
నిజామాబాద్ కల్చరల్ (నిజామాబాద్‌అర్బన్) : ఇందూరు నగరంలో సోమవారం హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ సందడి చేశారు. నగర నడిబొడ్డున రాష్ట్రపతిరోడ్డులో గల కిసాన్ ఫ్యాషన్‌మాల్‌ను సోమ వారం ఆమె రిబ్బన్‌కట్ చేసి ప్రారంభించారు. కాజల్ వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న అభిమానులు భారీసంఖ్యలో ఉదయం 10 గంటలకే కిసాన్ మాల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ ఇందూరు నగరంలో మొట్టమొదటిసారిగా ఆధునిక వస్త్ర ప్రపంచాన్ని ఏర్పాటు చేసిన కిసాన్ ఫ్యాషన్ మాల్‌ను ఉమ్మడి జిల్లా ప్రజలు ఆదరించాలన్నారు. తాను నగరానికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు చక్కటి అవకాశాలు వస్తున్నాయన్నారు. కిసాన్ గ్రూపు చైర్మెన్ ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా మాట్లాడుతూ మారుతున్న కాలానికనుగుణంగా కస్టమర్లను సంతృప్తి పరచడానికి కిసాన్ ఫ్యాషన్ మాల్‌ను ప్రారంభించామన్నారు. 40 సంవత్సరాలుగా తమ పట్ల కస్టమర్లు చూపుతున్న ఆదరణ మరచిపోలేమని, ఇదే ఆదరాభిమానాలు మున్ముందు చూపాలని ఆయన కోరారు. దాదాపు 40 నిమిషాలపాటు ఉన్న కాజల్ ఆగర్వాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్‌లో కలియతిరిగారు. అనంతరం షోరూం నుంచి తిరిగి వెళ్తూ బయట ఉన్న అభిమానులకు హాయ్ చెప్పారు. కార్యక్రమంలో కిసాన్ ఫ్యాషన్ మాల్ యజమానులు ధన్‌పాల్ ప్రణయ్‌కుమార్, ఉదయ్‌కుమార్. నగర ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment