
సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్) : చిన్నచిన్న కారణాలతో పగలు, ప్రతీకారాలు పెంచుకుంటున్న మనుషుల మధ్య కొన్ని మూగజీవాలు జాతివైరాన్ని మరచి స్నేహభావంతో బతుకుతున్నాయి. కుక్కలు, పిల్ల కలిసి జీవిస్తూ అబ్బురపరుస్తున్నాయి.నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన కల్లంపేట కృష్ణ అనే యువకుడు తన ఇంటివద్ద మూడు కుక్కలతోపాటు ఒక పిల్లిని పెంచుకుంటున్నాడు. కాగా కుక్క, పిల్లి మధ్య జాతి వైరమున్నప్పటికీ.. కృష్ణ పెంచుకుంటున్న కుక్కలు, పిల్లి మాత్రం స్నేహపూర్వకంగా మెలుగుతుండడం గమనార్హం. వీటి స్నేహాన్ని, ఆటలను చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏ రోజు కూడా పిల్లికి తన కుక్కలు హాని తలపెట్టలేదని కృష్ణ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment