New Jersey
-
న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు
న్యూజెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ న్యూజెర్సీ, శనివారం నాడు ఆర్ధిక అవగాహన సదస్సు నిర్వహించింది. న్యూజెర్సీలో ఉండే తెలుగు వారికి ఆర్ధిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఏజీ ఫిన్ టాక్స్ సీఈఓ అనిల్ గ్రంధి తెలుగువారికి ఎన్నో విలువైన ఆర్ధిక సూచనలు చేశారు. అమెరికాలో పన్నులు, ఉద్యోగం చేసే వారికి ఎలాంటి పన్ను మినహాయింపులు ఉన్నాయి.? అకౌంటింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక పన్నుల నుంచి తప్పించుకోవచ్చు..? వ్యాపారాలు చేసే వారు పన్నుల విషయంలో ఎలా వ్యవహారించాలి ఇలాంటి అంశాలను అనిల్ గ్రంధి చక్కగా వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న వారు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ ఆర్ధిక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడంలో నాట్స్ ప్రెసిడెంట్ ఎలక్ట్ శ్రీహరి మందాడి కీలక పాత్ర పోషించారు. తెలుగువారికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నాట్స్ చేపడుతుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా నాట్స్ విద్య, వైద్యం, ఆర్ధికం, క్రీడలు ఇలా ఎన్నో అంశాలపై కార్యక్రమాలు చేపట్టనుందని శ్రీహరి మందాడి వివరించారు.నాట్స్ బోర్డు డైరెక్టర్ బిందు ఎలమంచిలి, vice ప్రెసిడెంట్(ఆపరేషన్స్) శ్రీనివాస్ భీమినేని, నేషనల్ కోఆర్డినేటర్M(మార్కెటింగ్) కిరణ్ మందాడి, zonal వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, న్యూ జెర్సీ చాప్టర్ నుండి మోహన్ కుమార్ వెనిగళ్ల, శ్రీకాంత్ పొనకాల,వెంకటేష్ కోడూరి, రాకేష్ వేలూరు , కృష్ణ సాగర్ రాపర్ల, రామకృష్ణ బోను, వర ప్రసాద్ చట్టు, జతిన్ కొల్ల , బ్రహ్మనందం పుసులూరి, బినీత్ చంద్ర పెరుమాళ్ళ, ధర్మ ముమ్మడి, అపర్ణ గండవల్ల, రమేష్ నూతలపాటి, రాజేశ్ బేతపూడి, గోపాల్ రావు చంద్ర పలు కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (NRI వార్తల కోసం క్లిక్ చేయండి) -
న్యూజెర్సీలో ఘనంగా బాలల సంబరాలు..
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో బాలల సంబరాలను ఘనంగా నిర్వహించారు. సుమార 265 మంది విద్యార్ధిని, విద్యార్ధులు తమ ప్రతిభ పాటావాలను ప్రదర్శించారు. దాదాపు 800 మందికి పైగా తెలుగు వారు ఈ బాలల సంబరాల్లో పాలుపంచుకున్నారు. తెలుగు ఆట, పాటలు, సంప్రదాయ నృత్యాలతో బాలల సంబరాలు కోలాహలంగా జరిగాయి. తెలుగు వారికి మధురానుభూతులు పంచాయి. బాలల సంబరాల్లో భాగంగానే సంక్రాంతి సంబరాలను కూడా జరిపి తెలుగు వారందరికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని నాట్స్ పంచింది. నాట్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీహరి మందాడి అనేక తెలుగు సంస్థల నాయకులను వేదికకు ఆహ్వానించి వారిని సత్కరించారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు బిందు యలమంచిలి, టీపీ రావు, నాట్స్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ భీమినేని, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ( మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల, నాట్స్ మార్కెటింగ్ నేషనల్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, నాట్స్ జాతీయ మహిళా సాధికారత బృందం శ్రీదేవి జాగర్లమూడి తదితరులు పాల్గొన్నారు. నాట్స్ న్యూజెర్సీ నాయకులు మోహన్ కుమార్ వెనిగళ్ల, ప్రసాద్ టేకి, వెంకటేష్ కోడూరి, సురేంద్ర పోలేపల్లి, సునీత కందుల, ప్రణీత పగిడిమర్రి, గాయత్రి చిట్టేటి, అనూజ వేజళ్ల, సుధ టేకి, అరుణ గోరంట్ల, స్వర్ణ గడియారం, సమత కోగంటి, సుకేష్ సబ్బని, ప్రశాంత్ కుచ్చు, శ్రీనివాస్ నీలం, కృష్ణ సాగర్ రాపర్ల, కృష్ణ సాగర్ రాపర్ల, శ్రీనివాస్ నీలం, కృష్ణ సాగర్ రాపర్ల, నెక్కంటి, బ్రహ్మానందం పుసులూరి, కవిత తోటకూర, సాయిలీల మొగులూరి, సృజన, కావ్య ఇనంపూడి, బినీత్ చంద్ర పెరుమాళ్ల, ధర్మ ముమ్మడి, ఝాన్వీ సింధూర, అపర్ణ, చంద్రశేఖర్ కొణిదెల, వంశీకృష్ణ వెనిగళ్ల తదితరులు ఈ బాలల సంబరాల విజయంలో కీలక పాత్ర పోషించారు. హర్షిత యార్లగడ్డ, అద్వైత్ బొందుగల, జాన్వీ ఇర్విశెట్టి చక్కటి తెలుగుపాటలు పాడి అందరిని అలరించారు. కిరణ్ మందాడి, సాయిలీలలు వ్యాఖ్యతలుగా వ్యవహారించి బాలల సంబరాలను దిగ్విజయంగా జరగడంలో సహకరించారు. న్యూజెర్సీలో బాలల సంబరాలను విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: ట్రంప్ దూకుడు..ఇక స్వేచ్ఛ స్టాచ్యూ అయిపోనుందా..!) -
న్యూజెర్సీలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
డ్రోన్లా..? విమానాలా..? యూఎఫ్‌వోలా?
వాషింగ్టన్: అమెరికా తూర్పు తీర రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా రాత్రి వేళల్లో ఆకాశంలో గుర్తు తెలియని వస్తువులు కనిపిస్తుండటం ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. అవి శత్రు దేశాల నిఘా డ్రోన్లా, ఫ్లయింగ్ సాసర్లా, లేక మామూలు విమానాలా అన్నది ఓ పట్టాన తేలడం లేదు. దీనిపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దాంతో రాత్రయితే చాలు జనం ఆకాశం వంక ఆసక్తిగా పరికించి చూస్తున్నారు. తాజాగా న్యూజెర్సీ మీదుగా ఆకాశంలో కనిపిస్తున్న గుర్తు తెలియని వస్తువులపై స్థానిక సోషల్ మీడియాలో చిలువలు పలవలుగా కథనాలు వెలువడుతున్నాయి. వీటి వెనుక వాస్తవాలను ప్రభుత్వం తక్షణం ప్రజల ముందుంచాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేసేదాకా వెళ్లింది! న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అయితే అధ్యక్షుడు జో బైడెన్‌కు ఈ మేరకు లేఖ కూడా రాశారు. గురువారం రాత్రి న్యూజెర్సీ శివారులో కనిపించిన డ్రోన్‌ను వెంటాడినట్లు సెనేటర్ ఆండీ కిమ్ ‘ఎక్స్’లో వెల్లడించారు. మోరిస్ కౌంటీలోని ఓ ఇంటి ఆవరణలో గురువారం రాత్రి బుల్లి డ్రోన్ కూలడం మరింత కలకలం రేపింది. అది ది బొమ్మ డ్రోనేనని అధికారులు తేల్చారు. This is not a drone. We have a full blown UFO / UAP event occurring in real time in New Jersey with tens of thousands of witnesses and tons of video footage. pic.twitter.com/jPRy6pT6Rl— DivXMaN (@crypto_div) December 11, 2024ఇవీ వదంతులు.. గుర్తు తెలియని వస్తువులపై రకరకాల కథనాలు హల్చల్ చేస్తున్నాయి. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యూజెర్సీ రాష్ట్రంలోని బెడ్‌మిన్‌స్టర్‌లో ఉన్న ఆస్తులను కాపాడేందుకే ఈ డ్రోన్లను ప్రయోగించి ఉంటారని కొందరు, నిఘా కోసం ఇరాన్, లేదా చైనా పంపి ఉంటాయని మరికొందరు అంటున్నారు. దీనిపై చర్చకు సోషల్ మీడియాలో గ్రూపులే ఏర్పాటయ్యాయి! ఫేస్బుక్లో న్యూజెర్సీ మిస్టరీ డ్రోన్స్ పేరుతో పేజీ పుట్టుకొచ్చింది. అందులో సభ్యుల సంఖ్య శనివారానికి 44 వేలకు చేరింది! డ్రోన్లు, ఇతర వస్తువుల ఫొటోలను అందులో పోస్ట్ చేస్తున్నారు. కామెంట్ల వరద కొనసాగుతోంది. డ్రోన్లు కనిపిస్తే పిట్టల్ని కాలి్చనట్లు కాల్చి పారేయాలని కొందరు సలహాలిస్తున్నారు. జనం క్రిస్మస్ షాపింగ్ తదితరాలను కూడా మానేసి మరీ ఇంటిల్లిపాదీ వాటినే చూస్తూ కాలక్షేపం చేస్తున్నారట! చిన్న విమానాలే: వైట్‌హౌస్ ఆకాశంలో ఎగురుతూ కనిపించే డ్రోన్లతో జాతీయ భద్రతకు, ప్రజలకు ముప్పేమీ లేదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. అవేమిటో, ఎక్కడి నుంచి వస్తున్నాయో తేలుస్తున్నాం. వాటిలో చాలావరకు చిన్న విమానాలే. ఇతర దేశాల నుంచి వచి్చనవి కావు. నిషేధిత ప్రాంతాల మీదుగా ఎగరడం లేదు’’ అని తెలిపింది. కానీ జనం మాత్రం దీన్ని నమ్మడం లేదు.How are dozens of SUV-sized drones flying over New Jersey on a nightly basis and nobody in our government knows where they’re coming from or what they’re doing?FBI, Congress, local officials - all baffled.And no one is even talking about it?WHAT?!pic.twitter.com/7ldNDqF94Y— The Kevin Harlan Effect (@KevHarlanEffect) December 11, 2024 కూల్చేయండి: ట్రంప్మిస్టరీ డ్రోన్లను కనిపించిన వెంటనే కూల్చేయాలని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. ప్రభుత్వానికి తెలియకుండానే ఇవన్నీ యథేచ్ఛగా సంచరిస్తున్నాయా అంటూ సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ప్రశ్నించారు. ‘అవేంటో ప్రజలకు చెప్పండి. లేదా కూల్చేయండి’ అని అధికారులను కోరారు.Uap in Fairfield, New Jersey. According to the witness, no fixed wing and no sound.recorded by Lori Jones. 12/12/24#uap #ufo #njdrone #nj #drones pic.twitter.com/gxVHFoc9Md— Jason (@protestroots) December 13, 2024 UFO SPOTTED OVER NEW JERSEY..You got to be kidding me. NOPE " pic.twitter.com/HPqjAorZST— 🔨Robert The Builder 🇺🇸 (@NobodymrRobert) December 12, 2024 -
న్యూజెర్సీలో మాటా ఫ్రీ హెల్త్ క్యాంప్
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ ను ప్రారంభించింది. న్యూజెర్సీ, ఎడిసన్‌లోని సాయి దత్త పీఠం అండ్ కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్‌కి విశేష స్పందన వచ్చింది. ఫ్లు ఇంజెక్షన్ తోపాటు Free Medication అందజేశారు. వాలంటీర్లు, డాక్టర్లు పాల్గొని సేవలందించారు.ఈ సందర్భంగా మాటా తరుపున చేస్తున్న సేవా కార్యక్రమాలను సంస్థ సభ్యులు వివరించారు. అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్స్‌లో అతి తక్కువ టైమ్ లో ఎక్కువ మందికి చేరువైన సంస్థ మాటా అన్నారు. మూడు వేల మంది సభ్యులతో ప్రారంభించి.. అనేక రాష్ట్రాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఫ్రీ హెల్త్ క్లినిక్ లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు, డాక్టర్లందరికీ మాటా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాటా సంస్థని పలువురు అభినందించారు. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన పలువురు ప్రముఖులు మాటా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.(చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక) -
ఫ్రాంచైజ్ బిజినెస్‌పై నాట్స్ వెబినార్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ప్రాంచైజ్ బిజినెస్‌పై ఆన్లైన్ వేదికగా వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ఉండే తెలుగువారి ఆర్థిక భద్రతకు, స్వశక్తితో ఎదిగేందుకు కావాల్సిన సహకారాన్ని అందించే విధంగా నాట్స్ ఈ వెబినార్‌కు శ్రీకారం చుట్టింది. 250 మందికి పైగా తెలుగువారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో న్యూజెర్సీలో ప్రముఖ వ్యాపారవేత్త, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ టి.పి.రావు ఈ వెబినార్‌లో ప్రాంచైజీ బిజినెస్ పై అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో స్థిరమైన వ్యాపారం ప్రాంచైజెస్‌ల వల్ల సాధ్యమవుతుందని తెలిపారు. మార్కెట్ పై అవగాహన పెంచుకోవడం, సరైన ప్రాంతాలను, ప్రాంచెజ్ పెట్టే ప్రదేశాలను ఎంపిక చేసుకోవడంలోనే సగం విజయం దాగుందని టి.పి.రావు వివరించారు. మిగిలిన వ్యాపారాలతో పోలిస్తే ప్రాంచైజ్‌స్‌లతో రిస్క్ తక్కువగా ఉంటుందని, కానీ ప్రాంచైజ్ ప్రారంభించిన తొలినాళ్లలో దాని నిర్వహణ, వ్యవస్థాగతంగా దాన్ని బలోపేతం చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి నిలిపితే చక్కటి లాభాలు ఉంటాయని తెలిపారు. ప్రాంచైజ్‌స్ పై అవగాహన కల్పించడంతో పాటు ప్రాంచైజస్ ఏర్పాటు తన వంతుగా చేతనైన సహకారం అందిస్తానని టి.పి. రావు వెబినార్‌లో పాల్గొన్న వారికి హామీ ఇచ్చారు. సమయం, ధనం వెచ్చించి పట్టుదలతో ముందుకు వచ్చే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రాంచైజస్ చక్కటి మార్గమని తెలిపారు. ఈ వెబినార్‌కు నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి అనుసంధానకర్తగా వ్యవహరించారు. చాలా మంది ఔత్సాహికులు ప్రాంచైజ్ నిర్వహణ, ప్రాంచైజస్ బిజినెస్‌లో వచ్చే ఇబ్బందుల గురించి తమ సందేహాలను టి.పి.రావుని అడిగి నివృత్తి చేసుకున్నారు. ప్రస్తుత యూఎస్ గవర్నమెంట్లోఉద్యోగుల డోలాయమాన పరిస్థితుల్లో ఇటువంటి వెబినార్స్ యువతకు ఎంతో సహాయకారకం గా ఉంటాయని నాట్స్ ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, బోర్డ్ డైరెక్టర్ చెబుతూ టి.పి.రావు ను అభినందించారు. ఆన్లైన్ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందు టి.పి.రావు,కిరణ్ మందాడిలను నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు) -
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ : దేవుడా..ప్యాక్ చూసి షాక్!
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినపుడు ఒకటికి బదులు ఒకటి రావడం, లేదంటే ఆహారంలో పురుగులు, సిగరెట్ పీకలు రావడం లాంటి ఘటనలు గతంలో చాలా చూశాం. తాజాగా అమెరికాలోని ఒక మహిళకు మరో వింత అనుభవం ఎదురైంది. తను ఆర్డర్ చేసిన ప్యాకేజీ ఓపెన్ చేసి, చూసి షాకయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. స్టోరీ ఏంటంటే..!న్యూజెర్సీలో డ్రైవర్‌గా పని చేసే ఒక మహిళ ఉబెర్ ఈట్స్నుంచి బురిటో(షావర్మా) లాంటిది ఆర్డర్ చేసింది. ఉబెర్ ఈట్స్ డెలివరీ అందుకొని ఓపెన్ చేసి, తిందామని ఏంతో ఆతృతగా ఫాయిల్ రేపర్ విప్పి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అందులో బురిటోకు బదులుగా గంజాయి ప్యాక్ చేసి ఉంది. ఘటన వాషింగ్టన్ టౌన్షిప్, క్యామ్‌డెన్ కౌంటీలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ విషయంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే తన డెలివరీ ప్యాకేజీలో బురిటోకు బుదులుగా ఏదో తేడా వాసన వచ్చినట్టుగా అనిపించిందని బాధితురాలు తెలిపిందని వాషింగ్టన్ టౌన్షిప్ పోలీస్ చీఫ్ పాట్రిక్ గుర్సిక్ ఒక ప్రకటనలో తెలిపారు. అది ఒక ఔన్స్ గంజాయి అని తేలిందని ఆయన వెల్లడించారు. డ్రగ్స్, ఆల్కహాల్ లేదా మందులను రవాణాపై నిషేధం ఉన్న నేపథ్యంలో ఉబెర్ ఈట్స్‌లో ప్యాకేజీ డెలివరీ ఫీచర్‌ను ఎవరైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి ఉంటారని అనుమానిస్తున్నారు.ఉబెర్ ఈట్స్ స్పందనదీనిపై ఉబెర్ ఈట్స్ కూడా స్పందించింది. ఈ ఘటన తీవ్రంగా కలపర్చేదేనని ఉబెర్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. స్థానిక అధికారులను వెంటనే అప్రమత్తం చేసినందుకు ఆమెను అభినందించారు. ఇలాంటి అనుమానాస్పద డెలివరీలపై వెంటనే రిపోర్ట్ చేయాలని ఇతర డ్రైవర్లను కూడా కోరారు.ఇదీ చదవండి : వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా? -
న్యూజెర్సీలో దీపావళి వేడుకలు 2024
-
మానసిక ఆరోగ్యం పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్ న్యూజెర్సీ విభాగం తాజాగా మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సును, డిమెన్షియాపై సర్వే లను నిర్వహించింది. తొలుత నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి మానసిక నిపుణురాలైన శుభ బొలిశెట్టి ని, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల రట్గర్స్ యూనివర్సిటీ క్లినికల్ ఇన్స్టక్టర్, పీహెచ్డీ విద్యార్ధిని అంజు వాధవన్ లను సభకు పరిచయం చేశారు. ముఖ్యంగా విద్యార్ధులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపై ఈ సదస్సు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విద్యార్ధుల తల్లిదండ్రులు విద్యార్ధుల మానసిక సమస్యలను ఎలా కనిపెట్టాలి.? ఎలా పరిష్కరించాలి.? ఒత్తిడిని జయించేలా వారికి ఎలా దిశా నిర్దేశం చేయాలనే అంశాలపై ఈ సదస్సు ద్వారా అవగాహన కల్పించారు. నమి న్యూజెర్సీ ప్రోగ్రామ్ మేనేజర్, సమాజ్ స్టేట్ వైడ్ కో ఆర్డినేటర్, మానసిక నిపుణురాలైన శుభ బొలిశెట్టి ఈ సదస్సులో విద్యార్ధులకు, తల్లిదండ్రులకు మానసిక సమస్యలు, వాటి పరిష్కారాలపై చక్కటి అవగాహన కల్పించారు. డిమెన్షియాపై సర్వేకు నాట్స్ మద్దతుఆసియన్ అమెరికన్ డిమెన్షియా బాధితుల సంరక్షణ ఎలా ఉంది..? డిమెన్షియా బాధితులను సంరక్షించే వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.? ముఖ్యంగా మానసికంగా వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు.? అనే అంశాలపై చాంబర్లిన్ విశ్వవిద్యాలయం మరియు మెర్సర్ కౌంటీ కమ్యూనిటీ కళాశాలల విజిటింగ్ ప్రొఫెసర్, రట్గర్స్ యూనివర్సిటీ కి చెందిన పీహెచ్డీ విద్యార్ధిని అంజు వాధవన్ సర్వే చేస్తున్నారు. ఇలాంటి సర్వే ద్వారా డిమెన్షియా బాధితులకు, వారి సంరక్షకులు ఎదుర్కొనే సమస్యలపై కొత్త విషయాలు వెలుగులోకి రానున్నాయి. అందుకే ఈ కార్యక్రమానికి నాట్స్ కూడా తన వంతు మద్దతు, సహకారం అందించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలితో పాటు నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ భీమినేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల, న్యూ జెర్సీ ఛాప్టర్ జాయింట్ సెక్రటరీ ప్రసాద్ టేకి, రాకేష్ వేలూరు,రామకృష్ణ బోను, సుధ బిందు, నేషనల్ విమెన్ ఎంపవర్మెంట్ టీమ్ సభ్యురాలు శ్రీదేవి జాగర్లమూడి, శ్రీదేవి పులిపాక తదితరులు ఈ సమావేశం నిర్వహణ బాధ్యత వహించారు. తెలుగు లలిత కళాసమితి ఉపాధ్యక్షుడు ప్రసాద్ ఊటుకూరు, రాణి ఊటుకూరు, పలువురు న్యూ జెర్సీ ఛాప్టర్ కమిటీల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: ఆర్ధిక అక్షరాస్యత పై నాట్స్ అవగాహన సదస్సు) -
న్యూ జెర్సీలో దిగ్విజయంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూ జెర్సీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. న్యూ జెర్సీలో దాదాపు 200 మంది తెలుగు క్రికెట్ ప్లేయర్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు ఈ టోర్నీలో ఎడిసన్ కింగ్స్ విజేతగా నిలిచింది. రామ్ కోట ఎడిసన్ కింగ్స్ కెప్టెన్‌గా టీంను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఎఫ్ 5 జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ టీంకు కెప్టెన్‌గా తులసి తోట వ్యవహరించారు.ఈ టోర్నమెంట్ విజయవంతం చేసేందుకు నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గత వారం రోజులుగా విశేష కృషి చేశారు. నాట్స్ న్యూ జెర్సీ విభాగం క్రీడా సమన్వయకర్త రమేశ్ నెల్లూరి చేసిన కృషి మరువలేనిదని నాట్స్ నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. తెలుగువారిని కలిపే ఏ కార్యక్రమంలోనైనా నాట్స్ ముందుంటుందని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రికెటర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నాట్స్ నాయకులు సురేంద్ర పోలేపల్లి, ప్రశాంత్ కుచ్చు, వెంకటేష్ కోడూరి, కిరణ్ మందాడి, ప్రసాద్ టేకి, క్రాంతి యడ్లపూడి, హరీష్ కొమ్మాలపాటి, రాకేష్ వేలూరి, ధర్మేంద్ర ముమ్మిడి తదితరులు ఈ టోర్నీ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు.ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి నాట్స్ జాతీయ నాయకులు గంగాధర దేసు, బిందు యలమంచిలి, టిపి రావు, శ్రీహరి మందాడి, శ్రీనివాస్ భీమినేని, శ్రీనివాస్ మెంట, మోహన్ కుమార్ వెనిగళ్ల, శ్రీనివాస్ కొల్లా, రవి తుబాటి, శంకర్ జెర్రిపోతుల, వెంకట్ గోనుగుంట్ల, కృష్ణ గోపాల్ నెక్కంటి, బ్రహ్మానందం పుసులూరి, రమేష్ నూతలపాటి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీ వెనిగళ్ల, సూర్య గుత్తికొండ, సురేష్ బొల్లు, రాజేష్ బేతపూడి, శ్రీధర్ దోనేపూడి, హరీష్ కొమ్మాలపాటి, బినీత్ పెరుమాళ్ల తదితరులు విచ్చేసి క్రికెటర్ల క్రీడా స్ఫూర్తిని అభినందించారు. నాట్స్ బోర్డు డైరెక్టర్స్ టీపీ రావు, బిందు యలమంచిలి, మాజీ అధ్యక్షుడు గంగాదర్ దేసు, వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) శ్రీనివాస్ భీమినేని నాట్స్ చేస్తున్న భాష, సేవా కార్యక్రమాలు, మెంబెర్షిప్ డ్రైవ్ గురించి అందరికీ తెలియజేశారు. న్యూజెర్సీ నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
న్యుజెర్సీలో గ్రాండ్‌గా మాటా క్యారమ్ ఛాంపియన్షిప్ 2024
అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాటా క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిసాయి. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ‘మాటా’ అధ్యక్షులు శ్రీనివాస్ గనగొని ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఫస్ట్ టైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికా క్యారం బోర్డు.. ఈ పోటీలను నిర్వహించటం విశేషం.పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్యారమ్ పోటీల్లో మొత్తం 40 జట్లు పాల్గొని సత్తా చాటాయి. జాతీయస్థాయి క్రీడాకారులూ పాల్గొని తమ ప్రతిభను చాటారు. ప్రతి జట్టు కేవలం డబుల్స్‌లోనే పాల్గొనగా, ప్రథమ బహుమతిగా 1,116 డాలర్లు, రెండో బహుమతిగా 516 డాలర్లు, మూడవ స్థానం గెలుచుకున్న వారికి ట్రోఫీ అందజేసి.. సత్కరించారు. ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని గ్రాండ్ స్పాన్సర్ రియల్ టెక్ సర్వీసెస్ సీఈవో, ప్రెసిడెంట్ రఘు వీరమల్లు అన్నారు. క్రీడల్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. హెడ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఆదిత్య లోధా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూజెర్సీ సెనేటర్ పాట్ డిగ్నాన్, అసెంబ్లీమన్ స్టెర్లే స్టాన్లీ, మిడిల్సెక్స్ కౌంటీ కమిషనర్ శాంతి నర్రా, ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితేష్ పటేల్, ఎడిసన్ కౌన్సిలర్ అజయ్ పాటిల్, డా. ఉపేంద్ర చివుకులా, చీఫ్ కంప్లేన్స్ ఆఫీసర్ ఉదయ్ కులకర్ణి, తదితరులు హజరై.. విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ పోటీ నిర్వహణకు మాటా స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ సురేష్ బాబు కజానా ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించి విజయవంతం కావడంలో కీలక పాత్ర వహించారు. మాటా వ్యవస్థాపకులు, అధ్యక్షులు శ్రీనివాస్ గనగొని విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకు, క్రీడాకారులకు మాటా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మాటా సంస్థ తరుపున చేపడుతున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. -
న్యూజెర్సీలో విజయవంతంగా నాట్స్ పికిల్‌బాల్ టోర్నీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలుగు వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు న్యూజెర్సీలో తాజాగా పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. ఇందులో 30 జట్లు పాల్గొన్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించి నిర్వహించిన ఈ మ్యాచ్‌ల్లో.. 16 టీమ్‌లు నాకౌట్ మ్యాచ్‌లకు అర్హత సాధించాయి. తరువాతి రౌండ్లలో 8 జట్లు పోటీ పడ్డాయి. చివరకు నాలుగు జట్లు సెమీ ఫైనల్స్ ఆడాయి.విజేత చెస్టర్‌ఫీల్డ్ అద్భుత ప్రదర్శనతో ఈ టోర్నీ ఫైనల్‌కు చేరుకున్న మన్రో, చెస్టర్‌ఫీల్డ్ జట్ల మధ్య ఆఖరి మ్యాచ్ మరింత రసవత్తరంగా సాగింది. ఈ ఆసక్తికర పోరులో చెస్టర్‌ఫీల్డ్ జట్టు విజేతగా నిలవగా... మన్రో జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక తుది పోరులో నిలిచిన విన్నర్, రన్నర్ అప్ టీమ్‌లకు నాట్స్ నాయకులు ట్రోఫీలు, బహుమతులు అందించారు. టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి తొలి స్థానంలో నిలిచిన వంశీ కొండరాజు, నాగరాజు ఆకారపు, రెండవ స్థానంలో నిలిచిన మౌర్య యలమంచిలి, కీర్తన సంగం, మూడవ స్థానంలో తన్మయ్ షా, రాజా శశాంక్ ముప్పిరాలను నాట్స్ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. వారికి బహుమతులు అందించారు.న్యూజెర్సీ విభాగానికి అభినందనలుఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ అధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ, గంగాధర్ దేసు, నాట్స్ మాజీ చైర్ వుమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి పాల్గొని ఆటగాళ్లను ప్రోత్సహించారు. వారిలో క్రీడా స్ఫూర్తి పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ పికిల్ బాల్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన నాట్స్ న్యూజెర్సీ విభాగాన్ని అభినందించారు. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడంలో నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ ఈవెంట్స్ ఎగ్జిక్యూషన్ కో-ఛైర్ క్రాంతి యడ్లపూడి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడిలు కీలక పాత్ర పోషించారు.ఈ టోర్నమెంట్ నిర్వహణలో న్యూజెర్సీ చాప్టర్ కో ఆర్డినేటర్ మోహన్ కుమార్ వెనిగళ్ల, జాయింట్ కో ఆర్డినేటర్ ప్రసాద్ టేకి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ భీమినేని, నాట్స్ మార్కెటింగ్ నేషనల్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, నాట్స్ న్యూజెర్సీ టీమ్ రమేష్ నూతలపాటి, వంశీ వెనిగళ్ల , చంద్రశేఖర్ కొణిదెల, విష్ణు ఆలూరు, రాజేష్ బేతపూడి, వెంకటేష్ కోడూరి, శ్రీనివాస్ చెన్నూరి, శ్రీకాంత్ పొనకల, రమేష్ నెలూరి, కృష్ణ గోపాల్ నెక్కంటి, బ్రహ్మానందం పుసులూరి, ప్రశాంత్ కూచు, ప్రసూన మద్దాలి, ప్రణీత పగిడిమరి, రవి తుబాటి, శంకర్ జెర్రిపోతుల, శ్రీనివాస్ నీలం, సుకేష్ సుబ్బాని, గోపాల్ రావు చంద్ర, వెంకట్ గోనుగుంట. కృష్ణ సాగర్ రాపర్ల, రామకృష్ణ బోను, హరీష్ కొమ్మాలపాటి తదితరులు చేసిన కృషి విజయానికి దోహదపడింది. ఈ టోర్నమెంట్ దిగ్విజయం చేయడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
Video: టైగర్ ఎన్‌క్లోజర్‌లోకి దూకిన మహిళ.. జస్ట్ మిస్
అమెరికాలో ఓ మహిళా హల్చల్ చేసింది. న్యూజెర్సీలోని కోహన్‌జిక్ జూ వద్ద బెంగాల్ టైగర్ ఎన్‌క్లోజర్‌లోకి కంచె ఎక్కింది. ఏమాత్రం భయం లేకుండా పులిని తాకేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమెను పులి దాడి చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అయితే పులికి మహిళకు మద్య మరో ఫెన్సింగ్ ఉండటంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.అయినప్పటికీ మహిళ తన పిచ్చి వేషాలు మానుకోకుండా పులిని ప్రలోభపెట్టడానికి యత్నించింది. జంతువుకు చేయి చూపింది, దాన్ని రెచ్చగొట్టేందుకు చూసింది. వెంటనే పులి ఆమె చేతిని ఒరికేందుకు, దాడి చేసేందుకు యత్నించింది. దీంతో భయపడిన మహిళ అక్కడనుంచి వెనక్కి పరుగుత్తుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. జూలోని కంచెపైకి ఎక్కడం చట్ట విరుద్దమని తెలిపారు. సందర్శకుల భద్రతతోపాటు జంతువుల సంరక్షణ తమ ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్నారు. జూలో జంతువులపై సందర్శకుల ప్రమాదకరమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని తెలిపారు. సదరు యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.LOOK: Bridgeton Police want to identify this woman, who climbed over the tiger enclosure’s wooden fence at the Cohanzick Zoo “and began enticing the tiger, almost getting bit by putting her hand through the wire enclosure.” 1/4 pic.twitter.com/DPRFi5xFg1— Steve Keeley (@KeeleyFox29) August 21, 2024 ఇదిలా ఉండగా కోహన్‌జిక్ జూలో రెండు బెంగాల్ పులులు ఉన్నాయి. రిషి, మహేషా అనే సోదరులు. వీటిని 2016లో అక్కడికి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాటిని తీసుకొచ్చారు. అప్పుడు కేవలం 20 పౌండ్ల బరువుతో ఉండగా.. ఇప్పుడు పులులు ఒక్కొక్కటి దాదాపు 500 పౌండ్ల బరువు కలిగి ఉన్నాయి.ఇక బెంగాల్ పులులను భారతీయ పులులు అని కూడా పిలుస్తారు. ఇవి అంతరించిపోతున్న జాతికి చెందినవి. అక్టోబర్ 2022 నాటికి దాదాపు 3,500 పులులు మాత్రమే అడవిలో ఉన్నాయి. సైబీరియన్ పులి తర్వాత బెంగాల్ పులి జాతి రెండవ అతిపెద్దదిగా పరిగణిస్తారు. -
న్యూజెర్సీ సాయిదత్త పీఠంలో అట్టహాసంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
న్యూజెర్సీలో ఘనంగా TTA బోనాల జాతర
-
న్యూజెర్సీలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు
-
న్యూజెర్సీలో ఎన్నారై మహిళ దారుణ హత్య, నిందితుడు భారతీయుడే
అమెరికాలోని న్యూజెర్సీలో పంజాబ్‌కు చెందిన ఇద్దరు మహిళలపై భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. న్యూజెర్సీలోని కార్టెరెట్‌లోని నివాస భవనం వెలుపల 19 ఏళ్ల గౌరవ్ గిల్ జరిపిన కాల్పుల్లో జస్వీర్ కౌర్ (29) మరణించారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ కాల్పుల్లో మరో మహిళ,జస్వీర్ బంధువు గగన్‌దీప్ కౌర్ (20) తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. నిందితుడు గిల్ నాకోదర్లోని హుస్సేనివాలా గ్రామానికి చెందినవాడని, బాధితులు జలంధర్‌లోని నూర్‌మహల్‌కు చెందినవారని తెలుస్తోంది. నిందితుడు గౌరవ్ గిల్‌ను హత్య కేసులో అరెస్టు చేశారు. అతనిపై హత్య, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడనే ఆరోపణలపై కేసులు నమోదు చేశారు.హత్యకు గురైన జస్బీర్ కౌర్ తన బంధువు గగన్‌దీప్‌ను తన ఇంటికి ఆహ్వానించింది. ఈ సమయంలో అతడు కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ కాల్పుల వెనుక కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. పంజాబ్‌లోని నకోదర్ పట్టణంలోని IELTS కోచింగ్ సెంటర్లో గగన్‌దీప్‌తో గిల్‌కు పరిచయమున్నట్టు తెలుస్తోంది. కాగా జస్వీర్ కౌర్ న్యూజెర్సీలోని అమెజాన్‌లో పనిస్తుండగా, ఆమె భర్త, ట్రక్ డ్రైవర్‌గా ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. -
అమెరికా : ఆ ఇద్దరు తప్పు చేశారా? చేతివాటమా?
ఎరక్కపోయి అమెరికాలో ఇరుక్కుపోయారు ఇద్దరు అమ్మాయిలు. తెలిసో తెలియకో ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఇబ్బందుల్లో పడ్డారు. న్యూజెర్సీలో చదువుకుంటున్న వీరిద్దరు హోబెకన్ ఏరియాలోని షాప్‌రైట్ అనే సూపర్ మార్కెట్‌కు వెళ్లారు. ఈ మాల్లో కొంతసేపు షాపింగ్ చేసిన వీరిద్దరు బిల్లింగ్ చేసి బయటికొచ్చారు. అయితే వీరు అన్ని వస్తువులకు కాకుండా.. ఉద్దేశపూర్వకంగా కొన్ని వస్తువులకు మాత్రమే బిల్లు చెల్లించినట్టు పోలీసులు అభియోగం మోపి కేసు పెట్టి అరెస్ట్ చేశారు. -
న్యూ జెర్సీలో ఆటా బిజినెస్ సెమినార్, కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్
న్యూ జెర్సీ లో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ఆటా బిజినెస్ సెమినార్ మరియు కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. న్యూ జెర్సీ న్యూయార్క్ టీం సాయంతో.. అట్లాంటాలో జరుగనున్న 18th ఆటా కాన్ఫరెన్స్ కోసం 800K పైగా స్పాన్సర్షిప్ ప్రతిజ్ఞలను సేకరించారు. ఆట అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ఎలెక్ట్ జయంత్ చర్ల , పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, ఫిలడెల్ఫియా ట్రస్టీ రాజ్ కక్కెర్ల తదితరులు పాల్గొని ప్రసంగించారు. ATA న్యూజెర్సీ , న్యూయార్క్ టీం - కార్ప్రేట్ చైర్ హరీష్ బథిని, కో చైర్ ప్రదీప్ కట్టా మరియు ఫైనాన్స్ కమిటీ చైర్ శ్రీకాంత్ గుడిపాటి , కో చైర్ శ్రీకాంత్ తుమ్మలతో పాటు రీజనల్ కోరినేటర్లు సంతోష్ కోరం , ధనరాజ్, రీజినల్ డైరెక్టర్ విలాస్ రెడ్డి జంబుల, మహిళల రీజినల్ కో-ఆర్డినేటర్ గీతా గంగుల, తదితరుల సహాయంతో బిజినెస్ సెమినార్ మరియు నిధుల సేకరణను విజయవంతంగా నిర్వహించారు. అట్లాంటాలో జరిగిన ఆటా (ATA) కాన్ఫరెన్స్ కోసం 636k పైగా 175 కార్పొరేట్ స్పాన్సర్షిప్ ప్రతిజ్ఞలను సేకరించినట్లు సభ్యులు తెలిపారు. అలాగే న్యూజెర్సీ & న్యూయార్క్ బృందం అట్లాంటా కాన్ఫరెన్స్ కోసం 800K పైగా దాతల ప్రతిజ్ఞలను సేకరించిందని పేర్కొన్నారు. అట్లాంటాలో జూన్ 7 నుండి 9 వరకు జరిగే ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్‌లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వహకులు పిలుపునిచ్చారు. -
న్యూజెర్సీలో యాత్ర 2 మూవీ పబ్లిక్ టాక్
-
న్యూజెర్సీలో దుమ్మురేపుతున్న యాత్ర 2 మూవీ
-
న్యూజెర్సీలో అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ సంబరాలు
-
US: న్యూ జెర్సీలో మంచు తుఫాను బీభత్సం
న్యూజెర్సీ: అమెరికాలో దట్టమైన మంచు తుఫాను కురుస్తోంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన న్యూజెర్సీలో మంచు తుఫాను విశ్వరూపం చూపుతోంది. వింటర్ స్టార్మ్ కారణంగా హైవేలపై అడుగుల కొద్దీ మంచు పేరుకుపోయింది. రోడ్డపై గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడం వల్ల కార్లు నడవలేని పరిస్థితి ఏర్పడింది. వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై సుమారు 2 నుంచి 6 అంగుళాల మధ్య మంచు కమ్మేసినట్లు స్థానికులు చెబుతున్నారు. Winter Wonderland! ❄️#OceanCity #NewJersey #SnowDay #Beach #MancoPizza #MissingHome 📸 OffShore Drones pic.twitter.com/dUyzOhxcLT — Shannon 🎄❄️🌴✨💫 (@shanrobinson7) January 20, 2024 #snow #snowday #newjersey@News12NJ @njdotcom https://t.co/J3nQYoca35 — José Eduardo 🇵🇪👊🏼 (@JoseEdu87) January 19, 2024 న్యూజెర్సీతో పాటు దేశంలోని చాలా నగరాల్లో కరెంటు సరఫరా ఆగిపోయి ఆ ప్రాంతాలన్నీ చీకటిమయమైపోయాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం రాలేని పరిస్థితి నెలకొంది. #Driving the snowy roads of central #NewJersey tonight . Icy conditions as temps dip a real concern #takeitslow #snow #roads #fridaycommute pic.twitter.com/9HaqfXfulI — Checkey Beckford (@Checkey4NY) January 20, 2024 #Driving the snowy roads of central #NewJersey tonight . Icy conditions as temps dip a real concern #takeitslow #snow #roads #fridaycommute pic.twitter.com/9HaqfXfulI — Checkey Beckford (@Checkey4NY) January 20, 2024 #winterishere #snow #southjersey #newjersey pic.twitter.com/dVRy95fpFk — Amanda Fitzpatrick (@WatchAmandaTV) January 19, 2024 మంచు తుఫాన్ కారణంగా విమానాలు, రైళ్లు, ఇతర రవాణా సర్వీసులను రద్దు చేశారు. పలు ప్రాంతాల్లో 4 నుంచి 12 అంగుళాల మధ్య మంచు కురిసే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. భారీ మంచు తుఫాన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఇదీచదవండి.. జనవరి 22 రామ్ మందిర్డేగా గుర్తించిన కెనడా మునిసిపాలిటీలు -
న్యూజెర్సీ, సాయిదత్త పీఠంలో దీపావళి వేడుకలు
-
న్యూజెర్సీ, ఎడిసన్ లో బతుకమ్మ వేడుకలు
-
దీపావళి వేడుకలు.. అమెరికాలో స్కూళ్లకు సెలవు
అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కోసం అమెరికాలోని భారతీయులు భారీ వేడుకలను ప్లాన్ చేశారు. అమెరికా ప్రభుత్వం దీపావళిని పండుగగా గుర్తించి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్‌లో దీపావళి ఫెస్టివల్ గ్రాండ్‌గా జరిగింది. పాపాయిని పార్క్‌లో ఎడిసన్ మేయర్ సామ్ జోషి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఈ వేడకల్లో పాల్గొన్నారు. తెలుగు వైభవాన్ని ఘనంగా చాటుతూ ఈ వేడుకలు నిర్వహించారు. తెలుగు పాట,ఆట కనువిందు చేశాయి. తెలుగు సంస్క్రృతి, సంప్రదాయాలకు ఈ వేడుకలు అద్దం పట్టాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి తీసుకువచ్చారు. ఇక వేదికపై బతుకమ్మలను పెట్టి ఆడపడుచులు ఆడి పాడారు. పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇక పలువురు కళాకారులు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేలా ప్రదర్శనలు నిర్వహించారు. జే సీన్ స్ఫెషల్ మ్యూజికల్ ఫెర్మామెన్స్.. అహుతులను అలరించింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్ ఫుడ్ స్టాల్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. షాపింగ్ స్టాల్స్, ఫుడ్ అండ్ రిటైల్ వెండర్స్ స్టాల్స్, కిడ్స్ జోన్, ఫైర్ వర్క్, Raffles బహుమతులు, విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొనటం ఒక అద్భుతమైన అనుభవం అంటూ ప్రవాసులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న ఎడిసన్ మేయర్ సామ్ జోషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
న్యూజెర్సీలో బతుకమ్మ, దసరా సంబరాలు
-
న్యూజెర్సీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి
అక్షరధామ్ నుండి ప్రవాసాంద్రులకు పిలుపు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ స్పర్శ్ హస్పైస్ హైదరాబాద్‌లో చేపడుతున్న కార్యక్రమాలకు అమెరికాలోని స్పర్శ్ విభాగం మద్ధతుగా నిలిచింది. అమెరికా న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలో ఇటీవల నిర్మించిన అక్షర్ ధామ్ మందిరం వేదికగా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి అంటూ ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చింది. స్పర్శ్ హస్పైస్ కార్యక్రమాలేంటీ? స్పర్శ్ హస్పైస్ ఒక స్వచ్ఛంధ సంస్థ. హైదరాబాద్ కేంద్రంగా రోగులకు ఉచిత సేవలందిస్తోంది. ముఖ్యంగా చాలా కాలం పాటు వైద్య సేవలు అవసరమయ్యే అభాగ్యులకు (Long term care) స్పర్శ్ అండగా నిలుస్తోంది. మంచానికే పరిమితమైపోయి, దీర్ఘకాలం మెడికల్ కేర్ కోరుకునే వారికి ఇది అండగా నిలుస్తోంది. దీంతో పాటు కొందరు వృద్ధులు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడమో, లేక కుటుంబం, దగ్గరి వారి నుంచి మద్ధతు లేకపోవడమో, లేక చికిత్స లేదనుకున్న సమయంలో తీవ్ర ఆందోళనకు గురైపోతున్నారు. క్యాన్సర్, న్యూరో, గుండె పోటు లేక ఇతర తీవ్రమైన వ్యాధుల బారిన పడిన వారు ఇందులో ఉంటున్నారు. ఇలాంటి వారందరికి స్పర్శ్ అండగా నిలుస్తోంది. స్పర్శ్ హస్పైస్‌లో ఎలాంటి సౌకర్యాలున్నాయి? స్పర్శ్‌లో ఆరు హోం కేర్ వ్యాన్లు ఉన్నాయి. వీటిలో అన్ని రకాల సౌకర్యాలున్నాయి. అలాగే ఔట్ పేషేంట్ సర్వీసులతో పాటు ఇన్ పేషేంట్ సౌకర్యాలున్నాయి. దీర్ఘకాలం చికిత్స అందించే సౌకర్యాలు, నొప్పి నివారణ మార్గాలు, ఔషద చికిత్సతో పాటు మేమున్నామంటూ అండగా నిలిచే సామాజిక మద్ధతు స్పర్శ్‌లో ఉంది. దీని వల్ల రోగులకు పూర్తి భరోసా కలగడంతో పాటు త్వరగా స్వస్థత లభిస్తోంది. అమెరికా అక్షర్ధామ్ కార్యక్రమమేంటీ? న్యూజెర్సీ రాబిన్స్‌విల్లె 112 మెయిన్ స్ట్రీట్‌లో ఏర్పాటయిన BAPS స్వామి నారాయణ్ మందిర్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఇటీవల నిర్మించిన అక్షర్ధామ్ మందిరం అత్యంత ఆకర్షణీయంగా ఉండడంతో పాటు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్పర్శ్ చేస్తోన్న సామాజిక కార్యక్రమాలకు అక్షర్ధామ్ తన వంతు మద్ధతు ప్రకటించింది. అక్షర్ధామ్ ట్రస్టీలయిన డాక్టర్ సుబ్రహ్మణ్యం, లక్స్ గోపిశెట్టి ఈ సందర్భంగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి అంటూ పిలుపునిచ్చారు. విజిట్ అక్షర్ధామ్ అక్షర్ధామ్ ఆలయంలో అక్టోబర్ 22, ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇక్కడికి వచ్చే వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి అక్షర్ధామ్ ఆలయ మందిరమంతా చూపిస్తారు. అనంతరం స్వామి వారి ప్రసాదాన్ని, మధ్యాహ్న భోజనాన్ని అతిథ్యంలో భాగంగా అందజేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను స్పర్శ్ హస్పైస్‌కు అందిస్తారు. -
న్యూజెర్సీ సాయిదత్త పీఠంలో అద్భుత ప్రవచనం
-
అమెరికాలో ఎన్నారై కుటుంబం దారుణ హత్య?!
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు హత్యకు గురయ్యారు. తేజ్ ప్రతాప్ సింగ్(43), సొనాల్ పరిహార్(42), వారి పదేళ్ల కొడుకు ఆయుష్, ఆరేళ్ల కూతురు ఆరీలు ప్లెయిన్స్‌బోరోలోని వారి సొంతింట్లోనే విగతజీవులై రక్తపు మడుగులో కనిపించారని పోలీసులు తెలిపారు. ఐటీ నిపుణులుగా పనిచేస్తున్న సింగ్ దంపతులు 2018లో సొంతింటిని కొనుక్కున్నారని బంధువులు తెలిపారు. ఈ నెల 4న సాయంత్రం తమ ఫోన్‌కాల్‌కు సింగ్ దంపతులు స్పందించడం లేదంటూ వారి బంధువొకరు అధికారులను అలర్ట్ చేశారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా విషయం బయటపడింది. బుధవారం రాత్రి వారు హత్యకు గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తేజ్ ప్రతాప్ సింగ్ సొంతూరు యూపీలోని జలౌన్ అని తెలిసింది. కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని ప్లెయిన్స్‌బోరో పోలీసులు తెలిపారు. -
న్యూజెర్సీలోని ఎడిసన్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం వేడుకలు
-
Swaminarayan Akshardham: భారత్ వెలుపల అతిపెద్ద దేవాలయం
రాబిన్స్‌విల్లె: భారత్ వెలుపల నిర్మితమైన ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో అక్టోబర్ 8వ తేదీన ప్రారంభం కానుంది. న్యూజెర్సీ రాష్ట్రంలోని రాబిన్స్‌విల్లె పట్టణంలో బీఏపీఎస్ స్వామినారాయణ్ అక్షర్‌ధామ్‌గా పిలుచుకునే ఈ గుడి రూపుదిద్దుకుంది. అమెరికా వ్యాప్తంగా తరలివచ్చిన 12 వేల మంది కార్యకర్తలు ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. 183 ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణానికి 2011 నుంచి 2023 వరకు సుమారు 12 ఏళ్లు పట్టింది. సుమారు 10 వేల విగ్రహాలను ఇందులో వాడారు. కంబోడియాలోని 12వ శతాబ్ధం నాటి అంగ్కోర్ వాట్ హిందూ ఆలయం తర్వాత బహుశా ఇదే అతిపెద్దదని అంటున్నారు. ఆలయాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు తరలివస్తున్నారు. -
న్యూజెర్సీలో తెలంగాణ ఉద్యమ నేత కడియం రాజుకు ఘనంగా నివాళులు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ డాక్టర్ కడియం రాజు గారి శ్రద్ధాంజలి సభ అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రంలో ఏబీవీపీ పూర్వ కార్యకర్తల మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ శ్రద్ధాంజలి కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు, ఏబీవీపీ పూర్వ విద్యార్థులు విలాస్ జంబుల, అమర్ జునూతుల, సంతోష్ మైకా, రాజేష్ రెడ్డి, సమరసింహా రెడ్డి బొక్క, కిరణ్, మధుసుధన్ రెడ్డి, ప్రదీప్ కట్ట, సుధీర్ గుత్తికొండ , సురేష్ సోమిశెట్టి, ప్రీతం , ప్రేమ్ కాట్రగడ్డ, పూర్వ కార్యకర్తలు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, స్వర్గీయ డా కడియం రాజన్న ఆత్మీయ మిత్రులు పెద్ద ఎత్తున హాజరై కడియం రాజన్న గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. బండి సంజయ్ కూడా గతంలో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్‌లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పని చేశారు. ఉస్మానియా పూర్వ విద్యార్థి, అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్ నాయకుడు ,తన ఉద్యమాల ద్వారా ఎందరికో ఆదర్శంగా నిలిచిన జాతీయ స్థాయి లీడర్, కడియం రాజు మాకు (విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ తుమ్మల ) సహచరుడు కావడం మా పూర్వ జన్మ సుకృతం. విలాస్ రెడ్డి జంబుల అనే వ్యక్తి ఈ రోజు అమెరికాలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు అంటే దానికి కారణం మనం అందరం ముద్దుగా పిలుచుకునే ఉస్మానియా దిక్సూచి కడియం రాజు అని సగర్వంగా చెబుతాను. ఒక సిద్ధాంతం కోసం , తనని నమ్ముకున్న వారి కోసం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టైనా పోరాడే యోధుడితో కలిసి చదివే అవకాశం వచ్చినందుకు, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. దేశ భక్తి , సేవాభావం ,ఉద్యమస్ఫూర్తి ,నాయకత్వ లక్షణాలు, పోరాడేతత్వం ఇవన్నీ కలగలిపిన ఆదర్శ వ్యక్తి కడియం రాజు. అసలు ఎవరు ఈ "రారాజు", అయన గురించి, ప్రజలను చైతన్య పరిచిన అయన విధానాలు గురించి, ఒక్క మాటలో చెప్పాలంటే అయన ప్రయాణం గురించి మా మాటల్లో.....,కాదు కాదు ,మాలాగా అభిమానించే ఎంతోమంది కోసం ఆయన ప్రయాణం గురించి వారి మాటల్లో దేశాన్ని ప్రేమించే జాతీయ భావాలు కలిగిన విద్యార్థి.. ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన ఉద్యమ నేత.. సమాజాన్ని ప్రేమించే నవతరం నాయకుడు.. ఎంతో భవిష్యత్ ఉన్న ఆ డైనమిక్ లీడర్‌ను విధి కాటేసింది.. సమాజం చిన్నబోయేలా ఒక నాయకుడిని కోల్పోయింది.. ప్రజల కోసం ఆయన చేసిన ఉద్యమాలను ఆయన ఆదర్శ వ్యక్తిత్వం గుర్తు తెచ్చుకుని తల్లడిల్లుతున్నారు ఎంతో మంది.. ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ చరిత్రలో 108 రోజుల జైలు జీవితం గడిపి, అన్న, బాబాయ్, మామగా విద్యార్థులచే ముద్దుగా పిలుచుకునే ఉస్మానియా యూనివర్సిటీ దిక్సూచి డాక్టర్ కడియం రాజు ఇటీవల మార్చి 20న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన నల్లగొండ జిల్లాలోని కొత్తగూడెం గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. తన పాఠశాల విద్య కొండ్రపోల్ గ్రామంలో, ఇంటర్ నాగార్జున జూనియర్ కళాశాల, మిర్యాలగూడ కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తిచేశారు. పేదరికం వెక్కిరిస్తున్నా ఆ తర్వాత ఎంఏ హిస్టరీ విభాగంలో ఎంఫిల్, పీహెచ్డీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేశారు. ఆయనకు ఇంటర్ నుంచే దేశభక్తి, జాతీయ భావాలు కలిగిన విద్యార్థిగా ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ డిగ్రీలో కళాశాల ఎబీవీపీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2002 సంవత్సరం నుండి ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ సైద్ధాంతిక పోరులో ముందుండి క్రియాశీలకంగా పనిచేశారు. ఏబీవీపీ చేపట్టిన ఎన్నో విద్యారంగ సమస్యలపై ముందుండి పోరాడి, ఎన్నో లాఠీ దెబ్బలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి 108 రోజులు జైలు పాలయ్యారు. కుట్రలను, అవినీతిని సహించని వ్యక్తిత్వం ఆయనది. ఏబీవీపీ చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ భూముల పరిరక్షణ ఉద్యమంలో ముందుండి, అనేక ఆక్రమణ భూముల విషయంలో కోర్టులలో కేసులు వేశారు, నిరుద్యోగం, విద్యారంగ సమస్యలు మెస్ బిల్లులు, స్కాలర్షిప్పులు, మౌలిక వసతులు, నూతన హాస్టళ్ల నిర్మాణం కోసం పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఏబీవీపీలో డాక్టర్ కడియం రాజు తన సుదీర్ఘ ప్రయాణంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంచార్జ్‌గా, సిటీ సెక్రెటరీగా, స్టేట్ సెక్రెటరీగా, నేషనల్ సెక్రెటరీగా, సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా అనేక విద్యార్థి ఉద్యమాలకు నేతృత్వం వహించారు. అలాగే జాతీయ ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల విద్యా నియంత్రణ కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో సైతం ఏబీవీపీ చేపట్టిన అనేక ఉద్యమాలను ముందుండి నడిపించారు. ఏబీవీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన లక్ష మందితో ‘తెలంగాణ రణభేరి’లో సుష్మాస్వరాజ్ ఆహ్వానించిన సభకు సభాధ్యక్షత వహించారు. అలాగే ఏబీవీపీ తెలంగాణ సాధనకై మహా పాదయాత్రలో కోదాడ నుండి హైదరాబాద్ వరకు నేతృత్వం వహించారు. నా రక్తం- నా తెలంగాణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరాహార దీక్షలు... ఇలా తెలంగాణ సాధనలో అనేక ఉద్యమాలలో క్రియాశీలకంగా పోరాడారు. జాతీయ భావాలు కలిగిన దేశభక్తుడిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన డాక్టర్ కడియం రాజు మరణం విద్యార్థి లోకానికి, దేశానికి తీరని లోటు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల కోసం ఆయన చేసిన ఉద్యమాలను ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం, మరెంతో మందికి స్పూర్తి. (చదవండి: అమెరికాలో తెలుగు భాషకున్న స్థానం అంత ఇంత కాదు!: డా ప్రసాద్ తోటకూర) -
ఐటీ అమెరికా నిర్వహించిన ఆత్మీయ సదస్సులో బండి సంజయ్!
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అగ్రరాజ్యంలోని పలు నగరాల్లో నిర్వహిస్తున్న ఆత్మీయ సదస్సుల్లో ఆయన పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఎడిసన్‌లో ఐటీ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొని, ప్రసంగించారు. ఐటీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు బండి సంజయ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. మోదీ పాలనలో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఎన్నారైలను సంజయ్ కోరారు. ఇక అమెరికాలోని పలు నగరాల్లో జరుగుతున్న ఆత్మీయ సమావేశాల పట్ల బండి సంజయ్ స్సందించారు. ఈ సమావేశాలకు హాజరుకావటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: అమెరికాలో తెలుగు భాషకున్న స్థానం అంత ఇంత కాదు!: డా ప్రసాద్ తోటకూర) -
న్యూజెర్సీలో సామూహిక వరలక్ష్మి కుంకుమార్చన
-
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! అమెరికా బతుకమ్మ ఉయ్యాలో!!
‘‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ... ఏమేమి కాయొప్పునే గౌరమ్మ! తంగేడు పువ్వులో... తంగేడు కాయలో... ఆట చిలుకలు రెండు... పాట చిలుకలు రెండు...’’ ‘‘చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన...’’ ‘‘ఇలా ఒకటా... రెండా... లెక్కలేనన్ని బతుకమ్మ పాటలు మా నాలుకల మీద నాట్యమాడుతుంటాయి. గ్రామాల్లో గడిచిన బాల్యం జీవితాన్ని నేర్పుతుంది. తెలంగాణ గ్రామాల్లో బాల్యం బతుకమ్మ పాటల రూపంలో సమాజంలో జీవించడాన్ని నేర్పుతుంది. నిరక్షరాస్యులు కూడా ఈ పాటలను లయబద్ధంగా పాడతారు. బతుకమ్మ పాటల సాహిత్యం వాళ్ల నాలుకల మీద ఒదిగిపోయింది. తమకు తెలిసిన చిన్న చిన్న పదాలతో జీవితాన్ని అల్లేశారు గ్రామీణ మహిళలు. మా నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్. మా అమ్మమ్మ గారి ఊరు జగిత్యాల జిల్లా, వెలుగుమాట్ల. నా చదువు పుట్టపర్తిలో, సెలవులు అమ్మమ్మ ఊరిలో. దసరా సెలవులు వస్తున్నాయంటే సంతోషం అంతా ఇంతా కాదు. దేశమంతా దేవీ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటే మేము బతుకమ్మ వేడుకలు చేసుకుంటాం. గౌరమ్మ అందరి మనసుల్లో కొలువుంటుంది, మాట, పాట, ఆట అన్నీ గౌరమ్మ కోసమే అన్నట్లు ఉంటుందీ వేడుక. ఇంత గొప్ప వేడుకకు దూరమయ్యానని అమెరికా వెళ్లిన తర్వాత కానీ తెలియలేదు. అందుకే అమెరికాలో బతుకమ్మను పేర్చాను’’ అన్నారు దీప్తి మామిడి... కాదు, కాదు, బతుకమ్మ దీప్తి. ‘‘నేను 2007లో యూఎస్‌కి వెళ్లాను. న్యూజెర్సీలో ఉండేవాళ్లం. పెళ్లయి, ఒక బిడ్డకు తల్లిని. భర్త, పాప, ప్రొఫెషన్‌తో రోజులు బిజీగా గడిచిపోయేవి. డబ్బు కూడా బాగా కనిపించేది. కొద్ది నెలల్లోనే... ఏదో మిస్సవుతున్నామనే బెంగ మొదలైంది. వ్యాక్యూమ్ ఏమిటనేది స్పష్టంగా తెలియలేదు, కానీ బాల్యం, సెలవుల్లో బతుకమ్మ వేడుక మరీ మరీ గుర్తుకు వస్తుండేది. బతుకమ్మ కోసం ఇండియాకి రావడం కుదరకపోతే నేనున్న చోటే బతుకమ్మ వేడుక చేసుకోవచ్చు కదా! అనిపించింది. అలా అక్కడున్న తెలుగువాళ్లను ఆహ్వానించి బతుకమ్మ వేడుక చేశాను. మొదటి ఏడాది పదిహేను మందికి లోపే... పదేళ్లు దాటేసరికి ఆ నంబరు ఐదారు వందలకు చేరింది. అందరికీ భోజనాలు మా ఇంట్లోనే. ఏటా ఒక పెళ్లి చేసినట్లు ఉండేది. ఇండియా నుంచి తెలంగాణ పిండివంటలను తెప్పించుకోవడం, ఆ రోజు వండుకోవాల్సినవన్నీ మా ఇంట్లోనే వండడం, ఆ వంటల కోసం దినుసులను సేకరించడం, స్నేహితులందరినీ ఆహ్వానించడం, పూలు తెచ్చుకుని ఒక్కొక్కటీ పేర్చడం... ఇలా ప్రతి ఘట్టాన్నీ ఎంజాయ్ చేసేదాన్ని. ‘ఏటా అంతంత ఖర్చు ఎందుకు’ అని స్నేహితులు అనేవాళ్లే కానీ మా వారు ఒక్కసారి కూడా అడగలేదు. నా సంతోషం కోసం చేసుకుంటున్న ఖర్చు అని అర్థం చేసుకునేవారు. ఎప్పుడూ అన్నం ఉంటుంది! యూఎస్‌లో మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడూ అన్నం, కూరలుండేవి. మా కన్సల్టెన్సీకి వచ్చిన వాళ్లు, ముఖ్యంగా బ్యాచిలర్స్ కోసం ఈ ఏర్పాటు. మేము యూఎస్‌లో అడుగుపెట్టిన కొన్నాళ్లకే రెసిషన్ వచ్చింది. అప్పుడు పడిన ఇబ్బందులు నాకిప్పటికీ గుర్తే. అందుకే యూఎస్‌కి వచ్చిన కుర్రాళ్లు మన తెలుగింటి రుచులతో భోజనం చేస్తారు కదా! అనుకునేదాన్ని. షడ్రసోపేతమైన భోజనం అని కాదు కానీ కనీసం పప్పుచారయినా ఉండేది. ఈ అలవాటుకు బీజం పడింది కూడా అమ్మమ్మ దగ్గరే. అమ్మమ్మ పెద్ద పాత్రలో అంబలి చేయించి ఇంటి ముందు పెట్టేది. చాలామంది పొలం పనులకు వెళ్తూ దారిలో మా ఇంటి ముందాగి అంబలి తాగి, ఆవకాయ ముక్క చప్పరించుకుంటూ వెళ్లేవాళ్లు. ఆకలి తీర్చడంలో, అవసరమైన వాళ్లకు సహాయం చేయడంలో ఉండే సంతృప్తి మరి దేనిలోనూ ఉండదు. మా డ్రైవర్ ఇతర పనివాళ్ల పిల్లల చదువు కోసం ఫీజులు కట్టినప్పుడు మరొకరి జీవితానికి మనవంతు సహాయం చేస్తున్నామనే భావన సంతృప్తినిస్తుంది. అవకాశం లేనప్పుడు ఎలాగూ చేయలేం, వెసులుబాటు ఉన్నప్పుడయినా చేసి తీరాలి. మన ఎదుగుదల కోసం సమాజం నుంచి మనం తీసుకుంటాం, మనం ఎదిగిన తరవాత మరొకరి ఎదుగుదల కోసం ఆపన్న హస్తాన్ని అందించి తీరాలనేది పుట్టపర్తి స్కూల్ నేర్పించిన వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. మా అమ్మ ఫ్రెండ్ లీలా ఆంటీ కూడా బతుకమ్మ పండుగను బాగా చేసేవారు. ఆమె ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్. గునుగుపూలు వాటర్బాడీస్ని శుద్ధి చేస్తాయని చెప్తూ ఈ పండుగ వెనుక ఉన్న పర్యావరణ పరిరక్షణను వివరించేవారు. ఇవన్నీ మైండ్‌లో ఒక్కటొక్కటిగా అల్లుకుంటూ ఇలా దండ కూర్చుకున్నాయి. బతుకమ్మ దీప్తినయ్యాను! యూఎస్ జీవితం నాకు చాలా నేర్పించిందనే చెప్పాలి. అక్కడ అన్నీ ఉంటాయి కానీ ఏదో లేదనే వెలితి. రొటీన్ లైఫ్‌ని జాయ్‌ఫుల్‌గా మలుచుకోవడానికి నాకు బతుకమ్మ ఒక దారి చూపించింది. అప్పట్లో యూఎస్ ఇంతగా ఇండియనైజ్ కాలేదు. ఇప్పుడైతే న్యూజెర్సీ, డాలస్తోపాటు కొన్ని నగరాలు పూర్తిగా భారతీయలవే అన్నట్లు, తెలుగువాళ్ల ఊళ్లే అన్నట్లయిపోయాయి. మన పండుగలు ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. నేను మొదలుపెట్టడంతో నేను బతుకమ్మ దీప్తినయ్యాను. ‘దీప్తి మామిడి’గా అమెరికాలో అడుగుపెట్టాను. మూడేళ్ల కిందట తిరిగి వచ్చేటప్పటికి నా పేరు ‘బతుకమ్మ దీప్తి’గా మారింది. బతుకమ్మ పాటకు మ్యూజిక్ మొదలైతే చాలు... ఒళ్లు పులకించిపోతుంది. పూనకం వచ్చినట్లే ఉంటుంది. మీతో మాట్లాడుతున్నా సరే... బతుకమ్మ ఫీల్ వచ్చేస్తుంది. చూడండి గూజ్బంప్స్ వచ్చేశాయి’’ అని చేతులను చూపించారు బతుకమ్మ దీప్తి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
న్యూజెర్సీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
అమెరికాలోని న్యూజెర్సీలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇండియా డే పరేడ్ నిర్వహించారు. ఓక్ ట్రీ రోడ్ లోని ఎడిసన్ టు ఇసేలిన్ ఏరియాలో ఇండియా డే పరేడ్ వైభవంగా కొనసాగింది. ఈ వేడుకలకు గ్రాండ్ మార్షల్‌గా ప్రముఖ నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హాజరయ్యారు. తమన్నా ఇటువంటి పరేడ్ కార్యక్రమంలో పాల్గొనడం తొలిసారి కావడం విశేషం. ఇక న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై.. శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా పరేడ్ డే కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని ప్రవాస భారతీయులంతా న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్ కు చేరుకున్నారు. మువ్వన్నెల జెండాను చేతబూని వందేమాతరం, భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు. పలువురు చిన్నారులు భారతమాత వేషాధరణలో.. స్వాత్రంత్య యోధుల గెటప్పులలో ఆకట్టుకున్నారు. ఒకరికొకరు స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పరేడ్ లో భాగంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు శకటాలను ప్రదర్శించారు. భారీ జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఇక న్యూజెర్సీ ప్రాంతం మినీ ఇండియాగా మారిందా అనేలా అక్కడి వాతావరణం కనిపించింది. న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్ లో జరిగిన ఇండియా డే పరేడ్ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులతో పాటు ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: -
సురేఖవాణి కూతురు బర్త్‌డే.. పబ్‌లో డ్యాన్స్ చేస్తూ!
నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన ఆమె ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో నటించకపోయినప్పటికీ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అలరిస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. విదేశాల్లో ఎక్కడికెళ్లినా కూడా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తూ ఉంటోంది. (ఇది చదవండి: అనాథలా రేకుల షెడ్డులో దుర్భర జీవితం గడిపిన స్టార్ హీరోయిన్!) ఇకపోతే సురేఖవాణి, తన కూతురు సుప్రీత కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టిపొట్టి బట్టలతో గ్లామర్ ఫోటోలను తరచూ షేర్ చేస్తుంటారు. పార్టీలు, పబ్స్, వెకేషన్స్‌కు అంటూ తల్లీ,కూతుళ్లు కలిసే తిరుగుతూ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు. ఇటీవలే అమెరికాలో ఈ తల్లీకూతుళ్లు సందడి చేసిన సంగతి తెలిసిందే. న్యూజెర్సీ వీధుల్లో సుప్రిత, సురేఖా వాణి హల్ చల్ చేశారు. తాజాగా తన కూతురు సుప్రిత బర్త్ డే సందర్భంగా సురేఖ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. న్యూజెర్సీలోని వీధుల్లో తండ్రితో సుప్రిత ఉన్న ఫోటోను ఓ బిల్డింగ్‌పై ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. ఇక ఆ ఫోటోను చూసిన సుప్రిత తీవ్ర భావోద్వేగానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియోను సురేఖా వాణి తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: హాలీవుడ్ స్టార్స్‌కి తెలుగు నేర్పిన ఆలియా!) అంతే కాకుండా సుప్రిత తన బర్త్ డే సందర్భంగా పబ్బులో ఫ్రెండ్స్‌తో కలిసిసెలెబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్సులు చేస్తూ హంగామా చేసింది. మొత్తానికి సుప్రిత బర్త్ డే వేడుకల్లో పబ్బులో సందడి చేస్తూ ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలను సుప్రిత తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) -
అమెరికా అధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున మరో భారతీయుడు
వాషింగ్టన్: 2024లో జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా మరో భారతీయుడు ఎంట్రీ ఇచ్చారు. ఇండో అమెరికన్ ఇంజినీర్ అయిన హిర్ష్ వర్ధన్ సింగ్(38) ఈ మేరకు మూడు నిముషాల నిడివి ఉన్న ఒక వీడియో సందేశం ద్వారా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. హిర్ష్ వర్ధన్ సింగ్ కంటే ముందు రిపబ్లికన్ పార్టీ తరపున సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హాలీ(51), మిలియనీర్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(37) అమెరికా అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా హిర్ష్ వర్ధన్ సింగ్ ఈ రేసులో నిలిచిన మూడో భారతీయ సంతతి వారిగా నిలిచారు. వీడియో సందేశంలో సింగ్ మాట్లాడుతూ.. నేను జీవితకాలం రిపబ్లికన్ గా ఉంటానని, న్యూ జెర్సీ రిపబ్లికన్ పార్టీ కన్జర్వేటివ్ విభాగాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించిన మొట్టమొదటి అమెరికన్ ను నేనేనన్నారు.. గత కొన్నేళ్లుగా వచ్చిన మార్పులను యధాస్థితికి తీసుకొచ్చి అమెరికా విలువలను కాపాడేందుకు బలమైన నాయకత్వం అవసరముందన్నారు. నాది స్వచ్ఛమైన రక్తం.. కోవిడ్ సమయంలో కూడా ఎటువంటి వ్యాక్సినేషన్ల జోలికి వెళ్ళలేదని.. అందుకే నేను రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష రేసులో నిలవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ మేరకు గురువారమే ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ లో తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు హిర్ష్ వర్ధన్ సింగ్. హిర్ష్ వర్ధన్ సింగ్ గతంలో న్యూజెర్సీ తరపున 2017,2021లో గవర్నర్ గాను, 2018లో హౌస్ సీటు కోసం, 2020లో సెనేటర్ గాను ప్రయత్నించారు. కానీ రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కించుకోవడంలో విఫలమయ్యారు. ఇటీవలి కాలంలో కూడా గవర్నర్ గా క్యాంపెయిన్ చేస్తూ డోనాల్డ్ ట్రంప్ తో పోటీపడ్డారు. కానీ నామినేషన్లలో మూడో స్థానంలో నిలిచారు. మొత్తంగా రిపబ్లికన్ పార్టీ తరపున ఈసారి ముగ్గురు భారత సంతతి వారు అధ్యక్ష పదవి కోసం నామినేషన్లలో పోటీ పడుతున్నారు. ఇదే పార్టీ తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో డోనాల్డ్ ట్రంప్ మొదటి వరుసలో ఉన్నారు. కానీ ఆయనపై నేర అభియోగాలున్న నేపథ్యంలో తర్వాతి వరుస వారిని అదృష్టం వరించినా వరించొచ్చు. అధ్యక్షుడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు వచ్చే ఏడాది జులై 15-18 వరకు మిల్వాకీ, విస్కాన్సిన్ లో రిపబ్లికన్లు సమావేశం కానున్నారు. I'm entering the race for President.https://t.co/OEHCSYOdvK pic.twitter.com/RyxW4sKMSW — Hirsh Vardhan Singh (@HirshSingh) July 27, 2023 ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు -
జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్.. ఇంతలా మారిపోయిందేంటి?
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా మీకు గుర్తుందా?. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో అంకిత, భూమిక హీరోయిన్లుగా నటించారు. కేరళలో నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా టాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా లిస్ట్‌లో చేరింది. అయితే కొన్ని చిత్రంలో తన అందమైన కళ్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది హీరోయిన్ అంకిత. 'చీమ చీమ చీమ చీమ' అంటూ సాగే సాంగ్‌లో ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్‌తో అదరగొట్టింది. (ఇది చదవండి: 'వాటిని కూడా తీసుకోవాల్సిందే'.. తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) సింహాద్రి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న భామ.. ఆ తర్వాత చేసిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. విజయేంద్రవర్మ, లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మీ ఐ లవ్ యూ, రారాజు, మనసు మాట వినదు లాంటి చిత్రాల్లోనూ కనిపించింది. అయితే కొద్ది సినిమాలకే పరిమితమైన అంకిత 2016లో విశాల్ జగతాప్ అనే వ్యక్తిని పెళ్లాడింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటించిన అంకిత ఇప్పుడేం చేస్తోంది? ఎలా ఉందో తెలుసుకుందాం. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన అంకిత ప్రస్తుతం అమెరికాలో న్యూ జెర్సీలో స్థిరపడింది. దాదాపు అర ఎకరం స్థలంలో నిర్మించుకున్న అందమైన ఇంట్లో నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు సంతానం కాగా.. అంకిత భర్త విశాల్ అమెరికాలోని సిటీ బ్యాంక్ లో పని చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే!) -
WTC Final: కొత్త జెర్సీలో మెరిసిపోతున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
విషాదం: న్యూజెర్సీలో తెలుగు విద్యార్థి సజీవదహనం
ఖలీల్‌వాడి (నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా యువకుడు అమెరికాలో జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. భీంగల్ మండలం బడాభీంగల్‌కు చెందిన గుర్రపు శైలేశ్.. అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. వివరాల ప్రకారం.. న్యూజెర్సీలో శైలేశ్ కారులో వెళుతుండగా మరో కారును ఢీకొన్నట్టు తెలిసింది. ఈ ఘటనలో కారుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని.. శైలేశ్ కారులోనే చిక్కుకుని మృతి చెందినట్టు సమాచారం. శైలేశ్ న్యూజెర్సీలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లో మాస్టర్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చదువుతున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. శైలేశ్ ఇంజినీరింగ్ చదివేందుకు గతేడాది సెప్టెంబర్ నెలలో అమెరికాకు వెళ్లాడు. కాగా.. శైలేష్ తండ్రి సత్యం కొన్నేళ్ల కిందట గల్ఫ్ వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. తల్లి గృహిణిగా ఉన్నారు. శైలేష్ కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వారిద్దరూ ఇప్పుడు ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ కన్నుమూత -
టీమ్ ఇండియాకు కొత్త జెర్సీ...అడిడాస్ కు 350 కోట్ల కాంట్రాక్టు..!
-
అరుదైన అంతరిక్ష శిల అరుదెంచె..
న్యూజెర్సీ: సువిశాలమైన అంతరిక్షంలో వింతలు విడ్డూరాలకు అంతు లేదు. మనకు తెలియని ఎన్నెన్నో విశేషాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇతర గ్రహాల నుంచి విడిపోయిన శిలలు సుదీర్ఘంగా ప్రయాణం సాగించి మన భూగోళంపై పడుతుంటాయి. ఇలాంటి శిలల వల్ల భూమిపై భారీ గోతుల్లాంటివి ఏర్పడుతుంటాయి. అత్యంత అరుదైన కాన్‌డ్రైట్ అంతరిక్ష శిల(గ్రహ శకలం) అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఓ ఇంటి పై అంతస్తులోని పైకప్పును చీల్చుకొని పడక గదిలోకి దూసుకొచ్చింది. న్యూజెర్సీ రాజధాని ట్రెంటాన్‌కు ఉత్తరాన ఉన్న హోప్వెల్ టౌన్షిప్లో ఇటీవలే మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ శిల వేగానికి పడక గదిలోని కలప గచ్చు కొంత ధ్వంసమయ్యింది. ఎవరో ఆకతాయిలు రాయి విసిరారని భావించిన ఆ ఇంటి యజమాని సుజీ కాప్ దాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలించగా వేడిగా తగిలి చురుక్కుంది. అదొకలోహాన్ని పోలి ఉండడంతో ప్రభుత్వ అధికారులకు సమాచారం చేరవేశారు. అధికారుల సూచన మేరకు ‘ద కాలేజ్ ఆఫ్ న్యూజెర్సీ’ సైంటిస్టులు రంగంలోకి దిగి, ఆ శిలను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌తో క్షుణ్నంగా పరిశీలించారు. అది కాన్‌డ్రైట్ అంతరిక్ష శిలగా నిర్ధారించారు. బంగాళదుంప పరిమాణంలో 6/4 అంగుళాలు, 2.2 పౌండ్ల (దాదాపు ఒక కిలో) బరువు ఉన్నట్లు సైంటిస్టులు చెప్పారు. ఇలాంటి గ్రహశకలం గతంలో భూమిపై పడిన దాఖలాలు పెద్దగా లేవని తెలిపారు. అరుదైన గ్రహ శకలాన్ని పరీక్షించడం అద్భుతమైన అవకాశమని ద కాలేజ్ ఆఫ్ న్యూజెర్సీ ఫిజిక్స్ డిపార్టుమెంట్ చైర్మన్ నాథన్ మ్యాగీ చెప్పారు. ఈ శిలపై అధ్యయనం ద్వారా ఫిజిక్స్ ప్రొఫెసర్లు, విద్యార్థులు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చని వెల్లడించారు. -
109 ఏళ్లలోనూ మిస్టర్ పర్ఫెక్ట్..‘వావ్ తాత, ఏం ఆ ఎనర్జీ’
మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ ఎంత ఫిట్‌గా ఉంటాడో, అంతే ఫిట్‌గా ఉంటాడు ఈ శత వృద్ధుడు. పేరు విన్సెంట్ డ్రాన్స్ఫీల్ట్. అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటాడితను. చూడటానికి అరవై, డెభై ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడు. కానీ, నిజానికి ఇతని వయసు 109 సంవత్సరాలు. ఇప్పటికీ కారు నడుపుతాడు. కళ్లజోడు లేకుండానే న్యూస్ పేపర్ చదువుతాడు. చేతికర్ర లేకుండానే ట్రాఫిక్‌లో వెళ్లి ఇంటికి అవసరమైన వస్తువులు, సరుకులు తీసుకొస్తాడు. తన వ్యక్తిగత పనులన్నీ తానే స్వయంగా చేసుకుంటాడు. అప్పుడప్పుడు ఇంటి పనుల్లోనూ సహాయం చేస్తుంటాడు. ఈ వయసులోనూ ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏమిటని అడగ్గా.. విన్స్ ఏడుగురు మనవరాళ్లలో ఒకరు ఇలా అన్నారు: ‘విన్స్ 21 ఏళ్ల వయసులో అగ్నిమాపక సహాయ కేంద్రంలో ఉద్యోగంలో చేరి, ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. దాదాపు 80 యేళ్ల పాటు అదే ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడాడు. వారి దీవెనలే అతన్ని ఆరోగ్యంగా ఉంచాయి’. ఇదే విషయాన్ని అతని ఒక్కగానొక్క కూతురు, ముగ్గురు మనవళ్లు, ఏడుగురు మనవరాళ్లు కూడా న మ్ముతున్నారు. విన్స్ మాత్రం తన ఆరోగ్య రహస్యం రోజూ ఒక గ్లాసు పాలు తాగడం, శరీరాన్ని నిరంతరం కదిలించడమే అని అంటున్నాడు. చదవండి: చెరువులో వింత జీవి.. వామ్మో ఇరవై నాలుగు కళ్లు.. -
Shruthi Nanduri: నండూరి ఇంటి అమ్మాయి నోట ఎంకిపాట
నండూరి ఎంకిపాటల సొగసుదనం.. ఆ పదాల మాధుర్యం ఈ తెలుగు నేలకు సుపరిచయమే. ముత్తాత రాసిన పాటలను తన నోట ఆలపించడానికి అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చింది మునిమనమరాలు శృతి. మెడిసిన్ చదువుకుంటూనే శాస్త్రీయ సంగీత సాధన చేస్తోంది. సంగీతకార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శృతి నండూరిని పలకరిస్తే ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచింది. ‘‘అమ్మ లక్ష్మి, నాన్న సుధాకర్ నండూరి ఇద్దరూ ముప్పై ఏళ్లుగా న్యూజెర్సీలోనే ఉంటున్నారు. నేను అక్కడే పుట్టి పెరిగాను. కర్ణాటక సంగీతం ఐదేళ్ల వయసు నుంచే నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం కూడా గురువుల దగ్గరే శిక్షణ తీసుకున్నాను. సంగీతానికి సంబంధించిన వీడియోలు చేస్తుంటాను. న్యూజెర్సీలో చాలా చోట్ల ప్రదర్శనలు కూడా ఇచ్చాను. అమెరికాలో తెలుగు మహాసభలు జరిగినప్పుడు వెళుతుంటాను. ఆ విధంగా ఇండియా నుంచి వచ్చే సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు పరిచయం అయ్యారు. వాళ్లతో కలిసి స్టేజ్ షోలలో పాల్గొన్నాను. అక్కడ నా ఇంటిపేరులో నండూరి ఉండటంతో ‘నండూరి వారి అమ్మాయంట’ అని చెప్పుకునేవారు. నాతో నేరుగా ‘మీ ముత్తాత గారి గురించి తెలుసా!’ అని అడిగేవారు. దీంతో ‘నండూరి గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు ఏంటి’ అని అమ్మనాన్నలను అడిగాను. అప్పుడు తెలిసింది ముత్తాతగారి గురించి, ఆ పేరులోని ప్రత్యేకత గురించి. అప్పటి నుంచి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మా పెదనాన్న, మామయ్య, బంధువులను అడుగుతుంటాను. నాన్నను కూడా ఇంకా సమాచారం తెలుసుకొని చెప్పమని వేధిస్తుంటాను. ► ఒక్కో పదాన్ని పలుకుతూ.. అమ్మ వైపు కళాకారులు ఉన్నారు కాని నాన్నవైపు మా ముత్తాత నండూరి సుబ్బారావుగారి తర్వాత ఆర్ట్స్‌లో ఎవరూ లేరు. ఆయన రైటింగ్ గురించి గొప్పగా చెబుతుంటారు. కానీ, తాతగారి గురించి తెలిసిన విషయాలు అంతగా చెప్పేవారు లేరు. నాన్న ద్వారా కొద్దిగా విని ఉన్నాను. సంగీతం నేర్చుకుంటూ, చదువుకుంటూ నా ధ్యాసలో నేనుండిపోయాను. ఆయన పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి. అయితే, నాకు తెలుగు రాయడం, చదవడం రాదు. ఆయన ప్రత్యేకత తెలిశాక నాన్నను కూర్చోబెట్టి ఆ బుక్స్‌లోని ఒక్కో పదాన్ని పలుకుతూ, అర్థం తెలుసుకుంటూ ఉండేదాన్ని. కొన్ని రోజుల పాటు ఇదే పనిలో ఉన్నాను. చాలా అద్భుతం అనిపించింది. ► ఎంకిపాట నా నోట ఎంకి పాటల లిరిక్స్ తీసుకొని, కొత్తగా కంపోజ్ చేసి, నేనే పాడాలని నిశ్చయించుకున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం కొందరు మ్యూజిక్ డైరెక్టర్లను కూడా కలిశాను. అదే సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీపట్నాయక్ గారు ఇదే ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలిసింది. ఒకేసారి మా ఇద్దరిలో ఇలాంటి ఆలోచన రావడం నాకే వింతగా అనిపించింది. ‘ఎంకిపాటల్లో నుంచి కొన్ని లైన్స్ పాడమని అడిగారు. నేను పాడడంతో ‘నీ వాయిస్ ఈ పాటలకు చాలా బాగా సూటవుతుంది’ అని ఆ ప్రాజెక్ట్‌లో సింగర్‌గా నాకే అవకాశం ఇచ్చారు. ఆ విధంగా ఎంకిపాటలు నా నోట పాడించారు. ‘‘నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు మొన్నెతిరిగొస్తనన్నాడే...’’ ఎంకిపాట ఆర్పీనోట అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో పాడాను. ఆ పదాలను వింటూ అర్థం చేసుకుంటూ వాటికి తగిన న్యాయం చేయాలనుకున్నాను. ► చదువు.. సంగీతం అమెరికాలో మెడిసిన్ చేస్తున్నాను. ఫిజికల్ మెడిసిన్‌లో రిహాబిలిటేషన్ అనేది నా స్పెషలైజేషన్. బ్రెయిన్ ఇంజ్యూరీ, స్పోర్ట్స్ మెడిసిన్.. వంటి వాటిలో మ్యూజిక్ థెరపీ కొంత ఫిట్ అవుతుంది. అందుకే ఈ రెండింటీని బ్యాలెన్స్ చేస్తున్నాను. నా బ్రాండ్, డ్రీమ్, లైఫ్ గోల్ అదే. రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు.. అని కొందరు అడుగుతుంటారు. బెస్ట్ డాక్టర్ని, అలాగే బెస్ట్ సింగర్‌ని కూడా అవ్వాలనేది నా డ్రీమ్. అందుకు ఎంత రిస్క్ అయినా చేస్తానని చెబుతుంటాను. ► మా ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తుంటాను మా ఫ్రెండ్స్ అంతా తెలుగురానివారే. వాళ్లకు మా ముత్తాతగారి గురించి ఎంతసేపు చెప్పినా చాలా ఆసక్తిగా వింటారు. ఇంకా విషయాలు అడుగుతారు. నేను ఎంకిపాటలు పాడి, ఆడియో క్లిప్పింగ్స్ మా ఫ్రెండ్స్‌కు పంపిస్తుంటాను. ఆప్పటి పాటలన్నీ విలేజీ స్టైల్ అవడంతో ఒక్కసారిగా ఆ టైమ్ పీరియడ్ నుంచి ఈ పీరియడ్‌కు ఏదో కలిసిపోయిన ఫీల్ కలుగుతుంది. ఒక్కోసారి నైన్టీన్త్ సెంచరీ అమ్మాయినేమో అనిపిస్తుంటుంది(నవ్వుతూ). వెస్ట్రన్ మ్యూజిక్ షోస్ కూడా చేస్తుంటాను. నన్ను తెలుగువారు కూడా గుర్తించాలి. అందుకే, ఇంగ్లిషు, తెలుగు రెండూ కవర్ చేస్తూ ఉంటాను. తెలుగు సినిమాల పాటలన్నీ పాడుతుంటాను. నిద్రలేస్తూనే ఏదో పాటతో నా డే మొదలైపోతుంది. వెస్ట్రన్, కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నప్పుడే హిందీ, తెలుగు పాటలు పాడటం, స్పష్టంగా పదాలు పలకడం సాధన చేయడం అలవాటు చేసుకుంటూ వచ్చాను. ► గాయనిగా పేరు.. సింగర్‌గా బాగా గుర్తింపు తెచ్చుకోవాలని, మంచి మంచి పాటలు పాడాలనేది నా డ్రీమ్. అందుకోసం ఎంతదూరమైనా ప్రయాణిస్తాను. ఆ ప్రయత్నంలో ఎక్కడా ఆగకూడదు. అందుకే, ‘ఆహా వేదికగా జరిగే తెలుగు ఇండియన్ ఐడియల్ 2’ లో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చాను. ఇక్కడ ఎంతోమంది నుంచి నా వర్క్‌ని ఇంకా బెటర్ చేసుకుంటున్నాను. నేర్చుకోవాల్సింది చాలా ఉందని అర్ధమైంది. తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ప్రయాణించడమే’’ అంటూ నవ్వుతూ వివరించింది శృతి నండూరి. – నిర్మలారెడ్డి నండూరి వెంకట సుబ్బారావు రచయితగా తెలుగువారికి సుపరిచితులు. నండూరి రచించిన గేయ సంపుటి ‘ఎంకిపాటలు.’ తెలుగు సాహిత్యంలో ప్రణయ భావుకతకూ, పదాల పొందికకూ కొత్త అందాలు అద్దిన ఈ రచనను సాహిత్యకారులు గొప్పగా ప్రస్తావిస్తుంటారు. -
తానా కన్వెన్షన్ కిక్ ఆఫ్ మీటింగ్ కు అనూహ్య స్పందన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రతి రెండేళ్ళ ఒకసారి అంగరంగ వైభవంగా నిర్వహించే మహాసభలు ఈ ఏడాది జూలై 7,8,9 తేదీల్లో ఫిలడెల్ఫియాలోని కన్వెన్షన్ సెంటర్లో జరగనున్నాయి. ఈ మహాసభలకు ముందు జరిగే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా.. న్యూజెర్సీలో తానా కన్వెన్షన్ కిక్ ఆఫ్ మీటింగ్ జరిగింది. రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన కిక్ ఆఫ్ అండ్ ఫండ్ రైజింగ్ డిన్నర్ ఈవెంట్‌కి అనుహ్య స్పందన వచ్చింది. పెద్దలు, మహిళలు, పిల్లలతో ప్రాంగణం అంత కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ప్రదర్శించిన తానా సేవా కార్యక్రమాల వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగుతనం ఉట్టిపడేలా నిర్వాహకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమనికి హాజరై, గొప్ప ఔన్నత్యంతో విరాళలు అందించిన పలువురు దాతలకు పుష్ప గుచ్చాలతో వేదిక మీదకి స్వాగతం పలికి గౌరవ మర్యాదలతో శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విచ్చేసిన తానా సభ్యులు ఇటీవలే శివైక్యం చెందిన సుప్రసిద్ధ చిత్ర దర్శకులు పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్, శ్రీమతి జయలక్ష్మి గార్లకి, సినీనటుడు నందమూరి తారక రత్నకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. విరాళాల సేకరణకు ముందుగా తానా అధ్యక్షలు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ తానా ప్రస్థానం, నిర్వహించిన, నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు, ప్రవాస తెలుగువారు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి తానా భరోసాగా నిలిచిన పలు సందర్భాల గురించి అక్కడికి విచ్చేసిన తానా సభ్యులకు వివరించారు. 23వ తానా మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి మాట్లాడుతూ జులై 7,8,9 తేదిలలో జరగబోయే ప్రతిష్టాత్మక తానా మహాసభల యొక్క విశిష్టతను వివరిస్తూ, ఈ మహత్కార్యానికి ముందుకు వచ్చిన స్వచ్చంధ సేవకులకు, దాతలందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరై 23వ తానా మహాసభలకు వారి సంఫీుభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా మహాసభల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, కార్యదర్శి సతీష్ తుమ్మల, డైరెక్టర్ వంశీ కోట, అడ్వైజర్ మహేందర్ ముసుకు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ కూకట్ల, తానా ఫౌండేషన్ ట్రస్టీలు విద్యా గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి, సుమంత్ రామ్, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, కల్చరల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, తానా ప్రాంతీయ ప్రతినిధులు వంశి వాసిరెడ్డి, సునీల్ కోగంటి, శ్రీనివాస్ ఉయ్యురు, దిలీప్ ముసునూరు, తానా మహాసభల కల్చరల్ చైర్మన్స్వాతి అట్లూరి తదితరులు పాల్గొన్నారు. నాట్స్ కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతి మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ తదితర నాట్స్ కార్యవర్గ సభ్యులు, ఆటా బోర్డు అఫ్ డైరెక్టర్ విజయ్ కుందూరు, ఐటీ సర్వ్ అధ్యక్షులు వినయ్ మహాజన్, టిటిఏ డైరెక్టర్ శ్రీనివాస్ గనగోని తదితరులు అతిధులుగాహాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షులు మధు రాచకుళ్ల, సౌత్ జెర్సీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ కసిమహంతి, తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ డెలావేర్ వాలీ అధ్యక్షులు ముజీబుర్ రెహ్మాన్ తదితరులు పాల్గొని తానామహాసభలకు సంపూర్ణ మద్దతు తెలిపారు. -
న్యూజెర్సీలో ఆపి కన్వెన్షన్ లాంచ్ రెడ్ కార్పెట్ డిన్నర్ గాలా
అగ్రరాజ్యం అమెరికాలో ఎంతో సేవ చేస్తున్న అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ -ఆపి 41వ వార్షిక కన్వెన్షన్ ముహూర్తం ఖరారైంది. ఫిలడెల్ఫియాలో ఈ ఏడాది జులై 6 నుంచి 9వ తేదీ వరకు జరగనుంది. ఈ సందర్భంగా న్యూజెర్సీలో ఆపి కన్వెన్షన్ లాంచ్ రెడ్ కార్పెట్ డిన్నర్ గాలా జరిగింది. న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, బాలీవుడ్ ఐకాన్ భాగ్యశ్రీతో పాటు ఆపి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో, లైవ్ మ్యూజిక్ ఆహుతులను ఆకట్టుకుంది. ఫిలడెల్ఫియాలో జరిగే ఆపి 41వ కన్వెన్షన్‌కు అందరూ విచ్చేసి, విజయవంతం చేయాలని న్యూజెర్సీ స్టేట్ ఆపి ఫ్రెసిడెంట్ డాక్టర్ ప్రదీప్ షా కోరారు. కన్వెన్షన్ అద్భుతంగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆపి ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
IPL 2023: లక్నో కొత్త జెర్సీ.. మరీ ఇంత చెత్తగా ఉందేంటి? దీని కంటే..
LSG Latest Jersey For IPL 2023: ఐపీఎల్-2023 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు సరికొత్త జెర్సీలో దర్శనమివ్వనున్నారు. తమ అరంగేట్ర సీజన్లో లక్నో ఆటగాళ్లు టర్కోయిష్ బ్లూ గ్రీన్‌లో ఉన్న జెర్సీలు ధరించగా.. ఈసారి ముదురు నీలం రంగు జెర్సీలో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి ఫ్రాంఛైజీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. కొత్త రంగు.. కొంగొత్త ఆశలు ‘‘కొత్త రంగు.. నూతనోత్సాహం.. కొంగొత్త ఆశలు.. సరికొత్త శైలి’’తో ముందుకు వస్తున్నామంటూ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. నావీ బ్లూ షర్ట్‌పై ఎరుపు, ఆకుపచ్చ గీతలతో దీనిని రూపొందించారు. ఇక జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో లక్నో ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా, బీసీసీఐ కార్యదర్శి జై షా, లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, మెంటార్ గౌతమ గంభీర్ తదితరులు పాల్గొన్నారు. మరీ చెత్తగా ఉంది అయితే, అభిమానులకు మాత్రం ఈ జెర్సీ పెద్దగా నచ్చినట్లు కనిపించడం లేదు. సోషల్ మీడియా వేదికగా లక్నో జెర్సీ లుక్‌పై తమదైన శైలిలో సెటైర్లు పేలుస్తూ మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. ‘‘కొత్త జెర్సీ చూసిన తర్వాత పాత జెర్సీపై మమకారం పెరిగిపోయింది. ఎందుకంటే.. కొత్తది మరీ చెత్తగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమందేమో ఢిల్లీ క్యాపిటల్స్ పాత జెర్సీ(2013 నాటిది)తో పోలుస్తూ పెద్దగా తేడా ఏమీ లేదు కదా అంటూ డిజైనర్‌కు చురకలు అంటిస్తున్నారు. ఆరంభంలోనే ప్లే ఆఫ్స్ చేరింది.. కానీ ఐపీఎల్-2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన లక్నో సూపర్‌జెయింట్స్ 14 మ్యాచ్‌లకు గానూ తొమ్మిదింట గెలిచింది. ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించినప్పటికీ టైటిల్ రేసులో వెనుకబడింది రాహుల్ సేన. ఇక లక్నోతో పాటు ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ అరంగేట్ర సీజన్లోనే ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ జట్టు ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. చదవండి: BCCI: వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్! మరీ కోట్లలో వ్యత్యాసం.. తగునా? IPL 2023: కోహ్లికి ముచ్చెమటలు పట్టించిన బౌలర్‌ను తెచ్చుకోనున్న ముంబై ఇండియన్స్ 𝑵𝒂𝒚𝒂 𝑹𝒂𝒏𝒈, 𝑵𝒂𝒚𝒂 𝑱𝒐𝒔𝒉, 𝑵𝒂𝒚𝒊 𝑼𝒎𝒆𝒆𝒅, 𝑵𝒂𝒚𝒂 𝑨𝒏𝒅𝒂𝒂𝒛 👕💪#JerseyLaunch | #LucknowSuperGiants | #LSG pic.twitter.com/u3wu5LqnjN — Lucknow Super Giants (@LucknowIPL) March 7, 2023 -
ఉపేంద్ర చివుకుల ప్రజాసేవకు గుర్తింపు
అమెరికాలో తెలుగువాడైన ఉపేంద్ర చివుకులకు మరో అరుదైన గౌరవం లభించింది. న్యూజెర్సీలో గత కొన్నేళ్లుగా ఉపేంద్ర చివుకుల చేస్తున్న సేవలను గుర్తించిన న్యూజెర్సీ పరిపాలన విభాగం.. ఆయన సేవలను ప్రశంసింస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. న్యూజెర్సీ పబ్లిక్ యూటీలీటీస్ బోర్డు సమావేశంలో కమిషర్లు ఫియోర్డలిసో, హోల్డెన్, సోలమన్, గోర్డాన్, క్రిసోడౌలాలు... ఉపేంద్ర చివుకుల సేవలను గుర్తించి చేసిన తీర్మాన ప్రకటనను ఉపేంద్ర చివుకులకు అందించారు. పన్ను చెల్లింపుదారులు, రేట్ పేయర్స్ కోసం గత 25 సంవత్సరాలుగా ఉపేంద్ర చివుకుల చేసిన సేవలు మరువలేనివిగా వారు అభివర్ణించారు. చిత్తశుద్ధితో, సేవా దృక్పథంతో పనిచేసిన ఉపేంద్ర చివుకులకు కృతజ్ఞతలు తెలుపుతూ గవర్నర్ ఫిల్ మర్ఫీ కూడా ఓ ప్రశంస ప్రకటనను ఉపేంద్ర చివుకులకు అందించారు. -
పేరెంట్స్ కాబోతున్న 'గే' జంట.. ఎలా సాధ్యం?
న్యూజెర్సీ: అమిత్ షా, ఆదిత్య మదిరాజు. 2019లో అమెరికా న్యూజెర్సీ వేదికగా ఒక్కటైన ఈ స్వలింగ సంపర్కులు అప్పట్లో ఇంటర్నెట్లో ప్రకంపనలు సృష్టించారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంట గురించి అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు వీళ్లు చేసిన చేసిన ప్రకటన మరోసారి సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. తామిద్దరం పేరెంట్స్ కాబోతున్నామని అమిత్ షా, ఆదిత్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్వలింగ సంపర్కులైన వీళ్లు సహజంగా పేరెంట్స్ కావడం అసాధ్యం. అయితే ఓ మహిళ వీళ్లకు అండాన్ని దానం చేసింది. దీంతో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫర్టిలైజేషన్) పద్ధతిలో వీళ్లు ఓ బిడ్డకు పేరెంట్స్ కాబోతున్నారు. మే నెలలో తాము పేరెంట్స్ కాబోతుండటం ఎంతో సంతోషంగా ఉందని ఈ గే జంట ఆనందం వ్యక్తం చేసింది. అందరిలాగే తమకు కూడా ఓ బిడ్డ ఉంటుందని పేర్కొంది. తమను చూసి ఎంతో మంది స్వలింగ సంపర్కులు ధైర్యం చేసి ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారని, ఇప్పుడు వాళ్లు పిల్లలను కనే మార్గం కూడా ఉందని తాము నిరూపిస్తున్నామని అమిత్ షా, ఆదిత్య వివరించారు. 4 రౌండ్ల ఐవీఎఫ్ తర్వాత తాము పేరెంట్స్ కాబోతున్నామనే విషయం ఖరారైందని చెప్పారు. ఇకపై స్వలింగ సంపర్కులు కూడా పెళ్లి, పిల్లల విషయంపై ఆందోళన చెందకుండా సంతోషంగా అందరిలాగే సాధారణ జీవితాన్ని ఆస్వాదించవచ్చని ఈ గే జంట చెబుతోంది. అమిత్ షా గుజరాత్‌కు చెందిన వాడు. న్యూజెర్సీలో స్థిరపడ్డాడు. ఆదిత్య తెలుగు రాష్ట్రాలకు చెందినవాడు ఢిల్లీలో నివసించేవాడు. 2016లో ఓ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ పరిచయమయ్యారు. ఆ తర్వాత మూడేళ్లకు 2019లో న్యూజెర్సీలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. చదవండి: 25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ .. డబ్ల్యూహెచ్ఓ అలర్ట్.. -
BCCI: టీమిండియా ‘కిట్’ మారింది! జెర్సీలపై ఇక ‘కిల్లర్ జీన్స్’ లోగో
Team India New Jersey: భారత క్రికెట్ జట్టు ‘కిట్’లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఎంపీఎల్ స్పోర్ట్స్ ‘కిట్’ స్పాన్సర్‌గా ఉండగా... ఇప్పుడు దాని స్థానంలో కేవల్ కిరణ్ క్లాతింగ్ లిమిటెడ్ (కేకేసీఎల్) వచ్చింది. ఎంపీఎల్‌తో ఈ ఏడాది మార్చి వరకు బీసీసీఐకి ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే. అయితే, తమ హక్కులను మరో సంస్థకు బదలాయించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎంపీఎల్ బోర్డును ఇటీవలే కోరింది. అందుకే మూడు నెలల స్వల్ప కాలానికి కేకేసీఎల్ సీన్లోకి వచ్చింది. దాంతో శ్రీలంకతో సిరీస్‌నుంచి కేకేసీఎల్ తమ పాపులర్ బ్రాండ్ ‘కిల్లర్ జీన్స్’ లోగోను టీమిండియా జెర్సీలపై ప్రదర్శించనుంది. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్‌తో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ జట్టుతో టీమిండియా 2023 ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఇందులో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం (జనవరి 3)న తొలి టీ20 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: Ind Vs SL: ఆసియా చాంప్‌తో ఆషామాషీ కాదు! అర్ష్‌దీప్‌పైనే భారం! ఇషాన్, రుతు.. ఇంకా టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవాకు ఒకేసారి రెండు క్యాన్సర్లు -
ఎంతటి విషాదం: ‘నానమ్మ.. అమ్మా, నాన్నలు ఎక్కడున్నారు’
ప్రత్తిపాడు (గుంటూరు): అమెరికాలోని న్యూజెర్సీలో తుపాను దృశ్యాలను ఫొటోలు తీసుకుంటున్న క్రమంలో భారీ ఐస్ గడ్డల నుంచి జారిపడి సరస్సులోకి జారి మృత్యువాత పడిన ముద్దన నారాయణ, హరిత దంపతుల మృతదేహాల రాక కోసం వారి కుటుంబీకులు కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఉద్యోగం రీత్యా అమెరికా వెళ్లి అరిజోనాలో నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన నారాయణ, హరిత దంపతులు గత నెల 26వ తేదీన విహార యాత్రకు వెళ్లి సరస్సులో గల్లంతై మృత్యువాత పడిన విషయం విదితమే. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొంత దూరంలో ఉండిపోయిన వారి ఇద్దరు కుమార్తెలు పూజిత, హర్షితలను టీసీఎస్ కంపెనీ సహకారంతో భారత్‌కు తీసుకువచ్చారు. శనివారం ఉదయం అమెరికాలోని డల్లాస్ నుంచి బయల్దేరిన ఆ పిల్లలు ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోగా.. అక్కడి నుండి నేరుగా ప్రత్యేక వాహనంలో స్వగ్రామమైన పాలపర్రుకు తీసుకువచ్చి తాతయ్య సుబ్బారావు, నాయనమ్మ వెంకటరత్నంకు అప్పగించారు. ‘అమ్మా నాన్నలేరీ!’ ‘నానమ్మ.. అమ్మా, నాన్నలు ఏరీ’ అంటూ నారాయణ, హరిత దంపతుల చిన్నకుమార్తె హర్షిత అడుగుతున్న తీరు బంధువుల్ని, గ్రామస్తుల్ని కన్నీరు పెట్టిస్తోంది. అమ్మానాన్న మరణించారన్న విషయం తెలియని ఆ చిన్నారిని చూసి వారంతా చలించిపోతున్నారు. బాధను పంటి బిగువున భరిస్తూ చిన్నారులను ఓదార్చుతున్నారు. తల్లిదండ్రులు ఇక రారన్న చేదు నిజాన్ని ఎలా చెప్పాలో తెలియక తాతయ్యలు, నాయనమ్మ, అమ్మమ్మలు భోరున విలపిస్తున్నారు. ఇప్పటికే ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడం, నేటికీ వారి చివరి చూపునకు కూడా నోచుకోని పరిస్థితులు ఉత్పన్నం కావడంతో వారి రోదన వర్ణనాతీతంగా ఉంది. -
ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం.. అమెరికాలో విగ్రహం
2023లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా లెజెండరీ దివంగత నటుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయనున్నారు. న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో భూమిని కేటాయించడానికి ఎడిసన్ సిటీ మేయర్ అనుమతి ఇచ్చారని నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ వెల్లడించింది. ఇటీవలే ఎడిసన్ ప్రాంతంలో ప్రపంచ నాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి చొరవ చూపారు. మెజారిటీ తెలుగువారు తమ యూఎస్ ప్రయాణాన్ని సిటీ ఆఫ్ ఎడిసన్ నుంచే ప్రారంభించారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్కరి హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారని తెలిపారు. భారతీయ చలనచిత్రంలో ప్రముఖ నిర్మాత మరియు వ్యవస్థాపకుడు టీజీ విశ్వప్రసాద్ గారు శతాబ్ది ఉత్సవాల సందర్భంలో భాగంగా న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో శ్రీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించేలా ప్రతిపాదనను తీసుకొచ్చారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఆలోచన యునైటెడ్ స్టేట్స్‌లోని తెలుగు అభిమానులు మద్దతు అందించారు. ఎడిసన్ సిటీ మేయర్ సామ్ జోషి ప్రతిపాదనను సమీక్షించిన తర్వాత అంగీకరించారు. సామ్ జోషి భారత దేశానికి చెందిన మొదటి మేయర్. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీచే నియమించబడిన సాకేత చదలవాడ, కమీషనర్ న్యూజెర్సీ స్టేట్ ఆసియన్ అమెరికన్, పసిఫిక్ ద్వీపవాసుల కమిషన్, ఎడిసన్ న్యూజెర్సీ నగరానికి చెందిన సాంస్కృతిక, కళా కమిటీ సభ్యుడు ఉజ్వల్ కుమార్ కస్తాల, మేయర్‌తో కలిసి భూమి గుర్తింపును అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్లో పబ్లిక్ ప్లేస్‌లో ఎన్టీఆర్ మొదటి విగ్రహం ఇదే. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవ కార్యక్రమాలు, సంస్కరణలను తెలుగు ప్రజలు ప్రతిచోటా గుర్తుంచుకుంటారు. ఇప్పుడు ఆయన విగ్రహం ప్రతిష్టించడం ప్రతి భారతీయుడు, ప్రత్యేకించి తెలుగు ప్రజలు గర్వించేలా అవుతుంది. ఇది భారతీయ వైభవాన్ని ప్రపంచమంతటా ప్రదర్శించడానికి మార్గం అవుతుంది. ఈ కార్యక్రమం NASAA(నార్త్ అమెరికన్ సీమ ఆంధ్రా అసోసియేషన్) ద్వారా నిధులు సమకూరుస్తుంది. ఎడిసన్ నివాసితులు సహా యునైటెడ్ స్టేట్స్‌లోని అనేక మంది నివాసితులు ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు. అట్లూరి, స్వాతి అట్లూరి, నాసా, తానా సంస్థ, ముఖ్యంగా అంజియ చౌదరి తానా అధ్యక్షుడు, రవి పొట్లూరి తానా 2023 కన్వెన్షన్ చైర్‌కు చెందిన పలువురు వాలంటీర్లు ఉన్నారు. ఎన్టీఆర్ తెలుగువారిని ప్రపంచ వ్యాప్తంగా, తెలుగు వారు గొప్పగా గర్వించదగిన ప్రజలమని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడు ప్రతి తెలుగువాడు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆ లెజెండ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ద్వారా తెలుగు సినిమా వైభవాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. -
న్యూజెర్సీలోని సాయి దత్తపీఠంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
న్యూజెర్సీలోని సాయి దత్త పీఠంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పరిసరాల్లోని ప్రజలు ఈ కార్యక్రమంలో ఉల్లాసంగా పాల్గొన్నారు. -
స్పందన ఫౌండేషన్ అధ్వర్యంలో దివాళి ధమాకా
స్పందన ఫండేషన్ అధ్వర్యంలో న్యూజెర్సీలో ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు సహాయార్ధం దివాళీ ధమాకా కార్యక్రమం ఘనంగా జరిగింది. మాంట్ గోమరీ అప్పర్ మిడిల్ స్కూల్ ఆడిటోర్యంలో జరిగిన ఈ వేడుకలకు రాజు ఆనంద్ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు దోహదం చేసిన కార్యకర్తలు ఫణీంద్ర నెక్కంటి, శ్రీరాం పొందూరి, రమేష్ గుత్తా, కిషోర్, రవిదొడ్డలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
టీ20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ కొత్త జర్సీ చూశారా..?
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు తమ కొత్త జెర్సీలను విడుదల చేస్తున్నాయి. తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కూడా తమ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్ తమ కొత్త జెర్సీలను ధరించి ఉన్న ఫోటోను న్యూజిలాండ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కివీస్ న్యూ జెర్సీ బూడిద, నలుపు రంగు కలయికతో ఉంది. కాగా యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2021లో న్యూజిలాండ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కివీస్ పరాజాయం పాలైంది. ఇక ఈ ఏడాది జరగనున్న పొట్టి ప్రపంచకప్‌లో టైటిల్ సాధించాలని న్యూజిలాండ్ జట్టు భావిస్తోంది. ఔ View this post on Instagram A post shared by BLACKCAPS (@blackcapsnz) ఇక టీ20 ప్రపంచకప్‌లో కివీస్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 22న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్ సన్నహాకాల్లో భాగంగా స్వదేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో ట్రై సిరీస్‌లో న్యూజిలాండ్ తలపడనుంది. టీ20 ప్రపంచ కప్‌కు న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సౌతీ, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, మార్టిన్ గప్టిల్, లాకీ ఫెర్గూసన్, డెవాన్ కాన్వే, మార్క్ చాప్మన్, మైఖేల్ బ్రేస్‌వెల్, ట్రెంట్ బౌల్ట్, ఫిన్ అలెన్ చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. టీమిండియా అత్యంత చెత్త రికార్డు! -
కొత్త జెర్సీ విడుదల చేసిన ఆస్ట్రేలియా.. 'సంక్రాంతి ముగ్గులాగే ఉంది'
అక్టోబర్-నవంబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా 2022 టి20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టైటిల్ ఎగురేసుకపోయింది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనున్న ఆసీస్ బుధవారం ప్రపంచకప్‌కు ధరించబోయే నూతన జెర్సీని ఆవిష్కరించింది. బ్లాక్ అండ్ యెల్లో కాంబినేషన్లో కాస్త కొత్తగా కనిపిస్తున్న జెర్సీపై ఎడమవైపు టి20 ప్రపంచకప్ 2022 అని రాసి ఉండగా.. మధ్యలో ఆస్ట్రేలియా అని ఇంగ్లీష్‌లో.. కుడివైపు ఆస్ట్రేలియా చిహ్నం ఉంటుంది. ఇక జెర్సీ కింది బాగంలో గ్రీన్, గోల్డ్ కాంబినేషన్లో ఆర్ట్ వర్క్ కనిపిస్తుంది. జెర్సీకి సంబంధించిన విషయాలను క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ''టి20 ప్రపంచకప్ కోసం కొత్త జెర్సీని ధరించడం గర్వంగా ఉంది'' అంటూ క్యాప్షన్ జత చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన జెర్సీపై క్రికెట్ అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''ఆస్ట్రేలియా కొత్త జెర్సీలోని డిజైన్ సంక్రాంతి ముగ్గును తలపిస్తుంది'' అంటూ పేర్కొన్నారు. ఇక అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు టి20 ప్రపంచకప్ జరగనుంది. అక్టోబర్ 16 నుంచి 23 వరకు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వాలిఫయింగ్‌లో భాగంగా గ్రూఫ్-ఏలో శ్రీలంక, నమీబియా, ఊఏఈ, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా.. గ్రూఫ్-బిలో వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వేలు ఉన్నాయి. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 దశకు చేరుకుంటాయి. ఇక సూపర్-12 దశలో గ్రూఫ్-1లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్‌తో పాటు ఎ1, బి2 క్వాలిఫై జట్లు ఉండగా.. గ్రూప్-2లో టీమిండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాటు బి1, ఏ2 క్వాలిఫయింగ్ జట్లు ఉండనున్నాయి. ఇక అభిమానుల ఎంతగానో ఎదురుచూస్తున్న టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 23న(ఆదివారం) జరగనుంది. View this post on Instagram A post shared by Cricket Australia (@cricketaustralia) చదవండి: సూర్యకుమార్లో మనకు తెలియని రొమాంటిక్ యాంగిల్.. టి20 ప్రపంచకప్‌కు కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా.. -
టి20 ప్రపంచకప్‌కు కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా..
ఆసియా కప్ టోర్నీలో నిరాశజనక ప్రదర్శన అనంతరం టీమిండియా మరో మెగాటోర్నీకి సిద్ధమైంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదిక పొట్టి ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ టైటిల్ అందుకోవడంలో విఫలమైన టీమిండియా.. ఈసారి టి20 వరల్డ్ కప్ కొట్టాలన్న సంకల్పంతో ఉంది. అయితే టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లు టీమిండియాకు మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడనుందని చెప్పొచ్చు. కాగా ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలకు టీమిండియా కొత్త జెర్సీలతో బరిలోకి దిగుతూ వస్తోంది. తాజాగా టి20 ప్రపంచకప్‌కు కూడా టీమిండియా కొత్త జెర్సీలతో బరిలోకి దిగనుంది. ఈసారి టీమిండియా ఆటగాళ్లు ధరించబోయే జెర్సీ కలర్ స్కై బ్లూగా ఉండనుంది. ఇలాంటి జెర్సీలు 2000 ఆరంభ సంవత్సరం నుంచి టీమిండియా ధరిస్తూ వచ్చింది. 2007లోనూ ఇదే తరహా నీలిరంగు జెర్సీలతో టి20 ప్రపంచకప్ ఆడి విశ్వవిజేతగా నిలిచింది. టీమిండియాకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఎంపీఎల్ స్పోర్ట్స్ జెర్సీ కిట్‌కు సంబంధించి చిన్న వీడియోనూ రిలీజ్ చేసింది. ''మీరు లేకుండా ఎలాంటి గేమ్ ఉండదు. మిమ్మల్ని చీర్‌అప్ చేయడానికి సరికొత్త జెర్సీతో వస్తున్నాం.'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక ఆసియా కప్‌ను నెగ్గలేకపోయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. టి20 ప్రపంచకప్‌కు అంతా సిద్ధమైందని తెలిపాడు. ఎలాంటి షార్ట్‌కట్స్ లేకుండా వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ మ్యాచ్‌ల్లో విజయాలు అందుకుంటాం. అందుకు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో టి20సిరీస్‌లు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడనున్నాయని రోహిత్ చెప్పుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్ 2022లో పాల్గొనే భారత జట్టు ఇదే.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ స్టాండ్ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి భిష్ణోయ్, దీపక్ చాహార్ The game is not really the same without you guys cheering us on! Show your fandom along with @BCCI for the game by sharing your fan moments on https://t.co/jH9ozOU1e9#MPLSports #IndianCricketTeam #ShareYourFanStories #CricketFandom #loveforcricket #cricket pic.twitter.com/VObQ3idfUz — MPL Sports (@mpl_sport) September 13, 2022 -
ఆర్య వల్వేకర్... మిస్ ఇండియా–యూఎస్ఏ
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ యువతి ఆర్య వల్వేకర్(18) మిస్ ఇండియా యూఎస్ఏ–2022 గెలుచుకున్నారు. వర్జీనియాకు చెందిన ఆర్య న్యూజెర్సీలో జరిగిన 40వ వార్షిక పోటీలో మిస్ఇండియా యూఎస్ఏ కిరీటం గెలుచుకుంది. సౌమ్య శర్మ, సంజన చేకూరి రన్నరప్‌లుగా నిలిచారు. సినిమాల్లోకి రావాలన్నది తన స్వప్నమని ఆర్య వల్వేకర్ ఈ సందర్భంగా చెప్పారు. ‘నన్ను నేను వెండితెరపై చూసుకోవాలని.. సినిమాలు, టీవీల్లో నటించాలనేది నా చిన్నప్పటి కల’ అని పీటీఐతో ఆమె అన్నారు. 18 ఏళ్ల ఆర్య వల్వేకర్.. వర్జీనియాలోని బ్రియార్ వుడ్స్ హై స్కూల్లో చదువుకున్నారు. మానసిక ఆరోగ్యం, బాడీ పాజిటివిటీ హెల్త్‌పై ఆసక్తి కనబరిచే ఆమె పలు అవగాహనా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. యుఫోరియా డాన్స్ స్టూడియోను స్థాపించి స్థానికంగా పిల్లలకు డాన్స్ నేర్పిస్తున్నారు. కొత్త ప్రదేశాల పర్యటన, వంట చేయడం, చర్చలు.. తనకు ఇష్టమైన వ్యాపకాలని వెల్లడించారు. యోగా చేయడం తనకు ఇష్టమన్నారు. ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులు, చెల్లెలితో గడపడంతో పాటు... స్నేహితుల కోసం వంటలు చేస్తుంటానని చెప్పారు. ఇక పోటీల విషయానికొస్తే... మిస్ ఇండియా–యూఎస్ఏతో పాటు మీసెస్ ఇండియా, మిస్ టీన్ ఇండియా –యూఎస్ఏ కాంపిటేషన్స్ జరిగాయి. అమెరికాలోని 30 రాష్ట్రాలకు చెందిన 74 మంది పోటీదారులు వీటిలో పాల్గొన్నారు. వాషింగ్టన్కు చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్ఏ, న్యూయార్క్‌కు చెందిన తన్వీ గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏగా నిలిచారు. (క్లిక్: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ మనసులో మాట) -
అసలు ఆమెను చంపిందెవరు? పోస్ట్‌మార్టమ్ నివేదికలోనూ..
పదహారేళ్ల జేనెట్ బయటకు వెళ్లడానికి రెడీ అయింది. ‘మమ్మీ! ఫ్రెండ్‌ను కలవడానికి ట్రెయిన్లో వెళుతున్నా... తొందరగానే వచ్చేస్తాలే’ చెప్పింది జేనెట్. ‘సరేనమ్మా! జాగ్రత్త!’ సాగనంపింది తల్లి. ఇది జరిగి నేటికి సరిగ్గా యాభయ్యేళ్లు. అంటే, 1972 ఆగస్టు 7న తల్లితో చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది జేనెట్ డి పామా. వెళ్లడమైతే వెళ్లింది గాని, ఇంటికి తిరిగి రాలేదు. ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెదుకులాడారు. ఆరాతీశారు. ఫ్రెండ్ దగ్గరకు కూడా చేరలేదని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమెరికాలోని న్యూజెర్సీలో యూనియన్ కౌంటీ స్ప్రింగ్ఫీల్డ్ టౌన్షిప్ క్లియర్‌వ్యూ రోడ్డులో ఉంటుందా ఇల్లు. స్ప్రింగ్ఫీల్డ్ పోలీసులు ఇంటికి వచ్చి, తల్లిదండ్రుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. స్ప్రింగ్ఫీల్డ్ పోలీసులు రోజుల తరబడి చాలాచోట్ల గాలించారు. ఫలితం కనిపించలేదు. ఆరువారాలు గడిచాక ఒకరోజు– సెప్టెంబర్ 19న ఒక కుక్క కుళ్లిపోయే దశలో ఉన్న అమ్మాయి మోచేతిని నోట కరుచుకుని వచ్చింది. దాని ఆధారంగా పోలీసులు వెదుకులాట మొదలుపెట్టారు. కుక్క వచ్చిన దారిలో వెదుకులాడుతూ స్ప్రింగ్ఫీల్డ్లోని హూడై క్వారీ కొండ శిఖరం మీదకు చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యం ఒళ్లు జలదరించేలా ఉంది. అర్ధగోళాకారంలో పేర్చి ఉన్న చెట్ల కొమ్మలు, కలప దుంగల కింద అమ్మాయి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మృతదేహం ఒక ముగ్గులాంటి ఆకారం మీద పడి ఉంది. మృతదేహం చుట్టూ జంతువులను బలిచ్చినట్లుగా జంతు కళేబరాల అవశేషాలు కనిపించాయి. పరిసరాల్లోని దృశ్యాన్ని బట్టి క్షుద్రపూజల కోసం ఎవరో తాంత్రికులు అమ్మాయిని బలి ఇచ్చి ఉండవచ్చని స్థానికులు చెవులు కొరుకున్నారు. అయితే, పోలీసులు ఆ వాదనలను కొట్టి పారేశారు. చకచకా చెట్ల కొమ్మలను, దుంగలను తొలగించి, మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం కనిపించకుండా పోయిన జేనెట్దేనని గుర్తించారు. నిబంధనల ప్రకారం అక్కడ జరగాల్సిన తతంగాన్ని పూర్తి చేశాక, పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. పోస్ట్‌మార్టంలో ఆమె మరణానికి దారితీసిన కారణాలేవీ బయటపడలేదు. శరీరంపై కత్తిపోట్లు, తూటాల గాయాలు ఏవీ లేవు. అఘాయిత్యం జరిపి, హింసించి గాయపరచిన ఆధారాల్లేవు. ఎముకలు విరిగిన గుర్తుల్లేవు. కనీసం మాదక ద్రవ్యాలు లేదా విషపదార్థాల ఆనవాళ్లు కూడా శవపరీక్షలో దొరకలేదు. కచ్చితమైన ఆధారాలు దొరకకున్నా, బహుశ గొంతు నొక్కేయడం వల్ల ఆమె మరణించి ఉంటుందని పోస్టుమార్టం జరిపిన డాక్టర్లు నివేదిక ఇచ్చి, అంతటితో చేతులు దులిపేసుకున్నారు. జేనెట్ చనిపోయిన రెండువారాల నుంచి పత్రికల్లో రకరకాల కథనాలు మొదలయ్యాయి. క్షుద్ర తాంత్రికుల నరబలికి ఆమె బలైపోయి ఉంటుందనే వాదనతో ఈ పత్రికలు ప్రచురించిన కథనాలు అమెరికా అంతటా కలకలం రేపాయి. యూనియన్ కౌంటీలోని వాచుంగ్ అభయారణ్యం క్షుద్రతాంత్రికులకు అడ్డాగా పేరు మోసింది. జేనెట్ మృతదేహం వాచుంగ్ అభయారణ్యానికి చేరువలోనే ఉన్న క్వారీ కొండపై లభించడంతో జనాలు కూడా పత్రికల వాదనను నమ్మారు. అంతేకాదు, జేనెట్ మరణానికి కొద్దినెలల ముందు జాన్ లిస్ట్ అనే ఉన్మాది యూనియన్ కౌంటీలో తన భార్యను, తల్లిని, ముగ్గురు పిల్లలను చంపేసి పారిపోయాడు. దాంతో యూనియన్ కౌంటీ జనాలు సాయంత్రమైతే చాలు ఇంటి బయటకు అడుగు పెట్టాలంటేనే వణికిపోయేవాళ్లు. అయితే, జేనెట్ మరణానికి పోస్ట్‌మార్టంలో కూడా కారణాలు బయట పడకపోవడంతో కేసు మూలపడింది. దశాబ్దాలు గడిచాక ఈ కేసు మళ్లీ చర్చలోకి వచ్చింది. అదెలాగంటే, ‘వీయర్డ్ ఎన్జే మేగజైన్’ కార్యాలయానికి 1990ల చివర్లోను, 2000 ప్రారంభంలోను జేనెట్ మరణానికి సంబంధించి వరుసగా ఆకాశ రామన్న ఉత్తరాలు వచ్చాయి. ఆ పత్రిక ఎడిటర్ మార్క్ మోరాన్ ఈ కేసుపై పరిశోధన ప్రారంభించాడు. తన పరిశోధనలో కనుగొన్న అంశాలతో, పలు అనుమానాలతో వరుస కథనాలను ప్రచురించాడు. ఈ కేసు ఫైలును స్ప్రింగ్ఫీల్డ్ పోలీసులు పోగొట్టుకుని ఉంటారని లేదా నాశనమైనా చేసి ఉంటారనే అనుమానం కూడా ఆయన తన కథనాల్లో వ్యక్తం చేయడంతో దీనిపై మళ్లీ కలకలం మొదలైంది. మీడియా గట్టిగా నిలదీయడంతో 1999 నాటి ఫ్లాయిడ్ తుపానులో ఈ కేసు ఫైలు గల్లంతైందని పోలీసులు అంగీకరించారు. అయితే, దాని ప్రతి మాత్రం పదిలంగానే ఉందని చెప్పారు. దరిమిలా జేనెట్ మరణంపై ఎడిటర్ మోరాన్ తన పత్రికలోనే పనిచేసే కరస్పాండెంట్ జెస్సీ పోలాక్‌తో కలసి ‘డెత్ ఆన్ ది డెవిల్స్ టీత్’ అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకం స్థానికంగా సంచలనం కలిగించింది. జేనెట్కు న్యాయం జరిపించాలంటూ స్థానికులు ఏకంగా ‘జస్టిస్ ఫర్ జేనెట్ డి పామా’ పేరుతో ఒక సంస్థనే ప్రారంభించి, న్యాయ పోరాటానికి రంగంలోకి దిగారు. జేనెట్ దుస్తులను డీఎన్ఏ పరీక్షలకు పంపాలంటూ కోర్టుకు వెళ్లారు. అధునాతనమైన డీఎన్ఏ పరీక్షల ద్వారా ఈ సంఘటనకు గల కారణాలు బయటపడవచ్చని భావిస్తున్నామని ఈ సంస్థ ప్రతినిధులు ఆశాభావంతో ఉన్నారు. ఈ కేసులో నిజం ఎప్పటికైనా బయటపడుతుందా? జేనెట్ను చంపిందెవరో వెలుగులోకి వస్తుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. చదవండి: 1991 Austin Yogurt Shop Killings: యోగర్ట్ షాప్ హత్యలు.. ఇప్పటికీ మిస్టరీ గానే..! -
Vedant Deoakte: అమెరికాలో రూ.33 లక్షల ఉద్యోగం కోల్పోయిన బాలుడు
ముంబై: కోడింగ్ కాంపిటీషన్లో 1,000 మందితో పోటీపడి నెగ్గిన విజేతకు అమెరికా కంపెనీ మంచి ఉద్యోగం ఆఫర్ చేసింది. ఏడాదికి రూ.33 లక్షల వేతనం ఇస్తామని తెలిపింది. అతడి వయసు గురించి తెలిశాక ఉద్యోగం ఇవ్వలేమని సమాచారం పంపింది. విజేత వయసు కేవలం 15 ఏళ్లు కావడమే ఇందుకు కారణం. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన వేదాంత్ దేవ్కాటే వయసు 15 సంవత్సరాలు. పదో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ల్యాప్‌టాప్ సాయంతో స్వయంగా కోడింగ్ నేర్చుకున్నాడు. అందులో మంచి పట్టు సంపాదించాడు. అమెరికాలోని న్యూజెర్సీ అడ్వర్టైజింగ్ కంపెనీ నిర్వహించిన కోడింగ్ పోటీలో పాల్గొన్నాడు. రెండు రోజుల్లో 2,066 లైన్ల కోడ్ రాశాడు. సునాయాసంగ విజయం సాధించాడు. వేదాంత్ ప్రతిభను గుర్తించిన న్యూజెర్సీ అడ్వర్టైజింగ్ కంపెనీ తమ మానవ వనరుల విభాగంలో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. రూ.33 లక్షల వార్షిక ప్యాకేజీ ఇస్తామని తెలిపింది. వ్యక్తిగత వివరాలు పంపాలని కోరింది. వేదాంత్ ఆ వివరాలు పంపించాడు. అతడి వయసు 15 ఏళ్లేనని తెలుసుకున్న న్యూజెర్సీ కంపెనీ ఉద్యోగం ఇవ్వలేమని పేర్కొంది. తమ కంపెనీ నిబంధనల ప్రకారం చిన్న వయసు వారిని చేర్చుకోవడం సాధ్యపడదని నిస్సహాయత వ్యక్తం చేసింది. నిరాశ చెందాల్సిన అవసరం లేదని, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తమను సంప్రదించాలని వేదాంత్‌కు సూచించింది. -
న్యూజెర్సీలో వైఎస్సార్ జయంతి వేడుకలు: మహానేతకు ఘన నివాళి
న్యూ జెర్సీ: డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో మన్రోలో థాంప్సన్ పార్కులో వైస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జులై పదిన జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆళ్ళ రామిరెడ్డి, డాక్టర్ రాఘవ రెడ్డి , హరి వెళ్కూర్, అన్నారెడ్డి, రఘురామి రెడ్డి, ప్రభాకర్ చీనేపల్లి, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి, సత్య పాతపాటి, ద్వారక వారణాసి, సహదేవ్ రెడ్డి, భానోజీ రెడ్డి, నగేష్ ముక్కమల్లతో పాటు పలువురు వై ఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలలో వైఎస్సార్ జయంతి జరుపుకోవడం ఆయనకిచ్చే ఘన నివాళి అని ఆళ్ళ రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ను స్మరించుకుంటూ ఫౌండేషన్ తరపున వాటర్ ప్లాంట్స్, హెల్త్ క్యాంప్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మెడికల్ కిట్స్, కూరగాయల సరఫరా లాంటి ఎన్నో కార్యక్రమాల నిమిత్తం వైస్సార్ అభిమానులు ఈ రెండేళ్లలో రెండు కోట్లకు పైగా సహాయం చేశారన్నారు. నాటా ప్రెసిడెంట్ డాక్టర్ రాఘవ రెడ్డి గోసల మాట్లాడుతూ వైఎస్సార్ పధకాలు ఎంతో మంది పేదలకు ఉపయోగపడితే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలతో పాటుగా ‘నాడు నేడు’, ఇంగ్లీష్ మీడియం మరింత సమర్ధ వంతంగా అమలుచేయడం గర్వకారణమన్నారు. వైఎస్సార్ అభిమానులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో వున్నారని అందుకు ఉదాహరణే ఇక్కడకు వచ్చిన అభిమానులని ప్రభాకర్ చీనేపల్లి పేర్కొన్నారు. డా.మూలే రామమునిరెడ్డి రాసిన కవితను కృష్ణమోహన్ రెడ్డి చదివి వినిపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మనోహర్ కడివెటి, అనిల్ రెడ్డి, బాలకృష్ణ బోడిరెడ్డి, ఆళ్ళ బసివి రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి పాల్వాయి, చంద్ర రెడ్డి, ఇందిరా శ్రీరామ్ రెడ్డి, కోటి రెడ్డి, కృష్ణ కళ్ళం, లక్ష్మారెడ్డి, నాగరాజా రెడ్డి, నాగేంద్ర ముక్కమల్ల, నాగిరెడ్డి భీమవరపు, నాగిరెడ్డి ఉయ్యురు, నరేష్ అన్నం, పద్మనాభ రెడ్డి, రామ్ వేమిరెడ్డి, సంజీవ రెడ్డి బెక్కం, శ్రీధర్ గుడేటి, శ్రీనివాస్ గుండేటి, సూరి తాడి, తాతా రెడ్డి, తిమ్మా రెడ్డి, విజయ్ గోలి, వీర ప్రతాప్ రెడ్డి, వెంకటరెడ్డి కాగితాల, వెంకట శివ మద్దిగపు, ఆళ్ళ వికాస్ రెడ్డి, వినయ్ వాసిలి, వినోద్ ఎరువతో పాటు 300కి పైగా అభిమానులు పాల్గొని మహానేతకు ఘన నివాళులర్పించారు. -
తెలుగుదనాన్ని మర్చిపోకండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పుట్టిన ఊరు, మట్టి వాసనలు, వంటలు వాటి గుభాళింపులు, పలకరింపులు, చదువు నేర్పిన గురువులను, పరిసరాలను మరిచిపోవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. సతీ సమేతంగా అమెరికా పర్యటనలో ఉన్న సీజేఐకి అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నార్త్ అమెరికా తెలుగు ప్రతినిధులు శుక్రవారం ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడారు. అమెరికా వంటి దేశాల్లో మన సంస్కృతీ సంప్రదాయాలను మరవకుండా, ఆచార వ్యవహారాలను పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడపటం అందరూ గర్వించాల్సిన విషయమని ఆయన కొనియాడారు. “అమెరికాలో 2010–17 మధ్య కాలంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 85% పెరిగింది. మిగతా ఆసియా భాషలతో పోలిస్తే తెలుగు భాష ప్రథమ స్థానంలో ఉంది’అని ఆయన తెలిపారు. తెలుగు భాషను ఎంతగా గౌరవిస్తామో, ఇతర భాషలను సైతం అదే విధంగా గౌరవించుకోవాలన్నారు. ఉద్యోగరీత్యా అవసరమైన విషయాలకు మాత్రమే భాష, సంస్కృతులను త్యాగం చేయాల్సి ఉంటుందే తప్ప, దైనందిన జీవితంలో, కుటుంబంలో రోజువారీ కార్యకలాపాల్లో మాతృభాషను వాడటం మరవొద్దని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. తెలుగులో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనడానికి తానే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. మాతృభాషలో చదువుకొని న్యాయశాస్త్రంలో ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. దేశంలో న్యాయం ఆకాంక్షించే ప్రతీ ఒక్కరికీ సత్వర న్యాయం అందేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజల అర్జీలను పరిష్కరించేందుకు తగిన సంఖ్యలో కోర్టులు, జడ్జీలనూ నియమించాల్సిన అవసరం ఉందన్నారు. -
న్యూజెర్సీ సాయిదత్త పీఠాన్ని సందర్శించిన జస్టిస్ ఎన్వీ రమణ
ఎడిసన్, న్యూ జెర్సీ: అమెరికాలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయిదత్త పీఠాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సందర్శించారు. న్యూజెర్సీ ఎడిసన్‌లోని శ్రీ సాయి దత్త పీఠం శివ విష్ణు మందిరంలో వేద పండితులు జస్టిస్ ఎన్వీ రమణ కు వేద మంత్రోచ్ఛారణతో స్వాగతం పలికారు. దేవాలయంలో దేవతా మూర్తులను ఆయన దర్శించుకుని పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వాదం పొందారు. సాయి దత్త పీఠం ఆలయ చైర్మన్, ప్రధాన అర్చకులు రఘుశర్మ శంకరమంచి, న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, ఆలయ బోర్డ్ డైరెక్టర్లు, స్టాఫ్, వాలంటీర్లు ఎన్.వి.రమణను కలిసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. చదవండి: ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు: వైవీ సుబ్బారెడ్డి -
న్యూజెర్సీ లో ఘనంగా ‘‘ఆటా’’ సయ్యంది పాదం నృత్య పోటీలు
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 17వ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభలలో భాగంగా న్యూజెర్సీలో ఆటా సయ్యంది పాదం నృత్య పోటీలను భారీ స్థాయిలో నిర్వహించారు. కూచిపూడి, భరత నాట్యం, జానపదం ఫిల్మ్ విభాగాలలో చాలా నాణ్యమైన ప్రదర్శనలతో ఈ పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని న్యూజెర్సీ సయ్యంది పాదం ఇంచార్జీలు ఇందిరా దీక్షిత్, మాధవి అరువ గారి ఆధ్వర్యంలో గొప్పగా జరిగాయి. మ్యూజిక్ ఆడియో సిస్టంను ఏర్పాటు చేసిన రాజ్ చిలుముల, కాన్ఫరెన్స్ డైరెక్టర్ రఘువీర్ రెడ్డిలు విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన న్యూజెర్సీ సయ్యంది పాదం బృందానికి అభినందనలు తెలిపారు. సక్సెస్ చేయడంలో.. వర్జీనియా నుండి న్యూ జెర్సీకు వచ్చిన సయ్యంది పాదం ఛైర్ సుధారాణి కొండపు, కో-ఛైర్ భాను మాగులూరి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. వాలంటీర్లకు, న్యూజెర్సీ ఆటా టీమ్ రాజ్ చిలుముల, రీజినల్ కోఆర్డినేటర్ సంతోష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆటా బృందం ప్రతి విభాగంలో విజేతలకు సర్టిఫికెట్లు, మెమోంటోలను అందించారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవడానికి ఇందిరా దీక్షిత్, మాధవి అరువ, నందిని దార్గుల, వాణి అనుగుల, రాజ్ చిలుముల, రఘువీర్ రెడ్డి , సంతోష్ రెడ్డి, శరత్ వేముల , విజయ్ కుందూరు, మహీందర్ రెడ్డి ముసుకు, రవీందర్ గూడూరు , శ్రీకాంత్ గుడిపాటి , శ్రీనివాస్ దార్గుల, శైల మండల ,బిందు, వినోద్ కోడూరు, రామ్ రెడ్డి వేముల, శివాని, విజయ ,ప్రవీణ్, నిహారిక , అపర్ణ, ప్రదీప్ కట్ట , విలాస్ రెడ్డి జంబులతో పాటు మిగితా వలంటీర్లు కృషి చేసారు. వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడం పట్ల సయ్యంది పాదం పోటీల ఛైర్ సుధా కొండపు, సలహాదారు రామకృష్ణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సంబంధిత కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు స్థానిక కోఆర్డినేటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. విజేతల వివరాలు సోలో నాన్ క్లాసికల్ సీనియర్ – నేహా రెడ్డి వంగపాటి, సోలో నాన్ క్లాసికల్ జూనియర్ – సంజన నూకెళ్ల, సోలో సీనియర్ క్లాసికల్ – మెగానా మధురకవి, సోలో జూనియర్ క్లాసికల్ – జాన్వీ ఇరివిచెట్టి, నాన్ క్లాసికల్ గ్రూప్ జూనియర్ – నిషా స్కూల్ ఆఫ్ డ్యాన్స్, నాన్ క్లాసికల్ గ్రూప్ సీనియర్ – శైలా మండల స్కూల్ ఆఫ్ డాన్స్, గ్రూప్ జూనియర్ – చార్వి పొట్లూరి, శ్రీనికా కృష్ణన్లు ఉన్నారు. ఆటా 17వ కన్వెన్షన్ ఆటా 17వ కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్‌ను వాల్టర్ ఈ కన్వెన్షన్ సెంటర్లో జూలె 1 నుంచి 3 వరకు వాషింగ్టన్ డీసీలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఆటా అధ్యక్షుడు భువనేష్ బూజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, బోర్డు ఆఫ్ ట్రస్టీలు వివిధ కమిటీల ఆధ్వర్యములో అమెరికా తెలుగు సంఘం (ఆటా) 17వ మహాసభలు జరగబోతున్నాయి. కావున తెలుగువారందరూ ఈ మహాసభలకు హాజరై, భారీ స్థాయిలో విజయవంతం చేయాలని ఆటా ప్రతినిధులు కోరారు. ఇళయరాజ సంగీత విభావరి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా తన మొత్తం ట్రూప్ తో జూలై 3న గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ హాజరుకానున్నారు. విజయ్ దేవరకొండ, డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, రకుల్ ప్రీత్ సింగ్, రామ్ మిర్యాల, మంగ్లీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఈ వేడుకకు విచ్చేయనున్నారు. సంగీత దర్శకుడు తమన్ జూలై 2న సంగీత కచేరీలో ప్రేక్షకులను అలరించనున్నారు. చదవండి: న్యూజెర్సీలో ‘తెలంగాణ’ ఉట్టిపడేలా ఉత్సవాలు -
న్యూజెర్సీలో ‘తెలంగాణ’ ఉట్టిపడేలా ఉత్సవాలు
తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మొదటిసారిగా నిర్వహించిన సోలో మెగా కన్వెన్షన్ ఘనంగా జరిగింది. న్యూజెర్సీ ఎక్స్పో & కన్వెన్షన్ సెంటర్లో మే 27 నుంచి 29 వరకు జరిగిన ఈ మెగా ఈవెంట్ ప్రేక్షకులతో గ్రాండ్ సక్సెస్ అయింది. వివిధ కేటగిరీల కింద పలువురికి అవార్డులు అందచేశారు. సాంస్కృతిక విందులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఫ్యాషన్ షోలు మెగా ఈవెంట్‌కు రంగులద్దాయి. విందు రాత్రి ముగింపులో సంగీత దర్శకుడు కోటి ట్రూప్ చేపట్టిన కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ గర్వకారణమైన బతుకమ్మ, బోనాలు, పోతరాజులతో టీటీఏ మెగా కన్వెన్షన్‌ను అధికారికంగా ప్రారంభించారు. కన్వెన్షన్ సెంటర్ ముఖద్వారాన్ని చార్మినార్, కాకతీయ కళా తోరణం, తెలంగాణ తల్లి, ఆరు అడుగుల బతుకమ్మ, సమ్మక్క, సారక్కల ప్రతిరూపాలతో ఉత్సవ కమిటీ చక్కగా అలంకరించింది. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ స్థానిక సెనేటర్లు సామ్ థామ్సన్, ఈస్ట్ బ్రున్స్విక్ మేయర్ బ్రాడ్ కోహెన్, తెలంగాణ మంత్రులు మరియు రాజకీయ నాయకులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో డాక్టర్ మల్లారెడ్డి పైళ్ల ఆధ్వర్యంలో డాక్టర్ విజయపాల్‌రెడ్డి, డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల, టీటీఏ అధ్యక్షుడు డాక్టర్ మోహన్‌రెడ్డి పట్లోళ్ల, కన్వీనర్ శ్రీనివాస్ గనగోని, అధ్యక్షుడు ఎలెక్ట్ వంశీరెడ్డి, కోఆర్డినేటర్ గంగాధర్ వుప్పల, కన్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, ఈర్వీపీలు, స్టాండింగ్ కమిటీలు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు కృషి చేశారు. యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రతి మూలకు చెందిన వాలంటీర్లు గత రెండు దశాబ్దాల చరిత్రలో అత్యుత్తమ మెగా కన్వెన్షన్‌ను అందించడానికి ఆరు నెలలకు పైగా తమ వ్యక్తిగత సమయాన్ని వెచ్చించారు. తెలంగాణపై అలంకరణలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో కన్వెన్షన్ అంతటా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించడంలో టీటీఏ విజయవంతమైంది. చదవండి: పెట్రోల్‌పై డిస్కౌంట్! యూఎస్‌లో ఆకట్టుకుంటున్న భారతీయుడు -
న్యూజెర్సీలో నాట్స్ ఫుడ్ డ్రైవ్
ఎడిసన్ (న్యూ జెర్సీ): భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో ఫుడ్ డ్రైవ్‌ను దిగ్విజయంగా నిర్వహిస్తోంది. నాట్స్ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు నాట్స్ న్యూజెర్సీలో ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 500 పౌండ్ల ఆహారాన్ని, ఫుడ్ క్యాన్స్‌ను సేకరించి పేదలకు పంపిణి చేసింది. న్యూజెర్సీలో ఆరవ సారి నాట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. కోవిడ్ కారణంతో గత రెండేళ్ల ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. కోవిడ్ కేసులు తగ్గడం.. వ్యాక్సినేషన్ పుంజుకోవడంతో నాట్స్ సభ్యులు ఉత్సాహంగా ఈ ఫుడ్ డ్రైవ్ లో పాల్గొని తమకు తోచినంత ఫుడ్ క్యాన్స్‌ను విరాళంగా ఇచ్చారు. ఈ పుడ్ డ్రైవ్‌కు నాట్స్ బోర్డ్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ మాజీ అధ్యక్షులు మోహనకృష్ణ మన్నవ, నాట్స్ బోర్డ్ సెక్రటరీ శ్యాం నాళం, బోర్డ్ డైరెక్టర్స్ శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, నాట్స్ సెక్రటరీ రంజిత్ చాగంటి, ఇమ్మిగ్రేషన్ అసిస్టెన్స్ సూర్య శేఖర్ గుత్తికొండ, రమేశ్ నూతలపాటి, రాజేశ్ బేతపూడి, గిరి కంభంమెట్టు తదితరులు తమ మద్దతు అందించారు. నాట్స్ న్యూజెర్సీ కో ఆర్డినేటర్ సురేశ్ బొల్లు, జాయింట్ కోఆర్డినేటర్ మోహన కుమార్ వెనిగళ్ల, ఈవెంట్ కమిటీ శేషగిరి కంభంమెట్టు, కమ్యూనిటీ సర్వీసెస్ కమిటీ అరుణ్ శ్రీరామినేని, వంశీ కొప్పురావూరి, కిరణ్ కుమార్ తవ్వ, ప్రశాంత్ లు ఈ పుడ్ డ్రైవ్ విజయవంతానికి కృషి చేశారు. -
పెట్టుబడులు పెట్టండి.. విరాళాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని ప్రవాస భారతీయులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చేపట్టిన ‘మన ఊరు–మన బడి’కి ఇటీవల ప్రారంభించిన ప్రత్యేక పోర్టల్ ద్వారా విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ఐటీ సర్వ్ అలయెన్స్ శనివారం నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కంటే ముందే 2001లో ఏర్పడిన ఛత్తీస్గడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఇంకా ఒడిదొడుకుల్లోనే ఉండగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధిరేటులో అభివృద్ధితో పాటు భారత ఆర్థిక పురోగతిలో కీలకంగా మారిందని చెప్పారు. విద్యుత్ కొరతను అధిగమించడంతో పాటు వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అందేవరకు జరిగిన పరిణామాలను వివరించారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటితో పాటు కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి రంగంలో సాధించిన మార్పును గణాంకాలతో చెప్పారు. ఐటీని పట్టణాలకు విస్తరిద్దాం: ప్రముఖ భారతీయ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని కేటీఆర్ సన్మానించి ఆయన సేవలను ప్రశంసించారు. తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా హెల్త్ రికార్డులను రూపొందిస్తున్నామన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని హైదరాబాద్‌లో అన్ని వైపులా విస్తరించడంతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించేందుకు పెట్టుబడులతో ముం దుకు రావాలని ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. మన ఊరు–మన బడికి విరాళాలు ప్రకటించిన ప్రవాస భారతీయులను శాలువాలతో సత్కరించారు. ఫైజర్, జాన్సన్, జీఎస్కే ప్రతినిధులతో భేటీ ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జీఎస్కే) ప్రతినిధులతో కేటీఆర్ శనివారం భేటీ అయ్యారు. లైఫ్ సైన్సెస్‌కు సంబంధించి తెలంగాణలో ఉన్న అవకాశాలు, మానవ వనరులు, ఫార్మా పరిశోధనలకు అనుకూలతలపై కంపెనీలకు కేటీఆర్ వేర్వేరుగా ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే 20వ బయో ఏషియా సదస్సుకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులతో పాటు విస్తరణ ప్రణాళికను ఆయా కంపెనీలు కేటీఆర్‌తో పంచుకున్నాయి. సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో పాటు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. హైదరాబాద్‌కు స్ప్రింక్లర్ సోషల్ మీడియా రంగంలో పేరొందిన అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీ స్ప్రింక్లర్ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దీనివల్ల వెయ్యి మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సోషల్ మీడియా మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, కంటెంట్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా రీసెర్చ్‌లో స్పి్రంక్లర్కు ప్రత్యేక స్థానం ఉంది. న్యూయార్క్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కేటీఆర్ విద్యార్థిగా, ఉద్యోగిగా తాను న్యూయార్క్‌లో గడిపిన రోజులను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. 10 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో అడుగు పెట్టిన నాటి నుంచి తీరిక లేకుండా గడుపుతున్న కేటీఆర్.. శనివారం ఫైజర్ సీఈవోతో భేటీ తర్వాత న్యూయార్క్ వీధుల్లో కాలినడకన తర్వాతి సమావేశానికి బయలుదేరారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో గతంలో తాను తిన్న స్ట్రీట్ ఫుడ్ వద్దకు వెళ్లి తనకు అత్యంత ఇష్టమైన వేడి వేడి సాస్‌తో కూడిన చికెన్ రైస్‌ను కొని తిన్నారు. సమావేశానికి ఆలస్యం అవుతుండటంతో న్యూయార్క్‌లో ఉండే ఎల్లో క్యాబ్ ఎక్కివెళ్లారు. -
భారత ప్రొఫెసర్‌కి న్యూజెర్సీ ఇనిస్టిట్యూబ్ ఆఫ్ టెక్నాలజీ ఎక్సలెన్సీ పురస్కారం
నెవార్క్ (న్యూ జెర్సీ): అమెరికాలో తెలుగు ఆచార్యుడికి అరుదైన అవార్డు లభించింది. న్యూజెర్సీలో ఉంటున్న త్రివిక్రమ్ రెడ్డి భానోజీ పాలకి న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్జేఐటీ) ఎక్సలెన్స్ ఆఫ్ టీచింగ్ పురస్కారం ప్రకటించింది. మెకానికల్ విద్య బోధనలో అత్యుత్తమ ఆధ్యాపకుడంటూ ఆయన సేవలను ప్రశంసించింది. మెషిన్ డిజైన్, మెకానికల్ సిస్టమ్ డిజైన్ తో పాటు స్ట్రైస్ ఎనాలిసిస్లను బోధించడంలో త్రివిక్రమ్‌రెడ్డి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రేట్ మై ప్రొఫెసర్ అని ఇచ్చే ర్యాంకింగ్‌లలో ఆయన టాప్ రేటింగ్ సాధించారు. టీచింగ్ ఫీల్డ్‌లో కొనసాగుతూనే బెక్టన్ డికిన్సన్ కంపెనీలో రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ స్టాప్ ఇంజనీరుగా కూడా త్రివిక్రమ్‌రెడ్డి సేవలందిస్తున్నారు. రోగులకు మందులను సరఫరా చేసేందుకు సరికొత్త పరికరాలను ఆయన రూపొందించారు. ఇలా తాను రూపొందించిన ఏడు పరికరాలపై ఆయనకు పేటెంట్ల ఉన్నాయి. -
అమెరికాలో వైరల్ అవుతున్న ఇండియన్ బుడత
American Toddler accidentally purchases 2000 Dollars worth of items: కరోనా వచ్చినప్పటి నుంచి పిల్లలంతా మొబైల్ ఫోన్స్‌కే అతుక్కుపోతున్నారంటూ కంప్లైంట్ చేస్తున్న తల్లిదండ్రులు కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఆన్లైన్ క్లాస్ లేదంటే గేమ్స్ మొత్తానికి ఫోన్ వదలడం లేదు. అయితే అమెరికాకు చెందిన 20 నెలల చిచ్చర పిడుగు స్మార్ట్‌ఫోన్‌తో చేసిన పని ఇప్పుడు యూస్‌తో పాటు ఇండియాలోనూ వైరల్‌గా మారింది. అమెరికన్ ఇండియన్ దంపతులు ప్రమోద్ , మధుకుమార్‌లు న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఇటీవల వారుంట ఇంటికి వరుసగా కొరియర్లు వచ్చి చేరుతున్నాయి. కొత్తగా తీసుకున్న ఇంటికి సంబంధించిన ఫర్నీచర్ వస్తువులు ఒక్కొక్కటిగా వాల్‌మార్ట్ బృందం ఇంటికి చేరవేస్తోంది. తాను ఆ వస్తువులు కొనాలని అనుకున్న మాట వాస్తమేనని, అయితే తాను ఆర్డర్ చేయలేదంటూ మధుకుమార్ డెలివరీ బాయ్స్‌తో వాదనకు దిగింది. అయితే వాల్‌మార్ట్ ప్రతినిధులు ఆర్డర్‌కి సంబంధించిన వివరాలను మధుకుమార్ ముందు ఉంచారు. దీంతో ఒక్కసారిగా ఆమె అవాక్కయ్యింది. ఎందుకంటే విలువైన వస్తువులు ఫోన్ ద్వారా ఆర్డర్ చేసింది మరెవరో కాదు.. నిత్యం ఆమె ఒడిలో ఆడుకునే ఇరవై నెలల బాబు ఆయాన్ష్. తల్లి ఫోన్లో వాల్‌మార్ట్ యాప్‌లో కార్ట్‌లో పిక్ చేసి ఉన్న వస్తువలను అతను సునాయాసంగా ప్లేస్ ఆర్డర్ చేసేశాడు. ఇలా అమెరికన్ కరెన్సీలో 2000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 1.49 లక్షలు) విలువైన వస్తువులు బుక్ చేశాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఆయాన్ష్ ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటాడని, కానీ ఫేస్ రికగ్నేషన్, పాస్‌కోడ్ ఉన్న ఫోన్‌ను ఆయాన్ష్ ఎలా ఓపెన్ చేశాడన్నది మిస్టరీగా మారింది. వెంటనే ఆయన్ష్ చేతికి కొన్ని ఫోన్లు ఇవ్వగా ఈ మెయిల్స్ పంపడం, కాంటాక్ట్ లిస్ట్ చెక్ చేయడం, క్యాలెండర్ క్లోజ్ చేయవం వంటి పనులు పక్కా చేశాడు. ఈ విషయం ఆ నోటా ఈనోటా అమెరికా మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. దీంతో 20 నెలల చిచ్చర పిడుగు ఆయాన్ష్ ఇప్పుడు అమెరికాలో లేటెస్ట్ సిసింద్రీగా మారాడు. పొరపాటున ఆర్డర్ చేసినట్టుగా తెలపడంతో.. సదరు ఫర్నీచర్‌ని వెనక్కి తీసుకునేందుకు వాల్‌మార్ట్ అంగీకరించింది. చదవండి: రెండేళ్ల బాలుడికి ప్రపంచంలోనే అరుదైన వ్యాధి.. చికిత్స కోసం? -
న్యూజెర్సీలో వ్యాక్సినేషన్ డ్రైవ్
న్యూజెర్సీలో సాయి దత్త పీఠం వుడ్ లేన్ ఫార్మసీ తో కలిసి ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించిందిది. న్యూజెర్సీలోని వుడ్ లేన్ ఫార్మసీ (ఓల్డ్ బ్రిడ్జి) దగ్గర జరిగిన ఈ వ్యాక్సిన్ డ్రైవ్ లో పిల్లలకు, పెద్దలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించారు. కోవిడ్ రెండు డోసులు పూర్తయిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చారు. అమెరికాలో మన వాళ్ళు కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు సాయి దత్త పీఠం ఈ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. ప్రశంసలు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో దాదాపు 250 మందికి పైగా తెలుగువారు వ్యాక్సిన్లు వేయించుకున్నారు. ఈ సందర్భంగా న్యూజెర్సీ సెనేట్, అసెంబ్లీ తరఫున స్టెర్లే ఎస్ స్టాన్లీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో స్థానిక సాయిదత్త పీఠం, వుడ్ లేన్ ఫార్మసీ, ఓల్డ్ బ్రిడ్జి న్యూజెర్సీలు చేపట్టిన కమ్యూనిటీ సేవాదృక్పధాన్ని కొనియాడారు. ప్రశంసా పత్రాన్ని అందించారు. కృతజ్ఞతలు ఈ వ్యాక్సినేషన్లో పాల్గొన్న ఫార్మసిస్ట్ రవి, డాక్టర్ విజయ నిమ్మ, డాక్టర్ ప్రసాద్ సుధాన్షు, నర్సులు శిరు పటేల్, సలోని గజ్జర్‌లతో పాటు వాలంటీర్లు గీతావాణి గొడవర్తి, మృదుల భల్లా, అంజలిబుటాలా, రావు ఎలమంచిలి, వికాస్, అన్షు, పల్లవి వీరికి సహాకరించిన పాటు ఇషిత్ గాంధీ, కిరణ్ తవ్వాలకు సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, బోర్డు సభ్యులు వెంకట్ మంత్రిప్రగడ, దాము గేదెల, మురళీ మేడిచెర్ల, సుభద్ర పాటిబండ్ల, వంశీ గరుడలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి న్యూజెర్సీ పబ్లిక్యూటీలిటీ కమిటీ ఉపేంద్ర చివుకుల సహకారం అందించారు. -
బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించిన ఎన్నారైలు
న్యూ జెర్సీ: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు న్యూజెర్సీలో సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది. న్యూజెర్సీ ఎడిసన్‌లో శివ, విష్ణు ఆలయంలో బిపిన్ రావత్ చిత్రపటం ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించింది. బిపిన్ రావత్‌తో పాటు సైన్యం లో సేవలందించిన రిటైర్డ్ కల్నల్ వీరేంద్ర ఎస్ తవాతియాఈ కార్యక్రమానికి వచ్చారు. బిపిన్ రావత్ తో తనకున్న అనుబంధాన్ని ఆయన స్మరించుకున్నారు. వీర సైనికులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసారు. ఈ సందర్భంగా సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, మాతా రాజ్యలక్ష్మి (స్పిరిట్యుయల్ గురు, కమ్యూనిటీ లీడర్), సాయి దత్త పీఠం బోర్డు సభ్యులు, ఆలయ భక్తులు, మాతృభూమి కోసం బిపిన్ రావత్ చేసిన సేవలను గుర్తు చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్‌తో పాటు మరణించిన ఇతర సైనికులందరికీ నివాళులు అర్పించారు. బిపిన్ రావత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు రఘు శర్మ శంకరమంచి తెలిపారు. -
అమెరికాలో కాల్పులు.. తెలుగు వ్యక్తి దారుణ హత్య
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో దుండగుడి కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి మృత్యువాత పడ్డారు. తెలుగు వ్యక్తి శ్రీరంగ అర్వపల్లి(54) న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో నివసిస్తున్నారు. 2014 నుంచి అరెక్స్ ల్యాబోరేటరీస్ ఫార్మా సంస్థ సీఈఓగా పని చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఇంట్లో ఉన్న శ్రీరంగపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చి ఈ దురాగతానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పెన్సిల్వేనియాలోని నారిస్‌టౌన్‌కు చెందిన జెకై రీడ్ జాన్(27)గా గుర్తించారు. చదవండి: (మెక్సికోలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య) శ్రీరంగ తన ఇంటి నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని పార్క్స్ క్యాసినోలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత 10,000 డాలర్లు గెలుచుకున్నారు. ఇదంతా అక్కడే ఉన్న రీడ్ జాన్ గమనించాడు. ఆ డబ్బు దోచుకోవడానికి శ్రీరంగను కారులో వెంటాడాడు. శ్రీరంగను అనుసరిస్తూ ఇంటిదాకా వచ్చాడు. ఇంట్లోకి రాగానే అతడిపై పిస్తోల్‌తో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన శ్రీరంగ అక్కడికక్కడే కన్నుమూశారు. రీడ్ జాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. శ్రీరంగ అర్వపల్లికి స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఆటా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఘనంగా దసరా
న్యూజెర్సీ: అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాయల్గ్రాండ్ మ్యానర్‌లో జరిగిన ఈ వేడుకలకు న్యూజెర్సీ పరిసర ప్రాంతాలకు చెందిన వెయ్యికి మందికి పైగా తెలుగు వారు హాజరయ్యారు. దుర్గమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ వేడుకలను న్యూజెర్సీ కాన్సులేట్ జనరల్ విజయ్ కృష్ణన్, ప్రారంభించారు. ఈ సందర్భంగా అటా అధ్యక్షుడు భువనేశ్ బూజాల మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న అటా మెగా సదస్సుకు రావాల్సిందిగా ప్రతీ ఒక్కరిని ఆహ్వానించారు. అటా తరఫున చేపడుతున్న కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ దసరా వేడుకల్లో వివిధ తెలుగు సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
అమెరికా జాబ్ వదులుకుని వచ్చాడు.. మార్పు తెచ్చాడు..
పసిపిల్లలు దేవుళ్లతో సమానంగా పోలుస్తారు. ఎందుకంటే వాళ్లు కళ్లకపటం ఎరుగరని, అభం శుభం తెలియదని. అయితే ‘వీరు’ శారీరకంగా పెద్దవారే అయినా మానసికంగా పిల్లలే. వీళ్లకి మోసాలు తెలియవు, అమయకత్వానికి నిలువెత్తు నిదర్శనం. కానీ వీళ్ల మంచి చెడ్డలు చూడాలన్నా,.. వీరి జీవితంలో మార్పు తేవాలన్నా ఎవరికైనా కత్తి మీద సామే. ఎంతో పట్టుదల ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అలాంటి వారి జీవితంలో వెలుగులు నింపేందుకు ఓ ఎన్నారై డాక్టర్ చేస్తోన్న నిర్విరామ ప్రయత్నం... - కాజీపేటకు చెందిన లిఖిత్ని ఇంతకు ముందు ఎవరైనా ఏమన్నా అంటే చాలు.. ముందు వెనుక చూడకుండా చేతిలో ఏది ఉంటే దాంతో ఎదుటివారిపై చేసేవాడు. బంధువులు ఏదోమాట అన్నారని విలువైన బంగారు వస్తువులు బయటపడేశారు. ఈ పిల్లాడి భవిష్యత్తు ఏంటని ఆ బిడ్డ తల్లి బెంగపెట్టుకోని రోజు లేదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఐదేళ్లలో లిఖిత్లో ఎంతో మార్పు. ఎవ్వరినీ ఏమనడం లేదు. ఏ వస్తువు పడేయడం లేదు. ఇప్పుడా తల్లి నిశ్చింతగా పని చేసుకుంటోంది. - వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన పోషాలు, హైమలది రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. వాళ్లకి ముగ్గురు పిల్లలు. అందులో ఇద్దరు తమకేం కావాలో చెప్పలేని స్థితిలో ఉన్నారు. పదేళ్లు దాటినా తల్లిదండ్రులు పక్కన లేకుంటే పక్క తడిపేస్తారు. అందుకే పని మానుకుని హైమ ఇంటి పట్టునే ఉండిపోయింది. ఒక్కడి కష్టంతో ఐదుగురి కడుపు నిండటం కష్టంగా ఉండేది ఒకప్పుడు. కానీ రోజులు మారాయి. ఇప్పుడు పిల్లలు పక్క తడపడం లేదు. తల్లిదండ్రులు బయట పనులకు వెళ్తున్నారు. పిల్లలకు కడుపు నిండా తిండి పెడుతున్నారు. రెండు వేర్వేరు కుటుంబాలు, వేర్వేరు పరిస్థితులు. కానీ కష్టాలు ఒకే రకం. తమ పని తాము చేసుకోలేని పిల్లలు, తమకేం కావాలో కూడా తెలియని అమాయకులు. ఇతరులపైనే ఆధారపడ్డ బతుకులు ఒకప్పుడు వాళ్లవి. కానీ ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్న వందల మంది పిల్లల జీవితంలో వెలుగు నింపేందుకు ఒక్కడొచ్చాడు అమెరికా నుంచి. అక్కడ క్షణం తీరిక లేకుండా రెండు ఆస్పత్రుల్లో చేస్తున్న డాక్టరు ఉద్యోగాన్ని వదులుకుని, ఎంతోమంది కలలుగనే డాలర్ల మూటలు పక్కన పెట్టి ఇండియాకి వచ్చేశాడు. తల్లిదండ్రులకిచ్చిన మాట కోసం, ఒకప్పుడు తనకు అండగా నిలిచిన పిల్లల కోసం. అతనే డాక్టర్ వీరమల్ల చరణ్‌జిత్‌రెడ్డి, అతను నెలకొల్పిందే వరంగల్‌లోని బన్ను ఆరోగ్యదా సేవా సోసైటీ. అందులోని ఓ విభాగమే బన్ను న్యూరోహెల్త్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్. వాళ్లకు ప్రత్యేకం దివ్యాంగులతో పోల్చితే ఇంటెలెక్చువల్ డిసెబులిటీ (మానసిక వికలాంగుల) పరిస్థితి మరీ దయనీయం. ఆకలేసినా చెప్పలేరు, కనీసం ‘ఒకటికి’ వచ్చినా నోరు విప్పరు. ఒంటికి మీదికి ఏళ్లు వచ్చినా ఇంకా చంటిబిడ్డల్లాంటి ప్రవర్తనే. తల్లిదండ్రులో మరొకరరో తోడుగా లేకుండా బతకలేని పరిస్థితి. పైగా ఎమోషన్స్ అదుపుతప్పి తల్లిదండ్రులు, ఎదుటి వారిపై దాడి చేసే స్వభావం కూడా వీరిలో ఎక్కువే. ఇలాంటి వారి కోసం అనేక స్వచ్చంధ సంస్థలు ముందుకు వచ్చినా... అవన్నీ ఆశ్రయం ఇవ్వడం, సమయానికి తిండి అందివ్వడం పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. కానీ ‘బన్ను’ ఇందుకు భిన్నం. తమకు తామే కాకుండా ఇతరులకు భారంగా మారిన పిల్లలకు బతుకు భరోసాను అందిస్తోంది. ప్రతీ పనికి ఇతరులపై ఆధారపడే పిల్లలకీ సొంతంగా బతికే తెలివితేటలు, నైపుణ్యాలను అందిస్తోంది. తమ పిల్లలు కూడా అందరిలాగే ఉంటే బాగుండు అనుకుని వివిధ ‘సెంటర్ల’ చుట్టూ తిరిగిన తల్లిదండ్రులకు ఇప్పుడు బన్ను రూపంలో ఓ నమ్మకం కనిపిస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన తర్వాత పిల్లలు వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్న అనుభవాలే ఇందుకు ఉదాహరణ. ఆ కష్టాలు అప్పుడే తెలిశాయి ఇండియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత పీజీ కోసం చరణ్‌జిత్‌రెడ్డి అమెరికా వెళ్లారు. అక్కడ పీజీలో సీటు సాధించేందుకు రెండేళ్ల సమయం పట్టింది. ఈలోగా ఖర్చుల కోసమని న్యూజెర్సీ దగ్గర్లో ఉన్న బ్యాన్‌క్రాఫ్ట్ న్యూరోహెల్త్ సెంటర్ అనే మానసిక వికలాంగుల కేంద్రంలో పార్ట్‌టైం జాబ్‌లో చేరారు. అప్పుడే మానసిక వికలాంగుల కష్టాలను, వారి ప్రత్యేక అవసరాలను దగ్గరగా చూశారు. వాళ్లకి సేవలు చేశారు. అందుకు ప్రతిఫలంగా వచ్చిన డబ్బుతోనే మెడిసిన్‌లో పీజీ చేశారు. ఆ పట్టాతోనే అమెరికాలో ఉద్యోగం పొందారు. అయితే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలోనే మానసిక వికలాంగుల పరిస్థితి ఇలా ఉంటే ఇండియాలో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటనే బాధ ఆయన్ని కలచివేసింది. అందుకే అక్కడ డాక్టరుగా కొంత డబ్బులు కూడబెట్టిన తర్వాత వరంగల్‌లో పూర్తి ప్రొఫెషనల్‌గా బన్ను న్యూరో హెల్త్ సెంటర్, రిహాబిలిటేషన్ సెంటర్‌ని నెలకొల్పారు. ఆశ్రయం, తిండి ఇస్తే సరిపొదని... ఎవ్వరి అవసరం లేకుండా మానసిక వికాలంగులు బతికేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా పూర్తి ప్రొఫెషనల్‌గా దీన్ని తీర్చి దిద్దారు. అందువల్లే ప్రారంభంలో 8 మంది విద్యార్థులే ఉన్నా 15 మంది ప్రొఫెషనల్ స్టాఫ్‌ని నియమించారు. ప్రస్తుతం ఇక్కడ 200ల మందికి పైగా విద్యార్థులు 34 మంది స్టాఫ్‌తో ఈ న్యూరోహెల్త్ సెంటర్ పని చేస్తోంది. . హెల్త్ సెక్టార్లో బన్ను న్యూరో హెల్త్ సెంటర్‌తో పాటు ఏటూరునాగారంలో బన్ను ఛారిటీ ఆస్పత్రిని కూడా ప్రారంభించారు. వరంగల్‌కి వంద కిలోమీటర్ల దూరంలో పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండే ఈ ఏరియా ప్రజలకి అతి తక్కువ ధరలకే వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఛారిటీ పనులయినా సరే నాణ్యతతో రాజీ పడపలేదు. ఆపరేషన్ థియేటర్, సర్జన్ , ఎక్విప్డ్ ల్యాబ్‌ల సాయంతో నాణ్యతతో కూడి వైద్య సేవలు ఏజెన్సీ ప్రాంతంలో అందిస్తున్నారు. రోగులకు నాణ్యమైన సేవలు అందించేందుకు వీలుగా సిబ్బందికి ఆకర్షణీయమైన వేతనం అందిస్తున్నారు. తాజాగా ములుగు జిల్లాలో ఉచితంగా అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. జీవితాల్లో వెలుగు బన్ను హెల్త్‌కేర్ ట్రస్ట్ కారణంగా ఈ రోజు ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారంలో అత్యవసర వైద్య సేవలు అతి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. రెండు వందల మందికి పైగా మానసిక వికలాంగులు ఇప్పుడు తమ పనులు తాము చేసుకుంటున్నారు. వారి తల్లిదండ్రులు వివిధ పనులు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇరుగుపొరుగు సూటిపోటీ మాటలతో మనసు కష్టపెట్టుకున్న ఎంతో మంది తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లల మీద భరోసాతో ఉంటున్నారు. ఇక నుంచి బన్ను ఛారిటీ ఆస్పత్రి, బన్ను న్యూరోహెల్త్సెంటర్, బన్ను అంబులెన్స్ సేవలు విజయవంతంగా సేవలు అందించే వరకు అమెరికాలో ఆస్పత్రుల్లో పని చేస్తూ తన జీతం డబ్బులతో వీటికి ఫండింగ్ చేశారు. ‘బన్ను’ సంస్థలు నిలదొక్కునేంత నిధులు సమకూర్చిన తర్వాత వాటిని దగ్గరుండి నడిపించేందుకు అమెరికా నుంచి ఇండియా వచ్చేశారు. రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యంగా ఆయన ముందుకు కదులుతున్నారు. అమ్మానాన్నల వల్లే - చరణ్‌జిత్ రెడ్డి ‘మా అమ్మకి డాక్టరై సమాజానికి తన వంతు సాయం చేయాలనే ఆశయం ఉండేది, కానీ రక్తం చూస్తే కళ్లు తిరిగి పడిపోయే హిమోఫోబియా కారణంగా మెడిసిన్ మధ్యలో వదిలేసింది. మా నాన్న సాయిరెడ్డిది స్థితిమంతుల కుటుంబమే అయినా.. ఆరేళ్లు వచ్చేప్పటికి తల్లిదండ్రుల్నీ కోల్పోయాడు. దీంతో ఆస్తులున్నా నాన్న వారాలు చేసుకుని చదువుకుని ఇంజనీర్‌గా సెటిలయ్యారు. తన ఎదుగుదలలో కుటుంబం కంటే సమాజమే ఎక్కువ అండగా నిలిచిందని, తిరిగి సోసైటీకి ఏదైనా చేయాలంటూ ఆయన ఎప్పుడు చెబుతుండే వారు. వారిద్దరి ప్రభావం వల్లనే మా అమ్మ పద్మజ ముద్దు పేరైన బన్ను పేరు మీదుగానే హెల్త్ సెక్టార్లో సేవా కార్యక్రమాలను చేపడుతున్నాను. - సాక్షి, వెబ్‌డెస్క్ -
ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై టీమిండియా జెర్సీ.. చరిత్రలో తొలిసారి
Team India New Jersey Displayed On Burj Khalifa : టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆటగాళ్లు ధరించబోయే సరికొత్త జెర్సీకి సంబంధించిన చిత్రాలను ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ 'బుర్జ్ ఖలీఫా'పై బుధవారం రాత్రి ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా అధికారిక కిట్ స్పాన్సర్ ఎంపీఎల్ స్పోర్ట్స్ ట్వీట్ చేస్తూ.. చరిత్రలో తొలిసారి టీమిండియా జెర్సీని ఈ ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై ప్రదర్శించారని పేర్కొంది. 'బిలియన్ చీర్స్ జెర్సీ'గా పిలువబడే ఈ జెర్సీని వంద కోట్ల మంది అభిమానుల చీర్స్ స్ఫూర్తితో తయారు చేశామని వెల్లడించింది. ఈ వీడియోలో టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు కొత్త జెర్సీలు ధరించి కనిపించారు. For the first time ever, a Team India Jersey lit up the @BurjKhalifa The #BillionCheersJersey inspired by the cheers of a billion fans reached new heights, quite literally 🤩 Are you ready to #ShowYourGame & back Team India 🥳 pic.twitter.com/LCUxX6NWqz — MPL Sports (@mpl_sport) October 14, 2021 ఇదిలా ఉంటే, గతేడాది ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ చిత్రాన్ని బూర్జ్ ఖలీపాపై ప్రదర్శించిన సంగతి తెలిసిందే. బుర్జ్ ఖలీఫాపై ఓ భారత క్రికెటర్ ఫొటో కనిపించడం అదే తొలిసారి. గతంలో మహాత్మా గాంధీ, షారుక్ ఖాన్ల ఫొటోలను ఈ ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై ప్రదర్శించారు. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ లోగో, ఆటగాళ్ల ఫొటోలను సైతం ఈ టవర్‌పై ప్రదర్శించారు. కాగా, అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్ 24న టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. చదవండి: IND Vs PAK: 'మౌకా మౌకా'... అరె భయ్యా ఈసారైనా -
కొత్త లుక్‌లో టీమిండియా జెర్సీ.. ఆ మూడు చుక్కలు ఎందుకంటే
BCCI Launch Team India New Jersey T20 WC 2021.. టి20 ప్రపంచకప్ 2021 నేపథ్యంలో టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. జెర్సీ కలర్ పాతదే అయినప్పటికి టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో మరి కాస్త కొత్తగా తయారు చేశారు. నేవీ బ్లూ కలర్లో ఉండే జెర్సీపై ముందుభాగంలో రాయల్ బ్లూ కలర్ షేడ్స్ ఉంటాయి. దానిపై టీమిండియా స్పాన్సర్స్ అయిన ఎమ్‌పీఎల్ స్పోర్ట్స్, బైజూస్ యాప్‌లో వైట్ కలర్లో కనిపిస్తాయి. ఇండియా అనే అక్షరాలు ఆరెంజ్ కలర్లో దర్శనమిస్తుంది. జెర్సీ ఎడమ భాగంలో బీసీసీఐ లోగోతో పాటు కొత్తగా మూడు చుక్కలు కనిపిస్తాయి. క్రికెట్ చరిత్రలో టీమిండియా మూడు ప్రపంచకప్‌లు సాధించిదనడానికి ఆ మూడు చుక్కలు సంకేతంగా కనిపిస్తాయి. లెజెండ్ కపిల్ దేవ్ సారథ్యంలో 1983 వన్డే ప్రపంచకప్, ఎంఎస్ ధోని సారథ్యంలో 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Kane Williamson: టీ20 ప్రపంచకప్ ముందు కెప్టెన్‌కు గాయం..! అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనున్న టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 24న పాకిస్తాన్‌తో ఆడనుంది. అయితే అంతకుముందు ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా అక్టోబర్ 18, 20న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ప్రపంచకప్ కోసం ప్రకటించిన టీమిండియా జట్టులో ఏవైనా మార్పులు ఉన్నాయా లేదా అనేది తెలియాలంటే అక్టోబర్ 15వరకు ఆగాల్సి ఉంది. కాగా ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్, వెంకటేశ్ అయ్యర్లు ఐపీఎల్ 2021 సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు నెట్‌బౌలర్‌గా వారి సేవలు వినియోగించుకోనుంది. చదవండి: T20 WC Ind Vs Pak: కోహ్లి వద్ద అన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి.. కానీ Presenting the Billion Cheers Jersey! The patterns on the jersey are inspired by the billion cheers of the fans. Get ready to #ShowYourGame @mpl_sport. Buy your jersey now on https://t.co/u3GYA2wIg1#MPLSports #BillionCheersJersey pic.twitter.com/XWbZhgjBd2 — BCCI (@BCCI) October 13, 2021 -
న్యూజెర్సీలో బాలు స్వరాంజలి
ఎడిసన్, న్యూ జెర్సీ: ప్రముఖ కూచిపూడి కళాకారిణి స్వాతి అట్లూరి నెలకొల్పిన కళావేదిక ఆధ్వర్యంలో ఎస్పీ బాలు వర్థంతి వేడుకలు నిర్వహించారు. న్యూజెర్సీలోని దత్తపీఠంలో ఉన్న ఈవెంట్ హాల్లో బాలు స్వరాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయనీ గాయకులు ఉష, సుమంగళి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సెయింట్ లూయీస్ కు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత శ్రీమతి వింజమూరి సాహిత్య ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కళావేదిక సంస్థ ఎడ్వైజర్ కమిటీలో ఒకరైన ఫణి డొక్కా అట్లాంటానుంచి ఈ కార్యక్రమానికి వచ్చి, సంధానకర్తగా వ్యవహరిస్తూ బాలు గారితో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకులతో పాటు స్టెరిలీ ఎస్ స్టాన్లీ, శాంతి నర్రా , శాం జోషిలు హాజరయ్యారు. తానా, ఆటా, నాట్స్, టాటా, టిఎల్సీఏ, టీఎఫ్ఏఎస్, ఎన్నారైవీఏ, సిలికాన్ ఆంధ్రా, సాయి దత్త పీఠం శివ విష్ణు టెంపుల్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిథులు పాల్గొన్నారు. చదవండి : ఎస్పీబీకి ‘ఆటా’ స్వర నీరాజనం