సాక్షి, అమరావతి: దేశంలో మహిళా పోలీసులు అత్య«దికంగా ఉన్న రాష్ట్రాల్లో అంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని 28 రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో అత్యధికంగా 21.76 శాతం మంది మహిళా పోలీసులు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధికంగా బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో ఉన్నారు. కాగా అఖిల భారత స్థాయిలో మహిళా పోలీసులు చాలా తక్కువగా ఉన్నారు.
జాతీయ స్థాయిలో 11.75 శాతమే ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. పోలీసుల అంశం రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీతోపాటు మహిళా కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్లకు సంబంధించి అదనపు పోస్టులను సృష్టించాలని సూచించింది. ప్రతి పోలీసు స్టేషన్‌లో కనీసం ముగ్గురు మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్లు, 10 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్లు పేర్కొంది. తద్వారా పోలీస్ స్టేషన్‌లో మహిళా హెల్ప్‌డెస్క్ 24 గంటలు పనిచేస్తుందని తెలిపింది.
ఏపీలోనే మహిళా పోలీసులు అత్యధికం
Published Mon, May 15 2023 4:40 AM | Last Updated on Mon, May 15 2023 6:30 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment