nagireddypeta
-
‘పోచారం’ వద్ద పర్యాటకుల సందడి
సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్) : నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద సోమవారం పర్యాటకుల సందడి నెలకొంది. చాలారోజుల తర్వాత ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో కామారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు హైదరాబాద్ నుంచి సందర్శకులు ప్రాజెక్టుకు తరలివచ్చారు. ప్రాజెక్టు అలుగుపై నుంచి పర్యాటకులు నడుచుకుంటూ ఉత్సాహాంగా గడిపారు. ప్రాజెక్టు వద్ద వంటలు చేసుకొని సామూహికంగా భోజనాలు చేశారు. ప్రాజెక్టులో నీటిమట్టం 18ఫీట్లకు చేరుకుంది. ప్రాజెక్టు ఎగువప్రాంతం నుంచి ప్రస్తుతం 285క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1461.33అడుగులతో 1.398టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టిందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
జాతివైరం మరిచి..
సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్) : చిన్నచిన్న కారణాలతో పగలు, ప్రతీకారాలు పెంచుకుంటున్న మనుషుల మధ్య కొన్ని మూగజీవాలు జాతివైరాన్ని మరచి స్నేహభావంతో బతుకుతున్నాయి. కుక్కలు, పిల్ల కలిసి జీవిస్తూ అబ్బురపరుస్తున్నాయి.నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన కల్లంపేట కృష్ణ అనే యువకుడు తన ఇంటివద్ద మూడు కుక్కలతోపాటు ఒక పిల్లిని పెంచుకుంటున్నాడు. కాగా కుక్క, పిల్లి మధ్య జాతి వైరమున్నప్పటికీ.. కృష్ణ పెంచుకుంటున్న కుక్కలు, పిల్లి మాత్రం స్నేహపూర్వకంగా మెలుగుతుండడం గమనార్హం. వీటి స్నేహాన్ని, ఆటలను చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏ రోజు కూడా పిల్లికి తన కుక్కలు హాని తలపెట్టలేదని కృష్ణ చెబుతున్నారు. -
నాగిరెడ్డిపేటను ‘మెదక్’లో కలపాలి
పోచమ్మరాలో నిరాహార దీక్షలు ప్రారంభించిన గ్రామస్తులు మెదక్ రూరల్: ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ నాగిరెడ్డిపేట గ్రామస్తులు మంగళవారం మెదక్ మండలం పోచమ్మరాల్ గ్రామంలో నిరాహర దీక్షలు చేపట్టారు. నాగిరెడ్డిపేటను దగ్గరలో ఉన్న మెదక్‌లో కాకుండా కామారెడ్డిలో చేర్చాలనే ప్రభుత్వ ముసాయిదాను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా ఉద్యమాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నర్సింహారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, జయరాజ్, వాసురెడ్డి, బాపురెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.