
షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో కాజల్ మెరుపులు
కరీంనగర్: కరీంనగర్‌లో మాంగళ్య షాపింగ్ మాల్‌ను ప్రముఖ సినీతార కాజల్ అగర్వాల్ ప్రారంభించారు. ఆదివారం షాపింగ్ మాల్ ప్రారంభానికి కాజల్ వస్తుందని తెలియడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాజల్‌ను చూసేందుకు ఎగబడటంతో పోలీసులు వారిని అడ్డుకోవడం కోసం లాఠీఛార్జ్ చేశారు. ఈ సమయంలో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో నిర్వాహకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.