lotty charge
-
నిమ్జ్ నిర్వాసితులపై లాఠీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/ఝరాసంగం: తమ భూములకు పరిహారం చెల్లించే వరకు, రైతు కూలీలకు న్యాయం చేసేవరకు నిమ్జ్ (జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి)లో నిర్మాణాలు చేపట్టవద్దంటూ నిర్వాసితులు బుధవారం చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడిగిలో నిర్వహించిన ర్యాలీని మంగళవారం రాత్రి నుంచే మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదం తోపులాటకు దారితీయడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇదే గ్రామానికి చెందిన పద్మమ్మ అనే మహిళ ముఖానికి గాయం కావడంతో స్పృహ కోల్పోయింది. దీంతో పోలీసులు ఆమెను జహీరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పదుల సంఖ్యలో నిర్వాసితులను అదుపులోకి తీసుకొని చిరాగ్పల్లి పీఎస్‌కు తరలించారు. లాఠీచార్జిపై మండిపడ్డ కొందరు ఆందోళనకారులు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. నిమ్జ్ గోబ్యాక్ .. సేవ్ ఫార్మర్ ఝరాసంఘం మండలం చీలపల్లి వద్ద నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీస్‌కు ప్రభుత్వం 512 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ స్థలంలో సమీకృత రక్షణ వ్యవస్థ పరిశ్రమ నిర్మాణానికి సంస్థ భూమి పూజ నిర్వహించింది. ఈ నేపథ్యంలో నిర్వాసితులు ‘గోబ్యాక్ నిమ్జ్.. సేవ్ ఫార్మర్, జై జవాన్.. జై కిసాన్, సారవంతమైన భూములు లాక్కోవద్దు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. 2013 చట్టం ప్రకారం పరిహారమివ్వాలి నిమ్జ్ కోసం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల పరిధిలో మొత్తం 12,635 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో 3,100 ఎకరాలను సేకరించింది. అయితే ప్రభుత్వం నామమాత్రంగా పరిహారం చెల్లించిందని.. తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. -
హుస్నాబాద్ రణరంగం
సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై మళ్లీ లాఠీచార్జి జరిగింది. పూర్తిగా పరిహారమిచ్చాకే గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌రన్ చేపట్టాలంటూ నిర్వాసితుల ఆందోళన.. ప్రతిగా టీఆర్ఎస్ శ్రేణుల ర్యాలీ.. పరస్పరం రాళ్లదాడులు.. నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి.. కొట్టుకుంటూ, లాక్కెళ్లి పోలీస్స్టేషన్లకు తరలించడంతో హుస్నాబాద్ పట్టణం రణరంగంగా మారింది. సోమవారం తెల్లవారుజామున గుడాటిపల్లిలో పోలీసుల అరెస్టులతో మొదలైన ఆందోళన.. మంగళవారం సాయంత్రానికి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తెల్లవారుజామున అరెస్టులతో మొదలై గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తికావడంతో ట్రయల్ రన్ నిర్వహించాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రధాన కాల్వ పనులపై కోర్టు స్టే ఉండటంతో ట్రయల్‌రన్ నిర్వహించేందుకు మరో కాల్వ నిర్మాణం చేపట్టి, నీళ్లు నింపాలని నిర్ణయించారు. ఇందుకోసం గుడాటిపల్లిలో సేకరించిన భూమిలో నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేపట్టగా.. నిర్వాసితులు అడ్డుకుని, నిరసన తెలిపారు. అయితే సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు భారీగా పోలీసు బలగాలు గుడాటిపల్లికి చేరుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిపేసి.. ఇళ్లలోకి చొరబడి నిర్వాసితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడ్డుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ నిర్వాసితులు పాదయాత్రగా హుస్నాబాద్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. నిర్వాసితులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మంగళవారం హుస్నాబాద్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం కూడా నిర్వాసితులు ఆందోళన కొనసాగించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బైఠాయించిన భూ నిర్వాసితులు ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి.. ఓ వైపు నిర్వాసితుల ఆందోళన కొనసాగుతుండగానే.. మరోవైపు టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలంతా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకోవాలంటూ సమాచారం వెళ్లింది. గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్‌రన్ జరగకుండా ప్రతిపక్షాలు అడ్డు కుంటున్నాయని, వెంటనే ట్రయల్ రన్ చేపట్టాలంటూ ర్యాలీగా వెళ్లి ఆర్డీవోకు వినతిపత్రం ఇద్దామని.. అంతా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి రావాలని సూచన వచ్చింది. టీఆర్ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర నేతలు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ కూడా అక్కడికి వస్తున్నారని తెలిసిన నిర్వాసితులు.. ఎమ్మెల్యేకు తమ సమస్యలు వివరిస్తామంటూ భారీ ర్యాలీగా క్యాంప్ ఆఫీస్ వైపు బయలుదేరారు. పోలీసులు వారిని క్యాంపు ఆఫీసుకు కొద్దిదూరంలో హన్మకొండ ప్రధా న రహదారిపై అడ్డుకున్నారు. దీంతో నిర్వాసితులు ప్రధాని రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. టీఆర్ఎస్ శ్రేణులు బయటికొచ్చి.. క్యాంపు ఆఫీస్‌లో పెద్ద సంఖ్యలో గుమిగూడిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. ప్రాజెక్టు ట్రయల్‌రన్ వెంటనే చేపట్టాలనే డిమాండ్‌తో ర్యాలీగా బయలుదేరారు. బయట నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారని, వెళ్లొద్దని ఏసీపీ, ఇతర పోలీసు అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. టీఆర్ఎస్ నేతలు వినలేదు. మరోవైపు ఆందోళన విరమించాలంటూ పోలీసులు కోరినా నిర్వాసితులూ వినలేదు. కాసేపటికే టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలంతా నినాదాలు చేసుకుంటూ రోడ్డుపైకి వచ్చారు. ఇరువర్గాలు ఎదురుపడటంతో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పోలీసులు వచ్చి లాఠీచార్జి మొదలుపెట్టారు. దొరికినవారిని దొరికినట్టు కొడుతూ.. కర్ర, ఫైబర్ లాఠీలతో పోలీసులు విరుచుకుపడ్డారు. ప్రధానంగా నిర్వాసితులను ఉరికించి కొట్టారు. కొందరిని ఈడ్చిపారేశారు. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు కూడా నిర్వాసితులపై దాడికి పాల్పడ్డాయి. నిర్వాసితులను కొడుతుంటే వారి కుటుంబ సభ్యులు, మహిళలు అడ్డురాగా వారిపైనా పోలీసులు లాఠీ ఝలిపించారు. కొందరిని క్యాంపు ఆఫీస్ నుంచి పోలీస్‌స్టేషన్ వరకూ కొట్టుకుంటూ లాక్కెళ్లారు. తమ వారిని పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకెళ్లి కొట్టి చంపుతారని ఆందోళన వ్యక్తం చేస్తూ మహిళలు, కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిని లాఠీలతో చెదరగొట్టి నిర్వాసితులను లోనికి తీసుకెళ్లారు. దీనితో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. నలుగురు మహిళలు స్పృహతప్పి పడిపోగా ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనల్లో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, ఎస్సై శ్రీధర్‌లకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా వస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు గుర్తుపెట్టుకుని మరీ కొట్టారు! పోలీసులు గత మూడు రోజులుగా ఆందోళనలో ముందున్న నిర్వాసితులను గుర్తుపెట్టుకుని మరీ లాఠీలు, కర్రలు విరిగేలా కొట్టారని కుటుంబ సభ్యులు, గుడాటిపల్లి గ్రామస్తులు మండిపడ్డారు. తమ వారిని వెంటనే విడుదల చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పరామర్శించారు. కాగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం రాత్రి గుడాలిపల్లి నిర్వాసితులను, గాయపడిన మహిళలను పరామర్శించారు. పోలీసులు, టీఆర్ఎస్ నేతలు కలిసి తమపై దాడి చేశారని మహిళలు రోదిస్తూ గోడు వెళ్లబోసుకున్నారు. రిజర్వాయర్ లెక్క ఇదీ.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గౌరవెల్లి రిజర్వాయర్‌ను 1.14 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2007లో సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. 1,870 ఎకరాల భూమికి ఎకరానికి రూ.2.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించి సేకరించారు. 2015లో టీఆర్ఎస్ సర్కారు ఈ ప్రాజెక్టును రీడిజైన్ చేసింది. రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచింది. దీనితో గుడాటిపల్లి పంచాయతీ పరిధిలోని తెనుగుపల్లి, మద్దెలపల్లి, చింతలతండా, జాలుబాయితండా, కొత్తపల్లి, సేవనాయక్ తండా, తిర్మల్ తండా, సోమాజి తండాల్లో ఇళ్లు, వ్యవసాయ భూములు పూర్తిగా రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యాయి. రీడిజైన్ కోసం అదనంగా 1,900 ఎకరాలు అవసరమవడంతో.. మొదట 1,600 ఎకరాలను ఒక్కో ఎకరానికి రూ.6.95 లక్షల చొప్పున చెల్లించి సేకరించారు. గత నవంబర్‌లో మరో 222 ఎకరాలను ఎకరానికి 15 లక్షల చొప్పున చెల్లించి సేకరించారు. నిర్వాసితుల డిమాండ్లివే! ► భూనిర్వాసితులు తమ కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన అందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. 2015 నాటికి నిర్వాసితుల్లో మేజర్లకు రూ.8 లక్షల చొప్పున, మైనర్లకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దీనిని నిర్వాసితులు తిరస్కరించారు. అందరికీ రూ.8 లక్షల పరిహారమివ్వాలని కోరారు. ఈ ఏడేళ్లలో చాలా మంది మేజర్లు అయ్యారు. అందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలంటున్నారు. ► నిర్వాసితులకు పరిహారం చెల్లించే సమయంలో 57 మంది రైతుల పేర్లు మిస్సయ్యాయని.. మరో 59 మంది వృద్ధులని చెప్పి ప్యాకేజీ అందించలేదని.. వారందరికీ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నారు. ► ఇక 88 ఎకరాలకు చెందిన రైతులు తమకు భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ► మరోవైపు అధికారులు మాత్రం భూసేకరణకు సంబంధించి 80శాతం పరిహారం చెల్లింపు పూర్తయిందని, మిగతా వారికి నెలరోజుల్లో చెల్లిస్తామని చెప్తున్నారు. ఇక ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి మైనర్లు తిరస్కరించడం వల్లే చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. -
హరియాణాలో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీచార్జీ
-
తెలంగాణ: హైదరాబాద్‌లో అర్దరాత్రి లాఠీగ్యాంగ్ హల్చల్
-
రణరంగంగా జామియా వర్సిటీ
న్యూఢిల్లీ/గువాహటి/ఈటానగర్: పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో శుక్రవారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే, గత రెండు రోజులతో పోలిస్తే.. అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొంత తగ్గుముఖం పట్టాయి. కానీ ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం రణరంగంగా మారింది. పశ్చిమబెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లాలో ఉన్న బెల్డాంగ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌ను ఆందోళనకారులు తగలబెట్టారు. అస్సాంలోని డిబ్రూగఢ్‌లో, మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ల్లో శుక్రవారం కొద్దిసేపు కర్ఫ్యూ సడలించారు. అస్సాంలో నిరసనలకు కేంద్రమైన గువాహటిలో శుక్రవారం హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది. లాఠీచార్జ్.. టియర్ గ్యాస్ పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌కు ర్యాలీగా వెళ్లాలనుకున్న జామియా మిలియా వర్సిటీ విద్యార్థులను పోలీసులు వర్సిటీ గేటు వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల పైకి విద్యార్థులు రాళ్లు రువ్వడంతో, ప్రతిగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారని, రాళ్లు కూడా మొదట పోలీసులే రువ్వారని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులే బారికేడ్లను ధ్వంసం చేసి తమపైకి దూసుకువచ్చారని పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యారు. దాదాపు 50 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ ప్రాంత ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్(ఆప్) ఘటనాస్థలికి వెళ్లి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. రైల్వే స్టేషన్‌కు నిప్పు పశ్చిమబెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లాలో ఉన్న బెల్డాంగ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌ను శుక్రవారం ఆందోళనకారులు తగలబెట్టారు. వేలాదిగా అక్కడికి వచ్చిన నిరసనకారులు రైల్వే కార్యాలయానికి, ఆర్పీఎఫ్ అవుట్‌పోస్ట్‌కు, ట్రాక్స్‌కు నిప్పంటించారు. అక్కడ రైల్వే పోలీసులపై తిరగబడ్డారు. బెల్డాంగ పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. రఘునాథ్గంజ్ పోలీస్ స్టేషన్‌లోని వాహనాలకు నిప్పంటించారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో ముస్లిం జనాభా ఎక్కువ. అలాగే, ముస్లిం జనాభా అధికంగా ఉన్న గ్రామీణ హౌరా, బిర్భుమ్, బుర్ద్వాన్ల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అరుణాచల్‌లో విద్యార్థుల భారీ ర్యాలీ అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం కూడా నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పరీక్షలను బహిష్కరించి, వీ«ధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. ఈటానగర్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ నుంచి రాజ్‌భవన్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ జరిపారు. 30 కి.మీల దూరం సాగిన ఈ ర్యాలీలో పాల్గొని, గవర్నర్ బీడీ మిశ్రాకు వినతిపత్రం ఇచ్చారు. గువాహటిలో ఏఏఎస్‌యూ ర్యాలీ అస్సాంలోని గువాహటిలో తాత్కాలికంగా కర్ఫ్యూను తొలగించారన్న సమాచారంతో నిత్యావసర సరుకుల కోసం ప్రజలు వేలాదిగా దుకాణాల ముందు బారులు తీరారు. నగరంలోని దాదాపు అన్ని చోట్ల భద్రతా బలగాలు మోహరించాయి. పలు చోట్ల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. నగరంలో శుక్రవారం ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నగరంలో శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించింది. అమిత్ షా పర్యటన రద్దు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో ఆది, సోమవారాల్లో హోంమంత్రి అమిత్ షా జరపనున్న పర్యటన రద్దయింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. జపాన్ ప్రధాని పర్యటన రద్దు జపాన్ ప్రధాని షింజో ఆబే భారత పర్యటన రద్దయింది. పౌరసత్వ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా గువాహటిలో ప్రధాని మోదీతో ఈనెల 15 నుంచి జరగాల్సిన భేటీ రద్దయినట్లు తెలిపింది. అల్ప సంఖ్యాకుల హక్కులకు రక్షించండి వాషింగ్టన్: పౌరసత్వ చట్ట సవరణ..తదనంతర పరిణామాలపై అమెరికా స్పందించింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి అల్పసంఖ్యాక మతాల వారి హక్కులకు రక్షణ కల్పించాలని భారత్‌ను కోరింది. పౌరసత్వ చట్టంపై సుప్రీంలో పిటిషన్లు పౌరసత్వ చట్ట సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాతోపాటు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఆసు), పీస్ పార్టీ, కొన్ని ఎన్జీవోలు, న్యాయవాది ఎంఎల్ శర్మ, కొందరు న్యాయ విద్యార్థులు కూడా శుక్రవారం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ చట్ట సవరణలపై తక్షణం విచారణ చేపట్టాలని మహువా మొయిత్రా తరఫు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. అయితే, ధర్మాసనం నిరాకరించింది. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు ఈ చట్టం ద్వారా భంగం కలుగుతోందని జైరాం రమేశ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
అట్టుడుకుతున్న అస్సాం
న్యూఢిల్లీ/గువాహటి: పార్లమెంట్ తాజాగా ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గువాహటిలో యుద్ధ వాతావరణం కనిపించింది. కర్ఫ్యూను సైతం లెక్కచేయకుండా రోడ్ల దిగ్బంధం, గృహ దహనాలు, దుకాణాల లూటీకి పాల్పడుతుండటంతో పోలీసులు లాఠీచార్జి, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు చెబుతుండగా ముగ్గురు మరణించారని ఆందోళనకారులు అంటున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం విద్యా, వాణిజ్య సంస్థలు పని చేయలేదు. రవాణా వ్యవస్థ స్తంభించింది. అధికారులు ముందు జాగ్రత్తగా త్రిపుర, అసోంలకు రైలు సర్వీసులను రద్దు చేశారు. విమాన సర్వీసులను సైతం పలు ప్రాంతాలకు రద్దు చేశారు. సైనికులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఇంటర్నెట్ సేవలపై మరో 48 గంటలపాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అస్సాం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా పలు హామీలిచ్చారు. ఇంటర్నెట్పై నిషేధం ఉండగా ట్విట్టర్లో హామీల విషయం ప్రజలకెలా తెలుస్తుందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. గువాహటి యుద్ధరంగం రాష్ట్ర రాజధాని గువాహటిలోనే ఆందోళనల ప్రభావం ఎక్కువగా ఉంది. నగరంలో ఆందోళనకారులు భవనాలు, దుకాణాలకు నిప్పు పెట్టడం, ధ్వంసం చేయడం, రోడ్లపై టైర్లు కాల్చడం, అడ్డంకులు కల్పించడం, పోలీసులతో ఘర్షణలకు దిగారు. దీంతో పలుచోట్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని అధికారులు అంటున్నారు. అయితే, ముగ్గురు మృతి చెందారని ఆందోళన కారులు అంటున్నారు. గువాహటిలో పర్యటిస్తున్న అస్సాం పోలీస్ చీఫ్ భాస్కర్ జ్యోతి మహంత కాన్వాయ్‌పై కొందరు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఎవరికీ ఎటువంటి అపాయం సంభవించలేదు. పోలీసు ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆసు(ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్) పిలుపు మేరకు గువాహటిలోని లతాశిల్ మైదానంలో సినీ, సంగీత పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా వందలాదిగా ప్రజలు, విద్యార్థులు హాజర య్యారు. ఆందోళనకారులు దిగ్బంధించడంతో వేలాది మంది ప్రయాణికులు గువాహటి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. రహదారుల దిగ్బంధం కారణంగా దిబ్రూగఢ్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పౌరవిమానయాన శాఖ తెలిపింది. డిబ్రూగఢ్‌లో ముఖ్యమంత్రి సోనోవాల్, ఎమ్మెల్యే బినోద్ హజారికా నివాసాలకు, వాహనా లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పోలీసు సర్కిల్ అధికారి కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. కామ్రూప్ జిల్లాలో దుకాణాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. 31వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. జోర్హాత్ జిల్లాలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. 39వ నంబర్ జాతీయరహదారిపై బైఠాయించిన వారిని చెదరగొట్టేందుకు గోలా ఘాట్ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. రంగియాలో కూడా పోలీసు కాల్పులు జరిగాయి. విమాన సర్వీసుల రద్దు అస్సాంలో శాంతిభద్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు ఇండిగో, విస్తారా, ఎయిరిండియా, స్పైస్‌జెట్ ప్రకటించగా గో ఎయిర్, ఎయిర్ ఏషియా ఇండియా షెడ్యూల్‌ను మార్చుతున్నట్లు తెలిపాయి. ప్రభుత్వ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. జాతీయతను, దేశ సమగ్రతను దెబ్బతీసేవి, హింసను ప్రేరేపించే అంశాలను ప్రసారం చేయవద్దని శాటిలైట్ టీవీ చానెళ్లను కేంద్రం కోరింది. ఇంటర్నెట్పై నిషేధం కొనసాగింపు సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపించకుండా ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులపై మరో 48 గంటలపాటు నిషేధం పొడిగించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చే చర్యల్లో భాగంగా ప్రభుత్వం గువాహటి పోలీస్ అదనపు కమిషనర్ దీపక్ కుమార్‌ను తొలగించి మున్నాప్రసాద్ గుప్తాను నియమించింది. అదేవిధంగా, అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) ముకేశ్ అగర్వాల్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో జీపీ సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. త్రిపుర,అస్సాంలకు రైళ్లు బంద్ ఆందోళనల దృష్ట్యా అస్సాం, త్రిపుర వైపు వెళ్లే రైళ్లను రద్దు చేయడమో లేక కుదించడమో చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఆందోళనల కారణంగా ప్రయాణికులు పలు ప్రాంతాల్లో చిక్కుకు పోయారని తెలిపింది. 12 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను తరలిస్తున్నట్లు వెల్లడించింది. -
అట్టుడుకుతున్న ఈశాన్యం
గువాహటి: పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. అస్సాం, త్రిపురల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అస్సాంలో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పౌర నిరసనలకు కేంద్రంగా మారిన అస్సాం రాజధాని గువాహటిలో బుధవారం నిరవధిక కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూని ధిక్కరిస్తూ నిరసనకారులు వీధుల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. గువాహటి, దిస్పూర్, డిబ్రూగఢ్, జోర్హాత్, త్రిపుర రాజధాని అగర్తల తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు, నిరసనకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అస్సాం రాజధాని దిస్పూర్లో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సెక్రటేరియట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు దిస్పూర్లో ఆదివారం భేటీ కానున్న వేదికను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆందోళనల కారణంగా తేజ్‌పూర్ నుంచి వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కొద్దిసేపు గువాహటి విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. పలు రైళ్లను రద్దు చేశారు. త్రిపుర, అస్సాంలలో ఆర్మీని మోహరించారు. అస్సాంలోని 10 జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచి ఇంటర్నెట్ను నిలిపేశారు. త్రిపురలో మంగళవారం నుంచే ఇంటర్నెట్తో పాటు ఎస్ఎంఎస్ సదుపాయాన్ని కూడా నిలిపేశారు. ఆందోళన ఎందుకు? ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి భారీ సంఖ్యలో హిందువులు కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు వారందరికీ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా పౌరసత్వం వస్తుంది. ఇది ఆ ప్రాంతంలోని జనాభా స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ బిల్లు ముస్లిం శరణార్థులకు వర్తించదు. ఇప్పటికే అస్సాం పౌర రిజిస్టర్ ద్వారా ఎందరో దేశ పౌరసత్వాన్ని కోల్పోయారు. దశాబ్దాల తరబడి ఇక్కడ ఉంటున్న మైనారిటీల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన కొందరిలో నెలకొంది. -
యుద్ధక్షేత్రంగా శబరిమల
నిలక్కళ్/పత్తనంతిట్ట/పంబ: సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో గత కొన్నిరోజులుగా ఉధృతమైన నిరసనలు జరుగుతుండగానే శబరిమల ఆలయం ఐదు రోజుల మాస పూజల కోసం బుధవారం తెరచుకుంది. కొండ దిగువ ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనలు, హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో నిషేధిత వయస్సుల్లోని మహిళలెవ్వరూ పవిత్ర ఆలయ పరిసరాల్లోకి చేరుకోలేకపోయారు. 10 ఏళ్లలోపు, 50 ఏళ్ల పైబడిన వయసున్న బాలికలు, వృద్ధురాళ్లు అతి తక్కువ సంఖ్యలోనే అయ్యప్ప స్వామి గుడికి వెళ్లారు. రుతుస్రావం అయ్యే వయస్సుల్లో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం ఉండగా, ఆ నిషేధాన్ని గత నెల 28న ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. కాగా, బుధవారం సాయంత్రం ఆలయ ప్రధాన పూజారులు ఉన్నిక్రిష్ణన్ నంబూద్రి, కందారు రాజీవారులు గర్భగుడిని తెరిచి దీపం వెలిగించారు. సంప్రదాయం ప్రకారం తొలిరోజు ఆలయంలో పూజ నిర్వహించకుండా రాత్రి 10.30 గంటలకు తలుపులు మూసేస్తారు. ఉద్రిక్తంగానే కొండ పరిసరాలు శబరిమల కొండ పరిసరాల్లో బుధవారం మహిళలు సహా అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో కొండకు వెళ్లే దారులకు చేరుకుని, నిషేధిత వయస్సు అమ్మాయిలు, స్త్రీలను ఆలయానికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. వాహనాలు, బస్సులను తనిఖీ చేసి వారిని దించేశారు. విధులపై శబరిమలకు వెళ్తున్న పలు వార్తా చానళ్ల మహిళా పాత్రికేయులనూ నిరసనకారులు బెదిరించి, వారి వాహనాలను ధ్వంసం చేశారు. మరోవైపు స్త్రీలను అడ్డుకునే వారిని నిరోధించేందుకు కేరళ ప్రభుత్వం ఆలయానికి వెళ్లే దారుల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది. నిరసనలకు నేతృత్వం వహిస్తున్న అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిలక్కళ్, పంబల్లో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనల్లో పలువురికి గాయాలయ్యాయి. రిపోర్టర్లు, ఫొటో జర్నలిస్టులు కలిపి 10 మంది మీడియా వ్యక్తులకు గాయాలయ్యాయనీ, వారి పరికరాలు ధ్వంసమయ్యాయని మంత్రి జయరంజన్ చెప్పారు. పంబ, నిలక్కళ్లలో 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు పాతనంతిట్ట జిల్లా యంత్రాంగం ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ మద్దతు.. ఆందోళనకారులకు కేరళలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు బీజేపీ తమ మద్దతు ప్రకటించింది. పోలీసుల లాఠీ చార్జీకి నిరసనగా శబరిమల యాక్షన్ కౌన్సిల్ ఇచ్చిన 12 గంటల బంద్ పిలుపునకు బీజేపీ, ఇతర ఎన్డీయే పార్టీలు మద్దతు తెలిపాయి. బీజేపీ ఎంపీ మురళీధరన్ మాట్లాడుతూ ప్రభుత్వం తన మొండిపట్టును వదిలి ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ ఈ అంశాన్ని హిందూ పునరుజ్జీవనం, హిందూ ఛాందసవాదాలకు మధ్య జరుగుతున్న పోరాటంగా చూడాలన్నారు. ప్రజలు చట్టం పక్షాన నిలిచి, చట్టం ముందు అందరూ సమానులన్న నియమాన్ని పాటించాలని కోరారు. కాగా, ఆలయానికి వస్తున్న మహిళలకు సరైన భద్రత కల్పించాల్సిదిగా జాతీయ మహిళా కమిషన్ కేరళ పోలీసులను కోరింది. పోలీసుల రక్షణలో వెనుదిరిగిన ఏపీ మహిళ శబరిమలకు వెళ్లేందుకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాధవి (45) అనే మహిళ ప్రయత్నించారు. బుధవారం ఉదయం ఆమె తన కుటుంబంతో కలసి స్వామి అయ్యప్ప మార్గం గుండా కొండ ఎక్కేందుకు యత్నించారు. మధ్యలో అయ్యప్ప భక్తులు ఆమెను అడ్డుకుని వెనక్కు వెళ్లిపొమ్మన్నారు. అయినప్పటికీ పోలీసుల రక్షణ మధ్య మరికొంత దూరం కొండ ఎక్కిన అనంతరం ఆమె పంబకు తిరిగొచ్చారు. పంబకు చేరుకునే వరకు పోలీసులు ఆమెకు రక్షణగా ఉన్నారు. మాధవి ఆలయానికి వెళ్లి ఉంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గుడిలోపలికెళ్లిన తొలి మహిళగా ఆమె నిలిచేవారు. -
మహిళా కార్మికురాలి గొంతు పట్టుకున్న సీఐ ఫిరోజ్
ఒంగోలు టౌన్: ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన నగర పాలక సంస్థ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఫెడరేషన్ నాయకులు, సీఐటీయూ నాయకులు, కార్మికులు నగర పాలక సంస్థ కార్యాలయం గేట్లువేసి దాని ముందు బైఠాయించారు. ఉదయం తొమ్మిది గంటలకు బైఠాయించిన కార్మికులు, నాయకులు గంటసేపు నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఒక అరగంటపాటు నిర్వహించి కార్యక్రమాన్ని ముగిస్తామంటూ నాయకులు చెప్పారు. అయితే ఒంగోలు వన్‌టౌన్ ఏఎస్ఐ సుబ్బారావు నగర పాలక సంస్థ కార్యాలయ గేటుకు తగిలించిన సీఐటీయూ జెండాను తొలగించారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికే అక్కడకు పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. గేటు ముందు బైఠాయించిన సీఐటీయూ నాయకులను బలవంతంగా పక్కకు లాగారు. ఆ సమయంలో తీవ్ర పెనుగులాట జరిగింది. సీఐటీయూ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాం శ్రీనివాసరావును బలవంతంగా అక్కడ నుంచి లాగుతున్న సమయంలో ఆయన చొక్కా చినిగిపోయింది. దీంతో అక్కడే ఉన్న మహిళా కార్మికులు పోలీసుల చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో సీఐ ఫిరోజ్ మహిళలని కూడా చూడకుండా చిడిపోతు ఏసమ్మ అనే మహిళా కార్మికురాలి గొంతు పట్టుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు హుటాహుటిన అక్కడకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. పోలీసుల చర్యలను ఎండగడుతూ నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి నాయకులు, కార్మికులు ప్రదర్శనగా బయల్దేరి స్థానిక చర్చి సెంటర్లో కొద్దిసేపు మానవహారం నిర్వహించారు. మున్సిల్ కార్మికులను చిన్నచూపు చూస్తోంది మునిసిపల్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సీఐటీయూ, మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు విమర్శించారు. తొలుత నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన సమయంలో కార్మికులను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ శ్రీనివాసరావు, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాం శ్రీనివాసరావు, ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.సామ్రాజ్యం మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు గొడ్డలిపెట్టుగా మారిన జీఓ నం 279ని రద్దు చేయాలని, జీఓ నం 151 ప్రకారం పెరిగిన వేతనాలు అమలు చేయాలంటూ గత రెండేళ్ల నుంచి నిరసనలు, ధర్నాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ నెల 5వ తేదీ ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ శాఖామంత్రి నారాయణ, డీఎంఈ కన్నబాబులను రాష్ట్ర ప్రతినిధి బృందం కలిసి సమస్యను విన్నవించగా, ఒకరోజు గడువు కావాలని మంత్రుల బృందం సూచించిందన్నారు. ఆ తరువాత మరో నాలుగు రోజులు గడువు కావాలని మంత్రుల బృందం పేర్కొందన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. తాము ఉదయం 9 గంటలకు నగర పాలక సంస్థ కార్యాలయం గేట్లువేసి అక్కడే బైఠాయించామని, పదిన్నర గంటలకల్లా తమ ఆందోళన ముగిస్తామంటూ పోలీసులకు చెప్పినప్పటికీ, వారు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ప్రశాంతంగా జరుగుతున్న బైఠాయింపు కార్యక్రమాన్ని ఉధృతంగా మార్చారన్నారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు వారిపై అనుచితంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళలను తాకరాదని చట్టం చెబుతున్నప్పటికీ పోలీసులు మహిళా కార్మికురాలి గొంతు పట్టుకొని దౌర్జన్యంగా వ్యవహరించడంపై తీవ్రంగా ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు తంగిరాల మహేష్, కొర్నెపాటి శ్రీనివాసరావు, దామా శ్రీనివాసులు, తంబి శ్రీనివాసులు, ఫెడరేషన్ నాయకులు గోపి, రత్నకుమారి పాల్గొన్నారు. -
మల్లన్న నిర్వాసితులపై లాఠీ
-
నిర్వాసితులపై లాఠీ
► ఉద్రిక్తతకు దారితీసిన మల్లన్నసాగర్ నిర్వాసితుల ఆందోళన ► రాజీవ్ రహదారి దిగ్బంధనానికి కదిలిన పల్లెపహాడ్, ఎర్రవల్లి ప్రజలు ► మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు.. ఇరుపక్షాల మధ్య తోపులాట ► పరిస్థితి చేయిదాటడంతో లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు ► గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు.. భయంతో పరుగులు తీసిన ► ఆందోళనకారులు.. పోలీసులపైకి రాళ్లు ► గాయపడ్డ నిరసనకారులు, పోలీసులు ► లాఠీచార్జికి నిరసనగా నేడు మెదక్ బంద్‌కు ప్రతిపక్షాల పిలుపు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/తొగుట/గజ్వేల్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు తలపెట్టిన రాజీవ్ రహదారి దిగ్బంధం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల లాఠీచార్జి, నిర్వాసితుల ఆగ్రహావేశాలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీలతో విరుచుకుపడటం, గాల్లోకి కాల్పులు జరపడంతో మెదక్ జిల్లా పల్లెపహాడ్, ఎర్రవల్లి గ్రామాల్లో భయానక పరిస్థితి ఏర్పడింది. ఇందులో అటు నిర్వాసితులు, ఇటు పోలీసులు గాయాలపాలయ్యారు. అసలేం జరిగింది?: ఆదివారం ముంపు గ్రామాల ప్రజలు రాజీవ్ రహదారి దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. దీంతో వేములఘాట్ నుంచి పల్లెపహాడ్ చౌరస్తా, ఎర్రవల్లి మీదుగా కుకునూర్‌పల్లిలోని మంగోల్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై ధర్నా చేసేందుకు రైతులు, మహిళలు భారీగా కదిలారు. ర్యాలీ పల్లెపహాడ్ సబ్‌స్టేషన్ వద్దకు చేరుకోగానే సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీ చార్జికి దిగారు. అనుకోని ఘటనతో మహిళలు భయంతో సమీప పంట పొలాల్లోకి పరుగులు పెట్టారు. అయినా నిర్వాసితులు బెదరకుండా ఎర్రవల్లి వైపు వచ్చారు. దీంతో డీఎస్పీ మరింత మంది పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో వేములఘాట్ గ్రామస్తులకు ఎర్రవల్లి నిర్వాసితుల మద్దతు తోడైంది. పోలీసులకు, ఆందోళనకారులకు మరోసారి తోపులాట జరిగింది. పోలీసులు మళ్లీ దొరికిన వారిని దొరికినట్టు బాదారు. కొందరు భయంతో ఇళ్లల్లోకి వెళ్లగా బయటికి ఈడ్చుకొచ్చి కొట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. సుమారు 30 నిమిషాల తర్వాత పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఆ తర్వాత నిర్వాసితులు మళ్లీ పోగయ్యారు. ‘ఊర్లపై పడి భయపెడతారా..’ అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరుపక్షాల మధ్య మరోసారి తోపులాట జరగడంతో పోలీసులు మళ్లీ లాఠీచార్జి జరిపారు. వేములఘాట్, ఎర్రవల్లికి చెందిన మహిళలు, రైతులు చాలామంది గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం గజ్వేల్, సిద్దిపేట ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో కుకునూర్‌పల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి, కానిస్టేబుల్ రమేశ్ గాయపడ్డారు. -
'విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు'
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో లాఠీచార్జ్‌పై సోమవారం మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నివేదిక అందజేశారు. మహిళా పోలీసులే విద్యార్థినులను అరెస్ట్ చేశారని ఆయన నివేదికలో పేర్కొన్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. వైస్ ఛాన్సలర్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి దాడికి యత్నించారని అన్నారు. పోలీసులపై కూడా రాళ్లు రువ్వారని చెప్పారు. దాంతో విధిలేని పరిస్థితుల్లోనే పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు హెచ్ఆర్సీకి ఇచ్చిన నివేదికలో సీవీ ఆనంద్ వివరణ ఇచ్చారు. -
షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో కాజల్ మెరుపులు
కరీంనగర్: కరీంనగర్లో మాంగళ్య షాపింగ్ మాల్‌ను ప్రముఖ సినీతార కాజల్ అగర్వాల్ ప్రారంభించారు. ఆదివారం షాపింగ్ మాల్ ప్రారంభానికి కాజల్ వస్తుందని తెలియడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాజల్‌ను చూసేందుకు ఎగబడటంతో పోలీసులు వారిని అడ్డుకోవడం కోసం లాఠీఛార్జ్ చేశారు. ఈ సమయంలో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో నిర్వాహకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విద్యార్థులపై లాఠీచార్జ్
పురుగులన్నం పెడుతున్నారంటూ ఆందోళన చేసినందుకే.. భాగ్యనగర్‌కాలనీ: బొద్దింకలు చచ్చిన తాగునీరు, పురుగులతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారని శ్రీచైతన్య కళాశాలకు చెందిన హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిజాంపేటలోని శ్రీచైతన్య కళాశాలలో శుక్రవారం రాత్రి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. ఆందోళన తీవ్రతరం కావడంతో కళాశాల యాజమాన్యం విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు కళాశాల యాజమాన్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులకు బాసటగా నిలిచాయి. ఫీజుల వసూలు చేయడంలో జలగల్లా వ్యవహరిస్తూ కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కళాశాల యాజమాన్యాన్ని నిలదీశారు. కూకట్పల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ మోయిజ్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్‌లు సంఘటన స్థలానికి చేరుకుని సరైన భోజనం పెట్టాలని అడిగిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయించిన యాజమాన్యం తీరుని ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో నేతలు ప్రవీణ్‌గౌడ్, విష్ణు, కిషోర్, పూర్ణ, రాజు, శివ, ఈశ్వర్, సురేశ్ మాదిగ, దుర్గా, మూర్తి పాల్గొన్నారు. -
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జి
ఇబ్రహీంపట్నం : మూగజీవాలను అక్రమంగా తరలిస్తున్న డీసీఎంను ఆర్ఎస్ఎస్, హిందువాహిని కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎంను వదిలేసి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. దీంతో పెద్దసంఖ్యలో ఆర్ఎస్ఎస్, హిందువాహిని కార్యకర్తలు ఆదిబట్ల పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. -
లాఠీఛార్జ్ కు దారి తీసిన స్థల వివాదం
చిత్తూరు: చిత్తూరు జిల్లా గంగనపల్లిలో స్థలం విషయంలో తలెత్తిన వివాదం చివరికి లాఠీచార్జికి దారితీసింది. చిత్తూరు నగర మేయర్ కఠారి అనూరాధ భర్తకు, అతని మేనల్లుడికి మధ్య స్థల విషయంలో వైరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం వివాద స్థలంలో గోడను నిర్మిస్తుండగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పటంతో అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు లాఠీచార్జి చేసి, కొందరిని అదుపులోకి తీసుకున్నారు. -
కాంగ్రెస్ మహా ధర్నాలో స్వల్ప లాఠీచార్జ్
వరంగల్: ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా, నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం వరంగల్ కార్పొరేషన్ వద్ద చేపట్టిన మహాధర్నాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపుచేయడానికి పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి, నాయకులను మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. సమగ్ర సర్వే, సంక్షేమ పథకాలు అంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీ రాజయ్య, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ప్రభుత్వాన్ని విమర్శించారు. -
ముండే అభిమానులపై పోలీసుల లాఠీచార్జీ
-
ఈడెన్ లో క్రికెట్ అభిమానులపై లాఠీఛార్జి
కోల్ కతా: ఐపీఎల్ 7 విజయోత్సవ వేడుకల్లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు ఈడెన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. తాజా ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ సభ్యులకు స్టేడియంకు రావడానికి ముందే అక్కడకు అధిక సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యే క్రమంలో పోలీసులు అభిమానులపై లాఠీఛార్జికి దిగారు. ఇందులో పలువురు అభిమానులకు తీవ్ర గాయాలైయ్యాయి. ఐపీఎల్ ఏడో అంచెలో చాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు మంగళవారమిక్కడి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఇక ఈడెన్ గార్డెన్స్ లో ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు దాదాపు 30 వేలమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్లో నైట్ రైడర్స్ పంజాబ్ ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కోల్ కతా ఐపీఎల్ టైటిల్ గెలవడమిది రెండో సారి. విజేతగా వస్తున్న నైట్ రైడర్స్ కోసం కోల్ కతాలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సంగీత, నృత్య ప్రదర్శనలు ఏర్పాట్లు చేశారు. క్రికెటర్లను ఘనంగా సన్మాన ఏర్పాట్లు చేయడం కాస్తా వివాదాలకు దారి తీసింది.