
ప్రాజెక్టు వద్ద పర్యాటకులు
సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్) : నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద సోమవారం పర్యాటకుల సందడి నెలకొంది. చాలారోజుల తర్వాత ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో కామారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు హైదరాబాద్ నుంచి సందర్శకులు ప్రాజెక్టుకు తరలివచ్చారు. ప్రాజెక్టు అలుగుపై నుంచి పర్యాటకులు నడుచుకుంటూ ఉత్సాహాంగా గడిపారు. ప్రాజెక్టు వద్ద వంటలు చేసుకొని సామూహికంగా భోజనాలు చేశారు. ప్రాజెక్టులో నీటిమట్టం 18ఫీట్లకు చేరుకుంది. ప్రాజెక్టు ఎగువప్రాంతం నుంచి ప్రస్తుతం 285క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1461.33అడుగులతో 1.398టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టిందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment