ప్రియుడి ఇంట్లో ప్రియురాలి ఆత్మహత్యాయత్నం | Young Girl Trying To Take Her Own Life In Lover House For Cheating | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంట్లో ప్రియురాలి ఆత్మహత్యాయత్నం

Published Sun, Jun 20 2021 1:10 PM | Last Updated on Sun, Jun 20 2021 1:12 PM

Young Girl Trying To Take Her Own Life In Lover House For Cheating - Sakshi

సాక్షి,నిజామాబాద్‌: ప్రేమికుడి ఇంట్లో ప్రియురాలు పినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఒక యువకుడు ఏడాది కిందట ఒక అమ్మాయిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం సదరు అమ్మాయి తన ఇంట్లో వాళ్లకు చెప్పకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వేరే పెళ్లి చేశారు. అమ్మాయికి పెళ్లి అయిన రెండో రోజునే ఆ అధికారి ఆమె ఇంటికి వచ్చి రహస్యంగా ఆమెను నగరంలోనే మరో ఇంట్లో ఉంచి పరారయ్యాడు.

అయితే అమ్మాయి తాను మోసపోయానని భావించి తల్లిదండ్రులకు విషయం వివరించింది. దీంతో సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఆ యువకుడి ఇంట్లో వదిలివెళ్లారు. తాను మోసపోయాననే అవమానభారం తట్టుకోలేక ప్రియుడి ఇంట్లోనే ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

చదవండి: పోలీసుల కళ్లెదుటే వ్యక్తి గుండెల్లో పొడిచి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement