
'విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు'
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో లాఠీచార్జ్పై సోమవారం మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నివేదిక అందజేశారు. మహిళా పోలీసులే విద్యార్థినులను అరెస్ట్ చేశారని ఆయన నివేదికలో పేర్కొన్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు.
వైస్ ఛాన్సలర్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి దాడికి యత్నించారని అన్నారు. పోలీసులపై కూడా రాళ్లు రువ్వారని చెప్పారు. దాంతో విధిలేని పరిస్థితుల్లోనే పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు హెచ్ఆర్సీకి ఇచ్చిన నివేదికలో సీవీ ఆనంద్ వివరణ ఇచ్చారు.