
న్యూజెర్సీ: తెలంగాణలో విశేష ప్రజాదరణ పొందిన పూలపండుగ బతుకమ్మ సంబరాలను విదేశాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు సంస్కృతి ఉట్టి పడేలా న్యూజెర్సీలో తెలుగు అసోషియేషన్ ఆఫ్ న్యూజెర్సీ ఆధ్వర్యంలో ఏఐసీసీతో కలిసి బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెర్సిపానీకి చెందిన పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల్లో ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. రావణ సంహారం అనంతరం ఉత్సవాలను ప్రారంభించారు.
ఆటపాటలతో ఆద్యంతం కనులపండువగా బతుకమ్మ పండుగ జరిగిందని నిర్వాహకులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీదత్తారెడ్డి, అరుణ్, భానోజీరెడ్డి తెలిపారు. స్థానికంగా దొరికే వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయబద్దంగా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మహిళలు బతుకమ్మ పాటలు పాడారు. కార్యక్రమంలో 600 మంది పాల్గొన్నారని నిర్వాహకులు వెల్లడించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ముందుతరాలవారికి అందించేందుకు పండుగలు తోడ్పతాయని అన్నారు. ఈ వేడుకలు మరచిపోలేని అనుభూతిచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పిల్లలకు పండుగలు మన సంస్కృతిని తెలియజెప్పుతాయిని పేర్కొన్నారు.







Comments
Please login to add a commentAdd a comment