
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్‌పై కార్మికుల దాడి చేశారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకుని మరి దాడికి పాల్పడ్డ కార్మికులు.. పసుపు దొంగతనం ఆరోపణలు నిరసిస్తూ పసుపు కాంటాలు నిలిపివేశారు. ఆందోళనకు దిగిన కార్మికులు.. మార్కెట్ ఛైర్మన్‌ను నిలదీశారు. పసుపు మార్కెట్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.
నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డులో కార్మికులు సమ్మెకు దిగారు. ర్యాలీగా వచ్చిన కార్మిక సంఘాలు.. చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించాయి. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారంటూ కార్మికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్మికుల సమ్మెతో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. దీంతో రైతులు ఆందోళన పడుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి క్రయవిక్రయాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment