cows illegal transport
-
మల్లేపల్లిలో ఉద్రిక్తత
హైదరాబాద్: ఆవుల అక్రమ రవాణా నిరోధిస్తామంటూ ఏర్పాటు చేసిన ఔట్‌పోస్టులతో ఎటువంటి ఉపయోగం లేకుండాపోయిందని, తరలింపు యథేచ్ఛగా సాగుతోందని బీజేపీ, భజరంగ్‌దళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సోమవారం మధ్యాహ్నం మల్లేపల్లిలోని వీఐపీ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలోని ఓ వీధిలోకి లారీ నుంచి 100 గోవులను తీసుకువచ్చారు. దీంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు అక్కడ ఆందోళనకు దిగారు. ఈ కారణంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హుమాయూన్‌నగర్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సమీక్షిస్తున్నారు. -
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జి
ఇబ్రహీంపట్నం : మూగజీవాలను అక్రమంగా తరలిస్తున్న డీసీఎంను ఆర్ఎస్ఎస్, హిందువాహిని కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎంను వదిలేసి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. దీంతో పెద్దసంఖ్యలో ఆర్ఎస్ఎస్, హిందువాహిని కార్యకర్తలు ఆదిబట్ల పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.