ఇబ్రహీంపట్నం : మూగజీవాలను అక్రమంగా తరలిస్తున్న డీసీఎంను ఆర్‌ఎస్‌ఎస్, హిందువాహిని కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎంను వదిలేసి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. దీంతో పెద్దసంఖ్యలో ఆర్‌ఎస్‌ఎస్, హిందువాహిని కార్యకర్తలు ఆదిబట్ల పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.