Telugu associations
-
Jhansi Reddy: మనలోని సమర్థతకు మనమే కేరాఫ్ అడ్రస్..
సమస్యతో పాటు పరిష్కారం కూడా మన వెన్నంటే ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకొని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందడుగు వేసేవారే ఎప్పుడూ విజేతలుగా నిలుస్తారు. అందుకు సరైన ఉదాహరణ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి. తెలంగాణలోని ఖమ్మం జిల్లావాసి ఝాన్సీరెడ్డి విద్య, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ అగ్రరాజ్యం అమెరికా వెళ్లారు. పురుషాధిక్య ప్రపంచమైన రియల్ ఎస్టేట్ రంగంలో తన సత్తా చాటడంతో పాటు, అంతర్జాతీయంగా ఉన్న తెలుగు మహిళల ఉన్నతికి పాటుపడుతూ, పుట్టిన గడ్డకు సాయమందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఝాన్సీరెడ్డిని పలకరిస్తే ఎన్నో విషయాలను ఇలా మన ముందుంచారు. ‘‘నా శక్తి ఏంటో నాకు తెలుసు. అందుకే, ఏ పనిని ఎంచుకున్నా అందులో సంపూర్ణ విజయాన్ని సాధించేదాకా వదలను. నేను పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లా మధిర దగ్గర బనిగళ్లపాడు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే. నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోవడంతో పెద్దనాన్నతో పాటు అమెరికా వెళ్లిపోయాను. అక్కడే టెన్త్ పూర్తయ్యాక సెలవుల్లో ఇండియాకు వచ్చాను. పదహారు సంవత్సరాల వయసులో పెళ్లి అయింది. సాధారణంగా భర్త వెంట భార్య అమెరికా వెళ్లడం చూస్తుంటాం. కానీ, నా విషయంలో ఇది రివర్స్ అయ్యింది. మా వారు కార్డియాలజిస్ట్ కావడం, మేం న్యూజెర్సీలో సెటిల్ అవడం... ఏడాదిలోనే జరిగిపోయాయి. పెళ్లయ్యింది కాబట్టి ఇక ఇంట్లోనే కూర్చోవచ్చు కదా అనుకోలేదు. చదువుకుంటూనే ఉద్యోగం చేసేదాన్ని. ఏ దేశం లో ఉన్నా భార్యాభర్త ఇద్దరూ పనిచేస్తేనే వారి కుటుంబంతో పాటు వారి జీవితాలు కూడా వృద్ధిలోకి వస్తాయని నమ్ముతాను. అలా ప్లస్ టూ పూర్తవగానే బ్యాంకింగ్ రంగంలోకి వెళ్లాను. కానీ, పై చదువులు చదవాలన్న ఆసక్తి ఎక్కువ. అదే సమయంలో బ్యాంకు కూడా ఫైనాన్సింగ్ క్లాసెస్ ఆఫర్ చేసింది. దీంతో సాయంత్రాలు చదువుకుంటూ, పగటి వేళ ఉద్యోగం చేశాను. ప్రమోషన్లు వచ్చాయి. పిల్లలు పుట్టడంతో వారి బాగోగులు చూసుకునే క్రమంలో ఉద్యోగానికి ఫుల్స్టాప్ పడింది. ఈ సమయంలోనూ ఖాళీగా లేకుండా మా వారి హాస్పిటల్ నిర్మాణాన్ని దగ్గరుండి చూసుకున్నాను. అమెరికా.. రియల్ ఎస్టేట్ డాక్టర్‌గా మా వారి సంపాదన బాగానే ఉంది. దీంతో ఓ చిన్న స్థిరాస్తి కొనుగోలు చేశాం. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. ‘ఈ స్థిరాస్తిని కేవలం పెట్టుబడిగానే ఎందుకు చూడాలి, ఇదే వ్యాపారం చేస్తే బాగుంటుంది’ అనుకున్నాను. కానీ, ఈ రంగంలో మహిళలు ఉన్నట్టు ఎవరూ కనిపించలేదు. ఇండియా–అమెరికా ఏ దేశమైనా ఈ రంగంలో మహిళల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టచ్చు. అంతటా పురుషాధిపత్యమే. చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని తెలుసు. అయినా, పాతికేళ్ల క్రితం ‘రాజ్ ప్రాపర్టీస్’ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించాను. ఎందుకొచ్చిన రిస్క్ అన్నవారూ ఉన్నారు. విమర్శలనే కాంప్లిమెంట్‌గా తీసుకున్నాను. కొద్దికాలంలోనే ఈ రంగంలో మంచి పేరు సాధించాను. తెలుగు మహిళల కోసం.. అమెరికాలో చిన్నప్పటి నుంచి ఉన్నాను కనుక తెలుగువారి సమస్యలు బాగా తెలుసు. అందులోనూ తెలుగు అసోసియేషన్స్‌కు వచ్చిన మహిళలతో మాట్లాడుతున్నప్పుడు వారి సమస్యలను అర్థం చేసుకున్నాను. దేశం మారుతున్నా మగవారి మనస్తత్వాలు, భావాలు మారడం లేదు. దీంతో తెలుగు కుటుంబాల్లో గృహహింస, గొడవలు, రకరకాల చికాకులతో మహిళలు అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్న వారున్నారు. ఆర్థిక స్థిరత్వం లేదు. ఇలాంటి వాటన్నింటికి పరిష్కారంగా ఒక సంస్థ ఉండాలనుకున్నాను. అంతర్జాతీయంగా ఉన్న తెలుగు మహిళల కోసం ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ తెలుగు అసోసియేషన్ (వెటా) సంస్థను నాలుగేళ్ల్ల క్రితం ఏర్పాటు చేశాను. ఇందులో నిష్ణాతులైన మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా తెలుగు మహిళలకు కావల్సిన ప్రేరణ, ప్రోత్సాహం, ఆసక్తి గల మహిళలందరికీ అందించాలన్నదే లక్ష్యం. మనలోని సమర్థత ఏంటో మనకే బాగా తెలుసు. ఏ రంగంలో మనం సమర్థవంతంగా రాణించగలమో గ్రహించి, ధైర్యంగా ముందడుగు వేయాలి. అప్పుడు అవకాశాలు కూడా వాటంతటవే వస్తుంటాయి. వాటిని అందిపుచ్చుకుంటూ వెళ్లడంలోనే మన విజయం దాగుంటుంది. దీంతో మనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు రావడంతో పాటు మన చుట్టూ ఉన్న కొందరికైనా సాయం అందించగలం’’ అని వివరించారు ఈ ప్రవాస భారతీయురాలు. (చదవండి: నాట్య దీపిక.. దీపికారెడ్డి) పుట్టిన గడ్డకు సాయం అనుకున్న విజయాలను సాధించాను. పుట్టినగడ్డకు కొంతైనా సేవ చేయాలని.. ఖమ్మం జిల్లాలోని మా ఊరితోపాటు చుట్టుపక్కల ఊళ్లలో స్కూల్ భవనాలు కట్టించి, ప్రభుత్వానికి అప్పజెప్పాను. తొర్రూరులో హాస్పిటల్ కట్టించాను. వీటితోపాటు లైబ్రరీ, గ్రామపంచాయితీ ఆఫీసు వంటివి ఏర్పాటు చేశాను. పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందించాను. – నిర్మలారెడ్డి ఫొటోలు: గడిగె బాలస్వామి -
ఘంటసాలను భారతరత్న పురస్కారంతో గౌరవించాలి : గీత రచయిత చంద్రబోస్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితమంటూ శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 120 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకొస్తోంది. ఇందులో భాగంగా హాంకాంగ్ నుంచి జయ పీసపాటి (వ్యవస్థాపక అధ్యక్షురాలు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య) జూన్ 19న జరిగిన అంతర్జాల కార్యక్రమములో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఘంటసాలకు ‘భారతరత్న’ కోసం చేస్తున్న కృషి అభినందనీయం- చంద్రబోస్ నంది పురస్కార గ్రహిత, గీత రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఘంటసాలకు భారతరత్న పురస్కార కోసం 30 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు అందరు కృషి చేయడం అభినందనీయమన్నారు. గాయకుడిగా ఘంటసాల ఎన్నో అత్యద్భుత గీతాలను ఆలపించి ఇప్పటికి ఎన్నటికీ తెలుగువాడి పాటను ప్రపంచ ఖ్యాతిని నలుచెరుగులా రెపరెపలాడించారన్నారు. సంగీత దర్శకుడిగా వందకుపైగా ఆణిముత్యాలు లాంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడం భారతదేశ సినీ పరిశ్రమ మొత్తంలో వారికే చెల్లిందని కొనియాడారు. ఘంటశాల అమృతం గళంనుంచి జాలువారిన దేశభక్తి ప్రభోదించే గీతాలతోపాటు, కుంతీ విలాపం, పుష్ప విలాపము, బంగారుమామ జానపద గేయాలు, జాషువా గారి బాబాయ్ పాటలు మనుషుల జీవన ప్రమాణాలను ప్రభోదించే భగవత్గీత లాంటివాటిని గుర్తు చేశారు. బాల్యంలో కడు పేదరికాన్ని అనుభవంచి వారాలు గడిపి సంగీతం నేర్చుకొని సినీ పరిశ్రమలో ఎవరు అందుకొని మైలురాళ్ళను చేరుకోగలిగారనీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన వ్యక్తి అని, ఇప్పటికైనా వారి సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని, ఈ సందర్భంగా నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. భారతదేశ గర్వించదగ్గ మహోన్నత గాయకుడు ఘంటసాల అని మరొక ముఖ్య అతిధి, గాయకుడు, సంగీత దర్శకుడు, పార్థ నేమాని కొనియాడారు. 30 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు వారికి భారతరత్న పురస్కార కోసం చేయడం అభినందనీయమన్నారు. ఘంటసాల గారిని మించిన భారతరత్నం ఏముంటుంది అని చెబుతూ వారు నిజంగా భారతరత్న'మే అని కొనియాడారు. పాటలతో సభికులను అలరించారు. చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంబం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతూ ఇప్పటిదాక ఈ కార్యక్రమంలో పాల్గొన్న 30 దేశాల సేవలను కొనియాడారు. యు.యెస్.ఏ నుండి డా. రాఘవ రెడ్డి గోసాల, ఉత్తర అమెరికాతెలుగు సంఘం నాటా మాజీ అధ్యక్షుడు, గంగసాని రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కొడాలి చక్రధరరావు తాన ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2003/05, వ్యవస్థాపక అధ్యక్షుడు టెన్నిస్సీ తెలుగు సమితి 1995/97, డాక్టర్ జయసింహ సుంకు, ఛైర్మన్, NRI వాసవి, ఐర్లాండ్ నుండి రాధా కొండ్రగంటి అధ్యక్షురాలు, ఐర్లాండ్ తెలుగుఅసోసియేషన్, జపాన్ నుండి శాస్త్రి పాతూరి, వాలంటీర్, జపాన్ తెలుగు సమాఖ్య, భారతదేశం నుండి కోలపల్లి హరీష్ నాయుడు, బ్యాంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల (స్థాపించినది. 1974) మచిలీపట్నం, తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాలకి కేంద్రం భారతరత్న అవార్డుతో సత్కరించాలి అని అందరూ ముక్తకంఠంతో కోరారు. అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు ఐర్లాండ్, జపాన్ స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికాలోని తెలుగు సంస్థలతో 123 టీవీ కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. -
సింగపూర్‌లో ఘనంగా మే డే వేడుకులు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్‌లో ఆదివారం మే డేను ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగు రెస్టారెంట్ల సహకారంతో 1200 మంది స్థానిక తెలుగు కార్మికులకు బిర్యానీ పంపిణీ చేశారు. అంతేకాకుండా వారి యోగక్షేమాలు తెలుసుకొని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. పూర్వ, ప్రస్తుత కార్యవర్గసభ్యులతోపాటు సభ్యులు, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ, తెలుగు కార్మిక సోదరులకు ఏ సమస్య వచ్చినా సింగపూర్ తెలుగు సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కొవిడ్ మహమ్మారి వల్ల రెండేళ్లు కలుసుకోలేకపోయామని, ఇప్పుడిలా కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్ధానిక రెస్టారెంట్స్ సహకారంతో కుటుంబాలకు దూరంగా ఉన్న సుమారు 1200 మంది కార్మిక సోదరులకు బిర్యానీ బాక్సులు అందించామని సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు, కార్యక్రమ నిర్వాహకులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి తెలిపారు. అన్నీ వేళలా కార్మిక సోదరులకు అండగా ఉంటూ...మరీ ముఖ్యంగా గత రెండు సంవత్సరాల క్లిష్ట సమయంలో సింగపూర్ తెలుగు సమాజం తరపున సహాయపడుతున్న పోతగాని నరసింహగౌడ్, నాగరాజు వారి సేవలను కార్యవర్గ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు వారికి, పలు కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ , మే డే వేడుకలు విజయవంతం కావడానికి శ్రమించిన కార్యవర్గసభ్యులకీ , దాతలకు , సహకరించిన రెస్టారెంట్ యాజమాన్యాలకు కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: అనాథల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు -
హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు!
హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కోవిడ్ నిబంధనల కారణంగా ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఉగాది వేడుకల్ని ఆన్లైన్ వేదికగా నిర్వహించింది. ఈ వేడుకల్లో తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కన్నుల విందుగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని హాంకాంగ్ తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీమతి జయ పీసపాటి ప్రారంభించగా, శాంతి మోగంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ ఉగాది వేడుకలను ఆర్థిక కార్యదర్శి రాజశేఖర్ మన్నే, ట్రెజరర్ నర్రా వరప్రసాద్, జనరల్ సెక్రటరీ గరదాస్ జ్ఞానేశ్వర్ తో పాటు ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఘనంగా నిర్వహించారు. -
మేలో తెలంగాణ తెలుగు అసోసియేషన్ సదస్సు
ఉత్తర అమెరికాలోని కెనడా, అమెరికా దేశాలలో ప్రసిద్ధిగాంచిన ప్రవాస భారతీయుల సంస్థ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA) భారీ వేడుకలకు సిద్ధమైంది. అందులో భాగం సన్నాహక సమావేశాలను విస్త్రృతంగా నిర్వహిస్తోంది. ప్రవాస భారతీయులకు ఇమిగ్రేషన్, ఐటి ట్రేనింగ్, కోవిడ్ టాస్క్ ఫోర్స్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్, తెలుగు రాష్ట్రాలలో ఎంబ్యులెన్స్ సేవలతోపాటు మురెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మాతృభూమికై టీటీఏ నేతృత్వంలో అమెరికాలోని తెలుగువారికి తమవంతు సేవలను అందిస్తున్నారు. 2022 మే 27, 28, 29వ తేదీలలో కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత అమెరికాలోనే మొట్టమొదటిసారి టీటీఏ సాంస్కృతిక మెగా కన్వెన్షన్ నిర్వహించనుంది. ఈ మెగా కన్వెన్షన్ సన్నాహాకాల్లో భాగంగా మార్చి 12, 13వ తేదీలలో టీటీఏ నాయకత్వ బృందం టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్, డల్లాస్ నగరాల్లోని తెలుగు వారితో కలిసి కన్వెన్షన్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిపింది. -
‘ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలి’
పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం ‘ఘంటావధాని’గా బిరుదు పొందిన విశాఖ వాస్తవ్యులు, డా. సయ్యద్ రహమతుల్లా గారి గానావధానం కార్యక్రమం అంతర్జాల వేదికపై 14 దేశాల ప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడింది. ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్, శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ఘంటసాల శతజయంతి సంవత్సరంగా 366 రోజులపాటు నిర్వహింపబడుతున్న నిర్వహింపబడుతున్న “ఘంటసాల స్వర రాగ మహా యాగం” కార్యక్రమంలో భాగంగా 70వ రోజు విశేషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. డా. వంశీ రామరాజు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు ఘంటసాల గారికి భారతరత్న పురస్కారంతో గౌరవించాలని, ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిల్లాకు ఘంటసాల పేరు పెట్టాలని సూచించారు. వంశీ సంస్థ తరఫున ఘంటసాల చదువుకున్న విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో ప్రతి సంవత్సరం, ఉత్తమ విద్యార్థికి స్కాలర్షిప్ అందించబోతున్నామని ప్రకటించారు. 14 దేశాల నుంచి సుమారు 20 మంది పృచ్ఛకులు పాల్గొని ఘంటసాల మాస్టారి పాటలపై, వారి జీవిత విశేషాలపై వివిధ కోణాలనుంచి ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగి సభను రక్తి కట్టించారు. సమయోచితంగా అడిగిన ప్రతి ప్రశ్నకు వెంటనే సంపూర్ణమైన వివరణతో అవధాని సమాధానాలను అందించి అందరిని అబ్బురపరిచారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మండలి బుద్ధ ప్రసాద్, మాధవపెద్ది సురేష్, సాలూరి వాసూరావు, భువనచంద్ర వంటి ప్రముఖులు విచ్చేసి విచ్చేసి ప్రసంగించారు. నిర్వాహకులుగా అమెరికా నుంచి డా. వంగూరి చిట్టెన్ రాజు సింగపూర్ నుంచి కవుటూరు రత్న కుమార్ పాల్గొనగా, రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా సభానిర్వహణ గావించారు. పృచ్ఛకులుగా గోవర్ధన్ మల్లెల, న్యూజిలాండ్, తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి, రమకంచిభొట్ల, ఆస్ట్రేలియా, రాధిక నోరి, అమెరికా, లక్ష్మి రాయవరపు, కెనడా సత్య మల్లుల, మలేషియా, సింగపూర్ నుంచి ఊలపల్లి భాస్కర్, గుంటూరు వెంకటేష్, సుబ్బు వి పాలకుర్తి, కాత్యాయని గణేశ్న, ఉసిరికల తాతాజీ, ఖతార్, డాక్టర్ బూరుగుపల్లి వ్యాసకృష్ణ, ఉగాండా, విక్రమ్ కుమార్ పెట్లూరు, దక్షిణాఫ్రికా, వెంకప్ప భాగవతుల, ఖతార్, శ్రీమతి రాణి మాధవ్, ఒమాన్, డాక్టర్ వెంకటపతి తరిగోపుల, నార్వే, పీసపాటి జయ, హాంకాంగ్, రాజేష్ తోలేటి, యూ.కె, ఆర్ ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు. చదవండి: మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మెల్బోర్న్లో గ్లెన్ మాక్స్వెల్ పెళ్లి -
అమెరికాలో తెలుగు సంఘాల హవా!
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభ్యత్వం రికార్డు స్థాయిలో పెరిగింది. చాలా ఏళ్ల పాటు 35 వేలకు అటు ఇటుగా ఉన్న సభ్యుల సంఖ్య 2021 చివరి నాటికి రికార్డు స్థాయిలో 70 వేల వరకు చేరుకున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన 'తానా' నూతన సభ్యుల చేరికతో మరింత ఉత్సాహంతో దూసుకుపోతుంది. అమెరికాలోని మొట్టమొదటి తెలంగాణ సంఘంగా రిజిస్టరైన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టిడిఎఫ్) ప్రస్తుత సభ్యుల సంఖ్య సుమారు 800 గా ఉన్నట్టు సమాచారం. డాక్టర్ దివేష్ అనిరెడ్డి, వెంకట్ మారంల నేతృత్వంలో కొత్తగా కొలువుతీరబోయే టీడీఎఫ్ కమిటీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించనుంది. నార్త్ అమెరికా తెలుగు అసోసియేన్ (నాట్స్)లో వేల సంఖ్యలో సభ్యులు ఉండగా.. నిత్యం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గత ఐదారేళ్లుగా అమెరికాలోని ఇతర తెలంగాణ సంఘాలు కూడా విస్తృతం అవుతున్నాయి. ఇప్పటికే అమెరికా తెలంగాణ సొసైటీ (ఏటీఎస్), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ)లలో సభ్యత్వ నమోదు పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారు అమెరికాలో ఏర్పాటు చేసుకున్న నేషనల్ లెవల్ ఆర్గనైజేషన్స్ (జాతీయ స్థాయి సంఘాలు) అధ్యక్షులు స్వరాష్ట్రాలకు వచ్చినప్పుడు వారికి ప్రజల నుంచి మంచి ఆదరణ, సామాజిక గౌరవం లభిస్తోంది. పుట్టిన గడ్డపై ప్రేమతో స్వరాష్ట్రాలలో అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రవాసి సంఘాల సభ్యులందరికీ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి అభినందనలు తెలిపారు -
హాంగ్‌కాంగ్‌లో ఘనంగా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు
ఈ తరం మిలినియల్ పిల్లల్లో తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు సంస్కృతి సంపదను తెలియజేసేందుకు ‘ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య’ ప్రతి సంవత్సరం జనవరిలో పిల్లలతో భోగి, తెలుగు సాంస్కృతిక ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తోంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోవిడ్ నిబంధనల కారణంగా పిల్లలతో భోగి వేడుకలు సామూహికంగా చేయలేక పోయినా, ఆన్లైన్లో జూమ్ ద్వారా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలను జరుపుతున్నామని సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటీ తెలిపారు. ఈసారి ఉత్సవాలు నిర్వహించేందుకు కొన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ.. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. వేడుకల్లో పాల్గొనేందుకు సభ్యులు, పిల్లలు ఎంతో ఉత్సాహం ప్రదర్శించడంతో ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించేందుకు సిద్ధమయ్యామన్నారు. కాగా.. ఈ కార్యక్రమాన్ని, హాంగ్ కాంగ్ వాస్తవ్యులు, NRI తెలుగు ఐడల్ 2021 రెండవ విజేత హర్షిణీ పచ్చంటి.. ప్రార్థన గీతంతో ప్రారంభించారు. సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోయిన చిన్నారులు.. భారతీయ శాస్త్రీయ సంగీతంలో ముద్దులొలికే తెలుగులో పాటలు పాడగా, మరికొందరు కన్నులకు ఇంపుగా భరతనాట్యం, కూచిపూడి నృత్యప్రదర్శన చేశారు. మరికొందరు టాలీవుడ్ పాటలకు డాన్స్ చేశారు. చిన్నారులు భారతీయ, పాశ్చాత్య శాస్త్రీయ వాయిద్యాల తమకున్న ప్రతిభను ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజు, స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాంగ్ కాంగ్ వాస్తవ్యులు డా. సుజాత గోవాడ (ప్రసిద్ధ అర్బన్ డిసైనర్, సెర్టిఫైడ్ టౌన్ ప్లానర్) మాట్లాడుతూ.. పిల్లల ప్రదర్శనలు ఎంతో ముచ్చటగా ఉన్నాయని, వారి ఉత్సాహం తమకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లల్ని, వారి తల్లిదండ్రులని అభినందించారు. తెలుగు సమాఖ్య చేస్తున్న భాష - సాంస్కృతిక సేవను, తెలుగు వారందరిని ఒక తాటిపై తెచ్చేందుకు చేస్తున్న కృషిని ఎంతగానో మెచ్చుకున్నారు. ఇక విశిష్ట అతిథిగా విచ్చేసిన, టాలీవుడ్ దర్శకులు కిషోర్ మాట్లాడుతూ, పిల్లల ప్రదర్శనలను మెచ్చుకొన్నారు. తాను సినిమాల్లో బిజీగా వుండి, కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనలేకపోయినా, సమాఖ్య నిరంతరం తెలుగు వారిని వివిధ కార్యక్రమాల ద్వారా కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. హాంగ్ కాంగ్లో మూడు దశాబ్దాలకు పైగా వైద్యుడిగా సేవలు అందిస్తున్న డా.వెంకట్ రావు తన సతీమణి శాంతితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లల ఆట పాటలను ఎంతో మెచ్చుకున్నారు. ప్రస్తుతం సమాఖ్య చేస్తున్న కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన సరస్వతి దేవిని స్మృతిస్తూ ఒక చక్కని భక్తి గీతాన్ని కూడా పాడి వినిపించారు. దంపతులు ఎంతో ఉల్లాసంగా పిల్లల్ని ఆశీర్వదించారు. ఇక ఈ వేడుకలు విజయవంతమయ్యేందుకు కృషి చేసిన పిల్లలను, వారి తల్లిదండ్రులును, సాంస్కృతిక కార్యదర్శి సువర్ణ చుండూరు, ఉప కోశాధికారి రమాదేవి సారంగా, ఆర్ధిక కార్యదర్శి రాజశేఖర్ మన్నే, జనరల్ సెక్రటరీ గర్దాస్ గ్యానేశ్వర్, స్వచ్చందంగా సేవనందించిన అపర్ణ కందా, రాజీవ్ ఈయు తదితరులను సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటీ కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: నిరాటంకంగా ఘంటసాల స్వర రాగ మహాయాగం -
ఘనంగా జరిగిన ‘‘స్వరకల్పన సమారాధన” ప్రథమ వార్షికోత్సవ వేడుకలు
సింగపూర్: విద్య సంగీతం అకాడమీ (సింగపూర్), ద్వారం లక్ష్మి అకాడమీ అఫ్ మ్యూజిక్ సర్వీసెస్ (తిరుపతి) వారి ఆధ్వర్యంలో, శ్రీసాంస్కృతిక కళాసారథి సింగపూర్ వారి సహకారముతో “స్వరకల్పన సమారాధన” కార్యక్రమ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు యూట్యూబ్ ద్వారా ఘనంగా జరిగాయి. 2021 డిసెంబర్ 19న జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలను, సంగీతగురువులకు అంకితం చేస్తూ వారు రచించి, స్వరపరిచిన సంగీతాన్ని ప్రసారం చేశామని నిర్వాహకులు తెలిపారు. ఎందరో గురువులు, కళాకారులు తెలుగు సంగీతాభిమానులు తమవంతు కృషిచేస్తూ పాటలు క్రియేట్ చేస్తున్న వారందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి, మన తెలుగుపాట వైవిధ్యాన్ని నిలబెడుతూ, మరిన్ని కొత్త పాటలను వెలుగులోకి తీసుకురావటానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నమే ఈ స్వరకల్పన సమారాధన. అన్నమయ్య కీర్తనలతో, వర్ణాలతో, చక్కటి తిల్లానాతో మరిన్ని శాస్త్రీయ కృతులతో అంతర్జాలంలో ఉన్న తెలుగువారందరినీ రెండున్నర గంటలపాటు ఈ కార్యక్రమం అలరించింది. ఈ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన గురువులు లహరి కొలచెల, డాక్టర్ ద్వారం లక్ష్మి, డాక్టర్ శేషులత విశ్వనాథ్, తాడేపల్లి సుబ్బలక్ష్మి, మోదుమూడి సుధాకర్, ద్వారం వీ కే జీ త్యాగరాజ్, డాక్టర్ యనమండ్ర శ్రీనివాసశర్మ, లక్ష్మీ సూర్య తేజ, విష్ణుభట్ల రామచంద్రమూర్తి, కమలాదీప్తి పాడిన కీర్తనలను ప్రత్యక్షప్రసారం చేశారు. ఈ రచనలన్నీ నొటేషన్స్‌తో సహా ఒక ఈ-పుస్తక రూపంలో కూడా ప్రచురించడం జరిగింది. అంతేకాక గురువులపేరు మీద వారు ఎంపిక చేసిన 11 మంది కళాకారులకు పారితోషకం రూపంలో ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తామని నిర్వాహకులు కార్యక్రమంలో ప్రకటించారు. సింగపూర్, భారత దేశాల నుంచే కాక అమెరికా, యూకే, మలేషియా నుంచి కూడా వీక్షకులు చూసి ఆనందించటం ఈ కార్యక్రమానికి మంచి శోభను చేకూర్చింది. మన సంగీతం మీద, సాంస్కృతిక విలువల మీద ఆసక్తి పెంచడానికి చేస్తున్న ఈ వార్షిక కార్యక్రమానికి, విద్య సంగీతం అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కాపవరపు విద్యాధరి వ్యాఖ్యానాన్ని అందించి ప్రేక్షకులందరినీ అలరించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శ్రీసాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ విచ్చేసి చక్కటి సందేశమును ఇచ్చారు. ఈ అంతర్జాల స్వరకల్పన సమారాధన చక్కగా కూర్పు చేయటంలో సహకరించిన ఆర్కే వీడియోగ్రఫీ (రాధా కృష్ణ గణేష్ణ, కాత్యాయని)లకు, వీక్షకులకు నిర్వాహకులు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. చదవండి: రాధిక మంగిపూడి 'భారతీయ తత్త్వ శతకము'ను ఆవిష్కరించిన డాక్టర్ మేడసాని మోహన్ -
అక్కినేనికి ఘన నివాళి అర్పించిన ప్రవాస భారతీయులు
దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు, పద్మ విభుషణ్ పురస్కార గ్రహీత నట సామ్రట్ అక్కినేని నాగేశ్వరరావు 98వ జయంతిని పురస్కరించుకుని 5 ఖండాలు 30 దేశాల తెలుగు సంస్థల సహకారంతో వంశీ ఇంటెర్నేషనల్ ఇండియా, తెలుగు కళా సమితి ఒమన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యములో జరిగిన కార్యక్రమంలో అక్కినేనికి ఘన నివాళి అర్పించారు. అంతర్జాల వేదికగా జరిగిన కార్యక్రమానికి అమెరికా నుంచి అమెరికా గాన కోకిల శారదా ఆకునూరి, ఇండియా నుంచి కళాబ్రహ్మ శిరొమణి వంశీ రామరాజు, వ్యవస్థాపకులు వంశీ, అనీల్ కుమార్ కడించర్ల కన్వీనర్ తెలుగు కళా సమితి, ఒమన్ నిర్వహణలో 16 గంటల పాటు నిర్విఘ్నంగా జరిగింది. చదవండి : .Miss Universe Singapore-2021: మిస్ సింగపూర్‌గా శ్రీకాకుళం యువతి ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు సన్‌షైన్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డా. గురువా రెడ్డీకి అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, వైద్య సేవ శిరొమణి బిరుదు ప్రదానం చేశారు. కరోనా కారణంగా డా. గురువా రెడ్డికి ఆయన నివాసంలోనే కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించి అవార్డును బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కినేని కుటుంబంతో తనకు విడదీయారాని బందం ఉందన్నారు. అక్కినేని పేరు మీద ఈ పురస్కారం అందుకోవడం అందులోనూ తమ కుటుంబ సభ్యులు తనను సత్కరించడం అపూర్వ సన్నివేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా నటి కళాభారతి డా. జమున రమణా రావు, సినీ దర్శకులు కే. విశ్వనాథ్, మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామిరెడ్డి, పద్మ భుషణ్ పురస్కార గ్రహిత డా. కేఎల్. వరప్రసాద్ రెడ్డి, డా. కె.వి.రమణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు, మాజీ పార్లమెంటరీ సభ్యులు, సినీ నటులు మురళిమోహన్,ఏపీ పూర్వ ఉప సభాపతి బుద్ధప్రసాద్, మహనటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, దేవుల పల్లి మనుమరాలు లలితారామ్(అమెరికా), ఉపేంద్ర చివుకుల కమిషనర్ న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ ఉటిలిటి(అమెరికా), డా. మెడసాని మొహన్, డా.కె.వి.క్రిష్ణ కుమారి, సుద్ధాల అశోక్ తేజ, భువన చంద్ర, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్ది( అమెరికా), రవి కొండబొలు(అమెరికా), డా. చిట్టెన్ రాజు వంగూరి( అమెరికా), జయ తాళ్ళురి ( తానా పూర్వ అధ్యక్షుడు), శీరిష తూముగుంట్ల(కల్చరల్ సెక్రేటరి తానా), శారదా సింగిరెడ్డి(చైర్ పర్సన్ ఆటా), గురుజాడ శ్రీనివాస్(అమెరికా) పాల్గొన్నారు. వారితో పాటుగా డా.లక్ష్మి ప్రసాద్ కపటపు, తాతాజీ ఉసిరికల(తెలుగు కళా సమితి ఖతర్, కే. సుధాకర్ రావు( ఊటాఫ్ కువైత్), వేదమూర్తి యూఏఈ), సత్యనారయాణ రెడ్డి( ఏకేవీ ఖతర్ ), సురేష్ తెలుగు తరంగిణీ(యూఏఈ), ప్రదీప్ (యూఏఈ), శివ యెల్లెపు(బహ్రెయిన్), వెంకట్ భాగవతుల(ఏకేవీ ఖతర్), దీపిక రావి( సౌదీ అరేబియా ), రత్నకుమార్ కవుటూరు(సింగపూర్), రాజేష్ టెక్కలి(అమెరికా), సారధి మొటుమర్రి(ఆస్ట్రేలియా), విజయ గోల్లపుడి(ఆస్ట్రేలియా), పార్థసారధి( ఉగండా), కె.ఆర్. సురేష్ కుమార్(టాంజనియా ), డా.G.V.L. నరసింహం, డా.తెన్నెటి సుధా, శైలజ సుంకరపల్లి, రాధికా నూరి( అమెరికా), సత్యదేవి మల్లుల(మలేషియా), డా. శ్రీరామ్ శొంటి, శారదా పూర్ణ శొంటి(అమెరికా), సుధా పాలడుగు(అమెరికా), లక్ష్మీ రాయవరపు(కెనడా), గుణ సుందరి కొమ్మారెడ్డి(అమెరికా), శ్రీదేవి జాగర్లమూడి(అమెరికా ), శ్రీలత మగతల(న్యూజిలాండ్), విజయ కుమార్ పర్రి(స్కాట్లాండ్), రవి గుమ్మడవల్లి(ఐర్లాండ్), రాధిక మంగినపుడి(సింగపూర్), రాజేష్ తొలెటి (లండన్), చిన్న రావు, వేణు గొపాల్ హరి, టి. నాగ, బి.కుమార్, చైతన్య, సీతరాం, చరణ్ కుమర్, అరుందతి, రాజశేఖర్, ఆనంద్, శారద, అపర్ణ, రాణి, సునీత, లక్ష్మీ కామేశ్వరి, విజయ కుమార్ పర్రి(స్కాట్లాండ్), రవి గుమ్మడవల్లి(ఐర్లాండ్), రాధిక మంగినపుడి(సింగపూర్), రాజేష్ తొలెటి(లండన్), డా. తెన్నెటి శ్యాంసుందర్, డా. తెన్నెటి విజయ చంద్ర ఆమని, డా. సమరం, గుమ్మడి గోపాలకృష్ణ, అపార గంటసాల, కామేశ్వర రావు, సింగినగ స్టార్ విజయలక్ష్మి తదితరులు పాల్లొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా వెంకట్ ప్రసారం చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 2 గoటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పలు దేశాల నుండి గాయనీ గాయకులు అక్కినేని నాగేశ్వర రావు నటించిన చిత్రాల నుంచి గీతాలను ఆలపించారు. చదవండి: ఇల్లినాయిస్లో నాట్స్ ఉమెన్ త్రో బాల్ టోర్నమెంట్ -
సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగువాహిని సాహితీ సదస్సు
సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగువాహిని మూడవ సాహితీ సదస్సు అంతర్జాలంలో విజయవంతంగా ముగిసింది. ఐదు గంటల సేపు నిర్విరామంగా కొనసాగిన సాహితీ సదస్సులో ముఖ్య అతిథులుగా వంగూరి చిట్టెన్ రాజు, ట్యాగ్ లైన్ కింగ్ ఆలపాటి, డా. మూర్తి జొన్నలగడ్డ, రత్నకుమార్ కవుటూరి, సిడ్నీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు మధు బైరెడ్డి ఇంకా పలువురు తెలుగువారు పాల్గొన్నారు. ఈ సాహితీ సదస్సులోనే పెయ్యేటి శ్రీదేవి కథల సంపుటి ''పిల్లలరాజ్యం' సామవేదం షణ్ముఖశర్మ అంతర్జాలంలో ఆవిష్కరించారు. శ్రీదేవి కథలపుస్తకంపై భువనచంద్ర, డా. కె.వి. కృష్ణకుమారి తమ అభిప్రాయాలను తెలిపారు. గతంలో వెలువడిన 'బియ్యంలో రాళ్ళు' 'పిల్లలరాజ్యం' ఇంటింట ఉండాల్సిన కథా పుస్తకాలని సామవేదం షణ్ముఖశర్మ అభిప్రాయపడ్డారు. పిల్లలరాజ్యం కథలపుస్తకం అంతర్జాతీయంగా మూడు దేశాలలో జూమ్ వేదికగా ఆవిష్కరణ కార్యక్రమం రూపొందించటం జరిగిందని తెలుగు వాహిని కన్వీనర్ విజయ గొల్లపూడి తెలిపారు. భారత్‌లో పిల్లలరాజ్యం కథల సంపుటిని సుధామ ఆవిష్కరించారు. పుస్తక పరిచయం గంటి భానుమతి చేయగా.. పెయ్యేటి శ్రీదేవితో ఆత్మీయ అనుబంధం గురించి పొత్తూరి విజయలక్ష్మి తెలిపారు. సిడ్నీలో మొదటి తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దుర్వాసుల మూర్తి, పలువురు ప్రముఖులు పెయ్యేటి శ్రీదేవి కథ శైలి, సునిశిత పరిశీలనా శక్తి, సామాజిక భాద్యతను కలిగిన చక్కని కథలని కొనియాడారు. తెలుగు వన్ గ్రూప్ అధినేత రవిశంకర్ కంఠమవేని శ్రీదేవి కథలు నాటికలుగా ప్రసారమయ్యాయని గుర్తుచేశారు. కుమార్తెలు విజయ గొల్లపూడి ఆస్ట్రేలియా నుంచి, కాంతి కలిగొట్ల అమెరికా నుంచి ఇంకా శ్రీదేవి భర్త పెయ్యేటి రంగారావు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రచయిత్రులు సంధ్య గొల్లమూడి, తమిరిశ జానకి, భావరాజు పద్మిని, బంధుమిత్ర సన్నిహితులు పాల్గొన్నారు. 26న జరగనున్నకెనడా అమెరికా సాహితీసదస్సులో కూడా పిల్లలరాజ్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుందని కాంతి కలిగొట్ల తెలిపారు. -
తెలంగాణ భాషాభిమానాన్ని పెంపొందించడానికి అందరూ కృషి చేయాలి : కేవీ రమణాచారి
తెలంగాణ భాషాభిమానాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే కాళోజీ సరైన నివాళి అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు వంశీ డాక్టర్ సినారె విజ్ఞాన పీఠం ,తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఉగాండా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన 107 వ జయంతి తెలంగాణ భాషా దినోత్సవంలో రమణాచారి మాట్లాడుతూ కాళోజీ పట్ల గౌరవ భావంతో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి తెలంగాణ భాషా దినోత్సవం గా నిర్వహిస్తూ స్ఫూర్తిని పంచుతుందని తెలిపారు. వంశీ రామరాజు తొలుత స్వాగతం పలుకుతూ కాళోజీ వ్యక్తిగతంగా తన వివాహం దగ్గరుండి జరిపించారని,కవిగా వంశీ ఆర్ట్ థియేటర్స్ నిర్వహించిన సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. కాళోజీ సినారె స్ఫూర్తితో యాభై ఏళ్లుగా సాంస్కృతిక సేవతోపాటు సామాజిక సేవ చేస్తున్నానని అన్నారు .తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య ఈ కార్యక్రమానికి అనుసంధానం చేశారు.ఉగాండ తెలుగు సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ రావు, ప్రస్తుత అధ్యక్షుడు వెల్దుర్తి పార్థసారధి తమదేశంలో కాళోజీ స్ఫూర్తితో తెలుగు భాషకు తెలుగువారికి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కాళోజీ పురస్కారాలు స్వీకరించిన ప్రముఖ కవులు ఆర్ సీతారాం ,డా.అంపశయ్య నవీన్, రామా చంద్రమౌళి ప్రసంగిస్తూ కాళోజి చెప్పిందే ఆచరించారని, గొప్ప ప్రజాస్వామ్యవాది అని అన్నారు సామాన్యులను సైతం చేరేలా కవిత్వం రాస్తూనే అందులో అరుదైన కవితా శిల్పాన్నిపొదిగారని అన్నారు. కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు నాగిళ్ల రామశాస్త్రి ,కార్యదర్శివి.ఆర్. విద్యార్థి ,కాళోజి కుమారుడు రవికుమార్ ,ఉగాండకు చెందిన రచయిత వ్యాస కృష్ణ బూరుగుపల్లి తదితరులు ప్రసంగిస్తూ కాళోజీ కవిత్వంలో, వ్యక్తిత్వంలో అనేక విశిష్టతలను వివరించారు. -
‘ప్రవాస తెలుగు పురస్కారం-2021’కు ఎంపికైన రాధికా మంగిపూడి
ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించిన ప్రముఖ రచయిత్రి, వ్యాఖ్యాత, సంఘసేవకురాలు రాధిక మంగిపూడికి 'తెలుగు భాషా దినోత్సవ' సందర్భంగా అంతర్జాతీయ "ప్రవాస తెలుగు పురస్కారం-2021" దక్కనుంది. దక్షిణాఫ్రికా నుంచి "సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ" యూరప్‌లోని నార్వే నుంచి "వీధి అరుగు" సంస్థల సంయుక్త అధ్వర్యములో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని 75 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో అంతర్జాల వేదికపై వైభవంగా, ఆగస్టు 28 29 తేదీలలో, రెండు రోజులపాటు జరగనున్న "తెలుగు భాషా దినోత్సవం-2021" కార్యక్రమంలో భాగంగా... విదేశాలలో నివసిస్తూ తెలుగు భాష, సాహిత్యం సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన 12 మంది తెలుగు వారిని ఎంపిక చేసి "ప్రవాస తెలుగు పురస్కారాలు-2021" అందజేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి రాధికా మంగిపూడి ఎంపికయ్యారు. చదవండి: వీధి అరుగు ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాలు 2020 వరకు సింగపూర్ లో నివసిస్తూ రాధిక, సింగపూర్ నుంచి తొలి తెలుగు రచయిత్రిగా రెండు పుస్తకాలను ప్రచురించి 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్" లో చోటు సంపాదించుకోవడం, 'గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం' ఫేస్బుక్ సంస్థ ద్వారా తెలుగు భాషా సంస్కృతులపై పలు వ్యాసాలను అందించడం, సింగపూర్ లో ఆధ్యాత్మిక సాహిత్య కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా సింగపూర్‌లోని "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ ప్రధాన కార్యనిర్వాహక సభ్యురాలిగా అందించిన సేవలకుగాను ఆమెకు ఈ గుర్తింపు లభించింది. అనేక అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ప్రణాళికారచన, సుమారు 45 అంతర్జాతీయ కార్యక్రమాలకు వ్యాఖ్యాన నిర్వహణ, 30కి పైగా సాహిత్య సదస్సులలో వక్తగా, అతిథిగా ప్రసంగాలు, ఆమెకు ప్రపంచవ్యాప్తంగా పేరును తెచ్చి పెట్టాయి. "తెలుగు భాషా దినోత్సవ" సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పురస్కారానికి ఎంపికైన కేవలం 12 మంది తెలుగు భాషాసేవకులలో తాను కూడా ఉండటం, తన కృషికి ఇంతటి చక్కటి గుర్తింపు లభించడం ఎంతో ఆనందంగా ఉందని" రాధిక కార్యక్రమ నిర్వాహకులకు, తనను నిత్యం ప్రోత్సహిస్తున్న "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. "ప్రపంచ నలుమూలలలోని పలు దేశాల నుంచి ఈ పురస్కారాల కోసం వచ్చిన నామినేషన్లను నిష్ణాతులైన న్యాయనిర్ణేతలు పరిశీలించి 12 మందిని పురస్కారాలకు ఎంపిక చేయటం జరిగిందని, ఈ పురస్కారాలను ఆగష్టు 𝟐𝟖వ తేదీ తెలుగు భాషా దినోత్సవ మొదటి రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథులచే ప్రధానం చేయటం జరుగుతుంద’’ని నిర్వాహకులు తెలియజేశారు.ఈ సందర్భంగా రాధికకు సింగపూర్ నుంచి 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, ఇతర సభ్యులు, అన్ని దేశాల నుంచి శ్రేయోభిలాషులు శుభాకాంక్షలను తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. చదవండి : సెప్టెంబరులో టొరంటో వేదికగా తెలుగు సాహితి సదస్సు -
అబుదాబిలో ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అబుదాబిలో ప్రవాస భారతీయులకు కేంద్ర బిందువైన ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో, కళా ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వేడుకలను జరుపుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చిందని సంస్థ ప్రధాన కార్యదర్శి జోజో అంబూకెన్ తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మెహ్రా అల్ మెహ్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు జార్తి వరీస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జార్తీ వరీస్ మాట్లాడుతూ.. ఎందరో త్యాగ మూర్తుల బలి దానాల ఫలితమే ఈ రోజు మనమందరము అనుభవిస్తున్న స్వేచ్చ వాయువులని, భావి భారత నిర్మాణం లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతయినా ఉందని తెలియ జేశారు. 75 వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా కోవిడ్ సమయం లో సంస్థ సభ్యులు బీరన్, యూనిస్ వారు చూపిన సమాజ స్పూర్తి కి గౌరవ పురస్కారాన్ని అందజేశామని సంస్థ సంక్షేమ కార్య దర్శి రాజా శ్రీనివాసరావు వెల్లడించారు. భారత ప్రభుత్వ పిలుపు మేరకు సాయంత్రం జరిగిన ఆజాది కి అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశం లోని వివిధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ గాన, నాట్య కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల వారి కళలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చిన్నారుల ప్రదర్శన చూపరులను ఎంతగానో ఆకర్షించింది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ గాన నాట్య కళా ప్రదర్శన జరిగింది. సాయంత్రం జరిగిన కార్యక్రమానికి లూలూ గ్రూపుల సంస్థ చైర్మన్ , ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ చైర్మన్ పద్మశ్రీ డా యూసుఫ్ అలీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో సంస్థ క్రీడా కార్యదర్శి ఫ్రెడీ, ఉప ప్రధాన కార్య దర్శి జార్స్ వర్గీస్, ఉప కోశాధికారి దినేష్, జనరల్ మేనేజర్ రాజు తదితర ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. -
హృద్యమైన పద్యము భాష వికాసానికి మూలం
మెల్బోర్న్ : నేటి ప్రపంచంలో నలుమూలలా తెలుగు భాష వృద్ధి చెందుతున్న పరిణామం మంచి భవిష్యత్తును సూచిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సభాపతి డా. మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆస్ట్రేలియా తెలుగు సంస్థ ‘తెలుగుమల్లి’ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ప్రారంభమైనా ‘తెలుగు కావ్యసౌరభాలు’ జూమ్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బుద్ధప్రసాద్ ప్రారంభోపన్యాసం చేస్తూ ఈ రోజుల్లో రచయితలు విరివిగా రచనలు చేయటం ముదావహమే అయినా తెలుగు కావ్యాలను, పూర్వసాహిత్యాన్ని చదివే పాఠకులు మళ్ళీ రావాలని పద్య సాహిత్యం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. వెయ్యేళ్ళ తెలుగుసాహిత్యాన్ని అధ్యయనం చేస్తే తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలు, పద్య ప్రాముఖ్యత సజీవంగా అర్థమవుతాయని ఒక్కాణించారు. ఈ విషయంలో విదేశాల్లోని తెలుగువారి కృషిని ఆయన ప్రశంసించారు. ఆస్ట్రేలియాలోని “తెలుగుమల్లి” సంస్థ ద్వారా నిర్వాహకులు కొంచాడ మల్లికేశ్వరరావు తెలుగు పద్యప్రచారానికి పూనుకొని అవధానాలు, పద్యకావ్యరచనలు, కావ్యసమీక్షలు కరోనా బాధితసమయంలో కూడా నిర్వహించటాన్ని బుద్ధప్రసాద్ ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో సాహిత్య ప్రక్రియలకు కొదవలేదని, ఇక్కడ కథలు, కవితలు, పద్యాలు వ్రాసే శతక కర్తలు కూడా చాలామంది ఉన్నారని గత సంవత్సరం తెలుగు భాష ప్రపంచ దేశాలలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో సామాజిక భాషగా గుర్తించడం, అందులో ఇక్కడి తెలుగువారందరూ పాలుపంచుకోవడం శ్లాఘనీయమని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు పంచకావ్యాలను వారానికొకటి చొప్పున విశ్లేషించటానికి పూనుకున్న డా. చింతలపాటి మురళీకృష్ణ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నెలనెలా అవధానాలు నిర్వహిస్తున్న ఆస్ట్రేలియా అవధాని తటవర్తి కళ్యాణ చక్రవర్తి సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రావిపాటి శ్రీకృష్ణ, డా. చారి ముడుంబి, డా.వేణుగోపాల్ రాజుపాలెం,డా.ఉష శ్రీధర్, డా.శనగపల్లి కోటేశ్వరరావు, సునిల్ పిడుగురాళ్ళ, విశ్వనాధశర్మ, పిలుట్ల ప్రసాద్ ప్రభృతులు జూమ్ ద్వారా పాల్గొన్నారు.సింగపూర్, మలేసియా, అమెరికా, ద.ఆఫ్రికా దేశాలవారు కార్యక్రమాన్ని ఆసక్తితో వీక్షించారు. -
వాషింగ్టన్ డీసీ వేదికగా ఆటా వేడుకలు
వాషింగ్టన్ డీసీ: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ని 2022 జులై 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఆటా కార్యవర్గం ప్రకటించింది. వాషింగ్టన్ డీసీలో ఉన్న హెర్న్‌డాన్ వరల్డ్ గేట్ సెంటర్ ఏరియాలో క్రౌన్ ప్లాజా హోటల్లో జరిగిన ఆటా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు ఎనిమిది వందల మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. మొదటిసారి ఇప్పటి వరకు 16 సార్లు ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్‌లు జరిగాయి. అయితే ఇవన్నీ అమెరికాలోని వేర్వేరు నగరాల్లో జరిగాయి. అయితే 17వ కాన్ఫరెన్స్‌కి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మొదటిసారి వేదికగా నిలవనుంది. ఈ వేడుకలు నిర్వహించేందుకు వాల్టేర్ ఈ కన్వెన్షన్ సెంటర్‌ని ఎంపిక చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కి క్యాపిటల్ ఏరియా తెలుగు సంఘం, కాట్స్ కో హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఏర్పాట్ల పరిశీలన ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కాట్స్ ఆధ్వర్యంలో 70 మందికి పైగా ఆటా కార్యవర్గ, అడ్హాక్, అడ్విసోరీ, లోకల్ కన్వెన్షన్ కమిటీలు కాన్ఫరెన్స్ ఏర్పాట్లను పరిశీలించారు. వాల్టేర్ ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉన్న సౌకర్యాలను పర్యవేక్షించారు. 12 వేల మంది ఆటా కాన్ఫరెన్స్ యూత్ కన్వెన్షన్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం లో 12,000 మందికి పైగా తెలుగు వారు పాల్గొనే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు కల్పించటానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. -
ఘనంగా ప్రారంభమైన ఆటా వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్ పనులు
వాషింగ్టన్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా), ఆధ్వర్యంలో 17వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ మీటింగ్ వాషింగ్టన్ డీసీ లో శనివారం ఎంతో ఉల్లాసంగా నిర్వహించారు. హెర్నడోన్ నగరంలో క్రౌన్ ప్లాజా హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు.మొట్టమొదటి సారిగా ఆటా కాన్ఫరెన్స్ అమెరికా రాజధానిలో 2022 సంవత్సరంలో జులై 1,2,3 తేదీలలో వాల్టర్ యీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నారు . కాపిటల్ ఏరియా తెలుగు సంఘం కాట్స్ కో-హోస్ట్‌గా వ్యవహరించనుంది. శనివారం రోజున నిర్వహించిన కార్యక్రమంలో ఆటా 17వ మహా సభల థీమ్ సాంగ్, లోగోను ఆవిష్కరించారు. ఆటా జాయింట్ సెక్రటరీ రామకృష్ణ ఆలా సభ కార్యక్రమాలకు అతిథుల్ని ఆహ్వానించారు. ఎంబసీ అఫ్ ఇండియాలో కౌన్సిలర్ అన్షుల్ శర్మ ముఖ్య అతిధిగా విచ్చేసారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. గత 30 సంవత్సరాలుగా అమెరికాలో భారత సంతతి వారికీ సేవ చేయడంలో ఆటా సంస్థ ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ కమిటీలను ప్రకటించారు. ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి తర్వాత అందరిని కలుసుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మొట్టమొదటిసారిగా డీసీలో కనెన్షన్ నిర్వహిస్తున్నామని అమెరికాలోని తెలుగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న ఈ కార్యక్రమం లో 12000 మందికి పైగా పాల్గొననున్నారు. అందుకోసం సకలసౌకర్యాలు కల్పించటానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఆటా ప్రెసిడెంట్‌గా ఎన్నిక కాబడిన మధు బొమ్మినేని మహిళలు కాన్ఫరెన్స్ లో ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. ఆటా 17వ మహా సభల కన్వీనర్ గా సుధీర్ బండారు, కోఆర్డినేటర్ గా కిరణ్ పాశం, కాన్ఫరెన్స్ డైరెక్టర్‌గా కేకే రెడ్డి, కో-కన్వీనర్‌గా సాయి సుదిని, కో-కోర్డినేటర్‌గా రవి చల్ల, కో-డైరెక్టర్‌గా రవి బొజ్జ , కాట్స్ ప్రెసిడెంట్ సుధా కొండపు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. అడ్విసోరీ కమిటీ చైర్‌గా జయంత్ చల్ల, రీజినల్ కోఆర్డినేటర్‌గా శ్రావణ్ పాదురు వ్యవహరించనున్నారు. 70 కమిటీలను ప్రకటించారు. డీసీ తెలుగు కమ్యూనిటీలో ఎంతో మంది ప్రముఖ వ్యక్తులను ఈ కమ్యూనిటీలో సభ్యులుగా ప్రకటించారు. 17వ మహా సభల కన్వీనర్ సుధీర్ బండారు వాషింగ్టన్, వర్జీనియా రాష్ట్రాల లోని తెలుగు వారందరు కాన్ఫరెన్స్ గొప్పగా నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించాలని అభ్యర్ధించారు. కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ కిరణ్ పాశం మాట్లాడుతూ.. ఆటా తెలుగు సంస్కృతి పరిరక్షణతో పాటు ఎన్నో సేవ కార్యకమాలు కూడా నిర్వహిస్తోందని తెలియచేశారు. కాన్ఫరెన్స్ డైరెక్టర్ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రారంభ సమావేశంలోనే ఈ సంఖ్యలో తెలుగు వారు పాల్గొనడం శుభసూచకమన్నారు. అడ్విసోరీ కమిటీ అధ్యక్షులు జయంత్ చల్ల కాన్ఫరెన్స్ విజయవంతం చెయ్యటానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. తానా, నాట, టీడీఫ్, నాట్స్, టాటా ,జీడబ్ల్యూసీటీఎస్, వారధి, తాం, ఉజ్వల, ఎన్నో సంస్థలు కాన్ఫరెన్స్‌కి తమ సంఘీభావం ప్రకటించాయి. అమెరికా నలుమూల నుంచి ఎంతో మంది ఆటా కార్యవర్గ, ఎగ్జిక్యూటివ్, వాలంటీర్స్ ఈ కార్యక్రంలో పాల్గొనటానికి విచ్చేశారు. 100 మంది ఆటా, కాట్స్ సభ్యులు కన్వెన్షన్ సెంటర్ టూర్లో పాలుపంచుకొని ఎటువంటి ఏర్పాట్లపై ఆలోచించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు అందరిని అలరింపచేశాయి. యువ గాయని గాయకుల పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఫండ్ రైసింగ్ కార్యక్రమం లో 750 వేల డాలర్ల విరాళాలు సేకరించారు. పూర్వ ఆటా అధ్యక్షులు పరమేష్ భీంరెడ్డి, కరుణాకర్ అసిరెడ్డి లోకల్ టీం, మీడియా మిత్రుల సహకారాన్ని కొనియాడారు. -
‘ఆధునిక జీవన విధానం- ఆయుర్వేదం పాత్ర’పై వీధి అరుగు సమావేశం
వీధి అరుగు ఆధ్వర్యంలో ‘ఆధునిక జీవన విధానం- ఆయుర్వేదం పాత్ర’పై జూలై 25 తారీఖున ఆన్లైన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం సాయంత్రం ఏడు గంటలకు కార్యక్రమం ప్రారంభంకానుంది. యూరప్‌లో నివసించే వారి కోసం 15.30 CEST కార్యక్రమం ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమంలో పలు అంశాలపై ప్రముఖ వక్తలు మాట్లాడనున్నారు. ‘భారతీయ వైద్య రంగం – శాంత ప్రస్థానంలో నా అనుభవాలు’ అంశంపై శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డి, ‘ఆధునిక జీవనం – ఆయుర్వేద పాత్ర’ అంశంపై కళారత్న, ఆంధ్రప్రదేశ్ హంస పురస్కార గ్రహీత, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జీ.వీ. పూర్ణచంద్ మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా ఐఐటీ ఢిల్లీ విశ్లేషకులు ప్రొఫెసర్ వి. రామ్ గోపాల్ రావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ భాస్కర్ దీర్ఘాసీ(భారత్), శిరీష తూనుగుంట్ల(యూఎస్ఏ), ప్రో. గణేష్ తొట్టెంపూడి(జర్మనీ), అశోక్ కుమార్ పారా(భారత్), విజయ్ కుమార్ (యూకే), లక్ష్మణ్.వి(దక్షిణాఫ్రికా), అన్నపూర్ణ మహీంద్ర(ఫ్రాన్స్), రవిచంద్ర నాగబైరవ(నార్వే), సత్యనారాయణ కొక్కుల(నార్వే), శ్రీని దాసరి(నార్వే), సునీల్ గుర్రం (నార్వే), రామకృష్ణ ఉయ్యూరు(నార్వే), శైలేష్ గురుభగవతుల(ఫిన్లాండ్),శివప్రసాద్‌రెడ్డి మద్దిరాల(డెన్మార్క్), అచ్యుత్‌రామ్ కొచ్చర్లకోట(ఫిన్లాండ్) ఆయా దేశాల సమన్వయకర్తలుగా ఉండనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని నిర్వహణ సంస్థ వీధి అరుగు పేర్కొంది. కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను నిర్వహకులు విడుదల చేశారు. నాలుగు తెలుగు మాటలు చెప్పుకునేందుకు ‘వీధి అరుగు’ వేదికగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం నెదర్లాండ్స్‌లో నివసిస్తున్న గాయకుడు కార్తీక్ మద్దాల పాటతో ప్రారంభం కానుంది. కార్యక్రమానికి డాక్టర్ విద్య వెలగపూడి అనుసంధానకర్తగా వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు, మీ ప్రశ్నలను ఈ క్రింద లింక్ ద్వారా తెలపవచ్చును: https://tinyurl.com/VeedhiArugu ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించవచ్చు: 1. Join Zoom meeting https://us02web.zoom.us/j/87433469173?pwd=QXpNK3ZVbVFYVkFIUm0wdElhNU1odz09 Meeting ID: 874 3346 9173 Passcode: arugu 2. Youtube live streaming: ఆధునిక జీవితంలో ఆయుర్వేద పాత్ర : వీధి అరుగు సమావేశం, జులై 2021 - YouTube -
తానా నూతన అధ్యక్షుడిగా అంజయ్య చౌదరి
వాషింగ్టన్: నీతి, నిజాయితీ, నిరాడంబరత, మంచితనం, మాటకు బద్దులై వుండటం, మానవతా దృక్పథం, ప్రజా సేవా తత్పరత మొదలైన సాత్విక లక్షణాలన్నింటి సమాహారమే అంజయ్య చౌదరి లావు. అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద తెలుగు సంస్థ తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) నూతన అధ్యక్షుడిగా ( 2021-23) బాధ్యతలు స్వీకరించ బోతున్న మానవత్వం పరిమళించిన మంచి మనిషి అంజయ్య చౌదరి లావు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరూ మనసా, వాచా, కర్మణా స్వాగతిస్తున్నారు. మాటల్లో నిష్కల్మషం, ఆచరణలో నిజాయితీ, అంజయ్య చౌదరి లావు ఔన్నత్యానికి నిదర్శనం. కష్టపడటం కాలంతో పరిగెత్తడం, అనుకున్న లక్ష్యం సాధించే వరకు అనునిత్యం అలుపెరగని పయనం సాగించనున్నారు. తెలుగు వారి పట్ల ప్రేమ వారి సమస్యల పరిష్కారం కొరకు కడదాకా పోరాడే యోధుడు అంజయ్య చౌదరి లావు . డాలర్ల వేటలో మానవ సంబంధాలను మరుస్తున్న ఈరోజుల్లో ఖండాంతరాల అవతల కూడా కాసులకు అతీతంగా సేవలందించి అందరి మన్ననలను పొందుతున్న తెలుగుతేజం అంజయ్య చౌదరి లావు. తానా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయడం నిజంగా పర్వదినం. తన కుటుంబ శ్రేయస్సు కాకుండా అమెరికాలోని తెలుగువారు కుటుంబాలను కూడా తన కుటుంబంగా భావించి ఆపదలో ఉన్నవారు ఎవరైనా ఏ సమయంలో వచ్చినా వెంటనే స్పందించి , వారికి కొండంత ధైర్యాన్ని కల్పించి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధంగా సేవ చేస్తున్న అంజయ్య చౌదరి లావు కి అభినందనలను తెలియజేశారు. తెలుగువారి సేవలో పరమాత్మను సేవిస్తూ తన సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకొని పోతూ తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకోవాలని అంజయ్య చౌదరి లావు లక్ష్యం . ఆ లక్ష్య సాధన కోసమే ఆయన నిరంతరం ఆరాటపడుతున్నారు. కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని ఉన్న పెద్దఅవుటుపల్లి గ్రామంలో లావు సాంబశివరావు - శివరాణి దంపతులకు 1971 మార్చి 27 న అంజయ్య చౌదరి జన్మించారు. తండ్రి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగిగా విశాఖపట్నంలో పనిచేయడం వలన అంజయ్య చౌదరి చిన్నతనంలోనే బాబాయి లావు రంగారావు,పిన్నమ్మ కోటేశ్వరమ్మ ల సంరక్షణలో పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా గన్నవరం లోని సెయింట్ జాన్స్ హైస్కూల్లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడలోని గౌతమి రెసిడెన్షియల్ కళాశాలలో, ఉన్నత విద్య బీటెక్ బళ్ళారి లోను, ఎంటెక్ గుల్బర్గా కళాశాలలో పూర్తిచేశారు. పూవు పుట్టగానే పరిమళించినట్లు గా అంజయ్య చౌదరి చిన్నతనం నుండే సేవా దృక్పథాన్ని అలవర్చుకున్నారు. 1988 లో అమెరికా వెళ్లి అట్లాంటాలో నివాసమున్నారు. 1997 లో అనకాపల్లి కి చెందిన నతాషా తో వివాహం జరిగింది. అంజయ్య చౌదరి లావు గారికి ఇద్దరు సంతానం. కుమారుడు శ్రీకాంత్ చౌదరి, కుమార్తే అక్షిణ శ్రీ చౌదరి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ,వారికి ఆపన్నహస్తం అందించడంలోనే జీవిత పరమార్థం దాగి ఉన్నదని భావించే అంజయ్య చౌదరికి కుటుంబ ప్రోత్సాహం బాగా తోడయింది. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ సహకారం తప్పక ఉంటుందనే అక్షరసత్యం నిజం చేస్తూ అంజయ్య చౌదరి లావు ప్రతి విజయం వెనుక వారి ధర్మపత్ని చేయూత, ప్రోత్సాహం ఉంది. ఆమె ప్రోద్బలంతోనే అంజయ్య చౌదరి సేవా కార్యక్రమాలకు ఎదురులేకుండా ( తానా ఎమర్జెన్సీ అసిస్టెంట్స్ మేనేజ్మెంట్ ) తానా టీమ్ స్క్వేర్ అంజయ్య చౌదరి లావుగా పేరుపొందారు. పేద ప్రజల గుండెచప్పుడు పెద అవుటపల్లి పల్లి గ్రామంలో ప్రజలకు ఎలాంటి అనారోగ్యం కలిగినా కార్పొరేట్ వైద్యులు వారి తలుపు తట్టి ఉచితంగా వారికి రోగాలు నయం చేస్తున్నారు . ఈ సామాజిక, ఆరోగ్య చైతన్యం వెనుక ఉన్నది ఒకే ఒక్కరు. ఆయనే అంజయ్య చౌదరి లావు. తన చుట్టూ ఉన్న సమాజం బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మి , సొంత లాభం కొంత మానుకొని స్వగ్రామానికి తోడ్పాటును అందించాలనే జన హితుడు ఆయన పేర్కొన్నారు. విజయవాడ మణిపాల్ హాస్పటల్ వైద్యబృందం సహకారంతో హృద్రోగ వైద్య శిబిరం ఏర్పాటు చేసి, గుండె వ్యాధులు ఉన్న వారిని గుర్తించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యుల సహకారంతో క్యాన్సర్ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన వైద్య సహాయం అందించారు. జైపూర్ నుండి వికలాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలను తెప్పించి పంపిణీ చేయించారు. తాను ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా తాను పుట్టి పెరిగి నడిచివచ్చిన దారిని మర్చిపోకుండా అందరినీ కలుపుకొని పోతూ తన స్వగ్రామం పెద్ద ఉటపల్లి అభివృద్ధికి నడుం బిగించిన అజాతశత్రువు అంజయ్య చౌదరి. "ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుని కో మాల అని నమ్మి " ఎన్నో సేవా కార్యక్రమాలకు స్వయంగా అంజయ్య చౌదరి విరాళం అందించారు . మిత్రులు సహృదయులు వద్ద నుండి విరాళాలు సేకరించి గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. గ్రామంలోని అనాధ పిల్లలకు, వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. నిరు పేద పిల్లలకు కానుకలు, ఆటబొమ్మలు పంపిణీ, విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ, అనాధ శరణాలయం లో అన్నదానం, గ్రామంలో మొక్కలు నాటడం చేపట్టారు. తానా స్కాలర్షిప్పులు వంటి ఎన్నో మంచి కార్యక్రమాలకు తన వంతు సహాయం అందించారు. భారతదేశంలో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. గ్రామాభివృద్ధి లో చౌదరి అలుపెరుగని కృషి చేస్తున్నారు. పెద్ద అవుటపల్లి గ్రామంలో మొదలైన అంజయ్య చౌదరి లావు సామాజిక సేవా పరిమళం మెల్లమెల్లగా అమెరికా అంతా వ్యాపించింది . అమెరికన్ రెడ్ క్రాస్ ఇతర జాతీయ ప్రాంతీయ సంస్థలు నిర్వహించిన రక్తదాన శిబిరాల నిర్వహణ లో అంజయ్య చౌదరి చురుగ్గా పాల్గొన్నారు. గత 22 సంవత్సరాలుగా జరిగిన అనేక రక్తదాన శిబిరాల్లో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అక్కడ నిర్వహించే వైద్య శిబిరాలు తగిన హాల్స్ ఏర్పాటు చేయడం, కార్యకర్తలను సమకూర్చటం, ధన సహాయం చేయడం, వైద్యం కోసం వచ్చిన వారికి తగిన వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు. " ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న " అనే నానుడిని ప్రగాఢంగా విశ్వసిస్తూ సాటి మనిషికి సాయం పడటం వారికి ప్రేమను పంచడం ఇవే నా జీవితాన్ని నడిపించే అంజయ్య చౌదరి లావు మూలసూత్రాలంటారు అన్నదానం " అన్నం పరబ్రహ్మ స్వరూపం " అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టి వారిని ఆదుకోవడం కన్నా మంచి పని ఏమి ఉంటుందని భావించారు అంజయ్య చౌదరి లావు. భగవంతుడు తనకు ఇచ్చిన శక్తి స్తోమతను బట్టి గత 20 సంవత్సరాలుగా నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక వృద్ధ శరణాలయాల్లో అన్నదానం చేస్తూ అందరి అభిమానాన్ని అంజయ్య చౌదరి లావు చూరగొన్నాడు. పదవులకే వన్నెతెచ్చిన అంజయ్య చౌదరి లావు అంజయ్య చౌదరి లావు పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు. పదవులే ఆయనను వరించాయి . వరించిన ప్రతి పదవికి ఆయన వన్నె తెచ్చాడు. అతి చిన్న వయసులోనే అనేక పదవులు చేపట్టారు. తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ గా మొదలైన వారి ప్రయాణం నేడు తానా అధ్యక్షులు వరకూ వచ్చింది. "తానా" టీమ్ స్క్వేర్ చైర్మన్ (2011-13) "తానా" సంయుక్త కోశాధికారి ( 2013-15) "తానా" టీమ్ స్క్వేర్ మెంటర్ చైర్మన్ (2013 -15 ) "తానా" కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ (2015 - 17 ) "తానా' టీమ్ స్క్వేర్ కో చైర్ (2015 - 17) "తానా" జనరల్ సెక్రటరీ (2017 - 19) తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ ( 2017 -19) "తానా" ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (2019 - 21 ) "తానా" ప్రెసిడెంట్ ( 2021 -23) తెలుగు వారి సేవలో అమెరికాలో ఉద్యోగం చేస్తూనే అంజయ్య చౌదరి లావు అక్కడి తెలుగు వారి సమస్యల పరిష్కారం కోసం తానా సంస్థలో సభ్యులుగా చేరారు. తెలుగువారు హత్యకు గురైనా, రోడ్డు ప్రమాదాల్లో మరణించినా వారి మృతదేహాలను ఇండియాకు తీసుకురావడంలో జరిగే ప్రాసెస్ మొత్తాన్ని దగ్గరుండి అన్ని తానై పూర్తి చేసేవారు. ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు ఇండియా నుండి అమెరికా కి వెళ్లి ఇబ్బందులకు గురైతే వారికి అండగా నిలిచారు. హెల్త్ ఇన్సూరెన్స్ , ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, ఫేస్బుక్ సమాచారం ఆధారంగా ఇబ్బందుల్లో ఉన్న వారి సమాచారాన్ని తెలుసుకొని వారికి సహాయపడేవారు. కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ గా సుమారు 100 కు పైగా సేవా కార్యక్రమాలు అమెరికా వ్యాప్తంగా చేశారు. ముఖ్యంగా బోన్‌మారో డ్రైవ్ , బ్లడ్ డ్రైవ్, ఫుడ్ అండ్ టాప్ డ్రైవ్, ట్రైనింగ్ వర్క్ షాప్, టాక్స్ సెమినార్లు, ఫైనాన్స్ ప్లానింగ్ సెమినార్ నిర్వహించి ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యం పెంపొందించుకొనేలా తన వంతు సహాయం అందించారు. ఆపదలో ఉన్న తెలుగు వారిని ఆదుకునేందుకు 2008వ సంవత్సరంలో ప్రారంభించబడిన టీమ్ స్క్వేర్ సంస్థకు చైర్మన్ గా పనిచేసిన కాలంలో అంజయ్య చౌదరి చేసిన సేవలు అనిర్వచనీయం. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ సుమారు 600 మంది కార్యకర్తలను సంధాన పరుస్తూ సేవా యజ్ఞాన్ని కొనసాగించారు. రానున్న రోజుల్లో "తానా" కీర్తి బావుటా తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిపేందుకు ,తానా యాష్చంద్రిక లను దశదిశలా వ్యాపింప చేసేందుకు అంజయ్య చౌదరి లావు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఆశిద్దామని పేర్కోనారు. -
ప్రవాసాంధ్రుల ఔదార్యం, కోవిడ్ కేర్ కిట్లు పంపిణీ
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కోవిడ్ సంబంధిత ఔషధాలు, మెడికల్ ఎక్విప్మెంట్ను విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ డోనేట్ చేసింది. కాలిఫోర్నియాలోని హన్‌ఫోర్డ్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించి.. వాటి పరిష్కారానికి పాటుపడుతోంది. కోవిడ్ సెకండ్ డ్రైవ్‌లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు చోట్ల వెటా ఆధ్వర్యంలో మందులు, మెడికల్ ఎక్విప్మెంట్ అందచేశారు. న్యూయార్క్, న్యూజెర్సీ ఫార్మసీల నుంచి విరాళాలు సేకరించి వాటిని రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలో పలు గ్రామాలకు రూ. 1. 50 లక్షల విలువైన యాంటీ బయాటిక్స్, సీ విటమిన్ ట్యాబెట్లు, సిరంజీలు డోనేట్ చేశారు. ఖమ్మం జిల్లా పల్లేరు గ్రామంలో ఐసోలేషన్ వార్డుకి ఫేస్ షీల్డ్స్, హెడ్ క్యాప్స్, ఆక్సిమీటర్లు, ఐఆర్ థర్మామీటర్లు అందించారు. ఇదే జిల్లాలో కూసుమంచి ఆరోగ్య కేంద్రానికి 7 పీపీఈ కిట్ గౌన్లలను అందించారు. సూర్యాపేట జిల్లాలోని పలు పాఠశాలలకు ఆక్సిమీటర్లు, ఇర్ థర్మామీటర్లను పంపిణీ చేయడంతో పాటు కృష్ణా జిల్లాలో 75 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు ఆక్సిమీటర్లు మరియు డిజిటల్ థర్మామీటర్లను పంపిణీ చేశారు. దీంతో పాటు తిరుపతి రుయా ఆసుపత్రికి రూ. 1.5 లక్షల విలువైన పల్స్ ఆక్సిమీటర్లు, కాంటాక్ట్‌లెస్ థర్మామీటర్లు, ఇర్ థర్మామీటర్లు, ఫేస్ షీల్డ్స్, పీపీఈ కిట్లు, హెడ్ క్యాప్స్, రేణిగుంటలోని అభయ క్షేత్రం అనాథ ఆశ్రమానికి ఒక నెలకు సరిపడా సామాన్లు, ప్రాజెక్ట్ ఆశ్రయ్కి 15 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వెటా ద్వారా అందించారు. -
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మకమైన WASC గుర్తింపు
కాలిఫోర్నియా: భారతీయ భాషలు, కళలకు నెలవైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మకమైన WASC(Western Association of Schools and Colleges) గుర్తింపు లభించింది. గత శతాబ్ద కాలంలో అమెరికాలో భారతీయులచే ఇటువంటి విశ్వవిద్యాలయం నెలకొల్పబడటం ప్రథమం. విశ్వవిద్యాలయానికి WASC గుర్తింపు లభించడం ప్రప్రథమం. కాలిఫోర్నియా రాష్ట్రంలో పేరొందిన స్టాన్ ఫోర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ, లాస్ఎంజిల్స్ విశ్వవిద్యాలయాలకు ఉన్న గుర్తింపు ప్రస్తుతం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి లభించింది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ.. భారతీయ భాషలకు, కళలకు అంతర్జాతీయ స్థాయిలో పట్టంగట్టి, ప్రతిభగల విద్యార్థులకు బోధన చేయటానికి ఈ గుర్తింపు ఆవశ్యకమని, ఈ అపూర్వ ఘట్టాన్ని అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఆచార్య పప్పు వేణుగోపాల్‌రావు మాట్లాడుతూ.. ఈ గుర్తింపుతో విశ్వవిద్యాలయం మరిన్ని భారతీయ కళలు,భాషలు, ఆయా రంగాల్లో పరిశోధనలు చేయటానికి సహకరిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. విశ్వద్యాలయ ప్రొవోస్ట్, చీఫ్ అకడెమిక్ ఆఫీసర్,చమర్తిరాజు మాట్లాడుతూ.. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుందని చెప్పటానికి ఈ గుర్తింపు తొలిమెట్టని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ఆర్థిక, పరిపాలనా విభాగం వైస్ ప్రెసిడెంట్, కొండుభట్ల దీనబాబు మాట్లాడుతూ.. WASC గుర్తింపు విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎన్నోబాటలు వేస్తుందని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కాలిఫోర్నియారాష్ట్రం, మిల్పిటాస్ నగరంలో 2016లో స్థాపించబడింది. 2017లో కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు సంపాదించి భారతీయ కళలు, భాషల్లో విద్యాబోధనను ప్రారంభించింది. ప్రస్తుతం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో కూచిపూడి నాట్యం, భరత నాట్యం, కర్ణాటక సంగీతం, తెలుగు సంస్కృత భాషా విభాగాలు ఉన్నాయి. డిప్లమా మొదలుకొని మాస్టర్స్ డిగ్రీల వరకు విద్యాబోధన జరుగుతుంది. మరిన్ని వివరాలు https://www.universityofsiliconandhra.org/ వెబ్ సైట్లో లభిస్తాయని ఫణి మాధవ్ కస్తూరి తెలిపారు. -
పెన్సిల్వేనియా లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
పెన్సిల్వేనియా: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రము లో హ్యర్రీస్ బర్గ్ నగరంలో జులై 11న ఘనంగా జరిగాయి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నూతన అధ్యాయం లిఖించారని అమెరికాలోని పెన్సిల్వేనియాలో హ్యర్రీస్ బర్గ్ నగరం లో ఉన్న ప్రవాస భారతీయులు అభిప్రాయ పడ్డారు. వైఎస్సార్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అమెరికా స్టూడెంట్ కన్వీనర్ పెన్సిల్వేనియా రీజనల్ ఇంఛార్జ్, ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ సాత్విక్ రెడ్డి గోగులమూడి, హ్యర్రీస్ బర్గ్ ఇంచార్జి తేజ అధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో అనుబంధాన్ని ప్రవాస భారతీయులు గుర్తుచేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అమెరికా స్టూడెంట్ కన్వీనర్ పెన్సిల్వేనియా రీజనల్ ఇంఛార్జ్, ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ సాత్విక్ రెడ్డి గోగులమూడి మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు డాక్టర్ వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలతో లబ్ధి పొందారని చెప్పారు. మాట తప్పని..మడమ తిప్పని నేతగా ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ నిలిచిపోతారని అభిప్రాయపడ్డారు. హ్యర్రీస్ బర్గ్ ఇంచార్జి తేజ మాట్లాడుతూ... అందరికీ మంచి చేయాలనే తపనతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు డాక్టర్ వైఎస్సార్ అమలు చేశారని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రభుత్వం కూడా ఈ తపనతో ఉందన్నారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా వైఎస్సార్‌కు అభిమానులు ఉన్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అమెరికా స్టూడెంట్ కన్వీనర్ పెన్సిల్వేనియా రీజనల్ ఇంఛార్జ్, ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ సాత్విక్ రెడ్డి గోగులమూడి, హ్యర్రీస్ బర్గ్ ఇంచార్జి తేజ, మల్లికార్జున రెడ్డి కసిరెడ్డి , విభూషణ్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, వాకా కృష్ణ, రవీందర్ రెడ్డి శీలం, రాజేష్ ఊతకోళ్ళు , వెంక రెడ్డి సుంకర , ప్రకాష్ మిరియాల, వెంకట్ దంగేటి, అన్వేష్ ముత్యాల, సుజీత్ అనుగు లతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. -
రికార్డు సృష్టించిన అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం-2021
సింగపూర్: అంతర్జాల వేదికపై 34 దేశాల తెలుగు కళాకారులతో “అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం -2021” సంచలనం సృష్టించింది.“శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ సంస్థ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 3, 4 వ తేదీలలో 24 గంటల పాటు అద్వితీయంగా జరిగిన “అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021” కార్యక్రమంలో ప్రపంచ నలుమూలల నుండి 35 దేశాల నుండి 45 తెలుగు సంస్థలు, ప్రతినిధులు పాల్గొని ఒకే ప్రపంచ తెలుగు సాంస్కృతిక కుటుంబంగా కలసి, తెలుగు సంస్కృతికి నీరాజనాలు పట్టారు. కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు జ్యోతి ప్రకాశనం గావించి తమ అనుగ్రహభాషణాన్ని అందించగా, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కార్యక్రమంలో పాల్గొంటున్న 34 దేశాల సంస్థల ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రారంభోపన్యాసం గావించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను సంతరింపజేసింది. “ప్రపంచ నలుమూలల్లో వివిధ దేశాలలో తెలుగువారి ప్రతిభకు పట్టం కట్టే విధంగా, అన్ని దేశాల తెలుగు కళాకారులు ఒక కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయం అయ్యేవిధంగా, ఒక ప్రపంచ వేదికను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం రూపొందించామని, అనూహ్యమైన స్పందన తో 35 దేశాల ప్రతినిధులు పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా అనిపించిందని” శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు, కార్యక్రమం ముఖ్యానిర్వాహుకులు కవుటూరు రత్న కుమార్ తెలిపారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు వంటి ప్రముఖ ఆధ్యాత్మిక మార్గదర్శకులు విచ్చేసి సదస్సులో వారందరికీ తమ ఆశీస్సులు అందించారు. రామ్ మాధవ్, మురళి మోహన్, మండలి బుద్ధ ప్రసాద్, వామరాజు సత్యమూర్తి వంటి రాజకీయ ప్రముఖులు, భువనచంద్ర, తనికెళ్ళ భరణి, సాయి కుమార్, హర్షవర్ధన్, వంటి సినీ దిగ్గజాలు, సురేఖ మూర్తి, పార్ధు నేమాని, విజయలక్ష్మి వంటి ప్రముఖ గాయనీ గాయకులు, శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు, మాండోలిన్ రాజేష్, తాళ్లూరి నాగరాజు వంటి ప్రముఖ వాద్య కళాకారులు సభలో పాల్గొన్నారు. అమెరికా నుంచి ప్రముఖులు చిట్టెన్ రాజు, తోటకూర ప్రసాద్, జయశేఖర్ తాళ్లూరి, నిరంజన్, మధు ప్రఖ్యా , ఇండియా నుంచి ప్రముఖులు డా.వంశీ రామరాజు. డా. మీగడ రామలింగస్వామి, రుద్రాభట్ల రామ్ కుమార్ పాల్గొన్నారు. సుమారు 200 మందికిపైగా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని శాస్త్రీయ సంగీతం, నృత్యాలు, జానపదాలు, సినీ గీతాలు, వయోలిన్ వీణ వేణువు పియానో మొదలగు వాద్య గానాలు, అష్టావధానం, కవితలు, కథలు, వ్యాసాలు, లఘు నాటికలు మొదలైన ఎన్నో అద్భుత ప్రదర్శనలతో అందరిని అలరించారు. పోలెండ్ దేశస్థుడైన బాల గాయకుడు బుజ్జి చక్కటి తెలుగు పాటలతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ బృహత్కార్యక్రమానికి రాధిక మంగిపూడి ముఖ్య సమన్వయకర్తగా, ఊలపల్లి భాస్కర్ ప్రధాన సాంకేతిక నిర్వాహకునిగా, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయిని ప్రత్యక్ష ప్రసార నిర్వాహకులుగా, చామిరాజు రామాంజనేయులు, జయ పీసపాటి, సుబ్బు పాలకుర్తి, సునీత, సీతారామరాజు ప్రధాన వ్యాఖ్యాతలుగా, గుంటూరు వెంకటేష్, సురేష్ చివుకుల, మౌక్తిక తదితరులు సాంకేతిక నిర్వాహక బృందంగా వ్యవహరించారు. “శుభోదయం” సంస్థ, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ సింగపూర్, ఈ రెమిట్, EGA జూస్ ప్రధాన స్పాన్సర్స్ గా, సాక్షి టీవీ, టీవీ5, సింగపూర్ తెలుగు టీవీ, ఈ క్షణం, మా గల్ఫ్, మొదలైన వారు మీడియా పార్ట్నర్స్ గా నిర్వహింపబడిన ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులపాటు యూట్యూబ్ మరియు ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడి, సుమారు 20 వేల మంది ప్రేక్షకులను ప్రపంచ వ్యాప్తంగా అలరించింది. అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021లో పాల్గొంటున్న వివిధ దేశాల సంస్థలు.. సింగపూర్ నుంచి తెలుగు భాగవత ప్రచార సమితి, కాకతీయ కల్చరల్ సొసైటీ, మలేషియా తెలుగు సంఘం, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, ఇండోనేషియా తెలుగు అసోసియేషన్ , తెలుగు అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ బ్రూనై, ఆస్ట్రేలియా నుంచి తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా, తెలుగుమల్లి , తెలుగు అసోసియేషన్ ఆఫ్ సిడ్నీ, న్యూజిలాండ్ నుంచి తెలుగు అసోసియేషన్, సంగీత భారతి, భారతదేశం నుంచి వంశీ ఇంటర్నేషనల్ , రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, నవసాహితి ఇంటర్నేషనల్ , జనరంజని ముంబై, విశ్వనాథ ఫౌండేషన్, సౌదీఅరేబియా నుంచి సౌదీ తెలుగు అసోసియేషన్, ఖతార్ నుంచి ఖతార్ తెలుగు సమితి, ఆంధ్ర కళా వేదిక , బహరే్ తెలుగు కళా సమితి , కువైట్ తెలుగు సంఘాల ఐక్యవేదిక , ఒమాన్ తెలుగు కళా సమితి పాల్గొన్నాయి. యుఏఈ నుంచి తెలుగు తరంగిణి, మారిషస్ తెలుగు సాంస్కృతిక నిలయం , దక్షిణాఫ్రికా నుంచి తెలుగు సాహిత్య వేదిక , సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ, ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అసోసియేషన్ , తెలంగాణ అసోసియేషన్,, తెలుగు అసోసియేషన్ ఆఫ్ బోత్సువానా , నార్వే నుంచి వీధి అరుగు, నార్వే తెలుగు అసోసియేషన్, యునైటెడ్ కింగ్డమ్ నుంచి తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ , స్వీడన్ తెలుగు కమ్యూనిటీ, ఫిన్లాండ్ తెలుగు అసోసియేషన్ , ఫ్రాన్స్ తెలుగు సంఘం, జర్మనీ కలోన్ తెలుగు వేదిక , నెదర్లాండ్స్ తెలుగు కమ్యూనిటీ , ఐర్లాండ్ తెలుగు సంఘం, డెన్మార్క్ తెలుగు సంఘం, కెనడా నుంచి ఆంటోరియో తెలుగు అసోసియేషన్, అటావా తెలుగు అసోసియేషన్, తెలుగు తల్లి మాసపత్రిక,అమెరికా నుంచి తానా, వంగూరి ఫౌండేషన్ IBAM సంస్థలు ... పోలెండ్, స్విజర్లాండ్ , బెల్జియం, ఉగాండా, జపాన్ , శ్రీలంక దేశాలనుంచి ప్రతినిధులు , కళాకారులు ఈ రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలిసారి ఒకే అంతర్జాల వేదికపై 35 దేశాల తెలుగు ప్రతినిధులు ఇలా కలుసుకుని సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రసంగాలతో వేడుకలు జరుపుకోవడం ఒక విశిష్ట రికార్డుగా పరిగణించి “తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్” అధ్యక్షులు చింతపట్ల వెంకటాచారి ఈ కార్యక్రమాన్ని నమోదు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. -
ఫ్లోరిడాలో నాట్స్ ఆధ్వర్యంలో భారత కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్
టెంపాబే: అమెరికాలో తెలుగు వారిని ఏకం చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇండియన్ కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్‌ను నిర్వహించింది. టెంపాబే నాట్స్ విభాగంతో పాటు స్థానిక భారతీయ సంఘాలు ఈ క్యాంప్ నిర్వహణలో కీలక పాత్ర పోషించాయి. ప్లోరిడాలోని హిందూ ఆలయం సహకారంతో, నాట్స్ హిందూ ఆలయంలోనే ఈ సర్వీసెస్ క్యాంప్ నిర్వహించింది. 400 మందికి పైగా భారతీయులు ఈ కాన్సులర్ సేవలను ఈ వేదికగా ద్వారా పొందారు. పాస్‌పోర్ట్ పునరుద్ధరణ, కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తు, OCI దరఖాస్తు, పునరుద్ధరణలు, పవర్ ఆఫ్ అటార్నీ, లైఫ్ సర్టిఫికేషన్, ధృవీకరణ వంటి వివిధ సేవలను అందుకున్నారు. ఈ క్యాంప్‌లో 4వేలకు పైగా పత్రాల పరిశీలన, ధ్రువీకరణ జరిగింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓ క్రమపద్ధతిలో నాట్స్ వారందరికి సేవలు అందించడంలో చేసిన కృషిని భారత కాన్సులేట్ బృందం ప్రత్యేకంగా అభినందించింది. టెంపాబే లో ప్రవాస భారతీయులకు కాన్సులర్ సేవలను అందించడమే లక్ష్యంగా నాట్స్ చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రవాస భారతీయులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇది తమకు ఎంతగానో ఉపకరించే కార్యక్రమాన్ని చేపట్టినందుకు నాట్స్‌ను ప్రత్యేకంగా వారు అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడంలో నాట్స్ బోర్డ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఉపాధ్యక్షులు(ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్) శ్రీనివాస్ మల్లాది కీలక పాత్ర పోషించారు. ఈ సేవలను అందించడంలో ప్రవాస భారతీయులకు సహకరించిన నోటరీ సర్వీస్ ప్రోవెడర్లు జగదీష్ తోటం, పరాగ్ సాథే, హేమ కుమార్‌లకు నాట్స్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇండియన్ కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్‌ను దిగ్విజయం చేసేందుకు నాట్స్ ముందు నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహారించింది. ఉదయం యోగా శిబిరంతో ఈ క్యాంప్ ప్రారంభించింది. దాదాపు 30 మంది సభ్యులు ఈ యోగా శిబిరంలో పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పక్కాగా అమలయ్యేలా నాట్స్ జాగ్రత్తలు తీసుకుంది. మాస్క్‌లు, టెంపరేచర్ చెకింగ్ వంటి సీడీసీ మార్గదర్శకాలను అమలు చేసింది.. నిర్వాహకులకు కావాల్సిన ఆహార ఏర్పాట్లు చేసింది. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ, సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపా బే విభాగం సమన్వయకర్త ప్రసాద్ ఆరికట్ల, నాట్స్ టెంపా బే విభాగం జాయింట్ కోఆర్డినేటర్ సురేష్ బొజ్జాతో పాటు నాట్స్ సభ్యులు విజయ నాయుడు కట్టా, అనిల్ అరిమంద, జగదీష్ తోటం, సుమంత్ రామినేని, అచ్చిరెడ్డి శ్రీనివాస్, నవీన్ మేడికొండ, హేమ కుమార్, సాయి వర్మ, పరాగ్ సాతే, రమేష్ కొల్లి తదితరులు ఈ క్యాంప్ విజయవంతం చేయడానికి తమ వంతు సహయ సహకారాలు అందించారు. ఈ సర్వీస్ క్యాంప్‌కు మద్దతు ఇచ్చిన నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు శేఖర్ అన్నే, నాట్స్ నాయకులు రవి గుమ్మడిపూడి, శ్రీనివాస్ కాకుమాను, రంజిత్ చాగంటి, మురళి మేడిచెర్లకు నాట్స్ టెంపా బే విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. చదవండి: అమెరికాలో బాలు పాటకు పట్టాభిషేకం -
డాల్లస్‌లో ఘనంగా వనభోజన కార్యక్రమం
టెక్సాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాల్లస్ (టీపీఏడీ) ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని డాల్లస్‌లో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్వర్యంలో గడిచిన మూడు నెలల్లో వరుసగా మూడు సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించిన తరువాత టీపీఏడీ వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ వనభోజన కార్యక్రమంతో డాల్లస్‌లోని తెలుగు వారందరినీ ఒక వేదికపైకి తీసుకురావడం సంతోషంగా ఉందని కార్యక్రమ నిర్వహకులు తెలిపారు. ఈ వనభోజన కార్యక్రమం డాల్లస్‌లోని హార్స్ రాంచీ, బిగ్ బ్యారెల్ రాంచీ, అరుబ్రే రాంచీ ప్రాంతాల్లో నిర్వహించారు. డాల్లస్‌లోని తెలుగువారు తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులను ధరించి ఎంతో ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ సంస్కృతి కనులకు కన్పించేలా భారీ సెట్టింగ్‌లతో ఫార్మ్ హౌజ్ ప్రాంతాలను అందంగా ముస్తాబు చేశారు. టెక్సాస్‌లో కోవిడ్-19 నిబంధనలను కాస్త సడలించడంతో తెలుగువారు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం మొదట గణపతి పూజతో మొదలై.. నోరురించే తెలంగాణ పిండి వంటకాలను తయారుచేసి అరగించారు. అంతేకాకుంగా కార్యక్రమంలో నృత్య ప్రదర్శన, మ్యూజిక్, క్రికెట్, ఇతర కార్యక్రమాలను నిర్వహించారు. రావు కాల్వల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన టీపీఏడీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీఏడీ అధ్యక్షుడు రవికాంత్ మామిడి, ఉపాధ్యక్షులు రూప కన్నయ్యగారి, శ్రీధర్ వేముల, మాధవి సుంకి రెడ్డి, ఇంద్రాణి పంచెరుపుల, మంజుల తోడుపునూరి, లక్ష్మి పోరెడ్డి, అనురాధ మేకల, ఫణీవీర్ కోటి, సీనియర్ టీపీఎడీ టీం మెంబర్ రఘువీర్ బండారు, కో ఆర్డినేటర్ గోలి బుచ్చిరెడ్డి తదితర తెలుగు వారు పాల్గొన్నారు. చదవండి: ఘనంగా 4వ అన్నమయ్య శతగళార్చన -
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో కోవిడ్-19పై ప్రత్యేక కార్యక్రమం
లండన్: తెలుగు వారి కోసం కోవిడ్-19 దృష్ట్యా కన్సల్టేషన్, ప్రశ్నోత్తరాల వర్చ్యుయల్ కార్యక్రమాన్ని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(తాల్) నిర్వహించారు. ఈ కార్యక్రమంతో కోవిడ్-19పై అవగాహనను కల్పిస్తూనే, ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ల బృందం సమాధానాలను నివృత్తి చేసింది. తాల్ ఇప్పటివరకు కోవిడ్-19 పై (మే 9, మే 16)న రెండు ఆన్లైన్ సెషన్లను నిర్వహించింది. జూమ్‌లో జరిగిన ఈ వర్చువల్ సెషన్లో సుమారు 300కు పైగా ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. డాక్టర్ ప్యానెల్ ప్రొఫెసర్ వేణు కవర్తపు (ఆర్థో, కింగ్స్ కాలేజ్, లండన్) నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ మూర్తి బుద్ధవరపు (కన్సల్టెంట్ ఇంటెన్సివిస్ట్, యూనివర్శిటీ హాస్పిటల్ కోవెంట్రీ & వార్విక్షైర్), డాక్టర్ సురేష్ గాంధీ గురిజాలా (యూనివర్శిటీ హాస్పిటల్ కోవెంట్రీ & వార్విక్షైర్), డాక్టర్ వెంకట్ గోంగురా (ఆర్థో, ఖమ్మం, ఇండియా), డాక్టర్ విజయ్ పాపినేని (కన్సల్టెంట్ రేడియాలజిస్ట్, మాయో క్లినిక్స్, అబీ ధాబీ, యుఎఇ) , డాక్టర్ శ్రీలక్ష్మి ఉప్పలపతి (కన్సల్టెంట్ ఇంటెన్సివ్ కేర్, నాగార్జున హాస్పిటల్స్, విజయవాడ, ఇండియా) పాల్గొన్నారు. వీరితో పాటుగా ఫార్మసిస్టులు , ఇతర డాక్టర్లు పాల్గొన్నారు. తాల్ చైర్పర్సన్ భారతి కందుకూరి మాట్లాడుతూ.. భారత్‌లో నెలకొన్న కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా తాల్ తరపునుంచి సహయం చేయడానికి ఎప్పుడు ముందుటామని పేర్కొన్నారు. అంతేకాకుండా కోవిడ్-19పై అవగాహనను కల్పించడానికి మరిన్ని సెషన్లను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తాల్ అడ్వజర్లు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ బాలాజీ కల్లూర్ , కిషోర్ కస్తూరి, నవీన్ గడమ్సేతి , అశోక్ మడిశెట్టి ఎంతగానోకృషి చేశారు. -
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ అధ్వర్యంలో ఉగాది వేడుకలు
లండన్: ప్లవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ అధ్వర్యంలో ఆన్లైన్లో ఈ నెల 18 న “ఉగాది సంబరాలు 2021” వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంతేకాకుండా అసోసియేషన్ 19 వ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నారు. కాగా లాక్డౌన్ కారణంగా ఈసారి కూడా వేడుకలను ఆన్లైన్లో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రముఖ రాజకీయ నేత, నటుడు డాక్టర్ బాబు మోహన్ హాజరయ్యారు. స్కాట్లాండ్, యూకేలోని తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా తన రాజకీయ అనుభవాలు, సినీ ప్రస్థానం గురించి తెలుగు ప్రజలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ పర్రి మాట్లాడుతూ.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ తరపున ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా మదర్స్‌డే సందర్భంగా మహిళలను ఉద్ధేశించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. అంతేకాకుండా భారత్ నుంచి యూకే, స్కాట్లాండ్కు ఇంటర్నేషనల్ స్టడీస్ కోసం వస్తోన్న విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నామనీ ప్రకటించారు. ఉగాదిపర్వదినం సందర్భంగా అందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని తెలుపుతూ అందరికీ శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శివ చింపిరి, చైర్మన్ మైధిలి కెంబూరి, సాంస్కృతిక కార్యదర్శి నిరంజన్, విజయ్‌కుమార్, మాధవి లత, ఉదయ్‌కుమార్ తదితరలు హజరయ్యారు. చదవండి: సింగపూర్‌లో వైభవంగా సంగీత రాఘవధాన కార్యక్రమం.. -
ఫిన్లాండ్ తెలుగు అసోషియేషన్ ఉగాది పండగ శుభాకాంక్షలు
హెల్సింకి: ఫిన్లాండ్ దేశంలో ‘ఫిన్లాండ్ తెలుగు అసోషియేషన్’ రెండు తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల అభివృద్దికి ఎంతో కృషి చేస్తోంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు తెలుగు పండగలను నిర్వహిస్తోంది. తెలుగు పండగల గొప్పదనాన్ని నేటి తరాలకు తెలియజేస్తోంది. ఫిన్లాండ్ దేశంలో సుమారు వెయ్యికి పైగా తెలుగు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. ఈ ఏడాది రఘునాథ్ పర్లపల్లి ఫిన్లాండ్ తెలుగు అసోషియేషన్(ఎఫ్ఐటీఏ)కి నూతన అధ్యక్షుడిగా నియమించడ్డారు. ఆయన ఈ పదవిలో మర్చి 2023 వరకు కొనసాగుతారు. ఉగాది పండగ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిన్లాండ్లో నివసించే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ‘శ్రీ ప్లవ నామ తెలుగు నూతన సంవత్సరం( ఉగాది) పండగ’ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేసే ఓ ప్రత్యేక వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. ఈ వీడియోలో చిన్నారులు శ్రీ ప్లవ నామ సంవత్సర(ఉగాది) శుభాకాంక్షలు తెలియజేశారు. ఎఫ్ఐటీఏ నిర్వహించిన పలు కార్యక్రమాలకు సహకారం అందించిన న్యూస్‌పేపర్లు, టీవీ చానళ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎప్ఐటీఏ తరపున తెలుగు ప్రజలందరికీ ఈ ఉగాది పండగ నుంచి శుభం జరగాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు. చదవండి: ఉగాదిరోజున సింగపూర్‌లో ఘనంగా శ్రీవారి కల్యాణం -
ఉగాదిరోజున సింగపూర్‌లో ఘనంగా శ్రీవారి కల్యాణం
సింగపూర్: లోక కల్యాణార్థం శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది రోజున (ఏప్రిల్ 13) సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సింగపూర్‌లోని సెరంగూన్ రోడ్డులో ఉన్న శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. శ్రీవారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకంతో పాటు మహా గణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి, ఆంజనేయస్వామి వార్లకు అభిషేకం మొదలగు విశేష పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం శ్రీవారి ఆస్ధానంలో బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం పఠించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హిందూ ఎండోమెంట్స్ బోర్డ్ నిర్దేశించిన మార్గదర్శకాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయానికి వచ్చే భక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించడం, భక్తుల వివరాల సేకరించడంతో పాటు భక్తులు భౌతిక దూరాన్ని పాటించేలా వివిధ ఏర్పాట్లు చేశారు. కలియుగ దైవం కృప అందరికీ కలగాలనే సత్సంకల్పంతో భక్తులు ఇంటి నుంచే శ్రీనివాస కల్యాణోత్సవం వీక్షించేలా ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ప్రత్యేక ప్యాకెట్లో సుమారు 2000 మందికి అందించారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి తెలుగువారందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాంగ పఠనం చేసిన నాగఫణి శర్మకు, బండారు దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ పోలిశెట్టి, కార్యదర్శి సత్యచిర్ల పాల్గొన్నారు. చదవండి: ఉగాది.. కాలగమన సౌధానికి తొలి వాకిలి -
నాటా వేడుకలకు సీఎంకు ఆహ్వానం
సాక్షి,అమరావతి: వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ వేడుకలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నాటా సభ్యులు ఆహ్వానించారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నాటా అధ్యక్షుడు డాక్టర్ రాఘవరెడ్డి, కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, కోశాధికారి జి.నారాయణరెడ్డి, పీఆర్వో డీవీ కోటిరెడ్డి సీఎంను కలసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. -
చికాగో తెలుగు సంఘాల సమర్పణలో ‘అర్ధనారీశ్వరం’
చికాగో : అమెరికా చికాగోలోని తెలుగు సంఘాలు సంయుక్తంగా సెప్టెంబర్ 7వ తేదీన నేపర్విల్లోని నార్త్ సెంట్రల్ కాలేజ్ ఫైఫర్ హాలులో సమర్పించిన కూచిపూడి సంగీత నృత్యరూపకం ‘అర్ధనారీశ్వరం’ తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది. పద్మభూషణ్ వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమికి చెందిన 21 మంది కళాకారులు ఈ నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. అనేక తెలుగు సంఘాలు సమైక్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సంఘాల్లో అమెరికన్ తెలుగు అసోషియేషన్, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా, ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్, చికాగో తెలుగు అసోషియేషన్, చికాగో ఆంధ్ర అసోషియేషన్ ఉన్నాయి. చికాగోలోని 8 డ్యాన్స్ స్కూళ్ల గురువులు కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు. సహకారం అందించిన వారిలో ఆనంద డ్యాన్స్ థియేటర్ గురువు జానకి ఆనందవల్లి నాయర్, ఆచార్య పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమి గురు ఆశా అడిగ ఆచార్య, ఆనంద డ్యాన్స్ గురువు సంగీత రంగాల, కూచిపూడి నాట్య విహార గురువు శోభ తమ్మన, నృత్య తరంగ డాన్స్ అకాడమి గురువు అపర్ణ ప్రశాంత్, ప్రేరణ అకాడమి ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ గురువు అరుణ చంద్ర, సంస్కృతీ ఫౌండేషన్ గురువు శోభ నటరాజన్, డా వినీల చక్కులపల్లి కాకర్లలు ఉన్నారు. కార్యక్రమం ప్రారంభ సమయంలో ‘అర్ధనారీశ్వరం’ ప్రదర్శన దృశ్యాలను నిర్వహకులు ప్రేక్షకులకు వివరించారు. రెండు గంటల పాటు సాగిన ఈ సంగీత నృత్యరూపకంలో ఆరణ్యంలో గంగ కోసమై భగీరథుని తపస్సుతో ప్రారంభమై, బ్రహ్మాదిదేవతల ప్రవేశము, గంగ ప్రవేశము, కైలాసంలో ప్రమధగణాలతో శివుని తాండవం, పరమేశ్వరుడు భగీరథ ప్రార్థనను మన్నించడం, ఉత్తుంగ తరంగ గంగాప్రవాహినియైన గంగావతరణం, గౌరి అసూయ శివుని అనునయం, గౌరి కైలాసం నుంచి నిష్ర్కమించడం, గౌతమమహర్షి ఆదేశంతో గౌరి కేదారేశ్వర పూజ చేయడం, శివుడు ప్రత్యక్షంగా గౌరీశంకరులు ఏకమవ్వడం, అర్ధనారీశ్వరుని లాస్య తాండవ నృత్యం, ప్రమధాది భక్త గణముల నృత్యముతో రసవత్తరంగా కథ ముగుస్తుంది. నృత్య ప్రదర్శనలోని సన్నివేశాలను ప్రతిబింబించేలా స్టేజీ అలంకరణ ప్రేక్షకులను కట్టిపడేసింది. కూచిపూడి నాట్యకళాకారుల, గాయనీగాయకుల, వాద్యబృందం అద్భుత ప్రదర్శన ప్రేక్షకులను అకట్టుకుంది. 19 ఏళ్ల తర్వాత చికాగో విచ్చేసిన వెంపటి బృందం వారి నృత్య ప్రదర్శనను ఘనంగా ఏర్పాటు చేయడంలో కార్యనిర్వహక ముఖ్య సభ్యులు రామరాజ బి యలవర్తి, జగదీశ్ కానూరి, సుజాత అప్పలనేని, పద్మారావు అప్పలనేని విశేష కృషి చేశారు. -
టాస్క్ ఆధ్వర్యంలో ఆటలపోటీలు
కాలిఫోర్నియా : దక్షిణ కాలిఫోర్నియా తెలుగు అసోసియేషన్ (TASC) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటలపోటీలు, వంటల పోటీలు విజయవంతమయ్యాయని టాస్క్ ప్రెసిడెంట్ బుచ్చి రెడ్డి తెలిపారు. మహిళల త్రోబాల్ క్రీడలో దాదాపు 150మంది పాల్గొన్నారు. మొత్తంగా 12టీమ్‌లు పోటీపడిన ఈ ఆటలో ఇర్విన్ ట్రయల్‌బ్లేజర్స్ టీమ్ మొదటి స్థానంలో నిలిచింది. దాదాపు వంద మంది మహిళలు వంటల పోటీల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ పోటీల్లో గెలిచిన వారందరికీ ఏప్రిల్ 20న నిర్వహించే ఉగాది వేడుకల్లో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు టాస్క్ ప్రెసిడెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. -
30 మంది తెలుగు విద్యార్థులకు విముక్తి
సాక్షి, హైదరాబాద్: ఫర్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో అరెస్టయిన తెలుగురాష్ట్రాల విద్యార్థులలో 30 మందికి విడుదల లభించింది. ఆదివారం ఆ విద్యార్ధులు అమెరికానుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని అమెరికా తెలుగు సంఘాల నాయకుడు నవీన్ జలగం మీడియాకు తెలిపారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ.. నకిలీ వీసాల కేసులో అమాయక విద్యార్ధులు ఇరుక్కుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా జైళ్లనుంచి విద్యార్ధులను విడుదల చేయించేందుకు అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు న్యాయ సహాయం చేస్తున్నాయని తెలిపారు. తన ఫేస్ బుక్ ఐడీకి స్టూడెంట్స్ వివరాలు పంపమని సాక్షితో ఆయన కోరారు. విద్యార్ధుల తల్లిదండ్రులు కంగారుపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే మిగిలిన విద్యార్ధులు ఇండియాకు చేరకుంటారని చెప్పారు. ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. కాగా ఈ కేసులో మొత్తం 130మంది విద్యార్ధులు అరెస్టవ్వగా వారిలో అధికులు భారతీయులు కావటం గమనార్హం. -
న్యూజెర్సీలో కనుల పండువగా బతుకమ్మ వేడుక
న్యూజెర్సీ: తెలంగాణలో విశేష ప్రజాదరణ పొందిన పూలపండుగ బతుకమ్మ సంబరాలను విదేశాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు సంస్కృతి ఉట్టి పడేలా న్యూజెర్సీలో తెలుగు అసోషియేషన్ ఆఫ్ న్యూజెర్సీ ఆధ్వర్యంలో ఏఐసీసీతో కలిసి బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెర్సిపానీకి చెందిన పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల్లో ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. రావణ సంహారం అనంతరం ఉత్సవాలను ప్రారంభించారు. ఆటపాటలతో ఆద్యంతం కనులపండువగా బతుకమ్మ పండుగ జరిగిందని నిర్వాహకులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీదత్తారెడ్డి, అరుణ్, భానోజీరెడ్డి తెలిపారు. స్థానికంగా దొరికే వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయబద్దంగా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మహిళలు బతుకమ్మ పాటలు పాడారు. కార్యక్రమంలో 600 మంది పాల్గొన్నారని నిర్వాహకులు వెల్లడించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ముందుతరాలవారికి అందించేందుకు పండుగలు తోడ్పతాయని అన్నారు. ఈ వేడుకలు మరచిపోలేని అనుభూతిచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పిల్లలకు పండుగలు మన సంస్కృతిని తెలియజెప్పుతాయిని పేర్కొన్నారు. -
దక్షిణ కొరియాలో ఉగాది, శ్రీరామ నవమి సంబరాలు
సియోల్ : దక్షిణ కొరియాలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు ఆదివారం ఉగాది, శ్రీరామ నవమి పండగలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. దేశ రాజధాని సియోల్ సమీపంలోని సువన్ నగరంలో గల సంగుక్వాన్ (ఎస్‌కేకేయూ) విశ్వవిద్యాలయంలో ఈ వేడుకలు జరిగాయి. దక్షిణ కొరియా తెలుగు సంఘం(టీఏఎస్కే) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక తెలుగు విద్యార్థులు, పలు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ఉగాది పచ్చడి రుచి చూసి, పంచాగ శ్రవణం చేశారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా పానకం పంచారు. ఆటపాటలతో అలరించారు. టాస్క్ కోర్ కమిటీ సభ్యలు డాక్టర్ సుశ్రుత కొప్పుల, డా. వేణు నూలు, అనిల్ కావల, డా. కొప్పాలి స్పందన రాజేంద్ర, అంకంరెడ్డి హరినారాయణ, సంపత్ కుమార్, సాయి కృష్ణ చిగురుపాటి నేతృత్వం వహించారు. అనంతరం మహిళలు కోలాటంతోను, చిన్నారులు ఫ్యాషన్ షోతోను అలరించారు. -
ఎన్ఆర్ఐల ఆధ్వర్యంలో 5కే రన్..
-
ఎన్నారైల ఆధ్వర్యంలో 5కే రన్..
సాక్షి, హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్లు సంయుక్తంగా శనివారం ఉదయం హైదరాబాద్‌లో 5కే రన్ నిర్వహించాయి. మహిళా సాధికారత, ఒత్తిడిని అధిగమించే అంశాలపై ప్రచారం చేస్తూ అమెరికా తెలుగు సంఘం, తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ 5కే పరుగును మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ రన్లో ఎన్ఆర్ఐల పాటు పెద్దసంఖ్యలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లిబర్టీ నుంచి నెక్లెస్ రోడ్డు మీదుగా జలవిహార్ వరకూ ఈ 5 కే రన్ జరిగింది. యూఎస్ఏ, ఇతర ప్రాంతాలలో ఎన్ఆర్ఐ తెలుగు అసోసియేషన్లు అన్ని ఒకే లక్ష్యంతో కలిసి పనిచేయడం లేదనే అపోహ ఉందని, అయితే ఈ కార్యక్రమం ద్వారా అది వాస్తవం కాదని నిరూపితమైందని ఎన్ఆర్ఐ ప్రతినిధులు అన్నారు. ఎన్ఆర్ఐ తెలుగు అసోసియేషన్లు అన్ని కలిసి 2018 డల్లాస్‌లో ఒక ఉమ్మడి సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
'తెలుగు భాష విశ్వవ్యాప్తం కావాలి'
- తెలుగు భాషాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పల్లె రఘునాథ్‌రెడ్డి విజయవాడ : తెలుగు భాష విశ్వవ్యాప్తం కావాలని భాషా సాంస్కృతిక శాఖ మంత్రి, తెలుగు భాషాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు భాషాభిమానులను ఉద్దేశించి మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రాధికార కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. తెలుగు భాష సంస్కృతి, సంప్రదాయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష అమలు, కళలు, గ్రామీణ క్రీడల అభివృద్ధి కోసం మేధావుల ఆలోచనలు, సూచనలకు కమిటీ తీసుకొని నివేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుందని వివరించారు. తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తెలుగు సంస్కృతి వికాసం, కళా ప్రదర్శనలకు అమరావతి కేంద్రంగా కళాకేంద్రం నిర్మిస్తామని వెల్లడించారు. తెలుగు నేల మీద భాషా సాహిత్య వికాసానికి కృషి చేసిన గొప్పవారి జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తున్నామని వివరించారు. అకాడమీలను పునరుద్ధరిస్తామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన భాషగా తెలుగు అమలుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రేతర ప్రాంతాల్లోని తెలుగువారు తమ మూలాలను మర్చిపోలేదని, వారికోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తయారు చేసిందని చెప్పారు. ప్రపంచంలోని తెలుగువారందరూ గర్వపడేలా కమిటీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రాచీన హోదా ద్వారా వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ డి.విజయభాస్కర్, పురావస్తు శాఖ డెరైక్టర్ రామకృష్ణ తదితరులు తెలుగు భాషా వికాసంపై ప్రసంగించారు. 300 మందికిపైగా భాషాభిమానులు చేసిన సూచనలను స్వీకరిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని వివరించారు. -
వైభవంగా తెలుగువారి గణతంత్ర వేడుకలు
సాక్షి, ముంబై : నగరంలోని పలు తెలుగు సంఘాలు 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలు సంఘాలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాయి. ది బొంబాయి ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో... దాదర్‌లోని ఆంధ్రమహాసభ ఆవరణలో ఉదయం సంపూర్ణానందగిరి స్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, అనుమల్ల రమేష్, గట్టు నర్సయ్య, నడిమెట్ల యెల్లప్ప, యెలిగేటి రాజ్‌కుమార్, రేపల్లి పరమేశ్వర్, మహిళా శాఖ అధ్యక్షురాలు తురగా జయ శ్యామల, ప్రధాన కార్యదర్శి యత్తం లత తదితరులు పాల్గొన్నారు. తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో... వాషిలోని తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో సమితి ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.టి.వి.రెడ్డి, కమిటీ సభ్యుడు భాస్కర్ రెడ్డి, కే.ఎస్.మూర్తి, మహిళా శాఖ ఉపాధ్యక్షులు వరలక్ష్మి, వహీద, గంటి లలిత, తిరుపతి రెడ్డి, జిండే తదితరులు పాల్గొన్నారు. మున్నూరు కాపు సేవా సంఘం... వర్లీలోని తెలుగు మున్నూరు కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు శెకెల్లి రాములు పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి సంగెవేని రవీంద్ర, ఉపాధ్యక్షులు బండారు రాజేశం, సిరినేని సత్తయ్య, తమ్మల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సమాజ సుధారక మండలి... వర్లీలోని పద్మశాలి సమాజ సుధారక మండలిలో అధ్యక్షులు వాసాల శ్రీహరి జెండావిష్కరణ చేశారు. తర్వాత దేశ భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రదాస్, ట్రస్ట్ చెర్మైన్ రమేష్ మంతెన, డాక్టర్ వీరబత్తిని చంద్ర శేఖర్, సహదేవ్ భోగ, గాజెంగి రమేష్, ఉపాధ్యక్షులు వేముల మనోహర్, తదితరుల పాల్గొన్నారు. వివేక గ్రంథాలయంలో.. ఖేడ్‌గల్లీలోని వివేక గ్రంథాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సామాజిక కార్యకర్త బాలచంద్ర ఇందాల్కర్ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తలకొక్కుల గంగాధర్‌తోపాటు ఉపాధ్యక్షులు ద్యావరిశెట్టి గంగాధర్, సిరిపురం రాజేశం, యెలిగేటి నరహరి తదితరులు పాల్గొన్నారు. పటేల్ మెన్షన్ చాల్ కమిటీ... ఖేడ్‌గల్లీలోని పటేల్ మెన్షన్ చాల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సత్యనారాయణ స్వామి మహాపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహిళలకు పసుపు-కుంకుమ అందచేశారు. ఈ వేడుకల్లో శివసేనా ఎమ్మెల్యే సదా సావర్కర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే నితిన్ సర్దేశాయ్ పాల్గొన్నారు. అధ్యక్షుడు సురేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు రాణాసింగ్, ప్రధాన కార్యదర్శి నాగభూషణ్, కోశాధికారి రజిని కాంత్ తదితరులు హాజరయ్యారు. ఆంధ్ర ప్రజా సంఘం ఆధ్వర్యంలో... గోరేగావ్‌లోని హనుమాన్ నగర్, ఆంధ్ర ప్రజా సంఘం ఆవరణలో సీనియర్ సభ్యుడు ఉండ్రు నరసింహారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి వి.జె.రావు, ఎం.నారధ, డి.వెంకటేశ్వరరావు, జే.ఎస్.మూర్తి, విష్ణు సాయిబాబా, వి.రామారావు తదితరులు ప్రసంగించారు. తెలంగాణ ప్రజా సంఘం... పశ్చిమ గోరేగావ్‌లోని తెలంగాణ ప్రజాసంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యక్షుడు శేఖర్ వంటపాక జెండావిష్కరణ చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గాదె మల్లేషం, కొండ బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. వడాలా తెలుగు సంఘం మహిళా మండలి... వడాలా తెలుగు సంఘం మహిళా మండలి ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రగిరి రామ చెంద్రయ్య, కల్కూరి మాధయ్య, గంగుల రామయ్య, కల్కూరి రాములు తదితరులు పాల్గొన్నారు. ఓం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో... ఖరాస్ బిల్డింగ్‌లోని ఓం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సంఘ అధ్యక్షుడు పోతు రాజారాం మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అంబల్ల గోవర్దన్, ప్రధాన కార్యదర్శి వేముల శివాజి, చౌటి నారాయణ, చాట్ల శ్రీనివాస్, యెల్ది సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఓం పద్మశాలి విజయ సంఘం... ఖరాస్ బిల్డింగ్‌లోని ‘ఓం పద్మశాలి విజయ సంఘం- కమ్మర్పల్లి’ ఆధ్వర్యంలో రోజంతా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ముందుగా ఉదయం సంఘం అధ్యక్షుడు గుడ్ల నడ్పి లింబాద్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయంత్రం శ్రీసత్యానారాయణ వ్రతం, రాత్రి జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమంలో మహిళలకు కానుకలు అందజేశారు. అనంతరం 250 మందికిపైగా అన్నదానం చేసినట్లు లింబాద్రి చెప్పారు. మోర్తాడ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో... ఎన్.ఎం.జోషి మార్గ్‌లోని మోర్తాడ్ పద్మశాలి సంఘంలో అధ్యక్షులు కామని హన్మాండ్లు పతాకావిష్కరణ చేశారు. తర్వాత నిర్వహించిన పసుపు-కుంకుమ కార్యక్రమంలో దాదాపు 150 మంది మహిళలు పాల్గొన్నారు. తెలుగు మాల సేవా సంఘం ఆధ్వర్యంలో... కింగ్సర్కిల్లో తెలుగు మాల సేవా సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు కోమర సాయన్న జెండావిష్కరణ చేశారు. దాస్, కైలాస్, వెలుగు గంగాధర్, మేకల శశింకరిత, డాక్టర్ రాము, మాదరి కుపల్, ఈరిగల సాయన్న, సూలం బాబురావు తదితరులు పాల్గొన్నారు. రజక ఫౌండేషన్... బోరివలి న్యూస్‌లైన్: బోరివలి పశ్చిమంలోని నూతన్నగర్లో రజక ఫౌండేషన్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ జరిగింది. విద్యార్థులకు జి. నర్సయ్య నోటు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఎలిజాల శ్రీనివాస్, మల్లేష్ చిల్కరాజు, సురేష్ కల్లూరి, మామిడాల భూపతి, చింతల తాడెపు మహేంద్ర, రాజు ఒడియానం తదితరులు పాల్గొన్నారు. తెలుగు చైతన్య పాఠశాలలో.. బోరివలిలోని తెలుగు చైతన్య పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ చాట్ల గంగాధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. షోలాపూర్‌లో... షోలాపూర్, న్యూస్‌లైన్: జిల్లా ఇన్చార్జి మంత్రి విజయ్ దేశ్‌ముఖ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి హోంగార్డ్స్, పోలీసులు, ఎస్.ఆర్.పి జవాన్ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో ప్రావీణ్యత సాధించిన వారిని సన్మానించారు. భివండీలో.... భివండీ, న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భివండీ నిజాంపూర్ షహర్ మహానగర్ పాలిక ముఖ్య కార్యాలయంలో మేయర్ తుషార్ చౌదరి త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలోని ఐదు ప్రభాగ్ సమితులకు క్రిమికీటకాలను సంహరించే పిచికారీలు బిగించిన మిరీ ట్రాక్టర్లను మేయర్ తుషార్ చౌదరి, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ లాడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో కమిషనర్ జీవన్ సోనావునే, నగర్ సేవకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తెలుగు సమాజ్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలోని వివిధ పాఠశాలలు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాయి. పద్మశాలి తెలుగు హైస్కూల్లో కన్నేరీ సంస్థ ట్రస్టీ దాసి అంబాదాస్, పద్మశాలి ఇంగ్లిష్ మీడియం స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో సంస్థ చైర్మన్ డాక్టర్ పాము మనోహర్, మార్కండేయ ప్రైమరీ స్కూల్ గాయిత్రినగర్‌లో నగర్సేవిక పూనం పాటిల్, వికాస్ ప్రైమరీ స్కూల్ పద్మనగర్‌లో కార్పొరేటర్ సంతోష్ ఎం. శెట్టి, పద్మశాలి ప్రైమరీ స్కూల్ పేనాగావ్లో సంస్థ ఉపాధ్యక్షుడు కుందెన్ పురుషోత్తం జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. శారద ఎడ్యుకేషన్ సొసైటికి చెందిన వివేకానంద ఇంగ్లిష్ మీడియం స్కూల్లో కాందేశ్ సేవా ప్రముఖ్ సుహాస్ బోందే, పద్మశాలి సమాజ్ యువక్ మండలి కార్యాలయంలో అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షుడు కముటం శంకర్, బాలాజీ సేవా సొసైటీ కార్యాలయంలో కార్పొరేటర్ సంతోష్ ఎం. శెట్టి త్రివర్ణ జెండాను ఎగురవేశారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు భివండీ, న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. తెలుగు ప్రజలు స్థిరపడ్డ పద్మనగర్ పరిధిలోని గల బాలాజీ జోపడ్‌పట్టి ప్రాంతంలో బాలాజీ మిత్ర మండల్ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాని శిబిరం నిర్వహించారు. భివండీ బ్లడ్‌బ్యాంక్ వారు దాతలు ఇచ్చిన 142 మంది నుంచి రక్తం సేకరించారు. మండలి తరపున దాతలకు మొక్కలను, గుర్తింపు కార్డులను అందజేశారు. రక్తం కావలసిన రోగులు మండలిని సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. రామ మందిరం ప్రాంగణంలో యువ గిటార్ గైస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్త దానం చేసిన ధాతలకు తులసి మొక్కలను అందచేశారు. ఈ శిబిరంలో 184 రక్తపు బాటిళ్లను సేకరించారని మండలి అధ్యక్షుడు కారంపురి వినోద్ తెలిపారు. పదవ తరగతి 2009-10 బ్యాచ్ తెలుగు విద్యార్థులు పద్మనగర్ ప్రాంతంలో దుకాణాల యజమానులకు మొక్కలను పంపిణీచేసి వాటిని సంరక్షించాలని కోరారు. సంఖ్య మరచిపోయిన అధికారులపై చర్యకు డిమాండ్ సాక్షి, ముంబై: గణతంత్ర దినోత్సవ వేడుకల సంఖ్యను తప్పుగా రాసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సోమవారం 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కాని ముంబైలోని శివాజీపార్క్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో అక్కడ పూలతో అలంకరించిన బ్యానర్‌పై 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అని పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్ష నాయకులు గణతంత్ర దినోత్సవ వేడుకల సంఖ్య మర్చిపోవడం దురదృష్టకరమని, ప్రభుత్వానికి ఆ మాత్రం కూడా తెలియదా అంటూ విమర్శలు సంధించారు. నిలదీశారు. మరో విశేషమేమిటంటే గవర్నర్ విద్యాసాగర్‌రావు కూడా తన ప్రసంగంలో 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అని ఉచ్ఛరించారు. కాగా బ్యానర్‌పై సంఖ్యను తప్పుగా రాసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మాణిక్‌రావ్ డిమాండ్ చేశారు. -
అమెరికాలో వేళ్లూనుకున్న తెలుగు సంఘాలు
‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అని రాయప్రోలు ఏనాడో చెప్పారు. విదేశాలలో, ముఖ్యంగా అమెరికాలో ఉన్న మన తెలుగువారందరూ అదే పని చేస్తున్నారు. అందుకు నిదర్శనమే అమెరికాలో వేళ్లూనుకొని అక్కడున్న మన వాళ్లకి తెలుగు భాషలోని తియ్యందనాన్ని పంచుతున్న తెలుగు సంఘాలు! జాతీయ సంఘాలైన తానా, ఆటా, నాట్స్, నాటా, సిలికానాంధ్రలతోపాటు అక్కడ ఇంచుమించు ప్రతి రాష్ట్రంలోనూ, తెలుగు వారున్న ప్రతి ప్రాంతంలోనూ ఒక్కో సంఘం ఉంది. వాటిలో అల్బనీ తెలుగు అసోసియేషన్, మెట్రో అట్లాంటా తెలుగు అసోసియేషన్ (తామా), గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్, ఆస్టిన్ తెలుగు సంఘం, బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), బ్లూమింగ్టన్ తెలుగు సంఘం, మిన్నెసొటా తెలుగు అసోసియేషన్, మెంఫిస్ తెలుగు సమితి, తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం, ఒక్లహోమా తెలుగు సంఘం, పిట్స్బర్గ్ తెలుగు అసోసియేషన్, ఫ్లోరిడా తెలుగు సంఘం, ట్రాయ్ తెలుగు అసోసియేషన్, వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్... ఒకటా రెండా... 59 తెలుగు సంఘాలనూ అకారాది క్రమంలో మన ముందుంచడమేగాక, వాటి అధ్యక్ష కార్యదర్శుల వివరాలు, అమెరికాలో తెలుగు భాషావ్యాప్తికి ఆయా సంఘాలు చేస్తున్న సేవలనూ చక్కగా గుదిగుచ్చారు పాత్రికేయులు చెన్నూరి వెంకట సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్‌లోని కళాకారులను అమెరికాలోని తెలుగు వారికి పరిచయం చేయడంలో ఆయన సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. - డి.వి.ఆర్. అమెరికాలో తెలుగు సంఘాలు రచన: చెన్నూరి వెంకట సుబ్బారావు పేజీలు: 300+; వెల: రూ. 400 ప్రచురణ: సుప్ర పబ్లికేషన్స్, ప్లాట్ నెం. 8, జానకిరామమ్, మోతినగర్, హైదరాబాద్- 500 018; ఫోన్: 9849599625 కొత్త పుస్తకాలు 1.పొనుక (పరిశోధక వ్యాసాలు) రచన: డా. టి.శ్రీరంగస్వామి పేజీలు: 120; వెల: 100 2.సంపత్కుమార సాహిత్య దర్శనం సంపాదకుడు: డా.టి.శ్రీరంగస్వామి పేజీలు: 102; వెల: 100 ప్రతులకు: శ్రీలేఖ సాహితి, 14-5/2, ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా, శ్రీలేఖ కాలనీ, హసన్‌పర్తి, వరంగల్-506371; ఫోన్: 0870-2564722 పూదోట(ఆధునిక పద్ధతుల్లో పూలసాగు) రచన: ప్రొ. రావి చంద్రశేఖర్, డా.పి.ప్రశాంత్, షహనాజ్ పేజీలు: 60; వెల: 100 ప్రతులకు: రైతునేస్తం మాసపత్రిక, 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్-4. ఫోన్: 040-23395979 1.సోషలిజమే ఎందుకు మూలం: ఇస్త్వాన్ మెస్జారస్ తెలుగు: సత్యరంజన్ కె. పేజీలు: 88; వెల: 40 2.నాణాలు చెప్పిన కథ మూలం: గె.అ.ఫ్యోదొరవ్, దవీదొవ్ తెలుగు: డా.నిడమర్తి మల్లికార్జునరావు పేజీలు: 128; వెల: 50 3. అంతు చిక్కని నీరు మూలం: ఐ.వి.పెత్య్రానొవ్ తెలుగు: డా.నిడమర్తి మల్లికార్జునరావు పేజీలు: 96; వెల: 40 4.సాపేక్షం... ఒక అద్భుత భావన మూలం: ఎల్.లాండౌ, వై.రూమెర్ పేజీలు: 72; వెల: 30 ప్రతులకు:ప్రజాశక్తి బుక్‌హౌస్, ఎమ్హెచ్ భవన్, ప్లాట్ నం.21/1, అజామాబాద్, ఆర్టిసి కళ్యాణమండపం దగ్గర, హైదరాబాద్-20. ఫోన్: 27660013 ముఖచిత్రాలు (కవిత్వం) రచన: షేక్ బషీరున్నీసా బేగం పేజీలు: 112; వెల: 100 ప్రతులకు: కవయిత్రి, 5-66-81, ఫస్ట్ లేన్, కోబాల్ట్పేట్, గుంటూరు-2. ఫోన్: 9985193970 -
గవర్నర్‌తో తెలుగు సంఘాల భేటీ
పుణే సిటీ, న్యూస్‌లైన్: గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు మొదటిసారిగా ఆదివారం పుణేకు విచ్చేసిన సందర్భంగా పుణేలోని పలు తెలుగు సంఘాలు గవర్నర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు, శాలువతో సత్కరిం చాయి. పుణేలోని రాజ్ భవన్లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను తెలుగు సంఘాల నాయకులు కలిశారు. ఆంధ్రా సంఘం సభ్యులు, ఘోర్పడి బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు గవర్నర్‌ను సత్కరిం చారు. అదేవిధంగా స్థానికంగా తెలుగు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యల విషయమై గవర్నర్‌తో విన్నవించారు. నగరంలో తెలుగు పాఠశాలను ఏర్పాటు చేయాలనీ, కమ్యూనిటీ హాలుకు ప్రభుత్వం స్థలం కేటాయించేలా చూడాలని కోరారు. ఆంధ్రా సంఘం నిర్వహించే వజ్రోత్సవాలు, సప్తగిరి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాలుపంచుకోవాలని విన్నవించుకున్నారు. ఇందుకు గవర్నర్ కూడా సానుకూలంగా స్పందిం చారు. అదేవిధంగా మోదీ తలపెట్టిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమంలో నగర తెలుగు ప్రజలు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. -
వడివేలును బెదిరిస్తే తీవ్ర పరిణామాలు : సీమాన్
చెన్నై: ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలును బెదిరిస్తే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సినీ దర్శకుడు, నామ్ తమిళర్ నేత సీమాన్ హెచ్చరించారు. హాస్యనటుడు వడివేలు తాజా చిత్రం తెనాలిరామన్లో హీరోగా నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో వడివేలు శ్రీకష్ణదేవరాయలుగా, తెనాలి రామకృష్ణగా ద్విపాత్రాభినయం చేశారు. శ్రీకష్ణదేవరాయల పాత్రను కించపరిచేలా చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ తమిళనాడులోని పలు తెలుగు సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నేతృత్వంలో పలువురు తెలుగు సంఘాల నేతలు ఇప్పటికే ఈ విషయాన్ని సెన్సార్ బోర్డు అధికారి, రాష్ట్ర గవర్నర్ దష్టికి తీసుకెళ్లారు. నటుడు వడివేలు ఇంటిని చుట్టుముట్టి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలుగు సంఘాల చర్యలను ఖండిస్తూ నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వడివేలు నటించిన తెనాలి రామన్ చిత్రంలో శ్రీకష్ణదేవరాయలను కించపరిచే విధంగా చిత్రీకరించినట్లు కొన్ని సంఘాలు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. చిత్రం నుంచి ఆ సన్నివేశాలను తొలగించాలని బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. చిత్రం చూడకుండా శ్రీకష్ణదేవరాయల్ని కించపరిచే సన్నివేశాలున్నట్లు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. పూర్తి వివరాలు తెలియకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం భావ్యం కాదని పేర్కొన్నారు. శ్రీకష్ణదేవరాయల పాత్ర గురించి ఆవేదన చెందేవారి మనోభావాలను తాము అర్థం చేసుకుంటామని వెల్లడించారు. నిజంగానే శ్రీకష్ణదేవరాయల పాత్రను కించపరిచే విధంగా చిత్రీకరిస్తే ఈ వ్యవహారంపై పోరాడేవారికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. చిత్రంలో అసలు శ్రీకష్ణదేవరాయల పాత్రను తీసుకోలేదని చిత్ర నిర్మాతలు చెబుతున్నారని, దీన్ని పట్టించుకోకుండా వడివేలుపై దండెత్తడం ఒక కళాకారుడిని అవమానించడమేనని పేర్కొన్నారు. ఆంధ్రలోను, కర్ణాటకలోను తమిళులకు వ్యతిరేకంగా చిత్రించే చర్యలను అక్కడ జీవించే తమిళులు ఖండించగలుగుతున్నారా? అంటూ ప్రశ్నించారు. తమిళనాడుకు ఘనత చేకూర్చిన నటుడు వడివేలుకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవడం ఒక తమిళయన్గా తమ బాధ్యతని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో వడివేలుకు సహకరించేవారెవరూ లేరని, కొన్ని సంఘాలు బెదిరించే కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి వారందరూ తమిళ సముదాయం అంతా వడివేలు వెనుక ఉందనే విషయాన్ని గ్రహించాలన్నారు. వడివేలుపై బెదిరింపులకు దిగితే నామ్ తమిళర్ పార్టీ వారికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. -
ఠాణేలో ‘తెలుగు’ రైళ్లు ఆపండి సారూ..
సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే రైళ్లను ఠాణే రైల్వేస్టేషన్లో నిలపాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే అనేక తెలుగు సంఘాలు తమ వంతు యత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల మహారాష్ట్ర టైలర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో తెలుగు ప్రజల బృందం సెంట్రల్ రైల్వే ఆపరేషన్స్ చీఫ్ మెనేజర్‌తో భేటీ అయ్యింది. ఈ సందర్బంగా వీరు ముఖ్యంగా కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైలు (17221-17222)ను ఠాణే రైల్వేస్టేషన్లో నిలపాలని డిమాండ్ చేశారు. లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) - కాకినాడ పోర్ట్‌ల మధ్య నడిచే ఈ రైలుతోపాటు ఎల్టీటీ - విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్‌లకు ఠాణేలో హాల్ట్ లేదు. జిల్లా కేంద్రమైన ఠాణే చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు.అయితే ఇక్కడ రైళ్లు ఆగకపోవడంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్పందించి వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే రైళ్లు ముఖ్యంగా కాకినాడ, విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఠాణేలో నిలపాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు వినతి పత్రాన్ని సెంట్రల్ రైల్వే ఆపరేషన్స్ చీఫ్ మేనేజర్‌కు అందచేశారు. మానవహక్కుల సంఘం సభ్యుడు సురేష్ కుమార్‌తోపాటు మహారాష్ట్ర టైలర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు దాసర్ భాస్కర్‌రావు, ప్రధాన కార్యదర్శి కడలి రామలింగేశ్వర్రావు, గుత్తుల సాహెబ్రావు, శ్రీనివాస్, గోపాలకృష్ణ, డి.రమణ, బాలం సత్యనారాయణ తదితరులున్నారు. -
‘చెన్నైకు తెలుగుగంగను ఆపితే సహించం’
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ విభజనకు తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి పి.చిదంబరాన్ని కారణంగా చూపుతూ చెన్నైకి తెలుగుగంగ జలాలను నిలిపివేస్తే సహించేది లేదని తెలుగు సంఘాలు హెచ్చరించాయి. 7న చెన్నైకి తెలుగుగంగ కాలువలో నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటామని సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ శ్రీకాళహస్తిలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆస్కా అధ్యక్షుడు కె.సుబ్బారెడ్డి, తెలుగు సంఘాల అధ్యక్షులు డా. సీఎంకే రెడ్డి, కె.నరసారెడ్డి, టి.రామకృష్ణ, అనిల్‌కుమార్‌రెడ్డి, ఎంవీ నారాయణగుప్తా, రంగనాయకులు శుక్రవారమిక్కడ మీడియూతో మాట్లాడారు. తెలుగుగంగను అడ్డుకుంటే తెలుగువారికి, తమిళులకు మధ్య అగాధాన్ని సృష్టిస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. -
ఘనంగా జంద్యాలధారణ
సాక్షి, ముంబై: నగరం, శివారు ప్రాంతాల్లోని వివిధ తెలుగు సంఘాలలో మంగళవారం రక్షాబంధన్ జంద్యాలధారణ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. శ్రీ రామ బాలసంఘం ఆధ్వర్యంలో.. వర్లీ బీడీడీ చాల్ 106/45 సంఘం ఆధ్వర్యంలో జంద్యాల వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు ఇట్టె మురళి, ఉపాధ్యక్షులు తాటిపాముల గంగాధర్, ప్రధాన కార్యదర్శి సామల్ల శ్రీహరి, ఉపకార్యదర్శి అనుమల్ల శ్రీనివాస్, కోశాధికారి చింతకింది శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ పద్మశాలి తెలుగు సంఘం ఆధ్వర్యంలో.. గాయత్రిధారణ మహోత్సవ సందర్భంగా సైన్-కోలివాడలోని శ్రీ పద్మశాలి తెలుగు సంఘం నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా కుడిక్యాల్ బాలకిషన్, ఉపాధ్యక్షుడిగా దుస్స శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా జోరీగల సింద్రాంలు, సహాయ కార్యదర్శిగా చిలివేరి మహేంద్ర, కోశాధికారిగా పారెల్లి రాజ్మహేంద్ర, సహాయ కోశాధికారిగా కస్తూరి గణేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పద్మశాలి యువక సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీ అనుమల్ల సుభాష్, దోమల శంకర్ తదితరులు నూతన కార్యవర్గ సభ్యులను సత్కరించారు. భివండీలో ... భివండీ, న్యూస్‌లైన్: భివండీలో తెలుగు ప్రజలు జంద్యాల పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా అఖిల పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో సాయంత్రం వివిధ ప్రాంతాల్లో మార్కండేయ పల్లకి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనడంతో తెలుగుతనం ఉట్టిపడింది. రాత్రి వరకు సాగిన పల్లకి యాత్ర ఉత్సవాలు పండుగ శోభను తెచ్చాయి. స్థానిక పోలీసుశాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించింది. పద్మనగర్‌లో అఖిల పద్మశాలి సమాజ మంగళ కార్యాలయంలో సమాజ పెద్దలు జంద్యాల పండుగను ఘనంగా నిర్వహించారు. పద్మనగర్‌లోని నీలకంఠేశ్వర్ మందిరం నుంచి మగ్గం ద్వారా నూలు బట్ట నేస్తూ పల్లకి శోభాయాత్ర నిర్వహించారు. బాజీ మార్కెట్, కన్నేరి, కుంబార్‌వాడ, తీన్ బత్తి ప్రాంతాల మీదుగా కాసర్ అలీలోని మార్కండేయ మహాముని మందిరానికి చేరుకుంది. యాత్రకు కన్నేరిలో తెలుగు యువక్ మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. నేసిన వస్త్రాన్ని మార్కండేయుడికి సమర్పించిన తర్వాత దానిని వేలం వేశారు. ఈ ఏడాది కామత్‌ఘర్ చందన్భాగ్ ప్రాంతానికి చెందిన భివండీ తెలుగు సమాజ్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్ దాన్ని రూ.2.05 లక్షలకు పొందారు. సమాజం పెద్దలు దాసి అంబాదాస్, వేముల నర్సయ్య, పాశికంటి లచ్చయ్య, వంగ పురుషోత్తంలు రమేశ్‌కు వస్త్రాన్ని అందజేశారు. కాసర్ అలీలోని మార్కండేయ మందిరాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మశాలి సమాజ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు లక్ష్మణ్ గోస్కే ఇతర సభ్యులు సాయంత్రం మందిరం నుంచి పల్లకి యాత్ర నిర్వహించారు. కామత్‌ఘర్‌లో శ్రీ శివభక్త మార్కండేయ మందిరంలో ప్రతి యేడాది మాదిరిగానే సుప్రభాత, నిత్య పూజలు, ద్వజారోహణ, గాయత్రి మహా యజ్ఞం, అభిషేఖాలు, అర్చనలు, యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మగ్గం ద్వారా నూలు బట్టను నేస్తూ కామత్‌ఘర్ పుర:వీధుల మీదుగా ఊరేగింపు నిర్వహిం చారు. ఆ నూలు బట్టను స్వామి వారికి సమర్పిం చారు. అనంతరం దానిని వేలం వేయగా మంగళంపల్లి రవి రూ.11,100 లు చెల్లించి సొంతం చేసుకున్నారు. తడాలిలో...అఖిల పద్మశాలి సమాజ్ కామత్‌ఘర్ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ మందిరం నుంచి వేషధారణలతో భక్తులు ఊరేగింపును నిర్వహించారు. పాంజలాపూర్, కోంబడ్పాడ, సంగమ్ పాడా, పద్మశాలి యువక మండలి శాఖలు కూడా పల్లకి ఊరేగింపు నిర్వహించాయి. కార్పొరేటర్ మచ్చ మురళి కార్యాలయంలో మార్కండేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా వరాలదేవి రోడ్డులోని శ్రీ మార్కండేయ మహాముని వాచనాలయ సమితి ఆధ్వర్యంలో మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథులుగా కార్పొరేటర్లు సంతోష్ శెట్టి, శశిలత శెట్టి హాజరయ్యారు. సాయంత్రం పల్లకి యాత్ర నిర్వహించినట్లు సమితి అధ్యక్షుడు సిరిపురం తిరుపతి, కార్యదర్శి శంకర్ వడిగొప్పుల తెలిపారు. -
ఘనంగా జంద్యాలధారణ
సాక్షి, ముంబై: నగరం, శివారు ప్రాంతాల్లోని వివిధ తెలుగు సంఘాలలో మంగళవారం రక్షాబంధన్ జంద్యాలధారణ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. శ్రీ రామ బాలసంఘం ఆధ్వర్యంలో.. వర్లీ బీడీడీ చాల్ 106/45 సంఘం ఆధ్వర్యంలో జంద్యాల వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు ఇట్టె మురళి, ఉపాధ్యక్షులు తాటిపాముల గంగాధర్, ప్రధాన కార్యదర్శి సామల్ల శ్రీహరి, ఉపకార్యదర్శి అనుమల్ల శ్రీనివాస్, కోశాధికారి చింతకింది శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ పద్మశాలి తెలుగు సంఘం ఆధ్వర్యంలో.. గాయత్రిధారణ మహోత్సవ సందర్భంగా సైన్-కోలివాడలోని శ్రీ పద్మశాలి తెలుగు సంఘం నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా కుడిక్యాల్ బాలకిషన్, ఉపాధ్యక్షుడిగా దుస్స శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా జోరీగల సింద్రాంలు, సహాయ కార్యదర్శిగా చిలివేరి మహేంద్ర, కోశాధికారిగా పారెల్లి రాజ్మహేంద్ర, సహాయ కోశాధికారిగా కస్తూరి గణేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పద్మశాలి యువక సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీ అనుమల్ల సుభాష్, దోమల శంకర్ తదితరులు నూతన కార్యవర్గ సభ్యులను సత్కరించారు. భివండీలో ... భివండీ, న్యూస్‌లైన్: భివండీలో తెలుగు ప్రజలు జంద్యాల పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా అఖిల పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో సాయంత్రం వివిధ ప్రాంతాల్లో మార్కండేయ పల్లకి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనడంతో తెలుగుతనం ఉట్టిపడింది. రాత్రి వరకు సాగిన పల్లకి యాత్ర ఉత్సవాలు పండుగ శోభను తెచ్చాయి. స్థానిక పోలీసుశాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించింది. పద్మనగర్‌లో అఖిల పద్మశాలి సమాజ మంగళ కార్యాలయంలో సమాజ పెద్దలు జంద్యాల పండుగను ఘనంగా నిర్వహించారు. పద్మనగర్‌లోని నీలకంఠేశ్వర్ మందిరం నుంచి మగ్గం ద్వారా నూలు బట్ట నేస్తూ పల్లకి శోభాయాత్ర నిర్వహించారు. బాజీ మార్కెట్, కన్నేరి, కుంబార్‌వాడ, తీన్ బత్తి ప్రాంతాల మీదుగా కాసర్ అలీలోని మార్కండేయ మహాముని మందిరానికి చేరుకుంది. యాత్రకు కన్నేరిలో తెలుగు యువక్ మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. నేసిన వస్త్రాన్ని మార్కండేయుడికి సమర్పించిన తర్వాత దానిని వేలం వేశారు. ఈ ఏడాది కామత్‌ఘర్ చందన్భాగ్ ప్రాంతానికి చెందిన భివండీ తెలుగు సమాజ్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్ దాన్ని రూ.2.05 లక్షలకు పొందారు. సమాజం పెద్దలు దాసి అంబాదాస్, వేముల నర్సయ్య, పాశికంటి లచ్చయ్య, వంగ పురుషోత్తంలు రమేశ్‌కు వస్త్రాన్ని అందజేశారు. కాసర్ అలీలోని మార్కండేయ మందిరాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మశాలి సమాజ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు లక్ష్మణ్ గోస్కే ఇతర సభ్యులు సాయంత్రం మందిరం నుంచి పల్లకి యాత్ర నిర్వహించారు. కామత్‌ఘర్‌లో శ్రీ శివభక్త మార్కండేయ మందిరంలో ప్రతి యేడాది మాదిరిగానే సుప్రభాత, నిత్య పూజలు, ద్వజారోహణ, గాయత్రి మహా యజ్ఞం, అభిషేఖాలు, అర్చనలు, యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మగ్గం ద్వారా నూలు బట్టను నేస్తూ కామత్‌ఘర్ పుర:వీధుల మీదుగా ఊరేగింపు నిర్వహిం చారు. ఆ నూలు బట్టను స్వామి వారికి సమర్పిం చారు. అనంతరం దానిని వేలం వేయగా మంగళంపల్లి రవి రూ.11,100 లు చెల్లించి సొంతం చేసుకున్నారు. తడాలిలో...అఖిల పద్మశాలి సమాజ్ కామత్‌ఘర్ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ మందిరం నుంచి వేషధారణలతో భక్తులు ఊరేగింపును నిర్వహించారు. పాంజలాపూర్, కోంబడ్పాడ, సంగమ్ పాడా, పద్మశాలి యువక మండలి శాఖలు కూడా పల్లకి ఊరేగింపు నిర్వహించాయి. కార్పొరేటర్ మచ్చ మురళి కార్యాలయంలో మార్కండేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా వరాలదేవి రోడ్డులోని శ్రీ మార్కండేయ మహాముని వాచనాలయ సమితి ఆధ్వర్యంలో మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథులుగా కార్పొరేటర్లు సంతోష్ శెట్టి, శశిలత శెట్టి హాజరయ్యారు. సాయంత్రం పల్లకి యాత్ర నిర్వహించినట్లు సమితి అధ్యక్షుడు సిరిపురం తిరుపతి, కార్యదర్శి శంకర్ వడిగొప్పుల తెలిపారు. -
సమైక్యాంధ్రను పరిరక్షించుకుంటాం
చెన్నై, సాక్షి ప్రతినిధి: సమైక్యాంధ్ర ఉద్యమంతో సీమాంధ్ర అట్టుడికి పోతోంది. చెన్నైలోని తెలుగువారు సైతం ఉద్యమబాట పట్టారు. తెలుగు సంఘాల ఆధ్వర్యంలో మైలాపూరులోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరంలో బుధవారం నిరాహారదీక్ష జరిగింది. పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించిన చోట వెలసిన స్మారక మందిరంలోని ఆయన విగ్రహానికి ముందుగా నివాళులర్పించారు. తర్వాత సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి తంగుటూరి రామకృష్ణ ప్రసంగించారు. ఒక మంచికి, మరో చెడ్డకు సైతం తెలుగువారే ముందుండి నిలిచారని అన్నారు. ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారు కావడం అదృష్టమన్నారు. ఒకే భాషను మాట్లాడుకునే వారికి రెండు రాష్ట్రాలు అనే దుష్ట సంప్రదాయానికి నాంది పకిలిన టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ తెలుగువారే కావడం అత్యంత దురదృష్టకరమన్నారు. నిరాహారదీక్షలు చేస్తే చాలు ప్రత్యేక రాష్ట్రాలు వస్తాయనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం దేశానికి చాటిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరాభివృద్ధి సమష్టికృషిగా ఆయన అభివర్ణించారు. విభజన నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలే విభేదిస్తున్నారని పేర్కొన్నారు. అర్థం లేని డిమాండ్ నిరాహారదీక్ష సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. వీరికి కెన్సెస్ అధినేత కె.నరసారెడ్డి పండ్ల రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌లోనే అర్థం లేదని విమర్శించారు. ఎలాంటి చర్యలు చేపడితే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందో విశ్లేషించుకుని దానిపై దృష్టి సారించాలన్నారు. అలా చేయకుండా ప్రత్యేక రాష్ట్రం కోరడం అవివేకమని అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారి సంఖ్య 30 లక్షలు దాటిందన్నారు. ఈ రెండు ప్రాంతాల వారే లేకుంటే హైదరాబాద్ లేదు, హైదరాబాద్ లేకుంటే తెలంగాణకు గుర్తింపే లేదని అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల తీవ్రవాదం, శాంతిభద్రతల సమస్య వంటివి ఏర్పడగలవని ఏనాడో రుజువైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా విభజన నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. అనంతరం ఘంటసాల రత్నకుమార్ మాట్లాడారు. సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి చెన్నైలోని తెలుగువారు మద్దతు పలకడం కనీస కర్తవ్యమని అన్నారు. ఈ ఆశయాన్ని సాధించే వరకు ఉద్యమాన్ని విరమించకూడదని కోరారు. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ ఉద్యమాన్ని లేవదీశారని రంగనాయకులు అన్నారు. పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తుల త్యాగాల ఫలంగా సిద్ధించిన ఆంధ్రప్రదేశ్‌ను కొందరి స్వార్థం కోసం విభజించరాదని ఉప్పులూరి విజయలక్ష్మి అన్నారు. విదేశీవనితగా భారత్‌లోకి అడుగుపెట్టిన సోనియాగాంధీకి ఆంధ్రప్రదేశ్ విలువ గురించి ఏమి తెలుసని కృష్ణారావు విమర్శించారు. విభజన ద్రోహులకు, సమైకాంధ్ర ఉద్యమకారులకు తెలుగు సంఘాల వారు ప్రకటించిన అవార్డులను ఆస్కా ట్రస్టీ శ్రీనివాసులురెడ్డి చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.నారాయణ గుప్త, స్మారక మందిరం కార్యదర్శి రామకృష్ణ, ఆస్కా ట్రస్టీలు ఎరుకలయ్య, విజయేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.