరూర్‌నగర్ ఉమెన్ పోలీస్‌స్టేషన్ వెంటనే స్పందిస్తున్నాం... చిన్న చిన్న ఫిర్యాదులకు వెంటనే స్పందిస్తున్నాం. నిర్భయ ఘటన తర్వాత మహిళా సమస్యలపై మాదాపూర్‌లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఉమెన్ హెల్ప్‌లైన్‌లో పని చేస్తున్న నేను నిత్యం 20కిపైగా ఫిర్యాదులు అందుకుంటున్నాను. మిస్డ్కాల్స్, బ్లాంక్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు ఇలా అపరచిత వ్యక్తుల నుంచి వచ్చే కేసులు ఎక్కువగా మా దృష్టికి వస్తున్నాయి. వీటన్నింటిని సానుకూలంగా విని పరిష్కారిస్తున్నాం. నిందితులను అరెస్ట్ చేస్తున్నాం. - మధులత, పోలీసు అధికారి, సైబరాబాద్ కమిషనరేట్ బాధితులు ధైర్యంగా ఠాణాకు వచ్చేలా చేయాలి... మహిళా బాధితులు ధైర్యంగా వచ్చి పోలీస్‌స్టేషన్‌లో చెప్పుకొనే పరిస్థితులను పెంపొందించాలి. వారి సమస్యను సానుకూలంగా విని పరిష్కరించడంలో వేగం చూపాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలి. నేరస్థులకు శిక్ష పడటంలో చొరవ చూపితే బాధిత మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి వస్తారు. - వెంకటలక్ష్మి, సీసీఎస్, ఉమెన్స్ పోలీస్‌స్టేషన్ -
మృగాళ్లపై గూండా చట్టం
హోం మంత్రి కె.జె.జార్జ్ చట్టానికి సవరణలు జిల్లాకొక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు జార్జ్ రాజీనామాకు శెట్టర్ పట్టు అత్యాచార ఘటనలతో రాజకీయ లబ్ధి వద్దు : కుమార సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు గూండా చట్టాన్ని ప్రయోగించనున్నట్లు హోం మంత్రి కేజే. జార్జ్ తెలిపారు. ప్రస్తుత గూండా చట్టం ప్రకారం అత్యాచారాలకు పాల్పడే వారిని శిక్షించే అవకాశం లేదని, కనుక ఈ చట్టానికి సవరణను తీసుకొస్తామని వెల్లడించారు. అత్యాచార ఘటనలకు సంబంధించి శాసన సభలో సోమవారం జరిగిన స్వల్ప వ్యవధి చర్చకు ఆయన సమాధానమిచ్చారు. అంతకు ముందు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోక్యం చేసుకుంటూ, అత్యాచారాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా అత్యాచారాలకు పాల్పడిన వారిపై గూండా చట్టం కింద కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. మహిళా పోలీసు స్టేషన్లు మహిళలపై లైంగిక దాడులు, దౌర్జన్యాలను అరికట్టడానికి ప్రతి జిల్లాలో మహిళా పోలీసు స్టేషన్లను ప్రారంభిస్తామని హోం మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే పది మహిళా పోలీసు స్టేషన్లు ఉన్నాయని, ఈ ఏడాది కొత్తగా పది పోలీసు స్టేషన్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది మరో పది స్టేషన్లను ప్రారంభిస్తామన్నారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక మహిళా పోలీసు స్టేషన్ ఉంటుందని ఆయన తెలిపారు. రాజీనామాకు పట్టు రాష్ట్రంలో వరుస లైంగిక దాడులను అరికట్టడంలో విఫలమైన హోం మంత్రి కేజే. జార్జ్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ డిమాండ్ చేశారు. లైంగిక దాడులపై శాసన సభలో ఆయన స్వల్ప వ్యవధి చర్చను ప్రారంభిస్తూ, పాలనా పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో హోం మంత్రి విఫలమయ్యారని ఆరోపించారు. మహిళల్లో విశ్వాసం పెంచే కార్యక్రమాలు కూడా చేపట్టలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో విఫలమయ్యారని ఆరోపించారు. పోలీసు అధికారులు ఏం పని చేస్తున్నారో ఎవరికీ అంతుబట్టడం లేదని, పని చేయాలనే ఉత్సాహం అధికారుల్లో కొరవడిందని విమర్శించారు. పోలీసు శాఖకు చెందిన హొయ్సళ, చీటా వాహనాలు పని చేయడం లేదని ఆరోపించారు. లైంగిక దాడులకు నిరసనగా ప్రజలు రోడ్డుకెక్కినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని దుయ్యబట్టారు. తమపై జరిగే దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్లకు వచ్చే మహిళల పట్ల పోలీసులు గౌరవప్రదంగా నడుచుకునేట్లు చూడాలని సూచించారు. పోలీసులు ఎవరి పట్లా గౌరవంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. పాఠశాలల్లో లైంగిక దాడులు జరుగుతున్నా, విద్యా శాఖ ఏం చేస్తున్నదో అర్థం కావడం లేదని విమర్శించారు. విబ్‌గ్యార్ పాఠశాల యాజమాన్యంపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఉప నాయకుడు ఆర్. అశోక్ ్రపభృతులు చర్చలో పాల్గొన్నారు. రాజకీయం చేయదలచుకోలేదు రాష్ర్టంలో లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వం పట్ల జేడీఎస్ మెతకగా వ్యవహరిస్తోందంటూ వస్తున్న విమర్శలను తిప్పి కొట్టడానికి ఆ పార్టీ శాసన సభా పక్షం నాయకుడు హెచ్డీ. కుమారస్వామి ప్రయత్నించారు. చర్చలో పాల్గొన్న ఆయన జేడీఎస్, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ కొందరు తమను విమర్శిస్తున్నారని తెలిపారు. లైంగిక దాడుల సంఘటనలను అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూడడం ఏ పార్టీకీ తగదని హితవు పలికారు. పోలీసు శాఖ వైఫల్యంపై ఇదివరకే తమ పార్టీ గళం విప్పిందని గుర్తు చేశారు. లైంగిక దాడులపై గత మూడు రోజులుగా ృస్తత చర్చలు జరుగుతున్నాయని, అయితే ఎవరూ దీనికి పరిష్కార మార్గాలు చెప్పడం లేదని అన్నారు. గుజరాత్ సహా దేశంలోని ప్రతి రాష్ర్టంలోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. అందరూ కూర్చుని ఈ లైంగిక దాడులను పూర్తిగా అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఓ నిర్ణయానికి రావాలని ఆయన అన్ని పార్టీలను కోరారు. -
మేమున్నామని...
‘2014 ఏడాదికల్లా దేశంలో మహిళా పోలీసుల సంఖ్య 5వేలు దాటాలి’ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని చెప్పిన మాటలివి. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులకు ఇదొక్కటే పరిష్కారమంటూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రతి జిల్లా పరిధిలో పన్నెండుమంది మహిళా పోలీసులుండాలన్న నిబంధనను అమలుచేసే పనిలో భాగంగా పెద్ద ఎత్తున శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్యనే ఆప్ఘనిస్తాన పోలీస్ అకాడమీలో చేరిన ఫ్రిభాని పలకరిస్తే...‘‘ఐదేళ్ల కిందట ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సమయంలో సహ ఉద్యోగుల్లో కొందరు పురుషులు నన్ను చాలా రకాలుగా వేధించారు. చాలాసార్లు పోలీసుల్ని ఆశ్రయించాలనుకున్నాను. కానీ, మగపోలీసులకు నా బాధ ఎలా అర్థమవుతుందనుకుని...ఊరుకున్నాను. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఏ మహిళకు చిన్న సమస్య వచ్చినా..మేం ఉన్నాం’’ అని గర్వంగా చెబుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం 1850మంది మహిళా పోలీసులున్నారు. ఈ ఏడాది చివరికల్లా ఆ సంఖ్యను రెట్టింపు చేసే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుంటున్నారు అక్కడి మహిళలంతా. -
మరింతమంది మహిళా అధికారులు ముందుకు రావాలి: సంజీవ్
న్యూఢిల్లీ: మహిళలపై నేరాలను విచారించేందుకు మహిళా అధికారులు తప్పనిసరిగా ముందుకురావాలని మధ్య ఢిల్లీ సంయుక్త పోలీస్ కమిషనర్ సంజీవ్ గోయల్ సూచించారు. ‘కమిట్మెంట్ టు జెండర్ జస్టిస్-జీరో టాలరెన్స్ టు సెక్సువల్ హెరాస్మెంట్’ అనే అంశంపై ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లో శనివారం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ప్రసంగించారు. మహిళలపై నేరాలను విచారించేందుకు మహిళా పోలీసు అధికారులకు సాధికారత కల్పించేరీతిలో వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని మహిళలకు భద్రత కల్పించడమే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. మహిళా పోలీసు అధికారులు విశ్వాసంతో పనిచేయాలని ఆయన సూచించారు. అప్పుడు మాత్రమే బాధిత కుటుంబాలకు ధీమా కలిగించగలుగుతారన్నారు. నేరాలు చేసేవారెవరూ తాము తప్పు చేస్తున్నట్టు ఏనాడూ భావించరని, ఇందుకు కారణం వారు విద్యావంతులు కాకపోవడమేనన్నారు. అత్యాచార కేసుల్లో బాధితులను, ప్రాణాలతో బయటపడిన వారిని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయప్రక్రియ అనేది బాధితులతోపాటు బాధిత కుటుంబాలకు ఇబ్బందికరంగా అనిపిస్తుందన్నారు. అందువల్ల లైంగిక వేధింపు కేసు విచారణ బాధ్యతలను మహిళా పోలీసు అధికారులే నిర్వర్తిస్తే వారికి ఎటువంటి ఇబ్బందులూ ఉండబోవన్నారు. బాధిత కుటుంబాలతో సంబంధాలు కలిగిన స్వచ్ఛంద సంస్థలతోనూ తాము కలిసి పనిచేస్తామన్నారు. అనంతరం జవహర్లాల్ నెహ్రూ (జేఎన్‌యూ) ప్రొఫెసర్ విదు వర ్మ మాట్లాడుతూ కేవలం చట్టాలవల్లనే బాధిత కుటుంబాలకు న్యాయం జరగబోదన్నారు. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ బాధితులను జాగ్రత్తగా చూసుకోగలిగే వారు కూడా అవసరమన్నారు. పనిమనుషులు, సెక్స్‌వర్కర్లు తదితర అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు తగినంత భద్రత కల్పించలేవన్నారు.