Vana Bhojanalu
-
NRI: 'టాగ్' ఆధ్వర్యంలో బెర్లిన్‌లో 'వన భోజనాలు'..
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (టాగ్) ఆధ్వర్యంలో ఆదివారం బెర్లిన్‌లోని చారిత్రక వోక్స్పార్క్లో "వన భోజనాలు" కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రఘు చలిగంటి మాట్లాడుతూ, వన భోజనాలకు సంబంధించిన విశేషాలను పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. చాలా కుటుంబాలు హాజరయ్యాయి. ఒకరితో ఒకరు పరిచయం కావడం ఆనందంగా అనిపించింది.ఈ ఈవెంట్ మాకు ప్రతిష్టాత్మకమైన సంప్రదాయంగా మారింది, ప్రతి వేసవిలో కొత్తగా ఇక్కడకు వచ్చిన కుటుంబాలను స్వాగతించడానికి, మా కమ్యూనిటీ బంధాలను బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.ఈ ఈవెంట్‌ను నిర్వహించేందుకు అంకితభావంతో పనిచేసిన టాగ్ కార్యదర్శులు శరత్, అలేకీ, నరేష్‌లకు అలాగే ఈవెంట్‌ను విజయవంతం చేయడానికి తమ సమయాన్ని, కృషిని అందించిన వాలంటీర్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. - డాక్టర్ రఘు చలిగంటి, టాగ్ అధ్యక్షుడు -
కుల మతాలకు అతీతంగా మండపేటలో కార్తీక వన భోజనాలు
-
రాజానగరం లో ఘనంగా కాపు కార్తీకమాస వన సమారాధన సభ
-
సంఘటితం.. సమారాధనం
సాక్షి, అమరావతి: అనుకూలమైన వనంలో బంధుమిత్రుల కలయిక. లక్ష్మీ దేవి స్వరూపంగా భావించే ఉసిరి చెట్టుకు పూజలు. అక్కడే వంటలు, ఆటలు, పాటలు, భోజనాలు.. ఓ వైపు ఆధ్యాత్మిక వాతావరణం. మరోవైపు ఆహ్లాదకరమైన సమారాధనం.. ఇదీ కార్తీక మాస వనభోజనాల ప్రత్యేకం. గతంలో ఇలా జరిగిన వన భోజనాల రూపు నేడు మారింది. ఒక కులానికి చెందిన వారంతా ఒక చోటకు చేరుతున్నారు. రాజకీయాలు, ఆర్థిక తారతమ్యాలకు అతీతంగా వనభోజనాల్లో ఐక్యతారాగం పాడుతున్నారు. ఉత్తేజపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. తమ కులస్థులు ఉన్నత స్థాయికి ఎదిగే ప్రణాళికలు వేస్తున్నారు. కుల జనోద్దరణ కోసం కార్తీక వనభోజనాలను వేదికగా చేసుకోవడం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 20 ఏళ్ల క్రితం మొదలైంది. అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండ్‌గా మారింది. కులస్థులను సంఘటితం చేసే సంకల్పంతో సమారాధనలు జరుగుతున్నాయి. తమ కులంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయాత నిచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజంలో ఎదుగుతున్న వారికి వెన్నుదన్నుగా ఎలా ఉండాలి అనే ప్రణాళికలు కూడా వేస్తున్నారు. మునుల కాలం నుంచి.. మాసాల్లో కార్తీకమాసానిది ప్రత్యేకం. శివకేశవులు ఆరాధన, ఉపవాస నియమాలు, పుణ్యతీర్థాల్లో స్నానాలు, ఆలయాల సందర్శనలు, వివిధ మాల ధారణలు ఇలా ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తూ ఉంటుంది. మరో పక్క వనభోజనాల సందడి కనిపిస్తూ ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజునే నైమిశారణ్యంలో సూత మహర్షి ఆధ్వర్యంలో మునులంతా వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు ‘కార్తీక పురాణం’లో ప్రస్తావించారు. భారతీయ సంప్రదాయంలో వనవిహారానికి ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదంలో ఉసరికి ప్రత్యేక స్థానం ఉంది. ఇలా అన్నీ కలసిన కార్తీకం మానసిక ఉల్లాసాన్నిస్తుంది. స్థానికంగా కుల సమారాధన.. రాష్ట్రంలో ప్రధానంగా కాపు, రెడ్డి, గౌడ–శెట్టిబలిజ, యాదవ, వైశ్య, కమ్మ, క్షత్రియ తదితర కులాల వారీగా సామాజిక వన భోజనాల సందడి కొనసాగుతోంది. ఉద్యోగులు, వ్యాపారులకు విరామం దొరికే ఆదివారం అయితే మరింత జోరుగా జరుగుతుంది. ఈ ఏడాది కార్తీకమాసం తొలి ఆదివారం రాజమండ్రిలో నిర్వహించిన గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత కుల సమారాధనకు పార్టీలకు అతీతంగా పలువులు నేతలు హాజరయ్యారు. గత ఆదివారం భీమవరంలో నిర్వహించిన ఆర్యవైశ్య సమ్మేళనంలో ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. సింగపూర్‌లోని ఆర్యవైశ్యులు సైతం అక్కడి కూర్మ ద్వీపంలో (కుసు ఐలాండ్) కార్తీక వనభోజనాలను నిర్వహించుకోవడం విశేషం. చీమకుర్తి మండలం రామతీర్థంలోని మోక్ష రామలింగేశ్వరస్వామి దేవస్థానం వద్ద యోగి వేమన రెడ్ల సత్రంలో ఈ నెల 14న కార్తీక వన భోజనాలను నిర్వహించనున్నారు. రాయలసీమ ప్రాంతంలో రెడ్లు, కురుబ, యాదవ, బలిజ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కమ్మ, కాపు, గౌడ కులాలు, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో శెట్టిబలిజ–గౌడ, ఆర్యవైశ్య, క్షత్రియ, ఉత్తరాంధ్రలో తూర్పుకాపు, నగరాలు, కాళింగ తదితర కులాల వారీగా వన సమారాధనలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ట్రెండ్ మారింది.. సంఘటిత శక్తి చాటుతోంది గతంలో ఆధ్యాత్మిక కార్యక్రమంగా బంధు మిత్రుల సమక్షంలో కార్తీక వన భోజనాలు నిర్వహించేవారు. ఆ తర్వాత ఆ వేదికలను సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఉపయోగించుకున్నారు. మరింత సామాజిక స్పృహ పెరిగి సొంత కులంలో ఆర్థికంగా దెబ్బతిన్న వారిని ఆదుకోవడానికి, విద్యా, వైద్యానికి సాయమందించడానికి కార్తీక వన సమారాధనలను వేదికగా చేసేవారు. క్రమంగా సామాజిక సంఘటిత శక్తిని చాటేందుకు ఉపయోగించుకోవడంతో పాటు రాజకీయంగా రాణించేందుకు దిశానిర్దేశం చేసేలా వన సమారాధనలు మారాయి. – పాకా వెంకట సత్యనారాయణ, కన్వీనర్, బీసీ కులాల సమాఖ్య పుణ్యం.. పురుషార్థం రాష్ట్రంలో కార్తీక సమారాధనలో పూజలతో పుణ్యం వస్తుంది. బంధు మిత్రులు ఒకే చోట కలుసుకుని సాధకబాధకాలు చర్చించుకుని, ఐక్యంగా పరిష్కారాలు కనుగొని ముందుకు సాగేందుకు చేసే ప్రయత్నాలతో పురుషార్థం నెరవేరుతుంది. రాష్ట్రంలో చాలా కాలంగా అనేక విధాలుగా కాపులు వన సమారాధనలు నిర్వహించి కులస్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. విహారయాత్రలు, వన సమారాధనలు నిర్వహిస్తున్నారు. అన్ని రంగాల్లోను రాణించేలా సంఘీయులు దిశానిర్దేశం చేస్తుంటారు. – చినమిల్లి వెంకట్రాయుడు, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, పశ్చిమగోదావరి జిల్లా సంఘటితం.. చైతన్యం వెనుకబడిన తరగతులకు చెందిన గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత వంటి గీత కులాల వారు ఒకే సామాజికవర్గంగా ఉన్నారు. వీరంతా మరింత సంఘటితమై చైతన్యవంతంగా ముందుకు సాగేందుకు ఎన్నో ఏళ్ల నుంచి కార్తీక వనభోజనాలను నిర్వహిస్తున్నారు. సమాజంలో వారిని వారు రక్షించుకునేందుకు మొదలైన సంఘటిత నిర్మాణం.. కార్తీక వన సమారాధనలతో మరింత చైతన్యవంతమైంది. –వేండ్ర వెంకటస్వామి, గౌడ–శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు, పశ్చిమగోదావరి జిల్లా. -
ఫిలడెల్ఫియాలో ఘనంగా తానా వన భోజనాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో వన భోజనాలు ఘనంగా జరిగాయి. అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రం, ఓక్స్ నగరంలోని లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ పార్కులో తానా సభ్యులు వన భోజన కార్యక్రమాల్ని నిర్వహించారు. మిడ్ అట్లాంటిక్, ఫిలడెల్ఫియా నగర పరిధిలో వందల సంఖ్యలో తెలుగు వారు, న్యూ జెర్సీ, డెలావేర్ నుంచి,టెక్సాస్ నుండి నాగరాజు నలజుల, వర్జీనియా నుండి బాబీ యెర్ర, ఫ్లోరిడా నుండి సాయి జరుగుల ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా మిడ్ అట్లాంటిక్ కోఆర్డినేటర్ సునీల్ కోగంటి మాట్లాడుతూ..23వ తానా మహాసభలు 2023 జులై 7 నుండి 9 వరకు ఫిలడెల్ఫియా లోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జరగనున్నట్లు తెలిపారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, మహాసభల కోఆర్డినేటర్ పొట్లూరి రవి నేతృత్వంలో సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. ఏర్పాట్లలో భాగంగా నవంబర్ 5 నాడు పెన్సిల్వేనియా వార్మినిస్టర్ నగరంలోని ఫ్యూజ్ బాంక్వెట్ హాల్లో తానా 23వ మహాసభల కిక్ ఆఫ్ డిన్నర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తానా లీడర్షిప్ టీం నుండి ఈ కార్యక్రమంలో సునీల్ కోగంటి, రాజా కసుకుర్తి, విద్య గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి, తానా 23వ మహాసభల కోఆర్డినేటర్ పొట్లూరి రవి, పాఠశాల చైర్ నాగరాజు నలజుల, టీం స్క్వేర్ కోచైర్ కిరణ్ కొత్తపల్లి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వనాధ్ కోగంటి, హరనాథ్ దొడ్డపనేని, లీలా కృష్ణ దావులూరి, శ్రీనివాస్ భారతవరపు, సుధాకర్ కంద్యాల, కృష్ణ నందమూరి, రాహుల్ యెర్ర, సాయి జరుగుల, రత్న మూల్పూరి, మూర్తి నూతనపాటి, రవి ఇంద్రకంటి, పవన్ నడింపల్లి, హరీష్ అన్నాబత్తిన, ప్రవీణ్ ఇరుకులపాటి, సురేష్ కంకణాల, శ్రీధర్ సాదినేని, శ్రవణ్ లంక, గౌరీ కర్రోతు, సతీష్ నల్లా, సౌజన్య ఉన్నవ తదితరులు సహాయ సహకారాలు అందించారు. -
ఒక ఊరి కథ: పిల్లా జెల్లా రోజంతా బయటే!
సాక్షి, బెంగళూరు: సుభిక్షంగా ఉండాలనుకుంటూ ఆ ఊరంతా ఖాళీ అయిపోతుంది. ఒక్కరోజంతా పిల్లా జెల్లా గోడ్డుతో బయటే గడుపుతుంది. వన భోజనాల సమయంలో మండలంలోనే ఆ ఊరు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. రోళ్ల మండల పరిధిలోని దొమ్మరహట్టి గ్రామంలోని ప్రజలు ఏటా సంప్రదాయం ప్రకారం.. ఊరి నుంచి పిల్లాపాపలు, జంతువులతో ఊరిబయటకు తరలిపోతారు. సమీపాన గుడారాలు వేసుకున్నారు. ముందుగా ఊరి చుట్టు ముళ్ల కంపల కంచెను వేశారు. చెట్టు దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాది ఒకసారి ఆషాఢ మాసంలో గ్రామాన్ని బహిష్కరించి చెట్టు దేవునికి వంటకాలు చేసి నైవేద్యంగా సమర్పించడం అనవాయితీ. ఇలా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని, ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉంటారని గ్రామస్తుల నమ్మకం. రకరకాల వంటకాలు చేసి బంధుమిత్రులతో ఆరగించారు. గురువారం నాడు వనభోజనం నిర్వహించి.. సాయంత్రం వరకు ఊరి బయటనే ఆటపాటలతో గడిపారు. -
డాల్లస్‌లో ఘనంగా వనభోజన కార్యక్రమం
టెక్సాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాల్లస్ (టీపీఏడీ) ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని డాల్లస్‌లో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్వర్యంలో గడిచిన మూడు నెలల్లో వరుసగా మూడు సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించిన తరువాత టీపీఏడీ వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ వనభోజన కార్యక్రమంతో డాల్లస్‌లోని తెలుగు వారందరినీ ఒక వేదికపైకి తీసుకురావడం సంతోషంగా ఉందని కార్యక్రమ నిర్వహకులు తెలిపారు. ఈ వనభోజన కార్యక్రమం డాల్లస్‌లోని హార్స్ రాంచీ, బిగ్ బ్యారెల్ రాంచీ, అరుబ్రే రాంచీ ప్రాంతాల్లో నిర్వహించారు. డాల్లస్‌లోని తెలుగువారు తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులను ధరించి ఎంతో ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ సంస్కృతి కనులకు కన్పించేలా భారీ సెట్టింగ్‌లతో ఫార్మ్ హౌజ్ ప్రాంతాలను అందంగా ముస్తాబు చేశారు. టెక్సాస్‌లో కోవిడ్-19 నిబంధనలను కాస్త సడలించడంతో తెలుగువారు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం మొదట గణపతి పూజతో మొదలై.. నోరురించే తెలంగాణ పిండి వంటకాలను తయారుచేసి అరగించారు. అంతేకాకుంగా కార్యక్రమంలో నృత్య ప్రదర్శన, మ్యూజిక్, క్రికెట్, ఇతర కార్యక్రమాలను నిర్వహించారు. రావు కాల్వల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన టీపీఏడీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీఏడీ అధ్యక్షుడు రవికాంత్ మామిడి, ఉపాధ్యక్షులు రూప కన్నయ్యగారి, శ్రీధర్ వేముల, మాధవి సుంకి రెడ్డి, ఇంద్రాణి పంచెరుపుల, మంజుల తోడుపునూరి, లక్ష్మి పోరెడ్డి, అనురాధ మేకల, ఫణీవీర్ కోటి, సీనియర్ టీపీఎడీ టీం మెంబర్ రఘువీర్ బండారు, కో ఆర్డినేటర్ గోలి బుచ్చిరెడ్డి తదితర తెలుగు వారు పాల్గొన్నారు. చదవండి: ఘనంగా 4వ అన్నమయ్య శతగళార్చన -
మా సంతోషం కోసం...
కలిసి కూర్చుంటే మాటలు కలుస్తాయి. కూర్చొని మాట్లాడుకుంటే అపోహలు విడిపోతాయి. కలిసి కూర్చొని, మాట్లాడుకుంటూ.. భోజనాలు చేస్తే.. అదొక ఫ్యామిలీ ఫంక్షన్ అవుతుంది. జీవిత ‘మా’ సభ్యులందరినీ కార్తీక భోజనాలకు పిలుస్తున్నారు. ఆ విశేషాలను మనతో పంచుకున్నారు. వన భోజనాల ఏర్పాట్లతో హడావుడిగా ఉన్నారని తెలిసింది... జీవిత: ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కోసం ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ‘మా’ తరఫున వన భోజనాలు ఏర్పాటు చేసేవారు. అప్పుడు ఎప్పుడో చిరంజీవిగారి చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ‘మా’ నుంచి చేయలేదు. ఇప్పుడు కూడా ‘మా’లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అందుకే ‘మా’ ఆధ్వర్యంలో కాకుండా మేం పర్సనల్‌గా చేస్తున్నాం. వచ్చే ఏడాది తప్పకుండా ‘మా’ నుంచి చేసే ప్రయత్నాలు చేస్తాం. అంటే.. ఇప్పుడు జరిగేది ‘మా’ తరఫున కాదు. జీవితా రాజశేఖర్ తరఫున అంటారా? అవును. మా సంతోషం కోసం చేస్తున్నాం. వేదిక ఎక్కడ? ఫీనిక్స్‌లో ప్లాన్ చేస్తున్నాం. 300 నుంచి 400 మంది వస్తారని ఊహిస్తున్నాం. ‘మా’ అంటే నటీనటుల సంఘం మాత్రమే. మరి.. మిగతా శాఖల వాళ్లని కూడా పిలుస్తున్నారా? లేదు. ‘మా’ సభ్యులనే అనుకుంటున్నాం. వ్యక్తిగతంగా ఎవర్నీ పిలవకూడదు అనుకుంటున్నాం. ఇలా మీరు నిర్వహించడంవల్ల ఏదైనా వివాదాలు వచ్చే అవకాశం ఉందంటారా? ఎటువంటి వివాదాలు రావనే భావిస్తున్నాం. రాబోయే నెల రోజుల్లో ‘మా’లో ఉన్న సమస్యలకు ఏదో ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటాం. ప్రస్తుతానికి పరిష్కరించి, ఆ తర్వాత వన భోజనాలు ఏర్పాటు చేసేంత టైమ్ లేదు. కార్తీక మాసం వచ్చే వారంతో అయిపోతుంది కాబట్టి.. ఇది ప్లాన్ చేశాం. వనభోజనాలను మీరు హోస్ట్ చేయబోతున్నారని తెలిసి ‘మా’ మెంబర్స్ ఏమన్నారు? చాలామంది ఉత్సాహం చూపించారు. ఈ మధ్య కాలంలో ఎవరూ చేయలేదు. చాలా విరామం తర్వాత మీరు చేయబోతున్నారని హ్యాపీగా స్పందిస్తున్నారు. ఎటువంటి వంటకాలను ప్లాన్ చేశారు? ఇంకా ఏం అనుకోలేదు. ఆదివారం వెళ్లి వంట విభాగానికి చెందిన వారితో చేయబోయే వంటకాల గురించి చర్చించాలి. ఈ విందులో ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారా? లైవ్ మ్యూజిక్ పెట్టాలనుకున్నాం. ఇంకా కొన్ని స్కిట్స్, గేమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. వచ్చినవాళ్లందరూ బాగా ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఉంటుంది. నాలుగు వందల మంది అతిథులంటే మీకు చేతి నిండా పనే.. (నవ్వుతూ) చేస్తున్నది మేం అయినప్పటికి అందరూ సహాయం చేస్తారు. అలా అందరితో కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలనుకుంటున్నాం. మీ కుమార్తెల విషయానికి వస్తే.. శివానీ, శివాత్మిక అని పేర్లు పెట్టారు. మీరు శివ భక్తులా? రాజశేఖర్‌గారు శివభక్తులు. ఆయనకు శివుడు అంటే చాలా ఇష్టం. రాజశేఖర్‌గారి మెడలో శివలింగం ఉంటుంది. శివభక్తి వల్లే మా కుమార్తెలకు శివానీ, శివాత్మిక అని పేర్లు పెట్టాం. కార్తీకమాసంలో మీరు పూజలు చేస్తారా? జనరల్‌గా కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తారు. నేనూ వెలిగిస్తాను. కానీ పెద్దగా పూజలు చేయను. రాజశేఖర్, మీ కుమార్తెల సినిమాల గురించి? రాజశేఖర్‌గారు హీరోగా చేయబోతున్న సినిమా జనవరిలో మొదలవుతుంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతా. ‘పెళ్ళిగోల’ వెబ్ సిరీస్ చేసిన మల్లిక్ దర్శకత్వంలో శివానీ హీరోయిన్గా ఓ సినిమా జరుగుతోంది. చైల్డ్ ఆర్టిస్టు తేజ హీరోగా నటిస్తున్నారు. ‘అద్భుతం’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. రధన్ సంగీతం అందిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ రచయిత. మంచి కథ. శివానిది మంచి పాత్ర. -
‘పోచారం’ వద్ద పర్యాటకుల సందడి
సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్) : నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద సోమవారం పర్యాటకుల సందడి నెలకొంది. చాలారోజుల తర్వాత ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో కామారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు హైదరాబాద్ నుంచి సందర్శకులు ప్రాజెక్టుకు తరలివచ్చారు. ప్రాజెక్టు అలుగుపై నుంచి పర్యాటకులు నడుచుకుంటూ ఉత్సాహాంగా గడిపారు. ప్రాజెక్టు వద్ద వంటలు చేసుకొని సామూహికంగా భోజనాలు చేశారు. ప్రాజెక్టులో నీటిమట్టం 18ఫీట్లకు చేరుకుంది. ప్రాజెక్టు ఎగువప్రాంతం నుంచి ప్రస్తుతం 285క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1461.33అడుగులతో 1.398టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టిందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
వనభోజనాలు.. పొలిటికల్ మీల్స్
రాజకీయ పార్టీల రూటు మారింది. సాధారణంగా రద్దీ కూడళ్లు, కాలనీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, మార్కెట్లు తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించే అభ్యర్థులు తాజాగా నగర శివార్లకు తరలి వెళ్తున్నారు. శివార్లలోని ఫంక్షన్‌హాళ్లు, ఫాంహౌస్‌లు, ఆలయాలను సైతం ప్రచార వేదికలుగా మలుచుకుంటున్నారు. ఈ వరసలో కార్తీక వనభోజనాల్లో ఇప్పుడు పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. కుల, కాలనీ, అపార్ట్మెంట్ సంఘాల ఓట్లను గంపగుత్తగా వేసుకొనేందుకు రాజకీయ పార్టీలే వనభోజనాలను నిర్వహిస్తున్నాయి. వివిధ కులసంఘాలకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఫంక్షన్ హాళ్లు, పార్కుల్లో ముందస్తు బుకింగ్‌లు కాలనీ, అపార్ట్మెంట్ సంఘాలు కూడా ఏడాదికోసారి ఆటవిడుపుగా ఉండేందుకు, సాన్నిహిత్యాన్ని పెంచుకొనేందుకు నగరంలోని పార్కుల్లో ఇలాంటి వేడుకలను నిర్వహిస్తారు. కానీ ఈసారి వనభోజనాలు ఎన్నికల ప్రచార వేదికలుగా మారాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున మొదటి విడత వన భోజనాలను నిర్వహించిన పార్టీలు రానున్న కార్తీక మాసం చివరి రెండు ఆదివారాల (ఈ నెల 25, డిసెంబర్ 2)లో రెండో విడత కార్తీక వన భోజనాలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకున్నాయి. వంటలు.. వడ్డింపులు సాధారణంగా కుల సంఘాలు, కాలనీ సంఘాలు నిర్వహించే వనభోజనాలకు పిల్లలు, పెద్దలు కలిసి వెయ్యి నుంచి 1,500 మంది వరకు ఉంటారు. అందరినీ ఆకట్టుకునేందుకు త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా మెనూ రూపొందిస్తున్నట్లు ఓ పార్టీ నాయకుడు తెలిపారు. ఇక సొంత కులానికి చెందిన వాళ్లే వనభోజనాలకు తరలివచ్చిన చోట అభ్యర్థుల పని మరింత సులువవుతోంది. చలో టూర్.. వారాంతాలు, వరస సెలవులు కూడా పార్టీల ప్రచారానికి కలిసొచ్చాయి. కాలనీ సంఘాలకు, సీనియర్ సిటీజన్స్ సంఘాలకు టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. సరదాగా పర్యాటక ప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకొనే పెద్దవాళ్లకు పార్టీల అభ్యర్థులే స్వయంగా వాహనాలు బుక్ చేసి, టూర్ ప్యాకేజీలను అందజేస్తున్నారు. ఎస్సార్‌నగర్‌లోని ఓ కాలనీకి చెందిన సీనియర్ సిటిజన్స్ పర్యటన కోసం ఒక పార్టీకి చెందిన అభ్యర్థి రూ.2 లక్షలు అందజేశారు. టూర్ ముగించుకొని వచ్చాక వనభోజనాల కోసం మరికొంత డబ్బు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ..::: పగిడిపాల ఆంజనేయులు -
గార్డెన్ దావత్‌కు నువ్వు రావలె
’అన్నా.. గీ ఆదివారం గార్డెన్ దావత్ అంట నువ్వు రావలె’ అని ఎంకటేసు అంటే నాకు సమజ్ గాలె. ఈ బిత్తిరోడు ఏదీ సక్కగ జెప్పడు గదా అనుకుని’ గార్డెన్ దావత్ ఏందిర బై.. ఇనేందుకే కొత్తగుంది’ అనడిగిన. ‘గదేనే.. కార్తీకంలో దావత్ పెడ్తరు.. అందరు కలుస్తరు గద’ అనంగనే నా బుర్ర గిర్రమంది. ‘అరె బేవకూఫ్ దాన్ని వనబోజనం అంటరు.’ అన్న. ‘గదేలేవె.. నాకేం దెల్సు ఇక్కడందరు గట్లనె అంటుండ్రు. గద్సరె గాని ఇంటోల్లందర్ని పిల్సుకు రా మల్ల’ అనెల్లిండు. కార్తీక మాసం ఒచ్చిందంటే వనబోజనాలు ఉంటయ్ గద. గీసారి ఏంది స్పెసల్ అని ఆలోచిస్తె టక్కున బల్బు ఎలిగింది. ఆ గీసారి ఎలచ్చన్లున్నయ్గ.. గదీ సంగతి. అరె ఈ ఎలచ్చన్లు.. వనబోజనాలు బలె కల్సి వచ్చినయ్! ⇔ వానకాలం ఎళ్లి చలికాలం సురువయ్యే టైంల వచ్చే గీ కార్తీకం అంటె ఇస్టం లేందెవర్కి. దివిల పండగ మొదలు ఇంటి ముందు మట్టి ప్రమిదల్ల దీపాలెల్గుతుంటె.. గవి మన కండ్లల్ల వెలుగుతున్నట్లె ఉంటయ్. ఇండ్లల్ల.. వీదుల్ల.. గుళ్లోన.. వెయ్యిదీపాలు.. లచ్చ దీపాలు.. కోటి దీపాలు అంటూ పోటీ పడ్తుంటె.. ఊరు ఊరంతా గా దీపాల్లెక్కన మెరిసిపోతుంటది. గింతేగాదు కార్తీకం అనగానె టక్కున గుర్తొచ్చేది వనబోజనాలె. ఊర్లో.. సిటీల అన్ని చోట్ల గీ వనబోజనాల సందడే సందడి. మొదట్లో గల్లీలో ఉన్నోళ్లు.. ఊరి చివర్న తోటల్కాడికెల్లి బోజనాల్జేసి కొంతసేపు కుశాల్గ కబుర్లు చెప్పుకొని ఆడిపాడి వచ్చేటోల్లు. ఊరేదైనా.. పేరేదైనా జనాలు కల్సిమెల్సి ఉండే మంచి కాలం అది. గిప్పుడు గట్ల కాదు. ఎవరికి వాల్లు సామాజిక వర్గాలుగ గుంపులు కట్టిండ్రు. వాట్సప్ల్ల కూడా గివి జోర్దార్గ నడుస్తున్నయ్ అంటె సూడుండ్రి. గీల్ల దిమాక్ గింతెందుకు కరాబ్ అవుతాందో గెంత బుర్ర పెట్టినా అందుత లేదు. ⇔ గిప్పుడు మా గల్లీల వనజోజనం ప్రచారం బలె జోరందుకుంది. కార్తీక మాసం.. శివనామ స్మరణం! వనబోజన ఉత్సవం.. అందరూ తరలి రావాలె! అంటూ బ్యానర్లు.. ప్లెక్సీçలు మస్తుగ కట్టిండ్రు. క్యాండేటు.. లేదా లీడర్లెంట.. పార్టీలెంట తిరిగే గల్లీ లీడరు దండాలు పెడ్తున్న పొటోలు పెట్టిండ్రు. గింతే కాదు సామాజికవర్గం పేర్లు కూడా రాసుకుండ్రు. ఏందైతే నేం మంచిగ దావత్ పెడ్తుండ్రు పున్నేనికి పున్నెం.. తినటాన్కి అన్నం అనుకుంటుండ్రు జనాలు. ఆదివారం అయితే సాలు గల్లీ ముందు బండ్లు పెడ్తుండ్రు. మల్ల జనాల్ని తీసుకెల్లాలి గాదె. అప్పట్లో తోటలుంటె.. గిప్పుడంత స్వేతా గార్డెన్.. పూజా గార్డెన్.. సువర్ణ గార్డెన్.. ఆ రిసార్టు గీ రిసార్టులు కనిపిస్తున్నయ్! ⇔ మొన్న ఓ వనబోజనం పంక్షన్‌కు కాండేటు వచ్చిండంట. బోజనాలైనంక.. ‘మెల్ల మెల్లగ వచ్చిండే.. క్రీము బిస్కట్ ఏసిండె’ పాట పెట్టంగనె పిల్లలు స్టేజిపై మస్తుగ డాన్సు చేసిండ్రంట. ఏం మిస్టేకో తెలీదు గానీ గీ లైను రాంగానె పాట బంద్. మల్లీ ‘మెల్ల మెల్లగ వచ్చిండే’ అంటూ సురు! గిట్ల నాల్గుసార్లు అయ్యేసరికి గా కాండేటు గుస్సా అయిండంట! ఏం మజాక్ జేస్తుండ్రు? నాకు దెల్వదనుకుండ్రా! గా పాటేంది? గా డాన్సేందిర బై ? నేనేం మెల్లగ రాలె బాగానె వచ్చిన. గదేదో క్రీము బిస్కట్ ఏసిండంటె ఏందర్థం? గింత జేసింది గాకుండ పెట్టిందే పెట్టి నా ఇజ్జత్ దీస్తరా చల్.. అని లేసిండంట. పాపం నిర్వాహకులు అన్నా గుస్సా జెయ్యకే.. గది ‘పిదా’ సిన్మా పాట అన్నా ఇనకుండా.. పిదా లేద్ గిదా లేద్ పదా.. అని ఎంటొచ్చినోల్లని లేప్కొని ఎల్లిపోయిండంట! నిజమే మల్ల ఎప్పుడు జనాల వద్ద రానోల్లకి గిట్ల బోజనాల కాడికొచ్చి ఓటు అడిగితె గట్లనే ఉంటది. ఇంతకీ గీ వనబోజనాల్కి పైసల్ ఎవరిస్తుండ్రని గా ఎంకటేసుల్ని అడిగిన. ఇంకెవ్రు గా కాండేట్లే! నీకు దెల్వదా? అన్నడు. అంటె గివన్నీ ఓట్లు రాబట్కునేకి కొట్టే పల్టీలన్నమాట! గీ గార్డెన్.. కాదు కాదు వనబోజనాలంటూ జనాల్ని కూడేసేది గిందుకోసమెనా? – రామదుర్గంమధుసూదనరావు -
కాన్సాస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కాన్సస్ : అమెరికాలోని కాన్సస్ సిటీలో తెలుగు అసొసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ(టీఏజీకేసీ) ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతోపాటూ, వనభోజనాలు కార్యక్రమం నిర్వహించారు. హెర్టిటేజ్ పార్క్ పార్క్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందమందికి పైగా హాజరయ్యారు. వనభోజనాలతో పాటూ భారత జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపారు. విశేషు రేపల్లె ఆధ్వర్యంలో సరదాగా బొట్టుపెట్టు గిఫ్ట్ కొట్టు, ఔట్ నాటౌట్, మెదడుకు మేత, చికుబుకు చికుబుకు పిల్ల, లోగో క్విజ్ ఆటలపోటీలు నిర్వహించారు. ఫుడ్ కమిటీ ఆధ్వర్యంలో చేసిన ప్రత్యేక వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
సీఏఏ ఆధ్వర్యంలో వనభోజనాలు
చికాగో : చికాగో ఆంధ్రా అసోసియేషన్(సీఏఏ) ఆధ్వర్యంలో వేసవి వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. రుచికరమైన తెలుగు వంటకాలతో ఆట పాటలతో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి మేలిసి ఈ వనభోజన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చికాగోలో శాంబర్గ్ లోని బస్సే పార్క్‌లో ఉదయం 11 గంటల నుంచి, సాయంత్రం 6 వరకు జరిగిన ఈ వనభోజనాల్లో తెలుగు వారందరు ఆత్మీయంగా కలుసుకొని విందు భోజనాలని ఆరగించారు. డా. ఉమ కటికి అధ్యక్షతన చికాగో ఆంధ్రా సంఘం వారు, వారి సాంప్రదాయాన్ని కొనసాగిస్తు, ఈ ఏడాది కూడా అరిటాకులలో వడ్డించడం అందరిని ఆకట్టుకుంది. చికాగోలోని తమ పిల్లలతో గడపాలని ఆంధ్ర నుంచి వచ్చిన తల్లిదండ్రులు సీఏఏ వారి ఆత్మీయతకి అబ్బురపడ్డారు. ఆంధ్రాలోనే బఫెట్ పద్ధతికి అలవాటు పడుతున్న రోజుల్లో అగ్ర రాజ్యంలో సీఏఏ వారి కృషి అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.ఆంధ్రా రుచులైన పులిహోరతో పాటు ఊరగాయ, ముక్కల పులుసు, బెండకాయ వేపుడు, పెరుగువడలు వడ్డించారు. రుచికరమైన పెరుగువడ కోసం ఆంధ్ర అయినా వెళ్లాలి లేదా చికాగో ఆంధ్ర సంఘం వన భోజనాలకి రావాలి అని ఫుడ్ కమిటీ చైర్ సాయి రవి సూరిభోట్ల అనడంతో నవ్వుల పూయించింది. 500 మందికిపైగా అతిథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ఎలా చేయాలి అన్న అంశంపై సీఏఏ కార్యదర్శి డా. భార్గవి నెట్టం అవగాహన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పిల్లలకి పెద్దలకి ఆటలని నిర్వహించారు. తండ్రులతో కలిసి పిల్లలు ఆడిన మూడు కాళ్ల పరుగు అందరిని ఆకట్టుకుంది. ఫాధర్స్ డేను పురస్కరించుకొని చివర్లో కేక్ కట్ చెయ్యడంతో పాటు వేసవి తాకిడిని ఎదుర్కోడానికి రోజంతా మజ్జిగ, పుచ్చకాయ ముక్కల్ని అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో సీఏఏ అధ్యక్షురాలు డా. ఉమ కటికి, ఉపాధ్యక్షులు పద్మారావు అప్పలనేని, కార్యదర్శి భార్గవి నెట్టం, ఫౌండర్స్ ఛైర్మన్ దినకర్ కారుమురితో పాటు గత ఫౌండర్స్ సభ్యులు సుందర్ దిట్టకవి, శ్రీనివాస్ పెదమల్లు, రాఘవ జట్ల, రమేష్ గారపాటి సహా బోర్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరిలో అధ్యక్షురాలు ఉమ కటికి మాట్లాడుతూ ఈ వనభోజనాలని జయప్రదం చేసిన అతిథులు, బోర్డు సభ్యులు, వాలంటీర్లకి ధన్యవాదాలు తెలిపారు. చికాగో వాసులని అలరించటానికి ఈ సంవత్సరం సీఏఏ ఇలాంటి మరెన్నో కార్యక్రమలని నిర్వహించబోతోందన్నారు. -
ఐక్యంగా ఉంటే అన్నిరంగాల్లో రాణిస్తారు
లేపాక్షి : రాష్ట్రంలో కాపు, బలిజలందరు ఐకమత్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. ఆదివారం ఉదయం లేపాక్షి మండలం పి.సడ్లపల్లిలో గ్రామ సర్పంచ్ అశ్వర్థనారాయణ తోటలో హిందూపురం బలిజసంఘం యూత్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ కార్తీక వనభోజనాలు చేయడంతో కాపు, బలిజల ఐక్యతకు దోహదపడుతుందన్నారు. భవిష్యత్తులో రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ రంగాల్లో రాణించాలంటే ఐక్యత అవసరమన్నారు. ఐక్యతా లోపంతో రాజ్యాధికారం కోల్పోతున్నామని వాపోయారు. కార్యక్రమంలో హిందూపురం బలిజ సంఘం నాయకులు రాయల్ గోపాల్, మారుతీ శ్రీనివాస్, రామచంద్ర, రమణ, విజయానంద్, మల్లెపూల మధు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
మల్లన్న భక్తులకు వనభోజనాలు
- కార్తీక మాసంలో రోజుకు 1500 అభిషేకం టికెట్ల విక్రయం ·- ఆన్‌లైన్‌తోపాటు దేవస్థానం అన్ని అతిథిగృహాలలో టికెట్ల లభ్యం - క్యూలో ఉచితంగా పాలు, మజ్జిగ, పులిహోర ప్రసాదాలు - కార్తీక పౌర్ణమిన నదీహారతులు, జ్వాలాతోరణం శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తులకు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓ భరత్ గుప్త తెలిపారు. శనివారం దేవస్థానం పరిపాలనా భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్తీకమాసంలో క్షేత్రానికి వచ్చిన భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా క్యూ కాంప్లెక్స్, ఉచిత,ప్రత్యేక దర్శన క్యూలలో వేచి ఉండే భక్తులకు దేవస్థానం మంచినీరు, మజ్జిగ, పాలు, పులిహోర ప్రసాదాలను అందజేస్తామన్నారు. స్వామివార్లను అభిషేకం చేసుకోవడానికి ఆన్లైన్లో రూ. 1500 ముందస్తు టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అలాగే మల్లికార్జునసదన్, గంగా సదన్ తదితర అతిథిగృహాలలో కూడా భక్తుల కోసం టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు ఐదారు విడుతలుగా, సాయంత్రం మరో విడతలో అభిషేకాల నిర్వహణ ఉంటుందని, గర్భాలయంలో జరిగే రూ. 5వేల అభిషేకం టికెట్లను నియంత్రించి 20 నుంచి 25లోపు విక్రయించాలని భావిస్తున్నామని, రద్దీకనుగుణంగా ఈ టికెట్ల విక్రయం ఉంటుందని చెప్పారు. కార్తీక పౌర్ణమి ఈ ఏడాది సోమవారంతో కలిసి వచ్చిందన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణవేణీ నదీమాతల్లికి అదేరోజు సాయంత్రం నదీహారతులు, రాత్రి 7గంటలకు గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
మిన్నెసోటాలో ఘనంగా బోనాల పండుగ
మిన్నెసోటా(యూఎస్): మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్(మాట) ఆధ్వర్యంలో బోనాలు, వనభోజనాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు కుటుంబాల కోలాహలంతో హేలాండ్ పార్క్ కళకళలాడింది. మాట అధ్యక్షులు మహేందర్ గినుగ, వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అల్లంనేని, బుచ్చిరెడ్డి ముదిరెడ్డిల పర్యవేక్షణలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మాట వారు పచ్చని పందిరిలో అమ్మవారిని పీఠంపై ఉంచి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని తెలుగు వారందరూ పట్టు వస్త్రాలు ధరించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలు తెచ్చిన వారందరు అమ్మవారిని పూజించి, దీవెనలు అందుకున్నారు. అనంతరం మాటవారు ఏర్పాటు చేసిన విందు భోజనం అందరూ ఆరగించారు.