nizambad
-
నవతకు షాకిచ్చిన అధికారులు
-
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చిరుతల సంచారం
-
ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..
-
నిజామాబాద్ కు డి శ్రీనివాస్ భౌతికకాయం
-
అటవీ అధికారులపై గిరిజనుల దాడి
-
ప్రాణం తీసిన కొట్లాట...బీసీ హాస్టల్ లో దారుణం
-
నిజామాబాద్ లో ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
-
భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ
-
సోదమ్మ చెప్పిన మాటలకు అవాకైనా పోచారం శ్రీనివాస్
-
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ వాసి మృతి
-
స్ట్రెచర్ లేక రోగి కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లిన బంధువులు
-
కేంద్రం తీరుకు నిరసనగా రేపు తెలంగాణ వ్యాప్తంగా మహాధర్నాలు
-
ఖతర్‌లో అంతేనా.. కార్మికుల ప్రాణాలకు లెక్క లేదా
మోర్తాడ్ (బాల్కొండ): ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన ఖతర్ అన్ని దేశాల దృష్టిని ఆకర్షించింది. గత నెల 20న ప్రారంభమైన ఫుట్‌బాల్ పోటీలు ఈనెల 18తో ముగియనున్నాయి. ఫిఫా క్రీడా సంగ్రామంతో దాదాపు రూ.1.40 లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న ఖతర్.. తన గుర్తింపు కోసం రక్తం చిందించిన వివిధ దేశాల వలస కార్మికులను మాత్రం మరచిపోయిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఫిఫా కోసం చేపట్టిన వివిధ నిర్మాణాల్లో భాగస్వాములైన వలస కార్మికులు ప్రమాదాల వల్ల, పని ఒత్తిడితో అనారోగ్యానికి గురై మరణించిన ఘటనలు ఉన్నాయి. మరణించిన వలస కార్మికుల్లో తెలంగాణకు చెందిన వాళ్లే సుమారు వంద మంది వరకు ఉంటారని గల్ఫ్ జేఏసీ అంచనాల్లో తేలింది. ‘చనిపోయిన వారిని స్మరించుకుందాం–బతికి ఉన్నవారి కోసం పోరాడుదాం’ అనే నినాదంతో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో ఖతర్ ఫిఫా అమరులను స్మరిస్తూ నిజామాబాద్‌లో ఇటీవల సమావేశం నిర్వహించారు. ఖతర్‌లో ఫిఫా పనులు చేస్తూ మరణించిన వారి కుటుంబాలను ఐక్యం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఖతర్ సర్కార్‌కు బాధితుల గోడును వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ సింగిరెడ్డి నరేష్‌రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, గల్ఫ్ తెలంగాణ సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు బసంత్‌రెడ్డి, న్యాయవాది బాస రాజేశ్వర్‌లు బాధిత కుటుంబాలతో సమావేశమై వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిరాశపరిచిన విదేశాంగ శాఖ.. పార్లమెంట్ సమావేశాల్లో ఖతర్ మృతుల ఆంశంపై ఎంపీలు వెంకటేశ్ నేత బొర్లకుంట, డాక్టర్ రంజిత్‌రెడ్డి, మాలోవత్ కవిత ప్రస్తావించారు. ఇందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ సమాధానం ఇస్తూ ఖతర్ కార్మిక చట్టాల ప్రకారం మృతుల కుటుంబాలకు పరిహారం అందుతుందని తెలిపారు. కానీ మృతుల సంఖ్యను వెల్లడించలేదు. కనీసం ఎంత మందికి పరిహారం అందించారనే విషయంలోనూ స్పష్టత లేదు. ఎంపీలు అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సమాధానం అస్పష్టంగా ఉండటం బాధిత కుటుంబాలను నిరాశపరిచిందనే అభిప్రాయ వ్యక్తమవుతోంది. (క్లిక్ చేయండి: కొండగట్టు ఆంజనేయుని ‘వెనకనున్న’ ఆ దంపతులు ఎవరో తెలుసా!) -
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
మోర్తాడ్: వలస కార్మికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పరిధిలోని ఏడీఎన్‌హెచ్ కంపాస్ కంపెనీ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ సంస్థలో క్లీనింగ్ సెక్షన్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఫ్రీ రిక్రూట్మెంట్కు శ్రీకారం చుట్టింది. కార్మికులకు ఉచిత వీసాలతోపాటు విమాన టికెట్ చార్జీలను కూడా ఆ సంస్థే భరించనుంది. జీటీఎం ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14న జగిత్యాలలోని హోటల్ పీఎం గ్రాండ్లో, 15న నిజామాబాద్‌లోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ఆ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి కోలుకుంటున్న తరుణంలో వలస కార్మికులపై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండా ఉచితంగా వీసాలను జారీ చేయడానికి ఏడీఎన్‌హెచ్ కంపెనీ ఫ్రీ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహించడం ఇది రెండోసారి. క్లీనర్లుగా పని చేసే కార్మికులకు ప్రతి నెలా రూ.20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఉచిత వసతి, భోజనం లేదా అలవెన్సుల రూపంలో అదనంగా చెల్లిస్తారు. వలస కార్మికులను ఒకచోటు నుంచి మరో చోటుకు తరలించడానికి రవాణా సదుపాయాన్ని కూడా కంపెనీయే కల్పించనుంది. ఉచితంగా జారీ చేస్తున్న వీసాలకు కార్మికులు ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఏడీఎన్‌హెచ్ కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని యాజమాన్యం స్పష్టం చేసింది. కాగా, కష్టాల్లో ఉన్న వలస కార్మికులకు మేలు చేసేందుకు యూఏఈ కంపెనీ ఉచిత వీసాలు, విమాన టికెట్లను జారీ చేస్తుండడం హర్షించదగ్గ విషయమని పలువురు వలస కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్: రెవెన్యూలో పదోన్నతులు!) -
మట్టి కొట్టుకుపోతున్న రాజమహళ్లు, గడీలు
సాక్షి నెట్వర్క్: దర్పానికి, రాజసానికి దర్పణంగా నిలిచిన చారిత్రక కట్టడాలు నిర్లక్ష్యంతో శిథిలమై నిశీథిలోకి జారుకుంటున్నాయి. అబ్బుర పర్చే నిర్మాణ శైలికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి ఇప్పుడు నిర్వహణాలోపానికి తలవంచి మట్టికొట్టుకుపోతున్నాయి. రెండొందల ఏళ్ల సంస్థానాధీశుల పాలనలో అనేక ప్రత్యేకతలతో నిర్మాణమైన రాజమహళ్లు, గడీలుశిథిల వైభవానికి చిరునామాలవుతున్నాయి. 1948లో సంస్థానాల పాలన అంతమైన అనంతరం రాష్ట్రంలోని పలుచోట్ల సంస్థానాధీశులు ఆ భవనాలను ప్రజోపయోగ పనుల కోసం ప్రభుత్వానికి అప్పగించారు. వీటిల్లో గత యాభై ఏళ్లు సజావుగా కార్యకలాపాలు నిర్వహించారు. కానీ, కొంతకాలంగా వీటిలో కనీస నిర్వహణ కరువైంది. ఈ భవనాలు శిథిలమవుతున్న తీరుపై సంస్థానాధీశుల వారసు లతోపాటు చరిత్రకారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాల పరిరక్షణతో పర్యాటకం పెరగటమేకాక ఈ తరానికి ఆర్కిటెక్చర్‌కు సంబంధించి కొత్తపాఠాలు చెప్పినట్లు అవుతుందని వారు అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ఈ భవనాల వైభవాన్ని ముందు తరాలకు అందించేవిధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కళ చెదిరిన.. రంగ్ మహల్ వనపర్తిలో నూటాఏభై ఎనిమిది ఏళ్ల క్రితం సరికొత్త నిర్మాణశైలితో సంస్థానాధీశుని కోసం నిర్మితమైన ‘రంగుమహల్’ ఇప్పుడు కళ తప్పింది. హైదరాబాద్ స్టేట్‌లో సొంత కరెన్సీ– అరబ్బులుసహా భారీ సైనిక బల గాలతో 152 గ్రామాల్లో 605 చద రపు మైళ్లు కలిగిన అతిపెద్ద సంస్థానం వన పర్తి. ఎత్తైన గోపురాలతో విదేశీ శిల్పుల ఆధ్వర్యంలో 1849లో ప్రారంభమైన ఈ భవననిర్మాణం 1864లో పూర్తయింది. ఇండియాలో విలీనమైన అనంతరం చివరి సంస్థానాధీశుడు రాజారామేశ్వర రావు దీన్ని ప్రభుత్వానికి అప్పగించారు. దీనిలో 1958లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ చేతుల మీదుగా రాష్ట్రంలోనే తొలి పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. అయితే భవనం నిర్వహణ లోపాలతో ఈ మధ్య పెచ్చులూడిపోతుండటంతో క్లాసులను వేరే చోటికి తరలించి ప్రస్తుతం పరిపాలన, గ్రంథాలయం కోసం వినియో గిస్తున్నారు. కళాత్మకమైన ఆర్చీలు ఇప్పటికీ చెదరలేదు. అయితే నిర్వహణ లోపాలతో గడీ మొదటి అంతస్తు మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. తక్షణ మరమ్మతుల కోసం రూ.4.20 కోట్ల అంచనా వ్యయంతో ఫైలు ప్రభుత్వానికి పంపినా ఇప్పటివరకు ఆమోదం పొందలేదు. వనపర్తి సంస్థాన వారసురాలు నందినీరావు హైదరాబాద్‌లో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు నిలబెట్టుకున్న సిర్నాపల్లి 1910–13లలో నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లిలో ఇండో– యూరోపియన్ నిర్మాణశైలితో గడీ నిర్మితమైంది. సిమెంట్, స్టీల్, కాంక్రీట్ వాడకుండా ఈ గడీని నిర్మించడం విశేషం. గడీకి ముందు భాగంలో ఇరువైపులా ఎత్తైన గోపురాలు, మధ్యలో రాజసం ఉట్టిపడేలా గంభీరంగా చూస్తూ నిలుచున్న రెండు సింహాలు ఉంటాయి. ఈ గడీ నిర్మాణంలో పూర్తిగా మట్టి, ఇటుకలు, రాళ్లు, డంగుసున్నం, పొడవాటి ఇనుప స్తంభాలు ఉపయోగించారు. గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేందుకు వీలుగా ముఖద్వారం ఉత్తరం వైపు ఉండేలా నిర్మాణం చేపట్టారు. నిర్మాణ శైలి, వాడిన పదార్థాల మూలంగా ఈ గడిలో ఉష్ణోగ్రతలు సమతూకంగా ఉంటాయి. చలికాలం వెచ్చగా, వేసవికాలం చల్లగా ఉంటుంది. 1921లో జానకీబాయి మరణానంతరం బందిపోట్లు, రజాకార్ల దాడుల్లో ఇతర బంగ్లాలు ధ్వంసమైనప్పటికీ గడీ మాత్రం పటిష్టంగానే ఉంది. తదనంతర కాలంలో ఇది దాదాపు మూడు దశాబ్దాలకుపైగా ప్రభుత్వ పాఠశాలగా సేవలు అందించింది. దీనిని శీలం జానకీబాయి వారసులు గ్రామస్తుల విరాళాలతో కాపాడుకుంటూ వస్తున్నారు. గ్రామస్తులు రూ.20 వేల విరాళాలు, జానకీబాయి వారసురాలు అనురాధారెడ్డి రూ.60 వేలు అందించారు. గ్రామ పంచాయతీ నుంచి మరో రూ.5 లక్షలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించి పెయింటింగ్ వేయించారు. ఉపాధిహామీ కింద దీనికి ఒక వాచ్‌మన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ గడీని పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థుల కోసం గ్రంథాలయంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. జానకీబాయి వారసురాలు అనురాధారెడ్డి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. దొంగల పాలైన.. ఇందారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గడీ దొంగల పాలైంది. దేశ, విదేశాల నుంచి తెచ్చిన విలువైన సామగ్రి, కలపను ఎత్తుకుపోయారు. నిజాంరాజుకు నమ్మినబంటు అయినా గోనె వెంకట ముత్యంరావు ఆధ్వర్యంలో ఈ గడీని 1927లో హైదరాబాద్ స్టేట్‌లోనే ఓ ప్రత్యేకత శైలితో నిర్మించారు. ఈ గడీ కేంద్రంగా సిరోంచ, గడ్చిరోలి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 300 గ్రామాల పాలన సాగేది. 1948లో నిజాం లొంగుబాటు తర్వాత గోనె వెంకట ముత్యంరావు కుటుంబం హైదరాబాద్‌కు తరలివెళ్లింది. (క్లిక్: తెలంగాణకే తలమానికం! ట్విన్ టవర్స్) టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటు చేయాలి ‘200 ఏళ్ల క్రితమే హైదరాబాద్ స్టేట్‌లో అత్యున్నత శైలిలో భవనాలు నిర్మించారు. అన్ని ప్రాంతాల్లోని సంస్థాన భవనాలపై ప్రభుత్వం తక్షణ శ్రద్ధ చూపి టూరిజం సర్క్యూట్‌గా ప్రమోట్ చేయాలి. దీనివల్ల ఆయా ప్రాంతాల ప్రాచుర్యంతోపాటు అనేకమందికి ఉపాధి కేంద్రాలుగా మారుతాయి’ –అనురాధారెడ్డి, కన్వీనర్, ఇంటాక్ -
బీజేపీ ఎంపీ అరవింద్ పర్యటన నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరద
-
నిజామాబాద్ జిల్లాలో చిరుత పులి కలకలం
-
ఆడబిడ్డ అయితే ‘సీత కష్టం’.. మగబిడ్డ అయితే 'రామ రామ'
సాక్షి, కామారెడ్డి: ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కౌసల్య ఆస్పత్రి గుట్టు రట్టయింది. లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు ఇష్టారీతిన అబార్షన్లు చేస్తున్న వైనాన్ని అధికార యంత్రాంగం బట్టబయలు చేసింది. ఆస్పత్రిని సీజ్ చేసి, యాజమాన్యంపై కేసు నమోదు చేసింది. కామారెడ్డిలోని శ్రీరాంనగర్ కాలనీలో గల కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొంత కాలంగా గర్భస్థ పిండ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా జరుగుతున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర స్థాయి నోడల్ అధికారి డాక్టర్ సూర్యశ్రీ, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో గురువారం ‘డెకాయ్ ఆపరేషన్’ నిర్వహించారు. అక్కడ గర్భిణికి లింగ నిర్ధారణ స్కానింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఆడో, మగో నిర్ధారించి చెబుతున్న విషయాన్ని గమనించి దాడులు నిర్వహించారు. స్కానింగ్ కూడా ఎలాంటి అర్హత లేని వ్యక్తులు నిర్వహిస్తుండడం, లింగ నిర్ధారణ నిబంధనలకు విరుద్ధంగా చేస్తుండడంతో ఆస్పత్రిలో సోదాలు నిర్వహించారు. ఆస్పత్రిలో అబార్షన్లు కూడా నిర్వహిస్తుండడం, స్కానింగ్ సెంటర్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడం వంటి విషయాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యంపై పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ ప్రకారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తెలిపారు. కోడ్ భాషలో చెప్పేస్తారు.. కౌసల్య ఆస్పత్రిలో కొంత కాలంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. కడుపులో పెరుగుతున్నది ఆడ బిడ్డ అయితే ‘సీత కష్టం’ అని, మగ బిడ్డ అయితే ‘రామ రామ’ అని కోడ్ భాషలో చెబుతారు. సీత కష్టం అనగానే చాలా మంది అబార్షన్ చేసుకోవడానికి డాక్టర్‌తో ధర మాట్లాడుకుంటున్నారు. ‘రామ రామ’ అని చెప్పడంతో ఆనందంతో ఇళ్లకు వెళ్లి పోతున్నారు. ఈ ఆస్పత్రి వ్యవహారంపై పలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ, సరైన ఆధారాలు లేక అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఇటీవల కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సరిహద్దులు దాటి వస్తున్నారు.. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, బోధన్ ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లా నారాయణఖేడ్, జహీరాబాద్, మహారాష్ట్రలోని దెగ్లూర్, నాందేడ్, ధర్మాబాద్, ఔరద్ తదితర ప్రాంతాల నుంచి కూడా లింగ నిర్ధారణ పరీక్షల కోసం ఇక్కడకు వస్తున్నారు. ఆడ బిడ్డ అని తెలిస్తే అబార్షన్లు చేయించుకుంటున్నారు. ఈ ఆస్పత్రిలో ఎలాంటి అర్హతలు లేని వారు అబార్షన్లు చేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, అబార్షన్లకు రూ.20 వేల నుంచి రూ.50 వేల దాకా వసూలు చేసినట్లు తెలిసింది. మాజీ ప్రజాప్రతినిధే అన్నీ.. రాజంపేట మండల కేంద్రానికి చెందిన గ్రామ మాజీ ప్రజాప్రతినిధి ఈ ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఎలాంటి అర్హలు లేకున్నా తనే రేడియాలజిస్టు అవతారం ఎత్తి స్కానింగ్‌లు చేయడం, లింగ నిర్ధారణ వివరాలు బయటకు చెబుతూ దండుకుంటున్నట్టు అధికారుల తనిఖీల్లో వెలుగు చూసింది. వైద్యుల కుటుంబానికి చెందిన సదరు ఆస్పత్రి యజమాని సొంతంగా ఆస్పత్రిని ఏర్పాటు చేసుకుని ఈ దందా నిర్వహిస్తున్నట్టు సమాచారం. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లతో అడ్డగోలుగా సంపాదించిన సదరు యజమాని.. శ్రీరాంనగర్ కాలనీలోనే సొంత భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఆస్పత్రి సీజ్, యజమానిపై కేసు.. కౌసల్య ఆస్పత్రిపై ఫిర్యాదులు రావడంతో దాడులు నిర్వహించిన అధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు. యజమాని సిద్దిరాములుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడుపులో పెరుగుతన్న బిడ్డ ఆడ, మగ అని నిర్ధారించడం చట్టరీత్యా నేరమని రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూర్యశ్రీ తెలిపారు. స్కానింగ్ చేసిన వారితో పాటు ప్రోత్సహంచిన వారు శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. ఆడ పిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గడానికి ఇలాంటి లింగ నిర్ధారణ పరీక్షలే కారణమని పేర్కొన్నారు. ప్రత్యేక బృందాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడతామని ఆమె చెప్పారు. -
నిర్మల్ జిల్లాలో భారీ వర్షం
-
పురుగుల మందు తాగి నూతన జంట ఆత్మహత్యా యత్నం
-
గుట్టుగా గుట్కా స్మగ్లింగ్
-
ప్రియుడి ఇంట్లో ప్రియురాలి ఆత్మహత్యాయత్నం
సాక్షి,నిజామాబాద్: ప్రేమికుడి ఇంట్లో ప్రియురాలు పినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఒక యువకుడు ఏడాది కిందట ఒక అమ్మాయిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం సదరు అమ్మాయి తన ఇంట్లో వాళ్లకు చెప్పకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వేరే పెళ్లి చేశారు. అమ్మాయికి పెళ్లి అయిన రెండో రోజునే ఆ అధికారి ఆమె ఇంటికి వచ్చి రహస్యంగా ఆమెను నగరంలోనే మరో ఇంట్లో ఉంచి పరారయ్యాడు. అయితే అమ్మాయి తాను మోసపోయానని భావించి తల్లిదండ్రులకు విషయం వివరించింది. దీంతో సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఆ యువకుడి ఇంట్లో వదిలివెళ్లారు. తాను మోసపోయాననే అవమానభారం తట్టుకోలేక ప్రియుడి ఇంట్లోనే ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: పోలీసుల కళ్లెదుటే వ్యక్తి గుండెల్లో పొడిచి.. -
చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య
-
నిజామాబాడ్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
-
గిరాకీ కోసం ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల దుర్మార్గం
-
ఎస్సారెస్పీకి అరుదైన గుర్తింపు
సాక్షి,నిజామాబాద్: కనువిందు చేసే కృష్ణజింకలు, ఫ్లెమింగో, ఫెలికాన్ వంటి విదేశీ పక్షుల కిలకిలలతో శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతం ఇకపై వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా మారనుంది. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రాంతాన్ని ‘కమ్యూనిటీ రిజర్వు’గా ఏర్పాటు చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (పీసీసీఎఫ్) కార్యాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు జిల్లా అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రతిపాదిత ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని పీసీసీఎఫ్ శోభ శుక్రవారం పరిశీలించారు. కృష్ణజింకల గంతులు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లో శ్రీరాంసాగర్ జలాశయం బ్యాక్‌వాటర్ ప్రాంతం సుమారు నాలుగు వేల ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గినప్పుడు ఈ ప్రాంతమంతా పచ్చిక బయళ్లుగా మారుతుంది. కనుచూపు మేర పచ్చదనం పరుచుకుంటోంది. ఆహారం కోసం గుంపులు గుంపులుగా సంచరించే కృష్ణజింకలు కనువిందు చేస్తుంటాయి. ప్రతిరోజు సూర్యోదయం అవుతుంటే చాలు సమీపంలోని గుట్టల చాటు నుంచి బయటకు వస్తున్నాయి. రాజస్తాన్, కర్నూల్ జిల్లాలో ఉన్న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల్లో మాత్రమే కనిపించే ఈ జింకలు ఇక్కడ సుమారు 30 వేల వరకు ఉంటాయని అటవీశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రజల భాగస్వామ్యంతో.. నూతనంగా ఏర్పాటు చేయనున్న కమ్యూనిటీ రిజర్వును ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించనున్నారు. నందిపేట్ మండలం జీజీ నడుకుడ గ్రామంతో పాటు సమీప గ్రామాల ప్రజలతో ప్రత్యేకంగా ఓ కమిటీని నియమిస్తారు. సంరక్షణ కేంద్రం నిర్వహణ బాధ్యతలను కమిటీకి అప్పగిస్తారు. అలాగే.. పర్యాటకుల సౌకర్యం కోసం వ్యూ పాయింట్ వంటివి ఏర్పాటు చేస్తారు. కమ్యూనిటీ రిజర్వు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారి సునీల్ హీరేమత్ ‘సాక్షి’కి తెలిపారు. -
కారు పార్టీలో చిచ్చు.. రచ్చకెక్కిన విభేదాలు
సాక్షి, నిజామాబాద్ : అధికార పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. టీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు బట్టబయలవుతోంది. సోమవారం నందిపేట్ మండలం లక్కంపల్లి సెజ్‌లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఓ ప్రైవేట్ బయో ప్లాస్టిక్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదంతో ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. కార్యక్రమానికి రాకుండా తనను పోలీసులతో అడ్డగించారని ఎమ్మెల్యేపై విఠల్‌రావు మండిపడ్డారు. దీంతో మంత్రి ప్రశాంత్‌రెడ్డి కలగజేసుకుని ఇరువురిని సముదాయించాల్సి వచ్చింది. ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్సీ కవిత, జిల్లా ముఖ్యనేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుతోంది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, పల్లె ప్రగతి కార్యక్రమాల నిర్వహణలో ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ మాక్లూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఈ పంచాయితీ సీఎం కేసీఆర్ దృష్టికి కూడా వెళ్లినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా సోమవారం జరిగిన ఘటన పార్టీలో అంతర్గత పోరును బయట పెట్టింది. నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్ నాయకుడు ఏఎస్ పోశెట్టి గత ఎన్నికల వేళ ఏకంగా ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాపై విమర్శనాస్త్రాలు సంధించారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మధ్య ఉప్పు.. నిప్పు.. అన్న చందంగా పోరు నడిచిన సంగతి తెలిసిందే. భూపతిరెడ్డి టీఆర్ఎస్ను వీడటంతో ఇక్కడ ఆధిపత్య పోరుకు తెరపడినట్లయింది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్కొండలో అంతర్గత పోరు ఇప్పటి వరకు బట్టబయలు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో ఇక్కడ ఇద్దరు అగ్రనేతల మధ్య కొంత ఆధిపత్య పోరు తలెత్తే అవకాశాలున్నట్లు అప్పట్లో ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పటి వరకు అలాంటి ఘటనలేవీ బయటకు రాలేదు. మిగతా నియోజకవర్గాల్లోనూ.. అధికార పార్టీలో అంతర్గత పోరు ఒక్క ఆర్మూర్ నియోజకవర్గానికే పరిమితం కాలేదు. ఇతర నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. బోధన్‌లోనూ స్థానిక ఎమ్మెల్యే షకీల్ అమేర్, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శరత్‌రెడ్డి మధ్య కూడా ఆధిపత్య పోరు నడుస్తోంది. వీరి మధ్య విభేదాలు ఇప్పటి వరకు ఇలా బహిర్గతం కాకపోయినప్పటికీ, బోధన్ మున్సిపాలిటీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల జోక్యంపై శరత్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
‘సౌమ్య’.. గ్రౌండ్లోకి దిగితే చిచ్చరపిడుగే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పేరులోనే ‘సౌమ్య’.. గ్రౌండ్లోకి దిగితే చిచ్చరపిడుగే.. కృషి, పట్టుదలతో ఫుట్‌బాల్ క్రీడలో రాణిస్తోన్న గుగులోత్ సౌమ్య.. పందొమ్మిదేళ్లకే భారత సీనియర్ మహిళల జట్టులో చోటు దక్కించుకున్న పిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కింది. ఈ నెల 14 నుంచి టర్కీలో జరిగే అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీల్లో భారత జట్టు తరఫున ఆడనుంది. గోవాలో 20 మందితో కూడిన తుది జట్టును బుధవారం ప్రకటించగా, అందులో సౌమ్య చోటు సంపాదించింది. 30 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి భారత సీనియర్ మహిళల జట్టుకు ఎంపికైన క్రీడాకారిణిగానూ సౌమ్య ఘనత సాధించింది. సౌమ్య స్వస్థలం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కిసాన్‌నగర్ తండా. నిజామాబాద్ కేర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. తండ్రి గుగులోత్ గోపి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి ధనలక్ష్మి గృహిణి. ఇద్దరు అక్కలు, తమ్ముడు ఉన్నారు. అండర్–14 నుంచి.. నేపాల్‌లో జరిగిన అండర్ 14 ఫుట్‌బాల్ పోటీల్లో భారత జట్టు తరఫున తొలిసారిగా ఆడిన సౌమ్య.. ఆపై చైనాలో అండర్ 16, మయన్మార్‌లో అండర్ 19 పోటీల్లో ఆడి ప్రతిభ చాటింది. దక్షిణాఫ్రికాలో 2019లో జరిగిన అండర్ 17 పోటీల్లో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించింది. భారత సీనియర్ మహిళల జట్టులో చోటు కోసం 11 నెలలు ప్రాక్టీస్ చేసింది. లాక్డౌన్లో క్రీడా ప్రాంగణాలన్నీ మూసివేసినా.. ప్రత్యేక అనుమతితో నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసింది. సోదరి వివాహానికీ హాజరుకాకుండా ప్రాక్టీస్‌ను కొనసాగించిందని కోచ్ నాగరాజు ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. వేగమే ఆమె బలం.. ఫుట్‌బాల్ గ్రౌండ్లో సౌమ్య కదలికలు చాలా వేగంగా ఉంటాయి. సీనియర్ జట్టులో చోటు కోసం కఠోరంగా శ్రమించింది. రోజూ ఆరు గంటల పాటు ప్రాక్టీస్ చేసేది. ఎలాగైనా గోల్ కొట్టాలనే కసి, అగ్రెసివ్నెస్ ఆమెకు కలిసొస్తున్నాయి. – గొట్టిపాటి నాగరాజు, కోచ్ నమ్మలేకపోయా.. భారత సీనియర్ జట్టుకు ఎంపికైనట్టు సౌమ్య ఉదయం ఫోన్‌చేసి చెప్పింది. మొదట నమ్మలేదు. జట్టులో చోటుకోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది సీనియర్లు పోటీపడతారు. అలాంటి జట్టుకు నా కుమార్తె ఎంపిక కావడం గర్వకారణం. – గుగులోత్ గోపి, సౌమ్య తండ్రి చిన్న వయసులోనే.. ఆటలో మాకంటే ప్రతిభ చూపడం వల్లే సౌమ్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. సౌమ్య భారత సీనియర్ మహిళల జట్టులో చిన్న వయసులోనే చోటు సంపాదించింది. – మేఘన, ఫుట్‌బాల్ క్రీడాకారిణి -
పెళ్లి మంటపంపైనే నగలు చోరీ
డిచ్పల్లి : వివాహ వేదికపైనే సుమారు 35 తులాల బంగారు ఆభరణాలను దొంగలు రెప్పపాటులో దోచుకెళ్లారు. ఆనందంగా పెళ్లి వేడుకలో మునిగిన వరుడు, వధువు, వారి బంధువులు ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. సిద్దిపేటకు చెందిన ఫణీంద్రకు, మహారాష్ట్ర ఉమ్రికి చెందిన కావ్యతో డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని బృందావనం గార్డెన్స్‌లో బుధవారం పెళ్లి జరిగింది. పెళ్లి జరగుతున్న సమయంలో 25, 30 ఏళ్ల వయసున్న ఇద్దరు గుర్తు తెలియని యువకులు వచ్చి ముందు వరస కుర్చీల్లో కూర్చున్నారు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత వధువు ఫొటోలు దిగేందుకు తన బంగారు నగలను తరచూ మార్చుతూ ఉంది. నగలను సమీప బంధువైన ఓ మహిళ వద్ద ఉన్న బ్యాగులో ఉంచారు. ఇంతలో ఇద్దరు దొంగల్లో ఒకరు స్టేజీ పైకి చేరుకుని నగలు పట్టుకున్న మహిళకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ మహిళ మైకంలో ఉన్న సమయంలోనే ఆమె వద్ద ఉన్న నగల బ్యాగును ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని ఇద్దరు దొంగలు క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించారు. కొద్దిసేపటికి మైకం నుంచి కోలుకున్న మహిళ నగల బ్యాగు కన్పించక పోవడంతో ఆందోళనగా విషయాన్ని పెళ్లి వారికి తెలిపింది. దీంతో అప్పటివరకు ఎంతో హుషారుగా సాగుతున్న పెళ్లి వేడుకలో ఒక్కసారిగా కలకలం రేగింది. చోరీకి గురైన నగల విలువ సుమారు రూ.20 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సురేశ్‌కుమార్ సీసీ టీవీ పుటేజీలతో పాటు పెళ్లి వేడుకల్లో రికార్డు చేసిన వీడియోలను పరిశీలించి ఇద్దరు అనుమానితులను గుర్తించారు. -
'నీ చెల్లిని కాపురానికి పంపిస్తే ఇంట్లోకి రానిస్తా'
సాక్షి, నిజామాబాద్ : భార్య బతికి ఉండగానే ఆమె చెల్లిపై కన్నేశాడు ఒక ప్రబుద్దుడు. అంతటితో ఆగకుండా ఆమె చెల్లిని బలవంతంగా పెళ్లి చేసుకొని భార్య సహా తన నలుగురు పిల్లలను ఇంట్లో నుంచి గెంటేశాడు. చెల్లిని కాపురానికి పంపిస్తేనే ఇంట్లోకి అనుమతిస్తానని చెప్పాడు. భర్త మాటలు నమ్మి చెల్లిని తీసుకువచ్చిన భార్యకు మరో షాక్ తగిలింది. వీరిద్దరిని కాదని మరో మహిళను వివాహం చేసుకొని కాపురం చేస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన మహిళ, తన చెల్లి, నలుగురు పిల్లలతో కలిసి తనకు న్యాయం చేయాలంటూ అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమె చేస్తున్న నిరసనకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. మహిళల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేహశుద్ది చేశారు. ఈ ఘటన నిజామాబాద్‌లోని విద్యుత్ నగర్ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఆర్మూర్ మండలం మగ్గిడికి చెందిన హారికకు.. నిజామాబాద్ విద్యుత్ నగర్ కు చెందిన గల్ఫ్ ఏజెంట్ కృష్ణ కు 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా నలుగురు పిల్లలు పుట్టాక హారిక చెల్లెలిపై కన్నేసిన కృష్ణ ఆమెను బలవంతంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. మరోవైపు తన చెల్లితో పాటు మరో మహిళను కూడా పెళ్లి చేసుకున్నాడని హారిక ఆరోపించింది. తన చెల్లిని కాపురానికి పంపిస్తే ఇంట్లోకి రానిస్తానని చెప్పిన కృష్ణ ఇప్పుడు మాట మార్చి ఇంట్లోంచి గెంటేశారని కన్నీటి పర్యంతం అయ్యింది. హారికతో పాటు ఆమె చెల్లి కూడా అక్క ఆందోళనకు మద్దతు తెలుపుతూ కృష్ణ ఇంటిముందు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. -
ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా
సాక్షి, నిజాంసాగర్ (జుక్కల్) : దీపావళి నాడు సరదా కోసం నిజాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన ఇద్దరు స్నేహితులు సెల్ఫీ మోజులోపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ మన్నన్, పిట్ల ప్రశాంత్, సయ్యద్ సుమేర్, చెగుళ్ల బాలరాజు, కటికె శివ స్నేహితులు. శనివారం కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన వీరు నీటి మడుగుల వద్ద బండరాళ్లపైకి వెళ్లారు. ప్రాజెక్టు వరద గేట్ల నుంచి దిగువకు నీరు జాలు వారుతుండటంతో మడుగుల్లో సెల్ఫీలు దిగుతూ స్నానాలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో మడుగుల లోతు అధికంగా ఉండటంతో శివ, సయ్యద్ సుమేర్ ఈతరాక నీటమునిగి పోయారు. అనంతరం పోలీ సులు గజ ఈతగాళ్లతో గాలించగా ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి. విహారయాత్రకు వచ్చి... ఎడపల్లి(బోధన్): సెల్ఫీమోజు ముగ్గురు బాలికల ప్రాణాలను బలితీసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్ ఉద్యానవనంలోని చెరువులో ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బోధన్ రాకాసిపేటకు చెందిన జుబేరా (10) ఇంటికి నిజామాబాద్ నుంచి మీరజ్ బేగం(16), హైదరాబాద్ నుంచి బషీరా బేగం (16) తమ కుటుంబసభ్యులతో వచ్చారు. ముగ్గురి కుటుంబాలకు చెందిన మొత్తం ఎనిమిది మంది అలీసాగర్ ఉద్యానవనానికి విహార యాత్రకు వెళ్లారు. అబ్దుల్‌తో పాటు ఈ ముగ్గురు పిల్లలు స్నానాలు చేయడానికి చెరువులోకి దిగారు. ఈ క్రమంలో సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు లోతైన ప్రదేశంలోకి జారిపోయి నీట మునిగారు. వీరిని గమనించిన కుటుంబ సభ్యులు సహాయం కోసం కేకలు వేయడంతో సమీపంలో ఉన్న బోటింగ్ పాయింట్ సభ్యుడు నగేష్ , చెరువులో చేపలుపడుతున్న జాలరి గంగాధర్ నీట మునుగుతున్న యువకుణ్ణి రక్షించగలిగారు. అప్పటికే బాలికలు నీట మునిగి మృతి చెందారు. పుట్టినరోజు వేడుకల్లో విషాదం వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం మరికాల గ్రామ సమీపంలోని గోదావరిలో మునిగి నలుగురు యువకులు మృతి చెందారు. వెంకటాపురం మండల పరిధి రంగరాజాపురం కాలనీకి చెందిన శశికుమార్ పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి శనివారం గ్రామానికి చెందిన 21 మంది యువకులు పాతమరికాల గ్రామ సమీపంలోని గోదావరి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 16 మంది సరదాగా నదిలోకి ðదిగారు. కొంతసేపటికి ప్రవాహం పెరగడంతో తుమ్మ కార్తీక్ (21), సంఖ్యా శ్రీకాంత్ (22), రాయవరపు ప్రకాశ్ (22), కోడిరెక్కల అన్వేశ్ (21) నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన మిగతా మిత్రులు ఒడ్డుకు వచ్చారు. సాయంకోసం అరుపులు, కేకలు పెట్టడంతో చుట్టు పక్కల రైతులు అక్కడికి చేరుకున్నారు. వారు వచ్చసరికే ఆ నలుగురు పూర్తిగా మునిగిపోయారు. అనంతరం గజ ఈతగాళ్లతో గాలించగా.. శనివారం రాత్రి రెండు, ఆదివారం ఉదయం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. చెక్‌డ్యాంలో పడి ఇద్దరి మృతి న్యాల్కల్(జహీరాబాద్) : ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని రేజింతల్‌లో శనివారం చోటు చేసుకుంది. ఈనెల 13న గ్రామానికి చెందిన ఫకీర్ ఇస్మాయిల్ కుమారుడు సాజిద్, నాగేందర్ కుమారుడు రాకేష్ మేకలు మేపడానికి వెళ్లారు. రాత్రి వరకు ఇద్దరూ ఇంటికి తిరిగి రాలేదు. కానీ మేకలు మాత్రం ఇంటికి వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. కాగా 14వ తేదీ ఉదయం గ్రామ శివారులోని చెక్‌డ్యాంలో సాజిద్ (14) మృతదేహం కనిపించింది. చెక్‌డ్యాంలో నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల రాకేశ్ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు ఆదివారం ఉదయం రాకేష్ (18) మృతదేహం లభించింది. -
జవాన్ మహేశ్ కుటుంబానికి రూ.50 లక్షల సాయం
సాక్షి, హైదరాబాద్ : సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ మహేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన యోధుడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంగళవారం పేర్కొన్నారు. జవాన్ మహేశ్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం, అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని ప్రకటించారు. -
కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు : కవిత
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించడం పట్ల కల్వకుంట్ల కవిత ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయానికి కృషి చేసిన తెరాస ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు, ఎంపీలు, జడ్పిటిసి, ఎంపీపీ, కార్పొరేటర్, కౌన్సిలర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత కల్వకుంట్ల ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది. దీంతో 14వ ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. (నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం) ఇక కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు కోల్పోయాయి. టీఆర్ఎస్కు 728 ఓట్లు రాగా బీజేపీకి 56, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చాయి. పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కవితకు అభినందనలు తెలుపుతున్నారు. రీఎంట్రీ టూ యాక్టీవ్ పాలిటిక్స్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.టీఆర్ఎస్ విజయంతో నిజామాబాద్, కామారెడ్డిలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాణాసంచాలు పేలుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. (కేబినెట్లోకి కవిత: ఎవరికి చెక్‌పెడతారు..!) -
అన్నదమ్ములపై పిడుగుపాటు
సాక్షి, కామారెడ్డి : జిల్లాలో పిడుగుపాటుకు ఓ బాలుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్లారెడ్డి ఇంతలో చెట్టుపై పిడుగు పడటంతో వినయ్ (14) మృతి చెందాడు. సుమన్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వినయ్ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భూ తగదాలు, ఒకరు మృతి సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మాన్సాన్పల్లిలో అన్నదమ్ముల మధ్య భూ తగాదాల నేపథ్యంలో కత్తిపోట్లతో ఒకరు మృతి చెందారు. పత్తి చేను వద్ద జరిగిన ఘర్షణలో రాములు అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు మోహరించారు. వీడిన మహిళ హత్య మిస్టరీ నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో మహిళ హత్య మిస్టరీ వీడింది. జగిత్యాల మండలం ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామానికి చెందిన రజితను గంగాధర్ అనే వ్యక్తి పరిచయం పెంచుకొని ఆమెను హత్య చేసి నగలు చోరీ చేశాడు. కాగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు ఇబ్రహీంపట్నం సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. -
ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
సాక్షి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఈసారి వంద శాతం పోలింగ్ నమోదు అయింది. జిల్లావ్యాప్తంగా 50 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 824మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 24మంది పీపీఈ కిట్లతో వచ్చి మరీ ఓటు వేశారు. ఇక ఎమ్మెల్సీ బరిలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత కల్వకుంట్ల పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి పోతన్కర్ లక్ష్మీ నారాయణ బరిలో ఉన్నారు. ఫలితాలు ఈ నెల 12న ప్రకటించనున్నారు. 99.64% పోలింగ్ శాతం నమోదు మొత్తం 824 ఓట్లకి 821 ఓట్లు పోల్ మిగతా ముగ్గురు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగం చివరి గంటలో ఓట్లు వేసిన కరోనా పాజిటివ్ వచ్చిన ప్రజా ప్రతినిదులు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ఈనెల 12న ఓట్ల లెక్కింపు -
దారుణం.. కూతుళ్లను తార్చిన తల్లి
సాక్షి, కామారెడ్డి : సభ్య సమాజం జీర్ణించుకోలేని దారుణం.. అంగీకరించ మనసొప్ప ని వాస్తవం.. కన్న బిడ్డల్ని ఒడిలో దాచుకో వాల్సిన తల్లే వాళ్ల జీవితాలను తాకట్టు పెట్టింది. అమ్మతనానికే మాయని మచ్చను తెచ్చింది. తన వక్ర బుద్ధితో కూతుళ్ల జీవితాలను నాశనం చేసింది. ఇద్దరు కూతుళ్లలో ఒకరు మైనర్ కావడం గమనార్హం. ఇక, మరో ఘటనలో పదేళ్ల బాలికపై 45 ఏళ్ల వయస్సున్న వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. సభ్య సమాజానికి మాయని మచ్చగా మిగిలిన ఈ రెండు ఘటనలు రెండు రోజుల వ్యవధిలో జరిగాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే, పెద్ద కూతుర్ని మెదక్ జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్‌తో పాటు మరొక యువకుడి దగ్గరకు తరచూ పంపించేది. కొంత కాలానికి పెద్ద కూతురు వారి బారిన పడకుండా తప్పించుకుంది. అయితే, అభం శుభం తెలియని చిన్న కూతురిపైనా నిందితుల కన్ను పడింది. వారు ఏది చెబితే అది చేసే ఆ తల్లి.. చిన్న కూతురిని కూడా వాళ్ల దగ్గరకు పంపించేది. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని అమాయకత్వంలో ఉన్న ఆ అమ్మాయి జీవితాన్ని నిందితులు నాశనం చేశారు. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతోంది. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన తండ్రి ఇంటికి రావడంతో పిల్లలు తమ బాధను తండ్రితో చెప్పుకున్నారు. ఆ తర్వాత బాధిత బాలిక, యువతి జిల్లా ఎస్పీ శ్వేతను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని మొర పెట్టుకున్నారు. కన్న తల్లి తమ జీవితాలను ఎలా నాశనం చేసిందో వివరించారు. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన ఎస్పీ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీసులను ఆదేశించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి విచారిస్తున్నారు. పిల్లలను తార్చిన తల్లితో పాటు నిందితులైన కానిస్టేబుల్, మరో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. పదేళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడో దుండగుడు. దేవునిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పదేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం జరిపిన ఘటన మూడు రోజుల క్రితం జరిగింది. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఆగని అఘాయిత్యాలు.. బాలికలు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగిన ఘటనల్లో పోలీసు యంత్రాంగం పకడ్బందీగా కేసులు నమోదు చేస్తోంది. నిందితులు చట్టం నుంచి తప్పించుకోకుండా ప్రయత్నిస్తోంది. మహిళలపై అత్యాచారాల కేసుల్లో ఎస్పీ శ్వేత ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నిందితులకు శిక్ష పడేలా చూస్తున్నారు. ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదన్న రీతిలో అత్యాచార సంఘటనలను తనే స్వయంగా పర్యవేక్షిస్తూ పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో కేసులు బలంగా ఉండి నిందితులు తప్పించుకోలేకపోతున్నారు. వారికి శిక్షలు పడుతున్నాయి. చాలా వరకు పోక్సో కేసులు నమోదవుతున్నాయి. నిందితులకు శిక్షలు పడుతున్నా అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇలాంటి ఘటనలు సమాజానికి మాయని మచ్చగా మిగులుతున్నాయి. బాలికలు, మహిళలపై అత్యాచారాల ఘటనలు జరగకుండా నిలువరించేందుకు పోలీసు శాఖ మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
మృతదేహాలు తారుమారు
ఇందల్వాయి/భిక్కనూరు: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం వల్ల మృతదేహాలు తారుమారయ్యాయి. మృతదేహాన్ని చితిపై ఉంచి నిప్పు పెట్టే సమయంలో ఆస్పత్రి నుంచి ఫోన్ రావడంతో ఆఖరి నిమిషంలో అంత్యక్రియలు ఆగిపోయాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన అంకం హన్మాండ్లు (58)కు కరోనా సోకడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. మూడు రోజుల తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు 11 రోజుల క్రితం హైదరాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ హన్మాండ్లు గురువారం రాత్రి మృతి చెందాడు. అయితే, చికిత్సకు రూ.10 లక్షలకు పైగా బిల్లు కాగా, అది చెల్లించే వరకూ మృతదేహాన్ని ఇవ్వమని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం రోజంతా డబ్బు కోసం ఇబ్బందులు పడ్డారు. చివరకు శనివారం ఉదయం బిల్లు చెల్లించగా, కరోనా నిబంధనల మేరకు ఆస్పత్రి యాజమాన్యం మృతదేహాన్ని పూర్తిగా ప్యాక్ చేసి, కుటుంబ సభ్యులకు అప్పగించింది. చివరి నిమిషంలో ఆగిన అంత్యక్రియలు మృతదేహాన్ని అంబులెన్సులో గన్నారం తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు.. చితి పేర్చి, దానిపై ఉంచారు. మరో రెండు నిమిషాల్లో చితికి నిప్పంటిస్తారనగా, అంబులెన్స్ డ్రైవర్‌కు ఆస్పత్రి యాజమాన్యం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మృతదేహాలు తారుమారయ్యాయని,, హన్మాండ్లు మృతదేహానికి బదులు మరొకరిది ఇచ్చినట్లు ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపారు. దీంతో చివరి నిమిషంలో అంత్యక్రియలు ఆగిపోయాయి. మృతదేహాన్ని తిప్పి పంపించాలని ఆస్పత్రి సిబ్బంది కోరగా, కుటుంబ సభ్యులు నిరాకరించారు. హన్మాండ్లు మృతదేహం తీసుకొచ్చే వరకూ ఈ మృతదేహాన్ని అప్పగించబోమని స్పష్టం చేశారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది మరో అంబులెన్స్‌లో హన్మాండ్లు మృతదేహాన్ని తరలించింది. సుమారు నాలుగు గంటల తర్వాత మృతదేహం గన్నారం చేరుకుంది. ప్యాకింగ్ తెరిచి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించగా.. వారు తమదేనని నిర్ధారించుకున్నారు. అప్పటికే చితిపై ఉంచిన మోహన్‌గౌడ్ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసి అంబులెన్స్‌లోకి మార్చి, హన్మాండ్లు అంత్యక్రియలు పూర్తి చేశారు. నిర్లక్ష్యం వల్లే.. హన్మాండ్లు మృతదేహమని చెప్పి ఆస్పత్రి సిబ్బంది అప్పగించిన మృతదేహం కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన మోహన్‌గౌడ్‌ది. అతనికి కూడా కరోనా సోకడంతో సన్‌షైన్ ఆస్పత్రిలో చేర్చించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఆస్పత్రి మార్చురీలో లేదు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన ఆస్పత్రి సిబ్బంది.. అసలేం జరిగిందని ఆరా తీయగా మృతదేహాలు తారుమారైనట్లు తేలింది. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి మృతదేహాలను మార్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సన్‌షైన్ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని హన్మాండ్లు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. చికిత్స వివరాలు తెలపకుండా రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
విషాదం నింపిన వన భోజనం
నిజామాబాద్ : వన భోజన సంబురం ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. భోజనాల అనంతరం పాత్రలు శుభ్రం చేస్తుండగా వాగులో కొట్టుకుపోయిన పాత్ర కోసం దిగిన కవల సోదరులిద్దరూ గల్లంతయ్యారు. మోర్తాడ్ మండలంలో గురువారం చోటుచేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నా యి. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన పూల వ్యాపారి ఖుద్రత్ నలుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు ఇంటికి రావడంతో వారితో సరదాగా గడిపేందుకు ఆయన గురువారం తన కుటుంబ సభ్యులను వనభోజనాల నిమిత్తం గాండ్లపేట్, దొన్కల్‌ల మధ్య ఉన్న పెద్ద వాగు పరిసరాలకు తీసుకువెళ్లాడు. భోజనాల అనంతరం కుటుంబ సభ్యులు పాత్రలను శుభ్రం చేసే క్రమంలో ఒక పా త్ర వాగులో పడిపోయింది. దానిని తీయడానికి కవల సోద రులు తాహెర్, తయ్యూబ్ ప్రయత్నించారు. ఈ క్రమంలో త య్యూబ్ వాగు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీనిని గమ నించిన సోదరుడు తాహెర్ అతడిని కాపాడేందుకు యతి్నంచి, అతడూ గల్లంతయ్యాడు. వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో స్థానిక జాలరులు, గజ ఈతగాళ్లు ఎంత ప్ర యతి్నంచినా ఫలితం లేకపోయింది. గల్లంతైనవారి కోసం మూడు గంటలపాటు గాలించామని గాండ్లపేట్‌కు చెందిన గజ ఈతగాడు మనోజ్ తెలిపారు. ఇసుక, నాచు ఎక్కువగా ఉన్నాయని, వాటిలో ఇరుక్కుపోయి ఉంటారన్నారు. ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ రఘు, భీమ్‌గల్ సీఐ సైదయ్య, మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై సంపత్‌కుమార్‌లు గురువారం రాత్రి వరకు గాలింపు చర్యలను పర్యవేక్షించారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందాన్ని రప్పిస్తున్నారు. వాగు ప్రవాహంలో కొట్టుకపోతే వారిని గుర్తించడానికి పాలెం, ధర్మోరాల మధ్య ఉన్న చెక్‌డ్యాం వద్ద వలను ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. -
నిజామాబాద్‌లో 173 మంది వీఆర్ఓల బదిలీ
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో భారీగా వీఆర్ఓలను బదిలీ చేశారు. 173 మంది వీఆర్ఓలను బదిలీ చేస్తూ అదనపు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం విధుల్లో చేరాలని ఆదేశించారు. మరోవైపు మేడ్చల్ జిల్లా రెవెన్యూశాఖలో కూడా బదిలీలు జరిగాయి. 18 మంది వీఆర్ఓలను బదిలీ చేస్తూ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. -
తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన
సాక్షి, నిజామాబాద్ : జక్రాన్ పల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట అర్గుల్ రైతులు ఆందోళనకు దిగారు. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు పట్టా భూములు ఇవ్వమంటూ రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే హైవే కోసం భూములు ఇచ్చి నష్టపోయామని, 600 ఎకరాలు కాకుండా 300 ఏకరాలే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, రైతుల ఆందోళనతో జిల్లాలో ఎయిర్ పోర్ట్ అథారిటీ బృందం తమ పర్యటనను వాయిదా వేసుకుంది. సర్వే పనులను రైతులు అడ్డుకుంటారనే సమాచారంతో పర్యటనును వాయిదా వేసుకుంది. -
‘వెల్’డన్.. కుక్కపిల్లను కాపాడారు!
సాక్షి, హైదరాబాద్: శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఫోన్ మోగింది. అవతలి వ్యక్తి ఏం చెప్పాడో ఏమో! ఐదుగురు యువకులు ఆ అర్ధరాత్రే బయలుదేరారు. 200 కి.మీ. ప్రయాణించి ఓ పాడుబడిన బావికి చేరుకున్నారు. అందులోకి తొంగిచూడగా అంతా అంధకారం. దట్టంగా పెరిగిన చెట్లు దడ పుట్టిస్తున్నాయి. అయినా వెరవక అందులోకి దిగారు. బిక్కుబిక్కుమంటున్న కుక్కపిల్లను అక్కున చేర్చుకున్నారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా పునర్జీవం పోశారు. పురాతన బావిలోకి దిగి... నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామ శివారులో నిజాం జమానాలో రాతితో నిర్మించిన ఓ పురాతన వ్యవసాయబావి ఉంది. అందులో 20 రోజుల క్రితం 4 నెలల వయసున్న ఓ కుక్కపిల్ల పడిపోయింది. బాగా లోతుగా ఉన్న ఆ బావిలో చుక్క నీరులేదు. విపరీతంగా చెట్లు మొలిచాయి. అందులోకి దిగేందుకు ఎవరూ సాహసించడంలేదు. సంతోష్‌యాదవ్ అనే స్థానికుడు ఆ కుక్క పిల్లను గమనించి కొద్దిరోజులుగా పైనుంచి దానికి ఆహారం అందిస్తున్నాడు. భయంతో వణికిపోతున్న ఆ కుక్కపిల్ల చనిపోయే స్థితికి చేరడంతో దానిని రక్షించేవారికి కోసం ఇంటర్నెట్లో వివరాలు వెతికాడు. నగరంలోని ‘యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సొసైటీ’వారి ఫోన్ నంబర్ కనుక్కొని సంస్థ ప్రధాన కార్యదర్శి సంజీవ్ వర్మకు శుక్రవారం రాత్రి 11.30కు ఫోన్ చేసి వివరాలు తెలిపాడు. సంజీవ్ వర్మ వెంటనే సంస్థ సభ్యులైన మెస్సీ, రాఘవ్, ప్రభు, అమర్నాథ్లతో కలసి శనివారం ఉదయం సిరికొండకు వచ్చారు. కరోనా భయం వెంటాడుతున్నా 200 కి.మీ. దూరం ప్రయాణించి వచ్చి కుక్కపిల్లను కాపాడిన ఆ యువకులను గ్రామస్తులు అభినందించారు. కొద్దిరోజుల క్రితం వరంగల్‌లో ఓ వ్యవసాయబావిలో పడిన కుక్కను , హైదరాబాద్‌లో ఓ పురాతన దేవాలయంలో ఉన్న బావిలో పడిన పిల్లిని, నగర శివారులో ఓ గుర్రాన్ని కూడా ఇలాగే రక్షించామని సంజీవ్‌వర్మ తెలిపారు. -
వలస కార్మికులొచ్చారు
నిజామాబాద్ అర్బన్: /జగిత్యాలక్రైం/కరీంనగర్ రూరల్: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి శనివారం తొలి శ్రామిక్ రైలు వచ్చింది. ముంబై నుంచి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వచ్చిన ఈ ప్రత్యేక రైలులో 214 మంది ప్రయాణికులు దిగారు. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు 162 మంది, కామారెడ్డి జిల్లాకు చెందిన వారు 23 మంది ఉన్నారు. అలాగే.. జగిత్యాల రైల్వేస్టేషన్లో 842 మంది, కరీంనగర్ స్టేషన్లో 44 మంది దిగారు. వలస కార్మికులు ప్లాట్‌ఫాంపై చేరుకోగానే పోలీసు భద్రత మధ్య ఆయా మండలాల వారీగా వైద్య ఆరోగ్య శాఖ పేరు, అడ్రస్, సెల్‌నంబర్లు సేకరించి, జూన్ 15 వరకు హోం క్వారంటైన్లో ఉండేలా చేతులపై స్టాంపులు వేశారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో వలస కూలీలను వారి స్వగ్రామాలకు తరలించారు. -
కరెంటుషాక్‌తో దంపతుల మృతి
సాక్షి, నిజామాబాద్: డిచ్పల్లి మండలం మిట్టాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫాంహౌస్‌లో ప్రమాదవశాత్తు కరెంటుషాక్‌తో దంపతులు మృతి చెందారు. మృతులు కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం బొప్పాస్‌పల్లికి చెందిన ధరావత్ శంకర్, మరోని బాయిగా గుర్తించారు. -
అయ్యో! కోడికి ఎంత కష్టం వచ్చింది
సాక్షి, నాగిరెడ్డిపేట : కరోనా వైరస్ ప్రభావంతో చికెన్ ధరలు ఆమాంతం తగ్గుతున్నాయి. కరోనా ప్రభావంతో ప్రజలు చికెన్‌కు దూరంగా ఉంటుండడంతో ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేటలో సోమవారం జరిగిన వారాంతపు సంతలో 2కిలోల కోడిని రూ. 70కే విక్రయించారు. ఎల్లారెడ్డికి చెందిన కోళ్లఫారం యాజమాని ఒక ట్రాలీ ఆటోలో కోళ్లను తీసుకొచ్చి వారాంతపు సంతలో విక్రయించారు. తక్కువ ధరకు రావడంతో జనాలు కొనుగోలుకు ఆసక్తి చూపించారు. (ఇక క్షణాల్లో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు!) -
కువైట్ బాటలో ఖతర్
మోర్తాడ్ (బాల్కొండ): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడికి ఖతర్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తమ దేశంలో కోవిడ్–19 కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం వైరస్ నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్ సహా 14 దేశాల నుంచి తమ దేశంలోకి రాకపోకలపై నిషేధం విధించింది. దీంతో ఉపాధి కోసం ఖతర్ వెళ్లే తెలంగాణవాసు లు ఇప్పట్లో అక్కడకు వెళ్లే అవకాశం లేదు. పలువురు కార్మికులకు వీసాతో పా టు ముందస్తుగానే విమాన టిక్కెట్ కొనుకున్నా, తాజా పరిణామాలతో ఆ దేశం వెళ్లలేని పరిస్థితి.. విమాన సర్వీసుల ర ద్దుపై ఆదివారం నుంచే అమలులోకి వచ్చిన నిర్ణయం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగనుందని తెలుస్తోంది. కాగా, కరోనా వైరస్ వల్ల తమ దేశ ప్రజలు ఇబ్బందిపడుతున్నారని గుర్తించిన కువైట్ ప్రభుత్వం కూడా ఎనిమిది దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అదే బాటలో తాజాగా ఖతర్ ప్రభుత్వం కూడా రాకపోకలపై నిషే ధం విధించింది. ఈ నిర్ణయంతో భారత్, చైనా, బంగ్లాదేశ్, ఈజిప్టు, ఇరాన్, ఇరాక్, లెబనాన్, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, శ్రీలంక, సిరియా, థాయిలాండ్ నుంచి ఖతర్‌కు రాకపోకలు నిలిచి పోయాయి. ఖతర్‌లో ఆదివారం వరకు 24 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైరస్ ప్రభావం ఉన్న ఈ 14 దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించారు. కాగా, ఖతర్‌లో ఉన్న తెలంగాణవాసులు ఒకవేళ తమ సొంత ఊళ్లకు వెళ్లాలంటే అందుబాటులో ఉన్న విమాన సర్వీసుల ద్వారా ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది. ఖతర్‌లోని వివిధ నిర్మాణ కంపెనీలు, వ్యాపార, వాణిజ్య సంస్థలలో వేలాది మంది తెలంగాణ వాసులు ఉపాధి పొందుతున్నారు. రోజూ పలువురు అక్కడి నుంచి స్వదేశానికి రాకపో కలు సాగిస్తారు. తాజా పరిణామాలతో ఇబ్బందులు ఏర్పడనున్నాయి. ఇప్పట్లో రాలేం..: ఖతర్ నుంచి ఇప్పట్లో ఇండియాకు రాలేం. అలాగే మన దేశం నుంచి ఖతర్‌కు వచ్చే వారు కూడా కొన్ని రోజుల పాటు ఓపిక పట్టాల్సిందే. కరోనా విస్తరించకుండా ఉండడానికి ఖతర్ ప్రభుత్వం 14 దేశాల రాకపోకల పై నిషేధం విధించింది. కొత్తగా వీసాలు తీ సుకున్న వారు కూడా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. – అబ్బగోని శ్రీధర్ గౌడ్, ఖతర్ -
వచ్చే నెల 7న ‘నిజామాబాద్ ఎమ్మెల్సీ’ పోలింగ్
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ శాసన మండలిలో సుమారు ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో టీఆర్ఎస్ పక్షాన శాసన మండలికి ఎన్నికైన ఆర్.భూపతిరెడ్డి పార్టీ ఫిరాయించారనే కారణంతో గత ఏడాది జనవరి 16న మండలి చైర్మ న్ అనర్హత వేటు వేశారు. 2022, జనవరి 4 వరకు నిజామాబాద్ కోటా శాసన మండలి సభ్యుడి పదవీ కాలం ఉండటంతో ఖాళీని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 12న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసి 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23వ తేదీ నామినేషన్ల ఉప సంహరణకు గడువు కాగా, ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో ఏప్రిల్ 7వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఏప్రి ల్ 9న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. ఏప్రిల్ 13లోగా నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్లో పేర్కొంది. -
సీసెడు తాగినందుకే సోయి తప్పుతున్నారు
జిల్లా కేంద్రంలోని ఓ కల్లు దుకాణంలో కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి మృతిచెందాడు. కల్తీ కల్లు తాగడం వల్లే అతడు మరణించాడని బంధువులు ఆందోళన చేశారు. కల్లు విక్రయదారులు వారిని సముదాయించి, కొంత పరిహారం చెల్లించి, విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది. సమీపంలోని మరో కల్లు దుకాణం నిర్వాహకులనుంచి కూడా కొంత మొత్తాన్ని ఇచ్చినట్లు సమాచారం.. కన్న కూతురిపైనే అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఓ తండ్రికి సంబంధించిన ఘటన ఇటీవల మాచారెడ్డి మండలంలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ప్రతిరోజూ మత్తుపదార్థాలు కలిపిన కల్లును సేవించడం, తన కుటుంబ సభ్యులకు కూడా తెచ్చి ఇవ్వడం చేసేవాడని తెలిసింది. జరిగిన దారుణానికి కల్తీకల్లు సేవించడం కూడా కారణమేనని భావిస్తున్నారు . సాక్షి, కామారెడ్డి : జిల్లాలో 22 కల్లు డిపోలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో రెండు కల్లు తయారీ కేంద్రాలు ఉన్నాయి. పట్టణంలో 14 కల్లు దుకాణాలు ఉండగా చుట్టు పక్కల గ్రామాల్లోని కొన్ని కల్లు దుకాణాలకు సైతం జిల్లా కేంద్రంలోని కల్లు తయారీకేంద్రాలనుంచే కల్లును సప్లయ్ చేస్తున్నారు. ఈత, తాటి చెట్ల నుంచి తీసే కల్లును నామమాత్రంగా కలుపుతారు. క్లోరోఫాం, డైజోఫాంలాంటి మత్తు పదార్థాలను కలుపుతూ కల్తీ కల్లు తయారు చేసి, విక్రయిస్తుంటారన్న ఆరోపణలున్నాయి. కల్లు విక్రయాలను పెంచుకోవడానికి మత్తు పదార్థాలను ఎక్కువ మొత్తంలో కలిపి అమ్ముతున్నారని తెలుస్తోంది. హైడోస్ కల్లుకు జిల్లా కేంద్రంలో కొన్ని దుకాణాలకు పెట్టింది పేరు.. దేవునిపల్లి, రామేశ్వర్‌పల్లి, సిరిసిల్లరోడ్, అంగడిబజార్, హైదరాబాద్ రోడ్, చిన్నమల్లారెడ్డి, సరంపల్లి తదితర ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లో కల్తీకల్లు విక్రయాలు ఎక్కు వగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మిగతా దుకాణాల్లోనూ కల్తీ కల్లు అమ్ముతున్నారు. వీధిన పడుతున్న కుటుంబాలు కల్తీకల్లు కారణంగా అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కల్లుకు బానిసలవుతూ ఎంతోమంది కుటుంబాలను పట్టించుకోవడం లేదు. పొద్దంతా పని చేయగా వచ్చే డబ్బులను కిక్కు కోసమే ఖర్చు చేస్తున్నారు. దీంతో కుటుంబాల్లో గొడవలు, ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. అనేక గొడవలు నిత్యం పోలీస్ స్టేషన్ల వరకు వస్తున్నాయి. కొన్ని ఆత్మహత్యలు, హత్యలకు మత్తుపదార్థాలతో కల్తీ చేసిన కల్లే కారణమవుతుండడం గమనార్హం. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు.. కామారెడ్డిలో విక్రయిస్తున్న కల్లులో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కల్లు విక్రయాలు పెంచుకునేందుకు ఇలా చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇలాంటి హైడోస్ కల్లును సేవిస్తూ ఎంతో మంది తమ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదంతా కళ్లెదుటే కనిపిస్తున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. వారు ఈ విషయాన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే కల్తీ కల్లు విక్రయాలను అడ్డుకోవడం లేదని తెలుస్తోంది. -
టీవీ సౌండ్ పెంచాడని చంపేశాడు
-
క్లర్కుగా చేసిన చోటే.. చైర్‌పర్సన్‌గా..!
సాక్షి,భీమ్‌గల్ : అదృష్టమంటే ఇదేనేమో..! క్లర్కుగా పని చేసిన కార్యాలయంలోనే తొలి చైర్‌పర్సన్‌గా మల్లెల రాజశ్రీ ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మున్సిపాలిటీగా మారక ముందు గ్రామ పంచాయతీలో రాజశ్రీ క్లర్కుగా పని చేసేవారు. అయితే, 2006 నుంచి 2013 వరకు మల్లెల లక్ష్మణ్ వార్డు సభ్యుడిగా, 2013 నుంచి 2018 వరకు ఉప సర్పంచ్‌గా పని చేశారు. ఈ మధ్య కాలంలో రాజశ్రీ, లక్ష్మణ్ మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు వివాహం చేసుకున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా భీమ్‌గల్ మున్సిపాలిటీగా మారింది. చైర్పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ నెల 22న జరిగిన ఎన్నికల్లో రాజశ్రీ టీఆర్ఎస్ తరఫున తొమ్మిదో వార్డు నుంచి బరిలోకి దిగి.. భారీ మెజారిటీతో గెలిచారు. సోమవారం జరిగిన పరోక్ష ఎన్నికలో ఆమె చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. -
ఉత్కంఠ వీడింది; ఆ పార్టీలోకి ఇద్దరు జంప్..!
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ మేయర్ పదవిని దక్కించుకునేందుకు అధికార టీఆర్ఎస్కు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. మొత్తం 60 డివిజన్లలో 13 స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్కు ఎంఐఎం (16) మద్దతు ఇవ్వనుంది. దీంతోపాటు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఓ కార్పొరేటర్, మరో ఇండిపెండెంట్ కార్పొరేటర్ గులాబీ గూటికి చేరాడు. ఇక ఆరుగురు ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతుతో టీఆర్ఎస్ బలం 37కి చేరింది. 67 మంది సభ్యుల ఓట్లతో మేయర్ ఎన్నిక జరుగనుంది. మేయర్ పదవి దక్కాలంటే ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి సంఖ్యా బలం 34 ఉండాలి. 37 మంది సభ్యులతో గులాబీ పార్టీ ముందు వరుసలో ఉంది. మేయర్ పదవి టీఆర్ఎస్కు, డిప్యూటీ మేయర్ పదవి ఎంఐఎంకు కేటాయించేలా ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. మేయర్ పీఠం కోసం ముగ్గురి మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. ఒకరి పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఫైనల్ చేసినట్టు సమాచారం. (చదవండి : నిజామాబాద్ కార్పొరేషన్‌కు లైన్‌క్లియర్) ఇదిలాఉండగా... 28 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పక్షంగా బీజేపీ అవతరించిన్పటికీ సరిపడినంత మెజారిటీ దక్కలేదు. కాంగ్రెస్ రెండు డివిజన్లలో, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ నేపథ్యంలో.. మేయర్ కోసం కావాల్సిన మేజిక్ ఫిగర్ తమకు రాలేదని.. టీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో పాటు ఎక్స్అఫీషియా సభ్యులు ఓటింగ్ పరంగా కూడా గులాబీ పార్టీకే ఎక్కువ బలం ఉన్నందున తాము వెనక్కి తగ్గుతున్నామని ఎంపీ అరవింద్ ఆదివారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణం, 12:30 నుంచి మేయర్ ఎన్నిక ప్రక్రియ, తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభ కానుంది. (చదవండి : 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ) -
సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా?
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): సీఎం కేసీఆర్ ‘చీప్’మినిస్టర్ అని, ఇంత చేతగాని, దిగజారిపోయిన సీఎంను ఎన్నడూ చూడలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు టీఆర్ఎస్ గెలుపు కోసం పని చేసినందుకే సీఎం కేసీఆర్ పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బులు, మద్యం పంపిణీ చేసిన వీడియోలు డజన్ల కొద్దీ చూపిస్తానని.. సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా? అని ఆయన సవాల్ విసిరారు. నిజామాబాద్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కేసీఆర్‌కు హిందువుల సంస్కృతి తెలియదని,గురుకులాల్లో దళి తులు, చిన్న పిల్లలను మత మార్పిడులు చేస్తున్న నువ్వు హిందువువా? అని ప్రశ్నించారు. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసే హక్కు అసెంబ్లీకి లేదన్నారు. -
నిజామాబాద్‌లో నువ్వా, నేనా?
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు ఉండటంతో మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు హోరాహోరిగా తలపడుతున్నాయి. కార్పొరేషన్‌లోని 60 డివిజన్లకు గాను ఇప్పటివరకూ 24 స్థానాల్లో బీజేపీ, 19 స్థానాల్లో టీఆర్ఎస్, ఎంఐఎం 18 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ రెండు డివిజన్లలో గెలిచింది. టీఆర్ఎస్లో మేయర్ పదవిని ఆశించిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. తాజా మాజీ మేయర్ ఆకుల సుజాత పరాజయం చెందారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఫయీమ్ కూడా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మేయర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ఆధిక్యంలో ఉంటారన్నది తెలుస్తుంది. కాగా, ఓట్ల లెక్కింపు జరుగుతున్న పాలిటెక్నిక్ కాలేజీలోని కౌంటింగ్ కేంద్రం చుట్టూ భారీగా పోలీసులను మొహరించారు. మూడు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను కమిషనర్ పోలీస్ కార్తికేయ పర్యవేక్షిస్తున్నారు. -
'కేసీఆర్ ఒక అబద్దాల పుట్ట'
సాక్షి, నిజామాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి మత్తు తెలంగాణ, అప్పుల తెలంగాణగా తయారు చేశారని ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్‌లో శనివారం నిర్వహించిన రోడ్ షోలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక అబద్దాల పుట్ట అని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులను కేంద్రం ఇస్తామన్నా సీఎం ఒప్పుకోవడం లేదని ఆరోపించారు. అయినా కేసీఆర్‌కు భయపడడానికి తమది కాంగ్రెస్ పార్టీ కాదని హెచ్చరించారు. నిజామాబాద్ పేరును తిరిగి ఇందూరుగా మార్చుకోవాలని, నిజామాబాద్ మున్సిపల్ మేయర్ పదవిని బీజేపీ సాధించాలని పేర్కొన్నారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి జాతీయత భావం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. దేశంలో జాతీయత భావం సాధించిపెట్టిన ఘనత మోదీ, అమిత్ షాలదేనని పేర్కొన్నారు. సీఏఏ, ఎన్నార్సీ వల్ల దేశంలోని ముస్లింలకు ఏ ఇబ్బంది ఉండదని, ముస్లింలంతా మా అన్నదమ్ములని రాజాసింగ్ వెల్లడించారు. -
తెలంగాణకు కొత్తగా 54 పీజీ మెడికల్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి 54 పీజీ మెడికల్ సీట్లను మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఉత్తర్వులిచ్చింది. ఈ సీట్లన్నీ నిజామాబాద్ మెడికల్ కాలేజీకే దక్కడం విశేషం. ఎంసీఐ నుంచి నిజామాబాద్ వైద్య విద్య కళాశాలకు శాశ్వత గుర్తింపు లభించిన ఏడాదికి ఒకేసారి 54 పీజీ సీట్లు మంజూరు కావడంపై వైద్య విద్య ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీకి మంజూరైన పీజీ సీట్లలో జనరల్ మెడిసిన్ – 10, అనస్థీషియా – 6, గైనకాలజీ – 6, ఆర్థోపెడిక్స్ – 4, అనాటమీ – 4, ఈఎన్టీ – 3, ఫోరెన్సిక్ మెడిసిన్ – 3, ఫిజియాలజీ – 2, పీడియాట్రిక్ – 3, సైకియాట్రీ – 2, అప్తామాలజీ – 3, పాథాలజీ – 3, మైక్రోబయాలజీ – 3, బయో కెమిస్ట్రీ – 2 ఉన్నాయి. ఇదే కాలేజీకి గతేడాది 3 పీజీ ఫార్మాకాలజీ సీట్లను ఎంసీఐ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. నీట్ పీజీలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ ఏడాది మార్చి – ఏప్రిల్ నెలలో నిజామాబాద్ కాలేజీలో పీజీ అడ్మిషన్లు ఇస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 706 పీజీ సీట్లుండగా, 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 917 సీట్లున్నాయి. మొత్తం అన్నీ కలిపి 1,623 పీజీ సీట్లున్నాయి. కొత్తగా వచ్చిన 54 సీట్లతో కలపి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే 760 సీట్లు అవుతాయి. -
భరోసా ఇచ్చినా.. తొలగని భయం!
భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రెండు రోజులుగా పరిస్థితి మెరుగు పడింది. ఆదివారం జరిగిన అల్లరి మూకల దాడుల తర్వాత వదంతుల వ్యాప్తి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. పోలీసులు భరోసా ఇచ్చినా.. వదంతులతో భయాందోళనకు గురవుతున్నారు. అల్లర్ల ఘటనకు కారకులైన 55 మందిని అరెస్టు చేసినట్లు సీఐ వేణుగోపాల్‌రావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చని చెబుతున్నప్పటికీ స్థానికంగా ఆ సందడి కనిపించడంలేదు. మరో రెండు రోజుల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించనున్నామని, ఎన్నికలయ్యే వరకూ భైంసాలో అదనపు బలగాలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. 240 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, 150 మంది స్పెషల్ పోలీసులు, ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్లు ప్రత్యేక బలగాలతో కలిపి 900 మంది బందోబస్తులో ఉన్నారు. ప్రతిరోజు భైంసాలో కవాతు నిర్వహిస్తున్నారు. కరీంనగర్, వరంగల్ ఐజీలు నాగిరెడ్డి, ప్రమోద్‌కుమార్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని భరోసా ఇస్తున్నారు. కర్ఫ్యూ, 144 సెక్షన్ ఎత్తివేసినప్పటికీ దుకాణాలు మాత్రం తెరుచుకోవడంలేదు. చాలా మంది తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో ఈనెల 22న జరిగే పోలింగ్‌పై ఈ ప్రభావం పడనుందని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే గృహ నిర్బంధం సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్): బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను పోలీసులు గురువారం రాత్రి నిజామాబాద్‌లో హౌజ్ అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ఘటనపై సమీక్షించేందుకు వెళ్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. -
దేశద్రోహులను ఏరేస్తాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దేశ ద్రోహానికి పాల్పడితే సహించేది లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవదర్ అన్నారు. దేశంలో ఉన్న పాకిస్తానీ, బంగ్లాదేశ్ ముస్లింలను కచ్చితంగా దేశం నుంచి పంపించేస్తామని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) అవగాహన సదస్సు పేరుతో శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మతం పేరుతో రెచ్చగొట్టి దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాగా, సీఏఏను టీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుందో స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ చెప్పే కారణాలు తప్పని రుజువు చేస్తానన్నారు. మీరు చెప్పే కారణాలు సరైనవేనని రుజువు చేస్తే తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తానని, దీనికి కేసీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ సభలో ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో కాంగ్రెస్ స్క్రాప్‌లా తయారైంది
సుభాష్‌నగర్ (నిజామాబాద్‌అర్బన్): రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్క్రాప్‌లా తయారైందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శించారు. భరతమాతను 3 ముక్కలు చేసి పాపాన్ని ఆ పార్టీ మూటగట్టుకుందని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం లో మాట్లాడుతూ, పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని చెప్పారు. ఏపీలో సీఎం జగన్ పసుపు రైతులకు మద్దతు ధర ప్రకటించి పుణ్యం కట్టుకున్నారని అభినందించారు. పౌరసత్వ బిల్లుతో దేశంలోని మైనారిటీలకు ఇబ్బందులు ఉండబోవన్నారు. దీనికి వ్యతిరేకంగా ఓటేసి టీఆర్ఎస్, కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల్లో మైనారిటీలైన హిందువులు ఊచకోతకు గురవుతున్నారని, శరణార్థులుగా మారిన వారికోసం ఈ చట్టాన్ని తెచ్చామని చెప్పారు. ఎంఐఎంకు ఓ వర్గం గంప గుత్తగా ఓట్లు వేస్తున్నారని, రాష్ట్రంలోని మైనార్టీలందరికీ సీఎం కేసీఆర్ ఒవైసీ కళ్లద్దాలు పెట్టి ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. -
అసలేం జరుగుతోంది?
సాక్షి, ఇందూరు (నిజామాబాద్): జిల్లాలో స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీ తీరుపై కలెక్టర్ రామ్మోహన్రావు అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరాల్లో స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీలో ముందున్న జిల్లా... కొన్ని నెలులుగా ఎందుకు ఒక్కసారిగా వెనుకబడి పోయిందని ఆరా తీశారు. రుణాల ప్రగతి ఇంతగా పడిపోవడానికి గల కారణాలేంటని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో డీఆర్డీఏ, మెప్మా అధికారులు, సిబ్బందితో స్త్రీనిధి రుణాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. స్త్రీనిధి పథకం కింద ఈ ఏడాది రూ.207 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు రూ.135 కోట్ల రుణాలు మహిళా సంఘాల సభ్యులకు మంజూరు చేయాల్సి ఉండగా, కేవలం 19 శాతంతో రూ.39 కోట్లు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బ్యాంకుల అశ్రద్ద ఉంటే వాటి వివరాలు తెలుపాలని, వారానికోసారి సమీక్షించుకుని సమస్య ఎక్కడుందో దృష్టి పెట్టి రుణాల పురోగతిని సాధించేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చే జనవరిలో అభివృద్ధి కనిపించాలని, నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. మహిళా సంఘాల బలోపేతానికి, మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడే స్త్రీనిధి రుణాల లక్ష్యానికి అనుగుణంగా మంజూరు చేయాలన్నారు. మంజూరు చేసిన రుణాలకు రికరీకి ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. డీఆర్డీవో రమేశ్ రాథోడ్, మెప్మా పీడీ రాములు, స్త్రీనిధి ఆర్ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంతందంగా ఉన్నానో..!
ఎంత అందంగా ఉన్నానో నేను.. అనుకుంటూ మురిసిపోతోంది ఈ పిచ్చుక. ఒకప్పుడు పొద్దున లేవగానే కిచ్‌కిచ్ అంటూ చప్పుడు చేస్తూ అల్లరి చేసే పిచ్చుకలు పెరిగిన పర్యావరణ కాలుష్యం దృష్ట్యా కనుమరుగైపోయాయి. చాలా తక్కువ సంఖ్యలో అవి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అలాంటి ఓ పిచ్చుక గాల్లో వెళ్తూ వెళ్తూ ఓ బైక్‌కు ఉన్న అద్దంను చూసి దాని ముందు వాలి హొయలొలికించింది.. మళ్లీ మళ్లీ చూసుకుంటూ సంబురపడిపోయింది. నిజామాబాద్ జిల్లాలోని కుర్నాపల్లి గ్రామ శివారులో ఓ బైక్ వద్ద పిచ్చుక చేసిన అల్లరి ఇది.. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
ఊపిరాడని బతుకుకు..ఊపిరిపోశారు!
చంద్రశేఖర్ కాలనీ: వరద నీరు వెళ్లేందుకు నిర్మించిన డ్రైనేజీలో చెత్తను తొలగించేందుకు దిగిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు అందులో చిక్కుకు పోయాడు. సరిగా శ్వాస ఆడక గంటపాటు విలవిల్లాడాడు. స్థానికులు సకాలంలో స్పందించడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన గురువారం నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని వర్ని రోడ్డులో దశాబ్దాల క్రితం స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మించారు. కోటగల్లి పరిసర ప్రాంతాలకు చెందిన మురుగునీరు ఈ డ్రైనేజీ ద్వారానే పూలాంగ్ వాగులోకి వెళుతోంది. అయితే, డ్రైనేజీలో చెత్త పేరుకు పోవడంతో మురుగు నీరు నిలిచి పోయింది. ఆ చెత్తను తొలగించేందుకు కార్పొరేషన్ సిబ్బంది గురువారం ప్రయత్నించారు. రోడ్డు కింద నిర్మించిన డ్రైనేజీ లోపలికి వెళ్లిన తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడు గంగాధర్ (35) కర్ర సాయంతో చెత్తను తొలగిస్తుండగా, మురుగు నీరు ఒక్కసారిగా ముంచెత్తింది. ఈ క్రమంలో గంగాధర్ కుడి చేయి కేబుల్ పైపులైన్లలో చిక్కుకోవడంతో అతడు డ్రైనేజీలో ఉండిపోయాడు. గంగాధర్‌కు పైపు ద్వారా గాలి అందిస్తున్న కార్మికులు శ్వాస సరిగా ఆడక విలవిల్లాడాడు. ఇది గమనించిన మరో కార్మికుడు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాడు. మరోవైపు గంగాధర్‌కు శ్వాస ఆడేందుకు ఇంట్లో వినియోగించే నీటి పైప్‌ను స్థానికులు అందించారు. అనంతరం జేసీబీతో రోడ్డును తవ్వి డ్రైనేజీ నీటిని వేరే వైపు మళ్లించారు. గంట పాటు డ్రైనేజీలో ఇరుక్కుని తల్లడిల్లిన గంగాధర్‌ను తోటి కార్మికులు బయటకు తీసి, జిల్లా ఆస్పత్రికి తరలించారు. గంగాధర్‌ను పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సాజిద్ అలీ తెలిపారు. -
నేడు బాన్సువాడకు మంత్రి కేటీఆర్ రాక
సాక్షి, కామారెడ్డి: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం జిల్లాకు రానున్నారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో అన్ని బల్దియాలపై గులాబీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో కేటీఆర్ ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా బాన్సువాడ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారని తెలిసింది. అభివృద్ధి ఇలా.. బాన్సువాడ పట్టణం మున్సిపాలిటీగా ఏర్పాటైన తరువాత దాదాపు రూ. వంద కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రధానంగా రోడ్ల వెడల్పు, డ్రెయినేజీల నిర్మాణం, స్టేడియం నిర్మాణం, మినీ ట్యాంక్‌బండ్ పనులతో పాటు మరికొన్ని పనులు చేపట్టారు. రూ. 37 కోట్లతో బాన్సువాడ పట్టణంలోని శ్మశాన వాటిక నుంచి బస్సు డిపో వరకు సుమారు 3 కిలోమీటర్ల రోడ్డును నాలుగు వరుసల సీసీ రోడ్డుగా మార్చారు. ఫుట్‌పాత్‌తోపాటు డ్రెయినేజీలు నిర్మించారు. రహదారి మధ్యలో డివైడర్లు, హైమాస్ట్ లైట్లను బిగించారు. రూ. 2.40 కోట్లతో పట్టణంలోని కమ్యూనిటీ హాల్ వద్ద మినీ స్టేడియం నిర్మించారు. మినీ స్టేడియం చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. రూ. 7.80 కోట్లతో కల్కి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దారు. రూ. 25 కోట్లతో పట్టణంలోని వివిధ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఆయా కాలనీల్లో పనులు వేగంగా సాగుతున్నాయి. పట్టణంలో చెత్తాచెదారాన్ని తరలించేందుకు ఆటోలు, ట్రాక్టర్లను మంజూరు చేశారు. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలను తెప్పించారు. మరికొన్ని అభివృద్ధి పనులూ చేపట్టారు. ఆయా పనులకు మంత్రి కేటీఆర్ శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కేటీఆర్ పర్యటన వివరాలు.. మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం 10 గంట లకు హెలికాప్టర్ ద్వారా బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. ఆయన వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉంటారు. మంత్రులు పట్టణంలో పర్యటిస్తారు. ప్రధాన రహదారితో పాటు డ్రెయినేజీలు, సీసీ రోడ్ల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. మినీ ట్యాంక్ బండ్, మినీ స్టేడియంలను ప్రారంభిస్తారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్, ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు మంత్రి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఏర్పాట్లు పూర్తి మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేయించారు. -
ఎవరా వసూల్ రాజా..?
‘‘కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో టికెట్లిప్పిస్తామని.. పదవులిప్పిస్తామని కొందరు డబ్బులు తీసుకుంటున్నట్లు జిల్లా పార్టీకి ఫిర్యాదు వచ్చింది.. అలాంటి వ్యక్తులు మీ వద్దకు వస్తే జిల్లా పార్టీకి ఫిర్యాదు చేయండి.. అలాంటి నాయకులను దూరం పెట్టండి.. ఏ ఒక్క కార్యకర్త, పరివార్ కార్యకర్తలు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.. అలాంటి వ్యక్తులను మందలించాలని విజ్ఞప్తి చేస్తున్నా..’’ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మంగళవారం చేసిన బహిరంగ ప్రకటన పార్టీ వర్గాల్లో కలకలం సృష్టించింది. సాక్షి, నిజామాబాద్: కమల దళంలో వసూళ్ల దందా కలకలం రేపింది! బల్దియా ఎన్నికల నగారా మోగక ముందే బీజేపీలో టికెట్ల లొల్లి రచ్చకెక్కుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీదున్న ఆ పార్టీలో కార్పొరేటరు, కౌన్సిలర్ల టిక్కెట్లు ఇప్పిస్తామని కొందరు నాయకులు వసూళ్ల దందాకు తెరలేపడం విమర్శలకు దారి తీస్తోంది. మంగళవారం బీజేపీ నిజామాబాద్ నగర కమిటీ సమావేశంలో ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడం తో పార్టీ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. తమకు రాష్ట్ర స్థాయి నాయకులతో పరిచయాలున్నాయని, జాతీయ స్థాయి నేతలు కూడా తెలు సని చెప్పి ఓ నాయకుడు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ద్వితీయశ్రేణి నాయకులు, ఆశావహు లు సమావేశంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ టికెట్ల కోసం ఆ పార్టీ ఆశావ హుల సంఖ్య పెరుగుతోంది. ఆశావహుల ఉత్సాహాన్ని కొందరు నేతలు క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తుండటం కలకలం సృష్టించింది. బీజేపీలో కార్పొరేటర్ టికెట్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడే స్వయంగా బహిరంగ ప్రకటన చేయడంతో ఆ వసూల్ రాజా ఎవరనే చర్చ పార్టీ వర్గాల్లో ప్రారంభమైంది. కేవలం నిజామాబాద్ కార్పొరేషన్లోనే ఈ వ్యవహారం కొనసాగిందా.. మిగిలిన మున్సిపా లిటీల్లోనూ ఇలాంటి దందాలేమైనా సాగుతున్నా యా? అనే అంశంపై పార్టీ అప్రమత్తమైంది. ఇలాంటి వ్యవహారాలు ఒక్క నిజామాబాద్ కార్పొరేషన్లోనే కాకుండా మిగిలిన మున్సిపాలిటీల్లోనూ కొనసాగే అవకాశాలుండటంతో ఆ పార్టీ ముందస్తుగా స్పష్టత ఇచ్చినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయమై బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డిని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఫిర్యాదులు అందిన మాట వాస్తవమేనని, అమాయక కార్యకర్తలు, నాయకులు నష్టపోవద్దనే ఉద్దేశంతోనే ముందస్తుగా అప్రమత్తం చేశామన్నారు. దీనిపై పార్టీలో అంతర్గత విచారణ ఏమీ జరగడం లేదని చెప్పారు. -
గురుకులంలో కలకలం
సాక్షి, నిజామాబాద్ : గురుకులాల్లో పెడుతున్న ఆహారం నాణ్యమైనదేనా..? పౌష్టికాహారం పేరుతో నాసిరకం భోజనం పెడుతున్నారా..? అసలు గురుకులాల్లో ఏం జరుగుతోంది. రెండు రోజుల క్రితం బిచ్కుంద మండలంలోని మైనారిటీ గురుకులంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మరువక ముందే.. మరో గురుకులంలో అచ్చం ఇదే తరహా పరిస్థితి పునరావృతమైంది. నిజామాబాద్ శివారులోని నాగారంలో గల గిరిజన డిగ్రీ గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో 62 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు కడుపునొప్పితో విలవిల్లాడి పోయారు. దీంతో వారిని హుటాహుటినప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఒకే తరహా ఘటనలు జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రెండ్రోజుల్లో రెండు ఘటనలు.. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మండలంలో గల మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం కలుషిత ఆహారం తిని 70 మంది ఆస్పత్రి పాలయ్యారు. నిజామాబాద్ నగర శివారులోని గొల్లగుట్ట తండా ప్రాంతంలో గల గిరిజన మహిళా డిగ్రి కళాశాలలో శనివారం రాత్రి భోజనం చేసిన 62 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాణ్యతపై అనుమానాలు.. నిజామాబాద్ జిల్లాలో ఐదు, కామారెడ్డిలో ఎనిమిది కలిపి ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 గిరిజన సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 25 మైనార్టీ గురుకులాలలు ఉన్నాయి. ఇందులో బాలుర–13, బాలికల గురుకులాలు–10, రెండు బాలుర ఇంటర్ బాలుర కళాశాలలున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. దీంతో గురకులాల్లో పెట్టే ఆహార నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాసిరకంగా ఆహారాన్ని అందించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం వస్తువులు.. గురుకులాల్లో నాసిరకం వస్తువులు వినియోగిస్తున్నాయి. తాజా కూరగాయలు వినియోగించడం లేదు. గిరిజన గురుకులంలోని కిచెన్‌లో పరిశీలిస్తే ఆలుగడ్డలకు మొలకలు వచ్చి ఉన్నాయి. వీటీతోనే శనివారం ఆలు బజ్జీలు వేయించి విద్యార్థినులకు స్నాక్స్ పెట్టారు. అలాగే, టమాటలు సైతం కుళ్లి పోయి, వాటిపై చిన్నపాటి పురుగులు వాలుతున్నాయి. దోసకాయలు బాగా లేవు. పరిసరాలు సైతం అపరిశుభ్రంగా ఉన్నాయి. కారం, ఇతర సరుకులు కూడా నాసిరకమైనవి వినియోగిస్తున్నారు. బిచ్కుంద మైనారిటీ గురుకులంలోనూ కుళ్లిపోయిన గుడ్లను విద్యార్థులకు పెట్టారు. నాసిరకం కూరగాయలు సరఫరా చేస్తున్నట్లు విద్యార్థులే చెబుతున్నారు. గురుకుల్లో నాసిరకమైన ఆహారాన్ని అందించడం వల్లే విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల ఆందోళన.. నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని గురుకులాల్లో అందిస్తారనే భావన తల్లిదండ్రుల్లో ఉంది. అయితే, రెండు రోజుల వ్యవధిలో రెండు గురుకులాల్లో ఒకే రకమైన ఘటనలు జరగడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు వాంతులు చేసుకున్న వెంటనే ఆస్పత్రులకు తరలించడంతో ఎవరికి ఏం జరగలేదు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఎవరు బాధ్యులు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు. గొల్లగుట్టలోని గిరిజన గురుకులం గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్! నిజామాబాద్ : గిరిజన రెసిడెన్షియల్ కళాశాల వసతి గృహంలో కలుషిత ఆహారం కారణంగా 62 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు!. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం గొల్లగుట్ట ప్రాంతంలో గల గిరిజన రెసిడెన్షియల్ కళాశాల వసతి గృహంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థులు కడుపునొప్పితో విలవిల్లాడారు. దీంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. విద్యార్థులను పరామర్శించిన కలెక్టర్.. ఘటనపై విచారణకు ఆదేశించారు. గొల్లగుట్ట ప్రాంతంలో గిరిజన గురుకుల హాస్టల్లో 292 మంది విద్యార్థినులు ఉంటున్నారు. గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ జన్మదినం కావడంతో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విద్యార్థులకు ప్రత్యేకంగా సేమియా చేసి పెట్టారు. అలాగే, పకోడి వడ్డించారు. రాత్రి 9 గంటల సమయంలో విద్యార్థినులు భోజనం చేశారు. అయితే, అరగంట తర్వాత వారికి కడుపు నొప్పి మొదలైంది. 62 మందికి తీవ్రమైన కడుపు నొప్పి రావడం, అందులో 10 మంది వాంతులు చేసుకోవడంతో అప్రమత్తమైన సిబ్బంది.. హుటాహుటిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు.. ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. విద్యార్థుల అస్వస్థతకు భోజనమే కారణమై ఉంటుందని వారు పేర్కొన్నారు. భోజనంపై కలెక్టర్ ఆరా.. కలెక్టర్ రామ్మోహన్రావు ఆదివారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి విద్యార్థినులను పరామర్శించారు. హాస్టల్లో భోజనం ఎలా ఉంటుంది.. పౌష్టికాహారం పెడుతున్నారా? అని ఆయన అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. విద్యార్థులు రాత్రి చేసిన భోజనం శాంపిల్స్ సేకరించాలని సూచించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసి తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలి వచ్చారు. -
భోజనం వికటించి 62 మందికి అస్వస్థత
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లా కేంద్ర శివారులోని నాగారం ప్రాంతంలో ఉన్న గిరిజన రెసిడెన్షియల్ కళాశాలలో భోజనం వికటించి 62 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. సిబ్బంది వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తు తం వారి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కలెక్టర్ రామ్మోహన్రావు ఆదివారం విద్యార్థినులను పరామర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించిన ఆయన.. భోజనం శాంపిల్స్ సేకరించాలని అధికారులకు సూచించారు. సాయంత్రం విద్యార్థినులను డిశ్చార్జి చేశారు. -
పంటకు ముందే ‘మద్దతు’!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అంకాపూర్.. ఇదో ఆదర్శ గ్రామం. గ్రామస్తుల ఐకమత్యంతో ఎన్నో అద్భుతాలు సృష్టించి.. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకొని మార్గదర్శకంగా నిలుస్తోంది. అనేక స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు తీసుకున్న ఈ గ్రామంలో ఈసారి రైతులు సంఘంగా ఏర్పడి పంటకు ముందే మద్దతు ధర నిర్ణయించారు. ‘ఇక పంటకు మద్దతు ధర నిర్ణయించేది వ్యాపారులు కాదు.. మేమే’అంటూ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పైగా పండించబోయే (మార్చిలో చేతికందే) పంటకు ముందే ధర ప్రకటించారు. ఈ మేరకు వ్యాపారులను గ్రామాలకు పిలిచి ఒప్పందం కుదుర్చుకున్నారు. వ్యాపారులతో ముందస్తు ఒప్పందాలు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఎర్రజొన్న (గడ్డి విత్తనం) ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సాగవుతుంది. ఏటా తమ పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ మార్కెటింగ్ కష్టాలను అధిగమించేందుకు అంకాపూర్ లో రైతులంతా ఏకమయ్యారు. ఈ రబీ సీజనులో సుమారు 1,300 ఎకరాల్లో ఎర్రజొన్న పంటను సాగు చేయాలని నిర్ణయించారు. సుమారు 1,400 టన్నుల ఉత్పత్తి అవుతుందని అంచనాకొచ్చిన రైతులు.. విత్తన వ్యాపారులతో సంప్రదింపులు జరిపారు. తమ పంటకు వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. 15 మంది విత్తన వ్యాపారులు, సీడ్ కంపెనీలు ఈ గ్రామానికి వచ్చి వేలంలో పాల్గొనగా.. 200 టన్నుల చొప్పున ఏడుగురు వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్చిలో చేతికందే తమ ఎర్రజొన్న పంటకు క్వింటాలుకు రూ.2,600 చొప్పున కొనుగోలు చేసేలా విత్తన వ్యాపారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారు. పంట విలువలో పది శాతం మొత్తాన్ని అడ్వాన్సు రూపంలో తీసుకుని పంటను సాగు చేస్తున్నారు. తీరా పంట పండిన తర్వాత మార్కెట్లో ఆ ధర లేదంటూ వ్యాపారులు చేతులెత్తేయకుండా ముందు జాగ్రత్తగా పేరున్న వ్యక్తుల జమానతు తీసుకున్నారు. -
తప్పుడు పత్రాలతో నిందితులకు బెయిల్
పిట్లం మండల కేంద్రంలో జూలై 18న బంగారం దుకాణంలో చోరీ జరిగింది. అంతర్రాష్ట్ర ముఠా పనిగా అనుమానించిన పోలీసులు.. కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠాను అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. అయితే వీరికి బెయిల్ కోసం బోధన్ మండలం ఊట్పల్లికి చెందిన ఎండీ గౌస్, గైని సాయిలు పేర్లతో ష్యూరిటీలు లభించాయి. బెయిల్‌పై బయటికి వచ్చిన నిందితులు.. కనిపించకుండాపోయారు. ఈ కేసులో సమర్పించిన జామీన్లు కూడా నకిలీవని తేలినట్టు సమాచారం. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఇటీవలి కాలంలో నకిలీ జామీను పత్రాల సాయంతో నేరస్తులు బెయిల్ పొందుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. కామారెడ్డి పట్టణంతో పాటు, పిట్లం మండల కేంద్రంలో జరిగిన రెండు దొంగతనాలు, దోపిడీ సంఘటనల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు పట్టుకుని, కటకటాల వెనక్కి పంపించారు. అయితే నేరస్తులు తప్పుడు జామీను పత్రాలను సమర్పించి, బెయిల్‌పై విడుదలై తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో వారిని తిరిగి పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. తప్పుడు జామీనుల దందా.... ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తప్పుడు జామీను పత్రాలను సృష్టించే ముఠాలు చురుకుగా పనిచేస్తోందని పోలీసు యంత్రాంగం అనుమానిస్తోంది. ఇటీవల వెలుగు చూసిన రెండు సంఘటనలపై ఎస్పీ శ్వేత ఆరా తీస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగలకు కూడా జిల్లాలో జామీనులు ఇస్తుండడం విస్మయం కలిగిస్తోంది. దొంగలు పట్టుబడినపుడు బెయిల్ పొందడానికి తమకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ప్రయత్నాలు చేయడం సాధారణమే.. బెయిల్ కోసం కోర్టుకు సమర్పించాల్సిన జామీను పత్రాలను అప్పటికప్పుడు, స్థానికంగా తయారు చేయించడం కష్టమైన పని.. కానీ నకిలీ పత్రాలతో బెయిల్ ఇప్పించే ముఠాలు తయారై నిందితులకు సంబంధించిన వ్యక్తులతో బేరమాడి డబ్బులకు తప్పుడు పత్రాలు సృష్టించి అంటగడుతున్నట్టు ఇటీవల వెలుగు చూసిన సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తులకు సులువుగా జామీనులు దొరుకుతుండడంతో పోలీసులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏడాదిన్నర క్రితం కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా చోరీకి యత్నించింది. మెలకువతో ఉన్న వాచ్‌మన్ ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. దీంతో దొంగలు అతడిపై దాడి చేసి గాయపరిచారు. వాచ్‌మన్ అరుపులకు మేల్కొన్న స్థానికులు అటువైపు వస్తుండడాన్ని గమనించిన దొంగలు పారిపోయారు. ఈ కేసులో పోలీసులు మహారాష్ట్రకు చెందిన ముఠాను పట్టుకుని, రిమాండ్‌కు తరలించారు. అందులో ఒక నిందితుడు కోర్టుకు ష్యూరిటీస్ సమర్పించడంతో బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత పత్తా లేకుండాపోయాడు. దీంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతడికి జామీను ఇచ్చిన వారి కోసం పోలీసులు నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం దూపల్లికి వెళ్లారు. అయితే జామీను ఇచ్చిన దానోయిన మైసయ్య, జర్పుల వెంకట్ అనే పేరు గల వ్యక్తులు ఆ గ్రామంలో లేరని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. ఈ విషయాన్ని అటు కోర్టుకు, ఇటు పోలీసు అధికారులకు నివేదించారు. తప్పించుకు తిరుగుతున్న నేరస్తులు దొంగతనాలు, దోపిడీలలో ఆరితేరిన కొందరు పోలీసులకు చిక్కినా.. బెయిల్‌పై విడుదలయ్యాక తప్పించుకు తిరుగుతున్నారు. కోర్టు పేషీలకు హాజరైతే శిక్షలు పడతాయన్న ఉద్దేశ్యంతో నిందితులు తప్పించుకుంటున్నారు. తప్పుడు ష్యూరిటీలు ఇచ్చి దర్జాగా వారు తమ చోరవృత్తిని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. తిరిగి వారు ఎక్కడో ఏదో ఒక సంఘటనలో పట్టుబడితే గానీ కేసుల్లో పురోగతి కనిపించని పరిస్థితి ఉంటోంది. తీగలాగితేనే.... నకిలీ పత్రాలతో జామీనులు ఇస్తున్న ముఠాకు సంబంధించి లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. తమకు తెలిసిన వారికి జామీను ఇవ్వడానికే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కానీ గుర్తు తెలియని వ్యక్తులకు బెయిల్ కోసం ష్యూరిటీస్ ఇస్తున్నారంటే.. దానిపై ఆరా తీయాల్సిందేనని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దొంగతనాలు, దోపిడీలకు సంబంధించిన ముఠాలు అరెస్టయిన సందర్భంలో అందించిన ష్యూరిటీలపై మరింత లోతైన దర్యాప్తు జరిపితే నకిలీ జామీను ముఠా చిక్కే అవకాశం ఉంది. ఆ దిశగా విచారణ జరుపుతున్నామని పోలీసు శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. విచారణ జరుగుతోంది.. వివిధ కేసుల్లో తప్పుడు జామీనుల విషయం ఇటీవలే తెలిసింది. దీనిపై విచారణ చేపట్టాం. వాటిపై కేసులు నమోదు చేయాలని మా సిబ్బందిని ఆదేశించాం. తప్పుడు జామీనులు సృష్టించేవారి గురించి ఆరా తీస్తున్నాం. ష్యూరిటీల విషయంలో కోర్టు విధులు నిర్వహించే మా సిబ్బందికి తగిన సలహాలు ఇచ్చాం. తప్పుడు పత్రాలు తయారు చేసిన వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. –ఎన్.శ్వేత, ఎస్పీ, కామారెడ్డి -
‘రెవెన్యూ’లో బదిలీలలు
జిల్లా కేంద్రంలోని ఓ తహసీల్ కార్యాలయంలో పని చేస్తున్న ఆర్ఐ విధుల నిర్వహణ చేపట్టి రెండేళ్లు పూర్తయ్యింది. బదిలీ అనివార్యమని తెలవడంతో పావులు కదిపాడు. తనకున్న పరిచయంతో తహసీల్దార్‌తో కలెక్టర్ పరిపాలనా కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేయించి ప్రస్తుతమున్న చోటే ఆర్ఐని కొనసాగించాలని, బదిలీ చేయవద్దని ఫోన్ చేయించాడు. ఈ విషయం ప్రస్తుతం బయటకు పొక్కడంతో రెవెన్యూ వర్గాల్లో చర్చగా మారింది. బదిలీల జాబితాలో ఉన్న ఈ ఒక్క ఆర్ఐయే కాదు... మరి కొందరు కూడా ఆశిస్తున్న ప్రాంతాలకు వెళ్లడానికి పైరవీలు చేసినట్లు విశ్వనీయ సమాచారం. సాక్షి, ఇందూరు(నిజామాబాద్): రెవెన్యూ శాఖలో త్వరలో భారీగా ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. ఎక్కువ కాలం ఒకే చోట పని చేస్తున్న వారికి స్థాన చలనం కల్పించడానికి జిల్లా కలెక్టర్ పరిపాలనా కార్యాలయం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా మండల తహసీల్ కార్యాలయాల్లో రెండు సంవత్సరాల పాటు పని చేస్తున్న వారిని గుర్తించి వారి బదిలీలకు రెవెన్యూ ఉన్నతాధికారులు ఫైలును రూపొందించారు. దాదాపు 16 మందికి పైగా ఆర్ఐలను ప్రస్తుతం పని చేస్తున్న స్థానాల నుంచి వేరే మండలాలకు బదిలీ చేయడానికి మండలాలు కూడా ఖరారు కాగా, అప్రూవల్ కోసం సంబంధిత ఫైలు జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లింది. అయితే సీసీఎల్ఏను మరోసారి సంప్రదించి ఫైలును నివేదించాలని కలెక్టర్ పరిపాలనా అధికారులకు సూచించారు. కలెక్టర్ సంతకమే తరువాయి కావడంతో మరో వారం రోజుల్లో బదిలీల ఉత్తర్వులు వెలుబడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బదిలీల ఫైలు రూపుదిద్దుకుంటున్న సందర్భంలోనే పలువురు ఆర్ఐలు పావులు కదిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆశిస్తున్న మండలాలకు బదిలీ అయ్యేందుకు ఉన్నతాధికారుల సిఫార్సులు చేయించారని, మరి కొందరు పని చేస్తున్న స్థానంలోనే మరికొన్ని రోజులు కొనసాగేందుకు తమదైన రీతిలో పైరవీలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్ఐల ఫైలు కలెక్టర్ వద్ద నిలిచిపోవడంతో కాస్త నిరాశకు గురయ్యారు. ఆశించిన మండలాలు రాకపోతే ఎలా అని అంతర్మథనంలో పడ్డారు. డిప్యూటీ తహసీల్దార్ల బదిలీలు... ఆర్ఐల బదిలీల పక్రియ పూర్తి కాగానే డిప్యూటీ తహసీల్దార్ బదిలీలు కూడా చేపట్టాలని కలెక్టర్ పరిపాలనా అధికారులు భావిస్తున్నారు. ఇందుకు జిలాల్లో ఎక్కువ కాలం అంటే రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు ఒకేచోట పని చేస్తున్న వారి వివరాలను సేకరించడానికి కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 20 మంది వరకు డిప్యూటీ తహసీల్దార్లు బదిలీలకు అర్హులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఐల బదిలీలు కాగానే తమ బదిలీలే ఉంటాయని తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్లు కూడా ఆశిస్తున్న ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమకున్న బలంతో పావులు కదుపుతున్నట్లు సమాచారం. -
ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా ?
సాక్షి, కామారెడ్డి : తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తూంటే సీఎం, ప్రభుత్వం స్పందించకపోవడంతో మనోవేధనకు గురై కార్మికులు ప్రాణాలు కోల్పొతున్నారని అయినా పట్టించుకోవడం లేదని సీఎంపై ఆర్టీసీ కార్మికులు ధ్వజమైత్తారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని చేపడుతున్న ఆర్టీసి కార్మికుల సమ్మె బుధవారంతో 40 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ, మావనహారం నిర్వహించారు. సమ్మె శిభిరం వద్ద మహభూబబాద్‌లో మృతి చెందిన ఆర్టీసి డ్రైవర్ నరేష్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసి జేఏసి నాయకులు వీ.దేవిదాస్, ఖదీర్, హరినాథ్, కృష్ణమూర్తి, రాజు, రాజేందర్, లత తదితరులు పాల్గొన్నారు. బోధన్: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించా లని, ఆర్టీసీని కాపాడాలనే డిమాండ్లతో చేపట్టిన సమ్మెకు గ్రామస్థాయి నుంచి సకల జనులను సమాయత్తం చేద్దామని వామపక్ష పార్టీలు, ఆర్టీసీ జేఏసీ జిల్లా ప్రతినిధులు అన్నారు. ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 40వ రోజుకు చేరింది. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బోధన్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో మహిళా కండక్టర్లు, కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 11నుంచి సాయంత్రం వరకు దీక్షలు కొనసాగించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం సమ్మె పట్ల మొండి వైఖరితో ఉందని, ఆర్టీసీని ప్రైవేటీకరించి, ఆస్తులను కొల్లగొట్టెందుకే ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు. దీక్షా శిబిరాన్ని ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షుడు వనమాల క్రిష్ణ, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు కంజర భూమయ్య, రమేష్‌బాబు, సబ్బాని లత, నూర్జాహాన్, తెలంగాణ జేఏసీ జిల్లా కన్వీనర్ బాస్కర్, వామపక్ష పార్టీల నాయకులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మి కులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో.. ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాకేంద్రం లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం 40వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ ర్టీసీ కార్మికులకు మద్దతుగా వామపక్షాలు, ప్ర జా సంఘాల నాయకులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. వారిలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, రాజన్న, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి రఘురాం, స్వరూపరాణి, నవీ న్, రంజిత్, సుమన్, మారుతి, ఎల్లయ్య, సాయి లు, రాజు, తదితరులు ఉన్నారు. -
చోరీకి యత్నించి.. పట్టుబడి!
సాక్షి, బోధన్(నిజామాబాద్) : రెండు చోట్ల చైన్‌స్నాచింగ్‌కు పాల్పడి పారిపోతుండగా, స్థానికులు వెంటబడడంతో ఒక దొంగ నాటకీయంగా చిక్కాడు. మరొకడు తప్పించుకుని పరారయ్యాడు. అసలేం జరిగిందంటే.. బోధన్‌లోని నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన సావిత్రి మంగళవారం మధ్యాహ్నం ఇంటి ఎదుట నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మంగళ సూత్రాన్ని లాక్కెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన సావిత్రి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో దొంగల చేతికి ఒక పుస్తే, రెండు గుండ్లు మాత్రమే చిక్కాయి. దీంతో దొంగలు బైక్‌పై వేగంగా అక్కడి నుంచి వెళ్లి పోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోధన్‌లో చోరీకి యత్నించి విఫలమైన దొంగలు ఎడపల్లిలో స్నాచింగ్ చేయాలని భావించారు. మాజీ సర్పంచ్ జనగం పుష్ప మిగులు అన్నాన్ని బయటకు పారేసి ఇంట్లోకి వెళ్తుండగా, దొంగలు ఆమె మెడలోని గొలుసును లాక్కొని నిజామాబాద్ వైపు పరారయ్యారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న యువకులు, ప్రజాప్రతినిధులు పోగయ్యారు. దొంగలను పట్టుకునేందుకు కార్లు, బైకులపై బయల్దేరారు. ఈ క్రమంలో జానకంపేట, నెహ్రూనగర్ ఎంపీటీసీ ఇమ్రాన్‌ఖాన్‌కు ఫోన్ చేసి, బైక్‌పై వస్తున్న వారిని అడ్డుకోవాలని కోరారు. దీంతో ఆయన కొంత మందిని జమ చేసి రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు. వారిని గమనించిన దొంగలు తమ బైక్‌ను బోధన్ వైపు మళ్లించారు. అయితే, అప్పటికే ఎడపల్లి నుంచి వస్తున్న నేతలు ఎల్లయ్య యాదవ్, సుభాష్ అలీసాగర్ ఎత్తిపోతల పథకం వద్ద రోడ్డుపై కారును అడ్డంగా పెట్టగా, దొంగలు కారును ఢీకొని కింది పడిపోయారు. దొంగలను పట్టుకునేందుకు యత్నించగా ఒకరు చిక్కగా, మరొకరు పరారయ్యారు. ఎడపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని దొంగతో పాటు బైక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడ్ని బోధన్ ఠాణాకు తరలించి విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రెండు చోట్ల కేసులు నమోదు చేసినట్లు బోధన్ టౌన్, రూరల్ సీఐలు రాకేశ్, షాకీర్ తెలిపారు. -
తహసీల్దార్ న్యాయం చేయడం లేదు..ఉరేసుకుంటున్నా!
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ‘తహసీల్దార్ నాకు న్యాయం చేయడం లేదు.. అందుకే ఉరివేసుకుంటున్నా..’ అని ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కలెక్టరేట్ ఆవరణలో ఉన్న చెట్టెక్కి ఉరేసుకునేందుకు యత్నించడం కలకలం సృష్టించింది. ధర్పల్లి మం డలం దుబ్బాక గ్రామానికి చెందిన అక్కం గంగాధర్‌కు రేకులపల్లిలో వ్యవసాయ భూమి ఉంది. గంగాధర్ తమ్ముడు సంతోష్ పొలం కూడా పక్కనే ఉంది. సంతోష్ తన పొలంలో బోరు వేసినప్పటి నుంచి గంగాధర్ బోరులో నీళ్లు రావడంలేదు. దీనిపై తహసీల్దార్‌కు ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదులు చేశానా న్యాయం జరగడం లేదనే ఆవేదనతో గంగాధర్ సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తాడుతో ఉరి వేసు కునేందుకు యత్నించాడు. ప్రజావాణికి వచ్చిన వారంతా చెట్టె క్కిన గంగాధర్‌ను ఎంత సముదాయించినా కిందికి దిగలేదు. గంగాధర్‌కు తెలియకుండా చెట్టు ఎక్కిన ఓ వ్యక్తి గంగాధర్‌ను పట్టుకుని తాడును విప్పాడు. గంగాధర్‌ను కిందికి దింపి నిజామాబాద్ ఆర్డీఓ వద్దకు తీసుకెళ్లి సమస్య ఏంటో తెలుసుకున్నారు. ధర్పల్లి తహసీల్దార్‌తో మాట్లాడిన ఆర్డీఓ బుధవారం విచారణకు వస్తున్నానని, అందుబాటులో ఉండాలని ఆదేశించారు. -
కేసీఆర్‌కు బ్లేడు పంపిద్దామా..
సాక్షి, నిజామాబాద్ : ఆర్టీసీ భూములు అమ్ముకోడానికి సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి ఆర్వింద్ ఆరోపించారు. సోమవారం నిజామాబాద్ ఆర్టీసీ కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ ప్రవర్తిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమ్మెపై ఎమ్మెల్యేలు, ఎంపీలు నోరు మెదపడం లేదని, మంత్రి హరీశ్‌రావు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ హోల్‌సేల్‌గా, ఎమ్మెల్యేలు రిటైల్‌గా దోపిడి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీ సమ్మె భయంతోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు. కేసీఆర్ తన కుటుంబంపై చూపించే ప్రేమలో 5 శాతం ఆర్టీసీ మీద చూపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల బలిదానాలకు సీఎం కేసీఆర్ ఆహంకార ప్రకటనలే కారణమని, ఇందులో కేంద్రం తప్పు ఏముందని ప్రశ్నించారు. అలాగే ‘దళితుడిని సీఎం చేయకుంటే మెడ కోసుకుంటాను అన్న కేసీఆర్‌కు బ్లేడు పంపిద్దామా.. సీఎంది కోడి మెడ.. ఒక్క బ్లేడు సరిపోతుంది’ అంటూ చురకలు అంటించారు. సీఎం కేసీఆర్‌ను కోర్టుకు ఈడ్చాలని, ఆయన చర్యలను కేంద్రం గమనిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ తప్పులు 100 అవ్వగానే ఆయన మెడ తెగడం ఖాయమని, కేసీఆర్ జైలుకు వెళ్లే రోజులు దగ్గర్లో ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. విపరీత పాపాలు చేసిన కేసీఆర్‌ను గద్దె దింపాలని ఎంపీ అర్వింద్ పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని, విజయం సాధించే రోజు దూరంలో లేదని భరోసాయిచ్చారు. -
బాటిళ్లలో పెట్రోల్ బంద్!
సాక్షి, కామారెడ్డి: సాధారణంగా బైక్‌పై తిరిగే వారికి ఎప్పుడో ఒకసారి పెట్రోల్ సమస్య తలెత్తుతుంది. వాహనంపై తిరిగినపుడు పెట్రోల్ పోసుకోవడం మరిచిపోయిన సందర్భంలో వాహనం ఆగిపోవడం, వెంటనే ఓ ప్లాస్టిక్ బాటిల్‌ను సంపాదించి దగ్గరలోని బంకుకు వెళ్లి పెట్రోల్ తెచ్చుకోవడం జరుగుతుంది. కొందరు తమ వాహనం పెట్రోల్ లేక ఆగిపోయిందని స్నేహితులకో, బంధువులకో ఫోన్ చేస్తే.. వారు బాటిళ్లలో పెట్రోల్ తీసుకువచ్చి ఇస్తుంటారు. ఇకపై ఇలా బాటిళ్లలో పెట్రోల్ తీసుకెళ్లడం కుదరదు.. ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ అమ్మడంపై సర్కారు ఆంక్షలు విధించింది. ఈ మేరకు అన్ని పెట్రోల్ బంకులలో బోర్డులు ఏర్పాటు చేశారు. ఇటీవలి కాలంలో హత్యలు, ఆత్మహత్యలకు పెట్రోల్‌ను వాడుతున్న సంఘటనలు పెరిగాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌పై సురేశ్ అనే వ్యక్తి తన వెంట ప్లాస్టిక్ బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై చల్లి సజీవదహనం చేసిన సంఘటన సంచలనం కలిగించింది. పెట్రోల్ చల్లి నిప్పంటించడంతో క్షణాల్లో ఆమె ప్రాణాలొదిలింది. కిరోసిన్, డీజిల్ కన్నా పెట్రోల్ వేగంగా దహనం అవుతుంది. కొందరు ఆత్మహత్య చేసుకునే విషయంలో, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడానికి పెట్రోల్ సీసాలతో హల్చల్ చేసిన సంఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు పెట్రోల్ అమ్మకాలకు సంబంధించి కొన్ని ఆంక్షలు విధించింది. బాటిళ్లలో ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్ పోయొద్దని ఆదేశించింది. దీంతో బంకుల యజమానులు ‘నో పెట్రోల్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్’ అనే బోర్డులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఆయా మండలాల్లో జాతీయ, రాష్ట్రీయ రహదారుల వెంట, ప్రధాన చౌరస్తాల వద్ద 40 కి పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. బాటిళ్లలో పెట్రోల్ పోయవద్దన్న ఆదేశాల నేపథ్యంలో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. బాటిళ్లలో సులువుగా పెట్రోల్ తీసుకెళ్లి వ్యక్తులపై పోసి నిప్పంటించడం గాని, తమకు తాము పోసుకుని కాల్చుకోవడం గాని జరగకుండా ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుందని పెట్రోల్ బంకుల నిర్వాహకులు అంటున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లలో పెట్రోల్ అయిపోయినా వాహనం తీసుకొస్తేనే పెట్రోల్ పోస్తామని పెట్రోల్‌బంక్ యజమాని ఒకరు ‘సాక్షి’తో తెలిపారు. ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ పోయవద్దని ప్రభుత్వంనుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. -
మృత్యు దారులు.. ఎన్నో ప్రమాదాలు..
రహదారులపై మరణ మృదంగం మోగుతోంది.. రోడ్ల ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది.. మితిమీరిన వేగం, అంతులేని నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలను ‘రోడ్డు’న పడేస్తోంది. సాక్షి,నిజామాబాద్ : రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మితిమీరిన వేగం, అంతులేని నిర్లక్ష్యం కారణంగా అమాయకులు బలవుతున్నారు. మరోవైపు, రోజూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల్లో స్పందన కరువైంది. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంలో వారు విఫలమవుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే భయం.. నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో రోడ్డెక్కాలంటేనే భయంగా పట్టుకుంది. ఇంట్లోంచి బయటకు వెళ్లిన వారు తిరిగి వచ్చే దాకా కుటుంబ సభ్యుల్లో ఆందోళన కనిపిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పోయింది. 22 ప్రాంతాలను డేంజర్ జోన్లుగా గుర్తించారు. రెండు జిల్లాల మీదుగా 105 కిలోమీటర్ల జాతీయ రహదారి, 1,988 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు విస్తరించి ఉన్నాయి. వీటిపై నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడేళ్లలో సుమారు 9 వేల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత నాలుగేళ్లలో జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లోనే 599 మంది మృతి చెందారు. నిర్లక్ష్యం, అతివేగం.. ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యం, అతివేగమే. ర్యాష్ డ్రైవింగ్, ఫోన్/డ్రంకన్ డ్రైవింగ్ కూడా యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి. జిల్లాలో నెలకు సగటున 100 నుంచి 110 వరకు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయా ప్రమాదాల్లో కనీసం 20–25 మంది మృతి చెందుతున్నారు. ముఖ్యంగా వాహనాలు నడుపుతూ సెల్ఫోన్లు మాట్లాడుతుండడం, నిర్లక్ష్యంగా నడపడం, ఎదురుగా వచ్చే వాహనాలను గమనించక పోవడం వంటి వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. త్వరగా గమ్యానికి చేరుకోవాలనే తపనతో వేగంగా వెళ్తుండడం వల్ల బతుకులే చిన్నాభిన్నమవుతున్నాయి. ‘మలుపు’ తిరుగుతున్న బతుకులు ప్రమాదాలకు నాణ్యత లేని రోడ్లు కూడా కారణమవుతున్నాయి. గుంతలు పడిన రహదారులు, ప్రమాదకర మూల మలుపులు ప్రాణాలను బలిగొంటున్నాయి. చాలా చోట్ల క్రాసింగ్‌లు సూచించే బోర్డులు కనిపించడం లేదు. ఇది గమనించకుండా అతి వేగంగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నిబంధనలు పాటించాలి.. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చు. కచ్చితంగా హెల్మెట్/సీటుబెల్టు ధరించాలి. సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగ్‌లకు దూరంగా ఉండాలి. ప్రమాదాలు నివారించేందుకు పోలీసు శాఖ తరఫున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – శ్రీనివాస్‌కూమార్, ఏసీపీ -
దీపావళి ఎఫెక్ట్; 167 కేసులు.. 799 మంది అరెస్టు
సాక్షి, నిజామాబాద్ : దీపావళి పండగ నేపథ్యంలో జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ముమ్మర దాడులు జరిపారు. మొత్తం 167 కేసులు నమోదు చేసి 799 మందిని అరెస్టు చేశారు. రూ. 15,04,180 స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ డివిజన్లో 105 కేసులు నమోదు అయ్యయి. 464 మందిని అరెస్టు చేశారు. రూ. 8,15,000 స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్ డివిజన్లో 41 కేసులు నమోదు చేసి 233 మందిని అరెస్టు చేశారు. రూ. 5,69,580 స్వాధీనం చేసుకున్నారు. బోధన్ డివిజన్లో 21 కేసులు నమోదు చేసి 102 మందిని అరెస్టు చేశారు. రూ.1,19,600 స్వాధీనం చేసుకున్నారు. -
పెండింగ్ బిల్లులు రూ. 440 కోట్లు..
నీటి పారుదల శాఖలో బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. పెండింగ్ బిల్లులు సుమారు రూ.440 కోట్లలో పేరుకుపోయాయి. నెలల తరబడి బిల్లులు రావడం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు కూడా బిల్లులు రాకపోవడంతో వాటి ప్రగతి కుంటుపడింది. ఇప్పటికే పూర్తయిన పనులకు కూడా చెల్లింపులు ఆగిపోయాయి. చిన్న నీటిపారుదల విభాగంతో పాటు, ప్రాజెక్టుల విభాగంలో బిల్లులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు, నాబార్డు వంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల బిల్లుల పరిస్థితి కూడా ఇలాగే ఉండటం గమనార్హం. సాక్షి. నిజామాబాద్: నీటి పారుదల శాఖలో కొత్త పనుల మంజూరును ప్రభుత్వం నిలిపేసింది. దీనికి తోడు బిల్లుల చెల్లింపులు కూడా జాప్యం జరుగుతోంది. జిల్లా నీటి పారుదలశాఖ నిజామాబాద్ ఐబీ డివిజన్ పరిధిలో సుమారు రూ.253.46 కోట్ల మేరకు చెల్లింపులు జరగాల్సి ఉంది. ప్రధానంగా మిషన్‌కాకతీయ పథకం కింద చేపట్టిన చెరువుల మరమ్మతు పనుల బిల్లు లు ఆగిపోయాయి. ఎక్కువగా మూడో విడ త, నాలుగో విడతల్లో చేపట్టిన చెరువుల పనులకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇలా ఒక్క మిషన్‌కాకతీయకు సంబంధించి 192 పనులకు గాను రూ.101.23 కోట్ల మేరకు బిల్లులు నిలిచిపోయాయి. అలాగే ట్రిపుల్ ఆర్ (రిపేర్స్, రిస్టోరేషన్, రెనోవేషన్) పథ కం కింద మంజూరైన పనులకు సంబంధిం చి కూడా రూ.8.90 కోట్లు, చెక్‌డ్యాం నిర్మాణాలకు సంబంధించి మరో రూ.6.12 కో ట్లు చెల్లించాల్సి ఉంది. నాబార్డు ఆర్థిక సహాయంతో చేపట్టిన పనులు, పీఎంకేఎస్‌వై పనులకు కూడా నిధులు ఆగిపోయాయి. చిన్న నీటి వనరుల అభివృద్ధి పనులన్నీ ఈ ఐబీ డివిజన్ పరిధిలో కొనసాగుతున్నాయి. ఎత్తిపోతల పథకాల బిల్లులు సైతం.. బోధన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రాజెక్టు డివిజన్ పరిధిలో జరిగిన పనులదీ ఇదే పరిస్థితి. ఇందులో సుమారు రూ.186.86 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అలీసాగర్ ఎత్తిపోతల పథకం నిర్వహణ నిధులు రావాల్సి ఉంది. ఈ లిఫ్టు పరిధిలోని పనులకు మొత్తం రూ.95.51 కోట్లు రావాల్సి ఉంది. అర్గుల్ రాజారాం ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి రూ.56.06 కోట్లు, నిజాంసాగర్ ప్రాజెక్టు, ప్రధాన కాలువ ఆధునీకరణ బిల్లులు సుమారు రూ.ఏడు కోట్లున్నాయి. కౌలాస్‌నాలా ప్రాజెక్టుతో పాటు, ఇతర ఎత్తిపోతల పథకాల నిర్వహణ ఖర్చులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలి. ఇందులో ఇప్పటికే పూర్తయిన పనులు కొన్ని కాగా, కొన్ని ప్రస్తుతం ప్రగతిలో ఉన్న పనులు ఉన్నాయి. గత ఆరు ఆరు నెలలుగా బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ విషమయమై ‘సాక్షి’ నీటి పారుదల ఓ ఉన్నతాధికారిని సంప్రదించగా ఈ అంశంపై తాను స్పందించలేనని దాటవేశారు. -
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, నిజామాబాద్ : మల్లారం గండి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్సుకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. నిజామాబాద్ నుంచి బాన్సువాడ వెళ్తుండగా మార్గ మధ్యలో బస్సు అదుపు తప్పడంతో ఒక్కసారిగా రోడ్డు పక్కకు దిగిపోయింది. దీంతో భయబ్రాంతులకు గురైన ప్రయాణీకులు వెంటనే కిటికీల నుంచి కిందకు దిగారు. కాగా అడవిలోకి దూసుకుపోయి ఉంటే మరింత ప్రమాదం తలెత్తే అవకాశం ఉండేదని డ్రైవర్‌పై తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎక్సైజ్‌కు రూ.34 కోట్ల ఆదాయం
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎక్సైజ్ సర్కిల్‌కు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. ప్రతి రెండేళ్లకు నిర్వహించే మద్యం దుకాణాల టెండర్లతో ఈసారి బాగా కలిసి వచ్చింది. ప్రభుత్వం దరఖాస్తు ఫీజు పెంచినా మద్యం వ్యాపారులు ఎక్కువ మొత్తంలో ఆసక్తి చూపారు. దీంతో 1072 దరఖాస్తుల ద్వారా రూ. 2 లక్షల చొప్పున రూ. 21 కోట్ల 44 లక్షల ఆదాయం వచ్చింది. దీంతో పాటు 83 మద్యం దుకాణాదారులు మొదటి కిస్తు చెల్లించడం ద్వారా రూ. 13 కోట్ల 18లక్షల ఆదాయం సమకూరింది. మొత్తంగా ఎక్సైజ్ శాఖకు రూ. 34 కోట్ల 62 లక్షల 75 వేల ఆదాయం వచ్చింది. నవంబర్ 1 నుంచి ఏర్పాటయ్యే నూతన మద్యం దుకాణాల్లో నిబంధనలు పాటించాలని, లేకుంటే దుకాణాల లైసెన్సు రద్దు చేస్తామని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 83 మద్యం దుకాణాల లైసెన్సు ప్రక్రియను పూర్తి చేశారు. గుడివిల్ పేరిట వల మద్యం దుకాణాలు దక్కని కొంతమంది వ్యాపారులు లక్కీడ్రాలో షాపులు దక్కిన వారికి గుడ్‌విల్ పేరుతో వల వేస్తున్నారు. నూతనంగా మద్యం దుకాణాలను లక్కీ డ్రాద్వారా దక్కించుకున్న వారిని నేరుగా కలిసి గుడ్‌విల్ ఇస్తామని మద్యం దుకాణాలను మాకే అప్పగించాలని అడుగుతున్నారు. ఇప్పటికే పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్నగరంతో పాటు డిమాండ్ ఉన్న మద్యం దుకాణాలపై ఇప్పటికే వ్యాపారులు కన్నేశారు. నయానో, భయానో తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగా మద్యం వ్యాపారం ప్రారంభించాలంటే బడా వ్యాపారులతో కొన్ని ఇబ్బందులు తప్పవు. అందుకే కొత్తగా దుకాణాలు దక్కిన వారు సైతం సిండికేట్లకు లొంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లీజుకు ఇస్తే లైసెన్సు రద్దు మద్యం దుకాణాలు దక్కిన వారు ఎవరైనా సరే కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. అలా కాకుండా మద్యం దుకాణాలు ఇష్టారాజ్యంగా నడిపితే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. మద్యం దుకాణాలు ఎవరికైనా లీజుకు ఇస్తే లైసెన్సులు రద్దు చేస్తామని చెబుతున్నారు. 24న 8 మద్యం దుకాణాలకు డ్రా నిజామాబాద్ జిల్లాలో లక్కీ డ్రా నిలిచిపోయిన 8 దుకాణాలకు మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 23 సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ నెల 24న జిల్లా కలెక్టరేట్లో లక్కీ డ్రా ఉంటుందన్నారు. నిజామాబాద్ నగరంలోని 18, 19 షాపులు, బోధన్‌లో 32, 41, 42, ఆర్మూర్‌లో 60, 61, 62 దుకాణాలకు 05 కన్నా తక్కువ దరఖాస్తులు రావడంతో డ్రా నిలిపివేశారు. మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గతంలో తక్కువ దరఖాస్తులు వచ్చినా లక్కీడ్రా నిర్వహించారు. కానీ ఈ సారి గెజిట్‌లో నిబంధన లేకున్నా మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారని పలువురు మద్యం దుకాణా దారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించాలి జిల్లాలో నూతన ఎౖక్సైజ్ పాలసీ నవంబర్ 1వ తేదీ నుంచి మొదలు కానుంది. 91 మద్యం దుకాణాల్లో 83 మద్యం దుకాణాలకు లైసెన్సు ప్రక్రియ పూర్తి చేశాం. ఇప్పటికే సుమారుగా రూ. 34 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. మరో 8 దుకాణాలకు సైతం దరఖాస్తులు తీసుకుంటున్నాం. 24న లక్కీ డ్రా ఉంటుంది. మద్యం దుకాణాదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. దుకాణాలు ఎవరికైనా లీజుకు ఇచ్చినా, నిబంధనలు పాటించకున్నా శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ నవీన్‌చంద్ర, ఎక్సైజ్ సూపరింటెండెంట్ -
ఆలయాలే టార్గెట్‌గా..
ఆలయాలే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోయారు. ఒక్కరోజే మూడు దేవాలయాలను కొల్లగొట్టారు. ధర్పల్లి మండలంలోని రెండు గుళ్లతో పాటు ఇందల్వాయి మండలంలో ఓ గుడిలోకి చొరబడ్డారు. దేవుళ్ల నగలతో పాటు హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలతో స్థానికంగా కలకలం రేగింది. సాక్షి,ధర్పల్లి(నిజామాబాద్) : మండలంలోని గోవింద్‌పల్లి గ్రామ శివారులో గల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు ఆలయంలోని గర్భగుడి తాళం పగులగొట్టి లోనికి చొరబడ్డారు. స్వామివారి మీద గల బంగారు, వెండి ఆభరణాలు, హుండీలోని నగదును దొంగిలించారు. భక్తులు గత ఏడాది నుంచి డబ్బులను కానుకలుగా హుండీలో సమర్పిస్తున్నారు. దీంతో హుండీలో సుమారు రూ.50 వేలకు పైగానే డబ్బు ఉంటుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై పాండేరావు చోరీ జరిగిన ఆలయాన్ని మంగళవారం పరిశీలించారు. దొంగల కోసం చుట్టుపక్కల గ్రామాల్లోని సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్దుల్ ఆలయంలోనూ.. మండల కేంద్ర శివారులోని మద్దుల్ అటవీ ప్రాంతంలో గల శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున దొంగలు పడ్డారు. చానల్ గేట్ తలుపులను పగులగొట్టి స్వామివారి మీద గల వెండి ఆభరణాలు, హుండీ పగులగొట్టి రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారమందుకున్న ఎస్సై పాండేరావు చోరీ జరిగిన శ్రీలక్ష్మినర్సింహాస్వామి ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. లోలం పెద్దమ్మ ఆలయంలో.. ఇందల్వాయి: మండలంలోని లోలం గ్రామ శివారులో గల పెద్దమ్మ ఆలయంలోకి సొమవారం రాత్రి దొంగలు చొరబడ్డారు. హుండీ పగలగొట్టి దాదాపు రూ.7 వేల నగదు, అమ్మవారి పుస్తెమట్టెలు, పట్టగొలుసులు ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయం గేటుకు వేసిన తీళం పగలగొట్టి, బీరువాను ధ్వంసం చేశారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు కేసు నమోదు చేసుకున్నారని సర్పంచ్ మమత చెప్పారు. -
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
నిజామాబాద్–2 ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించే దూదేకుల గఫూర్ (35) మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. సమ్మెపై ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తుండడంతో మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటారోలేదోనన్న బెంగతో గుండెపోటుకు గురయ్యాడని తెలుస్తోంది. సాక్షి, నిజామాబాద్ : సమ్మె నేపథ్యంలో.. ఇక తనకు ఉద్యోగం రాదనే బెంగతో కార్మికుడు గుండె నొప్పితో మరణించాడు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల గ్రామంలో మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గఫూర్ తన నివాసంలో టీవిలో ఆర్టీసీ సమ్మె వార్తలు చూస్తుండగానే గుండెనొప్పికి గురయ్యా రు.నొప్పిరాగానే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చేగుంట తుఫ్రాన్ మధ్యలో గఫూర్ ప్రాణాలు విడిచాడు. ఇతనికి భార్య, ఆరు నెలల కుమార్తె తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నారు. మొత్తం కుటుంబ భారమంతా ఇతనిపైనే ఉన్నందున మానసికంగా కుంగిపోయాడని తద్వారా గుండెనొప్పి వచ్చిం దని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంత కాలంగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అతడికి కుటుంబ పోషణ భారంగా మారింది. ఈనేపథ్యంలో వారం రోజులుగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు గఫూర్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. గఫూర్ మరణవార్తను తెలసుకున్న మం డలంలోని పలువురు ఆర్టీసీ కార్మికులు హుటాహుటిన గోలిలింగాల గ్రామానికి చేరు కుని వివరాలను ఆరా తీశారు. కేవలం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభు త్వం చేస్తున్న తాత్సారమే గఫూర్ మృతికి కారణమైందని ఆర్టీసీ కార్మికులు ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదిమందికిపైగా గుండెనొప్పితో మరణించారని, ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇంకెంతమందిని పొట్టనపెట్టుకుంటారని నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ జెఏఏసీ కో–కన్వీనర్, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు.