సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): సీఎం కేసీఆర్ ‘చీప్’మినిస్టర్ అని, ఇంత చేతగాని, దిగజారిపోయిన సీఎంను ఎన్నడూ చూడలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు టీఆర్‌ఎస్ గెలుపు కోసం పని చేసినందుకే సీఎం కేసీఆర్ పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ డబ్బులు, మద్యం పంపిణీ చేసిన వీడియోలు డజన్ల కొద్దీ చూపిస్తానని.. సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా? అని ఆయన సవాల్ విసిరారు. నిజామాబాద్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కేసీఆర్‌కు హిందువుల సంస్కృతి తెలియదని,గురుకులాల్లో దళి తులు, చిన్న పిల్లలను మత మార్పిడులు చేస్తున్న నువ్వు హిందువువా? అని ప్రశ్నించారు. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసే హక్కు అసెంబ్లీకి లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment