![Telangana Peoples Association of Dallas Conducts Vanabhojanalu in Dallas - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/7/nri.jpg.webp?itok=5aRMccE_)
టెక్సాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాల్లస్ (టీపీఏడీ) ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని డాల్లస్‌లో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్వర్యంలో గడిచిన మూడు నెలల్లో వరుసగా మూడు సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించిన తరువాత టీపీఏడీ వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ వనభోజన కార్యక్రమంతో డాల్లస్‌లోని తెలుగు వారందరినీ ఒక వేదికపైకి తీసుకురావడం సంతోషంగా ఉందని కార్యక్రమ నిర్వహకులు తెలిపారు. ఈ వనభోజన కార్యక్రమం డాల్లస్‌లోని హార్స్ రాంచీ, బిగ్ బ్యారెల్ రాంచీ, అరుబ్రే రాంచీ ప్రాంతాల్లో నిర్వహించారు.
డాల్లస్‌లోని తెలుగువారు తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులను ధరించి ఎంతో ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ సంస్కృతి కనులకు కన్పించేలా భారీ సెట్టింగ్‌లతో ఫార్మ్ హౌజ్ ప్రాంతాలను అందంగా ముస్తాబు చేశారు. టెక్సాస్‌లో కోవిడ్-19 నిబంధనలను కాస్త సడలించడంతో తెలుగువారు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం మొదట గణపతి పూజతో మొదలై.. నోరురించే తెలంగాణ పిండి వంటకాలను తయారుచేసి అరగించారు. అంతేకాకుంగా కార్యక్రమంలో నృత్య ప్రదర్శన, మ్యూజిక్, క్రికెట్, ఇతర కార్యక్రమాలను నిర్వహించారు.
రావు కాల్వల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన టీపీఏడీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీఏడీ అధ్యక్షుడు రవికాంత్ మామిడి, ఉపాధ్యక్షులు రూప కన్నయ్యగారి, శ్రీధర్ వేముల, మాధవి సుంకి రెడ్డి, ఇంద్రాణి పంచెరుపుల, మంజుల తోడుపునూరి, లక్ష్మి పోరెడ్డి, అనురాధ మేకల, ఫణీవీర్ కోటి, సీనియర్ టీపీఎడీ టీం మెంబర్ రఘువీర్ బండారు, కో ఆర్డినేటర్ గోలి బుచ్చిరెడ్డి తదితర తెలుగు వారు పాల్గొన్నారు.
చదవండి: ఘనంగా 4వ అన్నమయ్య శతగళార్చన
Comments
Please login to add a commentAdd a comment